
సినిమాల్లోకి చిరంజీవి చిన్నల్లుడు?
హైదరాబాద్: పెద్ద స్టార్ల కొడుకులే కాదు.. అల్లుళ్లు కూడా వారసులుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన చరిత్ర టాలీవుడ్‌లో ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు అంటూ వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న కళ్యాణ్ తెరంగేట్రానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. క్యూట్ లుక్స్‌తో అదరగొడుతున్న ఇతగాడిని హీరోగా పరిచయం చేయబోతున్నట్టు సమాచారం.
'మెగాస్టార్ చిన్నల్లుడు', 'శ్రీజతో కళ్యాణ్' అంటూ లీకైన ఫొటోలు టీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతోపాటు శ్రీజతో పెళ్లయిన తర్వాత చిన్నల్లుడు సినీ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అటు ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ట అల్లుడు సుధీర్ బాబు హీరోగా పరిచయమయ్యాడు. ఇపుడు చిరంజీవి చిన్నఅల్లుడు కళ్యాణ్ వంతు వచ్చిందన్నమాట అంటూ టాలీవుడ్ గుసగుసలాడుతోంది. శ్రీజ పెళ్లి వార్తలపై ఇప్పటికీ గోప్యతను పాటిస్తున్నమెగా ఫ్యామిలీ , మరి ఈ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.