చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి | Worker Hand Stuck in Sugarcane Machine in Karnataka | Sakshi

చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి

Published Sat, Feb 15 2020 9:22 AM | Last Updated on Sat, Feb 15 2020 9:22 AM

Worker Hand Stuck in Sugarcane Machine in Karnataka - Sakshi

యంత్రంలో చిక్కుకున్న చెయ్యిని బయటకు తీస్తున్న స్థానికులు

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు కార్మికుడి చెయ్యి చెరకు రసం తీసే యంత్రంలో చిక్కుకుని చేతి వేళ్లు తెగిపోయిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన యూసుఫ్‌ (28) చేతి వేళ్లు పోగొట్టుకున్న కార్మికుడు. పట్టణ పరిధిలోని తిరుమల రోడ్డులో యూసుఫ్‌ చెరకు రసం యంత్రం బండి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం యూసుఫ్‌ యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుంది. యూసుఫ్‌ కేకలు విన్న స్థానికులు గ్యాస్‌ కట్టర్‌ సాయంతో రెండు గంటలపాటు శ్రమించి చెయ్యి విడిపించారు. అయితే యూసుఫ్‌ చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. యూసుఫ్‌ రెండు గంటలపాటు బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి అంబులెన్స్‌ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు విక్టోరియాకు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement