Rashmika Mandanna Comments About Next Movie With Vijay Deverakonda - Sakshi
Sakshi News home page

ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక

Published Tue, Apr 27 2021 10:58 AM | Last Updated on Tue, Apr 27 2021 1:11 PM

Rashmika Clarity On Pair Up With Vijay Devarakonda  - Sakshi

‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. దీంతో ఈ క్యూట్‌ పెయిర్‌కు  సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇద్దరికి దాదాపు ఒకే సమయంలో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఒకనొక దశలో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడుస్తుందనే పుకార్లు వచ్చినా తమ మధ్య ప్రేమ, దోమ ఏదీ లేదని, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరి మధ్య వచ్చే రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడలేదు.

ఇక డియర్‌ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు ఇంత వరకు కలిసి నటించలేదు. దీంతో ఈ విజయ్‌-రష్మిక కాంబినేషన్‌ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన రష్మికను అభిమానుల నుంచి సేమ్‌ క్వశ్చన్‌ రిపీట్‌ అయ్యింది. విజయ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారంటూ పలువురు నెటిజన్లు ఆమెను ప్రశ్నించగా..'ఈ విషయాన్ని మీరు డైరెక్ట్‌గా విజయ్‌నే అడగండి.. మంచి స్ర్కిప్ట్‌ వస్తే ఇద్దరం తప్పకుండా నటిస్తాం' అంటూ ఈ కన్నడ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది.

ఇక వరుస ఆఫర్లతో బిజీ అయిన రష్మిక బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా మరో మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక ఇన్‌స్టా లైవ్‌లో వెల్లడించింది. త్వరలోనే ఈ మూవీ అప్‌డేట్స్‌ ప్రకటిస్తానని పేర్కొం‍ది. దీంతో బాలీవుడ్‌లోనూ దూసుకుపోతుంది. రెండు హిట్లు పడితే తప్పకుండా అక్కడ కూడా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్‌ తెగ సంతోష పడుతున్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement