MAD Movie
-
'మ్యాడ్ స్క్వేర్' నుంచి సాంగ్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్
డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్నిషేక్ చేసింది. చాలా రోజుల తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్కు ఓ సాలిడ్ హిట్ అదించాడు టిల్లుగాడు. ఇదే జోష్‌లో మరో హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్టయిన చిత్రం ‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్వ్కేర్’ ని ప్రకటించారు. 'మ్యాడ్'తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకరే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాడ్ ఎంతలా నవ్వులు పంచిందో, దానికి రెట్టింపు వినోదం సీక్వెల్ ద్వారా అందించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.'మ్యాడ్ స్క్వేర్' సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు కె.వి. అనుదీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడుకి స్క్రిప్ట్ అందజేసిన సిద్ధు జొన్నలగడ్డ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నిర్మాత సూర్యదేవర నాగవంశీ కుమార్తె , ఆయన సోదరీమణులు హారిక సూర్యదేవర, హాసిని సూర్యదేవర కూడా 'మ్యాడ్ స్క్వేర్' ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. -
Rewind 2023: బడ్జెట్‌తో పనిలేని బంపర్ హిట్స్
ఈ ఇయర్లో కొన్ని చిన్న సినిమాలు పెట్టిన పెట్టుబడికి ఐదారు ఇంతలకు పైగా కలెక్షన్లు సంపాదించాయి. ఇంకా చెప్పాలి అంటే..మేకర్స్ కూడా ఈ రేంజ్ విజయాన్ని ఉహించలేకపోయారు. అంతగా ఆడియన్స్ మనసు దోచుకున్నాయి. బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చి.. కంటెంట్ బలం మరోసారి నిరూపించాయి. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన స్మాల్ మూవీస్‌పై ఓ లుక్కేద్దాం. బలగం ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి పెద్ద హిట్‌గా నిలిచిన చిత్రాల్లో బలగం ముందు వరుసలో ఉంటుంది. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. తెలంగాణ నేపథ్యంలోని పల్లెటూరి లో జరిగే స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు వేణు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలంగాణలోని పల్లెల్లో తెరలు కట్టి మరి ఈ సినిమాను ప్రదర్శించారంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. బేబి ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన మరో చిన్న చిత్రం బేబి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 14న విడుదలై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. .దాదాపుగా వందకోట్ల వసూళ్ల వరకు వెళ్లి సంచలనాలు నమోదు చేసింది. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ ముక్కోణపు ప్రేమ కథా చిత్రంపై మొదట్లో పెద్ద అంచనాలేమి లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత మౌత్‌టాక్‌తో వసూళ్లను పెంచుకుంది. ఈ సినిమా బడ్జెట్ 10 కోట్లలోపే కానీ.. కలెక్షన్స్ మాత్రం వంద కోట్ల వరకు వచ్చాయి. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు సినిమా హిట్ చేస్తారనేదానికి బేబీ మూవీని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. మ్యాడ్ అంతా కొత్త నటులే..అయినా కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. విడుదలకు ముందు మ్యాడ్ చిత్రంపై కూడా పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్(అక్టోబర్ 6) తర్వాత ఈ మూవీకి బాగా పేరొచ్చింది. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామా.. యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ ఏడాది సితార ఎంటర్టైన్మెంట్స్కు మంచి లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా మ్యాడ్ నిలిచింది. ఈ ఇయర్ మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న చిత్రాలలో చోటు దక్కించుకున్నాయి. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన బెదురు లంక 2012 మూవీ .డీసెంట్ హిట్ కొట్టింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చినా..కీడా కోలా..పెట్టుబడిని వెనక్కి తీసుకొచ్చిన చిన్న చిత్రాల జాబితాలోకి చేరింది. సత్యం రాజేష్,బాలాదిత్యా ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర 2 మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన పరేషాన్..కూడా ఎంటర్టైన్ చేసింది.మరో చిన్న సినిమా మిస్టర్ ప్రెంగ్నెంట్ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్ చిత్రంగా అలరించింది.ఇక స్మాల్ హీరో సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మభూషణ్ మూవీ కూడా హిట్ స్టెటస్ దక్కించుకుంది. అలాగే ఇటీవల విడుదలైన హారర్ మూవీ పిండం కూడా మంచి టాక్ని సొంతం చేసుకుంది. -
ఓటీటీలో అదరగొడుతున్న మ్యాడ్.. బ్లాక్‌బస్టర్ జవాన్‌ను వెనక్కు నెట్టేసింది!
వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఓ పాన్ ఇండియా సినిమాకు ఓ చిన్న సినిమా గట్టి పోటీనిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో దక్షిణాది తారలే ఎక్కువగా కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీయే. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2న రిలీజ్ అయింది. అప్పుడే ఓటీటీ రిలీజైన మ్యాడ్ ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ సినిమా నిత్యం నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్‌లో చోటు దక్కించుకుంటోంది. అయితే ఈ సినిమాకు ఝలక్ ఇస్తోంది చిన్న చిత్రం మ్యాడ్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపీక ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లో హిట్ అయిన ఈ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అటు జవాన్, ఇటు మ్యాడ్‌ను ఓటీటీ ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. టాప్ 10 చిత్రాల్లో మ్యాడ్ ఏ స్థానంలో ఉందంటే? ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువమంది చూస్తున్న టాప్ 10 చిత్రాల్లో జవాన్ హిందీ వర్షన్ తొలి స్థానంలో నిలబడి తన ఆధిక్యతను చాటుకుంటోంది. కానీ తమిళ, తెలుగు వర్షన్లను మాత్రం మ్యాడ్ మూవీ వెనక్కు నెట్టేసింది. ఎక్కువమంది చూస్తున్న సినిమాల్లో మ్యాడ్ రెండో స్థానంలో నిలబడింది. జవాన్ తమిళ వర్షన్ మూడో స్థానంలో, తెలుగు వర్షన్ నాలుగో స్థానంలో నిలిచాయి డ్రీమ్ గర్ల్ 2.. ఐదో స్థానంలో ఉంది. చంద్రముఖి 2 పదో స్థానంలో ఊగిసలాడుతోంది. ఇది ఆదివారం నాటి లెక్కలు.. ఇది చూసిన అభిమానులు ఒక చిన్న తెలుగు సినిమా.. భారీ బడ్జెట్ మూవీ జవాన్‌కు గట్టి పోటీనే ఇస్తుందే అని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన మెగా ఇంటి కోడలు.. ఇంతకీ వాళ్లెవరో తెలుసా? -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 28 సినిమాలు రిలీజ్
చాలామంది వీకెండ్లో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి కాలక్షేపం చేస్తుంటారు. అయితే రోజుకో సినిమా చూడాలంటే మాత్రం ఓటీటీని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదనే చెప్పాలి. అటు ఒక వారంలో థియేటర్లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో అంతకు మించిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్ల కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. మరి ఈ శుక్రవారం (నవంబర్ 3న) ఏయే సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయో చూసేద్దాం.. అలాగే స్ట్రీమింగ్ అవుతోంది అని రాసి ఉన్న సినిమాలు ఈ రోజే ఓటీటీలోకి వచ్చాయని అర్థం. అమెజాన్ ప్రైమ్ వీడియో ► తకేశి క్యాటిల్ గేమ్ షో - స్ట్రీమింగ్ అవుతోంది ► ఇన్విజిబుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► రత్తం - నవంబర్ 3 ► PI మీనా (హిందీ సిరీస్) - నవంబర్ 3 హాట్‌స్టార్ ► స్కంద - నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ► కాఫీ విత్ కరణ్ షో రెండో ఎపిసోడ్ -స్ట్రీమింగ్ అవుతోంది ► లోకి రెండో సీజన్, ఐదవ ఎపిసోడ్ - స్ట్రీమింగ్ అవుతోంది ► ఆర్య సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 నెట్‌ఫ్లిక్స్ ► జవాన్ - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఆల్ ద లైట్ వి కాంట్ సీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► సిగరెట్ గర్ల్ (ఇండోనేసియన్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► హిగ్యుటా: ద వే ఆఫ్ ద స్కార్పియన్ (స్పానిష్ సినిమా) - స్ట్రీమింగ్ అవుతోంది. ► ఒనిముషా (జపనీస్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► యునికార్న్ అకాడమీ (ఇంగ్లీష్ సిరీస్) - స్ట్రీమింగ్ అవుతోంది. ► మ్యాడ్ - నవంబర్ 3 ► బ్లూ ఐ సమురాయ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► డైలీ డోస్ ఆఫ్ సన్‌షైన్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 3 ► ఫెర్రీ: ద సిరీస్ (డచ్ సిరీస్) - నవంబర్ 3 ► న్యాద్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► సెల్లింగ్ సన్‌సెట్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 3 ► స్లై (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 3 ► ద టైలర్ సీజన్ 3 (టర్కిష్ సిరీస్) - నవంబర్ 3 సోనీలివ్ ► స్కామ్ 2003: ద తెల్గీ స్టోరీ వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - నవంబర్ 3 బుక్ మై షో ► హాఫ్ వే హోమ్ (హంగేరియన్ మూవీ) - నవంబర్ 3 ► మై బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 ► ద థీఫ్ కలెక్టర్ (ఇంగ్లీష్ చిత్రం) - నవంబర్ 3 ఆపిల్ ప్లస్ టీవీ ► ఫింగర్ నెయిల్స్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 3 జియో సినిమా ► టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా (హిందీ సిరీస్) - నవంబరు 3 చదవండి: ప్రతిసారి వెధవ పని చేయడం అలవాటు.. అమర్‌పై రతికా ఫైర్! -
MAD OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మ్యాడ్’.. స్ట్రీమింగ్ ఎక్కడ,ఎప్పుడు?
చిన్న చిత్రంగా వచ్చి పెద్ద విజయం సాధించిన మూవీ ‘మ్యాడ్’. కాలేజీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా కొత్తవారే అయినప్పటికీ ప్రచార చిత్రాలతో తొలి నుంచే మ్యాడ్పై హైప్ క్రియేట్ అయింది. అక్టోబర్ 6న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం..అంచనాలకు తగ్గట్టే మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్..తాజాగా రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం నెట్‌ఫిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేస్తూ..‘మిమ్మలందర్ని పిచ్చెక్కించే ఒక శుభవార్త. మ్యాడ్ చిత్రం నవంబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని రాసుకొచ్చింది. ‘మ్యాడ్’ కథేంటి? మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు.ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. Mimmalnandarini picchekinche oka subhavaartha. MAD cinema 3rd November nunchi Netflix lo stream avabothundhi. #MADonNetflix pic.twitter.com/m5xKGH1vwj — Netflix India South (@Netflix_INSouth) October 30, 2023 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఈ మధ్య కాలంలో థియేటర్లలో సరైన సినిమాలు పడటం లేదు. పలువురు యంగ్ హీరోలు.. కొత్త మూవీస్‌తో వచ్చినా సరే అనుకున్నంత రేంజులో హిట్స్ అయితే కొట్టలేకపోతున్నారు. ఈ క్రమంలోనే అందరి దృష్టి ఓటీటీలపై పడుతోంది. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కొత్త మూవీస్ ఏం వస్తున్నాయా? వాటిని ఎప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే ఓ తెలుగు కామెడీ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏ సినిమా? తెలుగులో కామెడీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో అలరించిన సందర్భాలు తక్కువ. అలా అక్టోబరు తొలివారంలో అంటే 6వ తేదీన థియేటర్లలోకి వచ్చిన 'మ్యాడ్' చిత్రం.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా నిలిచింది. కథ పరంగా కొత్తగా ఏం లేనప్పటికీ చూస్తున్నంతసేపు నవ్వుకునేలా చేసింది. హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లు కూడా సాధించింది. ఇప్పుడీ సినిమానే ఓటీటీలోకి రాబోతుందట. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) ఓటీటీలోకి ఎప్పుడు? 'మ్యాడ్' ఓటీటీ హక్కుల్ని.. థియేటర్లలో విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ ఓటీటీలో చాలావరకు సినిమాలన్నీ నెలరోజుల్లోనే కాస్త అటుఇటుగా స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు 'మ్యాడ్' చిత్రాన్ని కూడా నవంబరు 3న ఓటీటీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సో అదన్నమాట విషయం. 'మ్యాడ్' కథేంటి? మనోజ్, అశోక్, దామోదర్ ముగ్గురు ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్. వీళ్ల ముగ్గురికి మూడు లవ్ స్టోరీలు. అయితే వీళ్లు ఫ్రెండ్స్‌గా కలిసిన విధానం, వాళ్లకు ఏర్పడ్డ ప్రేమలు, హాస్టల్లో ర్యాగింగ్ సీన్స్.. ఇలా అన్నీ సరదాగా సాగిపోతుంటుంది. మరి ఈ కథలో చివరకు ఏమైంది? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ‘మ్యాడ్’ చిత్ర బృందం (ఫొటోలు)
-
MAD Movie:'మ్యాడ్'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బాక్సాఫీస్ విన్నర్ దిశగా మ్యాడ్! ఏ ఓటీటీలోకి రానుందంటే?
సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్.. కథ, కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి.. లేదంటే పాతదైనా కొత్తగా చెప్పాలి, జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేయాలి. కథలో లీనమయ్యేలా చేయాలి. మరీ ముఖ్యంగా ఆడియన్స్‌కు వినోదాన్ని అందించాలే తప్ప ఎక్కడా విసుగు పుట్టించకూడదు. ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు నిర్మొహమాటంగా సినిమా ఫ్లాప్.. కాదుకాదు, అట్టర్‌ఫ్లాప్ అని తేల్చి పడేస్తారు. అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల తీర్పులో మాత్రం తేడా ఉండదు! అక్టోబర్ 6న దాదాపు 10 దాకా సినిమాలు విడుదలయ్యాయి. పది సినిమాలు.. ఫలితం ఎలా ఉందంటే? వీటిలో రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, ఏందిరా ఈ పంచాయితీ, గన్స్ ట్రాన్స్ యాక్షన్, అభిరామచంద్ర, మ్యాడ్.. ఇలా స్ట్రయిట్ సినిమాలున్నాయి. అలాగే క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800, సిద్దార్థ్ చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 800, చిన్నా చిత్రాలు బాగానే ఉన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవలేదు. మరి ఏ సినిమాకు జనాలు జై కొడుతున్నారో తెలుసా? మ్యాడ్. జాతిరత్నాలు తరహాలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం రోజురోజుకీ వసూళ్లు పెంచుకుంటూ పోతోంది. కలెక్షన్స్ డబుల్.. ఈ మూవీలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా రెడ్డి, అనంతిక సనిల్ కుమార్, గోపిక ఉద్యన్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. మ్యాడ్ తొలి రోజు రూ.1.8 కోట్లు రాబట్టగా రెండో రోజు ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది. దాదాపు రూ.3 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మ్యాడ్ మూవీకి రెండు రోజుల్లోనే రూ.4.7 కోట్లు వచ్చిపడ్డాయి. బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మొదటి వారంలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. MADness unleashed! 🔥 Day 2 > Day 1 🤩#MAD Grosses over 𝟒.𝟕 𝐂𝐑 in 2 Days! 🥳 Experience the MAD Entertainer of the Year at cinemas near you now! 🕺 🎟 - https://t.co/IrUWNwCYws@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin #SangeethShobhan… pic.twitter.com/Jc5GxNBY61 — Sithara Entertainments (@SitharaEnts) October 8, 2023 చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లోకి అంజలి పవన్? వీడియోతో క్లారిటీ ఇచ్చిన నటి -
'మ్యాడ్' సినిమాలో కామెడీతో ఇచ్చిపడేశాడు.. ఈ కుర్రాడెవరో తెలుసా?
ఈ శుక్రవారం చిన్నాపెద్దా కలిపి 10 వరకు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. వాటిలో ఇంజినీరింగ్ కాలేజీ, హాస్టల్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన 'MAD' మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. జూ.ఎన్టీఆర్ బావమరిది హీరోగా పరిచయమైన ఈ సినిమాలో ఓ కుర్రాడు.. తన యాక్టింగ్, కామెడీతో ఇచ్చిపడేశాడు. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇంతకీ ఎవరతడు? అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఈ కుర్రాడి పేరు సంగీత్ శోభన్. ప్రస్తుతం టాలీవుడ్లో పలు సినిమాల్లో హీరోగా చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ వాళ్ల తమ్ముడే ఇతడు. ప్రభాస్‌తో 'వర్షం' లాంటి హిట్ సినిమా తీసిన శోభన్.. సంగీత్ నాన్న. ఇలా ఇండస్ట్రీతో చిన్నప్పటి నుంచే సంబంధం ఉంది. అలా చైల్డ్ ఆర్టిస్టుగా 2011లోనే 'గోల్కోండ హైస్కూల్' సినిమాలో యాక్ట్ చేశాడు. అందులో బొద్దుగా ఉండేది ఇతడే. అప్పుడు బ్రేక్ తీసుకుని పదేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!) వెండితెరపై 'మ్యాడ్' ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. మూడేళ్ల క్రితమే 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' అనే వెబ్ సిరీస్‌లో సహాయ పాత్ర చేశాడు. దీనితోపాటు త్రీ రోజెస్, పిట్ట కథలు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ లాంటి తెలుగు వెబ్ సిరీసుల్లోనూ భాగమయ్యాడు. అలా ఓటీటీల్లో అదరగొట్టిన సంగీత్.. 'మ్యాడ్'లో అవకాశం దక్కించుకున్నాడు. దామోదర్ (డీడీ) అనే బీటెక్ చదివే కుర్రాడి పాత్రలో ఇరగ్గొట్టేశాడని చెప్పొచ్చు. త్వరలో 'ప్రేమ విమానం' అనే డైరెక్ట్ ఓటీటీ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సంగీత్ శోభన్.. మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తే మాత్రం మరో జాతిరత్నం కావడం గ్యారంటీ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలా కామెడీతో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త కష్టపడితే సంగీత్.. ఆ లిస్టులోకి చేరడం పెద్ద విషయమేమి కాకపోవచ్చు! (ఇదీ చదవండి: ‘మ్యాడ్’ మూవీ రివ్యూ) -
‘మ్యాడ్’ మూవీ రివ్యూ
టైటిల్: మ్యాడ్ నటీనటులు: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్, రఘుబాబు, రచ్చ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: హారిక సూర్యదేవర, సాయి సౌజన్య రచన, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్ సమర్పణ: ఎస్. నాగ వంశీ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ:మ్దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: అక్టోబర్ 06, 2023 కథేంటంటే.. ఓ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ ఇది. వివిధ ప్రాంతాలకు చెందిన మనోజ్ (రామ్ నితిన్), దామోదర్ అలియాస్ డీడీ (సంగీత్ శోభన్), అశోక్ (నార్నే నితిన్) ముగ్గురూ.. రీజీనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారు. వీరితో పాటు లడ్డు అనే కుర్రాడు కూడా అదే కాలేజీలో చేరుతాడు. ఈ నలుగురు మంచి స్నేహితులవుతారు. అశోక్ ఇంట్రావర్ట్‌గా ఉంటాడు. మనోజ్..కనిపించిన ప్రతి అమ్మాయితో పులిహోర కలుపుతాడు. డీడీ ఏమో తనకు ఏ అమ్మాయిలు పడరని దూరంగా ఉంటూ సోలో లైపే సో బెటర్ అని పాటలు పాడుతుంటాడు. అశోక్‌ను అదే కాలేజీకి చెందిన జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ఇష్టపడుతుంది. అశోక్‌కి కూడా ఆమె అంటే ఇష్టమే. కానీ తమ ప్రేమ విషయాన్ని ఒకరికొకరు చెప్పుకోరు. మరోవైపు మనోజ్.. బస్సులో శృతి((శ్రీ గౌరీ ప్రియా రెడ్డి)ని చూసి నిజంగానే ప్రేమలో పడతాడు. ఆమె కూడా కొన్నాళ్లు మనోజ్‌తో స్నేహం చేసి ఓ కారణంతో అమెరికాకు వెళ్లిపోతుంది. ఇక డీడీకి ఓ అజ్ఞాత అమ్మాయి నుంచి ప్రేమ లేఖ వస్తుంది. వెన్నెల పేరుతో ఫోన్లో పరిచయం చేసుకొని.. ప్రేమాయణం సాగిస్తుంటారు. మరి ఈ ముగ్గురి ప్రేమ కథలు ఎలా ముగిశాయి? శృతి ఎందుకు అమెరికా వెళ్లింది? అశోక్, జెన్నీలు ఒకరి మనస్సులో మాట మరొకరకు చెప్పుకున్నారా? డీడీకి ప్రేమ లేఖ రాసిన వెన్నెల ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో MAD(మనోజ్, అశోక్, దామోదర్) చేసిన అల్లరి ఏంటి? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. కాలేజీ నేపథ్యంలో వచ్చే సినిమాలు ఎప్పుడూ ఎంటర్టైనింగ్గానే ఉంటాయి. ప్రెండ్షిప్, ర్యాగింగ్, ప్రేమ.. ఈ మూడు అంశాల చుట్టే కథ తిరిగినప్పటీకి..వినోదంలో కొత్తదనం ఉంటే చాలు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. మ్యాడ్ కూడా అదే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి.. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరుస పంచ్ డైలాగ్స్‌తో వినోదభరితంగా కథ ముందుకు తీసుకెళ్లాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్. ఈ కథలో కొత్తదనం వెతికితే ఏమి కనిపించదు. కానీ సన్నివేశాలుగా విభజించి చూస్తే..ప్రతీదీ ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. కాలేజీలో ర్యాగింగ్.. సీనియర్లతో గొడవలు.. ఓ విషయంలో అంతా ఏకమై పక్క కాలేజీ వాళ్లతో పోటీపడడం.. ఇవన్నీ హ్యాపీడేస్ నుంచి మొన్నటి హాస్టల్ డేస్ వరకు చూసినవే. కానీ మ్యాడ్‌లో ప్లస్ పాయింట్ ఏంటంటే.. కామెడీ కొత్తగా ఉండడం. కొన్ని చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా.. ఆడియన్స్ నవ్వులో అవి కొట్టుకుపోతాయి. ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే రాయడం చాలా కష్టం. పైగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా వారి నుంచి దర్శకుడు తనకు కావాల్సినంత నటనను రాబట్టుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. లడ్డు అనే వ్యక్తి మ్యాడ్ గ్యాంగ్ గురించి ఓ స్టూడెంట్‌కు వివరిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత వారంతా కాలేజీలో చేసిన రచ్చ, ప్రేమ స్టోరీలు.. ర్యాగింగ్.. ఇలా సరదాగా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ కూడా ఫస్ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కోసం డీడీ తన టీమ్‌తో కలిసి లేడీస్ హాస్టల్‌కి వెళ్లి చేసే రచ్చ.. థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. వెన్నెల ఎవరై ఉంటారనే క్యూరియాసిటీని చివరకు కొనసాగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. అయితే సినిమాలో కామెడీ వర్కౌట్ అయినంతగా ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు. అలాగే నార్నే నితిన్ ని కోసం యాక్షన్ సీక్వెన్స్ కూడా కథకు అతికినట్లుగా అనిపించాయి. బూతు డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. కానీ నవ్వులు పంచడంలో మాత్రం ఈ ‘మ్యాడ్’ గ్యాంగ్ సక్సెస్ అయింది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించవారంతా కొత్తవాళ్లే. అయినా ఈ విషయం తెరపై ఎక్కడా కనిపించారు. డీడీ పాత్రలో నటించిన సంగీత్ శోభన్..తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ చాలా బాగున్నాయి. అశోక్ గా నార్నే నితిన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు కానీ.. ఆ సీన్స్ కథకి అతికించినట్లుగా అనిపిస్తాయి. ఇక లవర్‌బాయ్ మనోజ్‌గా రామ్ నితిన్ చక్కగా నటించాడు. హీరోయిన్స్ శ్రీ గౌరీ, ప్రియా రెడ్డి, ఆనంతిక తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. లడ్డు పాత్రలో ‘టాక్సీవాలా’ విష్ణు జీవించేశాడు. అమాయకత్వంతో ఆయన పండించిన కామెడీ సినిమాకు ప్లస్ అయింది. అనుదీప్ ఒక సీన్లో కనిపించి వెళ్తాడు. కాలేజీ ప్రిన్సిపల్‌గా రఘుబాబు, అతని పీఏగా రచ్చ రవితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. భీమ్స్ సిసిరోలియోసి పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచాయి. పాటలు కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజిశెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
MAD Movie Pre-Release Event: మ్యాడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన దుల్కర్ సల్మాన్, శ్రీలీల (ఫోటోలు)
-
MAD Movie Theatrical Trailer Launch: మ్యాడ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్ (ఫోటోలు)
-
థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?
ఎలా చూసుకున్నా సరే థియేటర్లలో ప్రతి శుక్రవారం ఒకటి రెండు అదీ కాదంటే ఓ మూడు సినిమాల వరకు రిలీజ్ అవుతుంటాయి. అంతకు మించి వస్తే మాత్రం థియేటర్ల దగ్గర నుంచి ప్రేక్షకుల వరకు ప్రతిదీ సమస్య అవుతుంది. కానీ అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా ఈ శుక్రవారం ఏకంగా 10 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ప్రతివారం ఓటీటీల్లో పదుల సంఖ్యలో సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. ఇప్పుడు వీటికి పోటీ ఇచ్చేలా థియేటర్లలో ఈ శుక్రవారం దాదాపు 10 వరకు కొత్త మూవీస్ విడుదల కాబోతున్నాయి. వీటిలో 'మ్యాడ్', 'రూల్స్ రంజన్', 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు', 'ఏందిరా ఈ పంచాయతీ', 'అభిరామచంద్ర', 'గన్స్ ట్రాన్స్ యాక్షన్' లాంటి స్ట్రెయిట్ సినిమాలు ఉన్నాయి. పైన చెప్పిన చిత్రాలకే థియేటర్లు దొరకడం కష్టమనుకుంటే 800, చిన్నా, ఎక్సార్సిస్ట్ అనే డబ్బింగ్ మూవీస్ కూడా ఇదే తేదీకి బిగ్ స్క్రీన్‌పైకి వచ్చేందుకు రెడీ అయిపోయాయి. ఈ మొత్తం లిస్టులో కాలేజీ కామెడీ ఎంటర్టైనర్ స్టోరీతో తీసిన 'మ్యాడ్' కాస్త ఆసక్తి కలిగిస్తుంది. మిగతా వాటిపై పెద్దగా బజ్ లేదు. అయితే వీటిలో ఏది హిట్ అవుతుందో ఏంటనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగితే సరిపోతుంది. ఇంతకీ వీటిలో మీ ఛాయిస్ ఏంటి? (ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
'మ్యాడ్' సినిమా.. థియేటర్లలో నవ్వుల హంగామా
జూ.ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'మ్యాడ్'. ఈ చిత్రంలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రధారులే. ఈ కామెడీ ఎంటర్టైనర్ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన యాక్టర్స్ పలు ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నారు. (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) ఈ సినిమాలో 'హ్యాపీ డేస్' వైబ్స్ కనిపిస్తున్నాయి కదా? అనే ప్రశ్నకు బదులిచ్చిన సంగీత్ శోభన్.. 'హ్యాపీడేస్' రిలీజై 15 ఏళ్లు దాటింది. అది అప్పటి యూత్ సినిమా. కానీ మా చిత్రంలోని కామెడీ ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇన్‌స్టా, ఫేస్బుక్, ట్విట్టర్‌ని ఎంజాయ్ చేసే ట్రెండ్ ఈ తరానిది. 'మ్యాడ్'లో ఈ తరహా కామెడీ ఉంటుంది. థియేటర్స్‌లో ఫుల్ నవ్వులు హంగామా ఉంటుంది. ఈ సినిమాని 'జాతిరత్నాలు'తో పోల్చుతున్నారనే విషయమై మాట్లాడిన యాక్టర్స్.. జాతిరత్నాలు చిత్రానికి కేవీ అనుదీప్, మ్యాడ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ సంయుక్తంగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అలా ఆ పోలిక వచ్చింది. నాగవంశీ కూడా ఈ మూవీ జాతిరత్నాలు తరహాలోనే అందరూ చూసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని చెప్పారు. దీంతో అందరూ జాతిరత్నాలతో పోల్చారు. మ్యాడ్‌లో అనుదీప్ సరదా పాత్రలో నటించారు. దర్శకుడికి మంచి ఫ్రెండ్ కాబట్టి ఆ రోల్ చేశారు. ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున 'మ్యాడ్' అని పేరు పెట్టినట్లు రామ్ నితిన్ తెలిపారు. (ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి) -
'వీళ్లలో చదువుకునే ఫేస్ ఒక్కటైనా ఉందా?'.. ఆసక్తిగా మ్యాడ్ ట్రైలర్!
