హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! | Delhi man dies after girlfriend sends self-harm video | Sakshi
Sakshi News home page

హస్తినలో ‘అమర’ ప్రేమికుడు!

Published Mon, Oct 21 2024 6:15 AM | Last Updated on Mon, Oct 21 2024 6:15 AM

Delhi man dies after girlfriend sends self-harm video

క్షణికావేశంలో చేయి కోసుకున్న ప్రియురాలు

ఆమెకు ఏమవుతుందోనన్న ఆందోళనతో తనువు చాలించిన వైనం

ఏడాది కింద మొదలైన ఆన్‌లైన్‌ పరిచయం ప్రేమకు దారితీసింది. కానీ చిన్న వివాదం ఈ ప్రేమ కథలో అంతులేని విషాదం మిగిలి్చంది. రోమియో, జూలియట్‌ తరహా ఉదంతానికి ఢిల్లీ వేదికగా నిలిచింది. పట్టరాని ఆగ్రహంతో ప్రాణాలు తీసుకోబోయిన ప్రేమికురాలిని కాపాడబోయి ప్రేమికుడు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలోని జగత్‌పురీలో 23 ఏళ్ల అరుణ్‌ నందాకు ఏడాది క్రితం ఆన్‌లైన్‌లో ఒకమ్మాయి పరిచయమైంది. లా స్టూడెంటైన ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం. నిత్యం పారీ్టలు, స్నేహితులంటూ తిరిగే అరుణ్‌కు, ఆమెకు ఇటీవల చిన్నపాటి మనస్పర్థలొచ్చాయి.

 శుక్రవారం రాత్రి అరుణ్‌ బంధువుల్లో ఒకరు ఆ అమ్మాయితో గొడవకు దిగారు. దీన్ని అవమానంగా భావించి ఆమె ఇంటికెళ్లి కత్తితో మణికట్టు కోసేసుకుంది. అందులోంచి చిమ్ముతున్న రక్త ధారలను వీడియో తీసి వాట్సాప్‌లో అరుణ్‌కు షేర్‌ చేసింది. అది చూసి అరుణ్‌ హుతాశుడయ్యాడు. ప్రేమికురాలు రక్తపుమడుగులో పడుంటంతో ఆమె తల్లికి ఫోన్‌ చేసి అప్రమత్తంచేశాడు. వెంటనే వాళ్ల ఇంటికెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాడు.

 వైద్యులు, నర్సులకు విషయం చెప్పి ఆమెనెలాగైనా బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో నర్సుతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్యులు స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చేలోపే అరుణ్‌ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. మధ్యలో స్పృహలోకి వచ్చి కూడా, ‘ఆమెను కాపాడండి. లేదంటే చనిపోతుంది’ అంటూ ప్రాధేయపడ్డట్టు సిబ్బంది చెప్పారు! గుండెపోటుతోనే అతను మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రేమికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.      

– న్యూఢిల్లీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement