భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు | Husband cuts a man hands by scolding of his wife | Sakshi
Sakshi News home page

భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు

Published Sun, May 3 2015 3:21 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM

భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు

భార్యను దుర్భాషలాడాడని... చేతులు నరికేశాడు

విజయనగరం(ఎస్.కోట): విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని ఎస్.కోట మండల కేంద్రంలో ఆదివారం ఆర్సీఎం స్కూల్ వద్ద తన భార్యను దుర్భాషలాడిన వ్యక్తి చేతులను భర్త నరికాడు. ఎస్‌కోటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే అతని భార్య ఒపెన్ స్కూల్ పరీక్షలు రాస్తుంది.

ఎస్‌కోటకు చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి పరీక్షలు రాస్తూ సదరు మహిళను కించపరిచేలా మాట్లాడటంతో ఆమె భర్తకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరావు, ఇబ్రహీంపై కత్తితో దాడి చేసి చేతులు నరికాడు. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను వైజాగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement