Ileana D Cruz
-
ఇలియానా కుమారుడి ఫస్ట్ బర్త్‌డే (ఫోటోలు)
-
ఓటీటీలో ఇలియానా బోల్డ్ అండ్ కామెడీ సినిమా
ఒకప్పడు తెలుగులో టాప్ హీరోయిన్గా మెప్పించిన ఇలియానా బాలీవుడ్లో కూడా మెప్పించింది. హ్యాపీ ఎండింగ్, రైడ్ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్లో కూడా తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్లో 'దో ఔర్ దో ప్యార్'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాలో నోరా పాత్రలో చాలా బోల్డ్‌గా ఇలియానా మెప్పించింది. షిర్షా గుహా ఠాకూర్తా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'దో ఔర్ దో ప్యార్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
అలాంటి 'దర్శకనిర్మాతల' వల్లే తెలుగులో ఛాన్సులు రాలేదు: ఇలియానా
'దేవదాసు'లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఇలియానా.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ గోవా బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే తెలుగునాట టాప్ హీరోయిన్గా కొనసాగింది.ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి అలరించిన ఈమె కొన్నేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో మళ్లీ మెరిసింది. సౌత్ ఇండియా చిత్రాలకు ఆమె ఎందుకు దూరంగా ఉన్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇలియానా చెప్పింది. ఇక్కడ ఆమెకు ఎందుకు అవకాశాలు రాలేదో కూడా ఓపెన్‌గానే చెప్పింది.2012లో ఇలియానాకు బాలీవుడ్లో నటించేందుకు అవకాశం దక్కింది. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగులో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఈ క్రమంలో దక్షిణాది సినిమాలకు దూరమైంది. ఇదే విషయాన్ని ఇలియానా ఇలా చెప్పింది. 'అనురాగ్ బసు' దర్శకత్వం నుంచి 2012లో 'బర్ఫీ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను. ఆ సమయానికి దక్షిణాదిలో చాలా సినిమాలతో బిజాగా ఉన్నాను. కానీ 'బర్ఫీ' కథ నచ్చడంతో ఆ ప్రాజెక్ట్‌ను వదలుకోవాలనిపించలేదు. నా అంచనా నిజమైంది. సినిమా సూపర్ హిట్ అయింది. ఈ వార్తతో ఇక సౌత్ ఇండియాలో నేను సినిమాలు చేయనని అందరూ భావించారు. ఆపై నేను బాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యానని కూడా అనుకున్నారు. ఈ కారణంతో దక్షిణాది నిర్మాతలతో పాటు దర్శకులు కూడా నా పట్ల ఆసక్తి చూపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ సినిమా అయినా సరే చాలా నిజాయితీగా నేను పనిచేశాను. కానీ నాకు మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈ విషయంపై ఇన్నేళ్లైనా నాకు క్లారిటీ రాలేదు. దో ఔర్ దో ప్యార్, తేరా క్యా హోగా లవ్లీ వంటి బాలీవుడ్ చిత్రాలతో ఏడాదిలో ఇలియానా నటించింది. -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న ఇలియానా!
దేవదాసు సినిమాతో హీరోయిన్గా ప్రయాణం మొదలుపెట్టింది ఇలియానా. సన్నజాజి తీగలా ఉండటంతో ఈమెకు బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. పోకిరి, జల్సా, కిక్, జులాయి.. ఇలా ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. బర్ఫీ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌కు దూరమైంది. ప్రస్తుతం ఆమె నటించిన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ, లవర్స్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ! ఇదిలా ఉంటే ఇలియానా.. మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని రహస్యంగా పెళ్లాడిందని, ఈ ఏడాది మే నెలలో వీరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ బ్యూటీ. బాబు ఆలనాపాలనా చూసుకుంటున్న బ్యూటీ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా సినిమాలపై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదట. నిజంగానే గుడ్‌బై చెప్పనుందా? అందువల్ల ప్రస్తుతం తాను ఏ సినిమా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పడం లేదని, భర్త, పిల్లాడితో అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇలియానా నిజంగానే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా? లేదంటే పిల్లాడు పెద్దయ్యేంతవకు మాత్రమే ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకుంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న నటుడు.. వీడియో చూశారా? -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్
పండంటి బిడ్డకు జన్మనిచ్చి నటి ఇలియానా అమ్మ అయ్యారు . ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఇలియానా తెలిపారు. తన చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. 'ఈ ప్రపంచంలోకి మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ని పరిచయం చేస్తున్నాను. ఇది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను. మా హృదయాలను దాటి ప్రపంచానికి ఇలా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనిని మాటల్లో చెప్పలేం.' అని ఇలియానా తెలిపారు. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) తాను తల్లి కాబోతున్నట్లు ఇదే ఏడాదిలో ప్రకటించిన ఇలియానా తన ప్రియుడి వివరాలను చాలా గోప్యంగా ఉంచి.. జులైలో ప్రియుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ ఆతని వివరాలు,పేరు ఇప్పటికి వెల్లడించలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తండ్రి వివరాలు బయటి ప్రపంచానికి చెప్పుకోలేని స్థితిలో ఎలా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా పలువురు కామెంట్లు పెడుతున్నారు. కనీసం ప్రియుడితో పెళ్లి అయినా అయిందా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త వివరాలు ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారంటూ ఏకంగా అతనేమైనా టెర్రరిస్టా..? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే రాయలేని భాష ఉపయోగిస్తు ఇలియానపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆమె స్పందిస్తే మంచిదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
ఇలియానా బేబీ బంప్.. ఇన్‌స్టాలో పోస్ట్ వైరల్!
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. (ఇది చదవండి: రూమ్‌కు రమ్మని రెండు సార్లు పిలిచాడు: నిర్మాతపై నటి సంచలన ఆరోపణలు) అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అని చెప్పడంతో చేయడంతో అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా షాక్ అయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను షేర్ చేసింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనికి బాలీవుడ్ నటి అతియాశెట్టి లవ్ సింబల్‌ను జతచేసింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ఇలియానా ఇటీవల రాపర్-సింగర్ బాద్షాతో కలిసి ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆమె చివరిసారిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించిన ది బిగ్ బుల్ (2019)లో కనిపించింది. తర్వాత రణదీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీలో కనిపించనుంది. (ఇది చదవండి: గోపీచంద్ 'రామబాణం'.. ఆ డిలీటెడ్ సీన్స్ మీరు చూశారా?) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
తొలిసారిగా బేబీ బంప్ ఫోటోను షేర్ చేసిన ఇలియానా
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా రీసెంట్గా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా తొలిసారిగా తన బేబీ బంప్‌ను షేర్చేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. -
పెళ్లి కాకుండా తల్లి కాబోతున ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు?
-
పొట్టి దుస్తుల్లో ఆరోహి హొయలు.. బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక
► సితార క్యూట్ లుక్స్.. నయా ఫోటోషూట్ అదుర్స్ ► ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న గీతా మాధురి ► మన్మథుడికి నేహా చౌదరి ఆహ్వానం ► పొట్టి బట్టల్లో బిగ్‌బాస్ బ్యూటీ ఆరోహి రావ్ ► బ్లాక్ అండ్ వైట్ అందాలతో శివాత్మిక ► కింద కూర్చొని ఫోటోకి ఫోజుచ్చిన చాందిని View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by EmraanArtistry🧿 (@emraanartistry) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by KUSHI🐰#petlover (@kushithakallapu) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) -
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఈ గోవా బ్యూటీ డేటింగ్లో ఉన్నట్లు ఇంగ్లీష్ వెబ్సైట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ సోదరుడుల సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్ 6 నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్ ఇన్‌స్టా అకౌంట్‌ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
అప్పుడు ఇలియానాకు, ఇప్పుడు పూజాకు.. సేమ్ టూ సేమ్..
టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వెలిగి పోతున్న నటి పూజా హెగ్డే. చిన్న గ్యాప్ దొరికినా విహారయాత్రకు బయలుదేతుంది. తాజాగా మూడు ఖండాలు.. నాలుగు నగరాలు.. ఒక నెల అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది ఈ భామ. ముంబయి నుంచి బ్యాంకాక్ వెళ్లే విమానం ఎక్కుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక సౌత్‌లో అత్యధిక పారితోషికం డిమాండ్ చేస్తున్న ఈ ఉత్తరాది భామ. చదవండి: శింబు మంచి నటుడు.. కానీ..: డైరెక్టర్ తాజాగా ఆమె బాలీవుడ్‌లోనూ సల్మాన్ ఖాన్, రణవీర్‌సింగ్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి మరోసారి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం సరైన విజయం దక్కలేదు. నిజానికి పూజా తమిళ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేసింది. 10 ఏళ్ల క్రితం ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డేను అక్కడ పట్టించుకోలేదు. చాలా గ్యాప్ తరువాత ఇటీవల బీస్ట్ చిత్రంలో విజయ్‌తో నటించినా లక్ కలిసి రాలేదు. చదవండి: కాజల్ రీఎంట్రీ.. ఇండియన్ 2తో వస్తుందా? ఇంతకు ముందు నటి ఇలియానా పరిస్థితి ఇదే. కేడీ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర అపజయంతో ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశారు. టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న తరువాత విజయ్ సరసన నన్భన్ చిత్రంతో రీఎంట్రీ అయ్యింది. అయితే ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందడంతో ఇలియానా ఇక్కడ కనిపించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాజాగా సూర్య సరసన నటించే మరో లక్కీచాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రమైనా పూజాకు అవకాశాలు అందిస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
ఇలియానాను నిత్యనూతనంగా చూపించే బ్రాండ్స్ ఇవే..!
ఇలియానా... ఈ మధ్య సినిమాల్లో కన్నా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తోంది.. అదే గ్లామర్‌తో ఇలా! ఆమెను అలా నిత్యనూతనంగా చూపించే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. గోపి వేద్ చిన్ననాటి స్నేహితులిద్దరి భిన్న ఆలోచనల ఫ్యూజనే ‘గోపి వేద్’ లేబుల్. ఆ ఇద్దరిలోని ఒకరే గోపి వేద్. ఇంకో ఫ్రెండ్ అర్నాజ్ సూనావాలా. ముంబై వాసులు. గోపి వేద్ ‘లా’ చదివి.. బిజినెస్ మేనేజ్మెంట్ కూడా చేసింది. అర్నాజ్ ఈఎన్టీ (డాక్టర్) గోల్డ్ మెడలిస్ట్. చదువు ఈ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను దూరం చేసినా డ్రెస్ డిజైనింగ్ పట్ల ఉన్న కామన్ ఇంటరెస్ట్ ఇద్దరినీ కలిపింది మళ్లీ. అలా కలిసి ‘గోపి వేద్’ను ప్రారంభించారు. నిజానికి గోపి వేద్ కుటుంబ నేపథ్యం కూడా వస్త్ర ప్రపంచమే. గోపి వాళ్లమ్మ డ్రెస్ డిజైనర్. వాళ్లింటి కింది అంతస్తులో వర్క్ షాప్ ఉండేది. అది చూసీ చూసీ గోపి వేద్‌లో డ్రెస్ డిజైనింగ్ పట్ల ఆసక్తి మొదలైంది. అందుకే చదువయ్యాక ఈ రంగంలోకి వచ్చింది. ఆమెకు అండగా నిలిచింది అర్నాజ్. గోపి వేద్ డ్రెస్ డిజైన్, కలర్స్ చూస్తే.. అర్నాజ్.. ఫ్యాబ్రిక్ అండ్ బిజినెస్ చూసుకుంటుంది. అలా ఈ ఇద్దరి వైవిధ్యమైన ఆలోచనలు, ధోరణుల మిశ్రమ ఫలితంగా ‘గోపి వేద్’ అనే కళాత్మాకమైన లేబుల్ ఆవిష్కృతమైంది. బ్రైడల్ కలెక్షన్స్ వీరి బ్రాండ్ వాల్యూ. పూజా డైమండ్స్ 1989లో మొదలైంది ఈ బ్రాండ్ ప్రస్థానం. వ్యవస్థాపకులు.. ముఖేశ్ మెహతా, పప్పు భాయ్. అహ్మదాబాద్ వాసులు. తొలుత ఈ ఇద్దరూ డైమండ్ హోల్‌సేల్ వ్యాపారం చేసేవాళ్లు. నగల తయారీ పట్ల ఈ ఇద్దరికీ ఉన్న ఇష్టం, సృజనే వీళ్లు పూజా డైమండ్స్‌ను స్థాపించేలా చేసింది. అలా పూజా డైమండ్స్ ఫస్ట్ షోరూమ్‌ను 2001లో అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తమ బ్రాండ్‌కున్న డిమాండ్‌ను చూసి రెండో షోరూమ్‌ను 2016లో ముంబైలో స్టార్ట్ చేశారు. కొనుగోలుదారుల నమ్మకమే బ్రాండ్ వాల్యూగా వీళ్ల వ్యాపారం వృద్ధిచెందుతోంది. నా ఫిట్నెస్ రహస్యం వ్యాయామం. దిగులుగా ఉన్నా.. నిరుత్సాహంగా ఉన్నా వ్యాయామం మొదలుపెడతా. అంతే.. మనసు ఉత్సాహంతో ఉరకలేస్తుంది.. కొత్త శక్తి ఆవహిస్తుంది. – ఇలియానా జ్యూయెలరీ: డైమండ్ ఇయర్ రింగ్స్ బ్రాండ్: పూజా డైమండ్స్ ధర: నాణ్యత, డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. డ్రెస్ షరారా సెట్ బ్రాండ్: గోపి వేద్ ధర: 28,500 -
ట్రెండ్ సెట్టర్ 'పోకిరి'ని మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే!
'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఆడే పండుగాడు..' ఈ డైలాగ్ వినగానే బుర్రలో పోకిరి సినిమా గిర్రున తిరుగుతుంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా నడిచి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు నిండాయి. 2006 ఏప్రిల్ 28న విడుదలైంది పోకిరి. మహేశ్ యాక్టింగ్‌కు, ఇలియానా అందాలకు, పూరీ డైరెక్షన్ మార్క్‌కు థియేటర్లలో విజిల్స్ మార్మోగిపోయాయి. అయితే ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఛాన్స్ మొదటగా ఇలియానాకు రాలేదు. పూరీ జగన్నాథ్ పోకిరి కోసం మొదటగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను సంప్రదించాడు. కానీ అప్పటికే ఆమె హిందీలో 'గ్యాంగ్‌స్టర్: ఎ లవ్ స్టోరీ' సినిమాకు సంతకం చేయడంతో పోకిరి చేయలేనని చెప్పేసింది. అలా ఆమె చేతిలో నుంచి సువర్ణ అవకాశం చేజారిపోయింది. విశేషమేంటంటే పోకిరి, గ్యాంగ్‌స్టర్ రెండూ ఒకేసారి రిలీజయ్యాయి. పోకిరి ఇక్కడ బ్లాక్‌బస్టర్ హిట్ కొడితే గ్యాంగ్‌స్టర్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. చదవండి: దీపికాకు అరుదైన గౌరవం, జ్యూరీ మెంబర్‌గా మన హీరోయిన్! కంగనా తర్వాత పోకిరి ఛాన్స్ ఆయేషా టకియా, పార్వతి మెల్టన్, దీపికా పదుకొణెలకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వీళ్లెవరూ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకోలేదు. ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్పి చేజేతులా గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. అలా ఈ బంపరాఫర్ గోవా బ్యూటీ ఇలియానా చేజిక్కించుకుంది. ఇక పోకిరి సినిమాలో ఆమె అందం, యాక్టింగ్‌తో ఎలా రెచ్చిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 16 Years since the Pandu gadu Mania took us away 💥🔥 A Remarkable TRENDSETTER in South Indian Cinema🤘 SuperStar's SWAG & VIBE will be Recreated with #SarkaruVaariPaata 😎💪#Pokiri #16YearsForSouthIHPokiri@UrstrulyMahesh #PuriJagannadh #Ileana #ManiSharma pic.twitter.com/a18kwTgsao — Viswa CM (@ViswaCM1) April 28, 2022 చదవండి: ఆడిషన్స్‌కు వెళ్తే రిజెక్ట్ చేశారు, అదే నా లక్ష్యం -
ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్నా : ఇలియానా
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లో ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. దేవదాస్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే బాడీ షేమింగ్ వల్ల ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఇటీవలె వార్తలొస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ఈ వార్తలపై స్పందించింది. అవుతను నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ అది బాడీ షేమింగ్ వల్ల మాత్రం కాదు. 12 ఏళ్ల వయసునుంచే నాకు శరీర సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి నా శరీరాకృతి కారణం కాదు. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్లోకి వెళ్లా. అందుకే చనిపోవాలనుకున్నా. కానీ మీడియాలో మాత్రం బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ అంశాలతోనే ఆత్మహత్య ఆలోచన చేసినట్టు రాశారు. ఆ ఆర్టికల్ చూసి చాలామంది తనకు సందేశాలు పంపడం ప్రారంభించారు. దాంతో నాకు చాలా చిరాకు కలిగింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిందీ భామ. -
బాబోయ్ ఇలియాన సాహసం, అలాంటి ఫొటో షేర్ చేసిందేంటి!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియాన ఓ షాకింగ్ ఫొటో షేర్ చేసింది. తన బికిని ఫొటోను చూసి అంతా ఒక్కసారిగా కంగుతింటున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఒకప్పుడు సన్నని నాజుకు నడుముతో కుర్రకారు మతిపోగోట్టిన ఈ ‘రాక్షసి’ ఈ ఫొటో బోద్దుగా కనిపించడంతో ఫ్యాన్స్ అంతా షాకవుతున్నారు. దీంతో ఇదేంటి ఏమాత్రం ఎడిట్ చేయని ఫొటో షేర్ చేసి ఇలియాన ఇలాంటి సాహసం చేసిందంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత ఈ ఫొటోతో తను ఇచ్చిన సందేశం చూసి ఇలియానపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రెడ్ హాట్ బికిని ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఇలియాన ఏం చెప్పిందంటే.. ‘మీరు సన్నగా మరింత టోన్డ్.. ఇంకా అందంగా కనిపించేందుకు.. మీ శరీరాన్ని చాలా అప్రయత్నంగా మార్చుకునే యాప్స్ లలోకి వెళ్లడం చాలా సులభం. నేను ఆ యాప్స్ అన్నింటిని డెలిట్ చేశాను. అందుకు నేను గర్వపడుతున్నాను. ఇది నేను, నా ప్రతి అంగుళం, ఇదే నా శరీరాకృతి. ఇప్పుడు నేను అందరినీ హగ్ చేసుకుంటున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో పాటు ‘నువ్వు అందంగా ఉన్నావు’ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేసింది. ఇది చూసి తన ధైర్యం, ఆటిట్యూడ్‌కు ఆమె ఫాలోవర్స ఫిదా అవుతున్నారు. ‘మంచి సందేశం ఇచ్చావు, ఇది నిజం, బ్రేవ్ లేడీ’ అంటూ కొందరు ఇలియానకు మద్దుతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలియానవెండితెరపై అంతగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోష్ షేర్ చేస్తూ ఫాలోవర్స్‌లో టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే గతంలో ఇలియానా బాడీ డైస్మార్పికి డిజార్డర్‌తో బాధపడ్డానని, తీవ్ర ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. సమస్యలను అధిగమించడానికి తనకు మానసిక చికిత్స ఉపయోగపడిందని చెప్పింది. -
ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్..
ఈ చిన్నారి ఎవరో గుర్తపట్టారా? ఒకప్పుడు సౌత్‌లో తన అందం, అభినయంతో దక్షిణానా స్టార్ హీరోయిన్గా రాణించింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్ నుంచి యంగ్ హీరో రామ్ పోతినేని వరకు తెలుగు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. జీన్స్,టీ-షర్ట్‌తో క్యూట్ క్యూట్‌గా ఫొటోకు ఫోజు ఇచ్చిన ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తొచ్చిందా. అయితే మరో క్లూ మీకోసం. చదవండి: మహిళల పరువు పోయింది.. సమంత స్పెషల్ సాంగ్‌పై మాధవిలత షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతం తనకు తెలుగులో ఆఫర్స్ లేకపోయిన ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అమాయకపు చూపులు, క్యూట్ స్మైల్, కవ్వించే వయ్యారంతో కుర్రాళ్ల గుండెల్లో నిలిచిపోయింది. ఈ మధ్య సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఈ భామ ఇటీవల తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు. దేవదాసు సినిమాతో సినీ తెరకు ప్రరిచయమైన గోవా బ్యూటీ ఇలియాన. చదవండి: ‘పుష్ప’ మూవీకి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ మొదటి సినిమాతోనే తన అందచందాలతో దర్శక-నిర్మాతల దృష్టి ఆకర్షించిన ఇలియాన.. ఆ తర్వాత వరసగా తెలుగు స్టార్ హీరోల సరసన నటించి బాక్సాఫీసు హిట్లు అందుకుంది.తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇలియానా.. ఆ తర్వాత ‘పోకిరి’, ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ లాంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ‘ది బిగ్ బుల్’ సినిమాతో ఓటీటీలోకి అడుగుపెట్టిన ఇలియానా.. ‘తేరా క్యా హోగా లవ్లీ’ అనే మూవీతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. -
అతడు అలా అనడంతో ఏడ్చేసిన ఇలియానా!
Ileana D Cruz Gets Emotional: ఫిట్నెస్గా ఉండటం కోసం తారలు పడే తిప్పలు అన్నీఇన్నీ కావు. ఒకపూట తిండి మర్చిపోతారేమోక కానీ వర్కవుట్ మాత్రం అస్సలు మిస్సవరు. పొరపాటున వ్యాయామానికి కొంత బ్రేక్ ఇస్తే మాత్రం రెట్టింపు కష్టపడుతూ వర్కవుట్స్ మొదలు పెడుతుంటారు. గోవా సొగసరి ఇలియానా కూడా అంతే.. ఫిట్‌గా ఉండటం కోసం ఏమైనా చేస్తుంది. తాజాగా వర్కవుట్ పూర్తయిన తర్వాత ఇలియానా ఎందుకో ఎమోషనల్ అయింది. ఫిట్నెస్ ట్రైనర్ గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. "నా రెండు చేతులతో నా శరీరాన్ని హత్తుకోమన్నాడు ట్రైనర్. నా కోసం నిరంతరం పని చేస్తున్న శరీరానికి ఒక్క క్షణం థ్యాంక్స్ చెప్పమన్నాడు ఫిట్నెస్ ట్రైనర్. అతడు చెప్పినట్లుగా నా బాడీని ఆలింగనం చేసుకోగానే ఏదో తెలియని మధురానుభూతి నన్ను కుదిపేసింది. ఇదెంతో బాగుంది. దీన్ని మీరు కూడా ప్రయత్నించండి, ఎలా ఫీల్ అవుతారో చూడండి" అని రాసుకొచ్చింది ఇలియానా. -
పెళ్లి చేసుకోవాలనుంది..అబ్బాయి దొరకడం లేదు: హీరోయిన్
Ileana DCruz Shares Pics After Cutting Her Two Finges: ఇలియానా చిన్నపిల్లలా ఏడ్చారు. ఇంత పెద్ద అమ్మాయి చిన్నపిల్లలా ఏడవడం ఏంటీ అంటే.. ‘‘ఏడవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ ఈ ఏడుపుకి కారణం ఏంటంటే... వంట చేద్దామని కూరగాయలు తరుగుతుంటే రెండు వేళ్లకు గాయం అయిందట. కత్తి చాలా పదునుగా ఉండటంవల్ల గాయం బాగానే అయింది. ఆ విషయం గురించి ఇలియానా చెబుతూ – ‘‘రెండు వేళ్లకు గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడ్చేశాను.చదవండి: ‘శ్యామ్‌సింగరాయ్’ నుంచి అదిరిపోయే అప్డేట్ ఏడవడానికి సిగ్గుపడకూడదు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్ వేయడం అంత తేలికైన పని కాదు’’ అంటూ తాను ఏడ్చిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతంలో కూడా వంట చేస్తున్నప్పుడు ఇలా గాయం అయిందని, అయినప్పటికీ ఇంకా తనకు వేళ్లు ఉండటం ఆశ్చర్యంగా ఉందని సరదాగా అన్నారీ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఓ ఫ్యాన్ పెళ్లెప్పుడు? అని అడిగితే – ‘‘నాకూ చేసుకోవాలని ఉంది. అయితే వరుడు దొరకడంలేదు’’ అన్నారు ఇలియానా చదవండి: 'ఆశ ఎన్కౌంటర్' ట్రైలర్.. ఇది కల్పితమన్న ఆర్జీవీ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత -
నాలుగో సారి జత కట్టనున్న ఆ జోడీ?
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్ కి క్రేజ్ మామూలుగా వుండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వారిని ఆదరించడమే కాకుండా ఆ కాంబినేషన్స్ రిపీట్ అవుతోంది అంటే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక టాలీవుడ్లో రవితేజ ఇలియానా కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి వెండితెరపై ప్రేక్షకులని అలరించనున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇప్పటికే రవితేజ ఇలియానా కాంబినేషన్లో కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్భర్ ఆంటోనీ చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో ' కిక్' చిత్రం ఒక్కటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం రవితేజ ఇలియానా ముచ్చటగా నాలుగో సారి జత కట్టేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ సారి ఇలియానా హీరోయిన్గా కాకుండా రవితేజ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని టాక్. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో బిజీగా ఉండగా, ఇందులో ఈ గోవా బ్యూటీతో స్పెషల్ సాంగ్ చేయించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్టు ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. కాగా దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌తో పాటు రవితేజ టీం వర్క్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు. -
'ఇలియానా అలా చేసిందా? అందుకే తెలుగులో అవకాశాలు రావట్లేదా?'..
దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా. పోకిరీ సినిమాతో ఎంతో మంది కుర్రాళ్ల మనసు గెలుచుకున్న ఈ బ్యూటీ పలువురు స్టార్ హీరోలతో జతకట్టి తెలుగులో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే అనుకోకుండా బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది. దీంతో సౌత్‌లో ఆమెకు క్రమంగా సనిమాలు కరువయ్యాయి. మరోవైపు బాలీవుడ్ కూడా ఈ అమ్మడికి అంతగా కలిసి రాలేదు.ఆ సమయంలోనే బాయ్‌ఫ్రెండ్‌తో విభేదాలు రావడంతో లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ క్రమంలో విపరీతంగా బరువు పెరిగి అందరికీ షాకిచ్చింది. అప్పటివరకు నాజుగ్గా కనిపించిన ఇలియానా అనూహ్యంగా బరువు పెరిగి ఆశ్చర్యపరిచింది. ఇక మళ్ళీ లైన్ లోకి వచ్చి ఆమె పాగల్ పత్ని అనే సినిమా ఆలాగే అభిషేక్ బచ్చన్‌తో ‘బిగ్ బుల్' అనే సినిమాలో నటించింది. బాలీవుడ్‌పై ప్రేమతో గోవీ బ్యూటీ టాలీవుడ్‌కు దూరమైందని, అందుకే ఇక్కడి సినిమాలు చేయడం లేదని అందరూ భావించారు. అయితే నిజానికి దీని వెనుక వేరే కారణం ఉందని దర్శక నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “దేవుడు చేసిన మనుషులు సినిమా చేస్తున్నప్పుడు ఇలియానా విక్రమ్ హీరోగా ఓ సినిమా ఒప్పుకుంది. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో ముందుగా అడ్వాన్స్ గా తీసుకున్న 40 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని ఆ తమిళ నిర్మాత ఇలియాను కోరగా అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఈ విషయంపై ఆయన తమిళ నిర్మాతల మండలిని కూడా సంప్రదించారు. అక్కడ కూడా ఈ విషయం పరిష్కారం కాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు ఈ వ్యవహారం వెళ్ళింది. దీంతో ఇలియానాపై అధికారికంగా బ్యాన్ విధించకుండానే అనధికారికంగా ఆమెను సౌత్ సినిమాలలోకి తీసుకోకూడదని నిర్ణయించారు'' అని వెల్లడించారు. ఈ కారణంగానే ఇలియానా టాలీవుడ్‌కు దూరమైందని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. చదవండి : సినీ పరిశ్రమ క్రూరమైంది, ఇక్కడ ఆ నియమాలు ఉండవు: హీరోయిన్ ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు తెలుసా? ఆమె ప్రొఫెషన్ ఏంటంటే.. -
సినీ పరిశ్రమ క్రూరమైంది, ఇక్కడ ఆ నియమాలు ఉండవు: హీరోయిన్
ఒకప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్లో అగ్ర నటిగా రాణించిన ఇలియానా ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో వెండితెరకు దూరమైంది. తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్‌కు మకాం మార్చింది ఇలియానా. అక్కడ ఆమె నటించిన సినిమాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఇలియానాకు మాత్రం అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఈ తరుణంలో ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్‌తో ప్రేమయాణం నడిపిన ఆమె అతనితో విడిపోయాక తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. అయితే బాలీవుడ్‌కు వెళ్లిపోయాక ఇలియానా పలుమార్లు టాలీవుడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భారత సినీ పరిశ్రమలపై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ అంటనే క్రూరమైందంటూ ఘాటుగా స్పందించింది. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది. ఇక్కడ జీవించడం చాలా కష్టం. ప్రజలు చూసేంతవరకే మేం స్టార్లుగా ఉంటాం. ఒక్కసారి వాళ్లు మా నుంచి తల తిప్పుకుంటే అంతే ఇంకా మేము అన్నింటిని కోల్పోతాము. నా విషయంలో అదే జరిగింది’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చిత్ర పరిశ్రమ గురించి చెప్పడానికి ఎన్నో చెడ్డ విషయాలు ఉన్నాయని, అయితే ఇది డబ్బు సంపాదించే యంత్రమనే విషయాన్ని తాను ఒప్పుకోకతప్పదని చెప్పంది. అదే విధంగా ‘మా అభిరుచికి అనుగుణంగా పరిశ్రమలో ప్రతీదీ జరగాలనే నియమం లేదు. మన అనుమతి లేకుండా చాలా విషయాలు జరుగుతాయి. మనం వాటిని తట్టుకుని ఎలాంటి సంఘటనలను అయిన ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. ఇక్కడ కష్టపడి పనిచేసేవారికి విలువ ఉండదు. ప్రజల ఫోకస్ ను బట్టే ఇక్కడ విలువ, కెరీర్ ఉంటుంది’ అని ఆమె తెలిపింది. కాగా ఆమె తనకు నచ్చని హీరోలా సినిమాలు అసలు చూడనని కూడా చెప్పింది. -
కిస్ మీ అంటోన్న అషూ, ఫస్ట్ టైం అన్న లక్కీ రాయ్
♦ ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన నైనా గంగూలీ ♦ కిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. మిస్ మీ.. అంటూన్న అషూ రెడ్డి ♦ పాముతో ఆడుకుంటోన్న ఊర్వశి రౌతేలా ♦ వర్కవుట్స్, డ్యాన్స్ కలిపి కుమ్మేస్తున్న సాక్షి అగర్వాల్ ♦ అందంగా ముస్తాబైన మంచు లక్ష్మి ♦ ఈ వర్కవుట్ చేయడం ఇదే తొలిసారి అంటోన్న లక్ష్మీ రాయ్ ♦ నువ్వు నీలా ఉంటేనే అందం అని చెప్తోన్న లావణ్య త్రిపాఠి ♦ కన్నుగీటి కవ్విస్తోన్న వీజే అనూషా దండేకర్ View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Abijeet_Duddala (@abijeet_duddala) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Erk❤️rek (@ektarkapoor) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Apsara👼 (@apsararaniofficial_) View this post on Instagram A post shared by Anusha Dandekar (@vjanusha) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
గోవా బ్యూటీ డిజిటల్ ఎంట్రీ.. త్వరలోనే ‘ఇలియానా టాక్ షో’
కరోనా పుణ్యమా అని డిజిటల్ మీడియాకి డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్లో వెబ్ సీరీస్‌లతో పాటు టాక్ షోలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. వాటిలో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు చేసే టాక్ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో టీవీ చానళ్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా పేరున్న హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోని చేసింది.ఆ షోకి మంచి స్పందనే వచ్చింది. ఇక తమన్నాతో సైతం ఓ టాక్ షోకి ప్లాన్ చేస్తుంది ‘ఆహా’. ఇదిలా ఉంటే ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైందని సీనీ వర్గాల సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలియానా ఓ టాక్ షో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. తొలుత ఓ సీజన్‌ని షూట్ చేసి విడుదల చేస్తారట. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మరో సీజన్‌ని ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ టాక్ షో కోసం ఇలియానా భారీగానే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ టాక్‌షోని రూపొందించబోతున్నట్లు సమాచారం. -
ఆత్మహత్యాయత్నం, అబార్షన్‌పై స్పందించిన ఇలియానా
తను గర్భవతిగా ఉన్న సమయంలో లేనిపోని రూమర్లు సృష్టించారని ఇలియానా వాపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఫేక్ న్యూస్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించింది. "నా గురించి చాలా పుకార్లు వచ్చాయి. నేను అబార్షన్ చేసుకోబోతున్నానని చాటింపు చేశారు. అది విని నాకు బాధేసింది. మరీ ఇంత దారుణమా అనుకున్నా. ఇక ఇంకోసారి ఏకంగా నేను ఆత్మహత్యకు యత్నించానని, కాకపోతే నా పనిమనిషి చూసి ఈ ప్రయత్నాన్ని అడ్డుకుందని కథనాలు వచ్చాయి" నిజానికి నాకు పనిమనిషి అంటూ ఎవరూ లేరు. అసలు నేనెప్పుడూ సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు.. చచ్చిపోలేదు, బతికే ఉన్నాను. అయినా ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలు వారికి ఎక్కడ దొరుకుతాయో అర్థం కావడం లేదు" అని ఇలియానా పేర్కొంది. అంతే కాదు 2018లో తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో కలిసి ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై మండిపడ్డ ఆమె తను గర్భవతిని కాదంటూ రూమర్లకు చెక్ పెట్టింది. చదవండి: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా ప్లీజ్ అనిరుధ్ కోలుకోవాలని ప్రార్థించండి: నటి అభ్యర్థన -
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా
‘దేవదాసు’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత అగ్రనటిగా రాణించింది. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్, పపవన్ కల్యాణ్, రవి తేజ వంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఆ తర్వాత చేతి నిండా సినిమాలతో తెలుగుతో పాటు తమిళంలోను ఫుల్ బిజీ ఆయిపోయిన ఇలియానాకు అదే సమయంలో బాలీవుడ్లో నటించే అవకాశం వచ్చింది. రణ్‌బిర్ కపూర్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’ సినిమాలో నటించే చాన్స్ కొట్టెసింది. ఈ సినిమాలో ఇలియానా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత అక్కడ ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆ మధ్య ఇలియానా పూర్తిగా సినిమాలు తగ్గించి ప్రముఖ అస్ట్రేలియా ఫొటో గ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అతడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా మళ్లీ సినిమాలపై మొగ్గు చూపింది. ఈ క్రమంలో రవితేజతో ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇటీవల బాలీవుడ్లో అభిషేక్ బచ్చన్‌తో బిగ్ బుల్లో నటించింది. అయితే గతంతో పోలిస్తే ఇలియానాకు ఇప్పుడు సినిమ అవకాశాలు అంతగా లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం హిందీలో రణ్‌దీప్ హుడాతో ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ మూవీలో నటిస్తోన్న ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న ఆమె తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది. ‘నేను ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణం ఉంది. ఏది పడితే అది చేయాలని నేను అనుకోవడం లేదు. కథలో పాత్రకి ప్రాధాన్యం ఉండాలి. నా దగ్గరకు వచ్చిన కథలని ఆచితూచి ఎంపిక చేస్తున్నాను. రొటీన్‌కి భిన్నంగా ఉండేలా చూసుకుంటున్నాను. అంతేకాక.. పూర్తిస్థాయిలో యాక్షన్ చిత్రంలో నటించాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేగాక ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, తన ట్విట్టర్‌ను ఓపెన్ చేయలేకపోతున్నట్లు తెలిపింది. కాబట్టి అందులో ఎలాంటి ట్వీట్లు వచ్చినా పట్టించుకోవద్దని ఇలియానా తన ఫ్యాన్స్‌కు సందేశం ఇచ్చింది. చదవండి: ఇతడే నా బాయ్‌ఫ్రెండ్.. ఫోటో షేర్ చేసిన ఇలియానా త్వరగా కోలుకో బడ్డీ: నెటిజన్ల రచ్చ మామూలుగా లేదుగా! -
చిల్ అవుతున్న జాన్వీ, ఇది జస్ట్ శాంపిల్ అంటోన్న కీర్తి
♦ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అంటోన్న కీర్తి సురేశ్ ♦ ఊపిరి పీల్చుకోండని చెప్తోన్న దీప్తి సునయన ♦ అలా చేస్తే కనీసం నీడను కూడా చూడలేరంటోన్న ప్రగ్యా జైస్వాల్ ♦ గ్యాంగ్‌తో కలిసి స్టెప్పులేసిన జాన్వీకపూర్ ♦ మాల్దీవుల్లో చిల్ అవుతున్న పాత ఫొటోను షేర్ చేసిన మంచు లక్ష్మి ♦ పుస్తకం చదవడం పూర్తైందంటున్న శోభిత ధూళిపాల ♦ వైట్ కలర్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతున్న సాయి మంజ్రేకర్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Saiee M Manjrekar (@saieemmanjrekar) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Saiyami Kher (@saiyami) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) -
ఇతడే నా బాయ్‌ఫ్రెండ్.. ఫోటో షేర్ చేసిన ఇలియానా
'దేవదాసు' చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా అడుగు పెట్టిన ఇలియానా..ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా 'ఆస్క్మీఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించిన ఇలియానాకు..మీ బాయ్‌ఫ్రెండ్ పేరంటని ఓ నెటిజన్ ప్రశ్నించారు. తన పేరు చార్లి అంటూ ఓ ఫోటోను షేర్ చేసి నెటిజన్‌కు షాకిచ్చింది ఈ సన్నజాజి భామ. చార్లి అంటే ఇలియానా ఎంతో ప్రేమగా చూసుకుంటున్న కుక్క పేరు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్‌తో ఇలియానా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఇలియానా..ఈ మధ్య కెరియర్‌పై ఫోకస్ పెట్టి వరుస సినిమాల్లో నటిస్తుంది. మీ చర్మ సౌందర్యం కోసం ఏదైనా శస్త్రచికిత్స తీసుకున్నారా అని మరో నెటిజన్ ప్రశ్నించగా...ఇప్పటివరకు అయితే లేదని, మన శరీరం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలని బదులిచ్చింది. ‘గతంలో నా శరీరాకృతి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని. ఎలా కనిపిస్తున్నాం? బాగానే కనబడుతున్నామా? అని తెగ ఆలోచించేదాన్ని.ఆ ఒత్తిడి ఎలా ఉండేదో చెప్పలేను. నా ముక్కు షార్ప్‌గా లేదని, పెదాలు ఇంకా పెద్దగా లేవని, చేతులు సరిగ్గా లేవని, పొట్ట కొంచెం ముందుకు ఉంటుందని, నడుము పెద్దగా ఉంటుందని, ఇంకా ఎత్తు ఉండాల్సిందేమోనని, చురుకుగా లేనేమోనని, ఫన్నీగా ఉండనేమోనని, ఫర్ఫెక్ట్గా లేనేమో అని... ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ పర్ఫెక్ట్గా ఉండాలనుకోలనుకోవడం లేదని, నాకున్న లోపాలతో సంతృప్తిగానే ఉన్నాను’’ అని పేర్కొంది ఇలియానా. చదవండి :(‘నా శరీరం అందంగా లేదని అనుకునేదాన్ని’) (18 ఏళ్లకే ఫస్ట్ కిస్.. డేటింగ్ మాత్రం..) -
న్యూ ఇయర్ ప్లాన్స్ ఏమీ లేవు: రష్మికా
2020...ఉరుకుల పరుగుల ప్రపంచానికి బ్రేక్ వేసింది. ‘ఆగండి... ఆలోచించండి’ అని చెప్పింది. ‘మనీ’ మాత్రమే కాదు.. జీవితంలో ‘మెనీ థింగ్స్’ ఉంటాయని తెలియజేసింది. మంచి పాఠంలా ముగిసింది. కొత్త ఆలోచనలతో 2021ని స్వాగతించమంది. గడచిన విషయాల్లో చెడు ఉన్నా, అందులో మంచి కూడా ఉంటుంది. ఆ మంచిని తీసుకుని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. చాలామంది అంటున్న మాట ఇది. మరి... అందాల తారలు ఏమంటున్నారో చూద్దాం. ప్లాన్స్ ఏమీ లేవు! – రష్మికా మందన్న ► న్యూ ఇయర్ కొత్త ప్లాన్స్ చేయలేదు. గోల్స్ కూడా పెట్టుకోలేదు. ► ప్రస్తుతం అయితే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి నా స్నేహితులతో గోవా వచ్చాను. ఇక్కడ స్నేహితులతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను. ► ఈ ఏడాదికి కొత్త రిజల్యూషన్స్ ఏమీ పెట్టుకోదలచుకోలేదు. ఎందుకంటే మనం చేసినట్లుగా 2020 సాగిందా? అందుకే ఈసారి నో ప్లాన్. ► అందరికీ ఓ విషయం చెప్పాలి. ఈ ప్రపంచం మీది. మీరు అనుకున్నవి చేయండి. సాధించాలనుకున్న దానికోసం కష్టపడండి. ఎక్కువమంది స్నేహితులను చేసుకోండి. ప్రపంచాన్ని చూడండి. ఎక్కువ నవ్వండి. నచ్చింది తినండి. వర్కౌట్స్ చేయండి. అలానే కోవిడ్ వెళ్లిపోయిందనుకోవద్దు. కరోనా ఇంకా అలానే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఒకరికొకరం ప్రేమగా ఉందాం – ఇలియానా ► చాలా మందికి ఈ ఏడాది చాలా కష్టంగా సాగిందని తెలుసు. అయితే 2020 నాకు కాస్త ఫన్నీగా గడిచింది అనిపించింది. కొన్నిసార్లు నాకూ కష్టకాలంగా అనిపించింది. నేను చాలా వాటికి రుణపడి ఉన్నాను. ముఖ్యంగా నా జీవితంలో ఉన్న కొద్దిమంది మనుషులకు కృతజ్ఞురాలిగా ఉండాలి. అంతమంచి మనుషులు నా చుట్టూ ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో నిలబడిన అందరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ప్రేమను నేనెప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. మీరు పంచినదాని కంటే ఎక్కువ ప్రేమను మీకు తిరిగివ్వాలనుకుంటున్నా. ► కొత్త సంవత్సరం సందర్భంగా నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే... మనందరం ఇతరులతో ఇంకాస్త ప్రేమతో, దయతో ఉందాం. ఇతరులను అర్థం చేసుకుందాం. అలాగే మనతో మనం ప్రేమగా ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఒక్క సెకను కేటాయించండి – శ్రుతీహాసన్ ► 2020కి బై చెప్పేశాం. నా గురించి నాకు ఎన్నో నేర్పించిన సంవత్సరం ఇది. ► నా కలలు, నా కళలు... వీటి పట్ల నా మీద నాకున్న నమ్మకాన్ని తెలియజేసింది. ► దారిలో ఎన్ని కష్టమైన మలుపులు వస్తే అన్ని పాఠాలు నేర్చుకున్నట్లు. కొత్త సంవత్సరంలో వచ్చే మలుపుల కోసం ఎదురు చూస్తున్నాను. అవి ఆశీర్వాదాలుగా భావిస్తాను. ► మనందరం ఒక్క సెకను కేటాయిద్దాం. మనపట్ల ప్రేమ, దయ కనబరిచనవాళ్లకు ధన్యవాదాలు చెప్పడం కోసమే ఆ సెకను. అలాగే అన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతున్నందుకు మనల్ని మనం అభినందించుకుందాం. -
ట్రెండింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం రాఖీ.. ఛార్మీ కౌర్, గోవా బ్యూటీ ఇలియానా ఫీమెల్ లీడ్‌లో నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సీనియర్ నటి సుహాసిని పవర్ఫుల్ పోలీస్ అధికారిణి పాత్రలో కనిపించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌కు కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో రాఖీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. తను తప్ప మరెవరూ నటించలేరన్నంతగా డైలాగులతో ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌గా టచ్ చేశారు. 2006లో ప్రేక్షకుల ముదుకు వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నేటితో రాఖీకి(డిసెంబర్22) 14 ఏళ్లు పూర్తియ్యాయి. ఈ సందర్భంగా ట్విటర్లో #14YearsForRakhi అనే హ్యష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సినిమాలో ఎన్టీఆర్ నటన వేరే లేవల్లో ఉందంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. చదవండి: బుల్లితెరపై మరోసారి హోస్ట్‌గా ఎన్టీఆర్ సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాలో తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చలించిపోయిన హీరో తీవ్ర కుంగుబాటుకు గురవుతాడు. తన చెల్లె కేసుకు వ్యతిరేకంగా వాదించిన న్యాయవాదిని, దొగ సాక్ష్యం ఇచ్చిన డాక్టరును, పోలీసులను కూడా పెట్రోల్ పోసి తగులబెడతాడు. ఇలాంటి పరిస్థితి మరే అమ్మాయికి రాకూడదని కంకణం కట్టుకుంటాడు. అప్పటి నుంచి సమాజంలో ఏ ఆడపిల్లకు ఎక్కడ అన్యాయం జరిగినా అంతు చూసే పనిలో పడతాడు. అక్కడ నుంచి మాయమయిపోయిన రాఖీ ఎక్కడ ఏ ఆడపిల్లను ఎవరు వేదించినా, బాధించినా వాళ్ళని పెట్రోల్ పోసి తగులబెడుతుంటాడు. ప్రెగ్నెంట్ అయిన తన చెల్లెను డబ్బుపిచ్చితో కాల్చి చంపినా కోర్టులో కేసుకొట్టేయడం చూసిన రాఖీ తన చెల్లి అత్తింటి వారందరినీ కారుతో సహా పెట్రోల్ పోసి తగులబెడతాడు. సినిమా క్లైమాక్స్‌లో రాఖీ కోర్టులో మాట్లాడే సీన్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. -
నా శరీరమే నా అందం: ఇలియానా
టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్‌తో క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా మళ్లీ అభిమానులను పలకరించారు. తన శరీర సౌష్టవాన్ని గురించి మొదట దిగులు చెందిన ఈ భామ ప్రస్తుతం అదే శరీరం చూసి మురిసిపోతుంది. దీనికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టులో శరీరాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడంలో ఎదుర్కొన్న సొంత అనుభవాలను పంచుకున్నారు. చదవండి: ఇలియానా వెరైటీ లుక్ తన శరీరంలో ఎన్నో లోపాలు ఉన్నట్లు బాధపడిన ఇలియానా ఇప్పడు ఆ లోపాలే ఆమెకు అందాలంటూ పేర్కొన్నారు. ‘నా శరీరాకృతిపై ఎప్పుడూ ఆందోళన చెందుతున్నాను. ఎదుటి వారికి ఎలా కన్పిస్తున్నానో అని బాధపపడేదాన్ని. నా థైస్ చాలా పెద్దగా ఉంటాయని అనిపించేవి. నా హిప్ చాలా వెడల్పుగా ఉంటుందని, నా నడుము సన్నగా ఉండేందని అనుకునేదాన్ని, నా వక్షోజాలు చిన్నగా ఉంటాయని, నా పొట్ట అనుకున్నంతా బాగోదని, భుజాలు బలహీనంగా ఉంటాయని అనిపించేది. పెదాలు అందంగా లేవని, నే ఎక్కువ ఎత్తు ఉండనని బాధపడేదాన్ని. అసలు నేను స్మార్ట్, పర్ఫెక్ట్ కాదని అభిప్రాయపడేదాన్ని.’ అని వెల్లడించారు.. (హైదరాబాద్‌లో 10 రోజులపాటు కంగనా) తన సహజసిద్ధమైన అందాలే తనకు అట్రాక్షన్ అని ఇలియానా తన పోస్టులో వివరించారు. ‘నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని ప్రతి మచ్చను అందంగా భావిస్తున్నాను. నాలోని అన్ని లోపాలను నా సొంత అందంగా మలుచుకున్నాను. ప్రపంచం అందం అని అనుకునే దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి. ఇతరులకు అందంగా అనిపించే దాని కోసం నేనేందుకు మారాలి. నా అందం నాదే. నాకు నేనుగా నిలబడ్డాను’. అంటూ సుదీర్ఘ పోస్టు చేశారు. కాగా ఇలియానా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ప్రేరేపించేలా ఉన్నాయి. అలాగే ఇలియానా షేప్ అంత అట్రాక్టివ్‌గా ఉండదని కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జరిగిన విషయం తెలిసిందే. View this post on Instagram I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough..... I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough. Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed. Different. Quirky. Unique. Every scar, every bump, every “flaw” just made me, me. My own kind of beautiful. That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful. I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out. #nophotoshop #nobs 📸 @colstonjulian A post shared by Ileana D'Cruz (@ileana_official) on Oct 1, 2020 at 5:51am PDT -
వెరైటీ లుక్
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నేరాలకు పాల్పడిన ఓ వ్యక్తికి సంబంధించిన కథాంశంతో రూపొందిన క్రైమ్ డ్రామా ‘ది బిగ్ బుల్’. అభిషేక్ బచ్చన్, ఇలియానా జంటగా కూకీ గులాటి దర్శకత్వం వహించారు. అజయ్ దేవ్గన్, ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కళ్ల జోడు, టైట్‌గా ముడివేసిన జుట్టుతో ఇలియానా లుక్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. ‘‘ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ఇలియానా. 1980, 1990లలో ముంబైలో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని, పలు ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్‌కు సంబంధించి కథ ఇదని సమాచారం -
మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!
రెబల్‌స్టార్ ప్రభాస్, గోవా బ్యూటీ ఇలియానా జంటగా వచ్చిన చిత్రం ‘మున్నా’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజ్ నిర్మించారు. హారిస్ జయరాజ్ అందించిన పాటలు సూపర్‌డూపర్ హిట్ సాధించడం, ఫస్ట్ లుక్ పోస్టర్లలో ప్రభాస్ లుక్ కొత్తగా డిఫరెంట్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. అయితే అభిమానుల అంచనాలను ‘మున్నా’ అందుకోలేకపోయాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ స్టైలీష్ లుక్‌ను, ఇలియానా అందచందాలను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఈ చిత్రం విడుదలై నేటికి పదమూడేళ్లయింది. అప్పటితో పోలిస్తే ప్రభాస్ క్రేజ్ వెయ్యింతలు అయింది. దీంతో మరోసారి ఆ సినిమా ముచ్చట్లు సోషల్‌మీడియాలో మారుమోగిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం ట్విటర్లో ‘#13yearsformunna’ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. చదవండి: ‘ప్రభాస్-అమీర్‌లతో మల్టీస్టారర్ చిత్రం చేయాలి’ ట్రెండింగ్ టిక్‌టాక్‌లో శృతిహాసన్, అక్షర హాసన్ -
మన కోసం ఉండేది మనమే!
‘‘నా గురించి నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా ఉంటున్నా’’ అంటున్నారు ఇలియానా. జీవనశైలిని కూడా మార్చుకున్నారట ఆమె. కొత్త జీవన విధానం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘మీపై మీరు శ్రద్ధ వహించండి. ఇది ఎవరైనా, ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. ఇది జీవితం. ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మనం ఇతరుల్ని నమ్మాల్సి రావొచ్చు. ఆ సమయంలోవారిపై మనం బాగా ఆధారపడతాం. జీవితాంతం వారు మనతో ఉంటారో ఉండరో తెలియకుండానో వారిని నమ్మేస్తాం. కానీ మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉండాలి. మర్చిపోకూడదు. ఎందుకంటే జీవితంలో ఏం జరిగినా ఫస్ట్ మనకోసం ఉండేది మనమే. నా గురించి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా హాయిగా ఉంటున్నాను’’ అని పేర్కొన్నారు ఇలియానా. -
ఇల్లిబేబి ఏంటి నీ లొల్లి..?!
ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి.. లేకపోతే ఆ తరువాత ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకోరన్నది వాస్తవం. ఇప్పుడు నటి ఇలియానాది ఇదే పరిస్థితి. టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉండగానే బాలీవుడ్లో ప్రవేశించింది. అక్కడ ‘బర్ఫీ’ లాంటి ఒకటి, రెండు చిత్రాలు పేరు తెచ్చి పెట్టినా, ఆ తరువాత వరుస అపజయాలను ఎదుర్కొంది. దాంతో అవకాశాలు ముఖం చాటేస్తున్నాయి. మరో దారి లేక ప్రస్తుతం ఇలియానా దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించింది. రవితేజకు జోడిగా నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్ర షూటింగ్ సమయంలో దక్షిణాదిలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ దక్కించుకుంటానని ధీమా వ్యక్తం చేసింది కూడా. అయితే ఆ చిత్రం ఇలియానా ఆశల్ని సమూలంగా కూల్చేసింది. దాంతో ఈ అమ్మడి పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎలాగైన అవకాశాలు పొందాలన్న భావనతో ఉన్న ఇలియానా.. అందుకు గ్లామర్‌ను వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లుంది. అందుకే శరీరంపై కనిపించీ కనిపించని దుస్తులు ధరించిన ఫొటోలను తన ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్ట్ చేసి సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకునే పనిలో పడింది. తాజాగా లోనెక్ జాకెట్‌ను మాత్రమే ధరించిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అవకాశాల కోసం మరి ఇంత దిగజారాల అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. -
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీ స్టిల్స్
-
అమర్ అక్బర్ ఆంటోని పైవోట్
-
అమర్ అక్బర్ ఆంటోని కాన్సెప్ట్ టీజర్
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రవితేజ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రోజు దర్శకుడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చారు. పివోట్ టీజర్ పేరిట ‘అమర్ అక్బర్ ఆంటోని’కి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో రవితేజ ఈ చిత్రంలో చేస్తున్న మూడు క్యారెక్టర్లను పరిచయం చేశారు. అమర్ కాషాయ రంగు దుస్తుల్లో దిగాలుగా ఓ మూలకు కూర్చుని చూస్తుంటే, అక్బర్ భవనంలో నుంచి బైనాక్యులర్‌తో చూస్తూ కన్పించారు. ఆంటోనీ స్టైల్‌గా జీన్స్ టీషర్ట్ వేసుకుని ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూపించారు. టైటిల్‌ని బట్టి చూస్తే ఈ చిత్రంలో రవితేజ హిందువు, ముస్లిం, క్రిస్టియన్‌గా మూడు పాత్రల్లో కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్గా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. -
అలాంటి సంఘటన జరిగితే సంతోషమే..
తమిళసినిమా: ఇటీవల నటి ఇలియానా వార్తల్లో ఎక్కువగా నానుతోందనే చెప్పాలి. దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే హిందీ చిత్రాల మోహంతో ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడికి అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో పునరాలోచనలో పడి ఎక్కడ వదిలేసింది అక్కడే తిరిగి పొందాలని ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమపై దృష్టి సారించింది. ఆ విధంగా టాలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధమైంది కూడా. ఈ విషయం పక్కన పెడితే ఇలియానా ప్రేమ వ్యవహారం ప్రేక్షకుల మధ్య కుతూహలాన్నే రేకెత్తిస్తోంది. ఈ అమ్మడు ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీపోన్ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమకలాపాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అతనితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలను తరచూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో ఉంటోంది. అయితే తన ప్రేమ వ్యవహారం గురించి బహిరంగంగా ప్రకటించకపోవడంతో రకరకాల ప్రసారం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీంతో ఇలియానా అలాంటి ప్రసారాలకు మీడియా వర్గాలపై ఆగ్రహంతో రంకెలు వేయడం పరిపాటిగా మారింది. అయితే ఇన్నాళ్లకు తన బాయ్‌ఫ్రెండ్ గురించి నోరు తెరిసింది. దీని గురించి ఇలియానా తెలుపుతూ ఆండ్రూ తన బాయ్‌ఫ్రెండ్ అని అంగీకరించింది. అయితే మాకు పెళ్లి అయ్యిందని, గర్భం దాల్చానని రకరకాల వదంతులు ప్రచారం అవుతుండడం మాత్రం ఇబ్బందికరంగా ఉందని చెప్పింది. నిజం చెప్పాలంటే తమకు పెళ్లి జరగలేదని, తాను గర్భం దాల్చలేదని స్పష్టం చేసింది. ఇంకా చెప్పాలంటే అలాంటి సంఘటన జరిగితే సంతోషమేనని, త్వరలోనే అది జరగాలని తానూ కోరుకుంటున్నానని అంది. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పింది. నాకు నన్ను అర్థం చేసుకునే ప్రేమికుడు లభించాడని అంది. ప్రేమలో నమ్మకం చాలా ముఖ్యం అని చెప్పింది. తన మనసుకు బాధ కలిగినప్పుడు తాను వెతికే మొదటి వ్యక్తి అండ్రూ అని పేర్కొంది. సాధారణంగా తాను మనోవేదనకు గురైనప్పుడు ఎవరినీ కలవనని చెప్పింది. ఇంటిలోనే ఒంటరిగా కూర్చుని ఏడ్చేస్తానని అంది. ఆ సమయంలో ఎవరైనా తనను కలవాలని ప్రయత్నిస్తే వారిని గట్టిగా తిట్టేస్తానని చెప్పింది. అలాంటి తనను పూర్తిగా మార్చింది ఆండ్రూనేనని అంటోంది ఇలియానా. -
‘అందర్నీ అన్ని వేళలా మెప్పించలేము’
‘డిప్రెషన్’, ‘శరీర సౌష్టవం’ గురించి ఏ బెరుకు లేకుండానే మాట్లాడుతుంది గోవా బ్యూటీ ఇలియానా. ‘మనం ఎంత అందంగా ఉన్నామనుకున్నా వంకలు పెట్టేవారు మాత్రం ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారు. వారిని సంతృప్తి పర్చడం మన వల్లకాదంటుంది’ ఈ బర్ఫీ భామ. ప్రస్తుతం తన కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తుంది ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆమె గతంలో చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ ఫిజీలో విహారయాత్రలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఆండ్రూ తీసే ఫొటోలను ఇలియానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. ఈ విషయం గురించి తన ఫొటోలు అన్ని వేళల, అందరికీ నచ్చవంటున్నారు ఇలియానా. తన ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతంగా కామెంట్లు వస్తుంటాయని, కానీ ఇక వాటి గురించి పట్టించుకోదలచుకోలేదని చెబుతున్నారు. ‘కొందరు శరీరాకృతికి సంబంధించిన విషయాలతో బాధపడుతుంటారు. నాకైతే ఆ బాధ కాస్త ఎక్కువే. కానీ నేను దిగే ప్రతి ఫొటోతో అందరిన్నీ మెప్పించలేనని నాకు అర్థమైంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అందర్నీ మెప్పించాలని అనుకునేదాన్ని. నేను ఏం చేసినా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావాలని కోరుకునేదాన్ని. కానీ అది సాధ్యం కాదనిపించింది. కాబట్టి నేను కూడా వారు చేసే కామెంట్స్ విని వదిలేయడం నేర్చుకున్నాన’న్నారు. ఎప్పుడైనా బయటికి వెళ్లినప్పుడు అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు. ఆ సమయంలో నా ఫొటోలు తీయడం నాకు నచ్చదు. కానీ ఫ్యాన్స్ బాధపడతారని ఒప్పుకుంటాను. ఇన్నేళ్ల అనుభవంలో నాకు ఒక విషయం అర్థమైంది. మనం ఎంత అందంగా ఉన్నా జనాలు మనలో ఏదో ఒక లోపాన్ని వెతుకుతూనే ఉంటారన్నా’రు ఇలియానా. ఇలియానా ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో హీరోయిన్గా నటిస్తుంది. కాగా రవితేజ - ఇలియానా కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రమిది. -
సూపర్ స్పెషల్!
పదేళ్ల తర్వాత రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రూపొందుతుండటం ఒక స్పెషల్. వీళ్ల కాంబినేషన్లో 2007లో ‘దుబాయ్ శీను’ సినిమా వచ్చింది. అలాగే ఆరేళ్ల తర్వాత హీరో రవితేజ సరసన ఇలియానా నటించనుండటం ఇంకో స్పెషల్. 2012లో ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో ఇలియానా, రవితేజ కలిసి నటించారు. ఇప్పుడు రవితేజ సినిమాతోనే ఇలియానా మళ్లీ సౌత్‌లోకి రావడం సమ్‌థింగ్ స్పెషల్. ఇప్పుడీ సినిమాలో వన్మోర్ స్పెషల్ థింగ్ ఉంది. అదేంటంటే.. ఈ సినిమా సన్నివేశాలను రెడ్ మాస్ట్రో కెమెరా, జీస్ సుప్రీమ్ లెన్సెస్ను ఉపయోగించి చిత్రీకరిస్తున్నారు. అంతేకాదండోయ్.. 8కే రిజల్యూషన్‌తో షూట్ చేస్తోన్న తొలి తెలుగు సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’నే అని చిత్రబృందం చెబుతోంది. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మరి.. ఇన్ని స్పెషల్స్ ఉన్న ఈ సినిమా సిల్వర్‌స్క్రీన్‌పై సూపర్ స్పెషల్‌గా ఉండబోతుందన్నమాట. రవితేజ ట్రిపుల్ రోల్స్‌లో కనిపించనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సునీల్, లయ, అభిమన్యు సింగ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
నువ్వూ హీరోయిన్ అయిపోదామనే..!
సాక్షి, చెన్నై: నువ్వు కూడా హీరోయిన్ అయిపోదామనే.. ఏముందీ నీలో? ఒక అందం ఉందా? ఆకర్షించే అవయవ సంపద ఉందా? నీది చాలా సీరియస్ ముఖం. నీకు హీరోయిన్ అయ్యే లక్షణాలే లేవు. నీ పేరుతో వ్యాపారం అవ్వదు అని ఒక దర్శకుడు స్టుపిట్ కారణాలతో తూలనాడాడని నటి తాప్సీ చెప్పింది. అయితే ఇది ఇప్పటి సంగతీ కాదట. కొత్తగా అవకాశాల వేటలో ఉన్న సమయంలోనని తాప్సీ పేర్కొంది. ఆ దర్శకుడు ఎవరన్నది మాత్రం ఈ అమ్మడు బయటపెట్టలేదు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకున్న తాప్సీ ప్రస్తుతం హిందీలో వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటిస్తోంది. అయితే ఎప్పుడూ, ఏదోఒక అంశంతో వార్తల్లో ఉంటుంది తాప్సీ. ప్రస్తుతం హీరోయిన్గా తన తొలి రోజుల అనుభవాలను ఇటీవల ట్విటర్లో పేర్కొని మరోసారి సోషల్ మీడియాలకు పని చెప్పింది. దక్షిణాదిలో నటిగా గుర్తింపు తెచ్చుకుని, ఆ క్రేజ్‌తో బాలీవుడ్‌కు వెళ్లి ఆ తరువాత దక్షిణాదికి చెందిన వారిని విమర్శించడం హీరోయిన్లకు ఫ్యాషన్ అయ్యింది. తాప్సీ కూడా అంతే. బాలీవుడ్లో రెండు మూడు సక్సెస్‌లు రాగానే దక్షిణాది చిత్రపరిశ్రమతో పని లేదనుకుంటారో, ఏమోగానీ.. ఇలియానా, తాప్సీ లాంటి వాళ్లు నోరు జారడం చూస్తున్నాం. అసలు తనేమందో చూద్దాం. నటిగా ఆరంబంలో చాలా అవమానాలను ఎదుర్కొన్నాను. ‘నా మాదిరిగా చెల్లెల్ని కష్టపడనీయను. కారణం ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఇష్టపడేది నా చెల్లెలినే. తనంటే నాకు చాలా ప్రేమ. సినిమా రంగంలోకి రావద్దని తన చెల్లెలికి చెప్పలేదు. అయితే నా మనసులో ఉంది మాత్రం అదే. ఇక నాకు నటన అంటే ఇష్టం. కానీ ఈ రంగంలో ఎలా రాణించడానికి ఎలా ప్రవర్తించాలో అప్పట్లో నాకు తెలియదు. వివిధ రకాల పాత్రల్లో నటించాలి. సినిమాలో ఎలా ఎదగాలి అన్న విషయాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాను. ఏమీ తెలియని నేను ఇంతగా నేర్చుకోవడం ఈ స్థాయికి చేరుకోవడం పెద్ద విషయమే’ అని నటి చెప్పింది. -
ఇలియానా పెళ్లైపోయింది!
ముంబై: హీరోయిన్ ఇలియానా పెళ్లిపై గత కొంతకాలంగా ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబొనెతో ప్రేమాయణం సాగిస్తున్న ఆమె చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పరోక్షంగా వెల్లడించింది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా పెట్టిన పోస్ట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక ఫొటోను ఆమె షేర్ చేసింది. క్రిస్మస్ అంటే తనకెంతో ఇష్టమని, కుటుంబ సభ్యులతో సెలవులు గడపడం సంతోషంగా ఉంటుందని పోస్ట్ చేసింది. తాను షేర్ చేసిన ఫొటో తన భర్త(హబ్బీ) ఆండ్రూ తీశాడని పేర్కొంది. అతడితో పెళ్లిపోయింది కాబట్టే ఆండ్రూను భర్తగా సంబోధించిందని అభిమానులు అంటున్నారు. కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 2014లో ముంబై రెస్టారెంట్లో జంటగా కెమెరా కంటికి చిక్కారు. అప్పటి నుంచి బాలీవుడ్ కార్యక్రమాలు, వేడుకలకు జంటగానే హాజరవుతూ వచ్చారు. తామిద్దరి ఫొటోలను ఇలియానా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తుండటంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని అప్పట్లోనే అంతా అనుకున్నారు. My favourite time of the year ♥️ #christmastime #happyholidays #home #love #family Photo by hubby @andrewkneebonephotography ♥️ A post shared by Ileana D'Cruz (@ileana_official) on Dec 23, 2017 at 3:54am PST -
మై బెటరాఫ్!
‘బెటరాఫ్’ అంటే ఏంటి? జీవితాన్ని పంచుకునే వ్యక్తి. పెళ్లయ్యాక భర్త గురించి భార్య చెబుతున్నప్పుడో... భార్య గురించి భర్త చెబుతున్నప్పుడో ‘నా బెటరాఫ్’ అని అంటుంటారు. ఇలియానా కూడా అదే అన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా.. ఓ ఫొటోను ట్విట్టర్లో పెట్టారు. ‘మిమ్మల్ని నవ్వించే, ప్రేమించే స్నేహితులను వెతుక్కోండి’ అని ఆ ఫొటోను ఉద్దేశించి పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది.. ‘నా బెటరాఫ్ ఆండ్రూ నీబోన్ తీసిన ఫొటో ఇది’ అనడం చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ‘మా మధ్య రిలేషన్షిప్ ఉన్న మాట నిజమే’ అని కూడా పలు సందర్భాల్లో ఇలియానా అన్నారు. ఇద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చినప్పుడల్లా ‘అదేం లేదు’ అంటూ వచ్చారు ఇలియానా. మరి, ఇప్పుడు ‘నా బెటరాఫ్’ అనడంలో ఆంతర్యం ఏంటి? ఆండ్రూ – ఇలియానా రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. మరి.. ‘నా బెటరాఫ్’ అనడానికి అర్థం ఏంటో ఇలియానానే చెప్పాలి. మంచి స్నేహితులను కూడా ‘బెటరాఫ్’ అనొచ్చనీ, భార్యాభర్తలనే అనక్కర్లేదని చెప్పి ట్విస్ట్ ఇస్తారేమో? -
బాయ్ ఫ్రెండ్ తో ఇలియానా!
బిపాసాబసు బాటలోనే ఇలియానా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కరణ్ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసివున్న ఫొటోలను బయటపెట్టింది. మొనాకోలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొనాకో చాలా బాగుందని, ఇక్కడి అందాలను వర్ణించడానికి మాటల చాలవని పేర్కొంది. ఈ ఫొటోలు చూసినవాళ్లందరూ ఇలియానా తొందరలోనే పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని అంటున్నారు. అయితే పెళ్లి గురించి ఆమె మాత్రం ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో 'రుస్తూమ్' చిత్రంలో నటిస్తోంది. మంచి పాత్రలు వస్తే తప్పకుండా తెలుగులో నటిస్తానని ఇటీవల హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇలియానా చెప్పింది. సినిమా కెరీర్ కు ఇప్పుడప్పుడే ముగింపు పలికే ఉద్దేశం లేదని ఆమె స్పష్టం చేసింది. -
రూ.50 లక్షలు ఇస్తే నేను ఒకే!
నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో టాప్ కథానాయికల్లో ఒకరు ఇలియానా. ఇప్పుడు పారితోషికం ఇంతిస్తే చాలు అంటూ అవకాశాల కోసం దక్షిణాది దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకప్పటి కథానాయికల పారితోషికాలు వేరు. ఇప్పటి నాయికల పారితోషికాలు బేజారు. కథానాయకుల పారితోషికాలకు దీటుగా నాయికలు పెంచేస్తున్నారు. ఇంతకు ముందు నాయికల పారితోషికాలు లక్షల్లోనే ఉండేవి. ఇప్పుడు కోట్లకు పెరిగిపోయాయి. కథానాయకులు 30 నుంచి 40 కోట్లకు పెంచేస్తే తామేమీ తక్కువ కాదన్నట్లు నాయికలు కోట్లకు పెంచేశారు. ప్రముఖ కథానాయికలిప్పుడు కోటి నుంచి నాలుగు కోట్ల వరకూ పారితోషికాన్ని పుచ్చుకుంటున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టాప్ హీరోయిన్ నయనతార ఇప్పటి వరకూ మూడు కోట్లు పారితోషికం వసూలు చేసేవారని, తాజాగా తెలుగులో చిరంజీవికి జంటగా నటించడానికి నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం హోరెత్తుతోంది. ఇక గోవా సుందరి ఇలియానా నాలుగేళ్ల క్రితమే కోటికి పైగా పారితోషికం పుచ్చుకుని దక్షిణాదిలో అగ్రకథానాయిల పట్టికలో చేరారు. అయితే అంతకంటే అధిక పారితోషికం ఆశిస్తూ, మరింత పాపులారిటీని కోరుకుంటూ తెలుగు,తమిళ భాషల్లో అవకాశాలు తలుపుతడుతున్నా కాదని బాలీవుడ్లో మకాం వేశారు.అక్కడ తొలిరోజుల్లో పరిస్థితి ఆశాజనకంగా ఉన్నా రానురానూ అది మిథ్యగా మారింది. నాలుగేళ్లలో ఇలియానా ఐదు హిందీ చిత్రాలు మాత్రమే చేయగలిగింది.ప్రస్తుతం అవకాశాలు నిల్. దీంతో పీచేముడ్ అంటూ ఇప్పుడు తమిళం, తెలుగు భాషల్లో అవకాశాలు వెతుక్కునే పనిలో పడ్డారని సమాచారం. ఇందుకు తన పారితోషికంలో కూడా రిబేట్ ఇచ్చేయడానికి సిద్ధమయ్యారట. రూ.50 లక్షలు పారితోషికం ఇస్తే చాలు అంటూ తమిళ, తెలుగు దర్శక నిర్మాతలకు రాయబారం పంపుతున్నారని సమాచారం. దీంతో కొందరు దర్శకనిర్మాతలు ఆమెను తమ చిత్రాల్లో ఎంపిక చేసే విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో నన్భన్ చిత్రం తరువాత కొన్ని భారీ అవకాశాలు వచ్చినా ఇలియానా అప్పట్లో నటించడానికి అంగీకరించలేదన్న ప్రచారం జరిగిందన్నది గమనార్హం. -
ఐస్నీళ్లు కుమ్మరించుకుంటే ఏమొస్తుంది?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఓ సవాల్ హల్చల్ చేస్తోంది. అదే ‘ఐస్ బకెట్ చాలెంజ్’. అమియోట్రాఫిక్ లాటరల్ స్లెరోసిస్ (ఎఎల్ఎస్) అనే వ్యాధిపై అవగాహన కలిగించడానికి యూకేలో ఎఎల్ఎస్ సంస్థ ఈ సవాల్‌ని ప్రవేశపెట్టింది. ఒక బకెట్ ఐస్నీళ్లు నెత్తి మీద కుమ్మరించుకుంటే ఈ సవాల్‌ని జయించినట్లు. ఇది విజయవంతంగా పూర్తి చేస్తే పది డాలర్లు, చేయలేనివాళ్లు వంద డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బుని ఎఎల్ఎస్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం వినియోగిస్తారు. ఓ సత్కార్యం చేయడానికి సరదాగా ప్రవేశపెట్టిన ఈ సవాల్‌ని చాలామంది నిజంగా సరదా కోసం చేస్తున్నారు తప్ప, విరాళం ఇవ్వాలనే ఆకాంక్షతో చేయడంలేదు. ఇలాంటివారి గురించేనేమో ఇలియానా తన ట్విట్టర్లో ‘‘నెత్తి మీద ఐస్నీళ్లు కుమ్మరించుకుంటే ఏం లాభం? ఎఎల్ఎస్ సంస్థకు విరాళం ఇవ్వడానికి, ఆ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప సరదాగా తీసుకోవాల్సిన విషయం కాదు’’ అని పేర్కొన్నారు. -
అభిమానం అంటే అదే!
అభిమానులు లేనిదే హీరోలు లేదులే అంటూ హీరో వెంకటేష్ ఒక పాటలో అంటారు. అందుకే వాళ్లను ప్రేక్షక దేవుళ్లగా నటీనటులు భావి స్తారు. అభిమానం అనేది వెలకట్టలేనిది. కొందరి అభిమానం మధురంగా మనసు మీటుతుంది. ఇలియానా అనూహ్యంగా ఇలాంటి అనుభూతినే పొందారు. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమను తన అందచందాలతో ఊపేసిన ఇలియానా, ప్రస్తుతం తన సౌందర్య సంపదతో బాలీవుడ్ ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అక్కడ హీరోయిన్గా ఆమె పరిస్థితి ఎలా వున్నా తన ముగ్ధ మనోహర రూపానికి చాలామంది అభిమానులు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇటీవల జరిగిన ఒక సంఘటన ఇందుకు ఉదాహరణ. మెరుపుతీగ ఇలియానా ముంబయి విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈమెను చూడటానికి అభిమానగణం చుట్టుముట్టారు. అలాంటి కలకల వాతావరణంలో ఒక అభిమాని ఇలియానా ముందుకు దూసుకొచ్చి ఒక చీటి ముక్కను ఆమె చేతిలో పెట్టి కొంచెం సేపు తరువాత చదవమని వెళ్లిపోయాడు. అందులో ఏమి రాశాడు అంటూ అక్కడి వారడిగిన ప్రశ్నలకు అప్పుడు ఇలియానా బదులివ్వలేదు. ఆ అభిమాని చీటిలోని సారాంశాన్ని ఇలియానా తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ముచ్చటపడ్డారు. ‘‘హే ఇలియానా తెరపైనా అయినా నేరుగా అయినా చూడటానికి అందంగా ఉంటారు. మీరు నటించిన బర్ఫీ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది. అందులో మీ నటన ప్రశంసనీయంగా ఉంది. సినీ రంగంలో మీరు పయనించాల్సిన దూరం చాలా ఉంది.’’అని ఆ అభిమాని చీటి ముక్కలో పేర్కొన్న విషయం. ఇందులో అంత గొప్పగా అభినందించిందేముంది అని అడిగితే, అయితే ఆ అభిమాని చిన్న చీటి ముక్కలో తన స్వహస్తాలతో అభినందిస్తూ రాయడం తనకు బాగా నచ్చిందని ఏదేమైనా ఆ చీటి తన మనసు లోతుల్ని హాయిగా తాకిందని ఇలియానా పేర్కొన్నారు. నిజమైన అభిమానికి సరైన నిర్వచనం ఇదేనేమో.