kalyan
-
ఉగాది వేడుకల్లో మెగాస్టార్ మనవరాలు నవిష్క (ఫొటోలు)
-
ముంబై లోకల్ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబై లోకల్ ట్రైన్లో ఘాట్కోపర్ నుంచి కళ్యాణ్ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. లోకల్ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్‌లో కేరళలో నిర్మల వందేభారత్ రైలులో ప్రయాణించి అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. -
'ఆ ఊరి అమ్మాయిలకు నల్లగా ఉండే వాళ్లంటేనే ఇష్టం'..!
వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. ఈ చిత్రాన్ని కల్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం ద్వారా కల్యాణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోల్డెన్ మీడియా, ఆర్టీ టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు. మెగాస్టార్ ప్రశంసలు.. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చిత్రబృందాన్ని మెగాస్టార్ అభినందించారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాను ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హర్ష గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌తోనే నవ్వులు తెప్పిస్తోన్న ఈ చిత్రం.. థియేటర్లలో కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. MEGASTAR #Chiranjeevi garu launched the trailer of #SundaramMaster @RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA All The Best #SundaramMasterOnFeb23rd Boss @KChiruTweets#MegastarChiranjeevi pic.twitter.com/OnmGjU2hVa — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 15, 2024 -
AIFF: తొలిసారి అధ్యక్షుడిగా ఆటగాడు
న్యూఢిల్లీ: మైదానంలో ఆటగాళ్లు గోల్ కోసం శ్రమిస్తుంటే... కేంద్ర మంత్రి స్థాయి వారు ఫుట్‌బాల్ సంఘంలో ఏళ్ల తరబడి తిష్టవేసి రాజకీయాలు చేశారు. ఇలా ఆటకు సంబంధంలేని వారే 85 ఏళ్ల పాటు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)ను ఏలారు. ఏనాడూ మాజీ కెప్టెన్ కానీ, దిగ్గజ ప్లేయర్ కానీ సమాఖ్యలో అధ్యక్ష స్థానంలో లేనే లేరు. దీంతో రాజకీయాలతో మసక బారిన ఏఐఎఫ్ఎఫ్ చివరకు మన ఫుట్‌బాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ‘ఫిఫా’ నిషేధానికి గురైంది. చివరకు రోజుల వ్యవధిలోనే సడలింపుతో ఊపిరి పోసుకున్న ఏఐఎఫ్ఎఫ్కు ఇప్పుడు కొత్త జవసత్వాలు మాజీ ఆటగాడి రూపంలో వచ్చాయి. భారత మాజీ గోల్ కీపర్ కల్యాణ్ చౌబే 85 ఏళ్ల ఏఐఎఫ్ఎఫ్ చరిత్రలో అధ్యక్షుడైన ఆటగాడిగా నిలిచారు. మాజీ కెప్టెన్, దిగ్గజం బైచుంగ్ భూటియా ఈ ఎన్నికలో ఓడినప్పటికీ మైదానంలోలాగే ఓ ఆటగాడి చేతిలోనే ఓడాడు. రాజకీయ నాయకుడి చేతిలో కాకపోవడం గొప్ప ఊరట. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 46 ఏళ్ల కల్యాణ్ చౌబే అధ్యక్షుడిగా ఏకపక్ష విజయం సాధించారు. ఆయన 33–1 ఓట్ల తేడాతో భూటియాను ఓడించారు. ఆశ్చర్యకరంగా మాజీ కెప్టెన్‌కు ఒక్క ఓటే రావడం విచిత్రం! భూటియా, ఐఎం విజయన్, లారెన్స్, హైదరాబాద్‌కు చెందిన భారత మాజీ కెప్టెన్ షబ్బీర్ అలీ ఆటగాళ్ల ప్రతినిధులుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యులుగా వ్యవహరిస్తారు. మిగతా 14 మంది ఈసీ మెంబర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం జనరల్ సెక్రటరీ జీపీ ఫల్గుణతో పాటు అవిజీత్ పాల్, పి.అనిల్ కుమార్, వాలంక నటాష, మాలోజి రాజే ఛత్రపతి, మేన్ల ఎతెన్పా, మోహన్ లాల్, ఆరిఫ్ అలీ, కె.నీబౌ సెఖోస్, లాల్గింగ్లోవా, దీపక్ శర్మ, విజయ్ బాలి, ఇంతియాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గోపాలకృష్ణ కొసరాజు కోశాధికారి పదవి కోసం పోటీపడి 1–32తో కిపా అజయ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతిలో ఓడారు. మంచి గోల్ కీపర్... కల్యాణ్ చౌబే మాజీ గోల్ కీపర్, మంచి గోల్‌కీపర్ కూడా. 1996లో మోహన్ బగాన్ సీనియర్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశారు. తదనంతరం ఈస్ట్ బెంగాల్, జేసీటీ, సాల్గావ్కర్ తదితర క్లబ్‌లకు 2003 ఏడాది వరకు ప్రాతినిధ్యం వహించారు. అంతకంటే ముందు జూనియర్ స్థాయిలో భారత అండర్–17, అండర్–20 జట్ల తరఫున ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నారు. 1999–2000లో ప్రి–ఒలింపిక్ క్వాలిఫికేషన్లో భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణాసి యా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడుసార్లు విజేతగా నిలువడంలో గోల్‌కీపర్ గా చౌబే కీలకపాత్ర పోషించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో 2019లో బీజేపీ తరఫున బెంగాల్లో ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. -
డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ మూవీ నుంచి ఫస్ట్ స్ట్రైక్ అవుట్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కుమారుడు కల్యాణ్ హీరోగా త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా అధీర అనే మూవీ తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను డైరెక్టర్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు విడుదల చేశారు. ఈ ‘అధిర ఫస్ట్ స్ట్రైక్’ను హాలీవుడ్లో రెంజ్లో విజువల్ ఎఫెక్ట్స్‌ను చూపించారు. చూస్తుంటే మరో సూపర్ హీరో సినిమాను ప్రశాంత్ వర్మ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి గౌరీహరి సంగీతం అందిస్తుండగా, దాశరధి శివేంద్ర కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. -
హీరోగా డీవీవీ దానయ్య తనయుడు ఎంట్రీ, డైరెక్టర్ ఎవరంటే!
‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య తనయుడు కల్యాణ్ హీరోగా తెలుగు వెండితెరకు త్వరలో పరిచయం కాబోతున్నాడు. తనయుడిని లాంచ్ చేసే బాధ్యతను దానయ్య యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించినట్లు టాక్ నడుస్తోంది. అ, కల్కి, వంటి సినిమాలతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. మరోసారి తేజ హీరోగా హను-మాన్ అనే సూపర్ హీరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కళ్యాణ్ తొలి చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కల్యాణ్ కోసం ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఓ విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. దీనికి అదిరా అనే టైటిల్ పరిశీలిస్తున్నాడట వర్మ. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. మరోవైపు కళ్యాణ్ హీరోగా మారేందుకు అన్నివిధాల ట్రైన్ అయ్యాడట. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో స్పెషల్‌గా శిక్షణ కూడా తీసుకున్నాడట. మరోవైపు దానయ్య ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం డివివి దానయ్య ఎదురు చూస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ప్యాకెట్లలో బండరాళ్లు, పెంకులు
సైదాపూర్ (హుస్నాబాద్): తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశారు ఓ నలుగురు యువకులు. వీరి వ్యవహారంపై పైస్థాయి ఉద్యోగికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ నలుగురు చేసిన మోసం బయటపడింది. ఈ కేసు వివరాలను హుజురాబాద్ ఏఎస్పీ వెంకటరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రం, వెన్కెపల్లి గ్రామానికి చెందిన నీర్ల కల్యాణ్(24), అనగోని వికాస్(23), కనుకుంట్ల అనిల్(26), తూటి వినయ్ (22) హుజూరాబాద్‌లోని లార్జ్ లాజిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఫ్లిప్‌కార్ట్ కొరియర్ బోయ్స్‌గా 3 నెలల నుంచి పని చేస్తున్నారు. వీరు తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనుకున్నారు. దీని కోసం ఆన్లైన్లో మోసం చేయడం ఎలా అని యూట్యూబ్‌లో వెదికారు. ఆ తర్వాత ఆన్లైన్లో విలువైన వస్తువుల్ని వీరి స్నేహితుల ఫోన్నంబర్ల నుంచి బుక్ చేసుకున్నారు. ఆ వస్తువులు హుజూరాబాద్ ఫ్లిప్‌కార్టు హబ్‌కు రాగానే డెలివరీ ఇచ్చేందుకు వారిపేరున అసైన్ చేసుకుని సైదాపూర్‌కు తీసుకొచ్చారు. పార్శిల్ ఓపెన్ చేసి ఆ వస్తువులు తీసేసుకుని, రిటర్న్‌ల పేరిట ఆ కవర్లో బండరాళ్లు, పెం కులు నింపి వెనక్కి పంపించేశారు. కాజేసిన వస్తువుల్ని అమ్ముకుని ఆ సొమ్ముతో జల్సాలు చేశారు. అనుమానంతో కదిలిన డొంక వీరి వ్యవహారంపై టీంలీడర్ నవీన్‌కు అనుమానం వచ్చి సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో వీరి మోసం బయటపడింది. ఆదివారం నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని ఒప్పుకోవడంతో వారినుంచి రూ.9లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
8 కోట్ల ఖరీదైన కారు.. మరి 35 వేలకు కక్కుర్తి ఎందుకు?!
ముంబై: శివసేన నేత, కళ్యాణ్‌కు చెందిన వ్యాపారవేత్త సంజయ్ గైక్వాడ్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఖరీదైన కార్లలో తిరిగే మీకు.. ఇదేం దొంగ బుద్ధి.. సార్’’ అంటూ నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ హితవు పలుకుతున్నారు. అసలేం జరిగిందంటే.. సంజయ్ గైక్వాడ్ విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్) ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాల ప్రకారం.. తూర్పు కళ్యాణ్ ప్రాంతంలో గల కోక్సెవాడిలో ఉన్న గైక్వాడ్‌కు చెందిన కన్స్ట్రక్షన్ సైట్ వద్ద విద్యుత్ చైర్యం గురించి జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రూ. 34,840 బిల్లుతో పాటు 15 వేల జరిమానా విధిస్తున్నట్లు నోటీసులు పంపించారు. అయినప్పటికీ ఆయన నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడంతో.. జూన్ 30న ఎమ్‌ఎస్‌ఈడీసీఎల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం(జూలై 12)న సంజయ్ గైక్వాడ్ పెనాల్టితో కలిసి మొత్తం 49,840 రూపాయలు చెల్లించారు. ఈ మేరకు విద్యుత్ సంస్థ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ విషయంపై స్పందించిన శివసేన శ్రేణులు.. సంజయ్ గైక్వాడ్‌పై వచ్చిన ఆరోపణలు సరికావని, ఆయనకు విద్యుత్ చౌర్యంతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా సంజయ్ గైక్వాడ్ ఇటీవలే సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కారు ఖరీదును ప్రస్తావిస్తూ నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. -
ప్రభుదేవతో రొమాన్స్ చేయనున్న కాజల్..
‘లక్ష్మీ కళ్యాణం’ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లో అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్ ఇక్కడ తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా ఆఫర్లును అందిపుచ్చుకుంటూ అగ్ర హీరోయిన్గా రాణిస్తున్న క్రమంలోనే కాజల్, ముంబై వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలో అడుగు పెట్టిన హీరోయిన్లు సినిమాల్లో వేగం తగ్గించడం వల్ల వారికి అవకాశాలు తగ్గుతాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ కాజల్ మాత్రం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అలా అని పూర్తిగా సినిమాలకే అంకితం కాకుండా అటూ భర్త కిచ్లుకు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇటూ వైవాహిక బంధాన్ని.. అటూ సినీ కెరీర్‌ను బాగానే మేనేజ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ భామ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తోన్న సంగతి తెలిసిందే. (చదవండి: ప్రపంచాన్ని మార్చేయాలని ఉంది) దీనితో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్-2’లో కూడా నటిస్తున్నారు. అంతేగాక డైరెక్టర్ తేజ తెరకెక్కించనున్న ‘అలివేలు వెంకటరమణ’లో నటించేందుకు మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి ఆ తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకుంంది కాజల్. తాజాగా ప్రముఖ కోరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవతో మొదటిసారిగా జతకట్టనున్నదంట ఈ ‘చందమామ’ బ్యూటీ. తమిళ చిత్రం ‘గులేబకావలి’ ఫేం డి. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ రోమాంటిక్, కామెడీ, థ్రీల్లర్ నేపథ్యంలో తెరకెక్కనుందట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. కాగా ప్రభుదేవా 50వ చిత్రం ‘పోన్ మణికవేల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేగాక బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, దిషా పటానీలు జంటగా నటిస్తున్న ‘రాధే’ సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ప్రభుదేవా!) -
చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు
సాక్షి, హైదరాబాద్: ‘సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయి’ అని నటుడు, నిర్మాత కల్యాణ్ ఆరోపించారు. దాదాపు రూ. 300 కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. సత్యమేవ జయతే అనే ప్యానల్ తరఫున ఒ.కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా చిత్రపురి కాలనీకి సంబంధించి అవినీతి జరుగుతూనే ఉందన్నారు. ఈ విషయంపై నిర్మాత సి. కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.8 కోట్ల సబ్సిడీ ఇచ్చారని, ప్రస్తుత సీఎం కేసీఆర్ ఇచ్చిన రూ.6 కోట్లు ఎటు పోయిందని ఒ.కల్యాణ్ ప్రశ్నించారు. హౌసింగ్ సొసైటీని మోసం చేసి మేనేజ్ చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో అనిల్‌కుమార్ కావూరి, ఈశ్వరప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహారెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వైవి, శ్రీనివాస్ కూనపురెడ్డి, ఆత్మకూరు రాధ, మల్లికా టి, మధు జాటోత్ పాల్గొన్నారు. -
విజయశాంతిగారిలా పాయల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి
‘‘డబ్బులకోసం కాకుండా ప్యాషన్‌తో సినిమాలు తీస్తున్నారు కల్యాణ్‌గారు. ఈ కథని నమ్మి బడ్జెట్‌కి వెనకాడకుండా చాలా రిచ్‌గా ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆయన పెద్ద హిట్ సాధింబోతున్నారు’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. ‘హుషారు’ ఫేమ్ తేజస్ కంచర్ల, ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ జంటగా శంకర్ భాను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆర్డీఎక్స్ లవ్’. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. చాలా మంచి సినిమాలు చేశాడు, కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్‌గా తనకి పెద్ద బ్రేక్ రావాలి. తేజస్, పాయల్‌కి ఈ సినిమా మంచి పేరు తేవాలి. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాతో విజయశాంతిగారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి’’ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘యుక్త వయసులో జీవితాన్ని సరదాగా గడపాల్సిన టైమ్‌లో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుపక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఓ అమ్మాయి ఏ విధంగా పోరాడింది? అనేది మా చిత్ర కథాంశం. ఈ సినిమా తర్వాత పాయల్ మరో విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా చేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నా. ‘ఆర్డీఎక్స్ లవ్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంగా ఉన్నా. ఈ బ్లాస్టింగ్ హిట్‌తో కల్యాణ్‌గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపెనీ అవుతుంది’’ అని శంకర్ భాను అన్నారు. ‘‘ఈ అవకాశం ఇచ్చిన కల్యాణ్ గారికి, చక్కగా తెరకెక్కించిన శంకర్ భానుగారికి థ్యాంక్స్’’ అన్నారు తేజస్ కంచెర్ల. ‘‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ‘ఆర్డీఎక్స్ లవ్’ కొంచెం వైవిధ్యంగా ఉంటుంది. విద్య పరంగా ఆలోచింపచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. మనసును హత్తుకునే సినిమా ఇది’’ అని పాయల్ రాజ్‌పుత్ అన్నారు. నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: రథన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా, సహ నిర్మాత: సి.వి. రావ్. -
ముంబై అతలాకుతలం.. వర్షాలకు 22మంది మృతి
సాక్షి, ముంబై/పుణె: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం అతలాకుతలం అవుతోంది. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం అతలకుతలమవుతోంది. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. ముంబయి నగరంలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో గోడకూలి 13 మంది మృతిచెందారు. ఇంకో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే.. సంఘటన జరిగిన పింపరీపాడ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు స్పందించి పలువురినని శిథిలాల నుంచి బయటకు తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అంబేగావ్‌లోనూ.. పుణెలోని అంబెగావ్‌లోనూ విషాదం చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న వర్షాలకు అంబేగావ్‌లోని సిన్గాడ్ కళాశాల గోడ కూలి ఆరుగురు మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దుర్ఘటన తెల్లవారుఝామున జరిగింది. ఘటన సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసే చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి తడిచిన గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మరోవైపు ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలోని కల్యాణ్ ప్రాంతంలో అర్ధరాత్రి గోడ కూలడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ కల్యాణ్ ప్రాంతంలోని దుర్గ ఆలయానికి అభిముఖంగా ఉన్న జాతీయ ఉర్దూ పాఠశాల గోడ కూలడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
మరో థ్రిల్లర్‌కు హన్సిక రెడీ
అందాల భామ హన్సిక మరో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథా చిత్రంలో నటించనున్నారు. మహా చిత్రంతో అర్ధ సెంచరీ కొట్టేసిన ఈ బ్యూటీకి ఈ మధ్య అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం నటుడు అధర్వతో రొమాన్స్ చేసిన 100 చిత్రం 9వ తేదీన తెరపైకి రానుంది. కాగా మహా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాలో హన్సిక మాజీ ప్రియుడు శింబు అతిథి పాత్రలో నటించడం విశేషం. అంతే కాదు మహా చిత్రంలో హన్సిక పలు గెటప్‌లలో కనిపించనున్నారు. దీంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు కల్యాణ్ తెరకెక్కించనున్న నూతన చిత్రంలో హన్సిక హీరోయిన్గా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కథ సొల్లపోరేర్, గులేభకావళి వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన కల్యాణ్ తాజాగా నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న జాక్‌పాట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2డీ ఎంటర్‌టైయిన్‌మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో తదుపరి చిత్రానికి కల్యాణ్ సిద్ధం అవుతున్నారు. ఈ సారి కల్యాణ్ సూపర్ నేచులర్ థ్రిల్లర్ కథను తయారు చేసుకున్నారు. ఇందులో నటి హన్సిక ప్రధాన పాత్రలో నటించనున్నారు. కల్యాణ్ ఇంతకుముందు దర్శకత్వం వహించిన గులేభకావళి చిత్రలోనూ హన్సిక లీడ్ రోల్లో నటించారు. ఆ చిత్రం విజయవంతం కావడంతో హన్సిక మరోసారి కల్యాణ్ దర్శకత్వంలో నటించడానికి ఓకె చెప్పారన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
యూఫోరియా
హంటగన్ దానా పాయింట్ దగ్గర కళ్యాణ్, నేను కారు దిగుతున్నాం. అప్పటికే వెన్నెల, అంజని దిగి పోయారు. పార్కింగ్ దొరక్కపోవడం వల్ల కళ్యాణ్ కారు పార్క్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. పసిఫిక్ కోస్ట్ మీద అలా నడుస్తుంటే వాతావరణం సుందరంగా విచిత్రంగా అనిపించింది. తల వంచుకుని కళ్యాణ్, వెన్నెల వెంట కొంత దూరం నడిచాను. నడుస్తున్నానే కాని మనసంతా ఆలోచనతో మునిగి పోయింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లగునా హిల్స్‌లో మా అమ్మాయి వెన్నెల, అల్లుడు కళ్యాణ్ ఉంటారు. ఓ వారం క్రితం నేను అంజని అమెరికా వచ్చాం ఫసిఫిక్ ఓషియన్ చూడటానికి.ఫసిఫిక్ ఓషియన్ సందడిగా ఉంది. కొందరు అలలతో భలే సందడిగా రైడ్ చేస్తున్నారు. కొందరు అలలతో విన్యాసం చేస్తున్నారు. దీన్ని వాళ్ళు సర్ఫింగ్ అంటారట. పెద్ద గ్యాంగ్ మరొక చోట డోలక్ వాయిస్తున్నారు. వివిధ రకాలైన దుకాణాలు, అమ్మకాలు...విచిత్రమేమిటంటే ఎవరి మొహమైనా నిమిషం చూస్తే చాలు, హలో అంటూ పలకరిస్తారు.వెన్నెల మా ముగ్గురిని నిలబెట్టి ఫొటో తీసింది. తరువాత కళ్యాణ్, నన్ను వెన్నెలని అంజలిని ఫొటో తీశాడు. కాని నలుగురూ ఒకేసారి దిగాలంటే ఎలా ?‘‘షల్ ఐ టేక్ ఫొటోగ్రాఫ్ ?’’ ఒక తీయని గొంతు వినిపించింది. నేను వెంటనే ఆ వైపు చూశాను.ఓ..యూఫోరియా ... నేను పైకే అనేశాను. ఆమె దగ్గరగా వచ్చింది.యూఫోరియా...యూఫోరియా...అన్నాను. ఆమె మరీ దగ్గరగా వచ్చి వెన్నెల చేతిలోని కెమెరా తీసుకొంది. కాదు..ఆమె యూఫోరియా కాదు. వేరే అమ్మాయి. యూఫోరియా లాగే ఉంది కాని ఈమె కళ్ళు అంత విశాలంగా లేవు. ఆ అమ్మాయి మా నలుగురినీ ఫొటో తీసింది. నాకెందుకో నిట్టూర్పు వచ్చింది. యూఫోరియా మళ్లీ కనబడుతుందా? కనబడ్డా నన్ను గుర్తిస్తుందా ? ఎలా ఆమెను మళ్లీ చూడటం...కృతజ్ఞత వల్లనా...దానికంటే ఎక్కువ ఏదైనా ఉందా ? ఏమో మరి.కృతజ్ఞత అంటే కాదా మరి ? ఆమె చేసింది తక్కువేమిటి ? నేను ఇసుకలో పడుకొని కళ్ళు మూసుకున్నాను.లగునా హిల్స్‌లో రెటినా అపార్ట్మెంట్ చాలా పెద్దది. వెయ్యి అపార్ట్మెంట్లుంటాయి, దాదాపు అన్ని దేశాలవాళ్ళు అందులో అద్దెకుంటారు. ప్లాట్లకు మధ్యలో కింది భాగంలో ఒక స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ పూల్‌లో పైన చిన్న చిన్న గుడారాలు. దాని పైన ఈతలో అలసిపోయిన వాళ్ళు పడుకోవడానికి అనువైన చైయిర్లు, వాటి ప్రక్కన యాష్ ట్రే, ఈత తరువాత మళ్ళీ స్నానం చేయడానికి షవర్లు, బాత్ టబ్‌లు స్విమ్మింగ్ పూల్ పక్కనే జకూజీ ఉంది. జకూజీ ఆన్ చేసి లోపలి దిగాలి. మనిషికి పొట్ట పై భాగం వరకు నీళ్ళు ఉంటాయి. ఆన్ చేసిన వెంటనే వెచ్చని నీళ్ళు వస్తాయి. చిన్న హోల్స్ నుండి నీళ్ళు తడలు తడలుగా వస్తాయి. హోల్ పైన శరీరంలో ఏ భాగం ఆనించినా మసాజ్ చేసినట్టుగా ఉంటుంది.అమెరికా వచ్చే ముందు చాలా ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల నా కుడి భుజం విపరీతమైన నొప్పి లేచింది. డాక్టర్స్ మజిల్స్ ఫ్రీజ్ అయ్యాయని అన్నారు. ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా తగ్గలేదు. జకూజీలోకి దిగి కాసేపు వేడినీళ్ళ మసాజ్ పెట్టుకొని, పక్కనే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేవాణ్ని. ఎప్పుడో మా ఊరి మర్రిబావిలో ఈదినట్టు గుర్తు. మళ్ళీ ఈత కొట్టే అవకాశం అమెరికాలోనే వచ్చింది. ఇటు నొప్పి తగ్గుతుంది అటు ఈత కొట్టే సరదా కూడా తీరుతుంది.ఇదంతా ప్రతి రోజూ ఉదయం నాకొక దినచర్య అయింది. ఒకరోజు ఎప్పటిలాగే వెళ్లి జకూజీ ఆన్ చేశాను. బట్టలు విడిచి వాల్ దగ్గర పెట్టి ఈతకు ప్రత్యేకంగా వేసుకునే నిక్కరుపై జకూజీలోకి దిగాను. యథాలాపంగా భుజాన్ని జకూజీలోని ఓ మూల హోల్‌కి ఆనించాను. ఉన్నట్టుండి జకూజీ నుండి వేడి నీటి తీవ్రత పెరగసాగింది. నేను గుర్తించే లోపలే నీటి వేడి విపరీతమైపోయింది. బయటకు వెళ్ళే వరకు బతుకుతానా అనిపించింది. జ్వాలలతో కూడిన నీటితో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. గట్టిగా అరిచాను, హెల్ప్..హెల్ప్ అని.ఒకమ్మాయి స్విమ్మింగ్ పూల్ నుండి పరుగెత్తుకొచ్చింది. జకూజీ స్విచ్ ఉన్న దగ్గరికి వెళ్లి స్విచ్ ఆఫ్ చేసింది.అతి వేడి సాధారణమైన వేడిగా మారుతూంది. అయినా నేను తట్టుకోలేక పోతున్నాను. మంట.. మంట.. ఒళ్లంతా మంట. మెల్ల మెల్లగా నడుస్తున్నాను నీటినుంచి బయటకు రావడానికి. ఆమె గబగబా జకూజీలోకి దిగింది. నా వీపు మీద చేయి వేసి ‘‘కమాన్ ...నో ప్రాబ్లం. ఇట్స్ ఓ.కే’’ అంటూ నన్ను నడిపించింది.పూర్తిగా బయటకు వచ్చాను. ఆమె నన్ను తీసుకెళ్ళి పడక కుర్చీలో కుచోపెట్టింది. ఆమె గబా గబా వెళ్లి స్విమ్మింగ్ పూల్ నుండి ఓ బకెట్ చల్లని నీళ్ళు తెచ్చి నా పైన గుమ్మరించింది. ఒక గుడ్డను తడిపి నా ఒంటిని రుద్దసాగింది. నేను వారించ బోయాను, ‘‘ఓకే... ఇట్సోకే.. రిలాక్స్’’ అంటున్న మాటలు నాకు వినిపించీ వినిపించనట్టు వినిపిస్తున్నాయి. మా ఇంట్లోవాళ్లసెల్ నంబర్ చెప్పమంది. మా అమ్మాయి నంబర్ ఇచ్చాను. ఆమె ఫోన్ చేసింది. మా అమ్మాయి ఫోన్ ఎక్కడ పెట్టిందో ఎత్తలేదు. ఓ పావు గంట గడిచింది. ఆమె చల్లని చేయి నా భుజాల్ని స్పృశిస్తూనే ఉంది. ఒళ్ళు చల్ల బడింది. మెల్లగా తేరుకున్నాను. నెమ్మదిగా లేవబోయాను నా బట్టలవైపు చూస్తూ. ఆమె అక్కడే పెట్టుకున్న నా బట్టలు అందించింది. టవల్‌తో నెమ్మదిగా తుడుచుకున్నాను. ఆమె సెల్ మ్రోగింది. వెంటనే పికప్ చేసి హలో అంది.‘‘వాట్ హాప్పెండ్ టు దిస్ జకూజీ’’ నెమ్మదిగా అడిగాను.‘‘ఇస్ దేర్ సమ్ టెక్నీషియన్ అవైలబుల్’’ మళ్లీ అన్నాను.ఆమె సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేసి గబ గబా తన దుస్తులు ఉన్న దగ్గరికి వెళ్ళింది. తన స్లీవ్‌లెస్ బనియన్ పైనుండి శాలువా కప్పుకొని ‘‘ఓ.కే. బై టేక్ కేర్’’ అంటూ పరుగులాంటి నడకతో వెళ్లి పోయింది. దేవతలాగా వచ్చింది.కనీసం థాంక్స్ కూడా చెప్పలేకపోయాను. నన్ను నేను ఎంతగా నిందిచుకుంటే ఏం లాభం? మిస్ కాల్ చూసి వెన్నెల ఫోన్ చేస్తోంది. ఫోన్ శబ్దం వింటూ బట్టలు వేసుకున్నాను. నిక్కరు పై నుండే లుంగీ కట్టుకొని నెమ్మదిగా నడుస్తూ స్విమ్మింగ్ ఫూల్ గేటు దాటి లిఫ్ట్ వైపుకి వెళ్లాను. అంతా చెప్పి ఆనవాళ్ళు చెప్పి ఈ అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటుంది? అని అడిగాను. ‘‘అలా చెప్పడం కష్టం, ఎన్నో కుటుంబాలు ఉన్న అపార్ట్‌మెంట్స్‌లో పోలికలు చెప్పి ఎలా తెలుసుకోగలం?’’ అంది వెన్నెల.‘‘ఎట్లా మరి?’’ అడిగాను.‘ఏముంది? మళ్లీ కనిపించినపుడు ఆనవాళ్ళు పట్టి గుర్తు పట్టడమే’’‘‘పేరైనా అడిగారా’’ ?‘‘అడగలేదు’’ నాలో నేను గొణుగుకున్నాను. నాకు నేనే ఆమెకు పేరు పెట్టుకున్నాను. యూఫోరియా!కొద్ది రోజులకు మేం లాస్ ఏంజిల్స్ నుండి లాస్ వేగాస్‌కి బయలుదేరాం. సొంత కారు సర్వీసింగ్ చేయబడి లేకపోవడం వల్ల కళ్యాణ్ వెన్నెల ఒక పెద్ద కారు అద్దెకు తెచ్చారు. లాస్ వేగాస్ విద్యుద్దీపాలకు పుట్టిల్లుగా ఉంది. ఎటు జూసినా కాంతుల వెల్లువ. లాస్ వేగాస్ ప్రవేశిస్తుంటే చెప్పలేని ఉత్సాహం, ఆకాశాన్నంటే సుందరమైన మేడలు,ట్రంపు హోటల్ ఒకటుందీ. చాలా కాస్ట్లీ అట. వెన్నెల చెప్పింది.‘’అదిగో...నాన్నా...మనం ఉండబోయే హోటల్’’ వెన్నెల దూరం నుంచి చూపించింది. స్ట్రాటోస్పియర్ హోటల్, నూటారెండు ఫ్లోర్లు. దిగ్భ్రమకు లోనయ్యాను. దూరం నుంచి చూస్తే ఒక ఎత్తయిన çస్తంభం లాగా కనబడుతుంది. కళ్యాణ్ మేం ఉండబోయే గదికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని అరగంటలో వచ్చాడు. హోటల్లోనే సుమారు అరకిలోమీటరు నడచి, లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాం.గుండ్రని రెస్టారెంట్ అది. కూల్ డ్రింక్, బీర్, ఎవరికి కావలసినవి వాళ్ళు ఆర్డరిచ్చి సోఫాలలో కూచున్నాం. రెస్టారెంట్ గుండ్రంగా మెల్లగా తిరుగుతుంటుంది. లాస్ వేగాస్ ఎక్కడో కింద కనబడుతుంటుంది. విద్యుద్దీపాలు భూమికి మొలచిన నక్షత్రాలలాగా కనబడుతున్నాయి. పై భాగం నూటారెండవ భాగం స్లోగా గుండ్రంగా తిరుగుతూ ఉంటే భూమి మీద మిణుగురుల్లాగా మెరిసిపోతున్న దృశ్యాన్ని చూడడం ఒక గొప్ప అనుభూతి. అంతా ఒక అద్భుతం...సోఫాలో మాకు నాలుగవ వరుసలో కూచున్నది ఒకామె ...ఆమె.. ఆమె..యూఫోరియా!యూఫోరియా...నేను పెద్దగా అరిచాను. గ్లాస్ పక్కకు పెట్టి గబగబా దగ్గరకు వెళ్లాను. ఆమె కుడిచేతిలో డ్రింక్ ఉంది. ఎడమచేతిలో పొగలు కక్కే సిగరెట్ ఉంది. నేను దగ్గరకు వెళ్లి నిలబడ్డాను. ఆమె క్రిందికి చూస్తున్నదల్లా తల త్రిప్పి డ్రింక్ సిప్ చేస్తూ నావైపు చూస్తుంది.‘’హలో’’అన్నాను.ఆమె అట్లాగే నావైపు చూస్తూ హలో అంది. తన ముందు సోఫాను సూచిస్తూ ‘‘ప్లీజ్ బీ సీటేడ్’’ అంది.ఇంకొంచెం పరీక్షగా చూశాను. ఈమె యూఫోరియా కాదు. యూఫోరియా పెదాలు ఎర్రనివి. ఈమె బాగా లిప్‌స్టిక్ వేసుకున్నా ఆ అందం రాలేదు. అయాం సారీ ...‘‘యు ఆర్ రెసెంబ్లింగ్ మై ఫ్రెండ్, అయాం మిస్టేకెన్’’ నేను లేస్తూ అన్నాను. ‘‘ఇత్స్ ఓకే’’ అంది. వెనుతిరిగి వచ్చాను. మా వాళ్ళందరూ నవ్వుతున్నారు.∙∙ మరో రెండు రోజుల్లో ఆ హోటల్ ఖాళీ చేశాం. ఉదయమే అంటి లొప్ కెన్యాన్ కి బయలుదేరాం. అట్లా ఒక ఐదు గంటలు ప్రయాణించాక ఒక సెంటర్‌కి చేరుకున్నాం. అక్కడ నుండి కెన్యాకి వాహనాలు వెళ్ళవు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన ట్రక్కులో బయలుదేరాం. దారంతా ఇసుకమయంగా ఉంటుంది. దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ ట్రక్కు డ్రైవర్ ఒక రెడ్ ఇండియన్. ప్రయాణం జరిగినపుడు అతను తనపద్ధతిలో చెప్పాడు. ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని రెడ్ ఇండియాన్స్ కే వదలి వేసిందట. రెడ్ ఇండియన్స్ అదంతా తమ సొంతంగా భావిస్తుంటారు. మూలవాసులకు అట్లాంటి ప్రాధాన్యత దొరకడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. కచ్చా రోడ్ మీద ఊగుతూ వెడుతుంది వాహనం. అమెరికాలో కూడా అట్లాంటి రోడ్లున్నయన్నమాట.లాస్ వేగాస్లోనే అజయ్, ప్రతిమలు కలిశారు. వెన్నెల, కళ్యాణ్ కుటుంబ స్నేహితులు వాళ్ళు. అంటీ లోప్ కెన్యాన్కి మరో కారులో వచ్చారు. ట్రక్కు దగ్గర అందరం కలుసుకొన్నాం.అంటిలోప్ కెన్యాన్ లోపలి వెడుతుంటే చిన్నప్పుడు చూసిన జానపద సినిమాలు గుర్తొచ్చాయి. కొండల నడుమ చీకటి లోపలికి నడచి వెడుతున్నటనిపించింది. మధ్యలో శ్వాస ఆడకపోతే ఎలా? కొంచెం భయం వేసింది. ఇంతమంది ఉన్నారు. నాకే సమస్యా? ధైర్యం తెచ్చుకొని కొనసాగాను. లోపలికి వెడుతుంటే చీకటి. ..పైన బిలం నుంచి కొంత వెలుగు.్ర కమంగా భయం పోయింది. నూతనోత్సాహం వచ్చింది. మాతో వచ్చిన గైడ్ (డ్రైవర్ ) విషయాలు చెప్పుకొంటూ పోతున్నాడు. అవి చారిత్రకాంశాలు కావు. కల్పిత కథలే.అంటిలోప్ కెన్యాన్‌లో నేనెందుకో ఒక చోట వెనుకబడి పోయాను. అంతా ముందు వెళ్లి పోయారు. ఆ బిలాన్ని చూస్తూ సంభ్రమంగా నేను ఒక చోట ఉండిపోయాను.నా వెనుకే వీడియోలో దృశ్యాన్ని బంధిస్తూ పైకి చూస్తోంది ఒకామె. ఆమె వీడియో తీస్తూ తీస్తూ నా వైపు తిరిగింది. ఆమె కెమెరా తీసి మెడకు తగిలించుకొంది. ఆశ్చర్యం ...ఆమె యూఫోరియా...దగ్గరికి పరిగెత్తాను. ఆమె నా వైపు ఆశ్చర్యంగా చూసింది. హలో అన్నాను. ఆమె హలో అంది జుట్టు సవరించుకుంటూ,పూర్తిగా దగ్గరికి వెళ్ళాక తెలిసింది ....ఆమె యూఫోరియా కాదు. యూఫొరియా నా కంటే మూరెడు పొడుగుంటుంది. ఈమె కూడా నా కన్నా పొడవేవుంది. కాని అంత పొడవు లేదు. నాకు నిరాశ కలిగింది.‘’ఐ రెమేనడ్ హియర్, అయాం అఫ్రైడ్ అఫ్ గోయింగ్ ఎలోన్’’ అన్నాను ఏమనాలో తెలియక.‘’ఓ, కమ్ ఎలాంగ్ విత్ మీ, దెన్’’ ఆమె దారి తీస్తూ అంది.∙∙ తరువాత రెండు రోజులకు లాస్ వేగాస్‌కి తిరిగివచ్చాం. లేక్ వ్యూ గదిలో నది ప్రక్కనే గడపడం, బోట్ రైడింగ్, గ్రాండ్ కెన్యాన్, లోయర్ అంటిలోప్ కెన్యాన్ వంటివన్నీ గొప్ప అనుభవాలు. లేక్ వ్యూలో ధవళ సుందరుల మధురమైన పాటలు ఎప్పుడు మరచిపోలేనివి. లాస్ వేగాస్‌లో సీజర్ ప్యాలెస్‌కి వెళ్ళాం. సీజర్ వీరగాధ గురించి నేను కళ్యాణ్ కొంచెం సేపు మాట్లాడుకున్నాం. అక్కడే బాక్ హావెల్ బఫెట్లో వేయి రకాల డిష్‌లు ఉంటాయి. వివిధరకాల మాంసాహారాలుంటాయి. ప్రతి మాంసాహారం మీద ఆయా జంతువుల బొమ్మలుంటాయి. కుక్కల బొమ్మలు కూడా ఉన్నాయి. మేం మేక బొమ్మ ఉన్న దగ్గరికే వెళ్లి మటన్ కర్రీ వేసుకున్నాం. ప్లేట్లో ఇంకా ఇష్టమైన ఆహార పదార్థాలు వడ్డించుకొని వచ్చి మా సీట్లలో కూచున్నాం. వివిధ రకాలైన మద్యాల సరఫరా జరుగుతుంది. అట్లా ఎక్కువ సమయమే అక్కడ గడచింది.ఆడామగా తేడా లేకుండా అందరూ మద్యం తాగుతున్నారు. వాతావరణం కొంచెం మత్తుగా ఉంది.నాకు కూడా కొంచెం మత్తెక్కినట్టు అనిపించింది. లేచి నెమ్మదిగా అడుగు వేస్తూ టాయిలెట్ వైపు వెళ్లి వస్తున్నాను. వస్తూ బాల్కనీలోకి వెళ్లాను సిటీ చూద్దామని. ఓ యువతి బయటకు చూస్తూ నిలబడి ఉంది. సుతారంగా సిగరెట్ తాగుతోంది. వెనుక నుండి చూస్తే ఆమె భుజాలు తిలక్ వర్ణించిన చంద్రవంకల్లా ఉన్నాయి. ఆ ఎత్తు ఆ పద్ధతి చూస్తే ఈ శ్వేతసుందరి యూఫోరియా కాదు కదా,అవును ...ఆమె యూఫోరియాయే, గబ గబా ఆమె దగ్గరికి వెళ్ళాను. ‘’ఎక్సుక్యూజ్ మి’’ అన్నాను. ఆమె వెనక్కి తిరిగి ‘’ఎస్’’ అంది. కళ్ళు మత్తుగా వాలిపోతున్నాయి. బాగా మద్యం సేవించిందని తెలుస్తూనే ఉంది. ఆమె కళ్ళలోకి నిశితంగా చూశాను. నో...ఈ కళ్ళు చిన్నగా ఉన్నాయి. ఈమె యూఫోరియా కానే కాదు.సారీ ...అంటూ వెనుదిరిగాను. ఆమె ఆశ్చర్యంగా కళ్ళెగరేసి మళ్లీ ఎందుకో తలూపుతూ ఏదో అంటుంది. ఆమె ఉచ్ఛారణ అర్థం కాలేదు. వెనుదిరిగి వచ్చాను. ఆమె కిసుక్కున నవ్వినట్టు అనిపించింది.∙∙ బెలాజియం హోటల్లో ఫౌంటెన్ షో చూసినప్పుడు, విన్ హోటల్లో విలేన్ అనే డ్రీం షో చూసినపుడు, తరువాత గండోల బోటు రైడింగ్ చేసినపుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. యూఫోరియాని బాగా గుర్తించ గలిగితేనే పలకరించాలి కాని ఇట్లా పొరపాటు చేయకూడదనుకున్నాను. చివరికి లాస్ ఏంజిల్స్‌కి తిరుగు ప్రయాణమయ్యాను.∙∙ చివరికి మేం ఇండియాకి తిరిగి వచ్చే రోజు రానే వచ్చింది. వెన్నెల కళ్యాణ్‌లను విడిచి రావడం భారంగా అనిపించింది.విశాలమైన రోడ్లు, చక్కగా వాహనాలు పాటించే ట్రాఫిక్ రూల్స్, పెద్ద పెద్ద మాల్స్, విసుగు లేకుండా అందరూ అనుసరించే క్యూ సిస్టం, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశిష్టతలున్న అమెరికా సామాజిక జీవితం ఎంతో ముచ్చట గొలిపింది. అయినా మనం ఉండాల్సిన కాల పరిమితి అయిపోయాక తప్పదు కదా.వెన్నెల, కళ్యాణ్ ఎయిర్ పోర్టుకి వచ్చారు. వస్తున్నప్పుడు దారి సరిగా చూసుకోకపోవడం, ఇంట్లో కూడా తొందరగా తెమలక పోవడం వల్ల ఆలస్యం అయింది. ఏమిరేట్స్ ఫ్లైట్ కి కొద్ది సమయమే ఉంది.వెన్నెల మాకు వీల్ చైర్ ఏర్పాటు చేసింది. చెకింగ్ క్యాబిన్లోకి చేరిపోయాం.చకా చకా ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. లోపలికి వెడుతూ వెనక్కి చూశాం. వెన్నెల, కళ్యాణ్, చేయి ఊపుతున్నారు. మేమూ చేయి ఊపుతూ ముందుకెడుతున్నాం.ఆశ్చర్యం...వెన్నెల, కళ్యాణ్‌ల వెనుక నిలబడింది ఆమె. ఆమె ....ఆమె ...ఆమె ..యూఫోరియా ..అవును యూఫోరియా! చాలా పొడవైన యూఫోరియా...ధవళ దేహంతో మెరిసిపోతున్న యూఫోరియా ...విశాల నేత్రాల యూఫోరియా ...నన్ను విద్యుదాఘాతం నుండి కాపాడిన యూఫోరియా...అవును ఆమె కచ్చితంగా యూఫోరియానే ...నా శరీరం ఒక్కసారిగా జలదరించినట్టయింది. యూఫోరియా...గట్టిగా అరిచాను. వెన్నెల, కళ్యాణ్‌లతో పాటు ఆమె కూడా ఇటు చూసింది. యూఫోరియా ...యూఫోరియా ..నేను చేతులెత్తి ఊపుతూ అరిచాను. వీల్‌చైర్ అతను లోపలి వీల్ చెయిర్ని తోయడం ఆపి నిలబడ్డాడు. యూఫోరియా ఇటు చూసింది. ఆశ్చర్యంగా చూస్తోంది. నన్ను గుర్తించలేదు. అలాగే చూస్తూ నిలబడింది. ‘‘నాన్నా..వెళ్ళండి టైమవుతుంది’’ వెన్నెల టైం చూస్తూ అంది. వీల్ చైర్ అతను వెన్నెలను గమనించాడు. వీల్ చైర్ నెట్టుకుంటూ లోపలికి నడిచాడు. యూఫోరియా కనుమరుగయింది.∙∙ నాకు తెలుసు, యూఫోరియా నన్ను గుర్తించలేదు. బహుశా నన్ను మరచిపోయి ఉంటుంది. కాని నా ఙ్ఞాపకాలలో ఎప్పుడు ఉంటుంది.నాలో కథై దూకేలా హృదయాన్ని కదలిస్తూనే ఉంటుంది.యూఫోరియా ...వండర్పుల్ యూఫోరియా. డా.కాంచనపల్లి -
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
నమ్మకం నిజమైంది
ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. కల్యాణ్ జీ గోగన దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో చిత్రనిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ– ‘‘కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా కొన్నాను. మీరు (ప్రేక్షకులు) ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు, నా నమ్మకాన్ని నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్. మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాను’’ అన్నారు. హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ– ‘‘అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బావుందని మన దేశం నుండే కాదు, యూకే నుండి కూడా మంచి టాక్ వచ్చిందని చెప్తున్నారు. సినిమాని వేరే ప్లేసెస్‌లో కూడా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను మళ్లీ మళ్లీ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ బాగా వచ్చాయి. మౌత్ టాకే మా సినిమాకి మెయిన్ పబ్లిసిటీ’’ అన్నారు. -
ట్రెండ్ మారింది
కల్యాణ్, రిహా జంటగా కృష్ణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’. కె. శ్రీకాంత్, కె. చంద్రమోహన్ నిర్మిస్తున్నారు. ఆదివారం పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను వి. సాగర్, మోషన్ పోస్టర్‌ను నటి కవిత విడుదల చేశారు. టైటిల్ సాంగ్‌ను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘పవన్‌కల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కథ తయారు చేసుకున్నారంటే ఈ సినిమా యూనిట్‌కు ఆయన పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారింది. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి’’ అన్నారు కవిత. ‘‘మా సినిమా రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభిస్తాం’’ అన్నారు చంద్రమోహన్. కృష్ణతేజ, కల్యాణ్, సంగీత దర్శకుడు జయసూర్య పాల్గొన్నారు. సాయికుమార్, పోసాని కృష్ణమురళి, భానుచందర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మహి సరళ. -
మరో మెగా హీరో లాంచింగ్‌పై క్లారిటీ
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. వైష్ణవ్.. వారాహి చలనచిత్రం బ్యానర్లో హీరోగా పరిచయం అవుతున్నాడన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో ప్రముఖంగా వినిపించింది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాను నిర్మిస్తున్న ఈ సంస్థ.. మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ లాంచింగ్ సినిమాను తాము నిర్మించటం లేదని క్లారిటీ ఇచ్చింది. -
మెగా అల్లుడి సినిమా ప్రారంభోత్సవం
-
మెగా అల్లుడి సినిమా మొదలైంది
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ వెండితెర ఆరంగేట్ర చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు సంస్థ కార్యాలయంలో లాంఛనంగా జరిగింది. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ నటించనుంది. పూజా కార్యక్రమాలు నేడు (జనవరి 31) తెల్లవారుజామున వారాహి చలనచిత్రం ఆఫీసులో జరిగాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకులు రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి, ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కళ్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ పాల్గొన్నారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఎం.ఎం.కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు, రాజమౌళి గారు విచ్చేసి మా చిత్రబృందానికి వారి ఆశీస్సులు అందించడం ఆనందంగా ఉంది. రాకేష్ శశి ప్రిపేర్ చేసిన అద్భుతమైన కాన్సెప్ట్ ను ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించనున్నాం. ‘బాహుబలి’ చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’ అన్నారు. -
చిరు అల్లుడితో లై బ్యూటీ?
‘బొమ్మోలే ఉన్నదిరా పోరి.. బొం బొంబాటుగుందిరా నారి.. లడ్డోలె ఉన్నదిరా కోరి.. లై లైలప్ప బుగ్గల్ది ప్యారి’ అంటూ ‘లై’ సినిమాలో మేఘా ఆకాశ్ అందచందాల్ని వర్ణించారు నితిన్. రచయిత కాసర్ల శ్యామ్ రాసినట్లు నిజంగానే మేఘా ఆకాశ్ బాగుంటుంది. ‘లై’ సినిమా ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ రెండోసారీ నితిన్‌తో జోడీకట్టారు. నితిన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ ఓ సినిమాతో పాటు ప్రస్తుతం తమిళ సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. తాజాగా తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ కొట్టేసిందని సమాచారం. చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ హీరోగా పరిచయం కానున్న సినిమాలో మేఘా ఆకాశ్‌ను హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. ‘జతకలిసే’ ఫేమ్ రాకేశ్ శశి దర్శకత్వంలో కల్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రబృందం మరోవైపు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపైనా దృష్టి సారించారట. -
మెగా అల్లుడి సినిమాకు హీరోయిన్ ఫిక్స్!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. జతకలిసే ఫేం రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. కళ్యాణ్ అరంగేట్రం కోసం మెగా ఫ్యామిలీ భారీ కసరత్తులే చేస్తోంది. ఇప్పటికే కథా కథనాలను ఫైనల్ చేసిన చిత్రయూనిట్, ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోంది. కళ్యాణ్ సరసన హీరోయిన్ గా లై ఫేం మేఘా ఆకాష్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మేఘా ప్రస్తుతం నితిన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన మేఘా ఆకాషే, కళ్యాణ్‌కు సరైన జోడి అని భావిస్తున్నారట మెగా టీం. ప్రస్తుతానికి మేఘా ఎంపికపై మెగా టీం నుంచి ఎలాంటి సమాచారం లేదు. త్వరలోనే పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. -
నిఖిల్ కాదన్న కథతో మెగా అల్లుడు..!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జత కలిసే సినిమా ఫేం రాకేష్ శశి కళ్యాణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథ ముందుగా యంగ్ హీరో నిఖిల్ కు వినిపించారట. తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ కథ కావటంతో తనకు సూట్ కాదన్న ఉద్దేశంతో నిఖిల్ రిజెక్ట్ చేశాడట. అయితే అదే కథ కళ్యాణ్ కు నచ్చటం, మెగాస్టార్ కూడా ఓకె చెప్పటంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కించనున్నారు. -
రెండో అల్లుడి మొదటి మూవీ
మెగా కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో రెడీ అవుతున్నారు. యస్.. మీ గెస్ కరెక్టే. ఇక్కడున్న ఫొటో చూడగానే చిరంజీవి రెండో అల్లుడు కల్యాణ్ అరంగేట్రానికి రంగం షురూ అయిందని ఊహించేసి ఉంటారు. వచ్చే ఏడాది కల్యాణ్ కెమెరా ముందుకు రానున్నారు. ‘అందాల రాక్షసి’, ‘ఈగ’, ‘లెజెండ్’, ‘దిక్కులు చూడకు రామయ్య’... ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వారాహి చలన చిత్రమ్ అధినేత సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దర్శకుడిగా జస్ట్ వన్ మూవీ ఓల్డ్ అయిన రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అసలు ఈ ప్రాజెక్ట్‌కి ఎలా శ్రీకారం జరిగింది? అనేది రాకేశ్ శశి మాటల్లో తెలుసుకుందాం. ‘‘డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీ ‘జత కలిసే’ చూసి, సాయి కొర్రపాటిగారు ఇంప్రెస్ అయ్యారు. ఆయనే ఆ సినిమాని రిలీజ్ చేశారు. అప్పుడే వారాహి బ్యానర్లో దర్శకుడిగా నాకు అవకాశం ఇస్తానని మాటిచ్చారాయన. మంచి కథ రెడీ చేసుకున్నా.వైజాగ్ సత్యానంద్‌గారు ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు కాబట్టి, ఎవరైనా కొత్త హీరో ఉంటే చెప్పమని ఆయన్ను అడిగా. కథ కూడా చెప్పాను. ‘‘చిరంజీవిగారి అల్లుడు కల్యాణ్‌కి అయితే కరెక్ట్‌గా సూట్ అవుతుంది’’ అని సలహా ఇచ్చారు సత్యానంద్‌గారు. ‘నేనా.. చిరంజీవిగారి అల్లుడితోనా? చాన్స్ ఇస్తారా?’ అనుకున్నా. అయినా కల్యాణ్‌ను కలిసి, కథ చెప్పా. ఓకే అన్నారు. కానీ ‘ఓసారి మామయ్య చిరంజీవిగారికి కథ చెప్పండి’ అని కల్యాణ్ అన్నారు. అనుకోని కారణాల వల్ల చిరంజీవిగారితో నా ఫస్ట్ అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవిగారిని కలిసి, కథ చెప్పాం. ఆయన ఇంప్రెస్ అయ్యారు. కథ చాలా బాగుందని అభినందించారు. ఆ క్షణాలను మరచిపోలేను’’ అన్నారు రాకేశ్ శశి. మరి కల్యాణ్‌తో తీయబోయే సినిమా లవ్‌స్టోరీనా? అని అడగ్గా.. ‘‘లేదు. డిఫరెంట్ స్క్రిప్ట్. జనవరిలో లేదా ఫిబ్రవరిలో సెట్స్‌పైకి తీసుకెళ్తాం. వారాహిలాంటి పెద్ద బేనర్, చిరంజీవిగారి అల్లుడు.. ఇలా నా రెండో సినిమాకే మెగా చాన్స్ కొట్టేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు రాకేశ్. -
మరో మెగా వారసుడు రెడీ..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకుపైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. తాజాగా ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. మెగాస్టార్ అల్లుడు, చిరు చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి సినీ ప్రవేశంపై చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇంత వరకు మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా.. కళ్యాణ్ లుక్స్, మేకోవర్ చూస్తుంటే మాత్రం సినిమాల్లోకి రావటం ఖాయమనిపిస్తుంది. తాజాగా కళ్యాణ్ చేయబోయే సినిమాపై ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కళ్యాణ్ ను తెరకు పరిచయం చేసే బాధ్యతను మెగా ఫ్యామిలీ దర్శకుడు రాకేష్ శశి(జత కలిసే ఫేం), నిర్మాత సాయి కొర్రపాటి లకు అప్పగించారట. అంతేకాదు రామ్ చరణ్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, మెగాస్టార్ ఓకే అన్న వెంటనే సినిమాను పట్టాలెకక్కించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి ఈప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా.. త్వరలోనే మెగా అల్లుగా ఎంట్రీకిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.