ఓరి దేవుడోయ్... | Ori Devuda telugu new movie | Sakshi
Sakshi News home page

ఓరి దేవుడోయ్...

Published Sun, Aug 25 2013 1:11 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

ఓరి దేవుడోయ్...

ఓరి దేవుడోయ్...

 ‘‘ఇప్పటి వరకూ ఈ తరహా సోషియో ఫాంటసీ రాలేదు. తెలుగు ప్రేక్షకులకు చాలాకొత్తగా అనిపిస్తుంది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. కథ మొత్తం సిద్ధమైంది. తనికెళ్ల భరణిగారి ఆధ్వర్యంలో సంభాషణలు సిద్ధమవుతున్నాయి’’ అని దర్శకుడు శ్రీరామ్ వేగిరాజు చెప్పారు. రాజీవ్ సాలూరి హీరోగా ఓ వినోదాత్మక సోషియో ఫాంటసీ చిత్రం రూపొందనుంది. ఛేజింగ్ డ్రీమ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘మా దర్శకుడు శ్రీరామ్ గతంలో ‘డిస్టెంట్ బీట్స్’ అనే సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఆ చిత్రానికి లాస్‌ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పురస్కారం కూడా దక్కింది. ‘ఓరి దేవుడోయ్’కి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి స్వరాలందిస్తున్నారు. సెప్టెంబరులో అమెరికాలో సంగీత చర్చలు, పాటల రికార్డింగ్ చేయబోతున్నాం. ఇందులో మొత్తం ‘7’ పాటలుంటాయి. చిత్రీకరణ కూడా మొదలుపెడతాం. సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement