
‘రంగస్థలం‘ సూపర్ హిట్‌తో మాంచి ఫామ్‌లో ఉన్నారు డైరెక్టర్ సుకుమార్. ‘భరత్ అనే నేను’ సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ బాబు. వీరిద్దరూ కలిసి మరోసారి సినిమా చేయబోతున్నారు. ‘1 నేనొక్కడినే’ తర్వాత వన్స్‌మోర్ ఈ కాంబినేషన్ సెట్ అయింది. మహేశ్ 26వ చిత్రంగా ఈ సినిమా రూపొందనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
‘శ్రీమంతుడు’ తర్వాత మహేశ్, ‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ మైత్రీ మూవీస్ బ్యానర్‌లో రెండోసారి చేస్తుండటం విశేషం. సో.. ఈ హిట్ కాంబినేషన్ కూడా వన్స్‌మోరే. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లి, 2019లో విడుదల కానుంది. ‘1 నేనొక్కడినే’ సినిమాతో ప్రయోగం చేసిన మహేశ్–సుక్కు కాంబినేషన్ ఈసారి ఎలాంటి సినిమా చేస్తారో? అనే ఆసక్తి ఇటు చిత్రవర్గాల్లో అటు మహేశ్ అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment