
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. ఈ సారి డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంది. దీంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కల్యాణ్ శంకర్ తనలోని మరో టాలెంట్‌ను బయటపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాయిరే నాయిరే అనే సాంగ్‌కు డ్యాన్స్‌తో అదరగొట్టారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను ఊర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Director #KalyanShankar sets the stage on fire with #JrNTR's 'Nairey Nairey'. pic.twitter.com/mixonqAiR7
— Suresh PRO (@SureshPRO_) April 4, 2025