'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి'.. మ్యాడ్‌ స్క్వేర్ ఫుల్ సాంగ్ చూశారా? | Mad Square Super Hit Song Swathi Reddy Full Video Song Out Now | Sakshi
Sakshi News home page

Mad Square Hit Song: మ్యాడ్ స్క్వేర్‌ మూవీ.. స్వాతి రెడ్డి ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

Published Tue, Apr 15 2025 4:28 PM | Last Updated on Tue, Apr 15 2025 5:14 PM

Mad Square Super Hit Song Swathi Reddy Full Video Song Out Now

ఇటీవల యూత్‌ను ఫుల్‌గా అలరించిన కామెడీ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌, సంగీత్‌ శోభన్‌ కీలక పాత్రల్లో మెప్పించారు. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మ్యాడ్‌ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించింది.

తాజాగా ఈ సినిమాలో క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. స్వాతిరెడ్డి అంటూ సాగే పాట ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హీరోయిన్‌ రెబా మోనికా జాన్ తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ పాటలో నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌, సంగీత్‌ శోభన్‌ తమ స్టెప్పులతో అలరించారు. కాగా.. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. రిలీజ్‌కు ముందే క్రేజ్‌ దక్కించుకున్న ఈ సూపర్ హిట్‌ సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement