Hand cut
-
హస్తినలో ‘అమర’ ప్రేమికుడు!
ఏడాది కింద మొదలైన ఆన్లైన్ పరిచయం ప్రేమకు దారితీసింది. కానీ చిన్న వివాదం ఈ ప్రేమ కథలో అంతులేని విషాదం మిగిలి్చంది. రోమియో, జూలియట్ తరహా ఉదంతానికి ఢిల్లీ వేదికగా నిలిచింది. పట్టరాని ఆగ్రహంతో ప్రాణాలు తీసుకోబోయిన ప్రేమికురాలిని కాపాడబోయి ప్రేమికుడు ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు ఢిల్లీలోని జగత్పురీలో 23 ఏళ్ల అరుణ్ నందాకు ఏడాది క్రితం ఆన్లైన్లో ఒకమ్మాయి పరిచయమైంది. లా స్టూడెంటైన ఆ అమ్మాయికి చదువంటే ప్రాణం. నిత్యం పారీ్టలు, స్నేహితులంటూ తిరిగే అరుణ్‌కు, ఆమెకు ఇటీవల చిన్నపాటి మనస్పర్థలొచ్చాయి. శుక్రవారం రాత్రి అరుణ్ బంధువుల్లో ఒకరు ఆ అమ్మాయితో గొడవకు దిగారు. దీన్ని అవమానంగా భావించి ఆమె ఇంటికెళ్లి కత్తితో మణికట్టు కోసేసుకుంది. అందులోంచి చిమ్ముతున్న రక్త ధారలను వీడియో తీసి వాట్సాప్‌లో అరుణ్‌కు షేర్ చేసింది. అది చూసి అరుణ్ హుతాశుడయ్యాడు. ప్రేమికురాలు రక్తపుమడుగులో పడుంటంతో ఆమె తల్లికి ఫోన్ చేసి అప్రమత్తంచేశాడు. వెంటనే వాళ్ల ఇంటికెళ్లి ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాడు. వైద్యులు, నర్సులకు విషయం చెప్పి ఆమెనెలాగైనా బతికించాలంటూ ప్రాధేయపడ్డాడు. ఈ క్రమంలో నర్సుతో మాట్లాడుతూనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. వైద్యులు స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దాంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చేలోపే అరుణ్ చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. మధ్యలో స్పృహలోకి వచ్చి కూడా, ‘ఆమెను కాపాడండి. లేదంటే చనిపోతుంది’ అంటూ ప్రాధేయపడ్డట్టు సిబ్బంది చెప్పారు! గుండెపోటుతోనే అతను మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రేమికురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది. – న్యూఢిల్లీ -
పెంపుడు శునకం చేతిని కొరికేసింది!
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన ఓ మహిళ ముంజేతిని ఆమె పెంపుడు కుక్క కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సగం తెగిన చేతిని వైద్యులు తిరిగి అతికించారు. తీరప్రాంత టౌన్స్విల్లెలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7 గంటల సమయంలో అత్యవసర ఫోన్ కాల్ రావడంతో పోలీసులు వెంటనే ఓ నివాసానికి చేరుకున్నారు. ఓ ఇంటి బయట మహిళ రక్తం కారుతున్న చేతితో విలవిల్లాడుతుండగా, లోపల ఓ భారీ శునకం బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తూ కోపంతో తిరుగుతోంది. దీంతో, వెంటనే పోలీసులు వైద్య సిబ్బందికి కబురు పంపారు. వారొచ్చి బాధితురాలి చేతికి కట్టుకట్టారు. లోపలున్న శునకం నియంత్రణలోకి రాకపోవడంతో నిపుణుల సూచన మేరకు కాల్చి చంపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ కుక్క గతంలో తనపైనా కూడా దాడి చేసిందని పొరుగింటి వ్యక్తి చెప్పాడని స్థానిక మీడియా పేర్కొంది. పెంపుడు కుక్కలు ఇంతటి ప్రమాదకర స్థాయిలో దాడి చేయడం తన 37 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని సీనియర్ సార్జెంట్ స్కాట్ వారిక్ వ్యాఖ్యానించారు. -
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
వేతన బకాయిలు అడిగితే... చెయ్యి నరికేశాడు
రేవా: చేసిన పనికి సక్రమంగా వేతనం చెల్లించమని అడగడమే ఆ అభాగ్యుడి పాపమైంది. మధ్యప్రదేశ్‌లోని రేవ జిల్లాలోని దోల్‌మౌ గ్రామంలో గణేష్ మిశ్రా అనే మేస్త్రీ వద్ద నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు బాధితుడు అశోక్ సాకేత్. గణేష్ సక్రమంగా వేతనాలు చెల్లించకుండా ఎంతోకొంత విదిలిస్తూ వస్తున్నాడు. దీంతో విసిగిపోయిన అశోక్ సాకేత్ శనివారం సహచర కూలీతో కలిసి వెళ్లి తమకు రావాల్సిన కూలీ బకాయిలను చెల్లించాలని గట్టిగా నిలదీశాడు. ఫలితంగా వారిమధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశం పట్టలేని గణేష్ మిశ్రా, అతని మిత్ర బృందం పదునైన ఆయుధంతో దాడి చేసి అశోక్ సాకేత్ చెయ్యిని నరికివేశారు. అంతేకాకుండా తెగిపడిన చెయ్యిని దాచేసే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడు అశోక్‌ను రేవాలోని సంజయ్ గాంధీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించారు. శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు అశోక్ చెయ్యిని తిరిగి అతికించారు. అయితే అధిక రక్తస్రావం కావడం మూలంగా బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. -
పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్
Ileana DCruz Shares Pics After Cutting Her Two Finges: ఇలియానా చిన్నపిల్లలా ఏడ్చారు. ఇంత పెద్ద అమ్మాయి చిన్నపిల్లలా ఏడవడం ఏంటీ అంటే.. ‘‘ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ ఈ ఏడుపుకి కారణం ఏంటంటే... వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ – ‘‘రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశాను.చదవండి: ‘శ్యామ్‌సింగరాయ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఏడవడానికి సిగ్గుపడకూడదు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్ వేయడం అంత తేలికైన పని కాదు’’ అంటూ తాను ఏడ్చిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో కూడా వంట చేస్తున్నప్పుడు ఇలా గాయం అయిందని, అయినప్పటికీ ఇంకా తనకు వేళ్లు ఉండటం ఆశ్చర్యంగా ఉందని సరదాగా అన్నారీ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఓ ఫ్యాన్ పెళ్లెప్పుడు? అని అడిగితే – ‘‘నాకూ చేసుకోవాలని ఉంది. అయితే వరుడు దొరకడంలేదు’’ అన్నారు ఇలియానా చదవండి: 'ఆశ ఎన్కౌంటర్' ట్రైలర్.. ఇది కల్పితమన్న ఆర్జీవీ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత -
మెడికల్ వండర్; రంగు మారింది!
కొచ్చి: ఆసియాలోనే తొలిసారిగా ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఓ యువతికి అతికించిన ఓ యువకుడి రెండు చేతుల రంగు మూడేళ్ల తర్వాత ఆమె చర్మం రంగులోకి మారింది. శ్రేయా సిద్ధనగౌడ చేతుల చర్మపు రంగు ఆమె శరీరం రంగు మాదిరిగా మారిపోయిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఇందుకు శాస్త్రీయ కారణాలు వివరించడం కష్టమని పేర్కొన్నారు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2017లో దాదాపు 13 గంటల పాటు శ్రమించి బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి చేతులను శ్రేయకు డాక్టర్లు అతికించారు. ఇంతకాలానికి అతడి చేతుల బరువు తగ్గిపోయి.. శ్రేయ సొంత చేతుల మాదిరిగానే మారిపోయాయి. అంతేకాదు చేతులపై వెంట్రుకలు కూడా చాలావరకు తగ్గిపోయాయి. బైక్ యాక్సిడెంట్లో తలకు బలమైన గాయాలు తగలడంతో సచిన్ అనే 20 ఏళ్ల కుర్రాడికి బ్రెయిన్ డెడ్ అయింది. అతడి చేతులను దానం చేసేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకొచ్చారు. దీంతో అమృతా ఆస్పత్రి తల, మెడ సర్జరీ విభాగం హెడ్ డాక్టర్ కె.సుబ్రమణియ అయ్యర్ ఆధ్వర్యంలో 20 మంది సర్జన్లు సహా 36 మందితో కూడిన బృందం శ్రేయకు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. ఆమె చేతుల రంగు మారేందుకు స్త్రీ హార్మోన్లు ప్రభావితం చేసి ఉండకపోవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ‘చర్మం రంగు విషయంలో స్త్రీ హార్మోన్లు ఎలాంటి ప్రభావం చూపవు. కేవలం మెలనిన్ మాత్రమే ఆ పని చేస్తుంది. మెదడు ఉత్పత్తి చేసే మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నియంత్రిస్తుంటుంది. ఈ హార్మోన్ స్థాయుల ద్వారానే ఆ రంగు మారి ఉంటుంది’ అని అయ్యర్ వివరించారు. చేతులపై వెంట్రుకలు క్రమంగా తగ్గిపోవడానికి కారణం టెస్టోస్టిరాన్ హోర్మన్ లేకపోవడమేనని ఢిల్లీకి చెందిన ప్రముఖ డెర్మటాలిస్ట్ షెహ్లా అగర్వాల్ వెల్లడించారు. చేతులు దానం చేసిన యువకుడు శ్రేయ కంటే సమయం ఎండలో గడపడం వల్లే అతడి చేతులు ముదురు రంగులోకి మారాయని తెలిపారు. శ్రేయకు అతికించిన తర్వాత అతడి చేతులు లేత వర్ణంలోకి మారాయని అభిప్రాయపడ్డారు. (చదవండి: కరోనా తొలి బాధితుడి అనుభవాలు) -
చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు కార్మికుడి చెయ్యి చెరకు రసం తీసే యంత్రంలో చిక్కుకుని చేతి వేళ్లు తెగిపోయిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన యూసుఫ్ (28) చేతి వేళ్లు పోగొట్టుకున్న కార్మికుడు. పట్టణ పరిధిలోని తిరుమల రోడ్డులో యూసుఫ్ చెరకు రసం యంత్రం బండి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం యూసుఫ్ యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుంది. యూసుఫ్ కేకలు విన్న స్థానికులు గ్యాస్ కట్టర్ సాయంతో రెండు గంటలపాటు శ్రమించి చెయ్యి విడిపించారు. అయితే యూసుఫ్ చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. యూసుఫ్ రెండు గంటలపాటు బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి అంబులెన్స్ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు విక్టోరియాకు తరలించారు. -
గేటు తెరవలేదని చేతులు నరికేశారు
న్యూఢిల్లీ: రైల్వే లెవెల్ క్రాస్ గేటును తెరవడానికి నిరాకరించాడని గుర్తు తెలియని వ్యక్తులు గేట్‌మన్ చేతులు నరికేసిన ఘటన ఉత్తర ఢిల్లీ ప్రాంతంలోని నరేలాలో చోటు చేసుకుంది. కుందన్పాఠక్ (28) అనే వ్యక్తి నరేలా–రత్దానా మధ్య 19వ నంబర్ రైల్వే గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి అతను విధులు నిర్వర్తిస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు గేట్ తెరవాల్సిందిగా ఒత్తిడి చేశారు. ఆ సమయంలో మూరి ఎక్స్‌ప్రెస్ వస్తున్నదని పాఠక్ గేట్ తెరిచేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముష్కరులు పాఠక్‌ను చావబాది చేతులను నరికివేశారు. ఈ దాడిలో పాఠక్ కాళ్లు, మెడకూడా దెబ్బతిన్నాయి. తీవ్ర రక్తస్రావమైన అతడిని ఆస్పత్రికి తరలించారు. పాఠక్ చేతులకు శస్త్రచికిత్స జరుగుతోందని, కోలుకునే వరకు రైల్వే తరఫున అన్నివిధాలా సాయం అందిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
విరిగి రోడ్డుపై పడిన మహిళ చెయ్యి
మొయినాబాద్(చేవెళ్ల) : అతివేగం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. డీసీఎంను నిర్లక్ష్యంతో నడిపి ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టడంతో మహిళ చెయ్యి విరిగి రోడ్డుపై పడింది. మండలంలో తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై చేవెళ్ల మండలం కందవాడ గేటు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని ఉప్పర్‌పల్లికి చెందిన హైమద్ తన భార్య ఫరీనాబేగం(26), తల్లి సయ్యద్బేగం, కూతుళ్లు మైయాక్, హర్ష, రిమ్షా, మోహిన్లతో కలిసి సోమవారం ఉదయం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని దర్గాకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. చేవెళ్ల మండలం కందవాడ గేటు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని డీసీఎం వాహనం ఆటోను కొనభాగంలో బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో కుడివైపు కూర్చున్న ఫరీనాబేగం చెయ్యి విరిగి రోడ్డుపై పడిపోయింది. ఆటోలు ఉన్న ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు. చెయ్యి విరిగిన ఫరీనాబేగంను అదే ఆటోలో వెంటనే కాళీమందిర్ సమీపంలో ఉన్న షాదన్ ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఆమె మృతి చెందింది. కలకలం రేపిన చెయ్యి... రోడ్డుపై తెగిపడిన చెయ్యి చేవెళ్ల ప్రాంతంలో కలకలం రేపింది. రోడ్డుపై పడి ఉన్న చెయ్యిని స్థానికులు చూసి సెల్ఫోన్లలో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసులు సైతం ప్రమాదం జరిగిన స్థలానికి చేరకుని గాయాలైన మహిళను ఆసుపత్రికి తరలించారని తెలుసుకుని అక్కడికి వెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో తెగిన చెయ్యి
కూసుమంచి: ద్విచక్ర వాహనంపై ముగ్గురు స్నేహితులు వెళుతున్నారు. వారి బైక్‌ను డీసీఎం డీకొంది. ఆ ముగ్గురిలో ఒకరి చేయి పూర్తిగా తెగిపోయింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం కూసుమంచిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పాలేరుకు చెందిన చెరుకుపల్లి శంకర్, వల్లెపు వెంకన్న, బత్తుల ఉపేందర్ బిల్డింగ్ వర్కర్లు. వీరు ముగ్గురూ కలిసి బైక్‌పై పాలేరు నుంచి కూసుమంచి వైపు వస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలోకి రాగానే, రోడ్డు క్రాస్ చేసేందుకని మధ్యలో కూర్చున్న శంకర్ తన చేతిని చాచాడు. ఇదే సమయంలో ఖమ్మం నుంచి పాలేరు వైపు వేగంగా వెళుతున్న డీసీఎం.. ఆ చేతిని ఢీకొంది. దీంతో శంకర్ చేయి గూడ కింది భాగం వరకు పూర్తిగా తెగిపడింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర్ చేయి తెగిపడటంతో పాటు తలకు దెబ్బలు తగిలాయి. వారిని, తెగిన చేతిని 108 సిబ్బంది ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. శంకర్ పరిస్థితి విషమించటంతో హైదరాబాద్ గాం«ధీ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ రఘు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుపై తెగిపడిన చెయ్యి
ఇబ్రహీంపట్నంరూరల్: కళ్ల ముందే మన చేయి తెగిపోయి పడిపోతే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. ఆ క్షణాలను ఊహించుకుంటేనే ఒళ్లంతా చెమటలు పట్టడం ఖాయం. అంతెందుకు మన కళ్లముందు ఎవరికైనా జరిగితే చూడటానికి కూడా ధైర్యం సరిపోదు. ఇదే పరిస్థితి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి ఎదురైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడ గ్రామానికి చెందిన శేఖర్ గురువారం హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు తన సొంత ఆటోలో ఉల్లిగడ్డ లోడుతో వెళ్తున్నాడు. ఆటోను ఆయనే స్వయంగా నడుపుకుంటూ వెళ్తుండగా ఇబ్రహీంపట్నం అగ్నిమాపక కేంద్రం వద్దకు రాగానే వెనుక టైర్ పగిలిపోయి బండి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి శేఖర్ తప్పించుకునే లోపే ఆటో ఆయన చేతిపై పడిపోయింది. దీంతో కుడి చేయి సగానికి తెగిపోయి వేలాడింది. తోటి ప్రయాణికులు వచ్చి శేఖర్‌ను బయటకు తీసి కాపాడారు. వేలాడుతున్న చేతితోనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయంతో శేఖర్ విలవిలలాడాడు. -
చేతులు బయటకు పెట్టొద్దన్నా..!
కుక్కునూరు: బస్సులో నుంచి చేతులు బయటకు పెట్దొద్దని ఆర్టీసీ సిబ్బంది పదేపదే హెచ్చరిస్తుంటారు.. అయినా అనేక మంది ప్రయాణికులు పట్టించుకోరు. ఇలా చేతులు బయట పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. శుక్రవారం కుక్కునూరు మండలంలోని పెద్దరావిగూడెంలో దురదృష్టవశాత్తూ ఇటువంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం డిపో నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సులో భద్రాచలం మండలంలోని కొర్రాజుల గుట్ట గ్రామానికి చెందిన యువకుడు రేబల్లి నాని(16) ప్రయాణిస్తున్నాడు. ఇతను బస్సు కిటికి నుంచి చేతిని బయటకు పెట్టాడు. ఈ క్రమంలో కుక్కునూరు నుంచి భద్రాచలం వెళ్తున్న లారీ బస్సు పక్కగా వెళ్తూ నాని చేయిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాని చేయి విరగడంతో తోటి ప్రయాణికులు బస్సును నిలుపుదల చేయించారు. 108లో బాధితుడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయలేదని..
చైతన్యపురి: ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయలేదని మనస్థాపంతో ఓ ఎస్ఎస్సీ విద్యార్థి బ్లేడుతో చేయికోసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక గౌతంమోడల్ స్కూల్లో శివమణి అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. కొన్నిరోజులుగా ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేయాలని ఇన్చార్జి టీచర్ మెహర్మణిని కోరుతుండగా, హెడ్ఆఫీస్ అనుమతి వచ్చిన తరువాత ఫేర్వెల్ పార్టీ డేట్ ప్రకటిస్తామని ఆమె తెలిపింది. ప్రీఫైనల్ పరీక్ష చివరిరోజు కావటంతో బుధవారం విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ విషయమై అడిగినా టీచర్ స్పందించక పోవటంతో మనస్థాపానిలోనైన శివమణి తరగతిగదిలో బ్లేడుతో చేయి కోసుకున్నాడు. దీనిని గుర్తించిన సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ప్రిన్సిపల్ రేణుకను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కసాయి తండ్రి
నెలమంగల (దొడ్డబళ్లాపురం): విద్యుదాఘాతంతో చేయి పోగొట్టుకున్న ఆడపిల్ల తనకు వద్దని కన్నతండ్రే నిరాకరించిన సంఘటన నెలమంగల పట్టణంలో వెలుగు చూసింది. నెలమంగల పట్టణంలోని రేణుకానగర్‌లో నివసిస్తున్న సయ్యద్భాష, షబానాభాను దంపతుల కుమార్తె ఆషియ (6). రెండు నెలల క్రితం ఇంటిపైన ఆడుకుంటుండగా ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగ షాక్ కొట్టి చిన్నారి ఆషియ కుడిచేయి పోగొట్టుకుంది. ఆ రోజు నుండి కసాయి తండ్రి ఆస్పత్రికి కాని, ఇంటికి కానీ కన్న కూతురిని చూడడానికి కూడా రాలేదని తల్లి షబానాభాను విలపిస్తోంది. అంతేకాకుండా తన భర్త మరో వివాహం చేసుకుంటాననని చెబుతున్నాడని తనను, తన కూతురిని దిక్కులేని వారిని చేసాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే చేయిలేని కూతురిని ఎలా పెంచగలమని, ఎలా పెళ్లి చేయగలమని అందుకే వదిలేసానని మానవత్వం లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించింది. ఇక బెస్కాం అధికారులు కేవలం ఆస్పత్రి ఖర్చులు చూసుకుని పరిహారం ఇవ్వకుండా వెళ్లిపోయారని చెబుతోంది. బెస్కాం అధికారుల నిర్లక్ష్యం, కట్టుకున్న భర్త వదిలేయడంతో షబానాభాను దిక్కుతోచని స్థితిలో ఉంది.తనకు,తన కూతురికి న్యాయం చేయాలని కోరుతోంది. -
భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు
విజయనగరం(ఎస్.కోట): విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఎస్.కోట మండల కేంద్రంలో ఆదివారం ఆర్సీఎం స్కూల్ వద్ద తన భార్యను దుర్భాషలాడిన వ్యక్తి చేతులను భర్త నరికాడు. ఎస్కోటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అతని భార్య ఒపెన్ స్కూల్ పరీక్షలు రాస్తుంది. ఎస్కోటకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పరీక్షలు రాస్తూ సదరు మహిళను కించపరిచేలా మాట్లాడటంతో ఆమె భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు, ఇబ్రహీంపై కత్తితో దాడి చేసి చేతులు నరికాడు. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను వైజాగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.