ariaana
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
మంచు వారసురాళ్ల ఎంట్రీకి రంగం సిద్ధం.. లేఖ వైరల్
మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు విష్ణు. ఈ మూవీతో తన కూతుళ్లు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ లేఖ వదలగా అది కాస్తా వైరల్‌గా మారింది. 'నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా నేను మీ నుంచి పొందే ప్రేమాభిమానాల ముందు ఈ సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టమనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. నేను ఎప్పుడూ వారికి దూరంగా లేను. ఆ కారణం చేతనే నాకు పిల్లలు పుట్టినప్పుడు మీ బ్లెస్సింగ్స్ కోసం వాళ్లను మీ ముందుకు తీసుకువచ్చాను. ఒక తండ్రిగా, నటుడిగా నా కూతురులైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జిన్నాలో మన అరియాన, వివియాన కలిసి ఓ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్ కానుంది. వాళ్లు నటీమణులు అవ్వాలనేది నా కల. కానీ వారు ఏమార్గం ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం' అని రాసుకొచ్చాడు. ❤️ pic.twitter.com/2o0sDdqV4p — Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022 ❤️ pic.twitter.com/FxrCFbZ9Rr — Vishnu Manchu (@iVishnuManchu) July 20, 2022 చదవండి: ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. చైసామ్ మా అపార్ట్మెంట్లో ఉండేవారు, గొడవపడేవారు కాదు -
బాలయ్య డైలాగ్ చెప్పిన మంచు వారమ్మాయిలు
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటుడిగానే కాక నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నాడు. అయితే ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడే విష్ణు, తాజాగా తన కూతుళ్లతో కలిసి చేసిన ఓ ఆసక్తికర డబ్స్మాష్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. నందమూరి బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని ‘ఐయామ్ ద ట్రూత్’ డైలాగ్‌ను విష్ణు కూతుళ్లు అరియానా, వివియానాలులతో డబ్ స్మాష్ చేయించాడు విష్ణు. గతంలోనే రికార్డ్ చేసిన ఈ డబ్స్మాష్ వీడియోనే త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పుడు షేర్ చేశాడు విష్ణు. టాలీవుడ్లో మంచు, నందమూరి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిన విషయమే. ఎన్టీఆర్, మోహన్‌బాబుల కాలం నుంచి కొనసాగుతున్న ఈ అనుబంధాన్ని ఈ జనరేషన్‌లోనూ కంటిన్యూ చేస్తున్నారు. అందుకే మంచు ఫ్యామిలీ నిర్మించిన ఊ కొడతార ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటించి మెప్పించాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన ఆచారి అమెరికాయాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా త్వరలో రిలీజ్ అవుతోంది.ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఓటర్ సినిమా పనుల్లోనూ బిజీగా ఉన్నాడు మంచు విష్ణు. "I am the truth" #Ariaana #Viviana #Throwback #NBKDialogue #DubsmashFun https://t.co/NtFkcc2lqH — Vishnu Manchu (@iVishnuManchu) 10 March 2018 -
కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో
హైదరాబాద్ : హీరో మంచు విష్ణు తమ కూతుళ్ల కోసం డ్యాన్స్ మాస్టర్‌గా అవతారం ఎత్తాడు. జింగ్ చిక్కు అంటూ... కూతుళ్లు అరియానా, వివియానాలతో డ్యాన్స్ చేయించాడు. దగ్గరుండి మరీ వాళ్లిద్దరికీ స్టెప్స్ నేర్పించాడు. ఈ సందర్భంగా నాన్నా ఏ స్టెప్పులు వేయాలంటూ....కూతురు అడిగిన ప్రశ్నకు విష్ణు.... ఏదో ఒక స్టెప్ వేయవే అంటూ సలహా ఇచ్చాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ ఎలా డ్యాన్స్ చేయాలో స్వయంగా విష్ణు తన కూతుళ్లకు నేర్పించాడు. వాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా స్టెప్స్ వేశాడు. 23 సెకన్ల నిడివిగా ఉన్న ఈ వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ అయింది. -
కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో