రౌడీ హీరో బర్త్‌ డే అప్‌డేట్‌.. కొత్త మూవీకి డైరెక్టర్‌ ఎవరంటే? | Tollywood Hero Vijay Devarakonda Latest Movie Update On His Birthday, Poster Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..'

Published Thu, May 9 2024 10:35 AM | Last Updated on Thu, May 9 2024 1:15 PM

Tollywood Hero Vijay Devarakonda Latest Movie Update On Birthday

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ బర్త్‌ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రముఖ నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించనున్నారు. ఈ బ్యానర్‌లో వస్తోన్న 59న చిత్రం ఇది నిలవనుంది.

ఈ సినిమాను భారీస్థాయిలో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 'రాజా వారు.. రాణి గారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్‌ చూస్తే ఫుల్ మాస్‌ యాక్షన్‌ చిత్రంగా కనిపిస్తోంది. 'కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే..' అనే క్యాప్షన్‌ చూస్తేనే సినిమా కథంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు ప్రకటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement