బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రత్యేక కార్యక్రమం గరం గరం వార్తలు నేడే ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రోమో తెలుగు రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణ వీడియో సైతం వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతున్న మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. (ఎఫ్‌బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు)
అందరికీ దండాలు, నమస్కారాలు పెడుతూనే భరణి సాసర్‌లో ఛాయ్ పోసుకొని తాగుతున్నాడు. "పొద్దుగాల పొద్దుగాల గరం గరం ఛాయ్ తాగితే గళా(గొంతు) సాఫైతది. ఆ తర్వాత పాటలు, మాటలు, ముచ్చట్లు, ఓ దునియా మాట్లాడచ్చు. అందుకే చెప్పే వార్తలు కూడా గరం గరం ఉండాలని డిసైడ్ చేసినం" అంటూ ఈ కార్యక్రమానికి ఆచితూచి ఆ పేరే ఎందుకు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కాగా తెలంగాణ యాసతో విశేషంగా పాపులారిటీ సాధించుకున్న సత్తి తాజాగా సాక్షి టీవీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గరం గరం వార్తలు ప్రోగ్రాంతో ముందుకు వస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment