నాలుగో సారి జత కట్టనున్న ఆ జోడీ? | Ravi Teja And Ileana Team Up For Fourth Time In Tollywood | Sakshi
Sakshi News home page

నాలుగో సారి జత కట్టనున్న ఆ జోడీ?

Published Mon, Aug 16 2021 3:09 PM | Last Updated on Mon, Aug 16 2021 3:42 PM

Ravi Teja And Ileana Team Up For Fourth Time In Tollywood - Sakshi

సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేష‌న్స్ కి క్రేజ్  మామూలుగా వుండదు. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు వారిని ఆదరించడమే కాకుండా ఆ కాంబినేషన్స్ రిపీట్ అవుతోంది అంటే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక టాలీవుడ్‌లో ర‌వితేజ‌ ఇలియానా కాంబినేష‌న్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా వీరిద్దరు కలిసి మరోసారి వెండితెరపై ప్రేక్షకులని అలరించనున్నారని ఇండస్ట్రీలో టాక్.

ఇప్పటికే రవితేజ ఇలియానా  కాంబినేష‌న్‌లో కిక్, దేవుడు చేసిన మ‌నుషులు, అమ‌ర్ అక్భ‌ర్ ఆంటోనీ చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో ' కిక్' చిత్రం ఒక్క‌టే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయిన‌ప్ప‌టికీ ప్రేక్షకుల్లో ఈ కాంబోపై అంచ‌నాలు భారీగా ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ర‌వితేజ‌ ఇలియానా ముచ్చ‌ట‌గా నాలుగో సారి జ‌త క‌ట్టేందుకు సిద్ధ‌మైన‌ట్టు సమాచారం. అయితే ఈ సారి ఇలియానా హీరోయిన్‌గా కాకుండా ర‌వితేజ సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌నుంద‌ని టాక్. ప్ర‌స్తుతం ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఇందులో ఈ గోవా బ్యూటీతో స్పెష‌ల్ సాంగ్ చేయించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారట‌. ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు ప్ర‌చారం కూడా జోరుగా జరుగుతోంది. కాగా దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

'రామారావు ఆన్ డ్యూటీ'  చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్తో పాటు రవితేజ టీం వర్క్స్ బ్యానర్లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement