
బాక్సాఫీస్ వద్ద రెట్టింపు వినోదాన్ని 'మ్యాడ్2' సినిమాతో పంచేందుకు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ సిద్దంగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుంది. ఇదే కాంబినేషన్‌లోనే రూపొందిన హిట్ ఫిల్మ్ ‘మ్యాడ్ (2023)’కు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ పేరుతో రూపొందుతోంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది.
గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్ ప్రకటించారు. సినీ అభిమానులంతా ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా 'మ్యాడ్ స్క్వేర్' నుంచి టీజర్ విడుదలైంది.
మ్యాడ్ సినిమాలో తనదైన ప్రత్యేక శైలి హాస్య సన్నివేశాలు, ఆకర్షణీయమైన కథనంతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కళ్యాణ్ శంకర్, ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నారు. మొదటి భాగంలో తమ అల్లరితో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మరియు విష్ణు ఓఐ (లడ్డు).. 'మ్యాడ్ స్క్వేర్'లో అంతకుమించిన అల్లరి చేయబోతున్నారు. టీజర్‌లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment