మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌.. మోహన్ బాబు లుక్‌ చూశారా? | Tollywood Movie Kannappa Mohan Babu First Look Poster Out Now | Sakshi
Sakshi News home page

Kannappa Movie: కన్నప్ప మూవీ.. మోహన్ బాబు పాత్ర పేరేంటో తెలుసా?

Nov 22 2024 3:48 PM | Updated on Nov 22 2024 4:14 PM

Tollywood Movie Kannappa Mohan Babu First Look Poster Out Now

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ‍ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్‌ బాబు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్‌ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్‌, దేవరాజ్‌ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు.  కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో  కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి  బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముఖేష్ కుమార్  తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement