Manchu Ariana And Viviana To Make Grand Entry In His Ginna Movie With Friendship Song - Sakshi
Sakshi News home page

Manchu Vishnu: మంచు ఫ్యామిలీ నుంచి సింగర్స్‌

Jul 20 2022 3:32 PM | Updated on Jul 20 2022 4:44 PM

Manchu Ariana, Viviana Sung Friendship Song - Sakshi

నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా

మంచు విష్ణు, సన్నీలియోన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్‌ సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు విష్ణు. ఈ మూవీతో తన కూతుళ్లు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ లేఖ వదలగా అది కాస్తా వైరల్‌గా మారింది.

'నేను ఈ సినీపరిశ్రమలోనే పుట్టాను, సినిమా సెట్స్‌లోనే పెరిగాను. ఎప్పుడూ నేను నటుడ్ని అవ్వాలనే కోరుకున్నాను, అనుకున్నది సాధించాను. ఒక నటుడి ప్రయాణం కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. కానీ ఒక నటుడిగా నేను మీ నుంచి పొందే ప్రేమాభిమానాల ముందు ఈ సవాళ్లతో కూడిన ప్రయాణం కష్టమనిపించదు. ప్రతి తెలుగువాడు నా కుటుంబ సభ్యుడు. నేను ఎప్పుడూ వారికి దూరంగా లేను. ఆ కారణం చేతనే నాకు పిల్లలు పుట్టినప్పుడు మీ బ్లెస్సింగ్స్‌ కోసం వాళ్లను మీ ముందుకు తీసుకువచ్చాను.

ఒక తండ్రిగా, నటుడిగా నా కూతురులైన అరియాన, వివియానలను గాయనీమణులుగా, నటీమణులుగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. జిన్నాలో మన అరియాన, వివియాన కలిసి ఓ పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియో సాంగ్‌ ఈ నెల 24 ఆదివారం ఉదయం 11.13 నిమిషాలకు రిలీజ్‌ కానుంది. వాళ్లు నటీమణులు అవ్వాలనేది నా కల. కానీ వారు ఏమార్గం ఎంచుకుంటారనేది పూర్తిగా వాళ్ల ఇష్టం' అని రాసుకొచ్చాడు.

చదవండి:  ఓటీటీలో వచ్చేస్తున్న ‘రాకెట్రీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..
 చైసామ్‌ మా అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు, గొడవపడేవారు కాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement