టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
తాజాగా మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.
కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.
Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s
— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024
Comments
Please login to add a commentAdd a comment