‘ఎంత బావుందో.. పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా... గుప్పెడు గుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది.. పైకే చెప్పనంటోంది.. హాయో.. మాయో అంతా కొత్తగా ఉంది.. అయినా ఇదే బాగుంది.. బహుశా ఎదురుపడనంది’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నారు మధునందన్. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్ అయిన మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’.
వంశీధర్ దర్శకత్వంలో క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప నిర్మిస్తున్నారు. స్వాతిష్ట కృష్ణన్ , శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఎంత బావుందో...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తాజాగా విడుదలైన ‘ఎంత బావుందో..’ మెలోడీకి కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆలపించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: రవి వర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్.
చదవండి: ఆస్కార్‌లో మన సినిమా
Comments
Please login to add a commentAdd a comment