'వచ్చార్రోయి.. మళ్లొచ్చార్రోయ్..వీళ్లకు హారతి పట్టండ్రోయ్' | MAD Square Movie Vaccharroi Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

MAD Square Movie: 'వచ్చార్రోయి.. మళ్లొచ్చార్రోయ్..వీళ్లకు హారతి పట్టండ్రోయ్'

Published Tue, Mar 18 2025 6:30 PM | Last Updated on Tue, Mar 18 2025 8:16 PM

MAD Square Movie Vaccharroi Lyrical Song Out Now

సంగీత్‌ శోభన్, నార్నే నితిన్, రామ్‌ నితిన్‌ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తున్నారు. గతంలో మ్యాడ్‌ మూవీతో ప్రేక్షకులకు మ్యాడ్‌నెస్‌ తెప్పించిన వీళ్లు.. మరోసారి అంతకుమించి ట్రీట్‌ ఇవ్వనున్నారు. ఈ సినిమాకు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్‌ను తెరకెక్కించారు.  కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం యూత్‌పుల్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్ దగ్గర పడడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.

(ఇది చదవండి: రెట్టింపు వినోదంతో 'మ్యాడ్‌2' టీజర్‌)

ఇప్పటికే 'మ్యాడ్ స్క్వేర్' నుంచి విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు కూడా ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో సాంగ్ 'వచ్చార్రోయ్' ఆడియన్స్‌కు మరింత గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో తనదైన ప్రత్యేక శైలి సంగీతంతో మరోసారి కట్టిపడేశారు. "ఏసుకోండ్రా మీమ్స్.. చేసుకోండ్రా రీల్స్.. రాసుకోండ్రా హెడ్ లైన్స్.. ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్" లాంటి లిరిక్స్‌తో అందరినీ అలరించేలా ఉంది.

కాగా.. ఈ పాటకు కేవీ అనుదీప్ లిరిక్స్ అందించగా.. భీమ్స్ సిసిరోలియో ఆలపించారు. తాజాగా విడుదలైన సాంగ్ ప్రేక్షకులకు జోష్‌ తెప్పిస్తోంది. కాగా.. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.   మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement