థియేటర్లలో దసరా సందడి ముగిసింది. ఇక దీపావళి హంగామా మొదలు కాబోతోంది. గతవారం చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న బాక్సాఫిస్ దీపావళికి పెద్ద సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వారం జిన్నా, ఓరి దేవుడా వంటి ఆసక్తికర సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో సైతం థియేటర్లో అలరించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తానికి సినీ ప్రియులకు దీపావళి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఇటు థియేటర్లు, అటు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీ వచ్చేస్తున్న చిత్రాలేవో చూద్దాం!
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’ (Sardar). రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. చుంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్‌లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో జాతిరాత్నాలు ఫేం అనుదీప్ కేవి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది.
విశ్వక్‌సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. టాలీవుడ్ అగ్ర హీరో విక్టరి వెంకటేశ్ ఈ సినిమాలో అతిథిగా కనిపించనున్నారు. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21 థియేటర్లోకి రాబోతోంది. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. లియన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే..
నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 21 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది.
శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మదర్‌సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సోని లివ్‌లో అక్టోబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్
* అమ్ము (తెలుగు) అక్టోబరు 19
* ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
* ఫోర్ మోర్ షాట్స్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
నెట్‌ఫ్లిక్స్
* ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ (హాలీవుడ్) అక్టోబరు 19
* బార్బేరియన్స్ (వెబ్‌సిరీస్-2) అక్టోబరు 21
* ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21
జీ5
* ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21
ఆహా
* పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21
Comments
Please login to add a commentAdd a comment