పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్‌ | Ileana DCruz Shares Pics After Cutting Her Two Fingers | Sakshi
Sakshi News home page

Ileana : 'చిన్నపిల్లలా ఏడ్చేశాను..ఆ పని అంత తేలిక కాదు'

Published Sun, Oct 31 2021 2:02 PM | Last Updated on Sun, Oct 31 2021 2:33 PM

Ileana DCruz Shares Pics After Cutting Her Two Fingers - Sakshi

Ileana DCruz Shares Pics After Cutting Her Two Finges: ఇలియానా చిన్నపిల్లలా ఏడ్చారు. ఇంత పెద్ద అమ్మాయి చిన్నపిల్లలా ఏడవడం ఏంటీ అంటే.. ‘‘ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ ఈ ఏడుపుకి కారణం ఏంటంటే... వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ – ‘‘రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశాను.చదవండి:  ‘శ్యామ్‌సింగరాయ్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

ఏడవడానికి సిగ్గుపడకూడదు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్‌ వేయడం అంత తేలికైన పని కాదు’’ అంటూ తాను ఏడ్చిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గతంలో కూడా వంట చేస్తున్నప్పుడు ఇలా గాయం అయిందని, అయినప్పటికీ ఇంకా తనకు వేళ్లు ఉండటం ఆశ్చర్యంగా ఉందని సరదాగా అన్నారీ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఓ ఫ్యాన్‌ పెళ్లెప్పుడు? అని అడిగితే – ‘‘నాకూ చేసుకోవాలని ఉంది. అయితే వరుడు దొరకడంలేదు’’ అన్నారు ఇలియానా

చదవండి: 'ఆశ ఎన్‌కౌంటర్‌' ట్రైలర్‌.. ఇది కల్పితమన్న ఆర్జీవీ
సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement