Ori Devuda
-
‘ఓరి దేవుడా..!’ అప్పుడే ఓటీటీలోకి... స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఆశాభట్ మరో హీరోయిన్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ రోజు(నవంబర్ 11) అర్థరాత్రి 12 గంటలకు ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా సంస్థ ట్విటర్ వేదికగా తెలియజేసింది. . ‘దేవుడా ఓ మంచి దేవుడా తినడానికి పాలకూర పప్పు, ఆలూ ఫ్రై ఇచ్చావ్. నాలాగే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్లందరి కోసం చూడడానికి ఆహాలో ఓరి దేవుడా సినిమాను ఇచ్చావు’ అంటూ ఓరి దేవుడా ఓటీటీ రిలీజ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆహా. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. Devuda o manchi devuda tinadaniki paalakura pappu ichhavu, alu fry ichhavu, nalage e prapancham lo unna vallandari kosam chudadaniki aha lo "Oridevuda" Ichhavu. Maa PD meeku koncham kottaga anipinchochhu. #OriDevudaOnAHA Premieres tonight at 12am. @Dir_Ashwath @VenkyMama pic.twitter.com/kbeYI3Ea15 — ahavideoin (@ahavideoIN) November 10, 2022 -
‘ఓరి దేవుడా’కు వెంకి షాకింగ్ రెమ్యునరేషన్!, 15 నిమిషాలకే అన్ని కోట్లా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓరి దేవుడా’. తమిళ బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఓ మై కడవులే’కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కింది. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తమిళంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను తెలుగులో వెంకటేశ్ చేశారు. కథను మలుపు తిప్పే దేవుడి పాత్రలో ఆయన కనిపించారు. కనిపించింది కొద్ది నిమిషాలే అయినా సినిమాకు హైలెట్‌గా నిలిచారు. చదవండి: నటుడిని అసలు ప్రేమించొద్దని చెప్పా: జాన్వీ కపూర్ అయితే ఈ సినిమా కోసం వెంకి భారీగానే పారితోషికంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కనిపించింది 15 నిమిషాలే యంగ్ హీరో రెమ్యునరరేషన్ స్థాయిలో ఆయనకు మేకర్స్ భారీ మొత్తం చెల్లించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓరి దేవుడా సినిమాలో వెంకి తన పాత్ర కోసం 5 రోజుల కాల్షీట్ ఇచ్చారట. ఈ 5 రోజుల షూటింగ్, 15 నిమిషాల నిడివికి ఆయన దాదాపు రూ. 3 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ సినిమాలో ఆశ భట్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. చదవండి: Mega 154 Title: మెగా 154 టైటిల్ వచ్చేసింది, ఆకట్టుకుంటున్న చిరు మాస్ లుక్ -
ఓరి దేవుడా అద్భుతాలు సృష్టిస్తుంది
‘‘ఓరి దేవుడా’ చిత్రం అందరి మనసుల్ని టచ్ చేస్తుంది. ఎంటర్టైనింగ్గా రూపొందిన మా సినిమా ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా బాగా నచ్చింది’’ అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరి దేవుడా’. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ప్రసాద్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ–‘‘ఓరి దేవుడా’ టీమ్ అంతా మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుంది’’ అన్నారు. ‘‘ఓరి దేవుడా’ ప్లెజెంట్ లవ్ స్టోరీ.. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక. ‘‘యువ ప్రేక్షకులే కాదు.. కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారు’’ అన్నారు అశ్వత్ మారిముత్తు. హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్, మ్యూజిక్ డైరెక్టర్ లియోన్, నటుడు వెంకటేష్ కాకమాను తదితరులు మాట్లాడారు. -
'ఓరి దేవుడా' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
' ఓరి దేవుడా ' ఓటీటీ పార్ట్నర్ అదేనా?
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇవాళ విడుదలైన థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను ఖాయం చేసుకుందని సమాచారం. (చదవండి: ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్) ఈ రొమాంటిక్ కామెడీ, డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'ఆహా' సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. ఆశా భట్, రాహుల్ రామకృష్ణ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
‘ఓరి దేవుడా..!’ ట్వీటర్ రివ్యూ
అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా..!’. ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా నేడు(అక్టోబర్ 21) విడుదలైంది. తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవులే’చిత్రానికి ‘ఓరి దేవుడా..!’తెలుగు రీమేక్. అక్కడ దేవుడి పాత్రని విజయ్ సేతుపతి పోషిస్తే.. తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌ని కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘ఓరిదేవుడా..!’పై హైక్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఓరి దేవుడా..!’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. పెళ్లి తర్వాత కొన్నాళ్లకే అపార్థాలతో విడిపోవాలకొని కోర్టు మెట్లు ఎక్కిన ఓ జంట జీవితాలలోకి దేవుడు వచ్చాక ఎలాంటి పరిణామాలు చేసుకున్నాయి. వారి సమస్యలను దేవుడు ఎలా పరిష్కరించాడు అనేదే ఈ సినిమా కథ. ఫస్టాఫ్ చాలా కామెడీగా, సెకండాఫ్ చాలా ఎమోషనల్‌గా సాగుతుందని చెబుతున్నారు. థియేటర్స్‌లో ఒక్కసారి చూడొచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #OriDevuda Overall A Pretty Decent Rom-Com with a Passable 1st half and Good 2nd Half! First half is passable and could’ve had better comedy but the heart of the film is the emotion in the later part which works very well along with good music. Easy One-Time Watch. Rating: 3/5 — Venky Reviews (@venkyreviews) October 21, 2022 #OriDevuda Decent watch though already watched OMK. @VishwakSenActor is very good in his role. Biggest asset is @leon_james Music which is better than Tamil version. He is the hero of the film. @Dir_Ashwath Well done 👍🏻 — Dead Air Space (@DeadAirSpaces) October 21, 2022 విశ్వక్ షేన్ చాలా బాగా నటించాడని, ఓ మై కడవులే చూసినవారు కూడా ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు. సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయిందని కామెంట్ చేస్తున్నారు. Hit kottesam @VishwakSenActor anna ❤️🔥 Congrats from #ManOfMassesNTR anna fans 💐#OriDevuda #VishwakSen Nenu kuda waiting anna ninnu Tarak anna ni oke stage meedha chudadaniki next ela ayina set cheyyu 💪 pic.twitter.com/Bh9AJpPdH5 — #𝓝𝓣𝓡30ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@tarakloves9999) October 21, 2022 Hit kottesam @VishwakSenActor anna ❤️🔥 Congrats from #ManOfMassesNTR anna fans 💐#OriDevuda #VishwakSen Nenu kuda waiting anna ninnu Tarak anna ni oke stage meedha chudadaniki next ela ayina set cheyyu 💪 pic.twitter.com/Bh9AJpPdH5 — #𝓝𝓣𝓡30ⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@tarakloves9999) October 21, 2022 #OkeOkaJeevitham 🤝 #OriDevuda Life doesn't always give you second chances, so take the first one. — No Woman No Cry (@Kamal_Tweetz) October 21, 2022 Superb first half @VishwakSenActor👍🏻 characters are well written with strong performances #OriDevuda — NTR30 (@kiran_nine) October 21, 2022 Liked it. A well-rounded screenplay but there's a catch. The last act becomes dated and predictable. There's even some meta humor thrown in the end but doesn't help much. #OriDevuda — No Woman No Cry (@Kamal_Tweetz) October 21, 2022 -
హిట్ సినిమాను ప్లాన్ చేయలేం
‘‘నేను ఓ యాక్టర్‌గా అత్యాశ పడకూడదని, తొందరపడకూడదని ఫిక్స్అయ్యాను. కొంతకాలం వరకు డిఫరెంట్, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూనే ఉంటాను. యాక్టర్‌గా కొంత దూరం ప్రయాణించాక.. అంటే నాకు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత బాక్సాఫీస్ నంబర్ ఫార్ములా, స్టార్ కావడం ఎలా? వంటి అంశాలపై దృష్టిపెడతాను. అప్పటి వరకు క్రమశిక్షణతో ఓ ఫ్లోలో సినిమాలు చేసుకుంటూ వెళతాను’’ అని విష్వక్ సేన్ అన్నారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విష్వక్సేన్ హీరోగా, వెంకటేశ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా..!’. ఈ సినిమాలో ఆశాభట్, మిథిలా పాల్కర్ హీరోయిన్స్‌గా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో విష్వక్ సేన్ చెప్పిన విశేషాలు... ► తమిళం చిత్రం ‘ఓ మై కడవులే’ చిత్రానికి ‘ఓరి దేవుడా..!’ సినిమా తెలుగు రీమేక్. ‘ఓ మై కడవులే..’ చిత్రంలో దర్శకునిగా అశ్వత్ ఏమైతే చేయాలేకపోయాడో అవన్నీ ‘ఓరి..దేవుడా..!’ లో చేశాడు. అలా సినిమా అప్‌గ్రేడ్ అయ్యింది. ► వెంకటేశ్‌గారితో వర్క్ చేయడం నా లైఫ్‌లో నేను ఊహించని సర్ప్రైజ్. నా అదృష్టం కూడా. సల్మాన్‌ఖాన్‌గారి సినిమాతో వెంకటేశ్‌గారు బిజీగా ఉండటం వల్లే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా గురించి రామ్‌చరణ్‌గారు మంచిగా మాట్లాడటం సంతోషంగా ఉంది.. అది ఆయన గొప్పదనం. ► ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ వంటి సినిమా చేయొద్దని నాకు చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ యాక్టర్‌గా నాకు ఇంకా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమాయే. ఇక హిట్ సినిమాలును ప్లాన్ చేసి తీయలేం. గొప్ప సినిమాలు ఏవైనా మనల్ని వెతుక్కుంటూనే రావాలి. ► కాల్షీట్స్ సర్దుబాటు కుదరక పోవడం వల్లే ‘హిట్ 2’ చేయలేకపోయా. ‘దాస్ కా దమ్కీ’ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అర్జున్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న సినిమా షూటింగ్లో నవంబరు 3 నుంచి పాల్గొంటాను. ‘గామీ’ సినిమాకు సీజీ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంది. అందుకే ఆలస్యం అవుతోంది. ‘ఫలక్‌నుమాదాస్ 2’ షూటింగ్ వచ్చే ఏడాది చివర్లో ప్రారంభం అవుతుంది. నిర్మాత రామ్ తాళ్లూరిగారితో ఓ సినిమా చేస్తున్నా. కొత్త దర్శకుడు రవితేజ ఈ సినిమాకు వర్క్ చేస్తారు. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఓరి దేవుడా' మూవీ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఆయనతో నటించడం మా అదృష్టం: ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్
‘‘ఓరి దేవుడా’ చిత్రకథ, కథనాలు ప్రేక్షకుల మనసులకు దగ్గరగా ఉంటాయి. ఫ్యామిలీ, యూత్.. ఇలా అన్ని వర్గాల ఆడియన్స్‌ని మా చిత్రం ఎంటర్టైన్ చేస్తుంది’’ అని హీరోయిన్లు మిథిలా పాల్కర్, ఆశా భట్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా వెంకటేష్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి వంశీ కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. పీవీపీ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మిథిలా పాల్కర్, ఆశాభట్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఓ మై కడవులే’ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేసి, ఆ చిత్రాన్ని ‘ఓరి దేవుడా’గా రీమేక్ చేయడం జరిగింది. ఇందులోని ట్విస్టులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాయి. అశ్వత్ అద్భుతంగా తెరకెక్కించారు. వెంకటేశ్ సార్ లాంటి లెజెండ్‌తో నటించడం మా అదృష్టం. ఆయన నటించడం మా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. విశ్వక్ సేన్ అంకితభావంతో పనిచేస్తారు. ఆయనతో నటించడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించారు. దీపావళికి కుటుంబమంతా కలిసి మా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ఇక నటి మిథిలా పాల్కార్ మాట్లాడుతూ.. ‘నేను నటించిన ‘లిటిల్ థింగ్స్’ వెబ్ సిరీస్‌ని రామ్ చరణ్‌లాంటి స్టార్ హీరో, ఆయన సతీమణి ఉపాసనగారు చూడటం ఆనందంగా ఉంది. నా నటనకి ఫ్యాన్ అంటూ ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌చరణ్‌గారు మాట్లాడటంతో నా ఆనందానికి అవధుల్లేవు’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే
థియేటర్లలో దసరా సందడి ముగిసింది. ఇక దీపావళి హంగామా మొదలు కాబోతోంది. గతవారం చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న బాక్సాఫిస్ దీపావళికి పెద్ద సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వారం జిన్నా, ఓరి దేవుడా వంటి ఆసక్తికర సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలో సైతం థియేటర్లో అలరించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందుబాటులోకి రాబోతున్నాయి. మొత్తానికి సినీ ప్రియులకు దీపావళి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు ఇటు థియేటర్లు, అటు ఓటీటీలు ముస్తాబవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీ వచ్చేస్తున్న చిత్రాలేవో చూద్దాం! మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ నటుడు కార్తి కథానాయకుడిగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్దార్’ (Sardar). రాశీఖన్నా, రజీషా విజయన్ కథానాయికలు. చుంకీ పాండే కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్‌కు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు శివ కార్తికేయన్. ‘డాక్టర్’, ‘డాన్’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్లో మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో జాతిరాత్నాలు ఫేం అనుదీప్ కేవి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ప్రిన్స్ మూవీ తెరకెక్కింది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. విశ్వక్సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన చిత్రం ‘ఓరి దేవుడా’. టాలీవుడ్ అగ్ర హీరో విక్టరి వెంకటేశ్ ఈ సినిమాలో అతిథిగా కనిపించనున్నారు. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21 థియేటర్లోకి రాబోతోంది. ఇందులో మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. లియన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'బింబిసార'. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకులను పలకరించిన కల్యాణ్ రామ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కె. హరికృష్ణ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజైన భారీ విజయం అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతోంది. దీపావళి సందర్బంగా అక్టోబర్ 21 నుంచి జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతోంది. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 16న తెలుగు, తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్ తల్లిగా అక్కినేని అమల కీలక పాత్రలో నటించారు. మదర్సెంటిమెంట్తో వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో విశేషంగా ప్రేక్షకుల ఆదరణ అందుకుంది. థియేటర్లో మంచి విజయం సాధించిన ఒకే ఒక జీవితం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సోని లివ్‌లో అక్టోబర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ * అమ్ము (తెలుగు) అక్టోబరు 19 * ద పెరిఫెరల్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 * ఫోర్ మోర్ షాట్స్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 నెట్‌ఫ్లిక్స్ * ద స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ (హాలీవుడ్) అక్టోబరు 19 * బార్బేరియన్స్ (వెబ్‌సిరీస్-2) అక్టోబరు 21 * ఫ్రమ్ స్క్రాచ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 21 జీ5 * ట్రిప్లింగ్ (హిందీ సిరీస్-3) అక్టోబరు 21 ఆహా * పెట్టైకాలి (తమిళ చిత్రం) అక్టోబరు 21 -
రాజమండ్రిలో ‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
రెండు రాష్ట్రాల్లో ఆ పేరు తెలియని వారు ఉండరు.. రామ్ చరణ్ స్పీచ్ వైరల్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశాభట్ కథానాయికలుగా జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా వస్తోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి మెగా హీరో రామ్‌చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. (చదవండి: లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్) వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'మనం సినిమాను ఎంత ప్రేమిస్తామో తెలుసు. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా. ఈ మూవీకి వంశీ కాక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయనకు ఆల్ ది బెస్ట్. వెంకటేశ్ అన్నా.. మీ కోసమైనా నేను ఈ సినిమా చూస్తా. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్సేన్ పేరు తెలియని వాళ్లు ఉండరు. అతి తక్కువ సమయంలో గల్లీగల్లీకి ఆయన ఫ్యాన్స్‌ను సంపాదించారు. ఒక్కసారి మాటిస్తే విశ్వక్ కూడా నిలబడతాడన్న పేరుంది. అతని వ్యక్తిత్వానికి నేను పెద్ద ఫ్యాన్. ఈ సినిమా కుడా ఉప్పెన మూవీలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..'రామ్ చరణ్ అన్న సినీ ప్రయాణం నాకెంతో స్ఫూర్తి. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వటం చిన్న విషయం కాదు. నేను అన్నయ్యను చూశాకే క్రమశిక్షణ నేర్చుకున్నా. ఈ క్షణాల్ని నేను మర్చిపోలేను. దర్శకుడు అశ్వత్, సంగీత దర్శకుడు లియాన్ జేమ్స్, డీఓపీ విద్ధు ఇండియాలోనే టాప్ లిస్ట్‌లో నిలుస్తారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే చిత్రమిది’ అని అన్నారు. -
ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే
ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఈ నెల 24న దీపావళి పండగ. కానీ కొత్త సినిమాల రిలీజ్‌లతో మూడు రోజులు ముందుగానే టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ దీపావళి వెలుగులతో మెరవనుంది. యాక్షన్ టపాసులు, ప్రేమ కాకరపువ్వొత్తులు, నవ్వుల చిచ్చుబుడ్డులు ఆడియన్స్ కోసం సిద్ధం అవుతున్నాయి. ఇక పండగ సందర్భంగా వస్తున్న సినిమాల వివరాల్లోకి ఓసారి వెళదాం. దీపావళికి యాక్షన్ ‘జిన్నా’గా వస్తున్నారు మంచు విష్ణు. ఈషాన్ సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో ఓ టెంట్ హౌస్‌ను రన్ చేసే జిన్నా అనే యువకుడి పాత్రలో కనిపించనున్నారు మంచు విష్ణు. తన వాళ్ల కోసం జిన్నా ఎలాంటి రిస్క్‌లు తీసుకున్నాడు? ఎవరి రాక కారణంగా జిన్నా లైఫ్ టర్న్ అయ్యింది? అనేది సినిమా కథ. డా. మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రిలీజ్ కానుంది. మరోవైపు ‘ఓరి దేవుడా..!’ అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అవుతున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమాలో దేవుడి పాత్రలో వెంకటేశ్ నటించారు. తమిళ దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగుకి పరిచయమవుతున్న చిత్రం ఇది. ‘వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందా..!’ అనే డైలాగ్ ‘ఓరి దేవుడా..!’ ట్రైలర్లో ఉంది. సో.. పెళ్లి చేసుకున్న తర్వాత ఓ యువకుడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? అనే అంశం ఆధారంగా ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించారు. ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ ‘సర్దార్’గా రానున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా చేయగా, కీలక పాత్రలో లైలా నటించారు. ఓ గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో ‘సర్దార్’ సాగుతుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్‌కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘జిన్నా’, ఓరి దేవుడా..!’, ‘సర్దార్’ చిత్రాలు రిలీజ్ అవుతున్న రోజునే ‘ప్రిన్స్’ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకుడు. ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్క హీరోయిన్గా చేశారు. ఇండియన్ కుర్రాడికి, బ్రిటిష్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. సునీల్ నారంగ్, డి. సురేబాబు, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతానికి ఈ నాలుగు సినిమాలు దీపావళికి కన్ఫార్మ్ అయ్యాయి. మరికొన్ని చిత్రాలు పండగ రేసులో నిలిచే అవకాశం ఉంది. -
'ఓరి దేవుడా' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. పూరి జగన్నాధ్ 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్' అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ 'వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రైండే వైఫ్‌లాగా వచ్చిందా..' విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. -
Vishwak Sen: 'ఓరి దేవుడా' బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వని చిత్రబృందం అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం అక్టోబర్ 21 థియేటర్లలో కనువిందు చేయనున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. Vishwak Sen: యాక్షన్ హీరో డైరెక్షన్లో విశ్వక్ సేన్ మూవీ.. ఆసక్తికర విషయాలు) పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా.. లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో విక్టరీ వేంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. గతంలో ఈ మూవీ నుంచి కేవలం మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తప్ప ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఒక్కసారిగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది చిత్రబృందం. -
ఓరి దేవుడోయ్...
‘‘ఇప్పటి వరకూ ఈ తరహా సోషియో ఫాంటసీ రాలేదు. తెలుగు ప్రేక్షకులకు చాలాకొత్తగా అనిపిస్తుంది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. కథ మొత్తం సిద్ధమైంది. తనికెళ్ల భరణిగారి ఆధ్వర్యంలో సంభాషణలు సిద్ధమవుతున్నాయి’’ అని దర్శకుడు శ్రీరామ్ వేగిరాజు చెప్పారు. రాజీవ్ సాలూరి హీరోగా ఓ వినోదాత్మక సోషియో ఫాంటసీ చిత్రం రూపొందనుంది. ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా దర్శకుడు శ్రీరామ్ గతంలో ‘డిస్టెంట్ బీట్స్’ అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ చిత్రానికి లాస్ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పురస్కారం కూడా దక్కింది. ‘ఓరి దేవుడోయ్’కి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరాలందిస్తున్నారు. సెప్టెంబరులో అమెరికాలో సంగీత చర్చలు, పాటల రికార్డింగ్ చేయబోతున్నాం. ఇందులో మొత్తం ‘7’ పాటలుంటాయి. చిత్రీకరణ కూడా మొదలుపెడతాం. సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేస్తాం’’ అని తెలిపారు.