Ginna Movie
-
చిరంజీవితో విభేదాలు.. స్పందించిన మోహన్‌బాబు
నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న గొప్ప నటుడు మంచు మోహన్ బాబు. పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్, అల్లుడుగారు, అసెంబ్లీ రౌడి, రౌడీ గారి పెళ్ళాం.. ఇలా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆయన పుట్టినరోజు నేడు(మార్చి 19). ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'ఎక్కడో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడిని అప్రెంటిస్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి నట జీవితం ప్రారంభించి మోహన్‌బాబు యూనివర్సిటీ ఛాన్స్లర్ దాకా వచ్చాను. నా తల్లిదండ్రులు, ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. నా జీవితంలో భయంకరమైన ఎత్తుపల్లాలు ఉన్నాయి. నాకు పగవాళ్లంటూ ఎవరూ లేరు.. కానీ ఎవరికీ నాలాంటి కష్టాలు రాకూడదు. హీరోగా వరుసగా సినిమాలు చేశాను. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు విలన్‌గానూ చేశా. నటుడిగా ఏ పాత్ర వేయడానికైనా నేను సిగ్గుపడను. కానీ సినిమాలు తీసే క్రమంలో సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకున్నా. ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ తిరిగి వాటిని సాధిస్తాననుకున్నా. అనుకున్నది సాధించాను. ఇల్లేంటి, ఏకంగా యూనివర్సిటీనే స్థాపించాను. నేను సొంతంగా బ్యానర్ పెట్టి ఎన్నో హిట్ సినిమాలు తీశాను. కానీ అదే బ్యానర్లో ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. నేను చేసిన సన్నాఫ్ ఇండియా ప్రయోగాత్మక చిత్రం. కానీ మంచు విష్ణు 'జిన్నా' ఎక్స్ట్రార్డినరీ మూవీ. అది ఎందుకు ఫ్లాప్ అయిందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. విష్ణు కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ. చిరంజీవికి, నాకు గొడవలు జరిగాయని పదేపదే రాస్తుంటారు. కానీ మేము ఎన్నోసార్లు ఎదురుపడ్డాం, మాట్లాడుకున్నాం. కాకపోతే మేము భార్యాభర్తల్లాగా పోట్లాడుకుని మళ్లీ కలిసిపోతుంటాం. ఇకపోతే కొన్ని సందర్భాల్లో నా ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేను. ఎన్టీ రామారావు, కృష్ణ మరణించినప్పుడే కాదు ఇటీవల నా కొడుకు మనోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. నా కుటుంబంపై వచ్చే ట్రోల్స్ గురించి నేను పట్టించుకోను' అని చెప్పుకొచ్చారు మోహన్‌బాబు. -
చంపేస్తామని బెదిరించేవారు.. నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి సన్నీ లియోన్ జిన్నా మూవీతో టాలీవుడ్లో అలరించింది. మంచు విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆమెకు ఎదురైన భయానక సంఘటనలను తలుచుకుని భావోద్వేగానికి గురైంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో బెదిరింపులు వచ్చాయని.. నేను తిరిగి ఇండియాకు వస్తానని అనుకోలేదని సన్నీ తెలిపింది. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' నా కెరీర్ ప్రారంభంలో బెదిరింపు మెయిల్స్ వచ్చేవి. చంపేస్తామంటూ సందేశాలు పంపేవాళ్లు. అధిక సంఖ్యలో ఇండియా నుంచి వచ్చేవి. ఇక్కడ ప్రజలు నాపై చాలా కోపంగా ఉన్నారని అనుకున్నా. అవీ నన్ను తీవ్ర ప్రభావితం చేశాయి. అప్పుడు నా వయసు కేవలం 20 ఏళ్లే. ఆ సమయంలో నాకు మంచిచెడులు చెప్పడానికి ఎవరూ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎదురైతే నన్నేం చేయలేవు. ఇప్పుడు నేను మానసికంగా చాలా బలంగా ఉన్నా.' అని ఆమె అన్నారు. -
ఓటీటీలోకి జిన్నా, అప్పటినుంచే స్ట్రీమింగ్!
మంచు విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం జిన్నా. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో రేపటి(డిసెంబర్ 2) నుంచి ప్రసారం కానుంది. తెలుగు, మలయాళ భాషల్లో జిన్నా అందుబాటులోకి రానుందంటూ అధికారిక ప్రకటన వెలువడింది. సినిమా కథ విషయానికి వస్తే జిన్నాలో హీరో పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. షార్ట్‌కట్‌గా జిన్నా అని పిలుచుకుంటారు. హీరో అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అలాంటప్పుడు జిన్నా తన అప్పు ఎలా తీర్చాడనేదే కథ. The endlessly entertaining movie is all set to entertain you on @PrimeVideoIN 🤩 from tomorrow. Just a day to go and full-on entertainment #GINNA!#GinnaOnPrime In Telugu & Malayalam.@iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth pic.twitter.com/9Jn2rESSH0 — AVA Entertainment (@avaentofficial) December 1, 2022 చదవండి: కాలితో ఒక్క తన్ను తన్నిన కీర్తి, షాక్‌లో హౌస్మేట్స్ అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్ కౌర్ -
జంపలకిడి జారు మిఠాయి సింగర్‌ని కలిసిన మంచు మనోజ్..
జంపలకడి జారు మిఠాయా.. సోషల్ మీడియా ఫాలో అవుతున్న వారికి ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జిన్నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సింగర్ భారతమ్మ పాడిన ఈ పాట నెట్టింట ఎంతగానో వైరల్ అయ్యింది. సాధారణంగానే సినిమా పాటలకు, జానపథ పాటలకు ఎంతో తేడా ఉంటుంది. ఈ మధ్యకాంలో జానపథ పాటలకు ఆడియెన్స్‌లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇక జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు స్వయంగా సింగర్ భారతమ్మని పరిచయం చేయడమే కాకుండా స్టేజి మీదకి పిలిచి ఆవిడ మా ఊరి నుంచి వచ్చారు పాట పాడతారు అంటూ ఎంకరేజ్ చేశారు. ఇక జంపలకడి జారు మిఠాయి.. అంటూ భారతమ్మ పాడిన ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరోవైపు ట్రోల్స్ కూడా అదే రేంజ్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రీసెంట్గా ఈ సాంగ్‌కు రీమిక్స్ యాడ్ చేసి ఇన్‌స్టాలో రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో హీరో మంచు మనోజ్ తాజాగా సింగర్ భారతమ్మను కలిశారు. ఆమెతో జంపలకడి జారు మిఠాయి పాట పాడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. Happy Birthday @iVishnuManchu anna :) Be positive and stay healthy always 🙌🏽❤️ #HBDVishnuManchu #JambaLakadiJaaruMittaya pic.twitter.com/elhBkboqHE — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 23, 2022 -
అందంతో కట్టి పడేస్తున్న ‘జిన్నా’ భామ సన్నీ లియోన్.. ఫోటోలు వైరల్
-
Ginna: ‘జిన్నా’ హిందీ డబ్బింగ్ రైట్స్‌కు రూ.10 కోట్లు!
ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21న విడుదైంది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. థియేటర్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఈ సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు కూడా అదే రోజు విడుదల కావడంతో ‘జిన్నా’కు ఆశించిన కలెక్షన్స్ రాలేకపోయాయి. అయితే ‘జిన్నా’మాత్రం మంచు ఫ్యామిలీకి మంచి లాభాలే తెచ్చిపెట్టినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు సమాచారం. ‘జిన్నా’ కంటే ముందు మంచు విష్ణు నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. దానికి తోడు ‘జిన్నా’లో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించడంతో దాదాపు రూ.10 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడుపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రూ. 15 కోట్లతో జిన్నా సినిమాను నిర్మించారు. ఒక హిందీ డబ్బింగ్ ద్వారానే రూ.10 కోట్లు వచ్చాయి. ఇక డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్స్, ఆడియో రైట్స్.. అన్ని కలుపుకుంటే బడ్జెట్ కంటే ఎక్కువే వచ్చాయట. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారా ఎక్కువ లాభం వచ్చిందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. -
'జిన్నా' మూవీ రివ్యూ
టైటిల్: జిన్నా నటీనటులు: మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిశోర్, సునీల్, నరేశ్, రఘుబాబు, సత్యం రాజేశ్, చమ్మక్ చంద్ర,సద్దాం తదితరులు నిర్మాణ సంస్థలు: అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాతలు: మోహన్‌బాబు, మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: ఇషాన్ సూర్య సంగీతం: అనూప్ రూబెన్స్ సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు ఎడిటర్: చోటా కే ప్రసాద్ విడుదల తేది: అక్టోబర్ 21, 2022 మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా 'జిన్నా'. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్స్‌గా నటించారు. స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. మరి ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయి? ఆడియెన్స్‌ను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం. జిన్నా కథ ఏంటంటే.. గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా తన స్నేహితులతో కలిసి టెంట్‌హౌస్ నడుపుతుంటాడు. అప్పుచేసి మరీ టెంట్‌హౌస్ పెడతాడు. అయితే అతను టెంట్హస్ వేస్తే పెళ్లిళ్లు ఆగిపోతుంటాయి. ఇంకోవైపు అంతకంతకూ అప్పు పెరిగిపోతుంటుంది. మరోవైపు ఓ గుండా దగ్గర జిన్నా అప్పులు చేయడంతో దాన్ని తిరిగి తీర్చలేక పరారీలో ఉంటాడు. చివరికి ఆ గుండా జిన్నాని పట్టుకొని అప్పు తీర్చడానికి ఓ షరతు పెడతాడు. అదేంటంటే.. తన సోదరిని వివాహం చేసుకుంటే అప్పు మొత్తం తీర్చేసినట్లే అని కండీషన్ పెడతాడు. ఇదే సమయంలో అమెరికా నుంచి వచ్చిన జిన్నా చిన్ననాటి స్నేహితురాలు రేణుక(సన్నీలియోన్)ఊర్లోకి దిగుతుంది.దాంతో జిన్నా పరిస్థితి మారుతుంది. అప్పులు తీరిపోతాయి. ప్రెసిడెంట్ అవ్వాలన్నా జిన్నా కోరిక కూడా తీరబోతుంది. అయితే రేణుకతో పెళ్లికి రెడీ అయిన జిన్నా.. తాను ప్రేమించిన పచ్చళ్ల స్వాతి (పాయల్ రాజ్‌పుత్)తో కలిసి వేసిన పథకం ఏంటి? చివరకు జిన్నా ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగితా కథ. ఎవరెలా నటించారంటే.. జిన్నాగా మంచు విష్ణు కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించారు. కొన్ని సన్నివేశాలు ఢీ సినిమాను గుర్తుచేస్తాయి.యాక్షన్, కామెడీలో తన స్టైల్లో మెప్పించాడు. పాయల్ రాజ్‌పుత్ చేసిన స్వాతి పాత్ర రొటీన్‌గా అనిపించినా తన అందంతో ఆకట్టుకుంటుంది. సన్నీలియోన్ పాత్ర అందరిని మెస్మరైజ్ చేస్తుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ చేశాక, ఆమె పాత్ర కాస్త తేలిపోయినట్లు అనిపిస్తుంది. మిగతా పాత్రలు పోషించిన సురేశ్, నరేశ్, రఘుబాబు, సునీల్, ‘సత్యం’ రాజేశ్, గౌతంరాజు, చమ్మక్ చంద్ర, ‘వెన్నెల’ కిశోర్, భద్రం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.బిగ్‌బాస్ ఫేమ్ దివి, త్రిపురనేని చిట్టి గెస్ట్ అప్పీరియన్స్‌లో కనిపించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. ఎలా ఉందంటే..జిన్నా కథ మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేసేంత ఫ్రెష్‌నెస్ ఏమీ లేదు కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. అప్పటిదాకా ఓ కామెడీ, ఓ సాంగ్, ఓ ఫైట్ అన్నట్టుగా పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సాగుతున్న కథకు ఇంటర్వెల్లో అదిరిపోయే ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం సెకండాఫ్‌పై క్యూరియాసిటీని పెంచింది. సన్నీ లియోన్ తన నటనతో ఆశ్చర్యపరుస్తుంది. సెకండాఫ్‌ను కొంచెం డిఫరెంట్‌గా డీల్ చేసే ప్రయత్నం చేశారు.వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్రల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని బలవంతపు కామెడీ సీన్స్ ఉన్నట్లు అనిపించడంతో కోర్ ఎమోషన్ సరిగ్గా పండలేదు.ఇందులో మంచు విష్ణు వేసిన డైలాగ్స్ కొన్ని ట్రోలర్లకు కౌంటర్లుగా అనిపించింది. నన్ను ట్రోల్ చేస్తే ఓకే గానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. సాంకేతికంగా జిన్నా పర్వాలేదనిపిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
‘జిన్నా’ నవ్వి నవ్వి కడుపునొస్తుంది: మంచు విష్ణు
‘‘జిన్నా’ ని రెండు షోలు ప్రివ్యూ వేశాం.. చూసిన వారందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. మా అమ్మ, అత్తగార్లు కూడా చప్పట్లు కొట్టేసి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అప్పుడు వచ్చిన నమ్మకంతోనే ‘జిన్నా’ని ఎక్కువగా ప్రమోట్ చేశాను. నేను, ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర సెకండాఫ్‌లో కడుపుబ్బా నవ్విస్తాం.. నవ్వి నవ్వి ప్రేక్షకులకు కడుపునొస్తుంది’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జిన్నా’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంచు విష్ణు పంచుకున్న విశేషాలు... ►మా నాన్న(మోహన్ బాబు) ‘జిన్నా’ చిత్రాన్ని ‘ఢీ’ సినిమాతో పోల్చారు. ‘ఢీ’ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాం. విడుదలయ్యాక అది కల్ట్ సినిమా అయింది. ‘ఢీ’లో ఇంటర్వెల్‌కు అంత సర్ప్రైజ్ అనిపించదు. కానీ, ‘జిన్నా’లో ఇంటర్వెల్‌కు అందరూ సర్ప్రైజ్ షాక్ అవుతారు. అయితే ‘జిన్నా’’ మూవీ ‘ఢీ’ రేంజ్లో సక్సెస్ అవుతుందా? లేదా? అనేది చూడాలి. ∙యాక్షన్ కామెడీ జానర్లో నేను చేసిన సినిమాలన్నీ హిట్లు ఇచ్చాయి. మధ్యలో వేరే జానర్స్ ప్రయత్నించి, తప్పు చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ‘జిన్నా’ చేశా. ప్రతి సినిమా బాగుండాలనే అందరూ అనుకుంటాం.. కానీ, ఫలితాన్ని ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ∙‘జిన్నా’లో నా పాత్ర పేరు గాలి నాగేశ్వరావు. జీనా అని పిలిస్తే బాగుండదు.. అందుకే జిన్నా అని పెట్టాం. జిన్నా అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. ఏ పెళ్లికి టెంట్ వేసినా ఆ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు అప్పు ఎలా తీర్చాడు?. అన్నదే ఈ చిత్ర కథ. ∙ ► ‘పెదరాయుడు, రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాలకు ఏమైనా ప్రిపేర్ అయ్యారా? అని నాన్నని అడిగాను. ‘ప్రిపరేషన్ లేదు.. మన పాత్ర చెబుతారు.. దాన్నే దృష్టిలో పెట్టుకుని చేయాలి’ అని ఆయన చెప్పడంతో షాక్ అయ్యాను. ‘జిన్నా’ కోసం నేను చిత్తూరు యాస మాట్లాడాల్సి వచ్చింది.. దాని కోసం కష్టపడ్డాను. జి.నాగేశ్వరరెడ్డిగారు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి శ్రీనువైట్లగారి అసిస్టెంట్ సూర్యను డైరెక్టర్‌గా తీసుకున్నాం. ► ఈ చిత్రానికి మూల కథ జి.నాగేశ్వరరెడ్డిగారు అందించారు. ‘జిన్నా’ కోసం కోన వెంకట్‌గారు ప్రతి రోజూ పని చేశారు.. ఆయనకు చాలా థ్యాంక్స్. మనకు జనాలతో కనెక్షన్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండక తప్పదు. అయితే ఇందులో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సిందే. ∙‘జిన్నా’తో నా కెరీర్లో ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు అనూప్ రూబె¯Œ ్స. ఈ చిత్రంలో చిన్నపిల్లల ట్రాక్‌ని నా కుమార్తెలు అరియానా, వీవీయానా పాడాలనే ఆలోచన నాదే. దీనిపై అనూప్ తొలుత సందేహపడ్డా, వారి పాట విన్నాక సంతోషించాడు. భవిష్యత్తులో వాళ్లు మంచి సింగర్లు కావాలని కోరుకుంటున్నాను.. కానీ వాళ్లకి నటీమణులు కావాలని ఉంది. ►నేను నటించే సినిమాలు మా అమ్మ, నా పిల్లలతో కలిసి చూసేలా ఉండాలనుకుంటున్నా. ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్లు డ్యాన్స్ విషయంలో బాగా కష్టపెట్టారు. నా కెరీర్లో బెస్ట్ సాంగ్స్, డ్యాన్స్‌లు ‘జిన్నా’ లో ఉన్నాయి. ► కొన్ని సినిమాల రీమేక్ హక్కులు కొన్నాను. మా ప్రొడక్షన్లో వేరే హీరోలతోనూ ఆ సినిమాలు చేస్తాను. నవంబర్‌లో ఆ చిత్రాల గురించి ప్రకటిస్తాను. ప్రస్తుతానికి యాక్షన్ కామెడీ జానర్లోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను. శ్రీను వైట్లగారు, నేను కలిసి చేయనున్న చిత్రం జనవరి లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చర్చలు జరుగుతున్నాయి. ► ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) టీమ్‌లో అంతా మంచి వాళ్లున్నారు. వారు బాగా పని చేస్తుండటంతో నేను ఓ వైపు హీరోగా, మరోవైపు ‘మా’ అధ్యక్షునిగా ప్రశాంతంగా ఉంటున్నాను. ‘మా’ అధ్యక్షునిగా మళ్లీ పోటీ చేయనన్నాను. నా కంటే ఇంకా మంచి ప్రెసిడెంట్ రావొచ్చేమో? ఒక వేళ ఇండస్ట్రీ పెద్దలు మళ్లీ నన్ను చేయమంటే చేస్తాను. అయితే ఈసారి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మంచిదని నా అభిప్రాయం. -
Ginna Twitter Review: ‘జిన్నా’మూవీ ట్విటర్ రివ్యూ
మంచు విష్ణుటైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ‘మోసగాళ్లు’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి.. తనకు అచ్చొచ్చిన కామెడీ యాక్షన్‌తో మళ్లీ వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు.ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అవేంటో చూడండి. Story okish and lil sloppy .. But when vishnu meets sunny Adrenaline kicks in … Action sequences and visuals are awesomest 🔥🔥 Vishnu’s perfection in terms of diction n super heroic swag 👌👌 Climax🔥🙏 3.23/5#Ginna @iVishnuManchu proud of u anna..super undi movie — pakash raj pspk (@pakash787791) October 20, 2022 ‘కథ ఫర్వాలేదు. సినిమా కాస్త నెమ్మదించింది. కానీ, సన్నీని విష్ణు కలిసినదగ్గర నుంచి కిక్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ అదిరిపోయాయి’ అంటూ 3.23 రేటింగ్ ఇచ్చాడు ఓ నెటిజన్. I completed watching the #Ginna Movie , @iVishnuManchu comeback with his comedy timing like in #dhee, those who went for #sunnyleone will definitely not feel regret , #vishnumanchu did a right choice selecting horrorcomedy zonner,rest is mouth talk. Rating:3/5⭐ Congrats team❤️ — Movie Buff (@UnitedTwood2108) October 20, 2022 #ginna Positive: @iVishnuManchu looks fun nd superb.@SunnyLeone looks beautiful and impressive.@starlingpayal scroes well.Gud Casting.@anuprubens music are backbone.Dances are good.Comedies are worked well. Negative: 1 hlf feel length. Verdict:Fun Entertainment Rating:3.0/5 — pakash raj pspk (@pakash787791) October 21, 2022 #ginna sunny Leone 🔥 intervel twist is shocking Awesome songs and dance . Anup bgm for sunny is goosebumps #randaka #randaka — vishnu admirer (@ranap03816208) October 21, 2022 మరోవైపు ఈ సినిమాపై మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఆగడం లేదు.. కావాలనే కొంతమంది నెగిటివ్‌గా ట్వీట్లు చేస్తున్నారు. సినిమా బాగోలేదంటూ విషప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు. ఓ పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూ ఇస్తున్నారని, ఇది తాను ముందే ఊహించానని విష్ణు ట్వీట్ చేశాడు. As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj — Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022 -
జిన్నా రిలీజ్ కాకముందే నెగెటివ్ రివ్యూలు: మంచు విష్ణు వార్నింగ్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జిన్నా. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. అయితే జిన్నా రిలీజ్ కాకముందే సినిమా బాగోలేదంటూ కొందరు విషప్రచారం చేస్తున్నారు. జిన్నాపై నెగెటివ్ రివ్యూలు ఇస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై మండిపడ్డాడు మంచు విష్ణు. ఆ ఛానళ్ల పేర్లు, వాటి యూఆర్ఎల్స్ ను ట్విటర్లో షేర్ చేసిన మంచు త్వరలోనే వాటిని మూసేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. 'ఊహించిందే జరిగింది. ఇదిగో పెయిడ్ బ్యాచ్‌ను మీ ముందుకు తీసుకువచ్చాను. జిన్నా ఇంకా రిలీజ్ అవనే లేదు, వీళ్లేమో అప్పుడే నెగెటివ్ రివ్యూలు ఇవ్వడం మొదలు పెట్టేశారు. ఎందుకింత ద్వేషం? త్వరలోనే మేము ఆ ఛానళ్లను మూసేస్తామని వారు గ్రహిస్తారని ఆశిస్తున్నాను' అని ట్వీట్లో రాసుకొచ్చాడు. కాగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ మూవీ రేపు తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. As expected. I am calling out the ‘paid batch’. GINNA hasn’t released and these guys have started giving negative reviews. Why so much hatred???? 🙄. I hope they realize that we will shut their channels down soon. pic.twitter.com/6FJ1xV4vaj — Vishnu Manchu (@iVishnuManchu) October 20, 2022 చదవండి: దరిద్రం ఏంటంటే మనవాళ్లకు ఆ హీరోయిన్సే కావాలి కొత్త ఫ్లాట్ కొన్న బుల్లితెర నటి -
దీపావళికి థియేటర్స్‌లో సందడి చేయబోయే సినిమాలివే..
పండగ సీజన్ అనగానే సినీ ప్రేక్షకులు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇప్పటికే దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్దబరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో మూవీపై బజ్ ఏర్పడింది. మరి జిన్నాపైనే ఆశలు పెట్టుకున్న విష్ణు ఈ సినిమాతో హిట్ కొటతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవుళే’ కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికాసింగ్, వాణిబోజన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది. డిఫరెంట్ జానర్‌తో వస్తున్న విశ్వక్ ఓరి దేవుడా అంటూ ఈనెల21న ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. దీపావళి కానుకగా రాబోతున్న మరో సినిమా ప్రిన్స్. శివ కార్తికేయన్,మారియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ రెండు భాషలలోనూ ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతుంది.ఇందులో శివకార్తికేయన్ స్కూల్ టీచర్‌గా నటించారు. నటుడు ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ప్రిన్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ సైతం రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇక మరో తమిళ హీరో కార్తి కూడా ఈసారి దీపావళి బరిలోకి దిగుతున్నారు. కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్. పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. రాశిఖన్నా,రజీషా విజయన్ ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. నటి లైలా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఇప్పటికే కార్తికి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. మరి ఈ సినిమాతో కార్తికి ఇంకో హిట్టు పడినట్లేనా అన్నది చూద్దాం. -
ట్రోలింగ్‌పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు విష్ణు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తనపై ట్రోలింగ్ చేస్తున్నది ఎవరన్నదానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ బడా హీరో తనను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయిస్తున్నట్లు విష్ణు కొన్నిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బడా హీరో ఎవరన్నది బయటపెట్టే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. ఆ హీరో ఎవరో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, తన నోటితో చెప్పాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. 'మా ఎలక్షన్స్ టైం నుంచి నాపై ట్రోలింగ్ మొదలయ్యింది. మనుషులను పెట్టి పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడు. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని తెలిసింది. అతని ఎవరో మీడియాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఆయన పేరు రివీల్ చేయడం లేదు' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యల వెనకున్న ఆ బడా హీరో ఎవరన్నదానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. -
విష్ణు నన్ను అలా అనడంతో షాకయ్యా: మంచు మోహన్ బాబు
తన తనయుడు, హీరో మంచు విష్ణు అన్న మాటలకు తాను షాకయ్యానన్నాడు నటుడు మంచు మోహన్ బాబు. ఆదివారం జరిగిన జిన్నా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 50 ఏళ్ల తన నటన జీవితంలో తనని ఎవరు ఇలా అనలేదన్నాడు. ‘నేను దాదాపు 560 చిత్రాల్లో నటించా, 75 సినిమాలు నిర్మించా. మా అన్నగారు ఎన్టీఆర్ మూవీ ఫంక్షన్ల్లో కానీ, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు గారి సినిమా ఫంక్షన్లలో ఇన్ని నిమిషాలే మాట్లాడాలని నాకెవరు చెప్పలేదు. కానీ విష్ణు నాకు చెప్పాడు. ఎంతసేపు మాట్లాడాలనేది అంత పెద్దవాళ్లే నాతో ఎప్పుడూ చెప్పలేదు. కానీ విష్ణు అలా అనడంతో షాకయ్యా. అంటే నేను వేదికపై ఎక్కువగా మాట్లాడతానా? అనిపించింది’ అని మోహన్ బాబు అన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే అనంతరం జిన్నా కోసం విష్ణు చాలా కష్టపడ్డాడని, ఏ సినిమాకు చేయని రిస్క్ షాట్స్ ఈ చిత్రంలో చేశాడంటూ తనయుడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నిలియోన్లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రుపొందిన ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందించారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే
థియేటర్లలో దసరా సందడి ముగిసింది. ఇక దీపావళి హంగామా మొదలు కాబోతోంది. గతవారం చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న బాక్సాఫిస్ దీపావళికి పెద్ద సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వారం జిన్నా, ఓరి దేవుడా వంటి ఆసక్తికర సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో సైతం థియేటర్లో అలరించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తానికి సినీ ప్రియులకు దీపావళి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఇటు థియేటర్లు, అటు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీ వచ్చేస్తున్న చిత్రాలేవో చూద్దాం! మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’ (Sardar). రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. చుంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో జాతిరాత్నాలు ఫేం అనుదీప్ కేవి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. విశ్వక్సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. టాలీవుడ్ అగ్ర హీరో విక్టరి వెంకటేశ్ ఈ సినిమాలో అతిథిగా కనిపించనున్నారు. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21 థియేటర్లోకి రాబోతోంది. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. లియన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 21 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సోని లివ్‌లో అక్టోబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ * అమ్ము (తెలుగు) అక్టోబరు 19 * ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 * ఫోర్ మోర్ షాట్స్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 నెట్‌ఫ్లిక్స్ * ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ (హాలీవుడ్) అక్టోబరు 19 * బార్బేరియన్స్ (వెబ్‌సిరీస్-2) అక్టోబరు 21 * ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 జీ5 * ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21 ఆహా * పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21 -
మా నాన్నలో నాకు నచ్చనిది అదే: మంచు విష్ణు
మంచు విష్ణు తాజాగా నటిస్తున్న చిత్రం జిన్నా. షూటింగ్ అనంతరం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 21వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ ప్రమోషన్స్ భాగంగా ఆదివారం జిన్నా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది ఈ చిత్రం బృందం. ఈ సందర్బంగా హీరో మంచు విష్ణు జిన్నా మూవీ టీంకు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తన తండ్రి, విలక్షణ నటుడు మోహన్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: హన్సిక రాయల్ వెడ్డింగ్, పెళ్లి జరిగేది ఎక్కడంటే? ఈ మేరకు విష్ణు మాట్లాడుతూ.. ‘జిన్నా మూవీ నా మనసుకి మరింత దగ్గరైంది. ఈ సినిమాకు అనూబ్ రూబెన్స్ అద్భుతమైన సంగీతం అందించారు. నా కెరియర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదిరింది. అంతేకాదు నా పిల్లలు అరియానా-వివియానాలు ఓ పాట పాడటం విశేషం. ఇందుకు అనూప్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. అనంతరం తన తండ్రి మోహన్ బాబును ఉద్దేశిస్తూ... ఆయన నుంచి చాలా విషయాల్లో స్ఫూర్తి పొందాను అని అన్నాడు. ఒకటి తప్ప ఆయన నుంచి చాలా నేర్చుకున్నానన్నాడు. అదే ఆయన కోపమని, ఆయనలో తనకు నచ్చనిది కూడా అదేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మంచు విష్ణు తాజా చిత్రం 'జిన్నా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమానే నా ఊపిరి
‘‘సినిమానే మన ఊపిరి అని మా గురువు దాసరి నారాయణరావుగారు అనేవారు.. అలా సినిమానే మా ఊపిరి.. నా ఊపిరి. కళామతళ్లి మాకు భోజనం పెట్టింది. ‘జిన్నా’ సినిమా గొప్ప హిట్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య దర్శకత్వం వహించారు. అవ్రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జిన్నా జాతర’ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ–‘‘జిన్నా’లో విష్ణు ఎంతో రిస్కీ షాట్స్ చేశాడు.. జీవితంలో అలాంటి సన్నివేశాలు చేయడం మంచిది కాదని చెప్పాను. ‘ఢీ’ కంటే పది రెట్ల హిట్‌ని ‘జిన్నా’ అందుకోవాలి. విష్ణుని ఛోటా కె.నాయుడు అద్భుతంగా చూపించాడు. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి థ్యాంక్స్. అరియానా– వీవీయానా ఇంత అద్భుతంగా పాడతారని కలలో కూడా ఊహించలేదు. ఈ సినిమా ద్వారా సూర్య గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. నాకు ఎన్నో హిట్ పాటలకు డ్యాన్స్‌లు సమకూర్చిన ప్రభుదేవా ‘జిన్నా’ లో విష్ణుకి నృత్యరీతులు సమకూర్చారు.. మా ఫ్యామిలీలో ఒకడిగా, మాపై ఉన్న గౌరవంతో తను డబ్బు తీసుకోకుండా చేసినందుకు థ్యాంక్స్’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘జిన్నా’ సినిమాకి ముందుగా కోన వెంకట్‌గారికి థ్యాంక్స్. ఛోటాగారితో ఎప్పటి నుంచో పనిచేయాలని అనుకుంటున్నాను.. ఇప్పుడు కుదిరింది. ‘జిన్నా’ నా మనసుకి బాగా దగ్గరైన సినిమా. నా కెరీర్లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్‌కి థ్యాంక్స్. అరియానా–వీవీయానా తొలిసారి అయినా అద్భుతంగా పాడారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన సూర్యకి థ్యాంక్స్. అందరూ మా సినిమాని చూసి, మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘జిన్నా’ కథా రచయిత జి.నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ–‘‘జిన్నా’ రషెస్ చూసినప్పుటి నుంచి ఒక బ్లాక్‌బస్టర్ వైఫై నా చుట్టూ తిరుగుతోంది.. ఇది వందశాతం నిజం. సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీలో హిట్ చూసిన ఎవరైనా సరే.. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ బాబు, చిరంజీవిగార్లు.. ఎవరైనా ఫ్లాప్ చూస్తారు.. కానీ, ఫ్లాప్‌ని ఎదుర్కొనే దమ్ము ఉండాలి. ఆ దమ్ము మోహన్‌బాబుగారి ద్వారా విష్ణుకి వచ్చింది.. తను ఎదుర్కొన్నాడు.. ‘జిన్నా’ తో బ్లాక్ బస్టర్ కొడతాడు’’ అన్నారు.‘‘జిన్నా’ సినిమా కాదు.. మా అన్నయ్య(మోహన్‌బాబు)గారు నాపై పెట్టిన బాధ్యత. ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది’’ అన్నారు చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ రైటర్ కోన వెంకట్. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, నటులు అలీ, చమ్మక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జిన్నా మూవీ టీం తో స్పెషల్ చిట్ చాట్
-
పాన్ ఇండియా సినిమాల పై మంచు విష్ణు కామెంట్స్
-
జిన్నా మూవీ నుంచి మాస్ సాంగ్ విడుదల
మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరో హీరోయిన్లుగా ఈషాన్ సర్య దర్శకత్వంలో రపొందిన త్రం ‘జిన్నా’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించిన ఈ త్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘జారు మిఠాయో..’ అనే పాట లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు ఎ. గణేష్ సాహిత్యం అందించగా సింహా, నిర్మలా రాథోడ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫర్. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే–క్రియేటివ్ ప్రొడ్యూసర్: కోన వెంకట్, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్‌లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది. యాక్షన్ టపాసులు, ప్రేమ కాకరపువ్వొత్తులు, నవ్వుల చిచ్చుబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక పండగ సందర్భంగా వస్తున్న సినిమాల వివరాల్లోకి ఓసారి వెళదాం. దీపావళికి యాక్షన్ ‘జిన్నా’గా వస్తున్నారు మంచు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్‌ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్క్‌లు తీసుకున్నాడు? ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయ్యింది? అనేది సినిమా కథ. డా. మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. మరోవైపు ‘ఓరి దేవుడా..!’ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేశ్ నటించారు. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగుకి పరిచయమవుతున్న చిత్రం ఇది. ‘వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందా..!’ అనే డైలాగ్ ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్లో ఉంది. సో.. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ ‘సర్దార్’గా రానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా చేయగా, కీలక పాత్రలో లైలా నటించారు. ఓ గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో ‘సర్దార్’ సాగుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జిన్నా’, ఓరి దేవుడా..!’, ‘సర్దార్’ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ‘ప్రిన్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా చేశారు. ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. సునీల్ నారంగ్, డి. సురేబాబు, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫార్మ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు పండగ రేసులో నిలిచే అవకాశం ఉంది. -
జిన్నాలో సునీల్ పాత్ర ఇదే.. పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ టీం
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. అలాగే దసరా సందర్భంగా విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీల్‌కు సంబంధించిన లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో సునీల్ ‘పెంచలయ్య’ పాత్రలో కనిపించనున్నాడట. పెళ్లి కోడుకు గేటప్‌లో సునీల్ భయపడుతూ కనిపించాడు. ఆయన లుక్ చూస్తుంటే సునీల్ ఈ చిత్రంలో కమెడియన్‌గా అలరించబోతున్నాడు తెలుస్తోంది. లుక్ చూస్తుంటే ఇందులో ఆయన కమెడియన్‌గా అలరించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. జి. నాగేశ్వర రెడ్డి కథను అందించిన ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. -
దసరాకు మంచు విష్ణు సర్ప్రైజ్.. జిన్నా ట్రైలర్ అవుట్
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. దసరా కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృదం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఇవాళ విడుదలై ట్రైలర్ చూస్తే కామెడీ, హార్రర్‌ను తలపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
18 యూట్యూబ్ చానళ్లపై కేసు పెడుతున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. చదవండి: మహేశ్ బాబు, కృష్ణలను పరామర్శించిన చిరంజీవి ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జిన్నా మూవీ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. ‘అక్టోబర్ 21న జిన్నా మూవీని రిలీజ్ చేయబోతున్నాం. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ చేస్తాం. నాకు అక్టోబర్ 21 ఎంతో స్పెషల్ డే’ అని చెప్పాడు. అనంతరం తన కుటుంబంపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై విష్ణు స్పందించాడు. సినిమా ఇండస్ట్రీలో అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్లమని, మీడియా పెరగడం, కొత్తవాళ్లు రావడంతో సైడ్ ట్రాక్ పట్టిందన్నాడు. ఆ తర్వాత తన తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రలర్స్‌పై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్ ‘ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించాను. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తా. అలాగే నన్ను, నా కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్న 18 యూట్యూబ్ చానళ్లపై కూడా కేసులు పెడుతున్నా. ఈ ట్రోల్స్‌ని సాధారణంగా మేం పట్టించుకోము. కానీ జవాబు దారితనం కోసం కేసులు పెడుతున్నా’ అని విష్ణు అన్నాడు. -
వెనక్కి తగ్గిన మంచు విష్ణు.. 'జిన్నా' వాయిదా?
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అక్టోబర్5న దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దసరా బరిలో ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానుండటంతో ఇలాంటి సమయంలో జిన్నా మూవీని రిలీజ్ చేయడం కరెక్టు కాదని భావించినా మేకర్స్ రెండు వారాల పాటు సినిమాను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.