టాలీవుడ్ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌.. ఈ సారి డబుల్‌ మ్యాడ్‌! | Tollywood Super Hit Movie Sequel Mad Square First Look Poster Out Now | Sakshi
Sakshi News home page

Mad Square First Look: యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌.. 'మ్యాడ్‌ స్వ్కేర్‌' వచ్చేస్తోంది!

Published Wed, Sep 18 2024 12:49 PM | Last Updated on Wed, Sep 18 2024 1:03 PM

Tollywood Super Hit Movie Sequel Mad Square First Look Poster Out Now

టాలీవుడ్‌లో యూత్‌ఫుల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం మ్యాడ్. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. గతేడాది అక్టోబర్‌లో రిలీజైన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. మ్యాడ్ సూపర్ హిట్‌ కావడంతో మేకర్స్‌ మరోసారి ఆడియన్స్‌ను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మ్యాడ్ స్వ్కేర్‌ తెరకెక్కించనున్నట్లు ప్రకటించిన మేకర్స్ తాజాగా ఫ‍స్ట్‌ లుక్‌ రిలీజ్ చేశారు.

(ఇది చదవండి: మొన్న టిల్లు స్వ్కేర్‌.. ఇప్పుడు మ్యాడ్‌ స్వ్కేర్‌)

ఈ చిత్రంలోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో ముగ్గురు కూడా పంచెకట్టులో కనిపించారు. పోస్టర్‌ చూస్తుంటే మ్యాడ్‌ను తలదన్నేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను సెప్టెంబర్‌ 20న విడుదల చేస్తామని ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ మూవీకి బీమ్స్ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement