Narne Nithin
-
మ్యాడ్ స్క్వేర్ నుంచి 'స్వాతి రెడ్డి' సాంగ్ చూశారా..?
'మ్యాడ్ స్క్వేర్' సినిమా నుంచి యూత్‌ను ఆకట్టుకునే సాంగ్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
ఎన్టీఆర్ బావ మరిది 'నార్నే నితిన్' నిశ్చితార్థం
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్ర పెళ్లి పీటలెక్కనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట.నార్నే నితిన్ నిశ్చితార్థం వేడుకలో ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు వారి కుమారులు అభయ్, భార్గవ్‌లు సందడిగా కనిపించారు. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్, వెంకటేశ్ పాల్గొన్నారు. కాబోయే వధూవరులను వారు ఆశీర్వదించారు.ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ఆయన రీసెంట్గా ఆయ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు. View this post on Instagram A post shared by NTR Trends (@ntrfantrends) -
'మ్యాడ్ స్క్వేర్' నుంచి సాంగ్ విడుదల
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్’. గతేడాదిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' పేరుతో సీక్వెల్ రానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యాడ్ సినిమాతో ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోదరి హారిక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు సీక్వెల్‌ను కూడా హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
టాలీవుడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్.. ఈ సారి డబుల్ మ్యాడ్!
టాలీవుడ్లో యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్ కావడంతో మేకర్స్ మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్.. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్)ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్ చూస్తుంటే మ్యాడ్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. This time it’ll be MAD MAXX!! 😎🤘🏻Here’s the First Look of #MADSquare 🕺First single coming out on 20th September 🤩🔥#ThisTimeItsMADMAXX 💥@kalyanshankar23 @vamsi84 #HarikaSuryadevara #SaiSoujanya @NarneNithiin @SangeethShobhan #RamNitin #BheemsCeciroleo @NavinNooli… pic.twitter.com/Bzod0AzKLo— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2024 -
Aay Movie Team: అల్లు అర్జున్‌ని కలిసిన ఎన్టీఆర్ బావమరిది (ఫొటోలు)