![Srikakulam Got Good Position In Tenth And Intermediate Open School Exams - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/25/Untitled-7.jpg.webp?itok=wbuzNwIt)
సాక్షి,శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో అభ్యసిస్తున్న పది, ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో సిక్కోలు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాను టెన్త్‌లో ఆరోస్థానం, ఇంటర్‌లో ఏడో స్థానంలో నిలిపారు. జిల్లా ఫలితాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ గార పగడాలమ్మ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ డి.సూరపునాయుడు విడుదల చేశారు.
పదో తరగతిలో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 41.82 శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచారు. అలాగే ఇంటర్మీడియెట్ విద్యార్థులు 56.37 శాతం ఉత్తీర్ణతను సాధించి ఏడో స్థానంలో నిలి,చారు. జిల్లా నుంచి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి పరీక్షలకు 1277 మంది విద్యార్థులు హాజరుకాగా 534 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ పరీక్షలకు 1350 మంది హాజరుకాగా 761 మంది ఉత్తీర్ణత పొందారు.
చదవండి: Maharashtra Crisis: జాతీయ కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు
Comments
Please login to add a commentAdd a comment