Director Sukumar
-
డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప-2
-
పుష్ప.. మేక్ ఇన్ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే..
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్‌ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. పుష్పరాజ్.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్ ముందే ఇస్టయిల్‌గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్ కోసం కూలీగా వెళ్లి.. క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది పుష్ప ది రైజ్ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్.. దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్ సర్‌తో నడిచే బ్రాండ్ ట్రాక్‌తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్‌లో పుట్టుకొచ్చిన ఎనిమీస్ మధ్యే పుష్పగాడి రూల్ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్ రెండో పార్ట్‌ను చూపించబోతున్నారు!. అయితే..👉పుష్ప కథ, కాస్టింగ్ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్‌గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్ ఫిల్మ్ వైపు మొగ్గు చూపాడు. 👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్‌డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.👉కాస్టింగ్‌లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్‌తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. 👉ఇక రెగ్యులర్ షెడ్యూల్‌ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్‌తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్‌లో కేరళ షెడ్యూల్‌తో షూటింగ్ మొదలుకావాల్సింది.కానీ, కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.👉2020 ఏప్రిల్ 8వ తేదీ.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రగ్డ్ లుక్‌తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి హాట్ టాపిక్‌గా మారింది.First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq— Allu Arjun (@alluarjun) April 8, 2020👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్‌తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్‌లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్‌తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్ గుర్తింపు దక్కించుకుంది. 👉కరోనా వైరస్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్ 17కి చేరింది. పుష్ప ది రైజ్ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. ::: పుష్ప ప్రమోషన్లో అల్లు అర్జున్ 👉2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది పుష్ప ది రైజ్. అయితే.. రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)#PushpaCelebrityFanatics" Now a days, all around everyone discussing about one film #Pushpa " ❤️🔥When Defence Minister of India @rajnathsingh ji mentioned about Pushpa euphoria & dialogue. This shows to what extent the reach & impact @alluarjun made 🙏💥 pic.twitter.com/Cuu1K0TXnX— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) October 23, 2024👉సుకుమార్ ‘పుష్ప ది రైజ్’.. 2022లో రష్యన్ భాషలో డబ్ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ‘‘బ్లాక్‌బస్టర్ హిట్స్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’’ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది.👉హిందీలో పుష్ప కేరక్టర్‌కు డబ్బింగ్ చెప్పింది నటుడు శ్రేయాస్ తల్పడే. తమిళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కేపీ శేఖర్ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్ మేకర్ జిస్ జాయ్ వాయిస్ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్ చెప్పారు. 👉షెకావత్ కేరక్టర్‌కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్ ఖట్టర్) మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్‌కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తా’(భీష్మ ఫేం) అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు.:: వెబ్ డెస్క్ ప్రత్యేకం -
అనాధ పిల్లలను కలిసిన సుకుమార్ కూతురు సుకృతి
-
Sakshi Little Stars: డాటర్ ఆఫ్ డైరెక్టర్ సుకుమార్
పిల్లలకు బంధువులంటే ఇష్టం. బాబాయ్, మావయ్య, పెదనాన్న, పిన్ని, అత్తయ్య, అమ్మమ్మ... బంధువులొస్తే వీరికి సంబరం. కాని దురదృష్టవశాత్తు కొందరు పిల్లలకు బంధువులుండరు. ఒకోసారి అమ్మో, నాన్నో కూడా వారితో వీరికి బంధువుగా మారి ఆదుకుంటోంది ‘వాల్మీకి గురుకులం’ అనే శరణాలయం. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి ఈ పిల్లలనుతానొక బంధువుగా కలిసింది. ఈ సమాజమే ఇటువంటి బాలలకు బంధుగణం అని మాట కలిపింది.అక్కడున్న పిల్లలు చాలా హుషారుగా ఉంటారు. స్కూల్‌కు వెళ్లి చదువుకుంటారు. అందరూ కలిసి ఆడుకుంటూ భోజనం చేస్తూ ఒకేచోట గడుపుతూ మనమంతా ఒకరికొకరం అనే స్థయిర్యంతో బతుకుతారు. అయితే ఒక్కోసారి వారిని దిగులు కమ్ముకోవచ్చు. అమ్మో నాన్నో గుర్తుకు రావచ్చు. ఆ సమయాన్ని మనం దాటించగలగాలి. ఇలాంటి చోటుకు వీలున్న సమయాలలో వెళుతూ పలకరిస్తూ ఉంటే, వారితో సమయం గడుపుతూ ఉంటే వారి లోకం మనకు పరిచయం అవుతుంది. వారి చిరునవ్వుకు మన చిరునవ్వు తోడైతే కారే కన్నీరు తోక ముడుస్తుంది.అందుకే రంగారెడ్డి జిల్లా మోకిలా సమీపానప్రొద్దుటూరులో ఉన్న వాల్మీకి ఫౌండేషన్‌లో సుమారు 50 మంది చిన్నారులు దర్శకుడు సుకుమార్ కుమార్తె, చైల్డ్ సెలబ్రిటీ అయిన సుకృతిని చూసి కేరింతలు కొట్టారు. షేక్హ్యాండ్లు ఇచ్చారు. సరదా కబుర్లతో సమయమే తెలియలేదు అన్నట్టుగా గడిపారు.నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా సాక్షి మీడియా ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఇక్కడి పిల్లల కోసం సుకృతి తెచ్చిన పండ్లు, చాక్లెట్లతో తియ్యని వేడుకగా మారింది. వంటి తియ్యటి కార్యక్రమమిది. ఇక సుకృతి తెచ్చిన పుస్తకాలు ఒక మంచి కానుక వారికి. ఈ సందర్భంగా ఇక్కడి పిల్లలు తమ గురించి తాము సుకృతితో మనసువిప్పి మాట్లాడారు.ఈ బాధ్యత మనందరిదీ...‘సాక్షి’ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి రావడం వల్లే ఇలాంటి చిన్నారుల సామాజిక, మానసిక స్థితిగతులపైన అవగాహన వచ్చింది. వీళ్లూ నాలాంటి చిన్నారులే.. వీళ్లలో ఎన్ని నైపుణ్యాలున్నాయో చూస్తే ఆశ్చర్యమేసింది. చదువులతో పాటు డ్యాన్సులు చేస్తున్నారు, క్రీడల్లో రాణిస్తున్నారు. వారు వచ్చిన నేపథ్యం వేరు.. ఇక్కడ పొందిన పరిపక్వత వేరు. వారి మదిని తడిమి చూస్తే మాత్రం ఊహించని వేదన దాగుంది. అది మనం తీర్చలేనిది. కానీ వీలైనంత ఆత్మీయత,ప్రోత్సాహం అందించడం మనందరి బాధ్యత.నేను ఇక్కడ పిల్లలు అందరితో కలిసి డ్యాన్సులు చేశాను. వారు నాకిష్టమైన అల్లు అర్జున్ గురించి, నా ఫేవరెట్ హాలిడే స్పాట్ పారిస్ గురించి, నా బెస్ట్ ఫ్రెండ్ సితార గురించి, నా చదువులు, లక్ష్యాలు ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పచ్చని పొలాల మధ్య ఉన్న వాల్మీకి గురుకులం నాకో మధుర ఙ్ఞాపకం గా నిలిచిపోతుంది. నాన్న తెరకెక్కిస్తున్న పుష్ప–2 విషయాలు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. నా ఆలోచనల్లో చాలా మార్పులకు ఈ విజిట్ కారణమైంది. – సుకృతిలైబ్రరీ... కల్చరల్ టూర్మా దగ్గర 55 మంది చిన్నారులు సేవలు పొందుతున్నారు. సీడబ్ల్యూసీ నియమాల ప్రకారం యుక్త వయసు వచ్చిన చిన్నారుల్ని అనాథ ఆశ్రమంలో ఉంచకూడదు... కాబట్టి ఆ వయసుకొచ్చిన 15 మందిని ఉన్నత చదువుల కోసం మంచి కాలేజీల్లో చదివిస్తూ, హాస్టల్స్‌లో చేర్చాం. అనాథలు, నిరుపేద పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలకు సేవలందిస్తున్నాం. ఆర్ట్ ఆఫ్ స్టైల్ పేరుతో వంద మందికి సరిపడేలా మంచి భవనాన్ని నిర్మించుకున్నాం. డైనింగ్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. అధునాతన కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీని నిర్మిస్తున్నాం. మా సేవలన్నీ దాతల విరాళాలపైనే నిర్వహిస్తున్నాం. పిల్లలకు చదువులు మాత్రమే కాదు... వినూత్న అనుభవాలు, ఆలోచనలు కల్పించాలనే లక్ష్యంతో కల్చరల్ టూర్‌ను ప్లాన్ చేశాం. ఇందులో భాగంగా చెన్నైలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన పిల్లలకు ఇక్కడ 4 రోజుల విడిది కల్పించి విభిన్నప్రాంతాల సాంస్కృతిక, చారిత్రక, అధునాతన జీవనశైలి పై అవగాహన కల్పించాం. మరికొద్ది రోజుల్లో మా చిన్నారులను కూడా చెన్నైకు తీసుకెళ్లనున్నాం. అంతేకాకుండా మా పిల్లలందరినీ విమానంలో గగనతల విహారం చేయించాం. న్యూట్రిషన్ కోసం ఎగ్ బ్యాంక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా వాల్మీకి పిల్లల కోసమే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి చిన్నారులకు గుడ్లు అందిస్తున్నాం. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదల విద్యకు 500కు పైగా సైకిళ్లను అందించాం. – హరి కిషన్ వాల్మీకి, సంస్థ నిర్వాహకులుస్ఫూర్తిదాయకమైనదినేను ఆమెరికాలో ఆంకాలజీ డాక్టర్ గా పని చేశాను. గత కొన్నేళ్లుగా ఇక్కడి పిల్లల చదువులకు స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను. ఇలాంటి వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివించాలనే ఆలోచన స్ఫూర్తిదాయకమైనది. ఏడాదికి సరిపడా ఫీజులు ఒకేసారి చెల్లిస్తాను. ఇక్కడి విద్యార్థులు ఉన్నత చదువులకు బయటకు వెళుతుంటే కాస్త బాధగానూ, అంతకు మించిన సంతోషంగానూ ఉంటుంది. – డా. రోహిణీ , సంస్థకు ప్రధాన సహాయకురాలుఎప్పుడూ చిల్డ్రన్స్ డేనేమాకెప్పుడూ చిల్డ్రన్స్డేలానే ఉంటుంది. ఇక్కడ అన్ని విషయాల్లో సహకారం అందిస్తారు. బాగా చదువుకుని సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. వీరు అందించిన ఏ సహకారాన్ని వృ«థాగా పోనివ్వను. – మారుతిమాదో కుటుంబంమేముంటున్న ‘వాల్మీకి గురుకులం’ అనా«థ ఆశ్రమంలా అనిపించదు. మాదో పెద్ద కుటుంబం. సౌకర్యాలు, వసతులే కాదు.. ఇక్కడ ప్రేమ, ఆప్యాయతలకు కొదువ లేదు. మాకెప్పుడూ ఒంటరి అనే ఫీలింగ్ రాకుండా చూసుకుంటారు. కాకపోతే రోజూ 14 కిలోమీటర్లు స్కూల్‌కు వెళ్లి రావడం కష్టంగా ఉంది. ఈ విషయంలో ఎవరైనా దాతలు సహకారమందిస్తే వెహికిల్ ఏర్పాటు చేసుకుంటాం. – గౌతమ్ సాయిఇదే గురుకులానికి హెల్ప్ చేస్తానేను బాగా చదువుకుని, మంచి జాబ్ చేస్తూ ఇదే గురుకులంలోని మరి కొందరు చిన్నారులకు సహకారం అందించాలనుంది. ఇవాళ వచ్చిన సుకృతి అక్క మాతో చాలా బాగా కలిసిపోయింది. చాలా విషయాలు చెప్పింది. సినిమా హీరోలు ఎలా ఉంటారు... వారి జీవితాలు ఎలా గడుస్తాయి.. ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాను. – అనిల్ప్రేమ, తోడ్పాటు కావాలిఅప్పుడప్పుడు బాధ అనిపించినా ఇక్కడ ఆ ఆలోచనలకు తావు లేదు. మేం చాలా గౌరవంగా, ఆరోగ్యంగా మంచి చదువులను పొందుతున్నాం. జాలి, దయ కన్నా ప్రేమ, తోడ్పాటు జీవితాన్ని ముందుకు తీసుకెళతాయని తెలుసుకున్నాను. – భాను ప్రసాద్ -
జిమ్ లో సుకుమార్ భార్య కసరత్తులు...వీడియో చూశారా ?
-
Director Sukumar: ఈ చిత్రకథ గొప్పగా ఉంది
‘‘జగడం’ సినిమా ద్వారా గణేశ్‌ని కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేశాను. ఇప్పుడు ‘గౌడ్ సాబ్’తో తను దర్శకుడిగా మారడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రకథ గొప్పగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. దివంగత నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు బంధువు విరాట్ రాజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గౌడ్ సాబ్’. కొరియోగ్రాఫర్ గణేశ్ దర్శకత్వంలో మల్లీశ్వరి సమర్పణలో రాజు, కల్వకోట వెంకటరమణ, కాటారి సాయికృష్ణ కార్తీక్ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ‘గౌడ్ సాబ్’ లోగోను సుకుమార్ లాంచ్ చేశారు. తొలి సీన్‌కి నృత్య దర్శకులు యాని, భాను, జానీ కెమెరా స్విచ్చాన్ చేయగా, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ క్లాప్ కొట్టారు. ‘‘మా విరాట్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి. ‘‘ఇది నా కెరీర్లో ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది’’ అన్నారు విరాట్ రాజ్. ‘‘లవ్ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’’ అన్నారు గణేశ్. ‘‘మంచి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ’’ అన్నారు నిర్మాతలు. -
పుష్ప 2 రిలీజయ్యేది ఆరోజేనా?
పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ మాంచి జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంబరాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకుండానే ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చారని, వచ్చే ఏడాది మార్చి 22న ‘పుష్ప: ది రూల్’ను విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని టాక్. విడుదల తేదీపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలిసింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మికా మందన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
సుకుమార్ డైరెక్షన్లో సినిమా చేయనున్న ప్రభాస్!
హీరో ప్రభాస్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమాకు రంగం సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రజాకారుల ఉద్యమం నేపథ్యంలో సుకుమార్ ఓ కథను రెడీ చేశారని, ఈ కథలో ప్రభాస్ హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘రాజా డీలక్స్ ’(ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాల తర్వాత ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. కాగా ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటూనే, సుకుమార్ దర్శకత్వంలోని సినిమానూ సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారట ప్రభాస్. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
స్మగ్లర్లు హీరోలు కాదు..పుష్ప 2పై మాజీ ఐజి ఫైర్
-
సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు
-
సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు
‘‘నా కెరీర్లో ఇప్పటివరకూ నేను మంచి కథలు, మంచి సినిమాల్లో నటించాను. కానీ నటనలో నాకు ఉన్న ప్రతిభకు సరైన పేరు రాలేదని ఫీలవుతుంటాను. అయితే ‘18 పేజెస్’ రిలీజ్ తర్వాత కేవలం ఈ సినిమా గురించే కాకుండా నా నటన గురించి కూడా మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను’’ అని హీరో నిఖిల్ సిద్ధార్థ అన్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్’. దర్శకుడు సుకుమార్ అందించిన కథతో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిఖిల్ చెప్పిన విశేషాలు. ► ‘18 పేజెస్’ చిత్రం ఎలా ఉంటుంది? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన క్రేజీ లవ్‌స్టోరీ ఇది. 18 పేజెస్ ఆధారంగా నందినీతో సిద్ధు ఏ విధంగా ప్రేమలో పడతాడు? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నదే కథ. ఈ సినిమా క్లయిమాక్స్‌ని ఊహించలేకపోయాను. అలాగే ఈ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోననే భయం కూడా ఉంది. హిట్టయినా కాకపోయినా మేం ఓ మంచి ప్రయత్నం చేశామని ఆడియన్స్ భావిస్తారనే గ్యారంటీ ఇవ్వగలను. ► థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లవ్‌స్టోరీ కాకుండా.. ఈ సినిమాలో వేరే అంశాలేమైనా? కొన్ని సామాజిక అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఎవరో ఒక అమ్మాయి తనను రిజెక్ట్ చేసిందని అతను ఆమెపై యాసిడ్‌తో దాడి చేయడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటివి వార్తల్లో చూస్తున్నాం. ఓ అమ్మాయికి ఎలాంటి గౌరవం దక్కాలి? ఆమె పట్ల ప్రవర్తన ఎలా ఉండాలి? పెద్దల పట్ల యువత తీరు ఎలా ఉంటే బాగుంటుంది? అనే అంశాలను చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత బ్రేకప్ను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారు. ► ఈ చిత్రంపై దర్శకుడు సుకుమార్ మార్క్ ఎంత? వంద శాతం ఆయన మార్క్ కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల క్యారక్టరైజేషన్స్, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉన్న ఇలాంటి లవ్‌స్టోరీని నేనిప్పటివరకు చేయలేదు. ప్రతి సీన్ చాలెంజింగ్‌గా అనిపించింది. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హీరో అయ్యారు. ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? పాన్ ఇండియా హీరో అన్న ప్రతిసారీ నాకు ఒత్తిడే. నాకు తెలిసి సక్సెస్‌ను మించిన ప్రెజర్ మరొకటి ఉండదు. ► మీ తర్వాతి చిత్రాలు? నెక్ట్స్ ఇయర్ ఓ స్పై మూవీతో రాబోతున్నాను. దర్శకుడు చందు మొండేటి ‘కార్తికేయ 3’ కోసం పరిశోధన చేస్తున్నారు. నా ‘యువత’ సినిమా రిలీజైన ఐదు రోజులకు సుకుమార్‌గారు లక్ష రూపాయల పారితోషికం ఇచ్చారు. ఆయనతో సినిమా ఎప్పుడో చెప్పలేను. ► మనతో పని చేసేవారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలను కూడా పొగుడుతుంటారు. రియల్ పర్సన్స్‌ను కలిసినప్పుడు మనకు రియాలిటీ అర్థమవుతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా ద్వారా రియల్ పీపుల్‌ను కలిసే చాన్స్ నాకు లభించింది. సోషల్ మీడియాలో నాకో ఫేక్ ప్రొఫైల్ ఉంది. నెటిజన్ల కామెంట్స్ చదువుతూ నిజాలు తెలుసుకుంటుంటాను. నా సినిమాలకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనే విషయాలను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంటుంటాను. ► అనుకోకుండా యాక్టర్ అయ్యాను. ఊహించని విధంగా హిట్స్ పడ్డాయి. అలాగే ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో ఆడియన్స్ దృష్టిలో పడ్డాను. ఇదంతా ఎలా జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటాను. -
రష్యా ఫ్లైట్ ఎక్కనున్న బన్నీ.. అందుకోసమేనట..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం దక్షిణాదితో పాటు హిందీలోనూ సత్తా చాటింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. (చదవండి: పుష్ప 2 నుంచి కొత్త అప్డేట్! లేడీ విలన్‌గా ఆ హీరోయిన్?) అయితే తాజాగా పుష్ప పార్ట్-1 సినిమాను రష్యాలో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. డిసెంబర్లో రిలీజ్ చేయనుండగా.. ప్రమోషన్ల కోసం బన్నీ రష్యా బయలు దేరనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో బన్నీ నటనకు రష్యా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారోనని చూసేందుకు అల్లు అర్జున్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పుష్ప-2: ది రూల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు బన్నీ. పుష్ప సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
పుష్ప-2 క్రేజ్.. బన్నీ ఫ్యాన్స్ అంటే అట్లుంటది మరి..! అసలు తగ్గేదేలే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు క్రేజ్ అంతా ఇంతా కాదు. పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ సంపాదించుకున్నారు బన్నీ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, సౌత్ సినిమా ఇండస్ట్రీల్లో బన్నీ అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. పుష్ప క్రేజ్‌తో ఒక్కసారిగా గ్లోబర్ స్టార్‌గా మారిపోయారుస్టెలిష్ స్టార్. బన్నీ సినిమాలు రిలీజైనప్పుడు థియేటర్ల వద్ద అభిమానులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. పుష్ప విడుదలైనప్పుడు థియేటర్లలో అభిమానులు కేకలతో హోరెత్తించారు. అంతే స్థాయిలో పుష్ప-2 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రబృందం ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ ఇస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. (చదవండి: అస్సలు తగ్గదేలే!) ఆ డైలాగ్ ఒక ప్రభంజనం: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలుగా లేదు. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు ఇలా సినిమాలో ప్రతీ అంశం ట్రెండ్‌గా మారింది. అన్నిటికంటే ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే ఆ ఒక్క డైలాగ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా రష్మిక మందన్నా గ్లామర్‌కు తోడు అల్లు అర్జున్ డ్యాన్స్, విలన్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఓ రేంజ్లో షేక్ చేసింది. (చదవండి: సుకుమార్ భారీ ప్లానింగ్.. అదే రోజు పుష్ప-2 టీజర్ రిలీజ్‌కు ప్లాన్?) ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే?: పుష్ప: ది రైజ్ థియేటర్ల వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టింది. డిసెంబర్ 17, 2021న విడుదలైన ఈ చిత్రం మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు పుష్ప రూ.71 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండో రోజే రూ.100 కోట్ల మార్క్‌ను దాటేసింది. పాన్ ఇండియా స్థాయిలో దాదాపు రూ.319 కోట్ల వసూళ్లు రాగా.. ఓవర్సీస్లో రూ.35 కోట్లు వసూలు చేసి మొత్తం రూ.354 కోట్లు వసూలు చేసింది. ఇది 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పుష్ప -2 అప్ డేట్ ఇవ్వని చిత్రబృందం: పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక బన్నీ ఫ్యాన్స్ అంతా సీక్వెల్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవలే 'పుష్ప 2' షూటింగ్ ప్రారంభం అయినా చిత్రబృందం నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అంతేకాకుండా అందులో పుష్ప-2 విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని కొద్ది రోజులు ప్రచారం కూడా జరిగింది. మూవీ అప్ డేట్స్ ఆలస్యం కావడమే బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమదే: పుష్ప-2 అప్ డేట్స్ ఇవ్వాలంటూ ఆదివారం హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో మరింత ఆలస్యం పనికి రాదని అభిమానులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పుష్ప-2 అప్ డేట్స్ మరింత ఆలస్యమైతే తగ్గేదేలే అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. -
అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆందోళన
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు బన్నీ ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప- 2 మూవీ అప్ డేట్స్ త్వరగా ఇవ్వాలంటూ అభిమానులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప రిలీజ్ అయి డిసెంబర్ 17 నాటికి ఏడాది పూర్తి కావొస్తోంది. సంవత్సరం గడుస్తున్నా ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద బైఠాయించారు. దీనిపై ఇంకా లేట్ చేస్తే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామంటూ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. ఐకాన్ స్టార్ బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమాలోని అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. ఆ డైలాగ్‌కు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం పుష్ప గెటప్‌లో కనిపించి అదుర్స్ అనిపించారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇటీవల నిర్వహించిన ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్ స్వీప్ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది. -
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్ ఆరోజే..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్ డిసెంబర్ 17 రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అప్ డేట్‌తో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పుష్ప-2: ది రూల్ మొదటి ప్రోమో గ్లింప్స్ వీడియోలో అల్లు అర్జున్‌పై తీసిన కొన్ని సీన్స్ హైప్ పెంచేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రం కంటే గొప్పగా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. పుష్ప విడుదలైన డిసెంబర్ 17 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న అల్లు అర్జున్ తిరిగొచ్చార షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. తదుపరి షెడ్యూల్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. బ్యాంకాక్ నుంచి తిరగొచ్చాక బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్పను రష్యాలో విడుదల చేయనుండగా ప్రమోషన్లలో అల్లు అర్జున్ పాల్గొననున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. -
సుక్కు... సౌండ్ బాగుంది
‘‘శివనాగేశ్వరరావుగారు ‘వన్స్ మోర్’ అని యూట్యూబ్ చానల్ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. రోహిత్ వర్ధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సుక్కు.. సుక్కు ....’ అంటూ సాగే పాటని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సుక్కు.. సౌండ్ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్ ఘోష్‌తో డాన్స్ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్’’ అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘‘సుక్కు..’ పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్‌కి మెసేజ్ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్ వచ్చింది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్. -
సుకుమార్ భారీ ప్లానింగ్.. అదే రోజు పుష్ప-2 టీజర్ రిలీజ్‌కు ప్లాన్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ వైరలవుతోంది. ఇటీవలే అల్లు అర్జున్‌తో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ సీన్ వివరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ గ్లింప్స్ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది . (చదవండి: పుష్ప-2 క్రేజీ అప్ డేట్.. అల్లు అర్జున్ ఫోటో వైరల్) అవతార్-2 రిలీజ్ రోజే ప్లానింగ్: తాజాగా అప్డేట్ ప్రకారం చిత్ర దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి టీజర్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ ప్రత్యేకత ఏమిటటే డిసెంబర్ 16న టీజర్ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే రోజు అవతార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. దీంతో పుష్ప-2 టీజర్‌ను అదే థియేటర్లలో దాదాపు 25 భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్పకు సీక్వెల్ తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం సమకూరుస్తున్నారు. As an Big Buzz..#Avatar was releaseing on this December. Sukumar and entire team was planning #Pushpa2 glimpse add to theatres with Avatar movie in 25 languages🔥#PushpaTheRule #AlluArjun pic.twitter.com/j2Q0xg7kiO — Abilash🪓 (@AbilashKp77) November 4, 2022 -
పుష్ప-2 క్రేజీ అప్ డేట్.. అల్లు అర్జున్ ఫోటో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను సోషల్ మీడియలో పంచుకున్నారు మేకర్స్. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్‌తో సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ సీన్ వివరిస్తున్న ఫోటో చక్కర్లు కొడుతోంది. ఆఫోటోను చూస్తే పుష్ప-2 అనుకున్న దానికంటే వేగంగా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. (చదవండి: పుష్ప: తగ్గేదే లే అంటూ.. నాన్‌స్టాప్‌గా షూటింగ్!) దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప-2 షెడ్యూల్లో అల్లు అర్జున్, రష్మికా మందన్నాపై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. FIRE @alluarjun 🔥🔥🔥#PushpaTheRule #Pushpa2 pic.twitter.com/ojL7v7bw4y — Allu Arjun TFC™ (@AlluArjunTFC) October 30, 2022 -
ముంబయిలో పుష్ప క్రేజ్.. బన్నీ అభిమాని క్రేజీ ఐడియా
ఐకాన్ స్టార్ బన్నీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. సినిమా విడుదల నుంచి భాషతో సంబంధం లేకుండా అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆ సినిమాలోని డైలాగ్ చెప్పకుండా ఉండని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ చిత్రంలోని తగ్గేదేలే అనే డైలాగ్ టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ ఊపు ఊపేసింది. తాజాగా బన్నీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. పుష్ప పేరు మీద జ్యూస్‌ల విక్రయం ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ముంబయికి చెందిన బంటీ అనే వ్యాపారి అల్లు అర్జున్ పేరు మీద డైలాగ్‌లు, చిత్రాలతో కూడిన గ్లాసుల్లో జ్యూస్ విక్రయిస్తున్నాడు. బన్నీ పేరు మీద అనే రకాల శీతల పానీయాలను కస్టమర్లకు అందిస్తున్నారు. బంటి మాట్లాడుతూ...' అల్లు అర్జున్ సర్కి అతని మొదటి సినిమా నుంచి అభిమానిని. ఆయన డైలాగ్స్ అన్నీ ఇష్టపడతాను. పుష్ప సినిమాలో నాకు ఇష్టమైన డైలాగ్ తగ్గేదేలే. హిందీలో 'ఫైర్ హై మెయిన్, జుఖేగా నహీ' అంటూ ఆ డైలాగ్‌ను చెప్పాడు. టాలీవుడ్లో 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ బండారి, సునీల్, రావు రమేష్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, అజయ్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో మాత్రమే పెరిగే అరుదైన కలప ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ ఆధారంగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Spice (@spicesocial) -
పుష్ప మూవీ.. బన్నీకి తల్లిగా నటించిన ఆమె ఎవరో తెలుసా?
ఐకాన్ స్టార్ బన్నీ, రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. బన్నీ అభిమానులు సైతం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించి కొన్ని ఫోటోలు సైతం పంచుకుంది చిత్రబృందం. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌కు అమ్మ పాత్రలో నటించి మెప్పించింది ఎవరో తెలుసా? అచ్చం చిత్తూరు యాసలో మాట్లాడి అభిమానులను సొంతం చేసుకున్న ఆమె గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. ఈ చిత్రంలో మరింత ఫేమస్ అయిన ఆమె పేరు కల్పలత గార్లపాటి. ఆమెను ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాల్లో చూడడం చాలా అరుదు. కేవలం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే పరిచయమైన కల్పలత పుష్ప సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు సాధించింది కల్పలత. పుష్ప సినిమా ఆడిషన్స్ జరుగుతుంటే తాను కూడా వెళ్లింది. అందరిలాగే ఆడిషన్స్‌లో పాల్గొంది. అచ్చం చిత్తూరు యాసలో మాట్లాడడం కష్టంగా అనిపించినా ఎలాగోలా ప్రయత్నించానని తెలిపింది. ఆడిషన్స్ జరిగిన ఆర్నేళ్లకు పుష్పలో అవకాశం వచ్చిందని ఫోన్ వచ్చినట్లు పేర్కొంది. అమ్మ పాత్ర రావడంతో తనకి కొడుకులు లేని లోటు ఈ సినిమాతో తీరిపోయిందని చెబుతోంది కల్పలత గార్లపాటి. -
Pushpa 2: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2లో భారీ ట్విస్ట్..!
ఐకాన్ స్టార్ బన్నీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. అయితే తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ఓ కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ క్యారెక్టర్ ద్వారా క్లైమాక్స్‌లో వచ్చే భారీ ట్విస్ట్ రివీల్ ఉంటుందని సమాచారం. అదే ట్విస్ట్ పుష్ప-3కి లీడ్ రోల్‌గా చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ ఫ్యాన్స్‌కు పండగే. దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప-2 మూవీ క్రేజీ అప్డేట్
ఐకాన్ స్టార్ బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప-2: ది రూల్. ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బాక్సాఫీస్ ఓ ఊపు ఊపేసిన పుష్పకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా షూటింగ్ జరుగుతున్న ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనిపై పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా కూడా ట్వీట్ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అంటూ అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్ట్‌లో షూటింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోందన్న విషయాన్ని చిత్ర నిర్మాతలు, దర్శకుడు కెమెరా వెనుక స్టిల్‌ను ఉన్న ఫోటోను షేర్ చేశారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ పిక్స్ షేర్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. కొద్ది రోజుల క్రితమే సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Works of #PushpaTheRule in full flow ❤ Icon star @alluarjun, director @aryasukku, celebrity photographer @avigowariker, poster designer @tuneyjohn and the entire team is putting all their efforts to deliver the best 🤙@iamRashmika @ThisIsDSP @SukumarWritings pic.twitter.com/xa9NiKYli5 — Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2022 . -
టీజర్ చూస్తే బ్లాస్టింగ్
‘‘వేద’ చిత్రం మోషన్ పోస్టర్ చాలా బాగుంది. టీజర్ చూస్తే బ్లాస్టింగ్. ఆ ఏడు కొండలులాగా ఈ సినిమాకు ఏడుగురు నిర్మాతలు ఉన్నారు.. ఇక్కడే వీరు సక్సెస్ అయ్యారు. ఈ సినిమా హిట్ కావాలి’’ అని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా జేడీ స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వేద’. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, శ్రీనివాస్ లావూరి, రాజేంద్రకనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని(అమెరికా) నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేయగా, రచయిత చంద్రబోస్ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ‘‘సైకో రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జేడీ స్వామి. ‘‘సమాజానికి ఉపయోగపడే ప్రయోగాత్మక చిత్రమిది’’ అన్నారు నిర్మాతలు. -
బెనారస్ ఏంటో పాటే చెప్పేస్తోంది
‘‘అన్నం ఉడికిందా? లేదా? అని తెలియడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలన్నట్లు ‘బెనారస్’ మూవీ గురించి ‘మాయ గంగ..’ పాట చెప్పేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో జంటగా జయతీర్థ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెనారస్’. తిలక్ రాజ్ బల్లాల్ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదల కానుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మాయ గంగ..’ అంటూ సాగే పాటను సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తిలక్ రాజ్ బల్లాల్ మాట్లాడుతూ– ‘‘జైద్ ఖాన్ ఎంతో డెడికేషన్, హార్డ్ వర్క్‌తో ఈ సినిమా చేశాడు. ‘పుష్ప’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. జయతీర్థ మాట్లాడుతూ– ‘‘నేను చిన్నప్పుడే స్కూల్ మానేశాను. అయితే వీధి నాటకాలు వేస్తూ పెరిగాను. సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా మరెవరూ ప్రేమించలేరు. భాష ఏదైనా మంచి సినిమాలను ఆదరిస్తున్నారు’’ అన్నారు. ‘‘హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది’’ అన్నారు జైద్ ఖాన్. సోనాల్ మోన్‌టైరో, లిరిక్ రైటర్ కె.కె. మాట్లాడారు. -
సుకుమార్ డైరెక్షన్లో నటించనున్న మెగాస్టార్ చిరంజీవి
Sukumar Directs Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక దాంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు మెగాస్టార్. వీటితో పాటు బాబీతో ఓ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజా విషయం ఏంటంటే.. సుకుమార్ దర్శకత్వంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. అయితే అది సినిమాకు కాదు. చాలా కాలం తరువాత మెగాస్టార్ ఓ కమర్షియల్ యాడ్‌లో కన్పించనున్నారు. అయితే ఆ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలా సుకుమార్ డైరెక్షెన్లో చిరంజీవి నటించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి చిరంజీవితో దిగిన ఓ ఫోటోను సుకుమార్ అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
'కేజీఎఫ్' రికార్డును బద్దలు కొట్టిన 'పుష్ప'
Pushpa Movie Collection Bollywood: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ ది రైజ్ గతేడాది డిసెంబర్ 17న విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. అటు బాలివుడ్లో కూడా పుష్ప రాజ్ తన సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా అక్కడ 'కేజీఎఫ్' రికార్డును ‘పుష్ప’ బద్దలు కొట్టినట్టు సమాచారం. బాలివుడ్ హీరోల సినిమాకు ఎలాంటీ రెస్పాన్స్ వస్తుందో ఆ రేంజ్‌లోనే పుష్పకు వసూళ్ళు రావడం గమనార్హం. ఇలా బన్ని తన మొదటి పాన్ ఇండియా చిత్రంతోనే తిరుగులేని రికార్డు సృష్టించి ఇక తగ్గేదేలే అంటున్నాడు. -
డెరైక్టర్ సుకుమార్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఎమోషనల్ అయిన సుకుమార్.. చంద్రబోస్ కాళ్లకు మొక్కుతూ
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను కొల్లగొడుతూ తగ్గేదే లే అంటోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాటల రచయిత చంద్రబోస్‌పై పొగడ్తల వర్షం కురిపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ క్రమంలోనే చంద్రబోస్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన సుకుమార్ చంద్రబోస్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. దాన్ని వద్దని చంద్రబోస్ వారిస్తూ తాను కూడా సుకుమార్ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. అలాగే 'చంద్రబోస్ ప్రతిభ ఏంటో నాకు తెలుసు. ఊ అంటావా అని చంద్రబోస్ గారు నాలుగేళ్ల క్రితం అన్నారు. మీరు ఉఉ అనండి.. దాన్ని అలానే దాచేయండి అని చెప్పాను. నాకోసం నాలుగేళ్ల దాచిన ఆ పాట ప్రపంచం మొత్తాన్ని ఊ కొట్టిస్తుంది. చంద్రబోస్ స్పాంటేనిటీ అద్భుతం. ఆయన శక్తికి పాదాభివందనం. నాకు పాట కావాలంటే ఐదు నిమిషాల్లో ఈజీగా పాట, పల్లవి చెబుతుంటారు. అది చూసి నేను ఆశ్చర్యపోతుంటా. చంద్రబోస్ నవ్వుతూ ఉంటే మామలు వ్యక్తిగానే ఉంటారు. పాట రాసినప్పుడు మాత్రం ఆయన శక్తి ఏంటో తెలుస్తుంది. ఆయన గురించి అందరికి తెలియాలనే ఇలా స్టేజ్‌పైకి పిలిపించాను.' అని సుకుమార్ తెలిపారు. ఇదీ చదవండి: బన్నీ స్టార్‌డమ్‌పై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే ? -
స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఎందుకు ఒప్పుకుందో తెలుసా?
Pushpa Director Sukumar Reveals Secrets About Samantha Item Song: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' మూవీ అద్భుతమైన వసూళ్లతో దుమ్మురేపుతుంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా'.. అనే పాట ఈ చిత్రానికే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంలోని లిరిక్స్‌పై వివాదం చెలరేగినా, అదే స్థాయిలో సూపర్ హిట్టయ్యింది. సమంత ఐటెం సాంగ్ చేస్తుందనగానే ఈ పాటపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విభిన్న పాత్రలతో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న సమంత అసలు ఐటెం సాంగ్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఈ విషయంపై డైరెక్టర్ సుకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొదట స్పెషల్ సాంగ్ చేయడానికి సమంత ఒప్పుకోలేదు. అలాంటి పాటలు నాకు కరెక్ట్ కాదేమో అని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో నేనే తనని కన్విన్స్ చేశాను. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు..కాబట్టి ఇబ్బంది ఉండదని చెప్పా. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఇదో కొత్త అనుభవం..నటిగా ఓ సరికొత్త సమంతను చూస్తారు అని చెప్పా. నా మాట మీద నమ్మకంతో సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి అంగీకరించింది అని సుకుమార్ వెల్లడించారు. -
Pushpa: సెకండ్ పార్టులో అవి చూపిస్తాం : సుకుమార్
‘‘నా చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డానంటే నా తల్లితండ్రులను తక్కువ చేసినట్లు అవుతుంది. ఉన్నంతలో నేను బాగానే పెరిగాను.. టీచర్ అయ్యాను. డైరెక్టర్ కావాలని, పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కష్టాలను కొనితెచ్చుకుంది నేనే. అయినా ఇష్టంతో చేసినప్పుడు ఏది కూడా కష్టం కాదు. ఒకవేళ కష్టంగా అనిపించినా అదీ ఆనందమే’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన తొలి పార్టు ‘పుష్ప: ది రైజ్’. ముత్తం శెట్టి మీడియా సహ నిర్మాత. అయితే ఈ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో సుకుమార్ పంచుకున్న విశేషాలు.... ► ‘పుష్ప: ది రైజ్’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన సంతోషాన్నిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా వేసవిలో విడుదల చేయాలనే ఆలోచన చేశాం. కానీ కరోనా పరిస్థితుల భయం వల్ల ఈ నెల 17నే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో ఫుల్ బిజీ అయిపోయాను. రిలీజ్‌కు సమయం తక్కువ ఉండటం వల్ల కాస్త ఇబ్బంది పడ్డాం. డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు అది వ్యాపారమే అవుతుంది. సో... నేను బాక్సాఫీసు నంబర్స్ గురించి ఆలోచిస్తాను. ► ‘పుష్ప’ చిత్రాన్ని ముందుగా వెబ్ సిరీస్‌గా తీయాలనుకున్నాను. కానీ ఆ తర్వాత సినిమాగా అనుకున్నాం.. అది కాస్తా రెండు పార్టులు అయ్యింది. ఓ కూలీ స్మగ్లింగ్ సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అన్న విషయాన్నే ‘పుష్ప: ది రైజ్’లో చూపించాము. పుష్పరాజ్ చిన్నతనం నాటి సంఘటనలు, అతని మనస్తత్వం ఎందుకు అలా మారింది? అనే విషయాలన్నీ సెకండ్ పార్టులోనే కనిపిస్తాయి. ► పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. చిత్తూరు యాస నేర్చుకున్నాడు. సెట్స్‌లో తోటి నటీనటులను కూడా ఇన్స్పైర్ చేసేవాడు. నా సినిమాల్లో కొన్ని రియల్‌లైఫ్ క్యారెక్టర్ల రిఫరెన్స్‌లు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఉన్నాయి. రావు రమేష్ వంటి వారు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టం. ఆయన ఎలాంటి పాత్రలైనా చేయగలరు. సునీల్ (మంగళం శీను), అనసూయ (దాక్షాయణి) పాత్రకు రెండో పార్టులో మంచి ప్రాధాన్యం ఉంటుంది. ‘పుష్ప: ది రైజ్’ క్లైమాక్స్ గురించి విభిన్నమైన మాటలు వినిపించాయి. కానీ ఆ క్లైమాక్స్ ఎందుకు అలా ఉందో సెకండ్ పార్టులో తెలుస్తుంది. ఫాహద్‌ఫాజిల్ క్యారెక్టర్ మరింతగా సెకండ్పార్టులో తెలుస్తుంది. ఫస్ట్పార్టులో ఉన్న క్యారెక్టర్సే సెకండ్ పార్టులో కూడా కంటిన్యూ అవుతాయి. ఒకటి రెండు పాత్రలు యాడ్ కావొచ్చు. ► ‘పుష్ప: ది రైజ్’కు హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. హిందీలో ఈ సినిమాను ప్రమోట్ చేయమని దర్శకులు రాజమౌళిగారు తిడుతున్నప్పటికీని సమయాభావం వల్ల చేయలేకపోయాం. ∙ఈ సినిమాలోని స్పెషల్‌సాంగ్ చేయడానికి ముందు సమంత అంగీకరించలేదు.. నేను కన్విన్స్ చేశాను. ‘రంగస్థలం’లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. ఒక యాక్టర్ అన్ని విధాలుగా నటించగలగాలి. ఒక బ్యాక్‌డ్రాప్‌లో ఎన్ని కథలైనా రావొచ్చు. మహేశ్‌బాబుతో నేను అనుకున్న కథ వేరు. ‘పుష్ప’ కాదు. ‘పుష్ప: ది రూల్’ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేస్తా. ‘ఆర్య 3’ గురించి భవిష్యత్‌లో ఆలోచిస్తాను. ► ‘ఆర్య’ సమయంలో నాకు సినిమాలంటే లవ్‌స్టోరీలే అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత డిఫరెంట్ సినిమాలు చేశాను. ఇప్పుడు లవ్‌స్టోరీస్ ఆలోచనలు రావడం లేదంటే నాకు వయసవుతున్నట్లే లెక్క (సరదాగా...). 2014 నుంచి పుస్తకాలు చదవడాన్ని మానేశాను. మళ్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కరోనా సమయంలో కొన్ని కథలను రెడీ చేశాను. సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వెబ్ సిరీస్‌ల ఆలోచనలేదు. -
Sukumar: నా కూతురికి ఆ మాట ఇచ్చాను
‘‘పుష్ప’ సినిమా 17న విడుదలవడం అసంభవం అనుకున్నారు.. ఓ రోజు నా కూతురు ఫోన్ చేసి 17న సినిమా రిలీజ్ కాదని అనుకుంటున్నారు అంది. కచ్చితంగా రిలీజ్ చేస్తామని నా కూతురికి మాట ఇచ్చాను. నా కూతురికి, యూనిట్‌కి ఇచ్చిన మాట ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ చాలా వేగంగా చేసి, 17నే సినిమా రిలీజ్ అయ్యేందుకు కష్టపడ్డా’’ అని సుకుమార్ అన్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మొదటి భాగం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 2’ తర్వాత నేను వాటర్‌లో పడిపోయినప్పుడు బన్నీ (అల్లు అర్జున్) నన్ను పైకి లేపాడు. ‘నీతో ఏడు సినిమాలు చేస్తాను’ అని అప్పుడు తనకు మాటిచ్చా.. ఆ తర్వాత ఇద్దరం టచ్‌లో లేం. లక్కీగా మళ్లీ ‘పుష్ప’ చేశాం. తనపై నాకున్న ప్రేమ అంతా ‘పుష్ప’లో కనిపిస్తుందేమో? దాన్ని మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఇంత బజ్ క్రియేట్ చేయడానికి ఓ కారణం దేవిశ్రీ.. అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. తను నా ఆత్మ అని భావిస్తుంటాను. ఇంతకాలం నన్ను భరించినందుకు నవీన్, రవిగార్లకు థ్యాంక్స్. ఇంత పెద్ద సినిమా జరుగుతున్నా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు కానీ ఏ రోజూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు నన్ను. సినిమా చూసినవారు బాగుందని అంటే అప్పుడు నా భారం దిగుతుంది’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నా 17వ సినిమా నువ్వు చేయాలి.. ఓ హిట్ కావాలి అని సుక్కుని అడిగాను. ‘నువ్వూ నేను ఒక్కటే. నీకు పేరొచ్చినా నాకు వచ్చినట్టే.. నాకు వచ్చినా నీకు వచ్చినట్టే’ అన్నారు. ఒక డైరెక్టర్ హీరోని ప్రేమిస్తే ఎలా ఉంటుందో ‘పుష్ప’లో చూస్తారు. దేవిశ్రీ అద్భుతమైన పాటలిచ్చాడు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి.. వాటిని అల్లుకుపోయే నాలాంటి టెక్నీషియన్స్‌కి ప్రొడక్ట్ కొత్తగానే వస్తుంది. ఈ చిత్రానికి పనిచేసే మాకు కూడా ప్రతి సన్నివేశంలో సర్ప్రైజ్ ఉండేలా బన్నీ–సుకుమార్ మంచి మ్యాజిక్ క్రియేట్ చేశారు. సుక్కుగారి ఆలోచనలను బన్నీ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. ఈ సినిమాని పెద్ద స్క్రీన్‌పై చూసేందుకు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. రష్మిక డీ గ్లామర్లోనూ అందంగానే ఉంది. ప్రత్యేక పాటలో నటించిన సమంతకు థ్యాంక్స్’’ అన్నారు. రష్మిక, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కెమెరామ్యాన్ మిరోస్లా క్యూబా బ్రోజెక్ మాట్లాడారు. -
ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా బర్త్‌డే వేడుకల ఫోటోలు
-
రూ.25 లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్: సుకుమార్
కంటికి కనిపించని కరోనా ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది. ఇక చాలాచోట్ల కరోనా బాధితులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు దర్శకుడు సుకుమార్ ముందుకు వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాడు. తన స్నేహితుడు అన్యం రాంబాబుతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అధికారులతో బుధవారం చర్చించాడు. అనుమతులు లభిస్తే వెంటనే ప్లాంట్ నిర్మిస్తానని సుకుమార్ పేర్కొన్నాడు. దీనికోసం రూ.25 లక్షలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు అధికారులకు తెలిపాడు. మరోవైపు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న పేషెంట్ల కోసం ఆజాద్ ఫౌండేషన్‌కు రూ.7 లక్షల విలువైన సిలిండర్లు పంపించాడు. గతేడాది కూడా కరోనా పోరులో తనవంతు సాయంగా రూ.10 లక్షలు అందించిన విషయం తెలిసిందే. కాగా సుకుమార్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా 'పుష్ప' తెరకెక్కిస్తున్నాడు. తర్వాత విజయ్ దేవరకొండతో పాటు, రామ్‌చరణ్‌తో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే! చదవండి: బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు భాగాలుగా ‘పుష్ప’ సలార్: ప్రభాస్‌కు అక్కగా తెరపైకి మరో హీరోయిన్ పేరు! -
పుష్పలో అనసూయ: మంచిరోజులున్నాయి అంటూ..
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో అనసూయ పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ ఆమె కెరీర్‌కు మంచి మైలేజ్‌ను ఇచ్చింది. ఇప్పుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ లో అనసూయ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ‘‘మంచి రోజులు ముందున్నాయి.. మళ్లీ సినిమా (సుకుమార్‌తో మరో సినిమా) చేయడం ఆనందంగా ఉంది’’ అని ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్న విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు అనసూయ. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13న విడుదల కానుంది. ‘పుష్ప’ సినిమా కాకుండా రవితేజ ‘ఖిలాడి’, కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రాల్లో నటిస్తున్నారు అనసూయ. అలాగే అనసూయ లీడ్ రోల్ చేసిన ‘థ్యాంక్యూ...బ్రదర్’ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: రెండున్నరేళ్లు అవుతుంది, అవి డిలీట్ చేయండి : మౌనిక -
అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!
‘‘పుష్ప’ సినిమాలోని ‘తగ్గేదే లే’ డైలాగ్‌ని నేను వ్యక్తిగతంగానూ ఆచరిస్తా. మీ అందరిలాగే నాకూ భయాలుంటాయి. నేనూ భయపడే క్షణాలుంటాయి. అప్పుడు నేను ‘ధైర్యం చేసి ముందడుగు వేసెయ్. పడిపోయినా ఫరవాలేదు. తగ్గేదే లే’ అనుకుంటా. అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చాననుకుంటున్నా’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. రష్మికా మందన్న కథానాయిక. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. నేడు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజుని పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో ‘పుష్ప’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ప్రేమకంటే గొప్ప బహుమతి ఏముంటుంది? నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా లైఫ్ టేకాఫ్ అయిందే సుకుమార్ ‘ఆర్య’ వల్ల. ఆ సినిమాతోనే నాకు ‘స్టైలిష్ స్టార్’ అని పేరొచ్చింది. ఈ రోజు ‘ఐకాన్ స్టార్’ అని ఓ కొత్త పేరొచ్చింది. నాకు ‘ఆర్య’, ‘ఐకాన్ స్టార్’ ఇచ్చినందుకు సుకుమార్‌కి థ్యాంక్స్. నేను చేసేది ఏదైనా ఫ్యాన్స్‌కు నచ్చాలి. నా జీవితాన్నే వారికి అంకితమిస్తున్నా’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘హిందీ సహా పరభాషా ప్రేక్షకుల వల్లే తెలుగు సినిమా రేంజ్ పెరిగింది.. ఇంత పెద్ద మార్కెట్ వచ్చింది. వినోదరంగంలో రానున్న 25 ఏళ్లలో తెలుగు సినిమా ప్రపంచంలోనే పెద్ద స్థాయికి చేరుకుంటుంది’’ అన్నారు. చదవండి: అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన టాప్ 5 చిత్రాలు.. నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘మంచి కథతో పాటు నటన, డైలాగ్స్, కెమెరా, సంగీతం, ఎమోషన్స్, ఫైట్స్... ఎంత ముఖ్యమో అవన్నీ కలగలిసినదే మా‘పుష్ప’ సినిమా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సానా బుచ్చిబాబు, హీరో అల్లు శిరీష్, ముత్తంశెట్టి మీడియా రవి పాల్గొన్నారు. ఇక నుంచి బన్నీ ‘ఐకాన్ స్టార్’! – సుకుమార్ ‘‘బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరు ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు. కానీ ‘పుష్ప’లో తన అద్భుతమైన నటనను మీకు అందించబోతున్నాం. ప్రామిస్. తన నటనకీ, ‘స్టైలిష్ స్టార్’కీ సంబంధం లేదనిపించింది. తన ప్రతి పాత్ర, ప్రతి సినిమా, తన ప్రతి డ్రెస్ యూనిక్.. ప్రతి విషయంలో యూనిక్ అయినందుకే తను స్టైలిష్ స్టార్ కాదని నేను భావించి ‘ఐకాన్ స్టార్’ అని పెట్టా. బన్నీని ఇదివరకు ‘ఆర్య’ అని పిలిచేవారు. ‘పుష్ప’ తర్వాత రెండే విషయాలు మిగలాలి... ఒకటి ‘ఐకాన్ స్టార్’, రెండోది ‘పుష్ప’ అని పిలవాలి’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. చదవండి: పుష్ప టీజర్: ఊరనాటుగా అల్లు అర్జున్ -
దేవా కథ చెబుతానంటే వద్దన్నాను: సుకుమార్
‘‘ప్రస్థానం’ సినిమాని మనం ఇప్పటికీ మరచిపోలేదంటే.. ఆ సినిమాలోని సెన్సిబిలిటీస్, న్యారేషన్ అంత గొప్పగా ఉంటాయి. ‘రిపబ్లిక్’ కథను దేవా చెబుతానంటే వద్దన్నాను. ఎందుకంటే ఓ మంచి దర్శకుడి కథను వినకూడదు.. చూడాలి. ఈ సినిమా టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సాయితేజ్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం జూన్ 4న విడుదల కానుంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ని సుకుమార్ విడుదల చేశారు. దేవా కట్టా మాట్లాడుతూ– ‘‘సుక్కు సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ణి. ‘బాహుబలి’ ఎంత ల్యాండ్ మార్క్ సినిమానో ‘రంగస్థలం’ కూడా అంతే ల్యాండ్ మార్క్ మూవీ. ‘రంగస్థలం’ కారణంగానే ‘రిపబ్లిక్’ చేశాను’’ అన్నారు. ‘‘సాయితేజ్‌తో తొమ్మిదేళ్లుగా ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రతిఫలమే ‘రిపబ్లిక్’ చిత్రం’’ అన్నారు జె.పుల్లారావు. ‘‘పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు జె.భగవాన్ . సాయితేజ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌గారు టీచర్ అయితే, బుచ్చిబాబు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్.. దేవాగారు మిడిల్ బెంచ్, నేను లాస్ట్ బెంచ్. నిజాయతీగా చేసిన ఈ సినిమా అందరికీ చేరువవుతుంది. మణిశర్మగారితో పని చేయాలనే నా ఆకాంక్ష ఈ సినిమాతో తీరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు, నటులు మనోజ్ నందం, రవివర్మ, స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ జై కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాంపిల్ వస్తోంది!
పుష్పరాజ్ ఎలా ఉంటాడో చూశాం. పుష్పరాజ్ ఏం చేస్తాడో మరో మూడు రోజుల్లో శాంపిల్ చూడనున్నాం. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫాహద్ ఫాజిల్ విలన్ . దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతదర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
సుకుమార్ నిర్మాణంలో కార్తికేయ కొత్త సినిమా
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రం ‘కుమారి 21ఎఫ్’ ఘనవిజయం సాధించింది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారాయన. ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘‘కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని చూసి, కార్తికేయ నటనకు ముగ్ధుడైన సుకుమార్ తన బ్యానర్లో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు సుకుమార్ అందిస్తున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
ఆగిన పుష్ప షూటింగ్; ఐసోలేషన్లోకి సుకుమార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునఃప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇక్కడే నెల రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సెగ ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్‌పై పడింది. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్.. సుకుమార్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఇటీవలే చనిపోయాడు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా ఈ వ్యక్తి మారేడుపల్లి షూటింగ్ సమయంలో టీం సభ్యులందరితో కలిసి పనిచేయడంతో ప్రస్తుతం పుష్ప షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి అల్లు అర్జున్‌తో ఎక్కవ కాంటాక్ట్ కాలేదు కానీ సెట్లో పనిచేస్తున్న క్రమంలో మిగతా బృందంతో ఇంటరాక్ట్ అయినట్లు సమాచారం. అలాగే పుష్ప’ యూనిట్లో కొంత మందికి కొవిడ్-19 లక్షణాలు కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మారేడుపల్లి అడవుల్లోకి పుష్ప టీం దీంతో టీం సభ్యులంతా కోవిడ్ టెస్ట్ చేయనుండటంతోపాటు ఉన్నపాటుగా షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్‌కు పయనం కట్టినట్లు గుసగుసలు వ్యాపిస్తున్నాయి. అంతేగాక దర్శకుడు సుకుమార్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారని, త్వరలో కోవిడ్ టెస్టు చేసుకోనున్నారని తెలుస్తోంది. అతనితోపాటు నిర్మాతలు కూడా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేసుకోనున్నారు. అయితే వారికి కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు ఓ వారంపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ వదంతులు మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. చదవండి: అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్.. ట్రెండింగ్‌లో -
మారేడుమిల్లి అడవుల్లో...
‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా చిత్రీకరణ సాగనుందని తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను శేషాచలం అడవుల్లో, కేరళ అడవుల్లో జరుపుతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే ‘పుష్ప’ టీమ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవుల్లో షూట్‌కి రెడీ అయ్యారని టాక్. నెల రోజుల ఏకధాటి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. నవంబర్ మొదటివారంలో ఈ షెడ్యూల్ ఆరంభం కానుందని తెలిసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
లవ్ థ్రిల్లర్
చేతన్ చీను హీరోగా ఎస్.కె. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తడ’. 24 ఆర్ట్స్ ప్రొడక్ష¯Œ ్స బ్యానర్‌పై మిథున్ మురళి, పద్మ సత్య తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. చేతన్ చీను బర్త్‌డే సందర్భంగా ‘తడ’ ఫస్ట్ లుక్ పోస్టర్ని డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో చేతన్ వైవిధ్యభరితమైన మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. గుబురు గడ్డం, బనియన్ , తలకు చుట్టిన రుమాలు, చేతిలో పదునైన ఆయుధంతో దేనికోసమో వేటాడుతున్నట్లు సునిశితమైన చూపుతో కనిపిస్తున్నారు. ‘‘చేతన్ లుక్ ‘తడ’ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. షూటింగ్ తుది దశలో ఉంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, కెమెరా: కన్నా. -
క్రేజీ కాంబినేషన్
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతోంది. కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫాల్కన్ క్రియేషన్స ఎల్ఎల్పి పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కేదార్ సెలగంశెట్టి ఈ ప్రాజెక్టును ప్రకటించి, మాట్లాడుతూ– ‘‘నాకెంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ, సుకుమార్‌గార్లతో నా మొదటి సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్ అనగానే చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ల శైలిలోనే ఈ సినిమా ఉంటుంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నాం. 2022లో సినిమా మొదలవుతుంది. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేస్తాను’’ అన్నారు. -
డ్రైవర్ పుష్పరాజ్
పుష్పరాజ్‌గా మారిపోయారు అల్లు అర్జున్. ఎందుకంటే తన కొత్త చిత్రం కోసం. ‘ఆర్య’ (2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ముత్తం శెట్టి మీడియా సహ–నిర్మాత. బుధవారం (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప’ టైటిల్‌ను, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూర్తిగా చిత్తూరు యాస మాట్లాడే పుష్పరాజ్ పాత్రలో కనిపిస్తారు అల్లు అర్జున్. పుష్పరాజ్ లారీ డ్రైవర్ అట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ, సీఈఓ: చెర్రీ. -
నిర్మాత ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహితుడు, ఆయన మేనేజర్ వి.ఇ.వి.కె.డి.ఎస్. ప్రసాద్ శనివారం గుండెపోటుతో మరణించారు. ప్రసాద్ ‘అమరం అఖిలం ప్రేమ’ అనే సినిమా నిర్మించారు. ఆయనకు భార్య పద్మజ, కుమార్తెలు సాయి ప్రణీత, సత్య ప్రజీత ఉన్నారు. ప్రసాద్ మరణ వార్త విన్న సుకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను ఏ కాస్త నిరుత్సాహంలో ఉన్నా ప్రసాద్‌తో మాట్లాడగానే ఎనర్జీ వచ్చేది. తన మరణం నాకు చాలా లోటు. తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు’’ అంటూ ప్రసాద్ కుటుంబానికి సుకుమార్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ప్లే బ్యాక్ డిఫరెంట్‌గా ఉంటుంది
దినేష్ తేజ్, అనన్య జంటగా హరి ప్రసాద్ జక్కా దర్శకత్వంలో పెద్దినేని కవిత సమర్పణలో పెద్దినేని ప్రసాద్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘ప్లేబ్యాక్’. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నేను చేయాలనుకున్న కథ ఈ ‘ప్లేబ్యాక్’. విభిన్నమైన కథ. హరిప్రసాద్‌కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. చిన్న సినిమాలు ఆడుతున్న రోజులు ఇవి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘నేను, సుకుమార్ పాతికేళ్లుగా స్నేహితులం. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాం. కెమెరామేన్ బుజ్జి ఇందుకు కారణం. హీరో దినేష్ చాలా కష్టపడి చేశాడు’’ అన్నారు హరిప్రసాద్. ‘‘నా కెరీర్లో ఈ సినిమా మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దినే‹ష్. ‘‘డైరెక్టర్ రాసుకున్న థ్రిల్లింగ్ పాయింట్‌ను కెమెరామేన్ బుజ్జి అందంగా చూపించారు. అర్జున్ కల్యాణ్, స్పందన, ఐశ్వర్య బాగా నటించారు’’ అన్నారు నిర్మాత డీజే రాజు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు అర్జున్ కల్యాణ్. -
మథనం విభిన్నంగా ఉంది
శ్రీనివాస్ సాయి, భావనరావు జంటగా అజయ్ మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మథనం’. దివ్య ప్రసాద్, అశోక్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న అమెరికాలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విభిన్నంగా ఉంది. అశోక్ ప్రసాద్ ప్యాషన్ ఉన్న నిర్మాత. నా సినిమా ‘1 నేనొక్కడినే’ కూడా అమెరికాలో బాగా ఆడింది. మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు’’అన్నారు. ‘‘అశోక్‌కి సినిమా అంటే పిచ్చి. కొత్త పాయింట్‌తో మంచి ప్రయత్నం చేశారు’’ అన్నారు డైరెక్టర్ సురేందర్ రెడ్డి. ‘‘వాస్తవ సంఘటన స్ఫూర్తితో ఈ కథ రాశా’’ అన్నారు అజయ్. ‘‘కేవలం అమెరికాలో సినిమా రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి’’ అన్నారు అశోక్ ప్రసాద్. ‘‘ఎన్ఆర్ఐ నిర్మాతలు నవీన్ ఎర్నేని, అనిల్ సుంకరలాగా అశోక్ మంచి హిట్ చిత్రాలు తీయాలి’’ అన్నారు ‘తానా’ అధ్యక్షుడు సతీష్ వేమన. శ్రీనివాస్ సాయి మాట్లాడారు. ∙ట్రైలర్ లాంచ్‌లో సుకుమార్, సురేందర్ రెడ్డితో చిత్రబృందం -
ప్రేమ.. పిచ్చి అలానే ఉన్నాయి!
అల్లు అర్జున్, సుకుమార్ స్నేహం ‘ఆర్య’ సినిమాతో మొదలైంది. ‘ఆర్య’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో ‘ఆర్య 2’ వచ్చింది. ‘ఆర్య 2’ సినిమా రిలీజ్ అయి బుధవారానికి పదేళ్లు అయింది. ఈ సందర్భంగా ‘ఆర్య 2’ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్. ‘ఆర్య 2’ సమయంలో దిగిన ఫొటో ఒకటి, ఇటీవల దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేసి – ‘‘సుక్కూ (సుకుమార్ నిక్‌నేమ్) జుట్టు రంగు మారింది. నా స్కిన్ మారింది. కానీ మా మధ్య ఉన్న ప్రేమ మారలేదు. మేమిద్దరం కలిసినప్పుడు ఉండే పిచ్చి మారలేదు. దాన్ని మళ్లీ త్వరలోనే చూడబోతున్నారు (వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న మూడో చిత్రాన్ని ఉద్దేశించి)’’ అని పేర్కొన్నారు అల్లు అర్జున్. -
పల్లెటూరిని గుర్తు చేసేలా...
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. రవి కిరణ్ కోల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మనోవికాస్, మీడియా 9 మనోజ్ నిర్మించారు. ఈ నెల 29న సురేశ్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సుకుమార్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘ట్రైలర్ చూస్తే దర్శకుడికి కథ చెప్పడంలో ఎంత క్లారిటీ ఉందో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘పల్లెటూరివారికి తమ జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా, పట్నంవారికి పల్లెటూరిని పరిచయం చేసేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు రవికిరణ్. ‘‘సుకుమార్‌గారు సపోర్ట్ చేయడం హ్యాపీ’’ అన్నారు కిరణ్. -
థాయ్‌కి హాయ్
ఈ ఏడాది చివర్లో థాయ్‌లాండ్‌లో ల్యాండ్ అవనున్నారట అల్లు అర్జున్, సుకుమార్. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండేదుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశం అట. ఇందులో అల్లు అర్జున్ గుబురు గడ్డం లుక్‌లో చిత్తూరు యాస మాట్లాడతారని తెలిసింది. ఈ సినిమా షూటింగ్ నల్లమల అడవులతో పాటు థాయ్‌లాండ్ అడవుల్లోనూ జరగనుందట. అందుకే ఈ ఏడాది చివర్లో థాయ్‌లాండ్ అడవుల్లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిందట చిత్రబృందం. రష్మికా మందన్నా హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
మ్యాజిక్ రిపీట్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారు. ముత్తం శెట్టి మీడియా ఈ సినిమాకు సహ – నిర్మాతగా వ్యవహరిస్తోంది. ‘‘ఆర్య (2004), ఆర్య 2 (2010) సినిమాల తర్వాత నా డార్లింగ్ సుక్కు (సుకుమార్)తో మూడో సినిమా చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాన్నగారికి (అల్లు అరవింద్), దర్శకులు కొరటాల శివ, సురేందర్ రెడ్డిగార్లతో పాటు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇతర అతిథులకు ధన్యవాదాలు. మైత్రీ మూవీస్, ముత్తం శెట్టి మీడియాలకు థ్యాంక్స్. సంగీతదర్శకుడు దేవీతో నాది ఎప్పుడూ స్పెషల్ కాంబినేషనే’’ అన్నారు అల్లు అర్జున్. ఈ సినిమాకు కెమెరా: మిర్‌స్లోవ్ కుబ బ్రోజెక్, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి. -
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
‘‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. ‘1 నేనొక్కడినే, 100%లవ్’ చిత్రాలకు కథ అందించిన హరి ప్రసాద్ ఈ సినిమాకు స్టోరీ అందించారంటే కథ ఎలా ఉంటుందో తెలుస్తోంది’’ అన్నారు డైరెక్టర్ సుకుమార్. సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేశారు. బి.ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ– ‘‘మంచి సందేశం ఉన్న కథతో తీశాం. డబ్బు వస్తుందా? లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశాననే సంతృప్తి ఉంది’’ అన్నారు. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని మా సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.కిషోర్, కెమెరా: సునీల్ కుమార్.ఎ¯Œ . -
పల్లెటూరి పిల్లలా..
‘రంగస్థలం’ సినిమాలో సమంతను అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చూపించారు దర్శకుడు సుకుమార్. ఈసారి రష్మికా మందన్నాను కూడా పల్లెటూరి అమ్మాయిలా మార్చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమాలో రష్మిక పాత్ర కట్టు, బొట్టు, మాట తీరు అన్నీ కొత్తగా ఉంటాయని సమాచారం. ఇప్పటివరకూ రష్మిక చేసిన పాత్రలకు ఈ పాత్ర విభిన్నంగా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్ల నుందని సమాచారం. -
అలీగారికి పెద్ద అభిమానిని
‘‘అలీ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన వినోదాన్ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ‘పండుగాడి ఫోటో స్టూడియో’తో హీరోగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్ హీరోలా అలీగారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. అలీ హీరోగా దిలీప్ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలు కథ తయారు చేసుకుని దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాంబిరెడ్డిగారికి 22 విద్యాలయాలున్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందర్నీ అలరించనుంది’’ అన్నారు. దిలీప్ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాలగారి ఫొటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఇందులో పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తెనాలిలో ఈ నెల 21న నిర్వహించనున్నాం’’ అన్నారు. అలీ, గుదిబండి వెంకట సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ప్రదీప్ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్ రెడ్డి. -
తెలుగు సినిమా తీరు మారింది
‘‘సినిమా రచన వేరు, దర్శకత్వం వేరు. ఈ రెండూ ఒకరే చేయడంతో ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు తెలుగు సినిమా తీరు మారింది. నిజాయతీ నిండిన కథలే ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాయి. కొత్త దర్శకులు చాలా మంచి సినిమాలతో వస్తున్నారు’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా జీవితారాజశేఖర్‌ల కుమార్తె శివాత్మిక హీరోయిన్గా పరిచయమవుతోన్న చిత్రం ‘దొరసాని’. కె.వి.ఆర్. మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘మధుర ’ ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నిషీధి’ అనే షార్ట్ ఫిల్మ్‌తో శ్యామ్ బెనగల్ నుండి ప్రశంసలు పొందాడు కె.వి.ఆర్. మహేంద్ర. దర్శకుడిగా అతని అభిరుచి ఏంటో ‘దొరసాని’ ట్రైలర్ చెబుతోంది. ఈ కథలో అంతా నిజాయతీనే కనిపిస్తోంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ విన్నప్పడు నాకు కలిగిన ఫీల్‌ని తెరమీదకు వందశాతం తెచ్చాడు మహేంద్ర. ఎడిటర్ నవీన్ నూలి మినహా దాదాపుగా అందరూ కొత్త వాళ్లతోనే ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్ రెడ్డి. ‘‘ఈ సినిమాలో ఏ ఎమోషన్ ఫేక్‌గా అనిపించదు. ఇందులో ఒక వాస్తవికత, స్వచ్ఛత ఉంది. 1980దశకాల్లో నడిచే ప్రేమ కథ ఇది’’ అన్నారు కె.వి.ఆర్ మహేంద్ర. ‘‘ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు కొత్త వాళ్లు చేశారనిపించడం లేదు. సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే ఇలాంటి కథలు తప్పకుండా ఆలోచనలో మార్పును తెస్తాయి’’ అన్నారు నిర్మాత దొరస్వామి రాజు. ‘‘మా ఇంట్లో అంతా సినిమా వాతావరణమే. నా కుటుంబం నాకు ఒక పెద్ద ఫ్యామిలీ (సినిమా ఇండస్ట్రీ, అభిమానులు)ని ఇచ్చింది అని ఈ సినిమా చేస్తున్నప్పుడు తెలిసింది’’ అన్నారు శివాత్మిక. ‘‘అమెరికాలో ఉద్యోగం చేసేవాణ్ణి. ‘పెళ్ళి చూపులు’ ట్రైలర్ లాంచ్ రోజు ఆఫీస్‌కి వెళ్లకుండా రూమ్‌లో ఉన్నా. ట్రైలర్ లాంచ్‌లో విజయ్ మాట్లాడేది చూసి ఆనందంతో కన్నీళ్లొచ్చాయి. అన్నయ్యను సపోర్ట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్, మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నాయి’’ అని ఆనంద్ దేవరకొండ చెప్పారు. ‘‘చాలా మంచి ప్రేమకథ ఇది. శివాత్మిక, ఆనంద్‌లకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీవిత. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి, సహనిర్మాత: ధీరజ్ మొగిలినేని. -
కొత్త ఐడియాతో తీశారు
‘‘సత్యనారాయణ చాలా కొత్త ఐడియాతో ‘స్టూవర్టుపురం’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పైగా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడమే కాకుండా ఎడిటింగ్, కెమెరా.. ఇలా ఆల్ రౌండర్‌గా పనిచేసి చాలా తక్కువ సమయంలో సినిమా చేశాడు. ట్రైలర్ చాలా ఆసక్తి కలిగిస్తో్తంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సుకుమార్ అన్నారు. ‘గూఢచారి’ ఫేమ్ ప్రీతీ సింగ్ ప్రధాన పాత్రలో సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘స్టూవర్టుపురం’. రంజిత్ కోడిప్యాక సమర్పణలో అర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ విడుదల చేశారు. సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ– ‘‘నరరూప రాక్షసుల్లాంటి స్టూవర్టుపురం గ్యాంగ్ హీరోయిన్ ఇంట్లోకి చొరబడతారు. వాళ్లను ఆమె ఎలా ఎదుర్కొంది అనే పాయింట్‌తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా నిర్మించాం. రీ రికార్డింగ్‌కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రానికి నవనీత్ చారి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేపథ్య సంగీతం అందించారు. మా సినిమా ట్రైలర్‌ని మెచ్చుకున్న సుకుమార్‌గారికి థ్యాంక్స్. ఆయన చెప్పిన సలహాలను పాటిస్తాం’’ అన్నారు. ‘‘గతంలో మా బ్యానర్లో నిర్మించిన ‘నందికొండ వాగుల్లోనా, మోని’ చిత్రాల దర్శకుడు సత్యనారాయణ ఏకారి ‘స్టూవర్టుపురం’ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’’ అని రంజిత్ అన్నారు. ‘‘పవర్ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు ప్రీతిసింగ్. -
కాంబినేషన్ షురూ
కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారు నాగశౌర్య. కాశీ విశాల్ అనే నూతన దర్శకుడి చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. ప్రముఖ దర్శకులు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు కాశీ విశాల్. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. త్వరలో మరిన్ని విషయాలను తెలియజేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సంగతి ఇలా ఉంచితే... హీరో నాగశౌర్య కెరీర్లో వన్నాఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన ‘ఛలో’ సినిమా విడుదలైన (ఫిబ్రవరి 2) తేదీనే ఆయన కొత్త సినిమా అనౌన్స్మెంట్ రావడం విశేషం. -
సత్తి హీరో అయ్యాడోచ్
యాంకర్‌గా, నటుడిగా ఫేమస్ అయిన ‘బిత్తిరి’ సత్తి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘తుపాకి రాముడు’. ‘బతుకమ్మ’ ఫేమ్ టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి బాలకిషన్ నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేసి మాట్లాడుతూ– ‘‘బిత్తిరి సత్తి’గా పరిచయమైన సత్తి ఈ సినిమాతో మరో కోణంలో కనిపిస్తున్నారు. నాకు పరిచయమైన తొలి దర్శకుడు ప్రభాకర్‌గారు. ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమా అందరికీ మంచి పేరు, సక్సెస్ తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘యూనివర్శల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సత్తిని కొత్త కోణంలో చూపిస్తున్నాం. బాలకిషన్‌గారు రాజీ పడ కుండా నిర్మించారు’’ అన్నారు టి.ప్రభాకర్. ‘‘సత్తిని హీరోగా పరిచయం చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంతో పాటు ఈ చిత్రం సత్తిని బిజీ నటుడిని చేస్తుంది’’ అన్నారు బాలకిషన్. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మక్కపాటి చంద్రశేఖర్, మక్బూల్ హుస్సేన్. -
తీసుకుంటే నువ్వు ఊపిరి ...
కొత్త వ్యక్తీకరణతో రాసే పాటలు వినడానికి చెవులు కూడా ఉత్సాహపడతాయి. ఆర్య 2 చిత్రం కోసం బాలాజీ రాసిన ఈ పాట చూడండి. పల్లవి ఎంత ఫ్రెష్షుగా ఉంటుంది! ‘ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో తియ్యనైన ఈ బాధకి ఉప్పునీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్లకీ లోకమంత ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకీ ఇన్ని శిక్షలెందుకో’ రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో? ప్రేమలోని అత్యున్నత గాఢతను ఇంతకంటే ఏ భావం తెలియజేస్తుంది! నాయకుడి స్వభావానికి తగిన పాదాలతో సాగే ఈ పాటలోని చరణంలో ఒకచోట– ‘తీసుకుంటే నువ్వు ఊపిరి పోసుకుంట ఆయువే చెలి’ అని వస్తుంది. ఇది ప్రేమ తీవ్రతను మరింత తీవ్రంగా చెప్పిన వ్యక్తీకరణ. 2009లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు సుకుమార్. సంగీత దర్శకుడు సుకుమార్ రెగ్యులర్ అయిన దేవిశ్రీ ప్రసాద్. పాడింది కేకే. కాజల్ అగర్వాల్, అల్లు అర్జున్ నటీనటులు. -
కొన్ని క్షణాలు నేను అశ్విన్ అయ్యా
సుకుమార్ కాసేపు నాగ్ అశ్విన్ అయ్యారు. ‘‘నేను సుకుమార్‌ని కాదు’’ అని అసలు విషయం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. ఎందుకలా? అంతలా సుకుమార్ మౌనంగాఉండిపోవ డానికి కారణం ఏంటి? ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ‘ప్రియ’మైన అశ్విన్, ‘మహానటి’ సినిమా చూసి బయటకి వచ్చి, నీతో మాట్లాడదామని నీ నంబర్‌కి ట్రై చేస్తున్నాను.. ఈలోగా ఒక ఆవిడ వచ్చి ‘‘నువ్వు డైరెక్టరా బాబు’’ అని అడిగింది. అవునన్నాను... అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ‘‘ఎంత బాగా చూపించావో బాబు.. మా సావిత్రమ్మని’’ అంటూ.. నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా... ఆవిడ నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.– సుకుమార్ (కొన్ని క్షణాల అశ్విన్) (గమనిక: ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు కాదని తెలియకపోతే బావుండు..) అంటూ ‘ఫేస్బుక్’ ద్వారా దర్శకుడు సుకుమార్ తన అనుభూతిని పంచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘మహానటి’ బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి, థియేటర్ నుంచి బయటికొచ్చిన సుకుమార్‌కి ఎదురైన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
అఫీషియల్: 200 కోట్ల క్లబ్లో రంగస్థలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం రూ. 200 కోట్ల కలెక్షన్ల క్లబ్లో చేరిపోయింది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చి 30న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. నెల రోజుల్లో రూ. 200 కోట్లకు పైగా రాబట్టి టాలీవుడ్లో ఈ ఘనత సాధించిన రెండో చిత్రంగా(నాన్-బాహుబలి) నిలిచింది. సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబుగా రామ్ చరణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆది పినిశెట్టి, సమంత, ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అనసూయ తదితరులు కీలక పాత్ర పోషించారు. పొలిటికల్ విలేజ్ డ్రామాను దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు.. దేవీశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, పాటలకు సాహిత్యం, ఇలా అన్ని విభాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోవటంతో చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటిదాకా ఇది హయ్యెస్ట్ గ్రాసర్ కావటం విశేషం. #200CrGrossRangasthalam pic.twitter.com/1KuT5yazto — Mythri Movie Makers (@MythriOfficial) 30 April 2018 -
వన్స్‌మోర్
‘రంగస్థలం‘ సూపర్ హిట్‌తో మాంచి ఫామ్‌లో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ బాబు. వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత వన్స్‌మోర్ ఈ కాంబినేషన్ సెట్ అయింది. మహేశ్ 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ మైత్రీ మూవీస్ బ్యానర్లో రెండోసారి చేస్తుండటం విశేషం. సో.. ఈ హిట్ కాంబినేషన్ కూడా వన్స్‌మోరే. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లి, 2019లో విడుదల కానుంది. ‘1 నేనొక్కడినే’ సినిమాతో ప్రయోగం చేసిన మహేశ్–సుక్కు కాంబినేషన్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో? అనే ఆసక్తి ఇటు చిత్రవర్గాల్లో అటు మహేశ్ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది. -
‘సంత’ సక్సెస్ కావాలి
‘‘గ్రామీణ నేపథ్యంలో చక్కని ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తీసిన చిత్రం ‘సంత’. గోరేటి వెంకన్నగారు ఓ లెజెండ్. ఆయన ఈ సినిమాకి రాసిన పాట అద్భుతంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలున్న ‘సంత’ సక్సెస్ కావాలి. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ట్యాగ్ లైన్. శ్రీ జై వర్ధన్ బోయెనేపల్లి నిర్మించి న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ‘రంగస్థలం’ సెట్లో సుకుమార్ విడుదల చేశారు.ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ– ‘‘ఓ సంత నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. ఫీల్‌గుడ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో పాటలు చిత్రీకరించాం. షూటింగ్ పూర్తయింది. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ఫణి, ప్రసన్న, ఆర్.ఎస్.నందా, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ– కథనం– సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
‘బాహుబలి తర్వాత రంగస్థలం టాప్...’
‘మీరు ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకునే సినిమాలు ఒప్పుకుంటారా?’ అని అడుగుతుంటారు. నేనెప్పుడూ అలా సినిమాలు ఒప్పుకోలేదు. కథ ముందు నాకు నచ్చాలి. ఆ తర్వాత అందరికీ నచ్చుతుంది. అందరూ గర్వపడే సినిమా చేయాలనే కథ వింటాం’’ అని రామ్‌చరణ్ అన్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సీవీఎం (మోహన్) నిర్మించిన ‘రంగస్థలం’ గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్‌కి థ్యాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్‌ను మా భుజాలపై పెట్టాడు. తన మిషన్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు, సినిమా సక్సెస్‌లో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఇలాంటి సక్సెస్ ఇండస్ట్రీకి ఎంతో అవసరం. వేసవిలో రాబోయే మరో రెండు సినిమాలు కూడా పెద్ద సక్సెస్ కావాలి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అంటే నాకెంతో ఇష్టం. సినిమా రంగంలో వచ్చే ప్రతి రూపాయిని వారు మళ్లీ తర్వాతి సినిమాపైనే పెడతారు. వాళ్లందరూ హ్యాపీగా ఉండాలి’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘నాకు, చరణ్‌కి కామన్ ఫ్రెండ్ రంగ. అతని ద్వారా ‘నాన్నకు ప్రేమతో’ సమయంలో చరణ్‌ని కలిశా. తను నా మైండ్‌లో ఉండిపోయాడేమో.. కాబట్టి ‘రంగస్థలం’ టైటిల్ పెట్టా. జగపతిబాబుగారు ఏ ప్రాత చేసినా బంగారమే. ఆయనతోనే ప్రేమలో పడిపోయా. ఆయనతో నా ప్రతి సినిమా చేయాలనుకుంటున్నాను. రత్నవేలుగారు ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్. హీరోయిన్‌కు పెళ్లయితే ఆమెను ప్రేక్షకులు ఆదరించరని అంటుంటారు. కానీ, సమంత విషయంలో అలా జరగలేదు. రూల్స్‌ను బ్రేక్ చేసిన సినిమా ఇది. చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ని తప్ప వేరే ఎవరినీ ఊహించలేదు’’ అన్నారు. ‘‘సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు ‘లెజెండ్’ చిత్రం ఓ లైఫ్ అయితే.. ‘రంగస్థలం’తో మరో లైఫ్ వచ్చింది. ఇది సుకుమార్ ఇచ్చిన ఇంకో లైఫ్’’ అన్నారు జగపతిబాబు. ‘‘రంగస్థలం తొలి మూడురోజులకు ఎంత కలెక్షన్స్ వచ్చాయో, నాలుగోరోజు సోమవారం కూడా అంతే కలెక్షన్స్ రావడం సినిమా బ్లాక్‌బస్టర్ అనడానికి పెద్ద నిదర్శనం. ‘ఆర్య’ తర్వాత సుక్కు చిత్రాల్లో పూర్తిగా నచ్చిన సినిమా ‘రంగస్థలం’. సుక్కు కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ మూవీ ఇది. స్టార్ హీరో కొత్తగా ట్రై చేసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అది ‘ధృవ’, ‘రంగస్థలం’ చిత్రాలకు వర్కవుట్ అయ్యింది. ‘మగధీర’ను కూడా ఈ సినిమా క్రాస్ చేయబోతోంది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘రంగస్థలం’ స్టార్టింగ్ షాట్ నుంచి ఎండింగ్ వరకు చరణ్‌గారి నటన సూపర్బ్ అని అందరూ చెబుతున్నారు. ‘రంగస్థలం’ ఫస్ట్ షెడ్యూల్ కాగానే మరో సినిమా చేయమని సుకుమార్‌గారితో కమిట్ అయ్యామంటే మా జర్నీ ఎంత బాగా సాగిందో అర్థం చేసుకోవాలి. మా మూడు సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘బాహుబలి, బాహుబలి 2’ తర్వాత ‘రంగస్థలం’ టాప్ గ్రాసర్ అవుతుంది. ‘ఖైదీనంబర్ 150’ చిత్రాన్ని కూడా చరణ్‌గారు దాటేస్తారు’’ అన్నారు నవీన్ ఎర్నేని. నిర్మాత సీవీఎం, రవిశంకర్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నటి అనసూయ, ఎడిటర్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక తదితరులు పాల్గొన్నారు. -
మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్..
‘‘తెల్ల కాగితంలా రండి... సినిమా చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’. ‘రంగస్థలం’ రిలీజ్‌కు ముందు సుకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆడియన్స్ వస్తున్నారు..ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్ మళ్లీ ‘తెల్ల కాగితం’ తీయడానికి రెడీ అవుతున్నారు. అయితే జస్ట్ నెల తర్వాత. ఈ తెల్ల కాగితంపై కొత్త కథ రెడీఅవ్వబోతోంది. మళ్లీ సేమ్...ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు..తెల్ల కాగితంలా థియేటర్‌కి వెళ్లాలి. సినిమా చూడాలి. ఎందుకంటే ‘అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ’స్ ఇవ్వడం సుకుమార్‌కి అలవాటు. లెక్కల మాస్టారిలా స్టూడెంట్స్కిమార్కులు వేసిన సుకుమార్ ఇప్పుడు ఆడియన్స్‌తో మంచి మార్కులు వేయించుకుంటున్నారు. ► సక్సెస్ రీ–సౌండ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు? (నవ్వుతూ). అవును. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ► సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ‘సిటీ బ్యాక్‌డ్రాప్’ అని ఒక రూట్లో వెళుతుంటే.. ‘విలేజ్ బ్యాక్‌డ్రాప్’ రూట్లో వచ్చారు.. ఈ రూట్లోకి డైవర్ట్ అవ్వడానికి కారణం? నేను ఇప్పటివరకూ తీసినవన్నీ సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలే. ఖరీదు గల కార్లు, బంగ్లాలు, రిచ్ సెట్స్, ఫారిన్ లొకేషన్స్. ఇవన్నీ నా సినిమాల్లో చూపించాను. డిఫరెంట్‌గా ఆలోచిస్తే బాగుంటుందనిపించింది. అందుకే విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేయాలనుకున్నాను. అది కూడా పక్కా పల్లెటూరిని చూపించాలనుకున్నాను. ► బాగానే ఉంది.. ముందు హీరోకి వినికిడి లోపం లేదట. తర్వాతే స్క్రిప్ట్‌లో యాడ్ చేశారట కదా. వినగానే రామ్‌చరణ్ ఏమన్నారు? అవును. ముందు రాసుకున్న స్క్రిప్ట్‌లో లేదు. తర్వాత యాడ్ చేశాను. క్యారెక్టర్లో కామెడీ కూడా ఉండాలనుకున్నాను. కథ వినగానే చరణ్ ఒక్క క్షణం ఆలోచనలో పడినట్లు అనిపించింది. ‘కొత్తగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది’ అన్నాను. చరణ్ ఇంకో క్షణం కూడా ఆలోచించలేదు. ► ‘రామ్‌చరణ్ ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు’ అని అందరూ అంటున్నారు. చరణ్ అలా చేయడానికి మీరు తనని ఏం చేశారు? ఏమీ చేయలేదు. స్టోరీ, క్యారెక్టరే తనని అలా డ్రైవ్ చేశాయి. ఏ ఆర్టిస్ట్ అయినా అంతే. వాళ్లకు మంచి క్యారెక్టర్ వస్తే రెచ్చిపోయి నటిస్తారు. డైరెక్టర్‌గా నేనా స్టోరీని, క్యారెక్టర్ని తన మనసుకి బాగా ఎక్కేలా చెప్పాను. ► సమంతను డీ–గ్లామరైజ్డ్గా చూపిస్తూనే అందంగా చూపించారు. ఆ క్యారెక్టర్‌కి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? నా ఫ్యామిలీలోనే ఉన్నారు. నా చిన్నక్క కట్టూబొట్టూ అలానే ఉండేది. రామలక్ష్మీ క్యారెక్టర్ అనుకున్నప్పుడే అక్క కట్టూబొట్టూ ఫాలో అవ్వాలనుకున్నాను. సమంత కూడా చాలా బాగా చేసింది. ► ఫుల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్.. అందులోనూ హీరోకి వినికిడి లోపం.. రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డారా? కొంచెం ఉండేది. అయితే చిరంజీవిగారు ఫస్ట్ కాపీ చూసి, ‘చాలా బాగుంది’ అన్న తర్వాత, చరణ్ పెద్దమ్మ (వసంతలక్ష్మీ – చరణ్ అమ్మ సురేఖకు అక్క)గారు చూసి, బాగుందన్నాక మొత్తం టెన్షన్ పోయింది. ఆవిడ జడ్జిమెంట్ బాగుంటుంది. ఆర్య, ఆర్య–2, 100% లవ్ సినిమాలు ‘చాలా బాగున్నాయి. హిట్ ఖాయం’ అని ఆమె అన్నారు. అది నిజమైంది. వసంతలక్ష్మీగారు ఉన్నది ఉన్నట్లు నిక్కచ్చిగా చెబుతారు. ఆవిడ చెప్పింది కరెక్ట్ అని అల్లు అరవింద్‌గారి ఫ్యామిలీ నమ్ముతుంది. నాకూ ఆవిడ మీద నమ్మకం. సినిమా చూశాక నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. సురేఖగారు కూడా చాలా బాగుందన్నారు. అప్పుడే నా టెన్షన్ మొత్తం పోయింది. ► ‘సినిమా బాగుంది’ అనే టాక్‌తో పాటు నాలుగు డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటుంది. కలెక్షన్స్ వైజ్‌గానూ ‘రంగస్థలం’ మీకు శాటిస్ఫ్యాక్షన్ ఇస్తుందనొచ్చా? డెఫినెట్లీ. బిగ్గెస్ట్ హిట్ ఇన్ మై కెరీర్. ప్రొడ్యూసర్స్ నవీన్, రవిశంకర్, మోహన్గార్లు హ్యాపీగా ఉన్నారు. వీళ్లు ఎంత మంచి నిర్మాతలంటే.. ‘రంగస్థలం’ షూటింగ్ సమయంలో వీళ్ల మీద జోక్ వేసుకునేవాళ్లం. అదేంటంటే.. ఒకవేళ వర్షం వస్తే మబ్బులను కూడా కొనేసి, వర్షం రాకుండా చూస్తారని నవ్వుతూ చెప్పుకునేవాళ్లం. వాళ్లెంత అన్కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్సో చెప్పడానికి ఇలా అనుకునేవాళ్లం. ‘ఇది కావాలి’ అంటే చాలు.. వెంటనే ఎరేంజ్ చేసేసేవారు. ఇవాళ ప్రాడెక్ట్ ఇలా ఉందంటే దానికి కారణం వాళ్లే. ► అది సరే.. ‘రంగస్థలం’ క్యారెక్టర్స్‌లో మీరు ఏ టైప్? అన్ని క్యారెక్టర్స్ మీరే రాసుకున్నప్పటికీ మీకేది ఇష్టం? నేను కుమార్ బాబు (రామ్‌చరణ్‌కి అన్నగా ఆది పినిశెట్టి చేసిన రోల్) టైప్ అండి. నేను రాసిన అన్ని పాత్రలూ నాకిష్టమే. కాకపోతే చిట్టిబాబుది స్పెషల్ ప్లేస్. ► మీది లవ్ మ్యారేజ్ కదా. కుమార్‌బాబు తన లవర్ని కలవడం కోసం మోపెడ్‌లో వెళతాడు.. మీరు? (గట్టిగా నవ్వేస్తూ). సైకిల్. అయ్య బాబోయ్. ఇప్పుడు నా లవ్‌స్టోరీ ఎందుకండీ? ఇంకోసారి మాట్లాడుకుందాం. ► ఇంతకీ మీ పిల్లలు ఏమన్నారు? ఏ పాట ఎక్కువగా పాడుతున్నారు? మా ఇంట్లో సినిమా అందరికీ నచ్చింది. మా అబ్బాయి ‘ఎంత సక్కగున్నావే..’ పాట పాడుతున్నాడు. వాళ్ల అమ్మని పట్టుకుని (నవ్వుతూ). మా ఇంట్లో మా ఆవిడే రామలక్ష్మీ (సమంత చేసిన క్యారెక్టర్ పేరు). ► మీతో ఏ హీరో సినిమా చేసినా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అల్లు అర్జున్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్. ఎలా బుట్టలో పడేస్తున్నారు? బుట్టలో పడేయడం ఏమీ ఉండదండి. ఒక సినిమా కోసం నేను హీరోలతో కనీసం రెండేళ్లు ట్రావెల్ చేస్తాను. వాళ్లతో కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే పని సజావుగా జరగదు. నేను వాళ్లను బాగా ప్రేమిస్తాను. ఎంత అంటే 100% ఇష్టపడతాను. ఆ ప్రేమంతా నిజమైనదే. నటన కాదు. వాళ్లతో నేను ఎప్పుడైతే ప్రేమగా ఉంటానో అప్పుడు వాళ్లకూ నా మీద అభిమానం ఏర్పడుతుంది. సినిమా చేస్తున్నంతసేపు చాలా బాగుంటాం. చేశాక కూడా ఆ ఎఫెక్షన్ అలానే కంటిన్యూ అవుతుంది. ► కంటిన్యూస్‌గా సిటీ బోర్ అని విలేజ్ బ్యాక్‌డ్రాప్ తీసుకున్నారు? వాట్ నెక్ట్స్? ఇంకా ఏమీ అనుకోలేదు. తెల్ల కాగితం బయటకు తీయాలి. రాయడం మొదలుపెట్టాలి. ► మీకు ‘రంగస్థలం’ హ్యాంగోవర్ ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది? ఇప్పట్లో వదలదు. ముందు ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసుకోవాలి. తర్వాత నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించాలి. ► మూడు గంటల సినిమా చూస్తారో? లేదో? అనే డౌట్ ఉండేదా? ఉండేది కానీ, సినిమా చూశాక చిరంజీవిగారు ఒక్క ఫ్రేమ్ తీసినా బాగుండదన్నారు. ఆయన మాటలు విన్నాక నమ్మకం కుదిరింది. మరో నమ్మకానికి కారణం ‘అర్జున్ రెడ్డి’. ఆ సినిమా మూడు గంటలకు పైన కొంచెం ఉంటుంది. చూశారు కదా అనుకున్నా. ► ‘రంగస్థలం’ చూసి ఎవరు బాగా ఇంప్రెస్ అవ్వాలనుకున్నారు? నా టార్గెట్ చిరంజీవిగారే. సినిమా చూశాక నాతో గంట సేపు మాట్లాడారు. పక్కనే సురేఖగారు కూడా ఉన్నారు. ఆవిడ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశారు. – డి.జి. భవాని -
తెల్ల కాగితంలా రండి... ఓ మంచి సినిమా చూడండి
‘‘1980 బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ ఉంటుంది కాబట్టి అందుకు తగట్టుగా సెట్ డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనికా. నా టీమ్ అందరూ చాలా బాగా సహకరించారు. ఎక్కడా రాజీ పడకుండా మేం ఏది అడిగితే అది ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాలు. ఎక్కడా తగ్గించొద్దు. అలానే రిలీజ్ చేయమని చిరంజీవిగారు చెప్పడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. అనసూయ ‘రంగమ్మత్త’ కారెక్టర్‌కి వంద శాతం న్యాయం చేశారు. నరేశ్ బాగా యాక్ట్ చేశారు. సినిమాలో కామెడీ సెపరేటుగా ఉండదు. క్యారెక్టర్స్‌లోనే కామెడీ ఉంటుంది. థియేటర్స్‌కి తెల్ల కాగితంలా రండి. ఓ మంచి సినిమా చూడండి. అద్భుతమైన ఫీల్ కలుగుతుందని గ్యారెంటీగా చెప్పగలను. ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావద్దు’’ అన్నారు సుకుమార్. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ‘రంగస్థలం’ ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘రంగస్థలం’ విలేజ్ సెట్లో చిత్రబృందం విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.నవీన్ ఎర్నేనీ మాట్లాడుతూ –‘‘రంగ స్థలం’ సినిమాను వరల్డ్‌వైడ్‌గా 1700 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. సినిమాకు టీజర్ దగ్గర నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలను రీచ్ అవుతాం. ఇంత మంచి మూవీని మా బ్యానర్‌కు అందించిన సుకుమార్‌కి, రామ్‌చరణ్‌కు థ్యాంక్స్. చరణ్ నటన ఈ సినిమాలో పీక్స్‌లో ఉంటుంది. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎగై్జటెడ్‌గా ఉన్నాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రతి ఏడాది 2–3 అద్భుతమైన హిట్స్ వస్తున్నాయి. సుకుమార్‌గారు చేసిన సినిమాలన్నింటిలో ‘రంగస్థలం’ బెస్ట్ స్క్రీన్ ప్లే. నాకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారు. న్యాయం చేశాననే అనుకుంటున్నాను. చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. నేషనల్ అవార్డు వస్తుంది’’ అన్నారు నరేశ్.‘‘నా ఫేవరెట్ యాక్టర్ చరణ్‌కు అత్తగా నటించడం థ్రిల్లింగ్‌గా ఉంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేక్యారెక్టర్ చేద్దాం అనుకునే టైమ్‌లో సుకుమార్‌గారు ఈ పాత్ర ఇచ్చారు’’ అన్నారు అనసూయ. -
చిరుతో మూవీ.. సుక్కూ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో రంగస్థలం ద్వారా చూపించబోతున్నాడు దర్శకుడు సుకుమార్. చిట్టిబాబుగా చెర్రీ చేయబోయే సందడి.. పొలిటికల్ విలేజ్ డ్రామా కోసం మెగా అభిమానుల కౌంట్‌డౌన్ మొదలైపోయింది. అయితే ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సుకుమార్ ఓ చిత్రం చేయబోతున్నాడంటూ ఈ మధ్య జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. రంగస్థలం ఫలితంపైనే అది ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తూ కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్లో పాల్గొంటున్న సుక్కూ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశాడు. ‘చిరంజీవిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయన చిత్రాలు చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పని చేయాలన్నది నా కల. కానీ, తర్వాతి చిత్రం ఆయనతో అన్న వార్త వాస్తవం నిజం కాదు. అలాంటి ప్రతిపాదన కూడా చర్చకు రాలేదు’ అని సుకుమార్ తేల్చేశాడు. అయితే అల్లు అర్జున్‌తో తన తర్వాతి చిత్రం ఉండే ఛాన్స్ ఉందంటూ సుకుమార్ చివర్లో ఓ హింట్ ఇచ్చాడు. -
రంగమ్మ.. మంగమ్మ.. ఏం పిల్లడూ!
సాక్షి, సినిమా : మెగా అభిమానుల్లో ఇప్పుడు ఒక్కటే ఆలోచన. రంగస్థలం చిత్రం ద్వారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెరపై చేసే సందడి ఎలా ఉంటుంది అని. దానికి ముందే ఒక్కో పాటను విడుదల చేస్తూ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన ఎంత సక్కగున్నావే లచ్చిమి, రంగా రంగా రంగస్థలానా సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా మూడో సాంగ్‌ను విడుదల చేశారు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడూ...పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు అంటూ సాగే పాట అది. చంద్రబోస్ సాహిత్యం.. మానసి గాత్రం.. దానికి దేవీ అందించిన బాణీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చెర్రీని ఏడిపిస్తూ సాగే ఈ పాటలో సమంత లుక్కు కూడా బావుంది .వినసొంపుగా ఉన్న ఈ పాట విజువల్స్‌తో సుకుమార్ ఆకట్టుకునేలా తీర్చిదిద్ది ఉంటాడనిపిస్తోంది. రామ్ చరణ్, సమంత, ఆదిపినిశెట్టి, జగపతి బాబు, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న రంగస్థలాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి.. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తెచ్చే యత్నం చేస్తున్నారు. -
రంగస్థలం దరువులకు.. తీన్మార్ చిందులే!
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాంగే మాస్ బీట్‌ను కాసేపటి క్రితం మేకర్లు విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన సాహిత్యం.. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం... అందుకు దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ చెర్రీ వాయిస్ ఓవర్ తో ఊర మాస్ బీట్ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్ కూడా వైవిధ్యంగానే ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. హీరోయిన్గా సమంత, కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
రంగస్థలం దరువులకు.. తీన్మార్ చిందులే!
-
మెగా ఫ్యాన్స్.. ఇంక పూనకాలే...
సాక్షి, సినిమా : రంగస్థలం చిత్ర రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్లను వేగవంతం చేసేశారు. ఇప్పటికే తొలి సాంగ్ ఎంత సక్కగున్నవే ట్రెండ్‌లో కొనసాగుతుండగా.. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ డేట్ ను మేకర్లు అధికారికంగా ప్రకటించేశారు. ‘రంగా.. రంగా.. రంగస్థలానా’... అంటూ సాంగ్‌ను మార్చి 2న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు మేకర్లు ఓ చిన్న వీడియోను వదిలారు. అంతకు ముందు ముందుగా ఎంత సక్కగున్నావే పాటను లెజెండరీ తార శ్రీదేవికి అంకితమిస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్.. పాటను అంతగా ఆదరించినందుకు దర్శకుడు సుకుమార్, రైటర్ చంద్రబోస్‌లు శ్రోతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆపై మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ సెకండ్ సాంగ్ రికార్డింగ్‌కు సంబంధించిన దృశ్యాలను చిన్న బైట్ రూపంలో విడుదల చేశారు. గ్రామ నేపథ్యాన్ని వివరిస్తూ సాగే ఈ సాంగ్‌లో చెర్రీ గెటప్ కూడా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు స్పష్టమౌతోంది. మొత్తానికి ఊర మాస్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేందుకు దేవీ సిద్ధమైపోతున్నాడు. మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ఆది, అనసూయ తదితరులు నటిస్తుండగా.. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మెగా ఫ్యాన్స్.. ఇంక పూనకాలే...
-
ఓహోహో.. రామలక్ష్మి... ఏం వయ్యారం!
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం నుంచి మరో టీజర్ వచ్చేసింది. హీరోయిన్ సమంత పాత్రను పరిచయం చేస్తూ కాసేపటి క్రితం ఓ టీజర్‌ను విడుదల చేశారు. ‘ఓహోహోహో.. ఏం వయ్యారం.. ఏం వయ్యారం. ఏ మాటకామాట సెప్పుకోవాలండి. ఈ పిల్ల ఎదురస్తుంటే మా ఊరికే 18 సంవత్సరాల వయసొచ్చినట్లుందండి. ఈ సిట్టిగాడికి గుండెకాయని గొలెట్టేచేసింది ఈ పిల్లేనండీ. పేరు రామ లక్ష్మి’... అంటూ చెర్రీ వాయిస్ ఓవర్‌తో సామ్ పాత్రను పరిచయం చేసేశారు. మునెపన్నడూ లేని విధంగా డీగ్లామర్ రోల్లో కనిపించబోతోంది ఈ సౌత్ బ్యూటీ. అయితే డైలాగులు లేకుండా కట్ చేసిన టీజర్‌తో సమంత మూగ పాత్ర పోషిస్తుందా అన్న సస్పెన్స్‌ను సుకుమార్ అలాగే కంటిన్యూ చేశాడు. ఈ చిత్రంలో మొదటి పాటను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నట్లు చెప్పేశాడు. ఇక మార్చి 30న రంగస్థలం విడుదల కానుంది. -
మోత మోగిపోద్ది
అందరికీ సౌండ్ వినపడుతుంది. కానీ నాకు మాత్రం కనపడుతుందండి అంటున్నాడు చిట్టిబాబు. అదేనండీ.. తనకు వినికిడి లోపం ఉన్న విషయాన్ని స్టైలిష్‌గా చెబుతున్నాడు. అంతేకాదండోయ్.. ఆ ఊరికి చిట్టిబాబే ఇంజనీర్. అందుకే అందరూ చిట్టిబాబును సౌండ్ ఇంజనీర్ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇదంతా ఓకే కానీ.. చిట్టిబాబుకు సౌండ్ వినిపించకపోయినా లిప్ మూమెంట్లో తేడా కనిపించిందో అంతే.. రీసౌండ్ మోత మోగిపోతుంది. అది ఏ రేంజ్లో అనేది తెరపై చూడండి అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రంగస్థలం’ టీజర్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నారు. ‘‘యూనిక్ క్యారెక్టరైజేషన్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్‌కి థ్యాంక్స్. షూటింగ్లో ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నాం’’ అని హీరో రామ్‌చరణ్ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీజర్లో రామ్‌చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గోదావరి యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. టీజర్ రిలీజైన ఆరు గంటల్లోపు 40 లక్షలు డిజిటల్ వ్యూస్ వచ్చాయని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. -
ఆన్ సెట్ ఎమోషన్.. ఆఫ్ సెట్ సెలబ్రేషన్
అది ‘రంగస్థలం’ సినిమా సెట్! హీరో రామ్‌చరణ్, ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్ అక్కడే ఉన్నారు. వీరందిరినీ డైరెక్టర్ సుకుమార్ చూస్తూనే ఉన్నారు. ఆయన స్టార్ట్ చెప్పారు. కానీ సీన్ అయినా కట్ చెప్పకుండా చెమర్చిన కళ్లతో చూస్తూ ఉండిపోయారు. యూనిట్ అందరి కళ్లల్లో కన్నీరు. చిట్టిబాబు (‘రంగస్థలం’లో రామ్‌చరణ్ పేరు) అయితే పట్టరాని దుఃఖంలో ఉన్నాడు. ఏమైంది? ఎందుకలా? అంటే.. ఈ సినిమాలో ఓ కీలకమైన సెంటిమెంట్ సీన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. ఈ హై ఎమోషన్ సీన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ పాట వస్తుంది. ఆ పాట, వీళ్ల వేదన చూస్తే ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఉందట. సీన్ నిజం కాదని తెలిసినా.. లొకేషన్లో అందరూ ఎమోషనల్ అయ్యారంటే.. రేపు థియేటర్లో ప్రేక్షకుల కళ్లు చెమర్చకుండా ఉండవు. ఆన్ సెట్ ఎమోషన్ అయినా ఆఫ్ సెట్ మాత్రం ఈ యూనిట్ సెలబ్రేషన్ మూడ్‌లోనే ఉంటున్నారు. నవీన్, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
తప్పెట మోత.. చిట్టిబాబు ఆట
ఊరు హోరేత్తేలా తప్పెట మోత మోగుతుంది. గుండెలు ఝల్లుమనేలా గజ్జెలు గల్లు గల్లుమంటున్నాయి. అక్కడికి చిట్టిబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్ట్స్ ఏంటి?... అంటే ప్రస్తుతానికి ఇంతే. బ్యాలెన్స్ వెండితెరపై చూస్తే ఫ్యాన్స్ ఈల కొట్టి గోల పెట్టడం ఖాయం అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ మంగళవారం మొదలైంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో తప్పెట డ్యానర్స్ పాల్గొంటున్నారు. ‘‘రంగస్థలం’ సెట్లో మళ్లీ ఫోక్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. మా సినిమాలోని తప్పెట డ్యాన్సర్స్‌ను మీట్ అవ్వండి’’ అని మీరు చూస్తున్న ఫొటోను రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం తప్పెట ఆటగాళ్లను వెస్ట్ గోదావరి నుంచి పిలిపించాం. కథలో కీలకమైన ఎపిసోడ్లో ఈ సీన్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలిసిందే. మార్చి 30న చిత్రం విడుదల కానుంది. -
ఫస్ట్ లుక్ : రామ్ చరణ్ రంగస్థలం
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ గెటప్.. లుంగీ అవతార్‌లో చిందులేస్తున్న రామ్ చరణ్ పోస్టర్‌ను మేకర్లు వదిలారు. చిట్టిబాబు పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడు. అంతేకాదు చిత్ర విడుదలపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పెట్టేశారు. మార్చి 30న చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుందని ప్రకటించేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తుండగా.. ఆదిపినిశెట్టి, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. #RangasthalamFirstLook 🕺 pic.twitter.com/ywDSA8e13r — Mythri Movie Makers (@MythriOfficial) December 9, 2017 -
తక్కువగా మాత్రం చూసుకోను
‘మీ అమ్మానాన్నలకంటే ఎక్కువగా చూసుకుంటానో లేదో తెలీదు కానీ.. తక్కువగా మాత్రం చూసుకోను’ అంటూ ప్రారంభమయ్యే ‘కన్నుల్లో నీ రూపమే’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నందు, తేజస్వీ ప్రకాశ్ జంటగా బిక్స్ ఇరుసడ్లను దర్శకునిగా పరిచయం చేస్తూ భాస్కర్ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. అనంతరం బిక్స్ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. యువతకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నా మాకు టైమ్ కేటాయించి మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ట్రైలర్ చూసి మమ్మల్ని ఆశీర్వదించడం మా టీమ్‌కు మరింత ఆనందంగా ఉంది. సాకేత్ సంగీతం సినిమాకి ప్లస్. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కొమండూరి, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి, పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి, కాసర్ల శ్యామ్. -
నేను డైరెక్టర్ అవుతానని ఆరోజే అన్నాడు – సుకుమార్
‘‘నేను డైరెక్టర్ కాకుముందు ‘మీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవుతానంటూ’ ఓ అబ్బాయి వచ్చాడు. నేనే ఇంకా డైరెక్టర్ కాలేదు.. నాకు అసిస్టెంటా? అన్నా. మీరు తప్పకుండా డైరెక్టర్ అవుతారని ఆరోజు అన్నాడు. నేను డైరెక్టర్ అయిన తర్వాత నా దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయే అజయ్ వోధిరాల. తను దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నవీన్ చంద్ర, నివేథా థామస్ జంటగా అజయ్ వోధిరాల దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్’. కొత్తపల్లి అనురాధ సమర్పణలో కొత్తపల్లి ఆర్. రఘుబాబు, కె.బి. చౌదరి నిర్మిస్తున్నారు. రతీస్ వేగ స్వరాలందించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని సుకుమార్ రిలీజ్ చేశారు. నవీన్ చంద్ర మాట్లాడుతూ– ‘‘అజయ్‌గారు చాలా మొండోడు. షాట్ బాగా వచ్చే వరకు ఒప్పుకోరు. సినిమాపై ఉండే ప్యాషన్‌తో నిర్మాతలు ఈ మూవీ నిర్మించారు. రతీస్ వేగ మంచి పాటలిచ్చారు. నివేథాతో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు. ‘‘మా సినిమా ప్రారంభం నుంచి సుకుమార్‌గారు ఎంతో సహకారం అందిస్తున్నారు. నవీన్ చంద్ర కథను నమ్మి, ఎంతో సపోర్ట్ చేశారు. అజయ్‌గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు’’ అన్నారు కొత్తపల్లి ఆర్. రఘుబాబు. ‘‘నేనీ స్థాయికి రావడానికి కారణమైన నా కుటుంబ సభ్యులకు, సినిమా మేకింగ్‌లో సహకారం అందించినవారికి కృతజ్ఞతలు’’ అన్నారు అజయ్ వోధిరాల. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్‌చంద్ర తల్లి రాజేశ్వరి, నిర్మాతలు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, విజయ్ బండ్రెడ్డి, పాటల రచయిత రామజోగయ్యశాస్తి, నటి ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవితేజ, లైన్ ప్రొడ్యూసర్: సురేశ్ కొండవీటి. -
సుకుమార్ నిర్మాణంలో తమిళ సినిమా
లెక్కల మాస్టారు సుకుమార్ తీసిన రొమాంటిక్ డ్రామా... 100% లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. కేవలం చదువు తప్ప మరేమీ తెలియని బాలు, అతడి మరదలి పాత్రలో తమన్నా చేసిన ఈ సినిమా ఇప్పుడు తమిళంలోకి రీమేక్ అవుతోంది. మరి తమిళ సినిమాలో సుకుమార్ పాత్ర ఏంటా అని చూస్తున్నారా.. పక్కా కాకినాడ కుర్రోడయిన ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించట్లేదు.. నిర్మాతగా వ్యవహరిస్తున్నారట. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ సినిమాలో లీడ్‌రోల్ పోషిస్తున్నాడు. ఈ వివరాలన్నింటినీ ప్రకాషే ట్వీట్ చేశాడు. తెలుగు దర్శకుడు సుకుమార్ తన తదుపరి సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని చెప్పాడు. 100% లవ్ సినిమాను రీమేక్ చేస్తున్నారని, చెన్నై ఎక్స్‌ప్రెస్, దిల్వాలే లాంటి సినిమాలకు పనిచేసిన డూడ్లీ.. ఈ సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా ఉంటారని కూడా చెప్పాడు. మొత్తానికి ఇన్నాళ్లూ మెగాఫోన్ పట్టుకుని యాక్షన్.. కట్ చెప్పిన మన లెక్కల మాస్టారు నిర్మాతగానూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే కుమార్ 21ఎఫ్ సినిమాతో నిర్మాతగానూ సూపర్ హిట్ కొట్టిన సుక్కు, త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న దర్శకుడు సినిమాకు నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు కోలీవుడ్ లోనూ నిర్మాతగా తొలి అడుగు వేస్తున్నాడు. Yes telugu director Sukumar is producing my next . 100% love remake . Dir chandramouli . Dop dudely (chennai express , dilwale ) #100%love pic.twitter.com/nh87ToN5L0 — G.V.Prakash Kumar (@gvprakash) 5 May 2017