'మ్యాడ్ స్క్వేర్' సినిమా నుంచి యూత్‌ను ఆకట్టుకునే సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment