bittiri satti
-
బిత్తిరి సత్తి నాన్ స్టాప్ కామెడీ.. పడి పడి నవ్వుకున్నా అల్లు శిరీష్, అలీ
-
బిత్తిరి సత్తి సాంగ్ పాడితే ఎలా ఉంటుంది..?
-
బిత్తిరి సత్తితో సాయి ధరమ్ తేజ్ ముఖాముఖీ
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 2
-
సుడిగాలి సుధీర్, బిత్తిరి సత్తి ఫన్నీ ఇంటర్వ్యూ - పార్ట్ 1
-
ఇదంతా బావ చలవే: శాంతిశ్రీహరి
ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగించారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాల కోసం ఈ వీడియో చూసేయండి మరి... -
రానా ఎంత కట్నం తీసుకున్నారు?
కొత్త వరుడు కొంటె పోరడు ► కొత్త పెళ్లికొడుకు రానా ఎంత కట్నం తీసుకున్నారు? పెళ్లయ్యాక వచ్చిన తొలి దీపావళి పండగను ఎలా జరుపుకోబోతున్నారు? ► టపాసుల్లో ప్రభాస్‌ని రానా ఏ బాంబుతో పోల్చారు? అనుష్క గురించి రానా ఏమన్నారు? ► ఇలాంటి విషయాలన్నీ భలే ఆసక్తకిరంగా ఉంటాయి. ఇవి మాత్రమే కాదు.. రానా ఇంకొన్ని విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. ► పెళ్లి చేసుకునే టైమ్ వస్తే ఎవరూ ఆపలేరు. అది ప్రభాస్‌కైనా, నాకైనా ఎవరికైనా ఒకటే. ప్రభాస్ స్టార్ రాకెట్ లాంటివాడు. అది పేలినప్పుడు ఆకాశమంతా కనపడుతుంది. అనుష్క కూడా ప్రభాస్‌లాంటి రాకెట్ కానీ, ఈమెకు ఇంకా కొన్ని కలర్స్ తోడవుతాయి. అనుష్క చిచ్చుబుడ్డిలాంటిది. కట్టప్ప (సత్యరాజ్) భూచక్రంలాంటివాడు. నేను థౌజండ్‌వాలా లాంటివాణ్ని. ► కోవిడ్ టైమ్‌లో పెళ్లి చేసుకోవటం మంచిదే. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చక్కగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడిప్పుడే మా ఫ్రెండ్స్ అందర్నీ కలుస్తున్నాను. ► కట్నం ఎంత తీసుకున్నారు? అని యాంకర్ బిత్తరి సత్తి అడిగితే.. ‘నువ్వెంత తీసుకున్నావ్’ అని రానా ఎదురు ప్రశ్నించారు. సత్తి ఏం చెప్పారు? రానా తీసుకున్న కట్నం ఎంత? ► ఇప్పుడు మూడు సినిమాలు చేస్తున్నాను. అందులో ‘అరణ్య’ చిత్రం ఒకటి. ఆ సినిమాలో 15 నిజమైన ఏనుగులతో కలిసి నేను పెరుగతాను. థాయ్‌ల్యాండ్‌లోని గాభి ఐల్యాండ్‌లో, కేరళ అడవుల్లో ఈ సినిమా తీశాం. ‘హిరణ్యకశ్యప’ని వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తాం. ‘విరాటపర్వం’ 1990లకు సంబంధించిన నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ప్రేమకథ. ‘గరమ్ సత్తి’తో రానా పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం రాత్రి 8.30 గం‘‘లకు, తిరిగి ఆదివారం ఉదయం 8.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. పండగ సిరి తండ్రి ‘సిరివెన్నెల’ స్టార్ రైటర్. తనయుడు రాజా మంచి నటుడు. ఇటీవలే వెంకటలక్ష్మీ హిమబిందుతో ఏడడుగులు నడిచారు రాజా. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. ► పెళ్లికాకముందు తనను అందరూ బిందు అని పిలిచేవారట. నాకు ఆ విషయం తెలియక లక్ష్మీ అని పిలుస్తుంటే ఎవర్నో పిలుస్తున్నట్లు వెళ్లిపోయేది. అప్పుడు నేను ‘నీ పేరు లక్ష్మీ హిమబిందు కదా, అందుకే లక్ష్మీ’ అని పిలుస్తాను అన్నాను. మా ఇంట్లో అందరూ లక్ష్మీ అనే పిలవటంతో ఇప్పుడు అలవాటు అయ్యింది. ► లక్ష్మీలో నాకు బాగా నచ్చింది ఆమె కలుపుగోలుతనం అని రాజా అంటే , ‘ఏ చిన్న పని చేసినా క్రిస్టల్ క్లియర్‌గా చేస్తారు. అలాగే ఆయన క్రమశిక్షణ చాలా నచ్చుతుంది’ అని లక్ష్మీ అన్నారు. ► మా అమ్మగారికి కోడల్ని తెద్దామనుకుంటే, అత్తగారికి కూతురయ్యింది. మమ్మల్ని ఎవరు చూసినా కొత్తగా పెళ్లయినవాళ్లలా లేరు అంటున్నారు. అలాగే మా బావ త్రివిక్రమ్‌గారు ‘ఎన్నో ఏళ్లుగా ఒకరికొకరు తెలిసినవాళ్లులా ఉన్నారు మీ ఇద్దరూ’ అన్నారు. మా ఫ్యామిలీ అందరికీ లక్ష్మి నచ్చేసింది. అది అన్నిటికన్నా ఆనందం. త్రివిక్రమ్‌గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్సైక్లోపీడియా. అందుకే నేను ఏదైనా విషయంలో డైలమాలో ఉంటే బావ సలహా తీసుకుంటాను. ప్రస్తుతం ఉన్న టాప్‌టెన్ డైరెక్టర్స్‌తో పని చేయటంతో పాటు కొత్తగా ఏదైనా చేసి నటునిగా నిరూపించుకోవాలనుకుంటున్నా. ► డబ్బు కోసం నేను నటునిగా ప్రయాణం మొదలుపెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బాగానే సంపాదించేవాణ్ని. కానీ, అక్కడ తృప్తిగా అనిపించకపోవటంతో జాబ్ క్విట్ చేశాను. ► నాన్న ఏ సినిమాకైనా పాట రాస్తున్నప్పుడు ఒక వెర్షన్ రాసి దర్శకునికి వినిపిస్తే, చాలా బావుంది పాట ఇచ్చేయండి అంటారు. అప్పుడు నాన్నగారు ‘మీకు నచ్చింది కానీ నాకు కావాల్సింది ఇంకా ఏదో మిస్సయింది. అది రాగానే ఇస్తాను’ అంటారు. నేను వ్యక్తిగతంగా నాన్న దగ్గర నుండి కమిట్మెంట్, వృత్తిపట్ల ప్యాషన్ నేర్చుకుంటే అమ్మదగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ► నాకు యాక్టింగ్ తర్వాత ఫిట్నెస్ ఎంతో ఇష్టం. నాకిష్టమైన పనే చేస్తాను కాబట్టి ఎప్పుడూ సెలక్టివ్ గా ఉంటాను. నేను ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టి ఇలా ఉండాలి, అలా తినాలి అని చెప్తాను. వాటివల్ల ఇంట్లో డిబేట్లు, గొడవలు అన్నీ జరుగుతాయి. ► మా నాన్న లక్ష్మీని వంకాయకూర చేయటం వచ్చా అని అడిగితే వచ్చు అని చెప్పింది. వండటం కాదు, మా అమ్మ వండినట్లు వండాలి అని తనను ఆట పట్టిస్తుంటాను. ఇంకా ఈ జంట చెప్పిన బోలెడన్ని కబుర్లు ‘సాక్షి టీవీ’లో శనివారం రాత్రి 7.30 గం‘‘లకు తిరిగి ఆదివారం ఉదయం 11.30 గం‘‘లకు చూడండి. శ్రీహరి కోట ఏడేళ్ల తర్వాత శ్రీహరి ఇంట దీపావళి పండగకి దీపాలు వెలిగిస్తున్నారు. తమ జీవితంలోని చీకట్లను పారదోలి ఇప్పుడిప్పుడే వెలుగులు నింపుకుంటున్నారు దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి, నిర్మాత శాంతీశ్రీహరి. 2013లో శ్రీహరి మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి చిన్న కుమారుడు మేఘాంశ్ హీరోగా చేస్తున్నాడు. మరో తనయుడు శశాంక్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. భర్త దూరం అయిన చేదు నిజం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న శాంతి తన తనయుడు మేఘాంశ్ తో కలసి పండగ వేళ బోలెడన్ని విషయాలు చెప్పారు. ► ప్రస్తుతం నా దృష్టంతా నటనటనపైనే. లవ్, క్రష్‌లాంటివేమీ లేవు. నా వయసిప్పుడు 20 ఏళ్లే. నా దృష్టంతా నటనపైనే ఉంది. నాన్న చేసినట్లుగా సామాజిక అంశాలతో వచ్చే చిత్రాలను అప్పుడే చేయదలచుకోలేదు. మంచి ఎంటర్టైనర్స్ చేసి ప్రేక్షకులకు దగ్గర కావాలనుకుంటున్నాను. కొంచెం పరిణితి వచ్చిన తర్వాత.. ఒకవేళ నాన్న సినిమాల్లో ఏదైనా సినిమా రీమేక్ చేయాలనుకుంటే ‘భద్రాచలం’ సినిమా చేస్తాను. ► నేను షూటింగ్లో ఉన్నప్పుడు మా అమ్మను సెట్స్ లోకి రానివ్వను. నా ఫస్ట్ మూవీ ‘రాజ్‌దూత్’ షూటింగ్‌కి ఓసారి అమ్మ సెట్‌కి వచ్చింది. నేను నటిస్తుంటే ఎదురుగా నిలబడి వెక్కిరించింది. ఆమె ఎదురుగా ఉంటే నేను నటించలేను. ► ఎప్పుడు ఎవరికి కష్టమొచ్చినా ‘నేనున్నాను’ అని ధైర్యం ఇచ్చేవారాయన. ఈ రోజు నేను, నా పిల్లలు ఏ కష్టం లేకుండా బతుకుతున్నామంటే అది ఆయన చలవే. ఆయన చేసిన పుణ్యమే.. ఆయన ఉన్నప్పుడు ఎంతోమందికి డబ్బులు ఇచ్చారు. ఆయన పోయాక వారి దగ్గరికెళ్లి మాకు రావాల్సిన డబ్బు ఇవ్వమంటే మీ ఆయనే మాకు ఇవ్వాలి అన్నారు. ► ఇంకా శాంతీశ్రీహరి ఏ సందర్భంగా కన్నీటి పర్యంతం అయ్యారు? ఆమె మనసులోని బాధ ఏంటి? ఈ తల్లీ తనయుడు మనసువిప్పి పంచుకున్న మరెన్నో విషయాలను శనివారం మధ్యాహ్నం 1.30 గం‘‘లకు తిరిగి ఆదివారం సాయంత్రం 6.30 గం‘‘లకు ‘సాక్షి’ టీవీలో చూడండి. -
గరం గరం ఛాయ్ తాగితే గళా (గొంతు) సాఫైతది..
బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ ప్రత్యేక కార్యక్రమం గరం గరం వార్తలు నేడే ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ప్రోమో తెలుగు రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అలాగే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణ వీడియో సైతం వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తనికెళ్ల భరణి మాట్లాడుతున్న మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. (ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు) అందరికీ దండాలు, నమస్కారాలు పెడుతూనే భరణి సాసర్లో ఛాయ్ పోసుకొని తాగుతున్నాడు. "పొద్దుగాల పొద్దుగాల గరం గరం ఛాయ్ తాగితే గళా(గొంతు) సాఫైతది. ఆ తర్వాత పాటలు, మాటలు, ముచ్చట్లు, ఓ దునియా మాట్లాడచ్చు. అందుకే చెప్పే వార్తలు కూడా గరం గరం ఉండాలని డిసైడ్ చేసినం" అంటూ ఈ కార్యక్రమానికి ఆచితూచి ఆ పేరే ఎందుకు పెట్టాడో చెప్పుకొచ్చాడు. కాగా తెలంగాణ యాసతో విశేషంగా పాపులారిటీ సాధించుకున్న సత్తి తాజాగా సాక్షి టీవీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గరం గరం వార్తలు ప్రోగ్రాంతో ముందుకు వస్తున్నాడు. -
ఎఫ్బీలో సత్తి ‘గరం గరం’ ముచ్చట్లు
సాక్షి, హైదరాబాద్ : తన మాట, భాష, యాసతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్న బిత్తిరి సత్తి గురించి తెలియని వారుండరు. రంగు రంగుల పూల చొక్కాతో తనదైన హావభావాలతో అందరిని అలరిస్తుంటాడు. మరి అలాంటి సత్తి ‘సాక్షి’ టీవీలో గరం గరం వార్తలతో మన ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వేదికగా లైవ్‌లో ముచ్చటించనున్నాడు. ఆదివారం (ఆగస్ట్ 2) సాయంత్రం 5 గంటలకు ‘సాక్షి’ ఫేస్బుక్ ద్వారా లైవ్‌లో తన మాటలను మనతో షేర్ చేసుకోబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి. (బిత్తిరి సత్తితో ‘గరం గరం వార్తలు’.. రేపే ప్రారంభం) కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రొమోలకు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా ప్రొమో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ‘గరం గరం వార్తలు’ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ స్పందనను బట్టి అర్థమవుతోంది. -
సత్తి పూలు పూల అంగీ.. పూలు పూల లాగు..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో.. ‘‘పూలు పూల అంగీ.. పూలు పూల లాగు’’ తో సత్తి తనదైన ఆహార్యంతో ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక అతిథికి ‘గరం గరం’ ఛాయ్ ఇచ్చి మర్యాదలు చేస్తూనే.. మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తన మార్కు డైలాగ్ విసిరి ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు. ‘‘సత్తీ.. పూల పూల అంగీ.. జబర్దస్త్ కొడుతున్నవ్.. హా’’ అంటూ తనికెళ్ల భరణి పలకరించగా.. ‘‘గరం గరం శాయె దెచ్చిన సార్ తీసుకోండి’’ అంటూ సత్తి ఆయనకు టీ అందించాడు. ఇక తనతో పాటు ఛాయ్‌ను పంచుకోమని తనికెళ్ల భరణి కోరగా..‘‘అమ్మో వద్దు సార్. దినాలు మంచిగ లెవ్వు. ఎవని శాయె ఆడే తాగాలే. తీసుకోండి’’ అంటూ జాగ్రత్తలు సూచించాడు. ఇక సాక్షి టీవీలోకి సత్తి ఆగమనాన్ని చాటుతూ ప్రత్యేకంగా రూపొందించిన వీడియో నెటిజన్లను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ సాక్షి టీవీ ద్వారా ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాంతో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.(‘గరం గరం వార్తల’తో సరికొత్త స్టైల్లో సత్తి!) -
బిత్తిరి సత్తి రాజీనామా అందుకేనా?
హైదరాబాద్: తీన్మార్ వార్తలతో సుపరిచితుడైన బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి కుమార్ త్వరలో రియాల్టీ షోలో కనిపించే అవకాశముందని ఊహాగానాలు వస్తున్నాయి. బుల్లితెర హిట్ షో 'బిగ్‌బాస్ సీజన్ 4' కోసమే సత్తి తాను పనిచేస్తున్న టీవీ చానల్‌కు రాజీనామా చేసినట్టు సమాచారం. బిగ్‌బాస్ ఇంట్లో అడుగు పెట్టేందుకు సత్తి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు వినికిడి. కాగా ఇప్పటికే బిగ్‌బాస్ నిర్వాహకులు పార్టిసిపెంట్ల వేట మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనూ కొందరి పేర్లు లీక్ అయ్యాయి. తాజాగా వీరి సరసన సత్తి చేరాడు. అయితే చివరాఖరికి బిగ్‌బాస్ నిర్వాహకులు ఎవరిని ఖరారు చేయనున్నారో చూడాలి. గతంలో బిత్తిరి సత్తితో పాటు వార్తలు చదివి పాపులారిటీ దక్కించుకున్న శివజ్యోతి కూడా బిగ్‌బాస్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా బిగ్‌బాస్ తదుపరి సీజన్ మరింత ఆలస్యం కానుంది. ఈ ఏడాది చివరికి ఈ షో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. (బిగ్‌బాస్ 4: ఈసారి పాల్గొనేది వీళ్లేనా?) -
తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి
‘‘కళలపై రసమయికి ఉన్న మక్కువతో ‘తుపాకి రాముడు’ సినిమాని నిర్మించాడు. బిత్తిరి సత్తి గురించి అందరికీ తెలిసిందే. వీరు కలిసి చేసిన ఈ చిత్రానికి థియేటర్లు ఇవ్వమని నిర్మాత ‘దిల్’ రాజుతో మాట్లాడాను. కొంత నష్టమైనా భరించాలని చెప్పాను. ఆయన ధైర్యంగా ముందుకొచ్చారు’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బిత్తిరి సత్తి, ప్రియ జంటగా టి. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తుపాకి రాముడు’. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, ఈటెల రాజేందర్ బిగ్ సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో రసమయి ఓ సినిమా చేశాడు. ఇప్పుడు హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందర్నీ తెలంగాణ వారినే పెట్టి మంచి సినిమా తీశాడు. తెలంగాణ కళలు, సంప్రదాయాలు, బతుకమ్మ పండగ గురించి తీసిన సందేశాత్మక చిత్రమిది. ప్రేక్షకాదరణతో 100 రోజులు ఆడాలి’’ అన్నారు. ‘‘శంకర్ అన్నలా ‘శ్రీరాములయ్య’ వంటి గొప్ప సినిమా తీయాలనే నా కోరిక ‘తుపాకి రాముడు’తో తీరింది. సినిమా నిర్మించడం కంటే విడుదల చేయడం కష్టమని ‘దిల్’ రాజుగారిని కలిశాక తెలిసింది’’ అని రసమయి బాలకిషన్ అన్నారు. ‘‘ఎప్పుడూ నవ్వించే సత్తి ఈ చిత్రంతో ఏడిపిస్తాడు కూడా’’ అని బిత్తిరి సత్తి అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, నిర్మాత శివకుమార్, నటులు రాజ్ తరుణ్, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు. -
దుమ్ము రేపుతున్న బిత్తిరి సత్తి ‘రాజన్న బిడ్డ’ పాట
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ యాస, భాషతో యాంకర్‌గా, ప్రెజెంటర్‌గా రాణిస్తున్న బిత్తిరి సత్తి అలియాస్ రవి ఇప్పుడు సింగర్‌గా తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణకు సంబందించిన పాటలు మాత్రమే పాడిన సత్తి తొలిసారి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ఓ పాటను పాడారు. తీన్మార్ వార్తల యాంకర్‌గా కనిపించే బిత్తిరి సత్తిని ప్రాంతాలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారు. ‘రాజన్న బిడ్డ అదుగో.. వస్తున్నాడు చూడరా.. అచ్చం రాజన్న లా నేడే ’ అంటూ సాగే పాటను బిత్తిరి సత్తి ఇరగదీశారు. అరచేతిలో స్వర్గం చూసే నాయకులే మనకొద్దురా.. ఆంధ్రప్రదేశ్‌కి జగనన్నే రావాలిరా.. రానే వచ్చాడు రానే వచ్చాడు నాయకుడే వచ్చాడు రా.. అంటూ మాస్ బీట్తో సాగే ఈ పాట లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచింది. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలోని కొన్ని ప్రధాన దృశ్యాలను ఈ గీతానికి బ్యాక్ డ్రాప్‌గా చూపించారు. కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను కూడా దీనికోసం వినియోగించారు. బిత్తిరి సత్తి తన సొంత యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఈ సాంగ్ తక్కువ సమయంలోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ జాబితాలో దూసుకుపోతోంది. వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా లిరిక్స్ ఉన్నాయంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన మారుమోగుతోంది. ఒక పార్టీ ప్రచారగీతం 1.7 కోట్ల వ్యూస్ సాధించి దేశ రాజకీయ చరిత్రలోనే యూట్యూబ్ ఆల్‌టైం రికార్డ్లను తిరగరాసింది. -
సత్తి హీరో అయ్యాడోచ్
యాంకర్‌గా, నటుడిగా ఫేమస్ అయిన ‘బిత్తిరి’ సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘బిత్తిరి సత్తి’గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్ తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు’’ అన్నారు టి.ప్రభాకర్. ‘‘సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు ఈ చిత్రం సత్తిని బిజీ నటుడిని చేస్తుంది’’ అన్నారు బాలకిషన్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మక్కపాటి చంద్రశేఖర్, మక్బూల్ హుస్సేన్. -
‘తుపాకీ రాముడు’గా బిత్తిరి సత్తి
ఓ టీవీ ఛానల్ కార్యక్రమంతో ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. పలు టీవీ షోలకు గెస్ట్ గానూ వ్యవహరిస్తున్న సత్తి త్వరలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలంగాణ కళాకరుడు, ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక శాఖ సారథి రసమయి బాలకిషన్ నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో నటించనున్నాడు. బతుకమ్మ సినిమాకు దర్శకత్వం వహించిన టి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈప్రాజెక్ట్‌కు తుపాకీ రాముడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 2న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నా వెనుక ఎవరూ లేరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషను అపహాస్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ వీ6 చానెల్ తీన్మార్ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై సోమవారం దాడికి పాల్పడిన మణికంఠను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. గత కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని వీ6 చానెల్ వద్ద రెక్కి నిర్వహించి మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బిత్తిరి సత్తిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చానల్ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతడిని సికింద్రాబాద్‌కు చెందిన కలాసిగుడకు చెందిన మణికంఠగా గుర్తించారు. సత్తి వాడే భాష తెలంగాణ యాసను వెక్కిరిస్తున్నట్టు ఉందని అందుకే దాడి చేసినట్లు తెలిపాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపాడు. తన వెనుక ఎవరూ లేరని అతను పేర్కొన్నాడు. బిత్తిరి సత్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
బిత్తిరి సత్తికి మద్దతుగా ర్యాలీ
సాక్షి, నిజామాబాద్: టీవీ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై దాడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విలేకరులు, సీపీఐ, సీపీఎం, ఎంబీసీ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అనంతరం బిత్తిరి సత్తికి మద్దతుగా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ యాసను బిత్తిరి సత్తి కించపరుస్తున్నాడని ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 చానల్ ముందు ఆ చానల్ తీన్మార్ యాంకర్ బిత్తిరి సత్తిపై సికింద్రాబాద్ కలాసిగుడకు చెందిన మణికంఠ(26) అనే యువకుడు హెల్మెట్‌తో దాడి చేశాడు. తలకు గాయాలైన బిత్తిరి సత్తిని స్థానికులు వెంటనే స్టార్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. -
బిత్తిరి సత్తిపై దాడి, నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ యాసను బిత్తిరి సత్తి కించపరుస్తున్నాడని ఆయనపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వీ6 చానల్ ముందు ఆ చానల్ తీన్మార్ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై సికింద్రాబాద్ కలాసిగుడకు చెందిన మణికంఠ(26) అనే యువకుడు హెల్మెట్‌తో దాడి చేశాడు. తలకు గాయాలైన బిత్తిరి సత్తిని స్థానికులు వెంటనే స్టార్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా బిత్తిరి సత్తిపై దాడి చేసేందుకు రెక్కీ నిర్వహించానని, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వీ6 చానల్ వద్దకు వచ్చి బిత్తిరి సత్తి కోసం వేచి చూశానని నిందితుడు తెలిపాడు. సరిగ్గా 12.30 గంటలకు సత్తి వీ6 చానల్ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేసినట్లు అంగీకరించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ చానల్లో బిత్తిరి సత్తి తెలంగాణ భాషను కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడటం భరించలేకపోయానని నిందితుడు చెప్పాడు. తాను సినిమా దర్శకుడిగా, రచయితగా ఉన్నానని, తాను చదివిన పుస్తకాల్లో బిత్తిరి సత్తి మాట్లాడుతున్న యాస ఎక్కడా కనిపించలేదన్నారు. పనిగట్టుకొని తెలంగాణను బదనాం చేయడానికి సత్తి కంకణం కట్టుకున్నాడని ఆరోపించాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడ్డట్లు తెలిపాడు. -
ఇద్దరి మధ్య!
రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో సాయితేజ పాటిల్ సమర్పణలో శివరాజ్ పాటిల్ నిర్మించారు. ఘంటాడి కృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ‘‘ఘంటాడి పాటలు అలరిస్తాయి. మా చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయాలను కుంటున్నాం’’ అన్నారు శివరాజ్ పాటిల్. ‘‘ఇది నా 50వ చిత్రం. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఘంటాడి. -
ఇద్దరి మధ్య..!
రామ్ కార్తీక్, భాను త్రిపాత్రి జంటగా, టీవీ ఫేమ్ బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం – ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘శివరాజ్ రాజకీయరంగంలో మంచి పేరు పొందారు. ‘ఇద్దరి మధ్య 18’ ద్వారా సినీరంగంలోకి అడుగుపెడు తున్నారు. సినిమా రంగంలోనూ తను సక్సెస్ అవ్వాలి’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘త్వరలో పాటలు, ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఘంటాడి కృష్ణ, సమర్పణ: సాయితేజ పాటిల్.