అలీగారికి పెద్ద అభిమానిని | Ali Pandugadi Photo Studio Movie Trailer launch | Sakshi
Sakshi News home page

అలీగారికి పెద్ద అభిమానిని

Published Sat, Jul 13 2019 5:47 AM | Last Updated on Sat, Jul 13 2019 5:47 AM

Ali Pandugadi Photo Studio Movie Trailer launch - Sakshi

దిలీప్‌ రాజా, సుకుమార్, అలీ, సాంబిరెడ్డి

‘‘అలీ గారికి  నేను పెద్ద అభిమానిని. ఆయన వినోదాన్ని చాలామంది దర్శకులు ఇష్టపడతారు. ‘పండుగాడి ఫోటో స్టూడియో’తో  హీరోగా ఆయన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నారు. ఒక స్టార్‌ హీరోలా అలీగారిని దర్శకుడు ఈ చిత్రంలో చూపించారు’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. అలీ హీరోగా దిలీప్‌ రాజా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పండుగాడి ఫోటో స్టూడియో’. పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను సుకుమార్‌ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రెండు సంవత్సరాలు కథ తయారు చేసుకుని దిలీప్‌ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సాంబిరెడ్డిగారికి 22 విద్యాలయాలున్నాయి. చక్కటి అభిరుచితో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. జంధ్యాల మార్కు కామెడీతో ఈ సినిమా అందర్నీ అలరించనుంది’’ అన్నారు. దిలీప్‌ రాజా మాట్లాడుతూ– ‘‘జంధ్యాలగారి ఫొటోకి నమస్కరించి ఈ సినిమా ప్రారంభించాం. ఇందులో పాత్రలు విలక్షణంగా, నటీనటుల పేర్లు వైవిధ్యంగా ఉంటాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవించడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను తెనాలిలో ఈ నెల 21న నిర్వహించనున్నాం’’ అన్నారు. అలీ, గుదిబండి వెంకట సాంబిరెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: ప్రదీప్‌ దోనెపూడి, మన్నె శివకుమారి, సంగీతం: యాజమాన్య, కెమెరా: మురళీమోహన్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement