సత్తి హీరో అయ్యాడోచ్‌ | Bithiri Sathi Tupaki Ramudu Motion Poster | Sakshi
Sakshi News home page

సత్తి హీరో అయ్యాడోచ్‌

Published Sun, Sep 16 2018 1:38 AM | Last Updated on Sun, Sep 16 2018 1:38 AM

Bithiri Sathi Tupaki Ramudu Motion Poster - Sakshi

సుకుమార్, బిత్తిరి సత్తి, ప్రభాకర్, ముక్బూల్‌

యాంకర్‌గా, నటుడిగా ఫేమస్‌ అయిన ‘బిత్తిరి’ సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్‌ టి. ప్రభాకర్‌ దర్శకత్వంలో రసమయి బాలకిషన్‌ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ను దర్శకుడు సుకుమార్‌ రిలీజ్‌ చేసి మాట్లాడుతూ– ‘‘బిత్తిరి సత్తి’గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను.

ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్‌ తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘యూనివర్శల్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు’’ అన్నారు టి.ప్రభాకర్‌. ‘‘సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడంతో పాటు ఈ చిత్రం సత్తిని బిజీ నటుడిని చేస్తుంది’’ అన్నారు బాలకిషన్‌. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మక్కపాటి చంద్రశేఖర్, మక్బూల్‌ హుస్సేన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement