lover dead
-
హస్తినలో ‘అమర’ ప్రేమికుడు!
ఏడాది కింద మొదలైన ఆన్లైన్ పరిచయం ప్రేమకు దారితీసింది. కానీ చిన్న వివాదం ఈ ప్రేమ కథలో అంతులేని విషాదం మిగిలి్చంది. రోమియో, జూలియట్ తరహా ఉదంతానికి ఢిల్లీ వేదికగా నిలిచింది. పట్టరాని ఆగ్రహంతో ప్రాణాలు తీసుకోబోయిన ప్రేమికురాలిని కాపాడబోయి ప్రేమికుడు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలోని జగత్పురీలో 23 ఏళ్ల అరుణ్ నందాకు ఏడాది క్రితం ఆన్లైన్లో ఒకమ్మాయి పరిచయమైంది. లా స్టూడెంటైన ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం. నిత్యం పారీ్టలు, స్నేహితులంటూ తిరిగే అరుణ్‌కు, ఆమెకు ఇటీవల చిన్నపాటి మనస్పర్థలొచ్చాయి. శుక్రవారం రాత్రి అరుణ్ బంధువుల్లో ఒకరు ఆ అమ్మాయితో గొడవకు దిగారు. దీన్ని అవమానంగా భావించి ఆమె ఇంటికెళ్లి కత్తితో మణికట్టు కోసేసుకుంది. అందులోంచి చిమ్ముతున్న రక్త ధారలను వీడియో తీసి వాట్సాప్‌లో అరుణ్‌కు షేర్ చేసింది. అది చూసి అరుణ్ హుతాశుడయ్యాడు. ప్రేమికురాలు రక్తపుమడుగులో పడుంటంతో ఆమె తల్లికి ఫోన్ చేసి అప్రమత్తంచేశాడు. వెంటనే వాళ్ల ఇంటికెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాడు. వైద్యులు, నర్సులకు విషయం చెప్పి ఆమెనెలాగైనా బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో నర్సుతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్యులు స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చేలోపే అరుణ్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. మధ్యలో స్పృహలోకి వచ్చి కూడా, ‘ఆమెను కాపాడండి. లేదంటే చనిపోతుంది’ అంటూ ప్రాధేయపడ్డట్టు సిబ్బంది చెప్పారు! గుండెపోటుతోనే అతను మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రేమికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. – న్యూఢిల్లీ -
ఇద్దరితో ప్రేమాయణం.. రెండో ప్రియుడంటే ఎంతో ఇష్టం.. అతడి కోసం..
దొడ్డబళ్లాపురం: దారితప్పిన మహిళ ప్రవర్తన ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. ఒకరితో పెట్టుకున్న అక్రమ సంబంధం.. మరో అక్రమ సంబంధం కలిగిన వ్యక్తికి తెలుస్తుందనే భయంతో మహిళ ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన నెలమంగల తాలూకాలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. జూలై నెల 2న తుమకూరు జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నెలమంగల పోలీసులు లక్ష్మి, వెంకటేశ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడ్డ నిందితులు ఇద్దరూ దొడ్డలింగప్ప అనే వ్యక్తిని తుమకూరులో హత్య చేసి నెలమంగల తాలూకా కళలుఘట్ట బ్రిడ్జి వద్ద శవాన్ని పారవేసి పరారయ్యారు. అందరిదీ రాయచూరు నిందితులు లక్ష్మి, వెంకటేశ్, హతుడు దొడ్డలింగప్ప అందరూ రాయచూరుకు చెందినవారే. వీరంతా తుమకూరు వద్ద ఉన్న గోశాలలో పనిచేసేవారు. లక్ష్మి మొదటి భర్త మృతి చెందగా, రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో లక్ష్మి.. దొడ్డలింగప్ప, వెంకటేశ్ అనే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే దొడ్డలింగప్పతో అక్రమ సంబంధం గురించి వెంకటేశ్‌కు తెలుసు. కానీ, వెంకటేశ్‌తో అక్రమ సంబంధం ఉన్న సంగతి దొడ్డలింగప్పకు తెలీదు. దొడ్డలింగప్పకు లక్ష్మి రూ.30 వేలు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వెంకటేశ్‌తో ఉన్న సంబంధం తెలిస్తే గొడవ చేస్తాడని భావించిన లక్ష్మి జులై 2న అతడ్ని ఇంటికి పిలిపించి మద్యం తాగించి తలపై బండరాయితో బాది హత్య చేసింది. ఇందుకు వెంకటేశ్ సహకరించాడు. శవాన్ని తీసుకువచ్చి నెలమంగల వద్ద బ్రిడ్జి కింద పారవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
భద్రాద్రిలో దారుణం: ప్రేమ పేరుతో ట్రాప్ చేసి.. గర్భవతి అయ్యాక..
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు.. యువతిని ట్రాప్ చేశాడు. అతడి మాటలు నమ్మిన సదరు యువతి.. శారీరకంగా దగ్గర కావడంతో గర్భం దాల్చింది. అతడి వల్ల చివరకు ప్రాణాలు విడిచింది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వీకే రామవరం గ్రామానికి చెందిన యువతితో పుసుగుడెంకు చెందిన భూక్యా నందుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ఆమెను పెళ్లి చేసుకుంటానని నందు ట్రాప్ చేశాడు. ప్రేమ పేరిట ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం దాల్చింది. 5 నెలల గర్భవతి కావడంతో అబార్షన్ కావడానికి మాత్రలు ఇచ్చాడు. కానీ, ఆమెకు అబార్షన్ కాకపోవడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో బాధితురాలు, నందు, మరో మహిళ కలిసి.. భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి తన భార్యకు తీవ్ర రక్తస్రావం అవుతుందని చెప్పి అడ్మిట్ చేశాడు. కాగా, వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో, నందుతోపాటు ఆసుపత్రికి వచ్చిన అమ్మాయి అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో బాధితురాలు మృతిచెందింది. దీంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు కన్నీటిపర్యంతమయ్యారు. తన బిడ్డను నందు బలితీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ఫేస్బుక్లో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే.. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే హత్య
ఖమ్మం అర్బన్: కాపురంలో విభేదాలతో ఆ భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత భార్యకు మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. సదరు యువకుడితో పలుమార్లు గొడవ పడిన మహిళ భర్త.. ఇద్దరూ ఏకాంతంగా కలుసుకోవడాన్ని జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాడు. విచక్షణారహితంగా కత్తితో యువకుడిని పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, హత్య చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం అల్లీపురానికి చెందిన సంపంగి వీరబాబుకు వైరా మండలానికి చెందిన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో సదరు మహిళ ఖమ్మం శివారు గోపాలపురం సమీపాన ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలతో నాలుగేళ్లుగా ఉంటోంది. పోలీస్ కేసులు కూడా నమోదు.. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్న అల్లీపురానికి చెందిన నల్లగట్ల నవీన్‌తో ఆమెకు వివాహేతర సం బంధం ఏర్పడింది. ఈ విషయం వీరబాబుకు తెలియడంతో నవీన్‌తో పలుమార్లు గొడవ పడ్డాడు. ఇరువురు పోలీసు కేసులు కూడా పెట్టుకున్నారు. అయినా నవీన్, తన భార్య సన్నిహితంగా ఉండడాన్ని వీరబాబు తట్టుకోలేకపోయాడు. ఇంతలోనే నవీన్‌కు నిశ్చితార్థం జరగగా, వచ్చే నెల 9న పెళ్లి నిర్ణయించారు. కాగా, సదరు మహిళ ఇంటికి ఆదివారం రాత్రి నవీన్ వెళ్లాడని తెలుస్తోంది. అక్కడకు వీరబాబు వెళ్లి నవీన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో నవీన్ పేగులు బయటకు వచ్చాయి. దాడిని అడ్డుకోబోయిన మహిళకు సైతం గాయాలయ్యాయి. నవీన్‌ను ఆమె ఆటో లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చేర్పించుకోకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున నవీన్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. అయితే, పెళ్లి కార్డు ఇచ్చేందుకే మహిళ ఇంటికి వెళ్లిన నవీన్‌పై వీరబాబు దాడి చేసి హత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి శ్రీను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరబాబు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియుడు, మేనత్తతో కలిసి భర్తను చంపిన భార్య -
విషాదం: చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
నిజామాబాద్: జిల్లాలోని చందూర్ మండలం లక్ష్మాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలోని అడవి ప్రాంతంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. అడవిలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలనానికి చేరుకొని పరిశీలిసుస్తున్నారు. మృతి చెందిన వారిని మోస్రా మండలం తిమ్మాపూర్‌కి చెందిన మోహన్, లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వారం రోజుల క్రితమే వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. వారం నుంచి చెట్టుకు మృతదేహాలు వేలాడుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: మంచాన పడ్డ భార్యను చూసేందుకు బైక్‌పై; 20 మీటర్లు ఎగిరి చెట్టు కొమ్మకు -
ప్రేయసి ఇంట్లో భోజనం: కొద్ది సేపటికే వాంతులతో ప్రియుడి మృతి
టీ.నగర్: ప్రేమికురాలి ఇంటిలో భోజనం చేసిన యువకుడు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 17వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణం జరిగింది. కేరళ రాష్ట్రం, ఇడుక్కి జిల్లా, మూనారు ప్రాంతానికి చెందిన నిషాంత్ (30). ఇతను చెన్నైలోని ప్రైవేటు సంస్థలో పని చేస్తూ వచ్చా డు. చెన్నై పళ్లికరనైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తున్న అరియలూరు జిల్లా, గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు సమ్మతం తెలిపారు. దీంతో ఈ నెల 17వ తేదీన వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఇదిలావుండగా కరోనా రెండో వైరస్ కారణంగా నిషాంత్ పని చేస్తున్న కార్యాలయానికి సెలవు ప్రకటించారు. దీంతో చెన్నై నుంచి వివాహం నిశ్చయించబడిన వధువు ఇంటికి మంగళవారం నిషాంత్ చేరుకున్నాడు. అక్కడ అతనికి చేపల పులుసుతో భోజనం వడ్డించారు. దీన్ని తిన్న నిషాంత్ కొద్ది సేపటికే వాంతులు చేసుకోవడం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మృతి చెందాడు. నిషాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు మీన్సురుట్టి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనా సాయం కోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ -
ఏమీ చేయనని నమ్మించి, ప్రాణాలు తీశాడు
సాక్షి, కృష్ణా: ప్రేమ పేరుతో వేధించడమే కాకండా ఓ యువతి పాలిట కాలయముడిగా మారాడు ఓ వ్యక్తి. తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఆమెపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. అంతటితో ఆగకుండా ప్రేయసితో పాటు తనూ నిప్పంటించుకొన్నాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్లో నర్సుగా పని చేస్తోంది. స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీసుస్టేషన్లో చిన్నారి ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగభూషణాన్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెకు దూరంగా ఉంటానని, ఏమీ చేయనని అతను స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకుంది. అయితే, రోజులానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. తనూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. -
ప్రియుడికి నిశ్చితార్థం.. ప్రేయసి ఆత్మహత్య
సాక్షి, విజయపురం: ప్రియుడికి నిశ్చితార్థం చేస్తున్నారని మనస్తాపంతో ఓ యువతి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం విజయపురం మండలం కాలియంబాకం ఆదిఆంధ్రవాడలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం..కాళియంబాకం ఆదిఆంధ్రవాడకు చెందిన నందని (18) అదే గ్రామానికి చెందిన పృథ్వి (24) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, నెల రోజులుగా పృథ్వికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలియడంతో నందని రెండు రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వెంటనే తల్లిండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడంతో కోలుకుంది. ఆదివారం సాయంత్రం ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. ప్రియుడికి నిశ్చితార్థం చేయడానికి సిద్ధం చేస్తున్నారన్న తెలుసుకుని కుంగిపోయింది. జీవితంపై విరక్తి చెంది నందని చెరువులోకి దూకి తనువు చాలించింది. స్థానికులు గాలించినా ఫలితం లేకపోవడంతో చివరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చెరువు నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లిండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఓబయ్య కేసు నమోదు చేశారు. వివాహిత అనుమానాస్పద మృతి శ్రీకాళహస్తి: అనుమానస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన సోమవారం స్థానిక స్కిట్ కాలేజీ సమీపంలో జనచైతన్య లేఔట్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం కోగిలి వడ్డికండ్రిగకు చెందిన వెంకటస్వామి, చెంగమ్మ దంపతుల కుమార్తె వరలక్ష్మి(28)ని అదే జిల్లాలోని సూళ్లూరుపేట మండలానికి చెందిన దశయ్యతో వివాహం చేశారు. వీరికి 12 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో ఇటీవల వరలక్ష్మి భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఆమె తన స్వగ్రామంలోని పరశురాంతో పరిచయం పెంచుకుంది. 4 నెలల క్రితం వరలక్ష్మి కోగిల వడ్డికండ్రిగ నుంచి తొట్టంబేడు మండలం చిలకావారికండ్రిగలోని తన బంధువుల ఇంట చేరింది. అప్పటి నుంచి ఆమె చేపల విక్రయంతో జీవనం సాగిస్తూ వచ్చింది. పరశురామ్ కూడా ఇదే వృత్తిపై ఆధారపడ్డాడు. వీరిద్దరి పరిచయాన్ని గమనించిన తల్లిదండ్రులు వరలక్ష్మికి కోడివాకకు చెందిన వెంకటేష్‌తో రెండవ వివాహం చేశారు. అయితే పరశురాంతో కాకుండా వేరొకరితో వివాహం చేశారని మనస్తాపానికి గురై ఈ నెల 9న వరలక్ష్మి అదృశ్యమైంది. గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి మృతదేహం సోమవారం పానగల్ ఏరియా జనచైతన్య ప్లాట్స్ సమీపంలోని ముళ్ల పొదల్లోని వెలుగులోకి వచ్చింది. మృతుని సోదరుడు ఈ విషయాన్ని చేరవేయడంతో టూ టౌన్ ఎస్ఐ స్వాతి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికలో తెలియాల్సి ఉంది. -
హౌరా ఎక్స్‌ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట
వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది. కదులుతున్న హౌరా ఎక్స్‌ప్రెస్ నుంచి దూకి వారిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియురాలి మృతితో ప్రియుడి ఆత్మహత్యాయత్నం
కావలి : ప్రియురాలు సూసైడ్ చేసుకుందని కలత చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తనచావుకు ఎవరూ కారణం కాదని డీఎస్పీకి సూసైడ్ లేఖ ఇచ్చేందుకు వచ్చి స్పృహ తప్పిన వైనం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.... వరికుంటపాడు మండలం తూర్పుబోయడుగులకు చెందిన గురవయ్య పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కావాలిలోనే ఉంటూ అప్పుడప్పుడు తిరుపతికి వెళ్లి వస్తుంటాడు. స్థానిక జనతాపేటలోని వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న బాబు అనే వ్యక్తితో ఇతనికి పరిచయం ఉంది. నిన్నసాయంత్రం బాబుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, చదువుపరంగా తనకు చేసిన సహాయం మరవలేనని తెలిపాడు. అనంతరం సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. రాత్రి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన చావుకు ఎవరూ కారణం కాదనే సూసైడ్ లేఖను డీఎస్పీ బాలవెంకటేశ్వరావుకు ఇచ్చేందుకు వచ్చాడు. అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న అతను అస్వస్థతకు గురై పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించింది పోలీసులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.