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా మ్యాడ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. (ఇది చదవండి: గ్లోబల్ స్టార్ హార్స్ రైడ్.. మగధీరను గుర్తుకు తెస్తోన్న చెర్రీ!) ట్రైలర్ రిలీజ్ చేసిన ఎన్టీఆర్ 'మ్యాడ్ వెబ్ వచ్చేసింది.. ట్రైలర్ చూస్తే మొత్తం నవ్వులే నవ్వులు.. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని ఇంజినీరింగ్ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందించారు. ట్రైలర్ చూస్తే యూత్ ఫుల్ ఎంటర్టైనర్గానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభం నుంచి నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని నిర్మాత నాగవంశీ ప్రకటించారు. Loved the vibe of the film. #MAD trailer is a laugh riot. https://t.co/7jFRF4WsUX Superb energy @NarneNithiin #SangeethShobhan #RamNitin… All the best to director @kalyanshankar23, my brother @vamsi84, and the entire team for their release on 6th Oct. @gouripriyareddy… — Jr NTR (@tarak9999) October 3, 2023 -
సినిమా చూసి నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తాం: నిర్మాత
వరుస సినిమాలతో దూసుకెళ్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. సూర్యదేవర నాగవంశీ ముందుడి మరీ ఈ నిర్మాణ సంస్థను నడిపిస్తున్నాడు. ఇప్పటికే పలు వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అదించిన ఈ నిర్మాణ సంస్థ..తాజాగా ‘మ్యాడ్’తో అలరించడానికి సిద్ధమైంది. ఎన్టీఆర్ బామ్మర్థి నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకి నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 6న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ మ్యాడ్ గ్యాంగ్ ని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. జాతి రత్నాలు సినిమా కంటె ఎక్కువగా ఈ చిత్రం నవ్విస్తుందన్నారు. జాతి రత్నాలు కంటే తక్కువగా ఈ సినిమా నవ్వించింది అని ప్రేక్షకులు ఫీల్ అయితే కచ్చితంగా వారి టిక్కెట్ డబ్బులు తిరిగి ఇస్తాను అంటూ నిర్మాత ఛాలెంజ్ చేశాడు. ‘సినిమా మీద నమ్మకంతో ఈ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది యూత్‌ఫుల్ సినిమా అయినప్పటికీ..కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లైఫ్ ని గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్ లు, ట్విస్ట్ లు ఏముండవు. సినిమా మొదలైనప్పటి నుండి చివరివరకు నవ్వుతూనే ఉంటారు. కుటుంబంతో కలిసి అందరూ ఆనందించదగ్గ సినిమా ఇది’ అని నాగవంశీ అన్నారు. -
సింగిల్‌గా ఉండు మామా..
‘హే సింగిల్‌గా ఉండు మామా.. గాళ్‌ఫ్రెండ్ ఎందుకు?..హైదరాబాద్.. సికింద్రాబాద్..పొరెంటబడితే నువ్వు బరాబాత్’ అంటూ మొదలవుతుంది ‘మ్యాడ్’ చిత్రంలోని ప్రౌడ్సే బోలో ఐయామ్ సింగిల్’ పాట. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో ఎస్. హారిక, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలోని ప్రౌడ్సే బోలో ఐ యామ్ సింగిల్..’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సారథ్యంలో రఘురామ్ సాహిత్యం అందించారు. నకాష్ అజీజ్‌తో కలిసి భీమ్స్ సిసిరోలియో ఈ పాటను ఆలపించారు. -
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా ‘మ్యాడ్’..టీజర్ చూశారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. ఇంజనీరింగ్ కళాశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక సూర్యదేవర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ కథ మొత్తం కాలేజ్ చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్, ప్రేమలు, కొట్లాటలు అన్నింటినీ ఇందులో చూపించారు. సుమారు నిమిషమున్నర ఉన్న ఈ మూవీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో నిండిపోయింది. ఇటీవల ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.