Tanikella Bharani
-
పల్లెటూరి డిటెక్టివ్
తనికెళ్ల భరణి(Tanikella Bharani) ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’(Asura Samharam)అనే చిత్రం రూపొందనుంది. కిశోర్ శ్రీకృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో మిధున ప్రియ కీలక పాత్ర చేయనున్నారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సాయి శ్రీమంత్, శబరీష్ బోయళ్ల నిర్మించనున్న ఈ చిత్రాన్ని శనివారం ప్రకటించారు. ‘క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.ప్రస్తుతం కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకి ప్రేక్షకాదరణ ఉంటోంది. ఈ క్రమంలోనే విలేజ్ క్రైమ్ డ్రామాగా ‘అసుర సంహారం’ రూపొందనుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: మిధున ప్రియ, కెమేరా: బాలు ఏబీసీడీ, సంగీతం: కరీం అబ్దుల్. -
తనికెళ్ల భరణికి డాక్టరేట్
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణికి వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తనికెళ్ల భరణి దాదాపు 800లకు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 52 సినిమాలకు మాటలు అందించారాయన.‘సముద్రం’ సినిమాకి ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ‘గ్రహణం’ చిత్రంతో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకిగాను ఉత్తమ రచయిత–ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారాయన. ఇక ఆగస్ట్ 3న వరంగల్‌లో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తనికెళ్ల భరణికి డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నారు. -
తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం
టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం లభించింది. ప్రముఖ ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా, రచయితగా ఆయన చేసిన సేవలకుగానూ డాక్టరేట్‌తో సత్కరించనుంది. ఈ అవార్డును ఆగస్ట్ 3వ తేదీన వరంగల్‌లో జరిగే యూనివర్శిటి స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారు.కాగా.. తనికెళ్ల భరణి టాలీవుడ్లో దాదాపు 800కు పైగా చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా దాదాపు 50 సినిమాలకు పైగా రచయితగా అనేక విజయాలను అందుకున్నారు. సముద్రం సినిమాకు ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ చిత్రంలో నటనకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, గ్రహణం మూవీకి ఉత్తమ నటుడిగా, మిథునం సినిమాకుగానూ ఉత్తమ రచయిత, దర్శకునిగా అయిదు నంది అవార్డులను అందుకున్నారు. కాగా.. గతంలో ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్‌ను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన సంగతి తెలిసిందే. -
ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?
టైటిల్: ఇంటి నెం.13 నటీనటులు: నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, గుండు సుదర్శన్, దేవయాని తదితరులు రచన, దర్శకత్వం: పన్నా రాయల్ సంగీతం: వినోద్ యాజమాన్య సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్ ఎడిటింగ్: సాయినాథ్ బద్వేల్ మాటలు: వెంకట్ బాలగోని, పన్నా రాయల్ సమర్పణ: డా.బర్కతుల్లా నిర్మాత: హేసన్ పాషా బ్యానర్స్: రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్, డి.ఎం. యూనివర్సల్ స్టూడియోస్ విడుదల తేదీ: 01.03.2024 సినిమా నిడివి: 126 నిమిషాలు హారర్ మూవీస్ అంటే దెయ్యాలు, ప్రేతాత్మలకు సంబంధించిన కథలతోనే తెరకెక్కుతుంటాయి. అయితే కొందరు దర్శకులు వాటిలోనే కొంత వైవిధ్యం వున్న కథలతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తీసుకొని కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి దర్శకుల్లో పన్నా రాయల్ ఒకరు. ఇంతకుముందు అలాంటి కథాంశాలతోనే కాలింగ్ బెల్, రాక్షసి వంటి హారర్ చిత్రాలను తీసి పేరు గడించారు. ఇప్పుడు తన మూడో చిత్రంగా ‘ఇంటి నెం.13’ను తెరకెక్కించారు. ఒక కొత్త పాయింట్, కొత్త బ్యాక్‌డ్రాప్‌ని ఎంచుకొని ప్రేక్షకుల్ని మరోసారి భయపెట్టే ప్రయత్నం చేశారు. శుక్రవారం(మార్చి 1న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అయింది? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.. కథ ఓ 90 ఏళ్ల వృద్ధుడు తన జీవితంలో ప్రేతాత్మల నుంచి ఎంత మందిని విముక్తుల్ని చేశాడో వివరిస్తుంటాడు. అందులో భాగంగా ‘ఇంటి నెం.13’ అనే ఒక విల్లాకు సంబంధించిన కథను చెప్పడం మొదలు పెడతాడు. అర్జున్ ఒక రచయిత. అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడుపోయిందంటూ అది ప్రింట్ చేసిన పబ్లిషర్ ఫోన్ చేసి చెబుతాడు. ఆ అచీవ్‌మెంట్‌కి బహుమానంగా ఒక విల్లా గిఫ్ట్‌గా ఇస్తానంటాడు. దానికి సంబంధించిన తాళాలను తన అన్నయ్య సంజయ్‌కి ఇమ్మని చెబుతాడు అర్జున్. అలా సంజయ్, అతని భార్య నిత్య, పనిమనిషి జేజమ్మ ఆ ఇంట్లో దిగుతారు. ఆ తర్వాత అర్జున్, నిత్య చెల్లెలు మధు కూడా ఆ ఇంటికి వస్తారు. కొన్ని రోజులు బాగానే గడుస్తుంది. ఆ తర్వాత నిత్యకు తెల్ల ముసుగు వేసుకున్న ఆకారాలు కనిపిస్తుంటాయి. దగ్గరకెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అలాంటివి తరచూ కనిపిస్తుండటంతో ఆమె మానసికంగా ఆందోళనకు గురవుతుంది. ఒక్కోసారి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇది గమనించిన భర్త ఆమెకు చికిత్స చేయించేందుకు డాక్టర్ని, సైకియాట్రిస్ట్‌లను తీసుకొస్తాడు. కానీ ఇద్దరూ చేతులెత్తేస్తారు. ఫైనల్‌గా గజానంద్ (ఆనంద్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. ఆ ఇంట్లో కనిపిస్తున్న తెల్ల ముసుగు ఆకారాలు ఎవరివి? అవి ఏం సాధించడానికి నిత్యను ఆవహించాయి? ఆ ఇంటిలో ఉన్న సమస్యను గజానంద్ ఏవిధంగా పరిష్కరించాడు? అనేది మిగతా కథ. విశ్లేషణ మనం ఎప్పుడూ చూసే దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఏ సినిమా అయినా ఒక ఇంట్లో ఉండే సమస్యతోనే మొదలవుతుంది. ఇందులోనూ అలాంటి సమస్యే అయినా దాన్ని చెప్పిన విధానం విభిన్నంగా అనిపిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా నడిపించేందుకు దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కానీ కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా మారింది. వినోద్ యాజమాన్య ఇచ్చిన మ్యూజిక్ ఎంతో గ్రాండ్‌గా ఉంది. నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన నవీద్, శివాంగి మెహ్రా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అని చెప్పుకోదగిన గజానంద్ పాత్రను ఆనంద్‌రాజ్ తనదైన శైలిలో రక్తి కట్టించాడు. అతిథి పాత్రల్లో కనిపించిన తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మీ, పృథ్విరాజ్, సుదర్శన్, శివన్నారాయణ, రవివర్మ వారి పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. సాంకేతిక నిపుణులు చిన్న సీన్‌ని కూడా బాగా ఎలివేట్ చేసేలా వినోద్ సంగీతం అందించారు.దర్శకుడు పన్నా రాయల్ తను అంతకుముందు చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి మంచి పర్ఫామెన్స్ రాబట్టుకున్నాడు. పి.ఎస్.మణికర్ణన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో హైలైట్‌గా చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో రిచ్‌గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎడిటర్ సాయి బద్వేల్ సినిమాను క్రిస్పీగా ఎడిట్ చేశారు. వెంకట్ బాలగోని, పన్నా రాయల్ రాసిన మాటలు పర్వాలేదనిపించాయి. నిర్మాత హేసన్ పాషా పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. మరో విశేషం ఏమిటంటే.. లాస్ట్ సీన్ చూసిన తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని అర్థమవుతుంది. కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి, యాక్షన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన వారికి ‘ఇంటి నెం.13’ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. -
హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా రానున్న 'సి 202' ఫస్ట్ లుక్ రిలీజ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 'సి 202' (C 202) ఫస్ట్ లుక్ విడుదలయింది. ఈ చిత్రాన్ని మైటీ ఒక్ పిక్చర్స్ (Mighty Oak Pictures) పతాకంపై మనోహరి కె ఎ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ నటిస్తుండగా మున్నా కాశి హీరోగా పలకరించనున్నాడు. ఇందులో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను వంటి నటులు కూడా ఉన్నారు. హర్రర్ థ్రిల్లర్ చిత్రంగా 'సి 202' రానుంది. షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో మున్నా కాశి మాట్లాడుతూ.. 'సి 202' (C 202) చిత్రం ఆద్యంతం రాత్రిపూట చిత్రీకరించబడింది. కథ స్క్రీన్ ప్లే చాలా ఆసక్తిగా అద్భుతమైన సస్పెన్స్‌తో తెరకెక్కించాం. హారర్ సన్నివేశాలతో మంచి త్రిల్లింగ్ ఎపిసోడ్స్ తో సినిమాని చిత్రకరించాము. షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతానికి రామానాయుడు స్టూడియోస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాంకేతికంగా మేము హై-ఎండ్ కెమెరాలతో పాటు మంచి లైటింగ్ పరికరాలను ఉపయోగించాము. మా చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళు ఎప్పుడు చేయని పాత్రలో నటించి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తారు. ఈ చిత్రంలో 21 నిమిషాల పాటు గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. నా గత చిత్రం హేజా(Heza) మంచి పేరు తెచ్చిపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఆ చిత్రాన్ని చూసి నన్ను చాలా మంది పార్ట్-2 ఎప్పుడని అడుగుతున్నారు. దానికి సీక్వెల్ త్వరలోనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మంచి హారర్ థ్రిల్లర్ చిత్రం 'సి 202' (C 202)తో మీ ముందుకు వస్తున్నాం. త్వరలో ట్రైలర్ ను విడుదల చేస్తాం' అని ఆయన తెలిపారు. ఈ చిత్రంలో మున్నా కానీ హీరోగా నటిస్తూనే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం అందించారు. -
సీనియర్ నటుడి కుమారుడు హీరోగా కొత్త చిత్రం!
ప్రణం దేవరాజ్, సుమన్, రవి శివతేజ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో పి.హరికృష్ణ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ మూవీని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హరి క్రియేషన్స్ ప్రొడక్షన్‌పై మొదటి చిత్రంగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా.. దేవరాజ్ కెమరా స్విఛ్ ఆన్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. 'సినిమా అంటే చాలా ప్యాషన్ ఉండాలి. హరి క్రియేషన్స్ బ్యానర్‌ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా ఉంది. దేవరాజు ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని వాళ్ల అబ్బాయి ప్రణం దేవరాజ్ ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. శంకర్ చాలా ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. 'ఇది నా మొదటి సినిమా. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గౌడ్‌కు ధన్యవాదాలు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఉండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యూల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, ఆ తర్వాత వైజాగ్ పరిసర తెరకెక్కించనున్నాం' అని తెలిపారు. హీరో ప్రణం మాట్లాడుతూ.. 'ఇది తెలుగులో నాకు మూడో చిత్రం. చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టొరీ, యాక్షన్ సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి' అని కోరారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. -
తనికెళ్ళ భరణితో గరం గరం ముచ్చట్లు
-
మనిద్దరం పక్షిలా ఎగిరిపోదాం అన్నయ్య: LB శ్రీరామ్
-
అందుకే పద్ధెనిమిది సినిమాలు వదులుకున్నా: తనికెళ్ల భరణి
‘‘నలభై ఏళ్ల సుధీర్ఘ కెరీర్లో 800 పైగా సినిమాలు చేశాను. వీటిలో 300 పైగా తండ్రి పాత్రలు ఉన్నాయి. దీంతో తండ్రి పాత్రలు చేయాలంటే విసుగొచ్చింది. ఈ ఏడాది 18 సినిమాల్లో తండ్రి పాత్రలు చేయమని అవకాశాలు రాగా, వదులుకున్నాను. కొత్త తరహా పాత్రలు చేయాలనుకుంటున్న నాకు ‘పెదకాపు–1’లో మంచి పాత్ర దొరికింది. నా కెరీర్లో నేను గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో ‘పెదకాపు 1’ ఉంటుంది’’ అన్నారు నటుడు– దర్శకుడు తనికెళ్ల భరణి. విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ పెదకాపు 1’. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ల భరణి పంచుకున్న విశేషాలు. ► ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల తర్వాత శ్రీకాంత్ అడ్డాలతో నేను చేసిన చిత్రం ‘పెదకాపు 1’. ఈ చిత్రంలో సమాజంపై విసిగిపోయిన ఓ టీచర్ పాత్రలో కనిపిస్తాను. శ్రీకాంత్ అడ్డాల పోషించిన పాత్రను తప్పిస్తే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అందరితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ‘మాతృ దేవో భవ, లేడీస్ టైలర్, శివ, మన్మథుడు, అతడు’.. ఇలా నిడివితో సంబంధం లేకుండా నా కెరీర్లో నేను గుర్తుపెట్టుకోదగ్గ పాత్రలు ముప్పై వరకు ఉంటాయి. ఈ జాబితాలో ‘పెదకాపు 1’ చేరుతుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకి కెమెరామేన్ చోటా కె. నాయుడుతో వర్క్ చేయడం థ్రిల్‌గా అనిపించింది. విరాట్ కర్ణ కొత్తవాడైనా బాగా నటించాడు. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. మిర్యాల రవీందర్‌రెడ్డిగారు ఈ సినిమాను భారీగా నిర్మించారు. ► ‘మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో చిత్రం రాలేదు. నేను కమర్షియల్ సినిమాలు తీయలేను. నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదు. నా నలభై ఏళ్ల కెరీర్లో నేను అనుకున్నవన్నీ చేశాను. అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను. -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
సిగరెట్, గంజాయి తాగడం.. ఇలా చాలా అలవాట్లుండేవి: తనికెళ్ల భరణి
నాన్న ఎందుకో వెనకబడ్డాడు.. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మకంటే నాన్న చాలా వెనుకబడ్డాడు.. ఆ మధ్య నటుడు తనికెళ్ల భరణి ఈ కవిత చదివి వినిపిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. అప్పట్లో ఈ వీడియోను చూసి కంటతడి పెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా తన తండ్రిని తలుచుకుని మరోసారి భావోద్వేగానికి లోనయ్యాడు తనికెళ్ల భరణి. ఓ ఇంటర్వ్యూలో ఆయన తండ్రితో తనకున్న అనుబంధాలను మరోసారి గుర్తు చేసుకున్నాడు. చెప్పులు కొనిస్తాడనుకుంటే.. ఏడో తరగతి చదువుకునే వరకు నా కాలికి చెప్పుల్లేవు. ఓసారి రోడ్డుమీద నడుస్తుండగా కాలిన సిగరెట్ మీద కావాలని కాలేసి అమ్మా అని అరిచాను. మా నాన్న వెంటనే అటూఇటు చూసి చెప్పుల దుకాణానికి తీసుకెళ్లి నాకో జత కొనిస్తాడని అలా చేశాను. కానీ మా నాన్న చూసుకుని నడవలేవా? అని ఒక్కటిచ్చాడు. ఒకసారైతే నేను చేసే పనులు చూసి చెట్టుకు కట్టేసి కొట్టాడు. వంద రూపాయల కోసం బూతులు.. మా నాన్న లాల్చీలో నుంచి రెండు రూపాయలు అలా కొట్టేసేవాడిని. ఓసారి ఆయన జేబులో నుంచి వంద రూపాయలు కొట్టేశాను. రాత్రి నేను అన్నం తింటుండగా వచ్చి.. వాడికి పప్పు, నెయ్యి ఎక్కువ వేయి, మనింట్లో భోజనం చేయడం ఇదే చివరిసారి కదా.. రేపటినుంచి జైల్లోనే కదా ఉండేది అని అమ్మతో అన్నాడు. వంద రూపాయలు కొట్టేస్తావా.. అని బూతులు తిట్టాడు. ఎప్పుడైనా నేను మా నాన్న జేబులో వెయ్యి రూపాయలు పెడితే ఎందుకనేవాడు. చిన్నప్పుడు కొట్టేసిన డబ్బులకు వడ్డీ అని చెప్పేవాడిని. చెడు అలవాట్లు.. నాన్న ఎంత బాధపడ్డాడో అప్పట్లో సిగరెట్స్ కాల్చేవాడిని. ధూమపానం మానేసిన నాన్న ఓసారి నా జేబులో నుంచి సిగరెట్ కొట్టేసి కాల్చాడు. అయితే ఒకానొక సమయంలో నాన్న నా గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు నాకు సిగరెట్ తాగడం, గంజాయి తాగడం.. ఇలా ఊహించనన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. నన్ను కొట్టాడు.. కానీ ఆయన మనసులో ఎంత బాధపడ్డాడో!' అని చెప్తూ ఏడ్చేశాడు తనికెళ్ల భరణి. చదవండి: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.. కావాలనే ఇండస్ట్రీకి దూరం చేశారు -
తెలంగాణ సంస్కృతి అంటే అంత చిన్న చూపా : తనికెళ్ల భరణి
-
RGV గురించి అసలు విషయం చెప్పిన తనికెళ్ళ భరణి...!
-
అదో భయంకరమైన అనుభవం
-
ఆ సినిమా చూసి నా మార్దల్ నన్ను అసహించుకుంది..!
-
ఇప్పటికి గుర్తు చేసుకుంటే నీళ్లు వస్తాయి...!
-
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘మిస్టరీ’..షూటింగ్ షురు
తల్లాడ సాయికృష్ణ, స్వప్న చౌదరి, సుమన్, అలీ, తనికెళ్ల భరణి, సత్య శ్రీ, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక పాత్రల్లో ‘మిస్టరీ’ సినిమా షురూ అయింది. తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 21 వరకు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్‌ని పూర్తి చేస్తాం. సెప్టెంబర్ చివరి వారంలో ‘మిస్టరీ’ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్ తవ్వ, కెమెరా: సుధాకర్, శివ రాథోడ్. పవర్ ఫుల్ పోలీస్‌గా రవిరెడ్డి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటుడు ‘రవి రెడ్డి’ చేస్తున్నట్లు టీం సభ్యులు తెలిపారు. గతంలో వి, విరాటపర్వం, గాలోడు లాంటి సినిమా లలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు రవిరెడ్డి. ఈ చిత్రంలో మంచి పాత్ర పోషిస్తున్నానని, రిలీజ్ తర్వాత మంచి గుర్తింపుతో పాటు అవకాశాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. -
దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" 3వ రోజు కార్యక్రమం, అక్టోబర్ 2, 2022, ఆదివారం అంతర్జాలం ద్వారా 14 గంటల పాటు దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొనగా, పారిస్ నుండి డా. డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు. అంతకు ముందు సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో మొదటి రెందు రోజుల సాహిత్య ప్రసంగాలూ న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక, అలాగే అంతర్జాలంలోనూ 24 గంటలు నిర్విరామంగా జరిగిన సంగతి తెలిసినదే. సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ నాటి సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు. రాధిక మంగిపూడి (ముంబై), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతర్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థవంతంగా నిర్వహించగా డా. ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వు మధు మొదలయిన లబ్ఢప్రతిష్టులు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ముగింపు వేదికలో మూడు రోజుల సదస్సు విశేషాలను సమీక్షిస్తూ సుమారు 25 దేశవిదేశాల వక్తలకీ, 18 మంది వేదిక నిర్వాహకులకీ, 30 మంది సాంకేతిక నిర్వాహకులకీ, ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకీ, మీడియా ప్రతినిధులకీ నిర్వాహకులు తమ ధన్యవాదాలు తెలిపారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 22, 23, 24 తేదీలలో ఫ్రాన్స్ లోని పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారంతో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప జరుగుతోంది ఆ సాంస్కృతిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అనీ ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు. -
తనికెళ్ల భరణికి లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు. -
తనికెళ్ల భరణికి ‘లోక్‌నాయక్’ పురస్కారం
ఏయూ క్యాంపస్: లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కళాభారతిలో లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలో తనికెళ్ల భరణికి పురస్కారం, రూ.2లక్షలు నగదు బహుమతి అందిస్తామని వివరించారు. తెలుగు సంస్కృతి, భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు 18 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తుది వరకు వెన్నంటి ఉన్న వ్యక్తులను కూడా గౌరవిస్తూ సన్మానిస్తామని చెప్పారు. ఎన్టీఆర్‌కు ప్రత్యేక అధికారిగా పనిచేసిన జి.రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, కారు డ్రైవర్ లక్ష్మణ్‌ను సన్మానించి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, సినీనటుడు మోహన్‌బాబు, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ, విజ్ఞాన్ విద్యా సంస్థల కార్యదర్శి లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు హాజరవుతారని తెలిపారు. -
అమెరికాలో ఘనంగా ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖీ’ కార్యక్రమం!
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో 'తనికెళ్ళ భరణితో ముఖాముఖీ' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన, నల్లూరి ప్రసాద్‌లు తనికెళ్ళ భరణిని సాదరంగా ఆహ్వానించారు. తానా మాజీ అధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించారు. రంగస్థలంపై మొదలెట్టి.. రంగుల ప్రపంచంపై ముద్ర వేసిన తనికెళ్ల భరణి గొప్పతనాన్ని కొనియాడారు. 2 గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ప్రసంగం అతిధుల్ని ఆకట్టుకుంది.ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాధాన్యంపై భరణి ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో భాగంగా తానా, టాన్ టెక్స్ సంస్థల నాయకులు ముఖ్యఅతిథి తనికెళ్ళ భరణిని 'బహుముఖ కళావల్లభ' అనే బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొణిదల లోకేష్ నాయుడు, ప్రసాద్ నల్లూరి, గిరి గోరంట్ల, వెంకట్ బొమ్మా, సతీష్ మండువ, కుమార్ నందిగం, కృష్ణమోహన్ దాసరి, రవీంద్ర చిట్టూరి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, చలపతి కొండ్రగుంటలు పాల్గొన్నారు. -
గాడ్సే మూవీ పబ్లిక్ టాక్
-
పాన్ గ్లోబ్ సాంగ్.. 'సూళ్లే బాకు'ను రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి
ప్రణవ చంద్ర, మాళవిక జంటగా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. ఐక్యూ క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు నిర్మించారు. శనివారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని ‘సూళ్ళే బాకు..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ని రచయిత, నటుడు తనికెళ్ల భరణి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ‘దోచేవారెవరురా’ సినిమాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథ మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో నేను రాసిన ‘సూళ్ళే బాకు..’ పాన్ గ్లోబ్ సాంగ్‌ని తనికెళ్ల భరణిగారు రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘జూలై చివరి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు బొడ్డు కోటేశ్వర రావు. ఈ కార్యక్రమంలో ప్రణవ, మాళవిక, పాటల రచయితలు చంద్రబోస్, సిరాశ్రీ, నటీనటులు సునయన, అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అర్లి, సంగీతం: రోహిత్ వర్ధన్. చదవండి: విరాటపర్వం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అపశ్రుతి హోటల్‌కు తీసుకెళ్లి ముద్దులతో ముంచెత్తాడు, అప్పుడే.. -
చంపేస్తామని బెదిరించారు: తనికెళ్ల భరణి
తనికెళ్ల భరణి.. నటుడిగా, రచయితగా తెలుగువారందరికీ సుపరిచితమే. తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న ఆయన నిజ జీవితంలోబెదిరింపులను సైతం ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ విషయాలను వెల్లడించాడు. ఊహ సినిమాలో కీలక పాత్ర పోషించిన తనికెళ్ల భరణి.. ఆ సినిమాలో కాస్త విలనిజం కనబరుస్తాడు. భర్త చనిపోయిన మరదలిపై కన్నేసిన ఊహ బావ పాత్రలో తనికెళ్ల నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నటనకు ఎంత గుర్తింపు వచ్చిందో అదే స్థాయిలో బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ సినిమా అనంతరం కొందరు మహిళలు తనను చంపేస్తామంటూ బెదిరించారు. అది నిజం కాదు.. కేవలం నటన మాత్రమే అని చెప్పినా కొందరు వినిపించుకునేవాళ్లు కాదు. నటన అంటే ప్రేక్షకులు అంతలా మమేకమైపోతారు అంటూ చెప్పుకొచ్చారు. -
వంశధార నడకలా హరుని ఎదుట.. భరణి పాట
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): నీలోన శివుడు గలడు.. నాలోన శివుడు కలడు.. అంటూ తన్మయత్వంతో ఆయన పాడుతూ ఉంటే మధుకేశ్వరుడు సైతం చెవులొగ్గి విన్నాడు. శబ్బాష్‌రా శంకరా.. అంటూ ఈశుని లీలలు వివరిస్తూ ఉంటే భక్తజనం లిప్తమాత్రం శబ్దం చేయకుండా వింది. ఎంత మోసగాడివి శివా.. అన్న నిందాస్తుతి కూడా శ్రీముఖలింగంలో పంచాక్షరి మంత్రంలా వినిపిస్తూ ఉంటే హరుని ఎదుట భరణి పాట వంశధార నడకలా హాయిగా సాగిపోయింది. ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి సోమవారం శ్రీముఖలింగంలో నిర్వహించిన శబ్బాష్ రా శంకరా.. కార్యక్రమం హృద్యంగా సాగింది. రాగయుక్తంగా శివస్తుతి చేసిన భరణి.. జిల్లా ప్రాముఖ్యతను కూడా వివరించారు. శ్రీకాకుళం, శ్రీముఖలింగం, శ్రీకూర్మం వంటి పట్టణాల్లో శ్రీ ఉందని, శ్రీ అంటే సంపద అని వివరించారు. నేటి తరం పిల్లలను మార్కుల కోసం సాధించకుండా.. మానవతా విలువలు కూడా నేర్పాలని సూచించారు. అంతకుముందు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు తనికెళ్లను ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతించి స్వామి వారి శేషవస్త్రాలు అందించి పుణ్యాహవచనాలతో దీవించారు. ఎన్టీఆర్ సాఫల్య పురస్కారం జనవరి 18న అందుకోనున్నట్లు తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ తమ్మన్నగారి సతీష్, ఐఆర్ఎస్ అధికారి పూజారి కృష్ణ, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, ఆలయ ఈఓ వీవీఎస్ నారాయణ, అర్చకులు పెద్ద లింగన్న, భక్తులు పరిసర గ్రామాలు నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీముఖలింగం అంటే నాకెంతో ఇష్టం శ్రీముఖలింగం తనకు ప్రీతిపాత్రమైన పుణ్యక్షేత్రమని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నా రు. ముఖలింగేశ్వరుని దర్శించుకోవడం తనకు ఇది నాల్గో సారని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి రాక మునుపే స్వామిని దర్శించుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడి ప్రాచీన శిల్ప కళ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పురాతన శివలింగాన్ని చూస్తే కలిగే ప్రశాంతత వేరని, ఈ క్షేత్రంపై ప్రచారం కూడా చేశానని తెలిపారు. శివతత్వం సహజంగా రావాలని, అలవాటు చేసుకునేది కాదని తెలిపారు. -
Sarath Babu: శరత్‌బాబు నట వారసుడు హీరోగా ఎంట్రీ
Actor Sarath Babu Nephew Introduced As Hero With Daksha Movie : ప్రముఖ నటుడు శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘దక్ష’. ఈ చిత్రంలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను తనికెళ్ల భరణి, శరత్‌కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ – ‘‘దక్ష’ అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడని అర్థం. అతడే మా తల్లాడి సాయికృష్ణ. చిన్న స్థాయి నుంచి వచ్చిన సాయికృష్ణ ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఆయుష్ నాక్కూడా కొడుకులాంటివాడే. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు శరత్‌బాబు. ‘‘హీరో అవ్వాలన్న నా కల ఈ చిత్రంతో నేరవేరింది. ఈ థ్రిల్లర్ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’’ అన్నారు ఆయుష్. ‘‘షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు సహనిర్మాత తల్లాడ సాయికృష్ణ. -
దక్షత కలిగిన సినిమా ‘దక్ష’: తనికెళ్ళ భరణి
‘దక్ష అంటే అన్ని వ్యవహారాలు సమన్వయం చేసేవాడు అని అర్థం‘ అలాంటి దక్షతతో కూడిన కథనంతో తెరపైకి రాబోతున్న దక్ష చిత్రం అందరిని ఆకట్టుకుంటుందని ప్రముఖ టాలివుడ్ నటుడు తనికెళ్ళ భరణి తెలిపారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ దక్ష‘. ఈ సినిమా ద్వారా సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోను ఫిల్మ్ ఛాంబర్లో తనికెళ్ళ భరణి, శరత్ బాబు విడుదల చేసారు. ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ తల్లాడ సాయి కృష్ణ చిన్న స్థాయి నుంచి స్వశక్తితో వ్యక్తి అని,. గతంలో వ్యవసాయం కథాంశంగా తను దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్‌కు నేషనల్ అవార్డు రావడం గర్వకారణమని అన్నారు. తన నిర్మాణంలో రూపొందుతున్న దక్ష చిత్రంతో తన మిత్రుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా పరిచయం కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. శరత్ బాబు మంచి మిత్రుడే కాకుండా ఇద్దరం కలిసి పలు చిత్రాల్లో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ఆయుష్ తన తమ్ముడి కొడుకైనప్పటికీ నా దగ్గరే పెరిగాడని, తన తనయుడిగా ఇండస్ట్రీకి రావడం ఆనందంగా ఉందని శరత్ బాబు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతకు ఆర్థికంగా, టెక్నీషియన్స్‌కు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుందన్నారు. వినూత్న కథాంశంతో వస్తున్నాం.. ‘దర్శకుడిగా నా మెదటి చిత్రాన్ని వినూత్నమైన కథతో, ఆసక్తికరమైన సన్నివేశాతో రూపొందించానని దర్శకుడు వివేకానంద విక్రాంత్ తెలిపారు. మంచి కథతో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, అందులో దక్ష స్థానం సంపాదించుకుంటుందని అన్నారు. హీరో ఆయుష్ మాట్లాడుతూ ‘హీరో అవ్వాలనేది నా డ్రీమ్. ముంబైలో యాక్టింగ్ కోర్స్ చేశాను. మేమంతా చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. థ్రిల్లర్ కథాంశంతో హైదరాబాద్, అరకు, ఖమ్మం తదితర అదర్భుతమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అను, నక్షత్ర, క్లాసిక్ గ్రూప్ చైర్మెన్ తల్లాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు కథ,మాటలు శివ కాకు, సంగీతం రామ్ తవ్వ అందించగా కెమెరాకు శివ రాథోడ్, ఆర్.ఎస్ . శ్రీకాంత్ పని చేశారు. -
కొత్త ప్యాకేజీతో ముందుకొచ్చిన ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్
-
ఎందరో మహానుభావులు పుస్తక ఆవిష్కరణ
-
నీకు నువ్వే ఆయుధమవ్వాలి: తనికెళ్ళ భరణి
సాక్షి, మాదాపూర్: అమ్మగా, చెల్లిగా, అక్కలా, ఆలిగా ఇలా మహిళ నిత్యం ఎన్నో పాత్రలు పోషించినా నేటికీ ఆమె బానిసత్వంలోనే ఉండిపోతోంది. మహిళ గొప్పదనాన్ని తెలుపుతూ మాదాపూర్ శిల్పారామంలో గోగ్రహణం పేరిట ఆదివారం వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా రచయిత తనికెళ్ళ భరణి హాజరై నాటకాన్ని ప్రారంభించారు. నిజజీవితంలో స్త్రీ ఎన్నో పాత్రలు పోషించినా బానిసత్వం ఆమెను చేతగాకుండా చేస్తోందన్నారు. అబలవంటూ చట్టాలు, న్యాయాలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానమై, ఆత్మవిశ్వాసం నిండిన ఆదిశక్తివై నీకు నువ్వే ఆయుధం అవ్వాలనే సందేశానిస్తూ గోగ్రహణం నాటికను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్‌డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్‌లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్‌గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్‌గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి
-
చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన తనికెళ్ల భరణి
వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. తనకు మంచిపేరు తెచ్చిపెట్టిన 'శబ్బాష్ రా శంకరా' కవితలే ఇప్పుడు ఈ విమర్శలకు తావు తీశాయి. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన దీనికి కొనసాగింపుగా ఫేస్బుక్ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. "ఫేస్బుక్లో పోస్ట్ చేసిన శబ్బాష్ రా శంకరా కవితలో దురదృష్టవశాత్తూ కొన్ని వాక్యాలు కొందరి మనసులను నొప్పించాయి. ఆ కవితకు వివరణ ఇస్తే కవరింగ్‌లాగా ఉంటుంది. కాబట్టి అలాంటిదేం చేయకుండా నొప్పించినందుకు నా చేతులు జోడించి బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా. ఆ పోస్టు కూడా డిలీట్ చేశాను. నాకు హేతువాదులన్నా, మానవతావాదులన్నా గౌరవమే తప్ప వ్యతిరేకత లేదు. అలాగే ఏ మనిషికీ ఇంకొకరిని నొప్పించే అధికారమే లేదు. జరిగిన పొరపాటుకు మన్నించండి" అని తనికెళ్ల భరణి కోరాడు. చదవండి: ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది: తనికెళ్ల భరణి ఆనందంలో మునిగితేలుతున్న అల్లు శిరీష్ -
తేజ మా మెగాఫ్యామిలీ మెంబర్
‘‘తేజ చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించాడు. వాడు మా ఫ్యామిలీలో ఒక మెంబర్. చిరంజీవిగారి ఆశీస్సులు తనకి ఎప్పుడూ ఉంటాయి. ‘ఓ బేబీ’ సినిమాలో తనని చూసి సర్ప్రై జ్ అయ్యాను. ప్రశాంత్ వర్మ గుడ్ విజన్ ఉన్న డైరెక్టర్. తెలుగులో ఫస్ట్ టైమ్ జాంబీ జానర్లో వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. తేజ సజ్జా హీరోగా, ఆనంది, దక్షా నగార్కర్ హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. రాజ్‌శేఖర్ వర్మ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘జాంబిరెడ్డి’ ప్రీ–రిలీజ్ వేడుకలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘ ‘శివ’ సినిమా టైమ్‌లో ఆర్జీవీని చూసి గొప్ప డైరెక్టర్ అవుతాడనుకున్నాను. ఇప్పుడు ప్రశాంత్ వర్మను చూసినప్పుడు అదే ఫీలింగ్ కలిగింది’’ అన్నారు. రాజ్‌శేఖర్ వర్మ మాట్లాడుతూ– ‘‘సినిమా తీయాలనే నా కల. ‘జాంబిరెడ్డి’తో నిజమైనందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా నిర్మాత రాజశేఖర్ వర్మగారు కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు. తేజ నాకు మంచి ఫ్రెండ్. ‘అ!’ సినిమా కన్నా ముందే తనతో ఓ చిత్రం చేయాలి... కుదరలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ఈ వేడుకలో సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఆనంద్ పెనుమత్స, ప్రభ చింతలపాటి, లైన్ ప్రొడ్యూసర్ వెంకట్ కుమార్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
తానా ఆధ్వర్యంలో ‘తారలు-రాతలు’
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన తొమ్మిదవ అంతర్జాతీయ ఆన్లైన్ సాహిత్య సమావేశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో విశిష్ట అతిధులు విచ్చేసి ‘‘తారలు-రాతలు’’ అనే అంశంపై సినీ తారలుగా వెలుగొందుతూ మంచి సాహిత్యాన్నిసృష్టించిన సినిమా తారలు తనికెళ్ళ భరణి, డా. అక్కినేని నాగేశ్వర రావు, డా.పీ భానుమతి, డా. కొంగర జగయ్య, డా. గొల్లపూడి మారుతిరావుల రచనలను గుర్తు చేసుకున్నారు. తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి తన ప్రారంభోపన్యాసంలో ఇది ఒక వినూత్న, విశిష్ట కార్యక్రమమని, సినిమా నటులుగా అందరికి పరిచయమైన వారి రచనలను సాహిత్య సమాలోచన జరపడం సముచితంగా ఉందన్నారు. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.. అగ్రశ్రేణి తారలైన వారిలో కొంతమంది నటులుగా రాణిస్తూనే తమ రచనా వ్యాసాంగాన్ని కొనసాగించడం, ఇప్పుడు దాన్ని చర్చించడం హర్షనీయమన్నారు. ప్రముఖ నాటక రచయిత, కథారచయిత, సంభాషణల రచయిత, సినీ నటుడు, దర్శకుడైన తనికెళ్ళ భరణి.. తాను విద్యార్ధి దశలో రాసిన “అద్దె కొంప, ఆ తర్వాతి కాలంలో రాసిన “గోగ్రహణం, “కోక్కరోకో, “గార్ధ భాండం, “చలచల్ గుర్రం, “జంబు ద్వీపం, “గొయ్య్ఙి మొదలైన నాటికలు రాసిన నేపథ్యాన్ని, ‘నక్షత్ర దర్శనం’, ‘పరికిణి’, ‘ఎందరో మహానుభావులు’ మొదలైన రచనలు ‘శభాష్ రా శంకరా’, ‘ఆటగదరా శివ’ లాంటి రచనల్లోంచి కొన్ని పద్యాలు పాడి అందరినీ పరవశింప చేశారు. పద్మవిభూషణ్, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు రాసిన ‘అక్కినేని ఆలోచనలు’, ‘మనసులో మాట’ మొదలైన రచనల గురించి దాశరథి. సినారె లాంటి సాహితివేత్తలతో ఆయనకున్న సాహిత్యానుబంధం గురించి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలను, అయన సాహితీ ప్రస్థానాన్ని, అక్కినేని ఆత్మీయ సోదరిగా అభిమానం సంపాదించుకున్న డా. కేవీ కృష్ణ కుమారి సోదాహరణంగా వివరించారు. డా. పీ భానుమతి రాసిన ‘అత్తగారి కథలు’, ‘భానుమతి కథలు’, ‘నాలో నేను’ అనే తన ఆత్మ కథలోని విశేషాలు, చక్రపాణి గారితో ఆమెకున్న సాహిత్యానుబంధం, సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం లాంటి ఎన్నో విశేషాలను డా. భానుమతితో పాతికేళ్ళ అనుబంధం ఉన్న ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి శారదా అశోకవర్ధన్ ఎన్నో విశేషాలను ఆసక్తికరంగా పంచుకున్నారు. కళావాచస్పతి డా. కొంగర జగ్గయ్య విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కొన్ని రచనలను ‘రవీంద్రగీత’గా రాసిన తీరు, ‘మనస్విని’ అనే సాహితీ సంస్థ ద్వారా అచార్య ఆత్రేయ రచించిన సినీ గీతాలను ఏడు సంపుటాలుగా ప్రచురించడం, ఎన్నో సాహిత్య సమావేశాలను నిర్వహించడం, డా. జగయ్యతో తనకున్న ఎన్నో ఏళ్ల సాహిత్యనుబంధాన్ని ప్రఖ్యాత కవి, రచయిత రసరాజు ఎంతో ఆత్మీయంగా, రసరమ్యంగా పంచుకున్నారు. డా. గొల్లపూడి మారుతీ రావు ఎంతో విస్తారంగా సృష్టించిన నాటికలు, నాటకాలు, నవలలు, కథా సంపుటాల పై ప్రముఖ కవి, కౌముది అంతర్జాల మాస పత్రిక వ్యవస్థాపకులు కిరణ్ ప్రభ డా. గొల్లపూడి రచనలపై ఎంతో లోతైన సమగ్ర సాహిత్య విశ్లేషణ చేశారు. ముఖ్యంగా డా. గొల్లపూడి రాసిన “సాయంకాలం అయింద్ఙి నవల, ఆత్మకధ “అమ్మ కడుపు చల్లగ్ఙా, “జీవన కాలమ్స్, ఆయన విశిష్ట రచనా శైలి, కౌముది మాస పత్రికతో డా. గొల్లపూడి కున్న సుదీర్ఘ సాహిత్యనుబంధాన్ని చక్కగా వివరించారు. డా. అక్కినేని నాగేశ్వర రావు, తనికెళ్ళ భరణి, డా. గొల్లపూడితో తనకున్న ప్రత్యేక ఆత్మీయ అనుభందం, ఎన్నోసార్లు కలిసి గడిపిన మధుర సంఘటనలను డా. ప్రసాద్ తోటకూర గుర్తు చేసుకుని అది ఒక అరుదైన సువర్ణ అవకాశం అని అభిప్రాయ పడ్డారు. -
నిర్మాతలు నష్టపోకూడదని...
‘హుషారు‘ ఫేమ్ కురపాటి గని కృష్ణతేజ్, అఖిల ఆకర్షణ, తనికెళ్ల భరణి, కల్పనా రెడ్డి ముఖ్య పాత్రల్లో వెంకట్ వందెల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందింది. ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారధ్యంలో రాజధాని ఆర్ట్ మూవీస్ సమర్పణలో జి.వి.ఆర్. ఫిల్మ్ మేకర్స్ పతాకంపై ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా వెంకట్ వందెల మాట్లాడుతూ– ‘‘నిర్మాతలు నష్టపోకూడదని కరోనా సమయంలోనూ ముందుకు వచ్చి షూటింగ్లో పాల్గొన్న తనికెళ్ల భరణిగారికి కృతజ్ఞతలు. మా చిత్రాన్ని అనుకున్న బడ్జెట్లో, అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. కరోనా కంటే ముందే రెండు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాం’’ అన్నారు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు. గణేశ్ మాస్టర్, జీవా, జోగి బ్రదర్స్, అనంత్, బస్ స్టాప్ కోటేశ్వరరావ్, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి. వంశీ ప్రకాశ్, సంగీతం: సందీప్ కుమార్. -
జీహెచ్ఎంసీ ఎన్నికలు : మందకొడిగా పోలింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలింగ్ శాతం పెంపుపై తీవ్రం కృషి చేసిన అధికారులకు నిరాశే ఎదురవుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్‌ను గణనీయంగా పెంచాలని గ్రేటర్ అధికారులు కసరత్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన తాజా ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచారాన్ని చేపట్టాయి. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు మన హక్కు... తప్పనిసరిగా అందరూ ఓటు వేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయినా ఓటింగ్ శాతంగాఅంతంతమాత్రమే. దీంతో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ పోలింగ్ సరళిపై ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలసి ఓటు వేసి వచ్చిన ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ‘‘మేమంతా..ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!!’’ అంటూ ట్వీట్ చేశారు. డైరెక్టర్ తేజ, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, హీరో విజయ్ దేవరకొండ కుటుంబం తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ చాలా ప్రాంతాల్ లోమందకొడిగా సాగుతోంది. పోలింగ్ మొదలై దాదాపు మూడు గంటలు గడుస్తున్నా చాలా చోట్ల పోలింగ్ శాతం 3 శాతానికి మించలేదంటే పరిస్థితిని అర్ధం చేసు కోవచ్చు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఒకవైపు చలి తీవ్రత, కోవిడ్-19 ఆందోళన ప్రభావితం చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇపుడిపుడే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఓట్లరు బారులు తీరుతున్నారని సమాచారం. మేము అంతా ఓటు వేశాం.. మీరూ వేయండి! ఇది మన బాధ్యత... హక్కు!! #ghmcelections2020 pic.twitter.com/rUZbGuwzJZ — Tanikella Bharani (@TanikellaBharni) December 1, 2020 -
ఆచార్య సెట్లో సోనూసూద్‌కు సత్కారం
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. మరికొన్ని రోజుల్లో చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నాడు. ఈ క్రమంలో తాజాగా నటుడు సోనూసూద్ ఆచార్య సినిమా షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా లాక్డౌన్లో సోనూసూద్ అందించిన మానవత సేవలను ప్రశంసిస్తూ సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్‌తో కలిసి ఆచార్య సెట్లో సత్కరించారు. శాలువ కప్పి, మెమొంటో అందజేశారు. ఈ ఫోటోలను నిర్మాత బీఏ రాజు తన ట్విటర్లో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్లో సోనూసూద్ పాల్గొన్న విషయం తెలిసిందే. చదవండి: పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా ‘రియల్ హీరో’ Tanikella Bharani & @sivakoratala felicitated @SonuSood on the sets of #Acharya for his humanitarian work during the pandemic. pic.twitter.com/LpY7xED2pu — BARaju (@baraju_SuperHit) November 21, 2020 కాగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ అందించిన సేవలు మరువరానివి. అనేక మంది వలస కార్మికులకు తన సొంత ఖర్చులతో బస్సులు, రైలు, విమానం ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు చేర్చారు. విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో ‘రియల్ హీరో’గా నిలిచాడు. తన దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా తోచినంత సాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు. ఓవైపు షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ.. తన కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని సోనూసూద్ కలుసుకొని వారి సమస్యలను ఓపికగా విని పరిష్కరిస్తున్నాడు. చదవండి: వైరల్ అవుతున్న సోనూసూద్ వీడియో -
తెలంగాణలో పచ్చదనం పెరిగింది
షాద్‌నగర్ టౌన్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్కలు నాటారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రకాశ్‌రాజ్ తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు పెంచే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారని, గత ఆరేళ్ళ కాలంలో తెలంగాణలో పచ్చదనం పెరిగిపోయిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌లు మట్టిమనుషులని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినీ నటులు మోహన్‌లాల్, సూర్య, రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. -
నేను...బాలు..కొన్ని జ్ఞాపకాలు
కైలాసంలో... శివతాండవం ఆగింది...! డమరుకం పేలింది...! రుద్రాక్ష రాలింది...! ఏకబిల్వమ్... శివార్పణం అయిపోయింది!! సింహపురిలో శివకేశవులిద్దరిమీదా హరికథలు చెప్పుకుంటూ ఏడాదికి ఒకసారి త్యాగరాజ ఆరాధనోత్సవాలు సమయంలో ఉంఛవృత్తి చేసి, పరమపవిత్రమైన జీవితం గడుపుకుంటున్న శ్రీపతి పండితారాధ్యుల సాంబ మూర్తి, శకుంతలగారి ఇంట బంగారు పంట... బాలు. · · · ఎస్.పి.బి... అనే బీజాక్షర సహిత పుంభావ సరస స్వర సరస్వతితో నా జ్ఞాపకాలు.... · · · తొలి పరిచయం... నిడదవోలులో.... జవ్వాది రామారావు గారి కళాసంస్థ.... మా ‘కొక్కొరొక్కో’ నాటిక వేసిన సందర్భంలో మాకు ప్రథమ బహుమతి వస్తే... ముఖ్య అతిథి అయిన బాలు గారు నన్ను, తల్లావజ్ఝల సుందరాన్ని కావలించుకుని ‘‘మీలాంటి వాళ్ళు ఉండాల్సింది హైదరాబాదులో కాదు.... అర్జెం టుగా మద్రాస్ రండి’’ అని ప్రోత్సహిం చిన సంస్కారి. · · · ‘కళాసాగర్’ నాటక పోటీల్లో; ప్రథమ బహుమతి మళ్ళీ ‘కొక్కొరొక్కో’కి వస్తే... ‘‘వీళ్ళు సామాన్యులు కాదు’’ అని... నేను, సుందరం స్టేజి ఎక్కి బహుమతి అందుకునే వరకూ ఆడిటోరియంలో అందరి చేత చప్పట్లు కొట్టించిన సహృదయుడు బాలు. · · · నా మొదటి చిత్రం ‘కంచు కవచం’ రికార్డింగ్.... నేను డైలాగ్స్ రాసిన సినిమా లో వేటూరి రచన, బాలు పాట .... అలా చూస్తూ ఉండిపోయా... నా కల పాటై బాలు నోట వినిపిస్తోంది. కాళ్ళకు దణ్ణం పెడితే; గుండెలకు హత్తుకుని... ఎత్తుకుని నెత్తినెట్టుకునే మనిషి! · · · తర్వాత.... వంశీ– ఇళయరాజా గారి కాంబినేషన్లో ఎన్ని పాటలు... ‘ఆలాపన’, ‘లేడీస్ టైలర్’, ‘శ్రీకనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’, ‘చెట్టు కింద ప్లీడర్’లోని ‘చల్తీ కా నామ్ గాడి, చలాకి వన్నెలేడి’...! ఎన్ని రికార్డింగ్ థియేటర్లలో పలకరింపుతో కలిసి బాతాఖానీలో.... టిఫిన్సో్ల. తమాషా ఏమిటంటే సింగర్లు తిండి, నీళ్ళ విషయంలో పరమ జాగ్రత్తగా ఉంటారు... బాలుకు అదేమీ లేదు. గుప్పెడు వక్కపొడి, ఎప్పుడైనా సిగరెట్, కుదిరితే తాంబూలం. గొంతును ఈశ్వరుడికి ఎల్.ఐ.సి చేసినట్టుండేవాడు. · · · నేను బాలు కలిసి కొన్ని సినిమాల్లో నటించే సమయాల్లో నా సాహిత్యం, ముఖ్యంగా ‘ఆటగదరా శివ’, ’శభాష్ రా శంకరా’ విని ముగ్ధుడైపోయేవాడు. ‘శభాష్ రా శంకరా’ సీడీని శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యానికి అంకితం ఇస్తూ... ‘భాషా శ్రీపతికి... పాటల పండితుడికి... సుబ్బరమైన బాలుడికి...’ అని చమత్కరిం చాను... · · · కొత్తగా రాసిన ‘శివ చిలకలు’ అనే శివతత్వాలను వినిపించి, వీటిని మీరు పాడాలి అంటే... కన్నీరు నిండిన కళ్ళతో, ‘వద్దు భరణి, వీటికి నీ గొంతే కరెక్ట్.... కొంచం ‘రా’ గా ఉంటే మంచిది.... శుభం భూయాత్‘ అన్నాడు. · · · నేను, జనార్దన మహర్షి అమీర్‌పేట్‌లో కొనుక్కున్న మొదటి 2 బెడ్ రూమ్ ఫ్లాట్ గృహప్రవేశానికి పిలిస్తే వచ్చి, మాతో భోజనం చేసి, సరదాగా గడిపి వెళ్తే... మా బంధువులంతా అలా అవాక్కయి చూస్తూ ఉండిపోయారు... ‘బాలు మా ఇంట్లో అడుగు పెట్టేడంటే సాక్ష్యాత్తు ఆ సుభ్రహ్మణ్య స్వామే వచ్చినట్టు పొంగిపోయాం‘. · · · ఆస్ట్రేలియాలో ఉండే కోడూరి రామమూర్తి గారు బాలుకి, నాకు కామన్ ఫ్రెండ్. బాలు ‘భగవద్గిత’ పాడేరు... (ఈ సంగతి చాలా మందికి తెలీదు). సి. నారాయణ రెడ్డిగారు, మిగతా ప్రముఖులు ముఖ్య అతిధులుగా చాలా వైభవంగా ‘సత్య సాయి నిగమాగమంలో’ ఆవిష్కరణ జరిగింది... ఆ కార్యక్రమానికి నేనే యాంకర్ని. కానీ అదెందుకో పాపులర్ కాలేదు. బహుశా భగవద్గీతను ఘంటసాల మాష్టారుకి, బిల్వాష్టకాన్ని బాలుగారికి కేటాయించాడేమో ఆ పరమేశ్వరుడు. · · · నా 25 సంవత్సరాల సినీ యాత్రని ‘వెండి పండగ’ పేరుతో రవీంద్ర భారతిలో సంగం అకాడమీ సంజయ్ కిశోర్ నిర్వహిస్తే చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. చివరిగా బాలు అడక్కుండానే భక్త కన్నప్పలో పద్యాలు పాడి, ప్రేక్షకులంతా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇచ్చేలా చేసి తన వాత్సల్యాన్ని ప్రకటించాడు. వెండిపండగ నాడు నాకదో బంగారు బహుమతి. · · · ఒకసారి చెన్నైలో బాలు గారి ఇంట్లో చరణ్ తియ్యబోయే ఒక ఆర్ట్ సినిమా గురించి చర్చించుకున్నాం. అక్కడే డిన్నర్ చేసి మీద దిగి వస్తుం డగా, కాలు జారి, నా బొటనవేలు ఫ్రాక్చర్ అయ్యింది. హైదరాబాద్ వచ్చాకా దాదాపుగా ప్రతిరోజా ఫోన్ చేసి ‘కాలు ఎలా ఉంది భరణి’ అని తగ్గేవరకూ పరామర్శిస్తూ ఉండేవాడు ఆయన. · · · మేమెప్పుడూ కలిసినా తరచూ వేటూరి వారి సాహిత్యంలో చమక్కుల్నీ, ఆ భాషా సౌందర్యాన్ని, భావ శబలతని తల్చుకుని మురిసిపోతూ ఉండేవాళ్ళం. ‘వేటూరి వంటి వారు వెయ్యేళ్ళకోసారి పుడతారేమో’ అని నేనంటే... ‘మా అందరి ఆయుష్షు పోసుకుని నువ్వు వెయ్యేళ్ళు బతకాలయ్యా సుందరయ్యా’ అని అంటుండేవాడు బాలు. మేము నీ విషయంలో అదే కోరుకున్నాంగా... కానీ ఏది? దెబ్బకొట్టేశావుగా బాలు! · · · ఇక ‘మిథునం’ సినిమా అనుకున్నప్పుడు మొదట అప్పదాసు వేషం నేను వేద్దామని అనుకుని, చాలా మంది హీరోయిన్లు అంటే హిందీ రేఖ... సుహాసిని... రాధిక... వై. విజయ... శైలజ (బాలు గారి చెల్లి), మృణాళిని (రచయిత్రి) ఇలా చాలామందిని అనుకున్నాకా... లక్ష్మి గారు, బాలు ఫిక్స్ అయ్యారు. బాలు గారికి కథ వినిపిస్తే బావుందని మెచ్చుకుని ‘ఔను, నువ్వూ నటుడివే కదయ్యా! ఇంత మంచి పాత్ర నువ్వే వెయ్యచ్చుగా’ అన్నాడు. అప్పుడు నేనన్నాను ‘స్వామీ నేనే రాసి, నేనే వేసి, నేనే తీస్తే, చివరికి నేనే చూసుకోవాల్సొస్తుందేమో’ అంటే నవ్వేసి చాలా తక్కువ పారితోషికం తీసుకొని అప్పదాసు పాత్రకి జీవం పోశాడు. · · · ‘మిథునం’ నిర్మాత ముయిద ఆనందరావు గారి ఊరు వావిలవలసలో షూటింగ్. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మూడు నెలల ముందు నుంచే అక్కడికి వెళ్ళి, ఆ పాడుబడ్డ పెంకుటింటిని సరిచేసి, అక్కడ నేను చెప్పిన అన్ని మొక్కలనీ పెంచి... సర్వాంగ సుందరంగా, పరమ సహజంగా తీర్చిదిద్దాడు. బాలుగారు లొకేషన్ చూడగానే వాళ్ళావిడ సావిత్రి గారితో ‘మనం రిటైర్ అయ్యాకా ఇలాంటి పర్ణశాలలో ఉండాలోయి’ అన్నాడు. ఏది బాలూ? ఆవిడ సావిత్రే ... నువ్వే పేద్ద సత్యవంతుడివి.... మాట తప్పావు!!! · · · రోజూ మధ్యాహ్నం బ్రేక్ చెప్పగానే తోటలో ఒక బెండకాయని కొరుక్కు తింటూ ఉండేవాడు. ‘ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పచ్చివి తింటూ ఉండాలయ్యా’ అని ముచ్చట పడుతూ ఉండేవాడు. బాలుని సంతోషపెడదామని ప్రత్యేకంగా ఒక వంట మనిషిని పెట్టి వండిస్తే సాయంత్రం ఆయన నవ్వుతూ, ‘నువ్వు ప్రేమ చేత అన్నీ వండించేవు గానీ, నేను రెండు గరిటెల కన్నా ఎక్కువ తినకూడదయ్యా.... బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాగా’ అన్నాడు. నేను ఎంత బాధపడ్డానో! కడుపునిండా అన్నం పెట్టేమన్న తృప్తి కూడా లేకుండా పోయింది అప్పదాసూ!! · · · బాలు, లక్ష్మి గార్లిద్దరూ పొద్దున్నే 8 గంటలకు వచ్చేసేవారు లొకేషన్‌కి. ఒంటిగంటకు బ్రేక్. మళ్ళీ 3 గంటలకే షూటింగ్. 6 గంటలకి పేక్ అప్. క్లైమాక్స్ మాత్రం ఒకటి, రెండు రోజులు అర్ధరాత్రి వరకూ జరిగింది... ఇద్దరూ విసుక్కున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్ర ప్రసాద్‌ని బాలు కేకలేశాడు కూడా! సినిమా చూశాక, కెమెరామ్యాన్‌కి సభాముఖంగా సారీ చెప్పి కావలించుకున్నాడు. దట్ ఈజ్ బాలు! · · · షూటింగ్ చివరిరోజుల్లో ఒక సీన్ పొరపాటున డ్రెస్ మార్చి, మళ్ళీ తియ్యాల్సొచ్చింది. ఆయనకీ కోపం వచ్చి లొకేషన్లో అన్యాపదేశంగా అసిస్టెంట్ డైరెక్టర్లని కేకలేశాడు. తప్పెవరు చేసినా బాధ్యత దర్శకుడిగా నాదే కదా... నేను హర్ట్ అయ్యాను... రాత్రి కన్నీళ్ళు పెట్టుకున్నాను. రెండు రోజులు మేము మాట్లాడుకోలేదు. సినిమా అయిపోయింది. నేను ప్యాక్ అప్ చెప్పేశాను. ఆయన్ని సాగనంపడానికి ముభావంగా కార్ దగ్గరకొచ్చాను. ఆయన చొక్కా పట్టుకు లాగి, కావలించుకున్నారు. నేను గాఢంగా కావలించుకుని ఏడ్చేశాను. నన్ను సముదాయిస్తూ, ‘చాలా గొప్ప సినిమా తీశావు భరణీ! పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా తీశావు. నీకు అఖండమైన పేరొస్తుంది. నీతో పాటు నాకూనూ‘ అన్నాడు. కాళ్ళ మీద పడిపోతే లేవనెత్తి ముద్దెట్టుకున్నాడు. ఆ ముద్దే నాకు ఆస్కార్ అవార్డు! · · · ఈ సినిమాలో టైటిల్ సాంగ్ బాలు గారితో కాకుండా జేసుదాస్ గారితో పాడించాడు వీణాపాణి. షూటింగ్ టైంలో ఆ సంగతి బాలుకి చెప్పలేదు. షూటింగ్ చివర రోజున వినిపిస్తే ‘నా కోసం మా అన్న పాడేడా!’ అని పరమానందపడిపోయాడు. సినిమా రిలీజ్ అయిన తరువాత ఒకసారి నాతో ఇలా అన్నాడు ‘ఎప్పుడైనా నేను జీవిత చరిత్ర రాస్తే ‘మిథునా’నికి ముందు, ‘మిథునా’నికి తరువాత’ అని... అంతకన్నా ఏ దర్శకుడికైనా ఏం ప్రశంస ఉంటుంది? శ్రీపతితో కలయిక... ఐశ్వర్యం. పండితారాధ్యుడితో పరిచయం... యోగం. బాలసుబ్రహ్మణ్యంతో స్నేహం... వ్యసనం... · · · ఇదీ కైలాసమే! కనకమహాసభ... ఐశ్వర్యానికి నిలయం... మొత్తం బంగారంతో మెరిసిపోతోంది. అంతెత్తు వెండి నంది తన ఉచ్ఛ్వాస, నిస్వాసాలతో బంగారు ఉయ్యాల ఊపుతోంది. ఆదిదంపతులిద్దరూ కూర్చున్నారు. ఒకవైపు అమ్మవారు...మరోవైపు అయ్యవారు. పార్వతీదేవి ఒళ్ళో నెల‘బాలుణ్ణి’ ఒద్దికగా బజ్జోపెట్టుకుని జోల పాడుతున్న హేల! చిరునవ్వుతో కన్నులరమూసిన పరమేశ్వరుడి లీల! వ్యాసకర్త : తనికెళ్ల భరణి, ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు -
గరం గరం వార్తలు
-
గరం గరం వార్తలు నేడే ప్రారంభం
-
గరం గరం ఛాయ్ తాగితే గళా (గొంతు) సాఫైతది..
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రత్యేక కార్యక్రమం గరం గరం వార్తలు నేడే ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రోమో తెలుగు రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణ వీడియో సైతం వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతున్న మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. (ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు) అందరికీ దండాలు, నమస్కారాలు పెడుతూనే భరణి సాసర్లో ఛాయ్ పోసుకొని తాగుతున్నాడు. "పొద్దుగాల పొద్దుగాల గరం గరం ఛాయ్ తాగితే గళా(గొంతు) సాఫైతది. ఆ తర్వాత పాటలు, మాటలు, ముచ్చట్లు, ఓ దునియా మాట్లాడచ్చు. అందుకే చెప్పే వార్తలు కూడా గరం గరం ఉండాలని డిసైడ్ చేసినం" అంటూ ఈ కార్యక్రమానికి ఆచితూచి ఆ పేరే ఎందుకు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కాగా తెలంగాణ యాసతో విశేషంగా పాపులారిటీ సాధించుకున్న సత్తి తాజాగా సాక్షి టీవీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గరం గరం వార్తలు ప్రోగ్రాంతో ముందుకు వస్తున్నాడు. -
శంకరా భరణి
-
ఈ నెల 20న ‘ఆట గదరా శివ’ సంగీత కచేరీ
ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ల భరణి ‘ఆటగదరా శివ’ అనే పేరుతో ఓ పుస్తకాన్ని పాఠకలోకానికి అందించిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం ప్రేక్షకాదరణకు నోచుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులోని అంశాలను ఒక్క కార్యక్రమ రూపంలో కూర్పు చేసి దేశవిదేశాలలో ఎన్నో ప్రదర్శనలిచ్చారు. అమెరికా దుబాయ్ లాంటి పలు దేశాల్లో భారతీయ వాయిద్యాలతో ‘ఆట గదరా శివ’ను కచేరి తరహాలో ప్రదర్శించారు. అయితే ‘ఆట గదరా శివ’ కచేరీ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయి సంగీత కళాకారుల బృందంతో సింఫనీ తరహాలో ప్రదర్శించేందుకు రంగం సిద్దమైంది. ఇవామ్ (ఐడబ్ల్యూఏఎమ్) సాంస్కృతిక సంస్థ అద్వర్యం లో , తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ సమర్పణలో తనికెళ్ళ భరణి సారథ్యంలో తాళ్లూరి నాగరాజు సంగీత దర్శకత్వంలో మణి నాగరాజ్ ‘ఆటగదరా శివా’ కార్యక్రమం చేపట్టారు. ఫ్లూట్ నాగరాజు, డ్రమ్స్ శివమణి తదితర ప్రసిధ్ద కళాకరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పలు విదేశీ వాయిద్య పరికరాలను ఉపయోగించి ఈ కార్యక్రమాన్ని అజరామరంగా మార్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫిబ్రవరి 20న సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరగనుంది. -
బాగుంది అంటే చాలు
‘‘సినిమా చూసిన తర్వాత అందులోని సందేశాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మా సినిమాలో అవయవదానం గురించి చెప్పాం. సినిమా చూసి ప్రేక్షకులు బాగుందంటే చాలు’’ అన్నారు మున్నా కాశి. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హేజా’. తనికెళ్ల భరణి, ముమైత్ ఖాన్, నూతన్ నాయుడు (బిగ్‌బాస్ ఫేమ్) కీలక పాత్రధారులు. కెవిఎస్ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. మున్నా కాశి మాట్లాడుతూ– ‘‘మిస్టర్ 7, యాక్షన్ 3డీ’ వంటి సినిమాలకు సంగీతం అందించాను. రామ్‌గోపాల్‌వర్మగారి ‘కిల్లింగ్ వీరప్పన్’కు రెండు పాటలు చేశాను. ‘మామా చందమామ’ సంగీత దర్శకుడిగా నా చివరి చిత్రం. సంగీత దర్శకుడిగా బ్రేక్ తీసుకుని, ‘చంద్రముఖి, అరుంధతి’ లాంటి హారర్ కథలు అయితే బాగుంటుందని ఈ చిత్రం చేశాను. కథలో నాది లీడ్ రోల్ మాత్రమే. కథను మలుపు తిప్పే పాత్రలో తనికెళ్ల భరణిగారు నటించారు. నా తర్వాతి చిత్రం సెటైరికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది’’ అన్నారు. -
మలుపుల సరోవరం
విశాల్ వున్న, ప్రియాంకా శర్మ, శ్రీలత, తనికెళ్ల భరణి, ‘ఛత్రపతి’ శేఖర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సరోవరం’. సురేష్ యడవల్లి దర్శకత్వంలో శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ యడవల్లి మాట్లాడుతూ– ‘‘సరోవరం’ అనే గ్రామంలో జరిగిన కథ ఇది. భావోద్వేగంతో నడిచే ఈ కథలోని మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు ఎస్.శ్రీలత. ‘‘మాస్కు కావాల్సిన అంశాలతో పాటు యూత్‌ని ఆకట్టుకునే అంశాలు కూడా ఉన్నాయి’’ అన్నారు నటులు ‘జబర్దస్త్’ నవీన్, రాము. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పులి ఈశ్వర్ రావు. -
‘తూనీగ’ ప్రోమో సాంగ్ విడుదల
ఒక దైవ రహస్యం వెల్లడి చేస్తామంటూ ఆద్యంతం ఆసక్తి రేపేలా రూపుదిద్దుకుంటున్న సినిమా తూనీగ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రోమో సాంగ్ ను కళింగనగరిలో ఈజిప్టు సుందరి నవలా రచయిత భాను ప్రకాశ్ కెంబూరి సామాజిక మాధ్యమాల ద్వారా విడుదలచేశారు. జాతరమ్మ జాతర కూలిజనం జాతర అనే పల్లవితో సాగే ఈ పాటను రేలా రే రేలా ఫేం జానకీ రావు స్వీయ స్వరకల్పనలో ఆలపించారు. చిత్ర ప్రచార సారథి రత్నకిశోర్ శంభుమహంతి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా భాను ప్రకాశ్ మాట్లాడుతూ ‘సరికొత్త ఆలోచనలకు ఈ సినిమా నాంది కావాలి.మా శ్రీకాకుళం కుర్రాళ్లు చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అయితే రేపటి వేళ మరికొందరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. శ్రీకాకుళం అంటే వలసలకు నిలయం అని, వెనుకబాటుకు చిరునామా అని ఏవేవో అనుకుంటారు కానీ ఇక్కడి కళలు, ఇక్కడి సాహిత్యం, ఇక్కడి జానపదం ఎంతో గొప్పవి. వీటిని సినీ మాధ్యమం విరివిగా వాడుకుని విజయాలు సాధించింది. కారణాలేమైనప్పటికీ ఇక్కడి జానపదం ప్రపంచ వ్యాప్త గుర్తింపునకు నోచుకోలేకపోతోందీ వేళ. ఈ నేపథ్యంలో జానకీరాం ఆలపించిన ఈ పాట ఎంతో హృద్యంగా ఉంది. గతంలో కూడా ఈ ప్రాంత అస్తిత్వ గొంతుకగా, ఆత్మ గౌరవానికి ప్రతినిధిగా నిలిచిన వారెందరో ఉన్నారు.ఆ కోవలో ఆ తోవలో మిత్రులు, చిత్ర దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ చిత్రయూనిట్ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిత్రబృందం తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్న చిత్రయూనిట్ సంగీత దర్శకుడు గాయకుడు జానకీ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారబాధ్యతలు నిర్వహిస్తున్న రత్నకిశోర్ శంభుమహంతికి దర్శకులు ప్రేమ్ సుప్రీమ్ అభినందనలు తెలిపారు. ఈ చిత్రం విషయమై మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి, మరో రచయిత మరుధూరి రాజాకు, నిర్మాత రాజ్ కందుకూరికి, ప్రముఖ దర్శకులు వేణు ఊడుగులకి, సతీశ్ వేగేశ్నకు, సినివారం ఫేం అక్షర కుమార్ బృందానికి, ప్రముఖ కళా దర్శకులు లక్ష్మణ్ ఏలేకు, ప్రముఖ నఖ చిత్ర కళాకారులు రవి పరసకు, ప్రముఖ చిత్రకారులు బాబు దుండ్రపెల్లికి, గిరిధర్ అరసవల్లికి, ధనుంజయ అండ్లూరికి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ శ్రీనివాస ఫణిదర్ కు ధన్యవాదాలు తెలిపారు. -
రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..
‘ఆయన స్ఫటికం’ అంటారు తనికెళ్ల భరణి. క్రిస్టల్ క్లియర్ అని. ఆ స్ఫటికంలో తనని తాను చూసుకున్నారు.తనని మాత్రమే కాదు..తనకో ఆదర్శాన్నీ.. తనకో అయ్యప్పనీ..తనకో గురువుగారినీ.. చూసుకున్నారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాల్నితడికళ్లతో తడిమి తడిమి చూసుకుంటున్నారు.రాళ్లపల్లితో మొదలైన తనికెళ్ల ప్రయాణంలో..ఎన్నో మలుపులు..మరపురాని మరెన్నో తలపులు.చదవండి. సాక్షి ఎక్స్‌క్లూజివ్. రాళ్లపల్లిగారితో మీ పరిచయం గురించి..? తనికెళ్ల భరణి: అప్పుడు నేను హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో చదువుతున్నాను. కాలేజీలో ఓ నాటకం వేయాల్సి వచ్చింది. ‘అద్దె కొంప’ అనే నాటకం. నేను రాసిందే. స్వీయానుభవాలతో రాసిన ఆ నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ దెబ్బతో మా చదువులు నాశనం. ఎప్పుడైతే నాటకం క్లిక్ అయిందో అప్పుడే సీతాఫల్ మండిలో ‘నవీన్ కళామందిర్’ అని ఓ నాటక సమాజాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అప్పుడు నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా నాటకానికి రాళ్లపల్లిగారిని పిలవాలనుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్లి జరిగి 14 రోజులే అయింది. మేం వెళ్లి ‘మీరు రావాలి సార్’ అన్నాం. ‘నాటకం కదా వస్తాను లే’ అన్నారు. ఆయనతో నా పరిచయం అదే. రాళ్లపల్లిగారు వస్తున్నారంటే ఒక ఉద్వేగం. స్టేజి మీద ‘ఇప్పుడు రాళ్లపల్లిగారు స్వగతంగా మాట్లాడతారు’ అన్నాను. ‘లేదు. ప్రకాశంగానే మాట్లాడతాను’ అని మొదలుపెట్టారాయన. ఆ తర్వాత నుంచి కాలేజీకి వచ్చిపోయేప్పుడు రాళ్లపల్లిగారింట్లో గడపడం అలవాటై అక్కడే ఉండిపోయేంతగా దగ్గరైపోయాను. నాటక రంగంలో అప్పటికే ఆయన పాపులరా? అవును. ఆయన అప్పటికే ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’ అనే ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నారు. ఆయనా బీకామ్ చదివారు. కానీ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్‌తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌కు వచ్చారు. నాకు తెలిసి అప్పట్లో సీతాఫల్మండి ప్రాంతంలో ‘అయ్యప్ప స్వామి’ గురించి ప్రచారం చేసినవారిలో రాళ్లపల్లిగారు మొదటివారు. అక్కడ ఓ తమిళియన్ ఉండేవారు. ఆయన శబరిమల వెళుతుండేవారు. అది తెలిసి ఈయన అయ్యప్ప గురించి చెప్పడం మొదలుపెట్టారు. రాళ్లపల్లిగారు 28సార్లు శబరిమల వెళ్లారు. ఆయన ద్వారా శబరిమలకు వెళ్లడం మాకూ అలవాటైంది. మా అనుబంధం ఎంత గాఢతను సంతరించుకుందంటే.. నేను నాటకాల్లో ఎక్కువగా నటిస్తున్నానని మా నాన్నగారు ఇంట్లో నుంచి గెంటివేశారు. అప్పుడు రాళ్లపల్లిగారి ఇంటికి వెళ్లాను. అక్కడే ఉండేవాణ్ణి. రాళ్లపల్లిగారి నాటకాలకి స్పందన ఎలా ఉండేది? విపరీతమైన ప్రేక్షకాదరణ ఉండేది. వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కదా. అక్కడి నాటకాల అధినేత మంత్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి. రాళ్లపల్లిగారు కన్యాశుల్కం, వరకట్నం వంటి నాటకాలు వేస్తే కచ్చితంగా వన్స్మోర్లు వచ్చేవి.ఒక మనిషి ఇంతలా ఓ పాత్రలో ఒదిగిపోగలరా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన నటించేవారు.ఆయన నాటక వైభవాన్ని చూశాం మేం. ప్రతి సంవత్సరం ఆయన నాటకం వేసేవారు. ఆగస్ట్ 15 ఆయన పుట్టినరోజు. ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. 50 వేలు ఎలా? అప్పు చేసేవారో ఏమో కానీ 50 వేల రూపాయలు ఇచ్చేవారు. లాస్ట్ ఇయర్ దాకా ఇచ్చారు. ఆయన నాటకాలు తీసే విధానం చాలా గొప్పగా ఉండేదట? అవును. నాటకం చేస్తే ప్రాణం పెట్టేవారు. 5 గంటలకు అంటే సరిగ్గా ఆ టైమ్‌కే రిహార్సల్ మొదలుపెట్టాలి. అది కూడా ఒక వైభవంగా ఉండేది. సినిమా లెవల్లో ఉండేది. ఖర్చంతా ఆయనదే. అన్నీ లెక్క వేసి.. వెయ్యి రూపాయిలు ప్రొడక్షన్ వస్తుంటే ఖర్చు 3 వేలు ఉండేది. అయితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే ఎప్పుడైతే నాటకం ఇలా అయిపోయిందో, ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి వెళ్లారో నాటకానికి ఇంత ఖర్చు చేయడం అనవసరం అని నేను అనుకున్నాను. ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలతో మొదలెట్టా. ఖర్చు తగ్గించా. మ్యూజిక్ తీసేశా. ఉధృతంగా, ఉద్యమంలా నాటకాలు వేసేవాళ్లం. రాళ్లపల్లిగారిని మీరు ఏమని పిలిచేవారు? గురువుగారూ అని పిలిచేవాణ్ణి. ‘ఏమయ్యా... భరణీ’ అనేవారు. గురువుగారి భార్యను ‘మాస్టారు’ అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఆమె టీచర్. వాళ్లది చాలా అన్యోన్యమైన దాంపత్యం. నిజం చెప్పాలంటే వారి ఇల్లు ఒక సత్రంలా ఉండేది. టిఫిన్లు.. భోజనాలు.. కాఫీలు.. టీలు ఇలా వచ్చినవాళ్లందరికీ సమకూరుస్తుండేవాళ్లు. నాటకాలంటే గురువుగారికి ఎంత మమకారం అంటే.. ఒకానొక దశలో వాటి కోసం అప్పులు చేయడం ప్రారంభించారు. ఏ స్థాయిలో అప్పులు అంటే.. ఆయన ఇంట్లో నుంచి ఓసారి ఓ సోఫాను నా కళ్లముందు నుంచి పట్టుకుపోయారు. డబ్బు కోసం ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డారు. ‘పర్లేదు.. గురువుగారూ.. మేం ఉన్నాం’ అని చెప్పేవాళ్లం. అయితే అప్పుడు మేం నిరుద్యోగులం. ఆయన నేతృత్వంలో నాటకాలు వేసేవాళ్లం. పరమ పరాకాష్ట ఏంటంటే... అప్పులవాళ్ల బాధ భరించలేక ఒకసారి ఇంటికి సైకిల్ మీద వచ్చి వెనక గుమ్మం మీద నుంచి దిగి మేడ మీదకు వచ్చి కోడిగుడ్డు సైజ్ దీపం పెట్టి... ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాశారు. దాదాపు మేం వందసార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించాం. వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకుంది. అప్పుడు నాకు 25 ఏళ్లు ఉంటాయి. అందులో నేను 70 ఏళ్లకు పైబడిన మామ పాత్ర చేశాను. ప్రదర్శించిన వందసార్లూ ఆ పాత్ర వేయడం ఓ మరచిపోలేని అనుభూతి. మీ గురువుగారి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి? ‘స్త్రీ’ అనే సినిమాలో చిన్న వేషం వచ్చింది. చిన్నదైనా సినిమాల్లోకి వెళుతున్నారంటే గొప్ప కదా. మేమంతా రాళ్లపల్లిగారిని సీతాఫల్ మండిలో రిక్షాలో కూర్చోబెట్టుకుని, మేం అటూ ఇటూ కూర్చొని, అదే.. మాకు మెర్సిడెస్ బెంజ్.. ఆయన్ను తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించాం. అమ్మగారి (రాళ్లపల్లిగారి సతీమణి) గురించి బాధపడవద్దు అని చెప్పాం. మీ గురువుగారితో మీరు పంచుకున్న ‘బెస్ట్ మూమెంట్స్’లో మరచిపోలేనివి ఏమైనా..? చాలా ఉన్నాయి. అప్పుడు నేను నిరుద్యోగిని. గురువుగారు సాంగ్ అండ్ డ్రామా కంపెనీకి సీతాఫల్ మండి నుంచి సైకిల్ వేసుకుని సోమాజిగూడ వెళ్లేవారు. వెళ్లేటప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టుకుని పద్యాలు పాడుకుంటూ సైకిల్ తొక్కేవారు. సాయంత్రం నేను ఆయన్ను కూర్చోబెట్టుకుని సైకిల్‌పై సీతాఫల్ మండి నుంచి తీసుకొచ్చేవాణ్ణి. పేదరికం.. ఆ మధ్యతరగతి జీవితం.. ఇలా అన్నీ కలిసి ఎంజాయ్ చేశాం. ఈయనకు బేసిక్‌గా ఉన్న వ్యసనం, బలహీనత ‘దానం’ చేయడం. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే.. వంద రూపాయలు ఇవ్వడం దానం. 500 ఇవ్వడం అపూర్వం. కానీ వెయ్యి రూపాయలు దానం చేయడం అంటే.. అది గురువుగారే చేయగలరు. ఆయన శిష్యుల్లో ఎవరూ అలా ఉన్నదంతా దానం చేసేయకూడదని చెప్పలేదా? గొప్ప గొప్పవారు ఏదైనా చేస్తుంటే చూసి నేర్చుకోవాలి కానీ ఎందుకు అని అగడకూడదు. ఆయన తత్వం అది. ఊటీలో షూటింగ్ జరుగుతోంది ఓసారి. అప్పటికి ఆయన సినిమాకు పదివేల రూపాయలు పారితోషికం తీసుకునేవారు. ఆ షూటింగ్లో వందమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ చలికి వణికిపోతున్నారు. అది చూసిన రాళ్లపల్లిగారు చలించిపోయి తనకు రావాల్సిన డబ్బులను ముందుగానే నిర్మాత నుంచి తీసుకుని ఆ డబ్బులతో వారికి షాల్స్ కొని తీసుకువచ్చారు. ఇలాంటి ఓ వెయ్యి సంఘటనలను నేను చెప్పగలను. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఎన్నో దానాలు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. నాకు కోపం వచ్చేది. కానీ ఆయనకు దానం ఓ వ్యసనం. కర్ణుడిలా అన్నమాట. అప్పట్లో ఆటోవాళ్లు కొట్టుకునేవారు ఆయన్ను తీసుకెళ్లడానికి. మీటర్ 100 అయితే 500 ఇచ్చేవారు. ఆయన ‘స్ఫటికం’లాంటి వ్యక్తి. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు కదా అలా. డబ్బు ఉన్నా లేకున్నా ఆయన సంతోషానికి కొదవ ఉండేది కాదు. మా గురువుగారు ‘నిత్య సంతోషి’. మీ సినిమా కెరీర్... మీరు రచించి, రాళ్లపల్లిగారు నటుడిగా చేసిన సినిమాల గురించి? నేను చెన్నై వెళ్లినప్పుడు ఓ సందర్భంలో గురువుగారు దర్శకుడు వంశీకి నన్ను పరిచయం చేశారు. ఆయన నాకు కథ చెప్పి కొన్ని రోజులు టైమ్ ఇచ్చి ఏడు సీన్లు రాసుకుని తీసుకు రమ్మన్నారు. నేను చాలా స్పీడ్‌గా ఉండేవాణ్ణి. వంశీ ఉదయం చెప్పగానే నేను సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసేశాను. అయితే నా సినిమా కెరీర్ మొదలైంది సుమన్ నటించిన ‘కంచు కవచం’తో. ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాను. ఆ తర్వాత వంశీ ‘ఆలాపన, లేడీస్ టైలర్’.. చేశాను. ‘లేడీస్ టైలర్’ సూపర్ హిట్. అప్పట్నుంచి రైటర్‌గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాళ్లపల్లి గారివి కూడా వీటిలో చాలా మంచి పాత్రలు.ఓ తమాషా సంఘటన చెబుతాను. వంశీగారి ప్రతి సినిమాలో రాళ్లపల్లిగారు ఉంటారు. ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు ఓ పాత్రకు రాళ్లపల్లిగారి పేరు రాశారు వంశీ. ఆ పేరు కొట్టేసి నేను ఇంకో పేరు రాసి, వేరే పాత్ర (బోయవాడి)కు గురువుగారి పేరు రాశాను. అప్పుడు వంశీ ‘ఆయన ఇంట్లో ఉంటూ ఆయన తిండి తింటూ మీ గురువుగారి పేరు కొట్టేశావేంటి? ఆయనకు ద్రోహం చేస్తున్నావేంటి?’ అన్నారు. లేదు సార్.. ఆ వేషం బాగుంటుంది అన్నాను. ఆ పాత్ర గురువుగారికి నిజంగా మంచి పేరు తెచ్చింది. రాళ్లపల్లిగారు బాగా వంట చేస్తారట? అవును. వంట సంగతి అడిగితే ఓ సంఘటన గుర్తొచ్చింది. ఓసారి గురువుగారి భార్య పుట్టింటికి వెళ్లారు. రవీంద్రభారతిలో నాటకం అయిపోయి మేం ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. స్టవ్ ఉంది. బియ్యం కడిగాం. చూస్తే అగ్గిపెట్టె లేదు. ఎలాగా అనుకున్నాం. ఆయనకో అలవాటు ఉండేది. చెవిలో అగ్గిపుల్లలు పెట్టుకుని తిప్పేవారు. దాన్ని అలా పైకి విసిరేవారు. అది గుర్తొచ్చి అటకమీద చూస్తే రెండు అగ్గిపుల్లలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాగుంది. ఒక్క అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించాలి. వెలిగించలేకపోతే ఆ రోజు పస్తే. మీరు వెలిగించండి సార్ అన్నాను. నేను వెలిగించడం మిస్సయిందనుకోండి.. నా వల్ల పస్తు ఉండాల్సి వస్తుందేమో అని టెన్షన్. మొత్తానికి వెలిగించాం. ఆ రోజు భోజనం తిన్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. వంట అద్భుతంగా చేసేవారు. షూటింగ్లో ఈయన సీన్స్ ముందుగా తీసి, ఏదోటి చేసి పెట్టవయ్యా అనేవారు దర్శకులు. ఆయన ఇష్టాలేంటి? డప్పు బాగా కొట్టగలరు. సంగీతం బాగా వింటారు. పాటలు, పద్యాలు చాలా అందంగా పాడతారు. వంట చేయడం సరే సరి. వాటితోపాటు ఆయనకు ఎప్పటికైనా ఒక్క ఇంటర్నేషనల్ అవార్డ్ తీసుకోవాలనే కోరిక ఉండేది. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శిష్యులను అడిగేవారా? ఏనాడూ అడిగింది లేదు. ఆ ఇంట్లో మనిషిగా నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే డబ్బు లేక నేను ఇబ్బందిపడతానని, ఫీల్ అవుతానని నేను నిద్ర లేవక ముందే నా వెనక జేబులోనో, పర్స్లోనో డబ్బులు పెట్టేవారు. (గద్గద స్వరంతో, చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). చెబితే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ నేను శబరిమల వెళ్తుండేవాణ్ణి. నా ముందు మా గురువుగారు ఉండేవారు. ఆయనే నాకు అయ్యప్పలా కనిపిస్తుండేవారు. ఏ మాత్రం కల్మషం లేని వ్యక్తి. ప్యూర్ హ్యూమన్. పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనుకునేవారా? లౌకికం కొంచెం తక్కువ. ఎప్పుడైతే కూతురు పోయిందో డిటాచ్ అయిపోయారు. ఆ తర్వాత అంతా పరమేశ్వరుడే చూసుకున్నాడు. దైవ భక్తి చాలా ఎక్కువేమో? బాగా. 28 సార్లు శబరికి వెళ్లారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ‘మహాతేజ’ అని పేరు పెట్టుకున్నారు. అంటే.. అయ్యప్ప పేరు. ఆ పేరుని నేను మా అబ్బాయికి పెట్టాను. పిల్లాడ్ని తీసుకెళ్లి ఆయన ఒళ్లో పడుకోబెట్టి ‘మీరే పిలవండి సార్’ అన్నాను. రాళ్లపల్లిగారి ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింది? మీరు చివరిసారిగా ఎప్పుడు కలిశారు? కూతురు చనిపోయాక కుంగిపోయారు. 10 ఏళ్ల క్రితం కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. అయినా గమ్మత్తేటంటే పోయిన వారం ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం ఆయనకు అలవాటు. గంధం బొట్టు పెట్టుకుంటారు. వారం క్రితం ఉత్సాహంగా మాట్లాడిన వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరం అవుతారని అనుకోం కదా. ఈ బాధను మాటల్లో చెప్పలేను (చెమర్చిన కళ్లతో). మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైనా ఓ సంఘటన గురించి? ఏదో ఫంక్షన్‌కి వెళ్లాం. నేను, నా ఫ్యామిలీ ఆయనతో పాటు వెళ్తున్నాం. మా పాప నోట్లో పాలపీక ఉంది. అది పడిపోయింది ఎక్కడో. ఇక గోల. పాలపీక కొనడానికి డబ్బులు లేవు. పీక పావలా అన్నమాట. పావలా కోసం ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత గురువుగారే వెళ్లి ఓ ఫ్రెండ్ ఇంటి తలుపు కొడితే 20 రూపాయిలు ఇచ్చారు. పాల పీక కొని, మిగతా డబ్బుని అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశారు. నటుడిగా మీ గురువుగారి దగ్గర మీరు పొందిన ప్రశంసలు? ‘ముగింపు లేని కథ’ నాటకంలో గురువుగారిది హీరో పాత్ర. ఇంకో వారంలో నాటకం వేయాలి. ఆయనకు సినిమా అవకాశం వచ్చి వెళ్లిపోయారు. నాటకానికి మళ్లీ రావాలి. అసలే కాంపిటీషన్. పోటీకి నాలుగు రోజులు ఉండగా టెలిగ్రామ్ పంపారు. ‘నేను రాలేపోతున్నాను. గాడ్ బ్లెస్ యు. బాగా చేయండి’ అని. నా గుండె ఆగిపోయింది. ఆ వేషం ఎవరు వేయాలి? అప్పుడు నా వేషం ఇంకొకరికి ఇచ్చి ఆయన పాత్ర నేను వేశా. అది నాకు పెద్ద చాలెంజ్. రాళ్లపల్లి గారి నాటకంలో ఆయనకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అంత పెద్ద పాత్ర ఎలా వేయాలా అని రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేసి వేశాను. బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ తీసుకెళ్లి ఇది నా తరఫున ‘గురుదక్షిణ సార్’ అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు.మామూలుగా శిష్యులకు పేరు వస్తుంటే కొందరు గురువులు అసూయపడతారు. అసూయ ఉండొచ్చేమో. కానీ ఆయన నా పట్లే కాదు ఎవరి పట్లా అసూయ పడేవారు కాదు. ఆయన మంచి రైజ్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని రికమండ్ చేస్తుండేవారు. రాళ్లపల్లిగారి జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మరణం. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయారట? ఆ అమ్మాయి డాక్టర్ చదువు కోసం రష్యాకు వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకూ ఫ్లైట్‌లో పంపించే స్తోమత ఆయనకు ఉంది. స్టూడెంట్స్ అందరూ ట్రైన్లో వెళ్తారు. పరిచయాలు అవుతాయని ట్రైన్లో వెళ్లింది. తనతో పాటుగా వాళ్ల మేనమామ వెళ్లారు. వరంగల్‌లో ఎక్కడో దిగిపోయారాయన. జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యే ముందే చనిపోయింది. కూతురి భౌతికకాయాన్ని చూసి, ‘నీ పుట్టుకకు, నీ చావుకి కారణం అయింది కూడా నేనే’ అంటూ చాలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ని చేయాలన్నది ఆయన కల. అందుకే రష్యా పంపించాలనుకున్నారు. కూతురి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయారు. ప్రతి ఒక్కరికీ మానసికంగా.. ఎందుకు? ఎందుకు? అని డిప్రెషన్లో ఉన్న టైమ్‌లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ట్విస్ట్ వస్తుంది. గురువుగారి రెండో అమ్మాయికి పెళ్లి అయింది. కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. అక్కడ నుంచి ఆయన మానసికంగా కొంచెం పుంజుకోవడం మొదలెట్టారు. అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు. అమ్మాయి వచ్చేసింది. అల్లుడు నాకు ఫోన్ చేసి, ‘నేను వచ్చే వరకూ ఉంచుతారా’ అని చాలా వేడుకోలుగా అడిగాడు. చాలా బాధ కలిగింది. అది గొప్ప విషయం కూడా. అలాంటి అల్లుడు దొరకడం అదృష్టం. అల్లుడి కోసమే గురువుగారి అంత్యక్రియలు 20న అనుకున్నాం. -
‘విశ్వదర్శనం’ టీజర్ లాంచ్
శంకరాభరణం, సిరి సిరి మువ్వ, స్వాతి కిరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అద్భుత చిత్రాలను అందించిన లెజెండరీ దర్శకుడు కే విశ్వనాథ్ జీవితంపై బయోపిక్ ను విశ్వ దర్శనం పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత జనార్థన్ మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మంగళవారం కె. విశ్వనాథ్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే సోమవారం ‘విశ్వదర్శనం’ టీజర్‌ను ఫిలింనగర్‌లోని కె.విశ్వనాథ్ నివాసంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్, జనార్ధన మహర్షి, వివేక్ కూచిబొట్ల, తనికెళ్లభరణి, సింగర్ మాళవిక తదితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ‘నాకు నేను చాలా గొప్పవాణ్ని, నా గురించి అందరికీ తెలియాలి అనే ఆశ నాకు లేదు. కానీ, కొన్నిసార్లు మనల్ని అభిమానించే వారి కోసం కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే విశ్వదర్శనం. ఈ ఆలోచనకు నీరు పెట్టింది, నారు పోసింది అంతా జనార్ధన మహర్షి అనటంలో అతిశయోక్తి లేదు. నా పుట్టినరోజు సందర్భంగా వాళ్లు చేస్తున్న ఈ టీజర్ రిలీజ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అన్నారు. దర్శకుడు జనార్ధనమహర్షి మాట్లాడుతూ ‘మా అమ్మగారు విశ్వనాథ్‌గారి భక్తురాలు. ఆమె చిన్నప్పటి నుంచీ ఆయన తీసిన సినిమాల్లోని కథలను చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ విశ్వనాథ్‌గారు డైరెక్టర్‌కాదు, హీరో. 2011లో నా సొంత బ్యానర్‌పై తీసిన ‘దేవస్థానం’ అనే చిత్రంలో ఆయన్ను డైరెక్ట్ చేసే భాగ్యం నాకు దక్కింది. మళ్లీ 2019లో ఆయనతో పనిచేసే అవకాశం ఈ విశ్వదర్శనం సినిమా ద్వారా వచ్చింది. వెండితెరపై ఎందరో మహానుభావులు కథలు తీశారు. ఈ సినిమాలో మేం ఆయన బయోగ్రఫీ చూపించటంలేదు. ఇండియాలో ఓ మహాదర్శకుని సినిమాల వల్ల సొసైటీలో ఎలాంటి ప్రభావం ఆ రోజుల్లో పడింది అనేది మా సినిమాలో చూపించబోతున్నా’ మన్నారు. నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘అందరు దర్శకులకు అభిమానులు ఉంటారు. విశ్వనాథ్ గారికి మాత్రం భక్తులు ఉంటారు. అటువంటి ఎంతో మంది భక్తుల్లో జనార్ధనమహర్షి ఒకరు. వారి ఈ సినిమాకు డబ్బులు ఎంత వస్తాయో చెప్పలేను కానీ కీర్తి మాత్రం పుష్కలంగా వస్తుంది. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు. -
కొత్తవాళ్ల ప్యాషన్ చూస్తుంటే ముచ్చటేసింది
‘‘ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్లందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ‘అంతర్వేదమ్’ చిత్రంలో నటించినవారు, యూనిట్ మెంబర్స్ అందరూ కొత్తవారే. సినిమా పట్ల వారి ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’’ అని రచయిత–నటుడు తనికెళ్ల భరణి అన్నారు. అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జె.యస్. నిథిత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ల భరణిగారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. చిత్రకథానాయకుడు అమర్, రైటర్ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు రాంప్రసాద్, ‘రైజింగ్’ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సహ నిర్మాత: ఎస్.ఎన్. -
‘ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారు’
ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన విభిన్న చిత్రం అంతర్వేదమ్. చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా ఆడియోను సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు. నిర్మాత రాజ్ కందుకూరి ఆడియో సీడీలను ఆవిష్కరించి తొలి సీడీని నటుడు తనికెళ్ల భరణికి అందించారు. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రలో నటించిన తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ‘ఈమధ్యకాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయ కేతనం ఎగురవేస్తున్నప్పటికీ.. మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. మంచి విజయం సాధిస్తున్నారు. యువత ఏదో పిచ్చి వేషాలు వేస్తున్నారు అంటున్నారు కానీ.. అంతర్వేదం సినిమాలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’ అన్నారు. ముఖ్య అతిధిగా హాజరైన రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘యూనిట్ మొత్తంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వాళ్ళందరూ మంచి సక్సెస్ అందుకోవాలని కోరుకొంటున్నాను’ అన్నారు. దర్శకుడు చందిన రవికిషోర్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ళ భరణి గారు ముందు కోఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఫ్రీగా ఇప్పటివరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ పేరుపేరునా కృతజ్ణతలు తెలియజేసుకొంటున్నాను‘ అన్నారు. -
పులులు, పిల్లులపాటి చేయదా నా అమ్మ భాష
‘పులులు అంతరిస్తున్నాయని గణనలు చేసి, వాటి పరరిక్షణ చర్యలు చేపట్టడం చూశాం. మరి ప్రపంచంలోనే గొప్ప సాహితీ ప్రక్రియలు తనలో ఇముడ్చుకున్న మన తెలుగు భాష ఆ పులులు, పిల్లుల పాటి చేయదా? పిల్లాడు సిగరెట్ తాగుతానంటే ‘వద్దు నాన్నా అనారోగ్యం, పాలు తాగు నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది’ అని అమ్మ అంటుంది కదా, అలాగే ఈ భాష పరిరక్షణలో ప్రభుత్వం ఆ అమ్మ పాత్ర పోషించాలి. ఎక్కడ కఠినంగా ఉండాలో, ఎక్కడ లాలించాలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పుడు భాష ఎందుకు వికసించదో, విలసిల్లదో చూద్దాం’. తెలుగు చలనచిత్ర రంగంలో భాషాప్రావీణ్యం అద్భుతంగా ఉన్నవారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కవి, రచయిత, నటుడు తనికెళ్ల భరణి మాట ఇది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో 2012లో తిరుపతిలో జరిగిన సభల్లో లీనమైన ఆయన ఇప్పుడు భాగ్యనగరం వేదికగా అత్యద్భుతంగా జరుగుతున్న సభల్లోనూ పాలుపంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే... మాతృస్తన్యం కాదని డబ్బాపాలు తాగితే... ‘‘మన మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు బహుభాషా కోవిదుడు. ఎన్ని భాషలు నేర్చినా, అమ్మభాషలో ఆయన ప్రావీణ్యం తగ్గించుకోలేదు. మనకు ఆసక్తి ఉండాలే కాని ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, నేర్పు చూపొచ్చు. కానీ అమ్మ ఒడి నేర్పిన భాషకు ఎప్పుడూ అగ్రతాంబూలమే దక్కాలి. అమ్మ స్తన్యం కాదని డబ్బాపాలు తాగితే ఆరోగ్యమొస్తుందా... ప్రతి ఇంట తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ఆ మాటకు నేను విరుద్ధం... పదిపదిహేనేళ్లుగా భాషపై వినిపిస్తున్న భయమొక్కటే, ఇది అంతరించే జాబితాలో ఉందని. కానీ మీరు గమనించండి.. గత రెండు దశాబ్దాల్లో తెలుగు నేలపై ఎన్నో అవధానాలు జరిగాయి, గతంలో లేని కొత్త రికార్డులు సృష్టించాయి. జనం విరగబడి ఆస్వాదించారు. భాష అంతరిస్తుంటే ఈ పరిస్థితి ఉండదు. భాష, అందులోని సాహితీప్రక్రియలపై మక్కువ ఉంది. నేటి తరానికి దాని మజా తెలియాలి. అది తెలిస్తే వారూ అక్కున చేర్చుకుంటారు. అందుకే... భాషకు ప్రమాదమనే భయానికి నేరు విరుద్ధం. బడుల నుంచి మొదలు కావాలి... ఈ మహాసభలు బాహుబలి లాంటివే... తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు నామమాత్రమే. అందుకే మన సినిమాకు అంతర్జాతీయ పురస్కారాలు ఉండవు. కానీ బాహుబలి విడుదలై ప్రపంచవ్యాప్తంగా తెరపై మాయ చేయటంతో విదేశీయులూ సమ్మోహనంలో మునిగిపోయారు. ఇప్పుడు భారతీయ సినిమా అంటే ముందుగా తెలుగు సినిమాను పేర్కొంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహాసభలు కూడా భవిష్యత్తులో తెలుగు భాషకు అలాంటి ప్రాభవమే తెస్తాయని ఆశిస్తున్నా. తెలుగులో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వండి... తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 1 నుంచి 12 తరగతుల వరకు తెలుగును తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం 20 ఏళ్ల క్రితం తీసుకుని ఉంటే ఇప్పుడు భాషపై భయం, ఆందోళన ఉండేవి కాదు. కనీసం ఇప్పటికైనా గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు. ఇదే కోవలో మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలుగు మాధ్యమంలో చదివితే ఉద్యోగాల్లో వాటా ఇవ్వాలి. జపనీయులు మాతృభాషలో చదివి ప్రపంచాన్ని ఏలటం లేదా? కాబట్టి తల్లిదండ్రులే తొలుత అమ్మభాషపై చిన్నచూపును దూరం చేసుకోవాలి. వారు పిల్లలకు నూరిపోస్తే వారు అలాగే తయారవుతారు. చప్పట్లకు రెండు చేతులుండాలి, ప్రభుత్వం–తల్లిదండ్రులు ఆ పాత్ర పోషించాలి. ఆసక్తి రగిలించాలి...: ఆమధ్య నేను ఓ గ్రంథాలయానికి వెళ్లి ముఖ్యమైన పాత తెలుగు పుస్తకం తీస్తే వాటి మధ్య పాము గుడ్లు కనిపించాయి. లైబ్రరీలు ఈ దుస్థితిలో ఉంటే పుస్తకంపై ఆసక్తి ఎలా ఉంటుంది? ప్రత్యేక సందర్భాలప్పుడు పుష్పగుచ్ఛాల బదులు మంచి పుస్తకాలివ్వండి. 20 ఏళ్లుగా నేను దాన్ని ఆచరిస్తున్నా. నాకు అదే స్ఫూర్తి... తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణలతో మా పూర్వీకులకు బంధుత్వం ఉంది. మా నాన్న కూడా సాహిత్యాభిమానే. అలా నాకు సాహిత్యంపై అనురక్తి చిన్నప్పటి నుంచే ఉన్నా, ఓ సంఘటన మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఓసారి మిత్రులతో కలిసి సినిమా చూసి వస్తూ మార్గమధ్యంలో ఉన్న కృష్ణదేవరాయ ఆంధ్ర భాషానిలయానికి వెళ్లాను. అక్కడ ఓ పదిమంది డబ్బాలో ప్రముఖుల పేరు రాసిన చిట్టీలు వేసి అది వచ్చినవారు ఆ ప్రముఖుడి గురించి రెండు నిమిషాలు మాట్లాడాలనే పోటీ పెట్టారు. నాకు మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు రావటంతో ఆయన గురించి మాట్లాడి తొలి బహుమతిగా మాస్తి వేంకటేశ అయ్యంగార్ రాసిన ‘వాయులీనం’ పుస్తకం అందుకున్నా. ఓరోజు ఆ పుస్తకం పోయింది. ఎక్కడ వెదికినా మరోటి దొరకలేదు. తర్వాత కాకినాడలో ఓ చోట పుస్తకం చూసి వెల రూ.2 ఉన్న ఆ పుస్తకానికి రూ.100 ఇచ్చి కొన్నా. ఇంటర్లో ఉండగా గణతంత్ర దినోత్సవం రోజున తొలిసారి కవిసమ్మేళనంలో పాల్గొన్నా. కవికి ఉన్న గౌరవం గురించి ‘కలం తప్ప వీసమెత్తు బలం లేనివాడు, హలం తప్ప అంగుళమైనా పొలం లేనివాడు, గుడ్డలు మాసిన, గడ్డం మాసిన, తలమాసినవాడంటూ సమాజం వెలివేసిన వాడే కవి’ అని చెప్పా. దీనికి ప్రముఖ కవి ఉత్పల సత్యనారాయణాచార్య తనకు కప్పిన శాలువాను తీసి నాకు కప్పారు. అప్పటి నుంచి కవిత్వం మీద మనసుపెట్టా. పుస్తకం లేకున్నా వద్దు దిగులు.. ఆన్లైన్ ఉన్నా చాలు... పిల్లలు పుస్తకాలు చదవటం లేదని చాలామంది గగ్గోలు పెడతారు. కానీ ఆ ఆందోళన వద్దు. పలక పోయిందని బాధపడుతూ కూర్చుంటామా, తోలుబొమ్మలాటలు లేవని నిట్టూరుస్తామా... ఆధునికతను అందిపుచ్చుకుంటూనే భాషను బ్రహ్మాండంగా కాపాడుకోవచ్చు. ఆన్లైన్లో బోలెడన్ని గ్రంథాలున్నాయి. వాటిని చదివినా చాలు.. ఫలితాల్లో తేడాలేమీ ఉండవు. అంతా మంచే జరుగుతుంది. మరికొన్ని దశాబ్దాల తర్వాత కూడా తెలుగు వైభవాన్ని అద్భుతంగా స్మరించుకుంటా. భాషతో ఉంటూనే భేష్ అనిపించుకుంటా. పైన చెప్పిన సూచనలు పాటిస్తే చాలన్నది నా మాట. – గౌరీభట్ల నరసింహమూర్తి తెలుగు అందమైన భాష ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ 30 ఏళ్లుగా తెలుగుతో అనుబంధం ‘‘ప్రపంచ తెలుగు మహాసభలు బాగా జరుగుతున్నాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గొప్పగా మాట్లాడారు. తన గురువుగారి గురించి చెప్పుకున్నారు. గురువు ద్వారా భాష విస్తారంగా అవగాహనకు వస్తుంది...’’ – ఫ్రెంచ్ ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ అచ్చ తెలుగులో పలికిన మాటలివీ! తెలుగు అందమైన భాష అని, కొత్తవారికి పదాలు పలకడం కష్టమేనని, అందుకే తాను మాట్లాడుతుంటే పిల్లలు మాట్లాడినట్లుగా ఉంటుందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలో ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. 30 ఏళ్ల తెలుగు ప్రస్థానం.. డేనియల్ తెలుగు ప్రస్థానం మొదలై 30 ఏళ్లయింది. 1986లో ఇండో– ఫ్రెంచ్ స్టూడెంట్స్ ఎక్సె్చంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్‌కు వచ్చారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ‘సామాజిక– సాంస్కృతిక శాస్త్రం’పై పీహెచ్డీ చేశారు. బుర్రకథ, తోలుబొమ్మలాట, హరికథలు, కంజెరి కథ, నాటకాలపై విస్తృతంగా అధ్యయనం చేశారు. రాష్ట్రం నలుమూలలా పర్యటించి తెలుగు నేర్చుకున్నారు. దక్షిణ భారతదేశమంతా పర్యటించి నాట్యశాస్త్రరీతులు, యక్షగానాలు, శాసనాలు, కళాచరిత్రలపై పరిశోధన గ్రంథాలు రాశారు. ఆరుగురు స్కాలర్స్‌ను కూడా గైడ్ చేశారు. వారిలో కొందరు పరిశోధన కోసం సంస్కృతం, తమిళం, తెలుగు భాషలు నేర్చుకున్నట్లు చెప్పారాయన. శెయర్జో జాకోవీ అనే విద్యార్థి నలభై ఏళ్ల తెలంగాణ ఉద్యమ పాటలపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. ఆ పరిశోధన గ్రంథానికి తానే గైడ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు.. దూకుతున్న అలుగు కవిత్వంలో పద్యం, వచనం రెండు ప్రధాన అలంకారాలు. ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ ప్రభుత్వం ఓ పద్యం, ఓ వచనాన్ని అధికారికంగా సమర్పించింది. ఇందులో ప్రముఖ కవి డాక్టర్ ఎన్.గోపి ప్రభుత్వ పక్షాన సమర్పించిన వచన కవిత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అది మీ కోసం... అమ్మా! తెలంగాణ తల్లీ పాదాభివందనం నీకు. మాకు తెలుగు నేర్పించిన మట్టి సరస్వతివి నువ్వు. మా పొలాల్లోని కూలి జనుల పాటల్లోని నుడికారానివి నువ్వు. వారి గుండెల్లోని మమకారానివి నువ్వు. నీ మధురమైన యాస మా జీవితాల్లోని ఉచ్ఛ్వాస నిశ్వాస. తంగేడు పూలను ముద్దకొప్పులో ముడిచి బంగారాన్ని వెక్కిరించావు నువ్వు. బతుకమ్మలను పేర్చి అన్ని రకాల పుష్పాలకు కలిసి బ్రతకటం నేర్పించావు నువ్వు. ఇవాళ తెలుగు తెలంగాణ చెరువుల్లోంచి దూకుతున్న అలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా వాకిళ్లలో ఎండబెట్టిన అస్తిత్వాల ఒరుగు. ఇవాళ తెలుగు తెలంగాణా సంస్కృతిని తవ్విపోసే పారా పలుగు. ఇవాళ తెలుగు తెలంగాణా బిడ్డలకు కల్పించే బ్రతుకు దెరువు. అన్యభాషల జడివానలో తెలుగే కదా మన గొడుగు. తల్లిభాష ఒక దారం అన్ని భాషలకు అది ఆధారం. చనుబాలలోంచి వచ్చిందే వ్యాకరణం అన్నింటినీ ఇముడ్చుకోవటమే దాని మూలగుణం. కన్నీటికీ భాషవుంది దాని పేరు తెలుగు. కాలికి దెబ్బతగిల్తే పసివాడు ‘అమ్మా’ అని అరుస్తాడు అది అచ్చమైన తెలుగు. అన్నం పెట్టండి తెలుగు భాషకు అది పరబ్రహ్మంలా వెలుగుతుంది అఖండదీపంలా కాపాడుతుంది. ఇవాళ తెలుగు పల్లెలన్నీ భాగ్యనగరిలో కుప్పపడ్డాయి. ఇది సకలజనుల కళారాధన సబ్బండ వర్ణాల సంవేదన. రండి! తెలుగును ఉజ్వలంగా వెలిగిద్దాం. ఇదొక విరాట్ వివేచన ఇది తెలుగు వెలుగుల తెలంగాణ అవును! ఇది తెలుగు వెలుగుల తెలంగాణ.. -
కూసుమంచి శివాలయంలో తనికెళ్ల భరణి పూజలు
-
కళాకారులకు మైమ్ కళ ఉండాలి
♦ నిజ జీవితంలో తెలియకుండానే ♦ మైమ్ కళను అనుసరిస్తుంటాం ♦ రామప్ప చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలి ♦ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి హన్మకొండ: ప్రతి కళాకారుడు మైమ్ కళను కలిగి ఉండాలని సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి అన్నారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో మైమ్ శిక్షణ కార్యక్రమాన్ని తనికెళ్ల భరణి, ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్, సాంస్కృతిక శాఖ రాష్ట్ర సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తో కలిసి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మైమ్ కళతో శరీరం తేలికవుతుందన్నారు. నిజ జీవితంలో తెలియకుండానే మైమ్ కళను పాటిస్తామన్నారు. ఇతర కళాకారులు మైమ్ కళను నేర్చుకోవాల్సిన అవసరముందని, మైమ్ తెలిసిన కళాకారులు సులువుగా నటించగలుగుతారన్నారు. అభ్యాసకులు ప్రశ్నించేతత్వం కలిగి ఉండాలన్నా రు. నేరెళ్ల వేణుమాధవ్ సహస్ర కంఠకుడని, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ కళలకు, కళాకారులకు రక్షణగా నిలుస్తున్నారన్నారు. రామప్ప శిల్పా కళాసంపద వంటి కళాత్మక కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని, రామప్ప శిల్ప కళను, చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలన్నారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కళాభిమాని, సాహిత్యాభిమాని అని అన్నారు. కళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కళలను ప్రజల ముంగింట్లోకి తీసుకెళుతుందన్నారు. మైమ్ శిక్షణను ఇందులో భాగంగానే చేపట్టామన్నారు. అరుసం మధుసూదన్ (మైమ్ మధు) 18 దేశాలలో తిరుగుతూ మైమ్ ప్రదర్శనలు ఇస్తూనే నేర్చుకున్నారన్నారు. మైమ్‌లో అంతర్జాతీయ స్థాయి అవార్డు పొందిన ఏకైక కళాకారుడు మధు అని అన్నారు. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రాభివృద్ధితో పాటు, కళలను పెంచిపోషిస్తున్నారన్నారు. కళల్లో వరంగల్ జిల్లాను ముందు నిలపాలనే ఆలోచన సీఎం కేసీఆర్‌లో ఉందన్నారు. ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సమైఖ్య రాష్ట్రంలో కళాకారులు, సాహితీవేత్తలను పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కళలకు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వరంగల్‌లో మైమ్ కళలో శిక్షణ కార్యక్రమం చేపట్టడం, ఈ శిక్షణ ఇవ్వడానికి మైమ్ మధు ముందుకురావడం అభినందనీయమన్నారు. మైమ్ కళాకారుడు అరుసం మధుసూదన్ మాట్లాడుతూ మన దేశ టెక్నిక్స్‌ని మనం మరచిపోతున్నామని, వీటిని విదేశాల్లో అనుసరిస్తున్నారన్నారు. శిక్షణకు వెళ్తున్న మనం కూడా మన టెక్నిక్స్‌నే నేర్చుకోవాల్సి వస్తోందన్నారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి శిక్షణ ఇస్తున్నామన్నారు. రాజమార్గంలో వెళ్లాలని, అడ్డదారిలో వెళ్లొద్దని తనకు సూచించిన తల్లిదండ్రుల మార్గంలో నడుస్తున్నానన్నారు. కార్యక్రమంలో ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారుడు నేరెళ్ల వేణుమాదవ్, కవులు పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, గిరిజా మనోహర్‌బాబు పాల్గొన్నారు. -
త్రయం తాండవం
నేను నా దైవం త్రికరణ శుద్ధితో... మనసు... మాట... తనువు నువ్వు... నేను... మనం గుడి... బడి... ఇల్లు నింగి... నేల... దిఙ్మండలంఫలం... పుష్పం... బిల్వం ఉగ్ర... జ్ఞాన... అంతర నేత్రం శ్రీ... కాళ... హస్తి గంగ... గళం... గరళం బ్రహ్మ... విష్ణు... పరమేశ్వర అంతా శివమయం ఇదే భరణి త్రీ ఇన్ వన్ తత్త్వం పురివిప్పి పరవశింప జేసే త్రయం తాండవం మీరు శివనామాలతోనే కనిపిస్తారు... శబ్బాష్ రా శంకరా అని శివతత్వం చెప్పారు... మీరు మహాభక్తులా! భక్తుడినే కానీ, మహా కాదు. మన జీవితంలో మట్టి ప్రాధాన్యత తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ఈ పూజకు ఒప్పుకున్నాను. నాకు ఎప్పుడూ ఉపవాసం అలవాటు లేదు. పూజ మొదలుపెట్టేటప్పుడే ‘అయ్యా, భక్తి ఎంత అవసరమో, భుక్తి కూడా అంతే అవసరం. సమయాన్ని పొడిగించకూడద’ని చెప్పాను. బుద్ధుడు కూడా మధ్యేమార్గాన్ని సూచించాడు. శరీరాన్ని కాపాడుకుంటూ దైవప్రార్థన చేయమని. శరీర లక్షణం ఏంటంటే వేళకు పెట్టే తిండి మానేస్తే... ఇంక వీడు తిండి పెట్టడు అనుకున్నప్పుడు తనే కొంతవరకు తయారుచేసుకుంటుంది. అలా ఆకలి అనిపించలేదు. భక్తిలో ఉన్నవారు కుటుంబంతో డిటాచ్డ్గా ఉంటారంటారు. మరి భక్తి ఫ్యామిలీ లైఫ్‌కి ఎఫెక్ట్ అవుతుంది కదా! భక్తి అనేది ఒక వ్యవహారం. మన భారతీయ జీవనంలో మనమేంటో ముందే డిసైడైపోతుంది. మీ తాత శివుని ఆరాధించేవాడు అనుకోండి. అది మీ తండ్రి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఆచారాలు సంప్రదాయాలు మనదగ్గర ముందే ఫిక్స్డ్. ఇంట్లో అందరూ భక్తులే ఉండాలనేం లేదు. మా పెద్దన్నయ్య శివారాధకుడు. రెండో అన్నయ్య ఫక్తు కమ్యూనిస్టు. నాలుగో అతను తటస్థం. మన ఇల్లే ఒక సమాజం. సమాజమే దేశం. దేవుడంటే ఒక నమ్మకం. ఒక విశ్వాసం. ఒక అనుభూతి. ఆ అనుభూతిని పొందాలే తప్ప మాటల్లో వ్యక్తం చేయలేం. అలాగని మూఢంగా నమ్మమని కాదు. నమ్మకానికి, మూఢ నమ్మకానికి తేడా ఉంది. భక్తకన్నప్పది మూఢభక్తి కాదు గాఢ భక్తి. ఏ స్థాయికెళ్లాడంటే దైవానికి కన్ను ఇచ్చేశాడు. మూఢనమ్మకమంటే... ఈ రాళ్లు పెట్టుకుంటే, ఫలానా రంగు చీర కట్టుకుంటే... మంచిది అంటే దానిని పాటిస్తుంటారు చూడండి అదన్నమాట. మనిషికి కర్తవ్యం అవసరం. అంతే కానీ, దేవుడే అంతా చూసుకుంటాడులే అనుకోవడం ఎంతవరకు సమంజసం? దేవుడు అనేవాడు నువ్వు పని మానుకొని నన్నే పూజిస్తూ కూర్చో అని చెప్పలేదు. ‘కర్మణ్యే వాధికారస్యే, మా ఫలేషు కదాచనా! అంటే, పని చేయ్! ఫలితం ఆశించకు’ అన్నాడు. సృష్టిలో ఏ జంతువు, ఏ పక్షీ పనిచేయదు. కానీ, బతకడం కోసం పనిచేసే ఏకైక జంతువు మనిషి మాత్రమే! అందుకే, మనిషికి దేవుడంటే నమ్మకం, భయం. దైవాన్ని నమ్మడం అంటే ధైర్యం కొరవడినట్టే అంటారు... నమ్మినవాడికి దేవుడే ధైర్యం. నమ్మనివాడికి వాడికి వాడే ధైర్యం. దేవుడు చేయాల్సిన పనులు కూడా వాడే చేసుకుంటాడు కాబట్టి వాడికి వాడే దేవుడు. నాస్తికుడు నా దృష్టిలో పరమోత్కృష్టుడు. అయితే, నువ్వేది నమ్మినా వంద శాతం నమ్ము. ఎంత భక్తుడైనా సరే... అతడిని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించండి. ‘కలడు కలడనువాడు... కలడో లేడో... అంటాడు. అదే నాస్తికుడితో –‘ఏమయ్యా, దైవం నిజంగా లేడా!’ అంటే, సందేహంతో చూస్తాడు. ‘నేను నమ్మనండి. ఇంట్లో వాళ్లు ఏవో వ్రతాలు, నోములు చేసుకుంటారు’ అంటాడు. అంటే ఇంట్లోవారినే ప్రభావితం చేయనివాడు ఇక సమాజాన్ని ఏం చేస్తాడు. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవడం చేతకాక దేవుని ముందు నిలబడితే ఎలా? పిల్లలకు దీని గురించి ఏం చెబుతున్నాం? సంకటకాలే వేంకటరమణ అన్నది ఓ సామెత ఉంది. కష్టాలు వచ్చినప్పుడే దైవాన్ని తలుచుకుంటాం. మనమేది చేస్తే, పిల్లలు అది చేస్తారు. పిల్లలతో ‘దేవున్ని మనం ఏమీ కోరనక్కర్లేదు. మనకన్నీ ఇచ్చాడు. ఈ జన్మను ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలయ్యా! అని ఓ దణ్ణం పెట్టుకుంటే చాలు’అని చెబితే వాళ్లే అర్థం చేసుకుంటారు. అంతేకాదు, అసలు రహస్యం ఒకటుంది. నువ్వే శివుడివి అని చెప్పాలి. ‘నాలోన శివుడు గలడు .. నీలోన శివుడు గలడు..’ అంటే మన గురించి మనం తెలుసుకోవడమే దైవం.. విశ్వరూపం అంటే అర్థం ‘ఆ విశ్వం అంతా నీలో ఉంది. నీలో ఉన్నదంతా విశ్వంలో ఉంది’ ఇలాంటప్పుడు ఇంకేం కావాలి. దుఃఖం వద్దంటావా? దుఃఖం లేకపోతే మజా ఏముంటుంది? ఎండ లేకపోతే ఏసీ చల్లదనం ఎలా తెలుస్తుంది? పిల్లలను గుడికి తీసుకెళితే అక్కడి వారు రుచికరమైన ప్రసాదాన్నే ఇష్టపడతారు. అలాంటప్పుడు వాళ్లకేం చెప్పాలి? ఇప్పటికీ నేనూ ప్రసాదం కోసమే వెళతాను (నవ్వు). వాళ్లు అక్కడ నమక చమకాలు వినిపిస్తుంటారు. ఏం చెప్పినా అక్కడి చక్కెర పొంగలి, పులిహోర ఊరిస్తుంటుంది. ప్రసాదం అంటే ప్రజెంటేషన్. ఈ క్షణం ఎంత అద్భుతమైనది. దానిని అనుభూతించాలని చెబుతుంది ప్రసాదం. పిల్లలు మనమేది ఆచరిస్తున్నామో అది తెలుసుకుంటారే తప్ప మనం చెబితే కాదు. ముక్కోటి దేవతలు ఉండగా మీకు శివుడు మీదే అంత ప్రేమ ఎందుకు? శివుడు ఎప్పుడు పరిచయం అయ్యాడు? నా చిన్నప్పుడు మా ఊళ్లో హరిదాసు ‘అజామీళుడు’ అని ఓ కథ చెప్పాడు. ‘నువ్వు ఇన్ని పాపాలు చేసినా ఒక్క బిల్వ దళం ఆయన నెత్తిమీద వేస్తే కైలాసమే’ అన్నాడు. చిన్నమనసులో అది నాటుకుపోయింది. అప్పుడు పాపాలు చేస్తున్నామని తెలియని దశ. ఇప్పుడు పాపాలు చేయకుండా ఉండలేని దశ (నవ్వుతూ... ఒక్క అబద్ధం చెప్పడం కూడా పాపమే కదా!) ఇక శివుడంటేనే ఎందుకంత ఇష్టం అంటే, మన దగ్గర కాకాహోటల్ అని ఉంటుంది. స్టార్ హోటల్ ఉంటుంది. కాకాహోటల్కి ఏ అర్థరాత్రి అయినా వెళ్లచ్చు. పిలిచి మరీ తిండి, బస ఇస్తాడు. స్టార్ హోటల్ అనుకోండి. ఐడి కార్డు లేకపోతే అవతలకు పో అంటాడు. అంత సింపుల్ శివయ్య. ‘చెంబెడు నీళ్లు పోస్తే ఖుష్.. చిటికెడు బూడిద పూస్తే బస్.. ఉట్టి పుణ్యానికే మోక్షమిస్తవ్ గదా! శబ్బాష్‌రా శంకరా!’ అని శివతత్త్వాలు రాసే శక్తినిచ్చాడు. శివుడు రూపరహితుడు. ఈయన్ను ఎక్కడైనా పెట్టచ్చు. ఈయనది అటామిక్ ఎనర్జీతో ఉండే భోళాతనం. ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉండవు. సింబాలిక్‌గా చెప్పాలంటే లింగం. మనవాళ్లు ఒక ఆర్డర్ ప్రకారం అనుకూలంగా ఆయన్ను మార్చుకున్నారు. పుట్టించేటప్పుడు వాడు బ్రహ్మ, స్థితికారుడు విష్ణువు. లయం చేస్తే గెటప్ వేసుకొచ్చేది శివుడే. అంటే, త్రీ ఇన్ వన్ శివుడే! వంకాయతో కూర చేసుకోవచ్చు. వేపుడు చేసుకోవచ్చు, పచ్చడీ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చడి శివుడే! శివ తాండవం అంటే ఏంటి? ఆయన ఎందుకలా డ్యాన్స్ చేస్తాడు? నృత్యం ద్వారా ఏం సూచనలు ఇస్తున్నాడు? (నవ్వుతూ) సమాజంలో బతకడానికి కొన్ని నటనలు చేస్తాం, తప్పదు. అయితే, ఈ శివ తాండవం జ్ఞానానికి సంబంధించింది. ఏది చేసిన తీవ్రంగా చేయ్. మనిషిగా నీకున్న తెలివితేటలు నాలుగు ఉంటే నాలుగూ వాడు. ప్రేమ ఉంటే అంతే తీవ్రంగా వాడు. ఆర్తి ఉంటే అంతే తీవ్రంగా వాడు అని చెప్పడం ఆ ఉద్దేశ్యం. జ్ఞానాన్ని ఎంత వీలైతే అంత పెంచుకో అని నృత్యంతో సూచిస్తున్నాడు. శివుడికి రుద్రాక్షలు అంటే ఎందుకంత ఇష్టం? అవి మనిషి ధరిస్తే వచ్చే లాభమేంటి? రుద్రాక్షల్లో పై భాగం గరుకుగా ఉంటుంది. ఇది జపం చేస్తున్నప్పుడు బొటనవేలికి ప్రెజర్ పెరిగి జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ విషయం చెబితే వింటారా! నాయనా, ఇవి రుద్రుడి అక్షుల నుంచి పడినవి రా! ఇది ధరిస్తే మంచిది. దీంతో జపం చేస్తే రుద్రుడు సాక్షాత్కరిస్తాడంటే ఒక ఆశ పుడుతుంది. భక్తి భావనలో మీ కళ్లలో నీళ్లు తిరిగిన సందర్భం... ఓ రోజు పూజ గదిలో ఉన్నాను. మా ఇంట్లో దేవుడి రూమ్, వంటరూమ్ పక్కపక్కనే ఉంటాయి. మా ఆవిడ గోంగూర పచ్చడి చేస్తోంది. నేను స్వామికి అభిషేకం చేసుకుంటున్నాను. గోంగూర పచ్చడి తాలూకు ఘుమఘుమకు నోట్లో నీళ్లూరాయి. అఖిలాండకోటి భ్రమంఢానాయకుడిని ముందు కూర్చుంటే కళ్లమ్మంట నీళ్లు రావడం లేదు. గోంగూర రుచికి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఇక నిన్నెలా వేడుకోను స్వామీ.. అనుకున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను. కళ్లు నీళ్లతో నిండిపోయాయి. ఆ క్షణంలో ఏ కోరికా లేని ఓ ఆనందాన్ని చవిచూశాను. ‘భూమిపై మూడు వంతులు నీళ్లు. మిగతాది కన్నీరు... ఆటగదరా శివా!’’ అంటూ శివ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే! దాదాపు 15 ఏళ్లుగా దేవుణ్ణి ఏమీ వేడుకోవడం లేదు. నాకో పెద్ద లోకాసమస్తసుఖినోభవంతుః అనుకుంటున్నాను. బార్డర్లో ఉన్న జవాన్‌కు కూడా ఒక్క బుల్లెట్ తగలకూడదు. ఇరాక్‌లో స్త్రీ కూడా కన్నీరు పెట్టకూడదు.. అని కోరుకుంటున్నాను. శివుడు బూడిద రాసుకొని ఉంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు కదా! ఆయనకు అంత పవర్ ఎక్కణ్ణుంచి వచ్చింది? ఐశ్వర్యానికి అధిపతి శివుడే! శివాలయాల్లో ద్వారం పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది. డబ్బులు కావాలంటే ఈ పెద్దసార్ పర్మిషన్నే అడగాలి. అక్కడ విభూదినే ఇస్తారు. విభూదే మన ఐశ్వర్యం. నాటి రాజుల వద్ద అనంతమైన ధనరాశులుండేవి. చివరకు ఏమయ్యింది. పోయేటప్పుడు... మట్టి. అంటే బూడిద. నీ శరీరం... ఐశ్వర్యం. చివరకు కాలి బూడిదైపోతుందని చెప్పడమే ఉద్దేశ్యం. స్థితికారకుడు కాబట్టి విష్ణువుకు నిలువు నామం. పోయేటప్పుడు పడుకోబెడ్తరు కాబట్టి ఈశ్వరుడికి అడ్డనామం. విశ్వమే ఆయనైనప్పుడు శక్తి కూడా ఆయనే కదా! ఏకంగా గంగనే నెత్తిన పెట్టుకున్నా, ఈ అభిషేకాల పిచ్చెందుకు? కాస్మిక్ ఎనర్జీ నిరంతరం వేడిని విడుదల చేస్తుంటుంది. శివలింగం నుంచి ఆ వేడి విడుదల అవుతుంది. మూడుసార్లు శివలింగం చుట్టు తిరిగితే మనకే ఒక శక్తి వస్తుంది. ఒక దివ్యానందంలో ఉంటాం. అంత దివ్యానందం పనికిరాదు అని కాసేపు ఆ ఆలయంలో కూర్చోమంటారు. అందుకే తడి బట్టలతో అభిషేకం చేస్తారు. కథా పరంగా చూస్తే నెత్తిన గంగ ఉన్నా దానిని జనుల కోసం వదిలాడు. అందుకే కృతజ్ఞతగా జలంతో అభిషేకిస్తారు. ప్రతి దైవకార్యంలోనూ పరోపకారమే కనిపిస్తుంది. నాలో సగం అంటూ శివయ్య ఇంతికి అంత విలువ ఎందుకు ఇచ్చాడు? దాన్నుంచి మనమేం నేర్చుకోవాలి? శివరూపం ఎత్తినప్పుడు సగభాగం ఇచ్చాడు. విష్ణుమూర్తి వేషం కట్టినప్పుడు కాళ్లొత్తమన్నడు. బ్రహ్మ రూపం ఎత్తినప్పుడు వీణవాయించమన్నడు. ఈయనేం సామాన్యుడు కాదు. (నవ్వులు) అయినా, చివరకు అన్ని రూపాల్లోనూ ఆ అయ్య అమ్మ ముందే మోకరిల్లాడు. నీకోసం ఏం కావాలో, ఏది అవసరమో అమ్మ ఇస్తుందని చాటాడు. దైవాన్ని పరిచయం చేసేది అమ్మే! అమ్మను కొలుచుకున్నవాడు ఈశ్వరుడిని ఆరాధించినట్టే! అన్ని అదుపాజ్ఞలో ఉంచుకునే దైవానికి అంత కోపమెందుకు? మన్మధుడిని మసి చేయడం ఎందుకు? మనలో ఉండే లక్షణాలకు తగ్గట్టే దేవుణ్ణి తయారుచేసుకున్నాం. జీవితంలో అన్ని రసాలు ఉండాలి. వాటిలో కోపం కూడా ఒకటి. మన్మధుడిని మసి చేశాడు కాబట్టి ఈ విషయంపై అంతా ఒకేలా ఆలోచిస్తారు. నీలో కామం పెరిగినప్పుడు అంతర్నేత్రంతో దానిని కట్టడి చేయి. అక్రమమైన కామం కలిగినప్పుడు దానిని దహించివేసే శక్తి నీలోనే ఉందని గ్రహించి దానిని అంతం చేయ్. అదే తెలుసుకో! అని ఈ కథ ద్వారా చెబుతారు. కడుపునిండా భోజనం తినమని ప్రకృతిలో ఇన్ని రుచులను ఇచ్చిన దేవుడు శివరాత్రినాడు ఉపవాసం ఉంటే సంతోషించడం ఏంటి? జాగరణ చేస్తే మురిసిపోయి వరాలివ్వడం ఏంటి? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం. జాగారణ మనసును జాగృతం చేయడం. అంతే కానీ, ఈ రోజు పూర్తిగా తిండి మానేసి మరుసటి రోజు ఫుల్లుగా లాగించమని కాదు. నిద్రమానేసి సినిమాలు చూస్తూ జాగరణ చేయడం అని కాదు. నీలోని అంతర్జ్యోతిని బయటకు తేవాలి. వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పారు. ఇది సైన్స్ పరంగానూ ధ్రువీకరించారు. ఇదే అంశంమీద మొన్నీమధ్యే ఒక విదేశీయుడుకి అవార్డు కూడా వచ్చింది. ఇది మనవాళ్లు ఎప్పుడో చెప్పారు? శరీరం పడిపోకుండా ఆహారాన్ని తీసుకుంటూనే దైవాన్ని తెలుసుకోవడం. అసలు పాపం చేయకుండా ఉండలేం కదా! భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు అని మూడు దశలు ఉంటాయి. ముందు పూజ ఉంటుంది. దీంట్లో కొబ్బరి కాయలు కొడతాం. ఓ పది సార్లు తిరుపతికి వెళ్లొస్తాం. అభిషేకాలు చేసేస్తుంటాం. ఈ దశలో ప్రపంచానికి చెప్పుకోవడం కోసమే పూజ ఉంటుంది. నే చెప్పేదేంటంటే ఏదైతే క్రియ ఉందో అది వద్దు. పూజ స్థాయి నుంచి ధ్యానం స్థాయికి చేరుకోవాలి. ఈ రెండోదశలో భక్తి నిశ్చలంగా ఉంటుంది. ఆ తర్వాతి దశలో అది కూడా ఉండదు. రమణమహర్షి. అంటే యోగి స్థాయికి చేరుకుంటాం. నిరంతరం నీలో ఓంకారం పలుకుతుంటే ఇంక ఏం కావాలి? మీరు గుడికి వెళ్తుంటారా? గుళ్లను దర్శించే ది అప్పటి శిల్పుల కళను తెలుసుకోవడానికి. ఆ కట్టడాల అందం చూడటానికి. దైవారాధనకు నమకచమకాలు అక్కర్లేదు. అలాంటి వాటికే దేవుడు లొంగడు. శ్రీ కాళహస్తిలో పురుగేం నేర్చుకుంది? పామేం తెలుసుకుంది? ఏనుగేమి చేసింది? వాటిని అనుగ్రహించలేదా శివుడు. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
'నరుడా డోనరుడా' మూవీ రివ్యూ
టైటిల్ : నరుడా డోనరుడా జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : సుమంత్, తనికెళ్ల భరణి, పల్లవి సుభాష్, శ్రీ లక్ష్మీ సంగీతం : శ్రీ చరణ్ దర్శకత్వం : మల్లిక్ రామ్ నిర్మాత : వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట, స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ స్థాయికి తగ్గ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయిన యంగ్ హీరో సుమంత్. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న సుమంత్ ఓ బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విక్కీ డోనర్ సినిమాను తెలుగులో నరుడా డోనరుడా పేరుతో రీమేక్ చేశాడు. 100% స్ట్రయిక్ రేట్ అన్న ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ స్పెర్మ్ డోనర్ సక్సెస్ సాధించాడా..? కథ : డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ల భరణి).. ఓల్డ్ సిటీలో ఓ చిన్న ఇన్పర్టిలిటీ క్లినిక్ నడుపుతుంటాడు. తన దగ్గరకు వచ్చే క్లయింట్స్‌కు సంతాన భాగ్యం కలిగించేందుకు ఓ వీర్యదాత కోసం వెతుకుతుంటాడు. విక్రమ్ అలియాస్ విక్కీ (సుమంత్) డిగ్రీ పూర్తి చేసి ఎలాంటి పని పాట లేకుండా ఫ్రెండ్స్‌తో టైమ్ పాస్ చేస్తూ షాపింగ్‌లు పబ్‌లు అంటూ తిరుగుతుంటాడు. విక్కీ తండ్రి కార్గిల్ వార్‌లో మరణించటంతో తల్లి స్వీటి(శ్రీలక్ష్మీ) బ్యూటి పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటుంది. ఎప్పటికైనా కొడుకు మంచి ఉద్యోగం చేస్తూ లైఫ్‌లో సెటిల్ అవ్వాలని ఎదురుచూస్తుంటుంది. డాక్టర్ ఆంజనేయులు, ఖాళీగా టైంపాస్ చేస్తున్న విక్కీ తనకు బాగా పనికొస్తాడని భావించి అతని వెంటపడతాడు. డబ్బులు ఎరచూపి వీర్యదానానికి ఒప్పిస్తాడు. అదే సమయంలో ఓ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే ఆషిమా రాయ్(పల్లవి సుభాష్) అనే బెంగాళీ అమ్మాయితో విక్కీకి పరిచయం అవుతోంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆషిమా గతం గురించి తెలిసిన తరువాత కూడా విక్కీ పెళ్లికి అంగీకరించటంతో ఆషిమాకు విక్కీ మీద ప్రేమ మరింత పెరుగుతుంది. పెళ్లి తరువాత మొదలవుతుంది అసలు సమస్య, అంత కాలం తాను ఏం బిజినెస్ చేస్తున్నాడో చెప్పకుండా మేనేజ్ చేసిన విక్కీ, ఫైనల్ గా ఓ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో తాను వీర్యదానం చేస్తున్న విషయం ఆషిమాకు చెప్పేస్తాడు. దీంతో ఆషిమా, విక్కీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అలా దూరమైన విక్కీ, ఆషిమాలు తిరిగి ఎలా ఒకటయ్యారు..? తన వల్లే విడిపోయినా ఆ దంపతులను డాక్టర్ ఆంజనేయులు ఎలా కలిపాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇలాంటి బోల్డ్ సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్న హీరో సుమంత్ ప్రయత్నాన్ని ప్రశంసించకుండా ఉండలేం. దాదాపు రెండేళ్ల విరామం తరువాత తెర మీద కనిపించిన సుమంత్ మంచి నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ మెప్పించాడు. పల్లవి సుభాష్ హీరోయిన్గా పరవాలేదనిపించింది. తన పరిధి మేరకు డిసెంట్ లుక్స్‌తో, కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఆకట్టుకుంది. ఇంకా సినిమా అంతా తానే అయి నడిపించాడు తనికెళ్ల భరణి, హీరోను వీర్యదాతగా మార్చే డాక్టర్ గా, అద్భుతమైన కామెడీ పండించాడు. ప్రతీ సీన్ లోనూ తన మార్క్ చూపిస్తూ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాడు. చాలా రోజుల తరువాత తెర మీద కనిపించిన సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మీ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. సాంకేతిక నిపుణులు : విక్కీ డోనర్ లాంటి బోల్డ్ సబ్జెక్ట్‌ను తెలుగు తెర మీద చూపించాలన్న నిర్ణయం సాహసం అనే చెప్పాలి. అలాంటి సాహసానికి రెడీ అయిన దర్శకుడు మల్లిక్ రామ్, అందుకు తగ్గ కథనాన్ని సిద్ధం చేసుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ పెద్దగా పండకపోవటం మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వించాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. సెకండ్ హాఫ్‌లో అసలు కథలోకి ఎంటర్ అయిన తరువాత వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. శ్రీ చరణ్ సంగీతం పరవాలేదు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : తనికెళ్ల భరణి నటన ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ మైనస్ పాయింట్స్ : కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటం తెలుగు నెటివిటీకి సూట్ అవ్వని సబ్జెక్ట్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
కృష్ణవంశీ దర్శకత్వంలో భక్తిరస చిత్రం
కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం భక్త కన్నప్ప ఈ సినిమాను ఈ జనరేషన్ మెచ్చేలా అత్యున్నత సాంకేతిక విలువలతో రీమేక్ చేయాలన్న ప్రయత్నం చాలా రోజులుగా జరుగుతోంది. ముందుగా కృష్ణంరాజు, ప్రభాస్ హీరోగా ఈ సినిమాను చేయడానికి ప్లాన్ చేశాడు అయితే ఈ లోగా రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తన స్వీయ దర్శకత్వంలో కన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. కామెడీ నుంచి హీరో క్యారెక్టర్లకు మారిన సునీల్ హీరోగా భక్తకన్నప్ప సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు భరణి. అయితే ఈ సినిమా పట్టాలెక్కలేదు. తరువాత అదే సినిమాను మంచు విష్ణు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుదన్న టాక్ వినిపించింది. తాజాగా భక్తకన్నప్ప సినిమాకు కృష్ణవంశీ దర్శకత్వంలో వహిస్తాడంటూ టాక్ నడుస్తోంది. తనికెళ్ల భరణి తయారు చేసిన కథనే.. కృష్ణవంశీ డైరెక్ట్ చేయనున్నాడట. విష్ణు హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమాను తెరకెక్కిస్తున్న వంశీ, ఆ తరువాత మంచు విష్ణుతో తెరకెక్కబోయే సినిమా పనులు మొదలెట్టనున్నాడు. -
డల్లాస్‌లో ఘనంగా 'శివతత్వం' ఈవెంట్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా), సనాతన ధర్మ ఫౌండేషన్(ఎస్డీఎఫ్), కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్(కేఎస్టీహెచ్) సంయుక్తంగా ఓ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాయి. 'శివతత్వం' అనే అంశంపై డల్లాస్ కేఎస్టీహెచ్ లో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రముఖ నటుడు, రచయిత తనికేళ్ల భరణి పాల్గొన్నారు. శివతత్వంపై అక్కడికి వచ్చిన వారికి అర్థమయ్యేలా వివరించారు. ఆయన ఇష్టదైవం పరమశివుడిపై తాను రాసిన పాటలను భక్తిగా పాడి వినిపించారు. శివతత్వాన్ని తనవంతుగా ప్రచారం చేస్తున్న భరణికి 'శివతత్వ విశారద' అనే బిరుదునిచ్చారు. కేఎస్టీహెచ్ చైర్మన్ డాక్టర్ ప్రకాశ్ రావ్ వెలగపుడి మాట్లాడుతూ.. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్(జీహెచ్హెచ్ఎఫ్) చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. హిందూమతం విశిష్టతను, వారసత్వాన్ని హిందూ దేవాలయాలను, పుణ్య పీఠాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కేఎస్టీహెచ్ గొప్పతనాన్ని, విశిష్టతలను ఆలయ అధ్యక్షుడు ఆర్కే వెల్లంకీ తెలిపారు. సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి నటుడు, దర్శకుడు అయిన తనికేళ్ల భరణిని సభకు పరిచయం చేశారు. 650కి పైగా మూవీలలో విభిన్న పాత్రలను పోషించారని కొనియాడారు. ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డును మూడు పర్యాయాలు అందుకున్నారని చెప్పారు. శ్రీకాళహస్తిశ్వర శతకం రాసిన ధూర్జటి కవి గురించి తనికేళ్ల భరణి ప్రస్తావించారు. తాను రాసిన పాటల్లో ఆయనకు ఎంతో పేరు తెచ్చిన 'ఆటగదర శివ' పాట పాడి వినిపించారు. తనికేళ్ల భరణిని ఈవెంట్‌కు ఆహ్వానించిన వ్యక్తి తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తనికేళ్ల భరణి గారి లాంటి ప్రముఖులను కార్యక్రమంలో భాగస్వాములు చేయడానికి కృషిచేశారు. తానా ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో భాగస్వాములయిన ఎస్డీహెచ్, కేఎస్టీహెచ్, మ్యుజిషియన్స్ ప్రభాళ, రాజు, వాలంటీర్లు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు తనికేళ్ల భరణి, తానా కోషాధికారి మురళి వెన్నమ్, రీజనల్ ప్రతినిధి శ్రీకాంత్ పోలవరపు, డైరెక్టర్ చలపతి కె, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, సనాతన ధర్మ ఫౌండేషన్ కీలక సభ్యుడు గోపాల్ పొనాంగి, , మధుమతి వ్యాసరాజు, ఐవీ రావు, మహేశ్ చొప్పా, విజయ్ తొదుపునూరి, లక్ష్మి తుమ్మల, శ్రీరామ్ చెరువు, జయేశ్ టి, ఇతర ముఖ్యలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలి: తనికెళ్ల భరణి
కొరిన కోరికలు తీర్చే గణనాథుడుని విషపూరిత విగ్రహాలతో ఇబ్బంది పెట్టవద్దని, కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించించాలని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. స్పూర్ది సేవా సంఘం ప్రతినిధి పుట్టా రామకృష్ణ ఆద్వర్యంలో ఆదివారం మారుతినగర్‌లోని తనికెళ్ల నివాసంలో ఆయనను కలిసి మట్టి విగ్రహాలను బహూకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శాస్త్రం ప్రకారం కేవలం బంగారం లేదా మట్టి విగ్రహాలు మాత్రమే ప్రతిష్టించాలని అయితే బంగారు విగ్రహాలు పెట్టే స్దోమత చాలామందికి ఉండదు కాబట్టి మట్టి విగ్రహాన్ని పెట్టి పూజించుకోవచ్చన్నారు.తద్వారా పర్యావరణానికి ఎనలేలి మేలు జరుగుతుందన్నారు. తనవంతుగా కాలనిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసేలా తనవంతు ప్రచారం చేస్తానన్నారు. -
నిర్మాతగా మారుతున్న స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులుగా ఉన్న చాలా మంది, నిర్మాతలుగా మారి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. మరో స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా అదే బాటలో నడవడానికి రెడీ అవుతున్నారు. అయితే మిగిలిన దర్శకుల్లా సినిమాతో కాకుండా ఓ ష్టార్ ఫిలింతో నిర్మాతగా మారుతున్నారు వినాయక్. ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఈ షార్ట్ ఫిలింను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సిరా, మిథునం లాంటి సినిమాలతో దర్శకుడిగా ఎన్నో అవార్డులు అందుకున్న తనికెళ్ల భరణి, లాస్ట్ ఫార్మర్ పేరుతో ఓ షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నారు. ఈ కథ నచ్చిన వినాయక్ తానే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న వినాయక్, తాజాగా ఈ నిర్మాణ బాధ్యతలను కూడా తలకెత్తుకున్నారు. -
సినిమాల్లోకి రాకుంటే.. జైల్లో ఉండేవాణ్నేమో!
రాళ్లపల్లి పరిచయంతోనే ఈ స్థాయికి.. తనికెళ్ల ఊరిలో మా పూర్వికులు ఉండేవారేమో..? ఖమ్మం కల్చరల్ : ప్రముఖ సినీ నటులు, రచయిత, కవి తనికెళ్ల భరణి మనసు విప్పి హాయిగా మాట్లాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనలు చెప్పారు. తనికెళ్ల ఊరితో ఉన్న సంబంధమేంటో వివరించారు. నాటకాలకు ఆదరణ లేదనొద్దని.. ఏం చేయాల్సి ఉందో ఉపదేశించారు. భాషలో యాసలను గుర్తించొద్దని, తెలుగువారమనే విషయం మరువొద్దని అన్నారు. ‘నెలనెలా వెన్నెల’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఖమ్మం వచ్చిన ఆయన జూబ్లీక్లబ్‌లో విలేకరులతో ముచ్చటించారు. కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు, రచయితలతో కవి సమ్మేళనం, ఇష్టాగోష్టిలో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 28 ఏళ్లు నాటకాలు వేశా.. విద్యార్థిగా ఉన్నప్పట్నుంచే నాటకాలంటే మక్కువ. సినిమాల్లోకి రాకముందు 28 ఏళ్లపాటు నాటకాలు వేశారు. అప్పట్లో రిహార్సల్స్ ఎక్కువ. నేడు ఒకట్రెండు నాటకాల్లో నటించగానే సినిమాల్లో చాన్స్‌లు వెతుక్కుంటుంటే..ఇక నాటకాలకు ఆదరణ ఎక్కడ లభిస్తుంది..?. నాటకాలకు ఆదరణ రావాలంటే.. అద్భుతమైన ప్రదర్శన చేయాలి. కథ, కథనం, లెక్కకు మించి రిహార్సల్స్ చేసినప్పుడు, నాటకం బాగా వస్తుంది. అప్పుడు ఆదరణ పెరుగుతుంది. హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు, యక్షగానాలు, నాటకాలకు పూర్వ వైభవం రావాలంటే కళాకారుల చేతుల్లోనే ఉంటుంది. ప్రేక్షకుడు మెచ్చేలా నాటకాలు లేవన్నది కూడా వాస్తవమే. ఇతిహాసాలు చదవాలి.. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి ఇతిహాసాలను చదివి, జ్ఞానం సంపాదించిన వారికే కవులుగా, కళాకారులుగా, రచయితలుగా రాణించేందుకు అర్హత ఉంటుందనేది నా అభిప్రాయం. మారకుంటే జైల్లో ఉండేవాణ్ని.. నా బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా శంఖంపేట రైల్వే క్వార్టర్స్‌లో గడిచింది. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేవాణ్ని. హత్యలు, దొంగతనాలు చేసేవారితో స్నేహం చేశా. అదే కంటిన్యూ అయితే.. కచ్చితంగా ఏదో ఒక నేరం చేసి ఖమ్మం జైల్లోనే ఉండేవాణ్ణేమో(సరాదాగా నవ్వుతూ). అలా మారిన జీవితం.. అప్పటి సినీ నటుడు రాళ్లపల్లి నర్సింహారావుతో ఏర్పడిన పరిచయం నా జీవితాన్ని మార్చింది. నాటకాల్లో అవకాశాలు కల్పించారు. అలా..సినిమాల్లోనూ చాన్స్‌లు లభించి ఈరోజు ఈ స్థాయికి చేరా. ఇప్పటికి 700 కుపైగా సినిమాల్లో నటించా. కానీ..మంచి అనుభూతిని మిగిల్చింది మాత్రం ‘మిథునం’ సినిమానే. ఉత్తమ చిత్రం అవార్డు రావడం మర్చిపోలేని అనుభూతి. సిరా అనే లఘుచిత్రానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది. యాసలు వేరైనా భాష ఒక్కటే.. యాసలు వేరైనా తెలుగు భాష ఒక్కటే. సినిమాల్లో తెలంగాణ యాసను వ్యంగ్యంగా వాడుతున్నారంటే.. కోపంతో కాదు. ఎలా పలకాలో తెలియకనే. ‘మొండిమొగుడు.. పెంకిపెళ్లాం’ అనే సినిమాలో హీరోయిన్ని పూర్తిస్థాయి తెలంగాణ యాసలో మాట్లాడించింది నేనే. సామాన్య మానవుడు శంకరునితో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియజెప్పాలనే ‘శభాష్ రా శంకర’ అనే గేయాన్ని రచించా. తనికెళ్ల మా ఊరేనేమో..! కొణిజర్ల మండలంలో ఉన్న తనికెళ్ల ఊరిపేరే నా ఇంటిపేరుగా ఉండడం విచిత్రం. బహుశా.. మా పూర్వీకులది తనికెళ్ల అయ్యుంటుంది. ఇక్కడి నుంచి వలస వచ్చామేమో అని మా పెద్దలు చెబుతుండేవారు. వాస్తవానికి మా నాన్నగారు టీచర్. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైల్వేక్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. సినిమాల్లోకి రాకముందే, బీకాం చదువుతున్నప్పుడే ఖమ్మంతో అనుబంధముంది. 1974 లో ఖమ్మం కళాపరిషత్ సభ్యులతో కలిసి నాటకం వేశా. పద్మశ్రీ నాకొద్దు.. తెలుగు చిత్రసీమలో ఎందరో గొప్ప నటులున్నారు. సూర్యకాంతం, సావిత్రి, ఎస్వీ. రంగారావు లాంటి మహానటులకు పద్మశ్రీ సత్కారం దక్కలేదు. అందుకే భవిష్యత్‌లో నాకు పద్మశ్రీ వచ్చినా.. నేను స్వీకరించను. సున్నితంగా తిరస్కరిస్తా. -
దుబాయ్‌లో గల్ఫ్ పాటలు!
దేశం కాని దేశం గల్ఫ్‌కు వలస వెళ్లి, అక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విజయతీరాలకు చేరుకున్న ఎంతో మంది భారతీయుల విజయగాథలే కథాంశంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గల్ఫ్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యెక్కలి రవీంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ ఇమ్మడి స్వరపరిచిన ఈ చిత్రం పాటల్లోని ఓ పాటను, ఈ సినిమా టీజర్‌ను దుబాయ్‌లో ఆవిష్కరించారు. గల్ఫ్ వలసల మీద రూపొందిస్తున్న సినిమా కావడంతో దుబాయ్‌లోని జజీరా ఎమిరేట్స్ పవర్ అనే కంపెనీకి చెందిన సోనాపూర్ లేబర్ క్యాంప్‌లో ఈ వేడుక నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘గల్ఫ్‌లో స్థిరపడిన చాలామంది భారతీయులను కలిసి వారి నుంచి సమాచారాన్ని సేకరించాం. దాదాపు 500 కేస్ స్టడీస్ ఆధారంగా కథ తయారు చేశాను. హీరో-హీరోయిన్లుగా కొత్తవాళ్లు నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, ఎల్.బి శ్రీరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎస్.వి.శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.బాపిరాజు. -
ప్రాచీన ఆలయాలను దర్శించిన తనికెళ్ల భరణి
జడ్చర్ల : ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. తొలుత ఆల్వాన్‌పల్లి సమీపంలోని మీనాంబర దేవాలయంలో శివుడిని దర్శించుకున్న ఆయన, అనంతరం జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. భరణి ఓ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ప్రాచీన ఆలయాలను సందర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అడ్డాకుల మండలం కందూరు ఆంజనేయస్వామిని భరణి తరచూ దర్శించుకుంటుంటారు. -
అందుకే శపథాలు మానేశా..!
నరసాపురం : సినిమా... అంటే గ్లామరస్ ప్రపంచం. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించాలని తాపత్రయ పడేవారే ఎక్కువ. పెద్దరికాన్ని ఆపాదించుకోవడానికి అసలు ఇష్టపడని లోకం. అటువంటి వారి మధ్యలో మనకు కనిపించే అరుదైన పర్సనాలిటీ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి. సమాజంలో ఏ దుర్ఘటన జరిగినా తీవ్రంగా చలించిపోతారు. నిర్భయ ఘటనలోని నిందితులకు ఉరిశిక్ష పడేవరకూ ఒంటి మీద నల్లచొక్కా విప్పనని ఆయన శపథం చేశారు. అంతేకాక తెలుగు పాఠశాలలను ప్రస్తుత ప్రభుత్వం ఇంగ్లిష్ మాధ్యమానికి మార్పుచేయడంపై తీవ్రంగా స్పందించారు. మొత్తం తెలుగుజాతినే నిషేధించేయండి అని తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి శనివారం నరసాపురం వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ ఇలా సాగింది. ప్రశ్న : నిర్భయ ఘటనలో చాలా తీవ్రంగా స్పందించారు, మళ్లీ అంత స్పందన చూడలేదు కారణం? జవాబు : నిజమే. హైదరాబాద్ సాక్షి చానల్ స్టూడియోలో శపథం చేశాను. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడేవరకూ ఆ రోజు వేసుకున్న నల్లాచొక్కా విప్పనని. కానీ ఆ నల్లచొక్కా విప్పిన తరువాత నిర్భయలాంటి ఘటనలు చాలా జరిగాయి. అలాంటి శపథాలు చేస్తే చొక్కాలు జీవితాంతం వేసుకోలేమని అర్థమైంది. అందుకే శపథాలు మానేశా. ప్ర : అన్యాయాలపై స్పందించకూడదని అనుకున్నారా..? జ : అలాగేమీకాదు. నా అభిప్రాయంలో సినిమా వాళ్లు నెగిటివ్‌గా చెప్తేనే ఎక్కువమంది ప్రభావితమవుతారు. కాని నాకు చేతనైనంత వరకూ సమాజంలో చెడును రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నా. అది సినిమాల ద్వారా కొంత, రచనల ద్వారా మరికొంత. ప్ర : ఇటీవల ర్యాగింగ్ అంశంపై గతంలా స్పందించలేదెందుకని? జ : ముందే చెప్పానుగా... సినిమావాళ్లు స్పందిస్తే గ్లామర్ ప్లేవర్ మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి రూపుమాపాలి. జనం అందరూ మంచిగా ఆలోచించాలి. ప్ర : తెలుగుభాష, అభివృద్ధి పరిరక్షణ రాష్ట్రంలో ఎలా ఉంది? జ : దారుణంగా ఉంది. రెండురోజుల క్రితం రాష్ట్రంలో 3 వేలకు పైగా పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఆ పాఠశాలల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగేది. వ్యంగ్యం అనుకోకుంటే... తెలుగు బోధించే పాఠశాలలను కాదు, తెలుగువాళ్లను, తెలుగుజాతిని నిషేధించేయమనండి. ఇంగ్లిష్‌ను నేర్చుకోవడం తప్పుకాదు గాని, మాతృభాషను విస్మరించడం అమ్మను చంపేయడమే అవుతుంది. ప్ర : తెలుగుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయా? జ : నిజమే, తెలుగులో ఎంఫిల్ చేసినా ఉద్యోగాలు రాని పరిస్థితి. అయితే మీ నరసాపురానికే చెందిన కడిమెళ్ల వరప్రసాద్ తెలుగును నమ్ముకుని ప్రపంచ గుర్తింపు పొందారు. ప్ర : మీ డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్న ఎప్పుడు? జ : 24 ఫ్రేమ్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మాతగా, ఆయన తనయుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో భక్తకన్నప్ప నా స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతోంది. జనవరిలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్ర : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? జ : స్టార్ పెద్ద హీరోలతో రూపుదిద్దుకుంటున్న 12 సినిమాల్లో నటిస్తున్నా. కిట్టూ సినిమాలో పాత తనికెళ్ల భరణిని చూస్తారు. -
సాహిత్యానికి సినీ వారధి
తనికెళ్ళ తాజా ప్రయత్నం ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ‘సిరా’ లాంటి షార్ట్ ఫిల్మ్‌లతో, ‘మిథునం’ లాంటి సినిమాతో అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయన మళ్ళీ మెగాఫోన్ పడుతున్నారు. విశేషం ఏమిటంటే, సాహిత్యాభిమాని, స్వయంగా రచయిత అయిన తనికెళ్ళ భరణి ఈ సినిమాకు కథను తెలుగు సాహిత్యంలో నుంచే ఎన్నుకోవడం! ఇటీవలే మరణించిన ఒక ప్రముఖ తెలుగు రచయిత రాసిన పాపులర్ కథతో ఈ కొత్త సినిమా తయారు కానుంది. ఒక పాపులర్ యంగ్ హీరో ఈ చిత్రంలో కథానాయక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి, తనికెళ్ళ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప పురాణ గాథ ఆధారంగా ‘కన్నప్ప కథ’ చిత్రాన్ని భారీగా రూపొందించడానికి ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఆ పౌరాణిక చిత్రానికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యే లోపల ఈ సరికొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ సెప్టెంబర్‌లోనే కొత్త సినిమాను ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే, తనికెళ్ళ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన ‘మిథునం’ సినిమా కూడా తెలుగు సాహిత్యంలోని సుప్రసిద్ధమైన కథ (రచయిత శ్రీరమణ ‘మిథునం’) ఆధారంగా రూపొందినదే. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా సాహిత్యం నుంచి సెల్యులాయిడ్ మీదకు ఎక్కుతున్నదే కావడం గమనార్హం! మొత్తానికి, ఈ సరికొత్త ప్రయత్నంతో తనికెళ్ళ దర్శకుడిగా మరోమారు తన సత్తా చాటడమే కాక, మన సాహిత్యానికీ, సినిమాకూ మధ్య పాత తరంలో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ పటిష్ఠం చేస్తారని భావించవచ్చు. తనికెళ్ళ, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటివారిని ఆదర్శంగా తీసుకొని, మరింతమంది డెరైక్టర్లు సాహిత్యం నుంచి సినిమా కథలు తీసుకుంటే, కొత్త రకం చిత్రాలు వస్తాయి కదూ! -
జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: తనికెళ్ల భరణి (నటుడు); శరత్‌కుమార్ (నటుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన శక్తి, సౌందర్య పోషణ అలవడతాయి. కొద్దిపాటి మానసిక ఒత్తిడి, ఒడుదొడుకులు ఉంటాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. పుట్టిన తేదీ 14. అంటే 5. ఇది బుధుడికి సంబంధించినది కావడం వల్ల విద్యార్థులకు బుద్ధిబలం బాగా పెరుగుతుంది. పరీక్షలలో మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీడియా వారికి, కళా సాంస్కృతిక రంగాల వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించడంతోపాటు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. లక్కీ నంబర్స్: 1,2,5, 6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, గ్రే, క్రీమ్, లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: రోజూ కొద్దిసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా పచ్చను ఉంగరంలో ధరించడం, అనాథలకు బెల్లం పాయసం పెట్టడం, బియ్యం దానం చేయడం మంచిది. - డాక్టర్ ముహ్మద్ దావూద్ -
'వెండితెరపై పాలమూరు ప్రాశస్త్యం'
జడ్చర్ల: పాలమూరు జిల్లా చరిత్ర, ప్రాశస్త్యాన్ని వెండితెరకు పరిచయం చేస్తామని ప్రముఖ సినీనటుడు తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ రాజావారి కోటను సందర్శించేందుకు వెళ్తూ మార్గమధ్యంలో జడ్చర్లలో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను తీయబోయే భక్త కన్నప్ప సినిమాలో జిల్లాలోని ప్రముఖ చారిత్రక కట్టడాలు, దేవాలయాలకు సంబంధించిన పురాతన చరిత్ర, సంస్కృతిని తెలుగుతెరకు పరి చయం చేస్తానన్నారు. గతంలో అలంపూర్, గద్వాల, మన్యంకొండను దర్శించుకున్నానని, ఇప్పటివరకు సినిమాలో రాని వాటిని తమ సినిమాలో చూపించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తాను కందూరు దేవాలయాన్ని సం దర్శించానని అక్కడి కోనేరులో కదంబ వృక్షా లు ఉన్నాయని తెలిపారు. దక్షిణ భారతదేశం లో ఉన్న ఈ వృక్షాలు ఇక్కడ ఉండటం విశేషమన్నారు. గుంటూరు జిల్లా న రసరావుపేట త్రిపురాంతకం వద్ద ఏడు కదంబ వృక్షాలు ఉండగా కందూరు దేవాలయం వద్ద 26 వృక్షాలు ఉన్నాయని చెప్పారు. ఇవి హిమాలయాల్లో ఎక్కువగా ఉంటాయని, వీటి ప్రాముఖ్యతను మనం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కందూరు కోనేరును శుద్ధిచేసేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అభిమానుల కోరిక మేరకు ఆయన ‘శభాష్ రా శంకరా!’ అనే భక్తి గేయాన్ని ఆలపించారు. -
మంచిరోజులు వస్తాయని ఏదో దురాశ
కొవ్వూరు : గోదావరి గలగలలు.. పచ్చని పైర్లు.. పాపికొండల అందాలంటే తనకెంతో ఇష్టమని సీనియర్ నటుడు, రచరుుత తనికెళ్ల భరణి అన్నారు. మండలంలోని కుమారదేవంలో ‘గోదారి.. నవ్వింది’ సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు సోమవారం వచ్చిన ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. మీ సినీ జీవితం ఎలా ఉంది చాలా హ్యాపీగా సాగిపోతోంది. అభిమానులు ఆదరిస్తున్నంత సేపూ ఇలా నటిస్తూనే ఉంటా. ఇప్పటి వరకూ ఎన్ని సినిమాల్లో నటించారు 30 ఏళ్ల క్రితం వంశీ డెరైక్షన్‌లో నటించిన లేడీస్ టైలర్ నుంచి ఇప్పటి వరకూ సుమారు 800 సినిమాల్లో నటించా. మీకు చాలా ఇష్టమైన, పేరు తెచ్చిపెట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. అంకురం, మాతృదేవోభవ, కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్, శివ, వారసుడొచ్చాడు, అన్నమయ్య, అతడు, ఆమె, యమలీల ఇలా చాలా ఉన్నారుు. మీ సొంతూరు పాలకొల్లు దగ్గర ఉన్న జగన్నాథపురం మా సొంతూరు ప్రస్తుతం నటిస్తున్న, నటించిన సినిమాలు కిక్-2, బెంగాల్ టైగర్, బాహుబలి, గోదారి నవ్వింది, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న మైనేమ్ ఈజ్ రాజులో నటిస్తున్నా. ఇంటర్వ్యూలలో శివుడు గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సమాజం గురించి ఏమైనా చెబుతారా అవును నాకు భోళాశంకరుడంటే ఇష్టం. సమాజంలో స్వార్థం పెరిగిపోరుుంది. ఎక్కడ చూసినా మోసం, దగా, కుట్ర కనిపిస్తున్నారుు. మనిషి తాను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి దేవుడిని నమ్ముతున్నాడు. దీంతో దేవుడు కూడా వెళ్లలేనంతగా ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుత సినిమాల్లో హింస ఎక్కువగా ఉందంటారా లేదు సినిమాల్లో కన్నా బయట ప్రపంచంలోనే హింస ఎక్కువగా ఉందని నా భావన. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతగా దుర్మార్గం పోయి మంచిరోజులు వస్తాయని ఏదో దురాశ. ప్రస్తుతం వస్తున్న సినిమాలపై మీ అభిప్రాయం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల మాదిరిగా త్వరత్వరగా సినిమాలు తీస్తున్నారు. దీంతో సక్సెస్‌రేటు పడిపోయింది. బాహుబలి సినిమా మొదలు పెట్టి రెండేళ్లు గడుస్తుంది. ఈ మధ్యలో పదుల సంఖ్యలో వచ్చాయి... వెళ్లాయి అంతే. కొత్తగా సినీ పరిశ్రమకు వచ్చే వారికి మీరిచ్చే సలహా సలహా ఇచ్చే అంత నా దగ్గర ఏమీ లేదు. అయితే ప్రతి దాంట్లోను కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఇక్కడ టాలెంట్ ఉంటే నూరు శాతం సక్సెస్ అవుతారు. గోదారి.. నవ్వింది సినిమా గురించి మంచి కథ, కథపై పట్టున్న దర్శకుడు భీమ్జీ, అభిరుచి గల నిర్మాత బలగ ప్రకాశరావు. సినిమా తప్పక విజయం సాధిస్తుంది. భరణీ విలనిజం కుమారదేవంలో షూటింగ్ సందడి కుమారదేవం (కొవ్వూరు రూరల్) : ‘గోదారి నవ్వింది’ చిత్రంలో సీనియర్ నటుడు తనికెళ్ల భరణి మరోసారి తన విలనిజాన్ని ప్రదర్శించారు. సినిమా షూటింగ్లో భాగంగా పోరాట సన్నివేశాలను కుమారదేవంలోని ఇసుక తిన్నెలపై దర్శకుడు భీమ్జీ యజ్జల సోమవారం తెరకెక్కించారు. చిత్రంలో ఎమ్మెల్యేగా నటిస్తున్న తనికెళ్ల భరణి తన అనుచరులతో కలిసి మైనింగ్ అధికారిని శిక్షించే సన్నివేశాన్ని కెమెరామెన్ సలీమ్ చిత్రీకరించారు. -
ఇప్పుడు కన్నప్ప మారాడు!
ఒక కథకు ముందు ఓ హీరోను అనుకొన్నా... చివరకు ఆ కథ వేరే హీరోతో తెరకెక్కడం సినిమా రంగంలో సర్వసాధారణం. ఈ మధ్య పూరి అనుకున్న కథకు నితిన్ ఎంపికై, తర్వాత ఆ స్థానంలో వరుణ్ తేజ్ వచ్చారు. తాజాగా మరో సినిమాకు అలా జరిగింది. భక్త కన్నప్ప జీవితం ఆధారంగా తాను దర్శకత్వం వహించా లనుకున్న చిత్రంలో టైటిల్ రోల్‌కు హీరోగా మారిన కమెడియన్ సునీల్‌ను ముందు ఎంపిక చేశారు దర్శక - రచయిత తనికెళ్ల భరణి. ఇప్పుడు అదే కథను మరో హీరోతో తనికెళ్ల తెరకెక్కించనున్నారు. ఈ ‘కన్నప్ప కథ’లో టైటిల్ రోల్‌ను మంచు విష్ణు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని ఓ హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మించను న్నారు. ‘‘కన్నప్ప కథ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకుంటుందని, కథ ఓకే అయిన ప్పట్నుంచీ ఎంతో ఉద్వేగంగా ఉన్నాం’’ అని విష్ణు అన్నారు. భారతీయ భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని నిర్మించనున్నామని, ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. -
గల్లీలో చెల్లి పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...
హిట్ క్యారెక్టర్ సినిమా పేరు: యమలీల (1994); డెరైక్ట్ చేసింది: ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా తీసింది: కె.అచ్చిరెడ్డి; మాటలు రాసింది: దివాకర్‌బాబు అనగనగా ఓ తోటరాముడు. పేరు చూసి వీడెవడో ‘పాతాళ భైరవి’లోలాగా వీరుడూ శూరుడూ అనుకోవద్దు. నీచనికృష్ట పాపిష్టి మానవుడు వీడు. బీరు తాగినంత సునాయాసంగా దోపిడీలు, బ్రేవ్‌మని తేన్చినంత ఈజీగా ఘోర హత్యలు, టీవీలో వార్తలు చూసినంత అవలీలగా మానభంగములు చేసెడివాడు. నరకలోకపు హెచ్ఆర్ మేనేజర్ చిత్రగుప్తుడికి సైతం వీడి చిట్టా మెయింటైన్ చేయలేక హెడేక్ మీద హెడేక్ వచ్చేసింది. ఈ తోట రాముడికి తిక్క... వెర్రి... పిచ్చి... ఉన్మాదం... మదం... పొగరు... బలుపు... ఇలా సకల అవలక్షణాలూ కలవు. తనో పెద్ద తోపు అని తోటరాముడికి ఫీలింగ్. వీడికో బ్యాట్ బ్యాచ్ కలదు. ఎవడైనా తోటరాముడు తెలియదన్నాడంటే వాడి తాట తీసిపారేస్తాడు. ఈ నగరమనే నరకానికి తానే ‘యముండ’ అని చెప్పుకుంటుంటాడు. ఎవణ్ణి ఎప్పుడు ఖతం చేయాలో తానే డిసైడ్ చేస్తుంటాడు. ఇంతోటివాడికి రగతం చూస్తే కళ్లు తిరుగుతాయి. తన బ్యాట్బ్యాచ్ ఎవడినైనా చంపుతుంటే, తాను వెనక్కి తిరిగి ఆ చావుకేకల్ని వింటూ తన్మయానికి గురవుతుంటాడు. ఇదే నగరంలో ఓ గరం పోరీ ఉంటుంది. పేరు లిల్లీ. ఆమెకో చైన్ బ్యాచ్. ఈ రెండు బ్యాచ్లకీ టెస్ట్మ్యాచ్ల్లాగా నిరంతరం గొడవలే. ఈ తోటరాముడికి ఎవడైనా అమాయకుడు కనబడ్డాడా... వాణ్ణి బకరా చేసి ఆడించేస్తాడు. తమాషా చూస్తాడు. ఇదో శాడిజం వాడికి. ఈ తోట రాముడికి కపిత్వంలో పాటు కవిత్వం కూడా ఇష్టం. ఆ రోజు ఏమి జరిగినదంటే... ఓ వారపత్రిక కార్యాలయమది. సంపాదకుడు మహా బిజీగా ఉన్నాడు. అక్కడికి తోటరాముడు ప్రవేశించేసరికి కార్యాలయం మొత్తం కల్లోలం. ఈ ఆఫీసుని కబ్జా చేయడానికే వచ్చాడని ఆ సంపాదకుడు భావించి తట్టాబుట్టా సర్దేసుకోవడానికి సిద్ధమైపోయాడు. కానీ, తోటరాముడు మాత్రం పెళ్లిచూపులకు వచ్చినవాడిలా సిగ్గుపడుతూ సంపాదకుని ముందు కూర్చున్నాడు. అతగాడు భయపడుతూ చూస్తున్నాడు. తోటరాముడు జేబులోంచి తీశాడు. కత్తి కాదు... కాగితం! ‘‘నేనీ మధ్య కవిత్వం రాయడం షురూ చేసినా...’’ అంటూ మెలికలు తిరిగిపోయాడు తోటరాముడు. సంపాదకుడికి సృ్పహ తప్పినంత పనయింది. తోటరాముడే నీళ్లు జల్లి లేపాడు. ఇక తప్పించుకోవడం అసాధ్యమని తేలిపోయి ‘‘చెప్పండి సార్’’ అని వినయంగా వేడుకున్నాడు సంపాదకుడు. తన అసిస్టెంట్ చిట్టి వైపు ఓ లుక్కిచ్చి సగర్వంగా చదవడం మొదలుపెట్టాడు తోటరాముడు.‘‘నాకొక బుల్లి చెల్లి...’’ అని ఒక లైను చదివాడో లేదో, చిట్టిబాబు ‘వహ్వా వహ్వా’ అంటూ భజన మొదలుపెట్టేశాడు. సంపాదకుడు కూడా పొగడాలి కదా. లేకపోతే గుండు రామకీర్తన పాడుతుందని తెలుసు. అందుకే తనూ పొగడ్డం మొదలెట్టాడు. ‘‘సిస్టర్ సెంటిమెంట్ అన్నమాట... కానివ్వండి కానివ్వండి’’ అన్నాడు. తోటరాముడు ఛాతీ రెట్టింపైంది. ‘‘నాకో బుల్లి చెల్లి నేడే గల్లీలో దానికి పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’’ అని కవిత చదవడం పూర్తి చేసి, తోటరాముడు చాలా ఉత్సుకతగా సంపాదకుడి వైపు చూశాడు. ఆ సంపాదకుడి పరిస్థితి చూడాలి. యాక్సిడెంటై అంబులెన్స్ ఎక్కితే, ఆ అంబులెన్స్‌కే యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ‘‘చెల్లి పెళ్లి... ఒక్కసారి కాదు... జరగాలి మళ్లీ మళ్లీ... బావుంది... చాలా బావుంది. కొత్తగా ఉంది. అద్భుతంగా ఉంది’’ అని పొగడ్డానికి పదాలు రాక... కాదు కాదు దొరక్క... అలా పొగుడుతూనే ఉన్నాడు. హుస్సేన్ సాగరంలో నిమజ్జనం చేసే వినాయకుడిలాగా తోటరాముడు తెగ సంబరపడిపోయాడు. ‘‘అయితే ఈ కవితను ప్రింట్ చేయాలని డిసైడ్ చేసినా’’ అన్నాడు. తోటరాముడు డిసైడ్ చేశాడంటే వార్ వన్‌సైడ్ అయిపోయినట్టే. కవిత పబ్లిషైంది. తోటరాముడు ఖుష్షో ఖుష్షు. సరిగ్గా అదే సమయంలో అసిస్టెంటు పరిగెత్తుకుంటూ వచ్చి ‘‘అన్నా అన్నా... నీకోసం పోస్టల్ వ్యాన్ వచ్చినాదే’’ అని చెప్పాడు. ‘‘అరె చుప్... నా కోసం వస్తేగిస్తే పోలీసు వ్యాను రావాలే. పోస్టల్ వ్యాను రావడమేంటి?’’ అని తోటరాముడు కసురుకున్నాడు. కానీ నిజంగానే పోస్టల్ వ్యాను వచ్చి, 5 బస్తాల ఉత్తరాలు అతని ముందు పడేసి పోయింది. తోటరాముడికి ఏం అర్థం గాలేదు.‘‘తొలి కవితతోనే ఎంత పాపులరైపోయారు సార్’’ అంటూ సంపాదకుడు ఉబ్బేశాడు. తోటరాముడు చాలా హుషారుగా ఓ ఉత్తరం తీసి చదవమన్నాడు. ‘‘తోటరాముడు గారికి... గత వారం వారపత్రికలో మీరు రాసిన ‘చెల్లి పెళ్లి’ కవిత చదివా. చెల్లికి మళ్లీ పెళ్లేంట్రా గాడిదా... నికృష్టుడా... దరిద్రుడా... అప్రాచ్యుడా... నీకు దినం పెట్టా...’’ ... ఇలా ఆ ఉత్తరమంతా తిట్ల సునామీ. తోటరాముడి మొహం మాడిపోయిన మసాలాదోశెలా అయిపోయింది. ఇంకో ఉత్తరం తీస్తే... అందులో అంతకన్నా ఎక్కువ తిట్లు.సంపాదకుడి వైపు కొరకొరా చూశాడు తోటరాముడు. ‘‘నా కవిత్వం బాగుందని అన్‌పాపులర్ చేస్తావురా. నన్ను కవిని చేయమంటే బద్నామ్ చేస్తావ్. నేను నిన్ను బద్నామ్ చేస్తా’’ అని సంపాదకుణ్ణి చెడుగుడు ఆడేశాడు. చూశారా... ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని తెలుసు మనకి. కానీ ఒక కవిత కూడా జీవితాన్ని ఎలా డిసైడ్ చేసేసిందో! ఫైనల్‌గా ఈ స్టోరీకి కన్‌క్లూజన్ ఏంటంటే - ఈ తోటరాముడు, సాక్షాత్తూ యమధర్మరాజునే డిసైడ్ చేసేయాలని చూశాడు.భూమ్మీదకు పొరపాటున జారిపడ్డ ‘భవిష్యవాణి’ పుస్తకం కోసం యమధర్మరాజు, చిత్రగుప్తుడు వెతుకుతుంటే, తోటరాముడు దాన్ని దొరకబుచ్చేసుకు న్నాడు. ఎంతో ఉత్సాహంగా, ఆత్రంగా ఆ ‘భవిష్యవాణి’ ఓపెన్ చేసి చూస్తే ‘నేటితో నీ చరిత్ర సమాస్తం’ అని రాసి ఉంది. అదేంటో యమధర్మరాజు గదతో గట్టిగా గదిమితే తప్ప తెలియలేదు. తోటరాముణ్ణి యమధర్మరాజు అట్లా డిసైడ్ చేసినాడు మరి! ఈ తోటరాముడి ప్రసారం ఇంతటితో సమాప్తం. - పులగం చిన్నారాయణ ‘యమలీల’ సినిమాలో యముడు ఎంత ఇంపార్టెంటో, తోట రాముడు కూడా అంతే ఇంపార్టెంటు. తన కామెడీ విలనీతో ఈ తోట రాముడు సినిమాను ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులూ తిప్పాడు. ఈ తోటరాముడు పాత్ర తనికెళ్ల భరణి కెరీర్‌ను చాలా గొప్పగా డిసైడ్ చేసేసిందంతే..! ‘‘ఆ రోజు... నేను ఇంటికి వెళ్లగానే ఓ వార్త. ఎస్వీ కృష్ణారెడ్డిగారు అర్జంట్‌గా కాల్ చేయమన్నారట. అప్పట్లో సెల్‌ఫోన్స్ లేవు. మా ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కానీ, ఎస్టీడీ సౌకర్యం లేదు. దాంతో ఎస్టీడీ బూత్‌కెళ్లి ఫోన్ చేశా. ‘యమలీల’లో మెయిన్ విలన్ వేషం ఇస్తున్నట్టు కృష్ణారెడ్డిగారు చెప్పగానే, ఆనందంతో ఉప్పొంగిపోయా. కానీ డేట్ల సమస్య. అవే డేట్లు ‘పల్నాటి పౌరుషం’ సినిమాకిచ్చా. రాజమండ్రిలో షూటింగ్. నిర్మాత ‘ఎడిటర్’ మోహన్‌గారిని బతిమిలాడా. కృష్ణంరాజులాంటి బోలెడుమంది ఆర్టిస్టులతో కాంబినేషన్. కుదరదన్నారు. అయ్యో... బ్రహ్మాండమైన అవకాశం మిస్సయ్యిందే అనుకుంటూ కృష్ణారెడ్డిగారికి ఫోన్ చేసి విషయం చెప్పా. ఆయన ‘‘ఏం పర్లేదు... మీరు వేరే డేట్లు ఇవ్వండి. అప్పుడే చేద్దాం’’ అని నాకు ఊపిరి పోశారు. అలా నాకు ‘తోటరాముడు’ పాత్ర దక్కింది. దాదాపు 20 రోజుల వేషం. ఆ రోజు లాస్ట్డే. నేను వెళ్లడానికి రెడీ అవుతుంటే... ‘‘మీ మీద పాట ఉంది’’ అని చెప్పారు. ఆశ్చర్యపోయా. క్లైమాక్స్‌లో నాతో సరదాగా ‘చినుకు చినుకు అందెలతో...’, ‘రగులుతోంది మొగలిపొద...’ పాటలకు స్టెప్పులేయించారు. ఈ సినిమా నా జీవితాన్ని ఎంతలా మలుపు తిప్పిందంటే - ఇక నేను రైటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించేశాను. ఒకే ఏడాది దాదాపు 37 సినిమాలు ఒప్పుకునేంత బిజీ అయిపోయా. నేనెక్కడికి వెళ్లినా ‘డిసైడ్ చేస్తా’ అంటూ అభిమానులు సరదాగా మాట్లాడేవారు. ‘చెల్లి పెళ్లి’ కవిత చెప్పమనేవారు. నేను తెలంగాణలో పుట్టి పెరిగా కాబట్టి, ఈ డైలాగులు నేను రాశానని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఒక్క అక్షరం కూడా నాదికాదు. నూటికి నూరు శాతం ఈ క్రెడిట్ రచయిత దివాకర్ బాబుదే.’’ - తనికెళ్ల భరణి -
భ్రమణం
ఒంటి స్తంభం మేడ మీద అందాల యువతి. ఆనందంగా పాటలు పాడుకుంటున్న ఆమె గొంతు విని ఎలాగైనా ఆమెను చూడాలనుకుంటాడు ఓ రాకుమారుడు. అక్కడే మాటువేసి ఉంటాడు. ఇంతలో మాంత్రికుడు వచ్చి మంత్రం చదవగానే బారెడు జడ కిందకు వస్తుంది. దాన్ని పట్టుకుని మాంత్రికుడు పైకి ఎక్కడం గమనిస్తాడు. మాంత్రికుడు వెళ్లి పోయాక అదే విధంగా పైకి వెళ్లి ఆ యువతిని కలుసుకుంటాడు రాకుమారుడు. యవ్వనవతి, సౌందర్యవతి అయిన ఆ చక్కటి చుక్క ఆ ఒంటి స్తంభం మేడనే ప్రపంచం అనుకుంటుంది. తనలాగే యవ్వనంలోకి వచ్చిన వారంతా ఇలాగే ఉంటారనే భ్రమలో బతుకుతుంటుంది. చిన్నప్పుడు చదివిన ఫెయిరీటేల్ రపుంజెల్లాగే సాగిన ‘సంపంగి’ నాటకంలో బలమైన ఆలోచన ఉంది. సమాజాన్ని... ఒక మంత్రగాడిగా చూపిస్తూ ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా టీనేజర్స్‌ని కూపస్త మండూకాల్లా కట్టిపడేస్తున్నారు పేరెంట్స్. సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను చూపించి భయపెడుతూ వారిని సమాజం నుంచి వేరు చెయ్యటం వల్ల యువత రెండు రకాల ప్రపంచాలను, రెండు వ్యక్తిత్వాలను సృష్టించుకుంటున్నారు. ఫ్యామిలీలో ఒకలా ప్రవర్తిస్తూ... తమకు నచ్చిన పని చెయ్యటానికి, తమకు ఆసక్తిగల విషయాలను తెలుసుకోవటానికి మరో రకమైన యాటిట్యూడ్‌ని అలవర్చుకుంటున్నారు. దాని వల్ల వాళ్లు ఏం కోల్పోతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేశామంటున్నారు ఈ ప్లే దర్శకుడు, నటుడు కృష్ణప్రసాద్. తాదామ్య విచ్ఛేదం.. హీరో హీరోయిన్, మాంత్రికుడు పాత్రలతో నాటకం సాగుతుండగా అందులో సూత్రధారుడు ఆ సన్నివేశాన్ని ఆపి.. ఇది ఎందుకు ఇలా ఉండాలి, ఆమెను మాంత్రికుడు ఎందుకు బాధిస్తున్నాడు? వంటి ప్రశ్నలు వేస్తాడు. బాధ పెట్టే మాంత్రికుడికి శిక్షపడాలని సూచిస్తాడు. ఈ ప్రక్రియ గురించి అక్కడికి ప్రేక్షకుడిగా వచ్చిన తణికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇది ఎలియనేషన్ ప్రక్రియ. తాదామ్య విచ్ఛేదం అంటారు. ఒక విషయం నాటకం ద్వారా ప్రెజంట్ చేస్తున్నప్పుడు, ఆడియెన్స్ మదిలో మెదిలే ప్రశ్నలను.. సూత్రధారుడే చెప్పి మళ్లీ నాటకాన్ని కొనసాగిస్తాడు. ఎలా అంటే.. రామాయణ కథ తెలిసిందే అయినా సీతను ఎత్తుకుపోతున్నప్పుడు ఆడియెన్స్ బాధ పడుతుంటారు. అప్పడు సూత్రధారుడు నాటకాన్ని ఆపి ‘ఆ సీత ఎవరో కాదు నీ చెల్లెలు, నీ భార్య జాగ్రత్త!’ అంటూ మళ్లీ చెప్పటం మొదలుపెడతాడు. అంటే ఒక విషయాన్ని రియాలిటికీ కనెక్ట్ చెయ్యటం. ఈ టెక్నిక్‌ని ఇక్కడ బాగా అడాప్ట్ చేసి ప్రదర్శించారు. సరదా స్క్రీన్‌ప్లేతో చాలా స్ట్రాంగ్ మెసేజ్‌ని అందించారు’ అని వివరించారు. జెర్మన్ నాటకాన్ని సంపంగి పేరుతో తెలుగు ఆడియెన్స్‌కు నచ్చే విధంగా, కొత్తగా ఆలోచించే విధంగా రాశారు ఉదయభాను గరికపాటి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో, హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకాన్ని భూమిక థియేటర్ గ్రూప్ ఇటీవల లామకాన్‌లో ప్రదర్శించింది. - ఓ మధు -
లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి
అప్పట్లో ‘లేడీస్ టైలర్’ పెద్ద హిట్టయింది. దానికీ మేమంతా ఓ టీమ్‌లా కలసి మెలసి పనిచేశాం. ‘సూర్య వెర్సస్ సూర్య’ టీమ్‌తో వర్క్ చేస్తుంటే నాకా రోజులు గుర్తొచ్చాయి’’ అని తనికెళ్ల భరణి అన్నారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా పదకొండు రోజులకు పదకొండు కోట్లు వసూలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. విభిన్న నేపథ్యంలో చేసిన మా ప్రయత్నం ఇంత ఘన విజయం సాధించడానికి ప్రేక్షకులు కారణమని నిర్మాతలు చెప్పారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత చందు మొండేటి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
దైవికంగా అంతా బాగా కుదిరింది : తనికెళ్ల భరణి
‘‘ద ర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రాత్రిళ్లే షూటింగ్ ఉంటుందని గ్రహించాను. చాలా కష్టమనుకున్నాను. కానీ దైవికంగా అంతా బాగా కుదిరింది. కార్తీక్ చాలా అద్భుతంగా తీశాడు. భవిష్యత్తులో తను పెద్ద దర్శకుడు అవుతాడు’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. నిఖిల్, త్రిదా జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సత్యమహావీర్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాద వ్ ఆవిష్కరించి, విభిన్న నేపథ్యంతో తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలన్నారు. నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. చందూ, కార్తీక్, నేను ఓ మంచి సినిమా తీయాలన్న ఆకాంక్షతో ఈ ప్రాజెక్ట్ చేశాం’’ అన్నారు. ఒక షార్ట్ ఫిలిం తీయడానికి ఆరు నెలలు తీసుకున్నాననీ, కానీ ఈ చిత్రాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేశాననీ, దీనికి చిత్రబృందం సహకారమే కారణమనీ దర్శకుడు అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెస్ రాజు, సందీప్ కిషన్, వీరభద్రం, సుశాంత్, ఎన్.శంకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
సినీ జీవిత నిష్ఠూరాలపై ఫోకస్ లైట్
అందుకే... అంత బాగుంది! లెమ్ లైట్ (1952) తారాగణం: చార్లీ చాప్లిన్, క్లెయిర్ బ్లూమ్, నిగెల్ బ్రూస్, బిస్టర్ కీటన్, సిడ్నీ ఎర్ల్ చాప్లిన్, వీలర్ డ్రైడెన్, నార్మన్ లాయిడ్, సంగీతం: చార్లీ చాప్లిన్, రచన-నిర్మాత-దర్శకుడు: చార్లీ చాప్లిన్, విడుదల: 1952, ఛాయాగ్రహణం: కార్ల్ స్ట్రస్, సినిమా నిడివి: 137 నిమిషాలు, నిర్మాణ వ్యయం: 9 లక్షల డాలర్లు (ఇప్పటి లెక్కలో దాదాపు 5 కోట్ల 40 లక్షల రూపాయలు), వసూళ్లు: 80 లక్షల డాలర్లు (48 కోట్ల రూపాయలు) చార్లీ చాప్లిన్! కామెడీ కింగ్... కాదు విషాద కథానాయకుడు... మానవాళికి ఓ దివ్య వరం! ఒక సినిమా... ఒక కళాకారుడూ మానవ జీవితం మీద, ఆ మాటకొస్తే యావత్ భూగోళంలో ఉన్న మానవజాతి మీద ఇంత ప్రభావం చూపించడం సాధ్యమా... అనిపిస్తుంది! అరవై ఏళ్ల క్రితం... అంటే ఇంచుమించు నేను పుట్టక ముందు తీసిన సినిమా... ఇంకా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటే... ఆ కళారూపానికి సాష్టాంగ పడడం తప్ప మరేం చేయగలం... లైమ్లైట్!... 1952లో వచ్చిన చిత్రం... అప్పటి దాకా మూకీ యుగాన్ని శాసించిన చాప్లిన్, సినిమాకి మాట వచ్చాక చేసిన మహోన్నత చిత్రం - ఓ కళాకారుడి జీవిత కథ... ఓ రకంగా ఇది చాప్లిన్ కథే కావచ్చు గూడా. టూకీగా ‘కాల్వెరో’ అనే కమెడియన్ అవసానదశలో ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటూ... నానా రకాలుగా మానసికంగా కుంగిపోయి... ఒకసారి హార్ట్ అటాక్‌కి కూడా గురై ఏదో జీవితం లాగిస్తున్న వాడల్లా.. ఆత్మహత్యకు పాల్పడబోయిన ‘టెర్రీ’ అనే కళాకారిణిని కాపాడడం ... తర్వాత ఆమెకు ధైర్యం నూరిపోసి... మళ్లీ ఆమె చేత అర్థవంతంగా డాన్స్ చేయించడం... కృతజ్ఞతగా... ఆ పిల్ల వయస్సులో తనకన్నా పెద్దవాడైన కాల్వెరోని గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తే... వయస్సులో ఉన్న ఆ పిల్లను సముదాయించలేక మరో గత్యంతరం లేక... ఆ పిల్ల జీవితంలో నుంచి తానే పారిపోవడం... చివరికి మళ్లీ కలిసి... జాయింట్‌గా ప్రదర్శనలిచ్చి... ఏ ప్రేక్షకులైతే తనను నిరాదరించారో, వాళ్లతో నీరాజనాలు పట్టించుకుని... తృప్తిగా వెళ్లిపోవడం... జీవితం కొనసాగించడం... స్థూలంగా ఇదే కథైనా... జనరల్‌గా చాప్లిన్ మూకీ చిత్రాల్లో ఉండే.. బాడీ లాంగ్వేజ్ ఇందులో ఉండదు. అసలు చాలాసేపటి వరకూ మనం చాప్లిన్ని గుర్తుపట్టం! తెల్లటి జుట్టుతో... క్లీన్ షేవ్‌తో చాలా డిగ్నిఫైడ్‌గా... కొన్నిచోట్ల చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. జీవితంలో నుంచి బలవంతంగా పారిపోదామనుకుంటున్న టెర్రీకి... జీవిత ధర్మాన్ని చెబుతున్నప్పుడు కౌరవ సేన మధ్య గాండీవం, గుండె రెండూ జారిపోయిన అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన కృష్ణుడిలా అనిపించాడు చాప్లిన్. ఓ వైపు జీవితంలో అన్ని రకాలుగా చితికి పోయినా, జీవిత మాధుర్యాన్ని బొట్టుబొట్టుగా గ్రోలుతూ ‘లైఫ్ ఈజ్ నో మీనింగ్, ఇట్స్ ఓన్లీ డిజైర్’ (ఔజీజ్ఛ జీట ౌ ఝ్ఛ్చజీజ, ఐ్ట’ట ౌడ ఈ్ఛటజీట్ఛ) అని చెప్పే చాప్లిన్ని చూస్తే... జీవితం మీద ఆశ పుడుతుంది. ఎంతటి మహానటుడైనా... ‘లైమ్లైట్’లో ఉన్నంత కాలమే!... తర్వాత పట్టించుకునే నాథుడుండడు అనే కర్కశమైన సత్యానికి బొమ్మకట్టాడు చాప్లిన్. అవును ‘లైమ్‌లైట్‌లో’ ఉంటే నీకు నీరాజనాలు... నీ నెత్తి మీద నుంచి లైట్ వెళ్లిపోతే నిన్ను గుర్తించలేదని నువ్వు ఏడవడం ఎందుకు? అసలు నువ్వు కనపడితే కదా! సిన్మా చూస్తున్నంతసేపూ... మన కళ్ల ముందు సావిత్రులూ... నాగయ్యలూ... రాజనాలలూ... కాంతారావులూ... శివరామ్లూ... కదలాడుతూనే ఉంటారు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అని కదూ... దీపం ఉండగా గుండె నిండా వెలుగులు నింపుకో... ఆ వెలుగులు పదిమందికీ పంచు... ఇదీ లైమ్లైట్ సారాంశం! సినిమా చూస్తున్నప్పుడు చాప్లిన్... నట విశ్వరూపా నికి మనం హారతులు పట్టాల్సిందే! నవరసాల్నీ క్షణాల మీద కురిపించిన ఆ నటరాజు అభినయానికి మనం అవాక్కయిపోతాం. అలాగే... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లిల్లీ లాంటి పిల్ల మీద కాల్వెరో కరుణ చిలకరించేటప్పటికి లిల్లీలా విరిసిన తీరు... టెర్రీ పాత్రలో క్లెయిర్ బ్లూమ్ నవ్వినప్పుడల్లా... ప్రేక్షకుడి గుండె గిలక్కాయలా కొట్టుకుంటుంది... ఎంత అందమైన నవ్వు... అలాగే బ్లాక్ అండ్ వైట్‌లో... లైట్ అండ్ షేడ్స్‌లో చిత్రీకరించిన విధానం... ప్రతీ షాటూ కథ చెబుతుంది! చాలాసార్లు చాప్లిన్ బాధను తనలో దిగమింగుకుంటాడు. ఆ సీన్లలో గుక్కెట్టి ఏడుస్తాం. సినిమాలు నాటకాలైపోతున్న ఈ రోజుల్లో కళ్ల ముందు, ఓ కళాకారుడి జీవితాన్ని కిటికీ తెరిచి చూస్తున్నట్టనిపించే ‘లైమ్లైట్’ చిరస్మరణీయ చిత్రం. ఇంకోళ్లకి సాయపడ్డానికి కాల్వరో పడుతున్న తాపత్రయం చూస్తే మనలోంచి మనిషి... మంచి మనిషి మళ్లీ పుట్టుకొచ్చి, తోటివాణ్ణి పట్టించుకోని ప్రస్తుత పరిస్థితికి సిగ్గుపడతాం. మన మీద మనం జాలి పడతాం. మూడో కంటికి తెలియకుండా మనల్ని మనం అసహ్యించుకుంటాం. అలాగే... తనకు సాయం చేసి... తనకి కొత్త బతుకిచ్చిన కాల్వెరో పట్ల టెర్రీ కృతజ్ఞతాభావంతో లొంగిపోవడం... ఆమె కళ్లల్లో అతని పట్ల ఆరాధన చూస్తే మనకు సిగ్గేసి, కృతఘు్నలకి ఓ నమస్కారం చేస్తాం. మనసు కరిగించే కథ.. వజ్రాలు పొదిగినట్లు డైలాగులు... నటనంటే ఇదిరా అనిపించే అభినయం... ఓ కమ్మటి కల కని... కన్నీళ్లు తుడుచుకున్నట్లనిపించే ‘లైమ్లైట్’ చూడకపోతే వెంటనే చూడండి! కుదిరితే డీవీడీ కొని ఇంట్లో అపురూప నిధిగా దాచుకోండి! మీకు సంతోషం కలిగినప్పుడూ... కోపం వచ్చినప్పుడూ... హృదయం ద్రవించినప్పుడూ... గుండె రాయైనప్పుడూ... చూడండి! మళ్లీ... మన జీవితాల మీద కొత్త కాంతి ప్రసరించి తమాషాగా మళ్లీ మనుషులమవుతాం... ప్రపంచ సినిమాలో చిరంజీవి జగత్ప్రసిద్ధ ఇంగ్లీషు హాస్య నటుడు, చలనచిత్ర రూపకర్త చార్లీ చాప్లిన్ (1889 - 1977). మూకీ సినిమా యుగంలో ప్రేక్షకులను ఊపేసి, తన సినిమాలతో ప్రపంచాన్ని జయించిన కళాకారుడు. చిన్నవయసులోనే నటించడం మొదలుపెట్టి 88 ఏళ్ళ వయసులో మరణించడానికి ఏడాది ముందు దాకా విస్తరించిన 75 ఏళ్ళ సుదీర్ఘమైన కెరీర్ ఆయనది. కష్టాలు, కన్నీళ్ళు, దుర్భర దారిద్య్రం నుంచి కష్టపడి పైకొచ్చి తన ట్రేడ్ మార్క్ టోపీ, టూత్‌బ్రష్ లాంటి మీసం, చిత్రమైన వేషధారణతో అందరినీ ఆకట్టుకున్న చాప్లిన్ మొదట్లో తన లఘు చిత్రాల దర్శకులకు సలహాలు చెప్పి, వారి కోపానికి గురవుతుండేవారు. అయితే, ఆ లఘుచిత్రాలకు లభించిన ఆదరణ కారణంగా మరిన్ని చిత్రాలు కావాలంటూ డిస్ట్రిబ్యూటర్లు దర్శకులను కోరడంతో చాప్లిన్ దర్శకుడయ్యారు. ‘కాట్ ఇన్ ది రెయిన్’ (1914) అనే 16 నిమిషాల లఘుచిత్రంతో ఆయన దర్శకుడి అవతారమెత్తారు. ‘ది ట్రామ్ప్’ (1915) చిత్రం దర్శకుడిగా ఆయన తీసిన పూర్తి నిడివి సినిమా. అది బ్రహ్మాండమైన విజయం సాధించడంతో ఇటు నటుడిగా, అటు దర్శకుడిగా ఆయన హవా మొదలైంది. అక్కడ నుంచి ఆయన రూపుదిద్దిన కళాఖండాలెన్నో! ఫెల్లినీ దగ్గర నుంచి ట్రూఫాట్ దాకా పలువురు ప్రముఖ దర్శకులను తనదైన ‘చాప్లిన్ తరహా’ చిత్రీకరణతో ప్రభావితం చేసిన ఘనత ఆయనది. తనికెళ్ల భరణి ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు -
కాళిదాసంటే పులకించేవారు! - తనికెళ్ళ భరణి
ఎమ్మెస్ సారస్వత ప్రియుడు. మేము ఎప్పుడు కలిసినా, సాహిత్యం గురించే మాట్లాడుకొనేవాళ్ళం. కొత్తగా ఏం చదివావంటే, ఏం చదివావని పరస్పరం చర్చించుకునేవాళ్లం. ఆయనకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలన్నా, సంస్కృత సాహిత్యమన్నా అపారమైన అభిమానం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, సంస్కృతం చదువుకున్న అతి తక్కువ మంది నటుల్లో ఆయన ఒకరు. ముఖ్యంగా మహాకవి కాళిదాసు ప్రస్తావన వస్తే, ఆయన పులకించిపోయేవారు. ‘కాళిదాసు పుట్టిన భూమిలో మనం పుట్టడం అదృష్టం సార్!’ అనేవారు. ‘కావ్యేషు నాటకం రమ్యం, నాటకేషు శకుంతల, తత్రాపి చతుర్థాంకం, తత్ర శ్లోక చతుష్టయమ్’ అని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. కావ్యాల్లో నాటకం... ఆ నాటకాల్లో కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలమ్’... అందులోనూ నాలుగో అంకం... అందులోని కీలకమైన నాలుగు శ్లోకాలు అతి రమ్యమైనవని దాని అర్థం. ఆ మాట చెబుతూ, ఆ నాలుగు శ్లోకాలనూ ఎమ్మెస్ అప్పజెప్పేవారు. సంస్కృతం చదువుకున్న నాకు కూడా ఆ శ్లోకాలు నోటికి రావని సిగ్గుపడి, స్కూలు పిల్లాడిలా ఒక వారం రోజులు కష్టపడి, ఆ శ్లోకాలు కంఠతా పట్టి, ఆయనకు అప్పజెబితే, ఆయన ఆనందంతో కౌగలించుకున్నారు. ఆ మధ్య కలిసినప్పుడు ‘నేను మీకు బాకీ తెలుసా?’ అన్నారు ఎమ్మెస్. అదేంటి అన్నా. ‘ఇంకా నటుడిగా స్థిరపడని రోజుల్లో 1994 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఒకసారి నాకు బాగా డబ్బు అవసరమైంది. అప్పుడు మీరున్న డబ్బింగ్ థియేటర్ దగ్గరకు వచ్చి అడిగితే, జేబులో నుంచి 2 వేలు తీసి నా చేతిలో పెట్టారు. ఆ డబ్బు తీసుకొని నేను వెళ్ళిపోయా. ఆ తరువాత మీకు ఇవ్వలేదు’ అని ఎమ్మెస్ చెప్పారు. ఆ సంగతి నాకు గుర్తే లేదు. ఆ మాటే ఆయనతో అన్నా. ‘డబ్బు ఇచ్చిన మీరు కాదండీ, తీసుకున్న నేను గుర్తుపెట్టుకోవాలి!’ అన్న ఎమ్మెస్, ‘ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వలేదు. ఇవ్వను కూడా. ఎందుకంటే, అది నా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’ అని చెప్పారు. అంత స్నేహం మాది. ప్రాథమికంగా జీవితాన్ని ప్రేమించే తత్త్వం ఆయనది. ప్రతి చిన్నవిషయానికీ స్పందించే సాహితీపరుల లక్షణం ఆయనలో పుష్కలం. అలాగే, ఆయన చక్కటి ఛలోక్తులు విసురుతారు. ఎవరేమన్నా దానికి చక్కటి రిటార్ట్‌లు ఇస్తారు. అలాగే, ఎంత కష్టం ఎదురైనా ఎదుర్కొనే మొండితనం కూడా ఉండేది. ‘కొడుకు’ సినిమా తీసినప్పుడు ఆయన చాలా నష్టపోయారు. మధ్యవర్తిగా నేనుండగా, ఆయన కొన్ని లక్షల డబ్బు అవతలవాళ్ళకు చెల్లిస్తుంటే, నేను కదిలిపోయాను. ‘పైసా పైసా కష్టపడి సంపాదించినది అలా ఇచ్చేస్తుంటే, నాకే దుఃఖం వస్తోంది’ అంటూ నేను బాధపడ్డా. ఆయన మాత్రం ‘ఏం ఫరవాలేదు సార్! మళ్ళీ సంపాదిద్దాం’ అని నిబ్బరం ప్రదర్శించారు. అలాగే, ‘దూకుడు’ నుంచి మళ్ళీ నటుడిగా పుంజుకొని, మంచి స్టార్ కమెడియన్‌గా వెలిగారు. మంచి నటుణ్ణే కాకుండా మంచి స్నేహితుణ్ణీ, సాహితీప్రియుణ్ణీ, అంతకు మించి మంచి మనిషిని కోల్పోవడం బాధగా ఉంది. ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి, కాళిదాసు, MS Narayana, Tanikella Bharani, Kalidasa -
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 2
-
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 3
-
ఎందరికో జన్మనిచ్చిన 'శివ'
అక్కినేని నాగార్జున - అమల జంటగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్.ఎస్.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన 'శివ' చిత్రం ఎందరికో జన్మనిచ్చిందని ఆ చిత్రంలో నటించిన పలువురు చెప్పారు. ట్రెడ్సెట్టర్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సాక్షి టీవీ నిర్వహించిన 'శివ 25 ఏళ్లు-స్పెషల్ ఎడిషన్'లో తనికెళ్ల భరణి, జెడి చక్రవర్తి, ఉత్తేజ్ పాల్గొన్నారు. దర్శకుడు శివనాగేశ్వర రావు, నటుడు, నిర్మాత చిన్న, రామ్ జగన్.....మరికొందరు ఫోన్లో మాట్లాడారు. రామ్‌గోపాల్ వర్మ కూడా ఫోన్లో మాట్లాడారు. శివ నిర్మాణం గురించి డాక్యుమెంటరీ విడుదల చేయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారందరూ ఆ నాటి శివ సినిమా నిర్మాణ ఘట్టాలను, షూటింగ్, రీరికార్డింగ్ సందర్భంగా జరిగిన విషయాలను, ఈ చిత్రంతో తమ అనుబంధాన్ని, తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము నటులుగా ఎంపికైన వివరాలు తెలిపారు. ముందు మాటల రచయితగా మాత్రమే ఎంపికైన తనికెళ్ల భరణి, ఆ తరువాత ఆ చిత్రంలో నానాజీ పాత్రకు ఎలా విధంగా పోషించారో తెలిపారు. ఈ మూవీలో బాగా పాపులర్ అయిన సైకిల్ చైన్ ఫైటింగ్ సన్నివేశాన్ని రామ్‌గోపాల్ వర్మతోపాటు తానుకూడా కలిసి రూపొందించినట్లు జెడి చక్రవర్తి చెప్పారు. తొలుత ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన తాను అనుకోకుండా అందులో యాదగిరి పాత్ర పోషించినట్లు ఉత్తేజ్ చెప్పారు. తమకు కొత్త సినీజీవితాలను ఆ చిత్రం ప్రసాదించినట్లు రామ్ జగన్, చిన్న పేర్కొన్నారు. తాను పుట్టి 25 ఏళ్లైందని చిన్న సవినయంగా చెప్పారు. తనకు ఈ చిత్రం కొత్త గుర్తింపును ఇచ్చిందని, అందువల్లే దర్శకుడు రాము పేరుతో కలిపి తన పేరును రామ్ జగన్‌గా మార్చుకున్నట్లు వివరించారు. ఈ స్పెషల్ ఎడిషన్'లో పాల్గొన్నవారు శివ లాంటి చిత్రం ఎవరూ తీయలేరు - రామూ కూడా తీయలేరు - రామూ తీసినా అంతబాగా తీయలేరు... అని చెప్పారు. వారు చెప్పిన కొన్ని ముఖమైన విషయాలు: తొలుత రామ్‌గోపాల్ వర్మను ఒక్క నాగార్జున మాత్రమే నమ్మారు. శివ ఇంత హిట్ అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో హాస్య సన్నివేశాలను రామూ అసలు అంగీకరించలేదు. కథనం-ఫొటోగ్రఫీ-మ్యూజిక్-ఫైటింగ్స్-డైలాగ్స్...అన్నీ కొత్తతరహాగానే ఉన్నాయి. తెలుగు సినిమాకు కొత్త నడక నేర్పింది. ** -
25 ఏళ్ళ 'శివ'తో మేము..! Part 1