
రవితేజ(Ravi Teja) ప్రస్తుతం ‘మాస్ జాతర’ మూవీలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం మే 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం తర్వాత రవితేజ నెక్ట్స్ మూవీకి ఎవరు దర్శకత్వం వహించనున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా ‘మ్యాడ్’ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి, ప్రస్తుతం ‘మ్యాడ్ 2’ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్(Kalyan Shankar) ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట.
స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. దీంతో స్క్రిప్ట్‌పై మరింత ఫోకస్ పెట్టారట కల్యాణ్ శంకర్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందని, అన్నీ కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీమ్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment