నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ దీనిపై స్పందించకుండా కామ్‌గా ఉంటున్నారు. సమయం వచ్చినప్పడు తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని విజయ్ అంటున్నాడు.
(చదవండి: యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి పోతారంటూ సెటైర్.. నాగవంశీ రిప్లై ఇదే!)
ఇక రష్మిక అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచననే లేదని చెబుతోంది. కానీ వీరిద్దరు వెకెషన్ ట్రిప్ వెళ్లడం..అక్కడ కెమెరాకు చిక్కడం..ఆ ఫోటోలు వైరల్ అవడం జరుగుతూనే ఉంది. అయితే అఫిషియల్‌గా మాత్రం ఎక్కడా బయటపెట్టట్లేదు. తాజాగా యంగ్ ప్రొడ్యుసర్ నాగవంశీ రష్మిక ప్రేమాయణం గురించి స్పందించాడు.
(చదవండి: దర్శకుడి చేతిలో ‘ప్రేమలు’ బ్యూటీ చెంప దెబ్బలు.. నిజమెంత?)
రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసని చెప్పాడు. ప్రస్తుతం రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ లో నాగ వంశీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నువ్వు చెప్పకపోయినా ఆ తెలుగు హీరో మాకు తెలుసు’, ‘రష్మిక లవ్ చేస్తున్నది విజయ్ దేవరకొండనే’, ‘ఈ ఏడాదిలో రష్మిక- విజయ్‌ల పెళ్లి జరగాలి కోరుకుంటున్నాను’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment