క్రేజీ కాంబినేషన్‌ | Vijay Devarakonda Teams Up With Sukumar Next | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌

Published Tue, Sep 29 2020 6:18 AM | Last Updated on Tue, Sep 29 2020 6:18 AM

Vijay Devarakonda Teams Up With Sukumar Next - Sakshi

విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ సుకుమార్‌

హీరో విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ సుకుమార్‌ కలయికలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ రాబోతోంది. కేదార్‌ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. ఫాల్కన్‌ క్రియేషన్‌స ఎల్‌ఎల్‌పి పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కేదార్‌ సెలగంశెట్టి ఈ ప్రాజెక్టును ప్రకటించి, మాట్లాడుతూ– ‘‘నాకెంతో ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, సుకుమార్‌గార్లతో నా మొదటి సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. వీరి కాంబినేషన్‌ అనగానే చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వాళ్ల శైలిలోనే ఈ సినిమా ఉంటుంది. ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందించనున్నాం. 2022లో సినిమా మొదలవుతుంది. సినిమాల మీద ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చాను. భవిష్యత్‌లో వరుసగా సినిమాలు చేస్తాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement