ఒక రోజు ముందే వినోదం | Narne Nithin Mad Square Set for a Grand Worldwide Release on March 28 | Sakshi
Sakshi News home page

ఒక రోజు ముందే వినోదం

Published Mon, Mar 3 2025 3:33 AM | Last Updated on Mon, Mar 3 2025 6:23 AM

Narne Nithin Mad Square Set for a Grand Worldwide Release on March 28

నార్నే నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘మ్యాడ్‌’ (2023) ప్రేక్షకులను ఫుల్లుగా నవ్వించి, బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. ఈ హీరోల కాంబినేషన్‌లోనే ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఈ నెల 29న విడుదల కావాల్సింది. 

అయితే ఆ రోజు అమావాస్య కావడంతో పంపిణీదారుల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ముందే 28న విడుదల చేయనున్నామని చిత్ర సమర్పకుడు సూర్యదేవర నాగవంశీ పేర్కొన్నారు. హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన కల్యాణ్‌ శంకర్‌ మలి భాగాన్ని కూడా తెరకెక్కించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement