Suryadevara Naga Vamsi
-
హీరోయిన్గా బ్రాహ్మణికి ఆఫర్.. కానీ, నో చెప్పింది: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఇప్పటికే టికెట్స్ ప్రీ సేల్ ప్రారంభం అయింది. కేవలం ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో నాలుగు వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అమెరికాలోని 125 లోకేషన్స్‌లలో 350 షోలు ఫస్ట్ డే పడనున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బాలయ్య వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ లో చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు తమన్ , నిర్మాత నాగవంశీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై తన పెద్ద కూతురు బ్రాహ్మిణి గురించి ఆయన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.అన్‌స్టాపబుల్ సీజన్ 4లో బాలయ్యకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీ ఇద్దరి అమ్మాయిల్లో ఎవరిని గారాబంగా పెంచారు' అని తమన్ అడిగారు. అందుకు సమాధానంగా వారిద్దరినీ చాలా గారాబంగానే పెంచానంటూ ఆయన అన్నారు. ఈ క్రమంలో బ్రాహ్మిణికి మణిరత్నం నుంచి వచ్చిన సినిమా ఛాన్స్‌ను ఆయన గుర్తు చేసుకున్నారు. 'గతంలో ఒక సినిమా కోసం హీరోయిన్గా బ్రాహ్మణి నటిస్తారా అని మణిరత్నం గారు నన్ను అడిగారు. సరే అని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పాను. నా ముఖం అంటూ సమాధానమిచ్చి వెళ్లిపోయింది. అవునూ.. నీ ఫేస్ కోసమే అడుగుతున్నారని మళ్లీ చెప్పాను. ఫైనల్‌గా తనకు అలాంటి ఆసక్తి లేదని చెప్పేసింది. అయితే, తేజస్విని మాత్రం ఇంట్లో అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటూ నటించేది. ఆ సమయంలో తనైనా నటిగా వస్తుందని ఆశించాను. ఇప్పుడు ఈ షో కోసం ఆమె క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తుంది. ఇంట్లో నేను ఎక్కువగా భయపడేది మాత్రం బ్రాహ్మిణికే' అని బాలయ్య అన్నారు.దేవిశ్రీ ప్రసాద్ కంటే తమన్ సంగీతం అంటే చాలా ఇష్టమని అదే వేదికపై బాలకృష్ణ అన్నారు. దర్శకులలో బాబీ, బోయపాటి శ్రీను ఇద్దరూ ఇష్టమేనని ఆయన తెలిపారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు అమెరికాలో జరగనుంది. అక్కడే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. -
ఎలా గౌరవించాలో మీరు నేర్పించనక్కర్లేదు.. బాలీవుడ్‌కు నాగవంశీ కౌంటర్
బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియా.. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న చర్చ! తాజాగా ఇదే అంశంపై నిర్మాతల రౌండ్ టేబుల్లో తెలుగు నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi), హిందీ ప్రొడ్యూసర్ బోనీకపూర్ (Boney Kapoor) మాట్లాడారు. దక్షిణాది ఇండస్ట్రీ బాలీవుడ్‌పై ప్రభావం చూపించిందని, కానీ హిందీ చిత్ర పరిశ్రమ మాత్రం ముంబైకే పరిమితమైందని సెటైర్లు వేశాడు. అది బోనీకపూర్ ఒప్పుకోలేదు. 'రష్యాలో ఇప్పటికీ రాజ్‌కపూర్‌ను గుర్తు చేసుకుంటారు. ఈజిప్టుకు వెళ్లినప్పుడు కూడా అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఎగతాళి చేస్తున్నారేంటి?షారూఖ్, బిగ్‌బీకి 'ద కింగ్ ఆఫ్ మొరాకో' అన్న బిరుదు ఇచ్చారు'.. అని బోనీ చెప్పుకుంటూ పోతుండగా కూడా మధ్యలో నాగవంశీ కలగజేసుకున్నాడు. అతడిని పూర్తిగా చెప్పనివ్వకుండా మధ్యలో దూరడంపై బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ సంజయ్ గుప్తా మండిపడ్డాడు. బోనీగారిని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అని ఎక్స్ (ట్విటర్) వేదికగా ఫైర్ అయ్యాడు. అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి సీనియర్ నిర్మాతల ముందు ఇలా దర్జాగా కూర్చుని ముఖానికి వేళ్లు చూపిస్తూ మాట్లాడే దమ్ముందా? అని ప్రశ్నించాడు.బాలీవుడ్ అక్కడే ఆగిపోయిందిబాలీవుడ్ సినీ విశ్లేషకులు సుమిత్ సైతం ఈ వివాదంపై స్పందిస్తూ నాగవంశీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తెలుగు చిత్రపరిశ్రమ పాన్ ఇండియా ట్రెండ్‌ను పరిచయం చేసిందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ ఇంకా మసాలా సినిమాల్నే నమ్ముకుంటూ ఎక్కడో ఆగిపోయింది. కానీ ఇక్కడ బోనీకపూర్ గారిని అగౌరవపర్చడం అనవసరం. చెప్పాలనుకున్నదేదో మర్యాదగా చెప్పుంటే అయిపోయేది. ఎంతోమంది దక్షిణాది ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు, హీరోలు హిందీ సినిమాపై ఎనలేని ప్రేమ చూపిస్తారు.విమర్శ తప్పు కాదు, కానీ!అమితాబ్, ప్రకాశ్ మెహ్రా, యష్ చోప్రా, మన్మోహన్ దేశాయ్ వంటి గొప్పవాళ్ల సినిమాలను ఆదర్శంగా తీసుకునే కమర్షియల్ సినిమాలు తీస్తున్నామని చెప్తుంటారు. సౌత్ సినిమాల కలెక్షన్స్‌లో హిందీ బాక్సాఫీస్ ప్రధాన పాత్ర పోషిస్తుందని మర్చిపోవచ్చు. విమర్శ తప్పనడం లేదు, కానీ అవమానించడం మాత్రం తప్పే! ఇలా యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి వెళ్లిపోతారు జాగ్రత్త! ఇది ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది అని ట్వీట్ చేశాడు.మీరు నేర్పించనక్కర్లేదుదీనికి నిర్మాత నాగవంశీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పెద్దవారిని ఎలా గౌరవించాలనేది నువ్వు నేర్పించనక్కర్లేదు. బోనీగారిని మీకంటే ఎక్కువే గౌరవిస్తాం. ఆ చర్చలో ఎక్కడా బోనీని అగౌరవపర్చలేదు. మేమంతా ఎంతో బాగా మాట్లాడుకున్నాం, నవ్వుకున్నాం. ఇంటర్వ్యూ అయ్యాక ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకున్నాం. కాబట్టి నువ్వు చూసినదాన్ని బట్టి అదే నిజమని డిసైడ్ అయిపోకండి అని రాసుకొచ్చాడు. You don’t need to teach us how to respect elders, we respect boney ji more than u guys do and there was no disrespect towards boney ji in that conversation it was a healthy discussion, me and boney ji had a nice laugh and hugged each other after the interview… So please dont…— Naga Vamsi (@vamsi84) December 31, 2024 చదవండి: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్.. ప్రభాస్ ఎక్కడంటే..? -
తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొన్నాళ్లుగా నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. అయితే అటు రష్మిక కానీ, ఇటు విజయ్ కానీ దీనిపై స్పందించకుండా కామ్‌గా ఉంటున్నారు. సమయం వచ్చినప్పడు తన ప్రేమ, పెళ్లి విషయాలు బయటపెడతానని విజయ్ అంటున్నాడు. (చదవండి: యాటిట్యూడ్ చూపిస్తే పాతాళంలోకి పోతారంటూ సెటైర్.. నాగవంశీ రిప్లై ఇదే!)ఇక రష్మిక అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచననే లేదని చెబుతోంది. కానీ వీరిద్దరు వెకెషన్ ట్రిప్ వెళ్లడం..అక్కడ కెమెరాకు చిక్కడం..ఆ ఫోటోలు వైరల్ అవడం జరుగుతూనే ఉంది. అయితే అఫిషియల్‌గా మాత్రం ఎక్కడా బయటపెట్టట్లేదు. తాజాగా యంగ్ ప్రొడ్యుసర్ నాగవంశీ రష్మిక ప్రేమాయణం గురించి స్పందించాడు. (చదవండి: దర్శకుడి చేతిలో ‘ప్రేమలు’ బ్యూటీ చెంప దెబ్బలు.. నిజమెంత?)రష్మిక లవ్ మేటర్ తనకు తెలుసని చెప్పాడు. ప్రస్తుతం రష్మిక ఓ తెలుగు హీరోతో ప్రేమలో ఉందని, అతన్నే పెళ్లి చేసుకుంటుందని చెప్పాడు. బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ లో నాగ వంశీ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నువ్వు చెప్పకపోయినా ఆ తెలుగు హీరో మాకు తెలుసు’, ‘రష్మిక లవ్ చేస్తున్నది విజయ్ దేవరకొండనే’, ‘ఈ ఏడాదిలో రష్మిక- విజయ్‌ల పెళ్లి జరగాలి కోరుకుంటున్నాను’ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. -
బాలీవుడ్‌పై నాగవంశీ అలాంటి కామెంట్స్.. బోనీ కపూర్ ఏమన్నారంటే?
టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ సినిమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాజాగా నిర్వహించిన నిర్మాతల రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ కేవలం బాంద్రా, జుహుకు మాత్రమే పరిమితమైందని నాగవంశీ అన్నారు. దక్షిణాది ప్రేక్షకులు బాలీవుడ్ చిత్రాలను చూసే విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, యానిమల్, జవాన్ చిత్రాలతో ఆ మార్పును చూశామని అన్నారు.అయితే నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్‌పై బాలీవుడ్ డైరెక్టర్ బోనీకపూర్ స్పందించారు. దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉందన్నారు. అలాగే తెలుగు సినిమాలకు యూఎస్‌లో ప్రత్యేకమైన మార్కెట్ ఉంది.. అంతేకాకుండా తమిళ చిత్రాలకు సింగపూర్, మలేషియాలో డిమాండ్ ఉందని తెలిపారు. గల్ఫ్ దేశాలతో పోలిస్తే యూఎస్ పెద్ద మార్కెట్ అని బోనీ కపూర్ అన్నారు. అయితే మలయాళ సినిమాకు గల్ఫ్‌లో భారీ మార్కెట్ ఉందని నాగవంశీ అన్నారు.అయితే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ముంబయికే పరిమితమైందన్న నాగవంశీ కామెంట్స్‌ను బోనీ కపూర్ వ్యతిరేకించారు. పుష్ప- 2 హీరో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్‌కి పెద్ద అభిమానిని అని చెప్పిన విషయాన్ని బోనీకపూర్ గుర్తు చేశారు. అంతేకాకుండా తాను సీనియర్ ఎన్టీఆర్‌కు బిగ్ ఫ్యాన్ అని అన్నారు. దీనికి స్పందిస్తూ.. తాను షారూఖ్, అల్లు అర్జున్, చిరంజీవికి పెద్ద అభిమానినని నాగవంశీ అన్నారు.ఇటీవల మీడియాతో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన విషయాన్ని బోనీ కపూర్ గుర్తు చేశారు. సినిమాకు భాష అడ్డంకి కాదు.. తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కన్నడ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఈరోజు మరాఠీ సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేస్తున్నాయని బోనీకపూర్ తెలిపారు. మరాఠీ సినిమా ఈ తరహా బిజినెస్ చేస్తుందని ఎవరూ ఊహిందలేదన్నారు. -
అల్లు అర్జున్ తర్వాతి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు
పుష్ప2 విజయంతో అంతర్జాతీయస్థాయిలో అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఆయన మార్కెట్ కూడా మరింత పెరిగింది. అయితే, అల్లు అర్జున్- త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. వీరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ ఇద్దరి కాంబోలో నాలుగో సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ వివరాలు తాజాగా నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు.డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిర్మాత నాగవంశీ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా గురించి ఆయన పలు విషయాలు చెప్పారు. 2025లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో బన్నీ పాత్రకు సంబంధించిన గెటప్ ఎలా ఉండాలో వారిద్దరూ కూర్చుని ఫైనల్ చేయనున్నారన్నారు.'పుష్ప2తో అల్లు అర్జున్ ఇమేజ్ మారిపోయింది. అందుకు సరిపోయేలా ఈ ప్రాజెక్ట్ భారీ రేంజ్‌లోనే ఉంటుంది. బన్నీ, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన గత చిత్రాలను మించే కథతో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఓస్టూడియోను నిర్మిస్తున్నాం. అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ పార్ట్ చాలా ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఇది పాన్ ఇండియా మొదటి సినిమా. అందుకే త్రివిక్రమ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌ను రెడీ చేశారు.' అని ఆయన అన్నారు.ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. జనవరిలో స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 మార్చి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారని. ఆయన కూడా టచ్ చేయని జానర్లో ఈ సినిమా ఉంటుందని గతంలోనే నాగవంశీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటివరకు దేశంలో ఎవరూ చూడని కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నట్లు కూడా ఆయన అన్నారు. 2026లో ఈ సినిమా విడుదల కానుంది. -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో సినీ ప్రముఖులు
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, చిత్ర పరిశ్రమల మధ్య దూరం పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రముఖ నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగు సినీ ప్రముఖులు కలుస్తారని ఆయన తెలిపారు. బాలకృష్ణ- బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'డాకు మహారాజ్' ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.సంధ్య థియేటర్ ఘటనతో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచడం వంటివి ఉండవని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు కదా.. మరీ మీరు నిర్మించిన డాకు మహారాజ్ పరిస్థితి ఏంటి అని నాగవంశీని ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమెరికాలో ఉన్నారు. గేమ్ ఛేంజర్ ప్రమోషన్ కార్యక్రమం నుంచి ఆయన హైదరాబాద్‌కు తిరిగొచ్చాక సీఎంను కలుస్తాం. ఆ సమయంలో టికెట్ ధరల పెంపుతో పాటు ప్రీమియర్ షోలపై చర్చ చేస్తామని ఆయన అన్నారు. నా సినిమా డాకు మహారాజ్ కంటే ముదే దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ విడుదల అవుతుంది. కాబట్టి, టికెట్ల ధరల విషయంలో ఆయన ఏం తేలుస్తారో అందరికీ అదే వర్తిస్తుంది' అని నాగవంశీ అన్నారు. తాము కూడా అన్ని సినిమాలకు టికెట్ ధరలు పెంచమని అడగమన్నారు. ఏ సినిమాకు అయితే టికెట్ ధర పెంపు అవసరమో వాటికి మాత్రమే అడుగుతామని వంశీ అన్నారు.ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లతో సినీ ప్రముఖుల భేటీ గురించి తనకు తెలియదని నాగవంశీ తెలిపారు. ఇండస్ట్రీ ఏపీకి తరలి వెళ్లిపోతుందని టాక్ వినిపిస్తోంది కదా..? అనే ప్రశ్నకు ఆయన ఇలా అన్నారు. 'నేను చాలా డబ్బులు పెట్టి హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకున్నా.. అలాంటప్పుడు మరోచోటకు ఎందుకు వెళ్తాను. ఏపీ, తెలంగాణ ఇరు రాష్ట్రాల సపోర్ట్ ఇండస్ట్రీకి వుంది.' అని ఆయన అన్నారు. -
చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ
ఎప్పటికప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేసే నిర్మాత నాగవంశీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు తనని తిట్టుకున్నా పర్లేదని అన్నారు. ఇదంతా కూడా బాలకృష్ణ 'డాకు మహారాజ్' మూవీ ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ సంగతేంటి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)బాలకృష్ణ 'డాకు మహరాజ్'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ప్లాన్ చేశారు. మరో ఈవెంట్ విజయవాడలో నిర్వహిస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. ఇతడి గత చిత్రం 'వాల్తేరు వీరయ్య'. గతేడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ.. హిట్ అయింది.అయితే బాబీ.. 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' సినిమాని బాగా తీశారని నిర్మాత నాగవంశీ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ తనని తిట్టుకున్నా పర్లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాతే కాదు గతంలో దర్శకుడు బాబీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు-బాలయ్యతో సినిమాలు చేయడం గురించి చెప్పారు. చిరంజీవి అయితే స్ట్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తారని, బాలకృష్ణ మాత్రం డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోతారని అన్నాడు. అప్పుడు బాబీ.. ఇప్పుడు నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: సన్నీ లియోన్ పేరిట మోసం) -
నా సినిమా అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తాయి: నిర్మాత నాగవంశీ
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.అయితే ఇవాళ జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు బ్లాక్స్ వేరే లెవల్లో ఉంటాయని అన్నారు. ఇంటర్వెల్ సీన్ బాలయ్య సీన్ మామాలుగా ఉండదని..టీజర్ కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి చూపించామని నాగవంశీ వెల్లడించారు.(ఇది చదవండి: బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్)ఆ తర్వాత సంక్రాంతి రేస్, నాగవంశీ సినిమాల విడుదల డేట్స్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ఏడాది గుంటూరు కారం, అలాగే లక్కీ భాస్కర్ సినిమా విడుదల సమయంలో మీకు పోటీగా ఏదైనా సింపతి కార్డ్ సినిమా వస్తోందా? అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? దీనిపై మీరేమంటారని నాగవంశీని అడిగారు.దీనికి ఆయన స్పందిస్తూ..' ఈ ప్రశ్న అడిగిన మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా సినిమా టైమ్‌లోనే ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు. అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తున్నాయి. ఇకనుంచి నేను కూడా ఏదైనా కష్టాలు వెతుక్కోవాలి. వచ్చే సంక్రాంతికి మేము కూడా సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి' అంటూ సరదాగానే మాట్లాడారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారంతో పాటు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హనమాన్, నాసామిరంగ, సైంధవ్ చిత్రాలు సందడి చేశాయి. ఈ పోటీలో హనుమాన్ హిట్‌గా నిలిచింది. ఇటీవల దీపావళీ సందర్భంగా లక్కీ భాస్కర్‌తో కిరణ్ అబ్బవరం క మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.Memu Kooda Ee Sankranthiki edho Oka Sympathy Card tho Raavali.- #NagaVamsi Mass at #DaakuMaharaj title teaser eventpic.twitter.com/NsTps1FrRp— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
'ఇంతకంటే పెద్ద హిట్ ఎవరైనా తీయగలరా?'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
సీతారామం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు మీడియా మిత్రులకు ఆయన పార్టీ ఇస్తానని మాటిచ్చారు. లక్కీ భాస్కర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా నాగవంశీ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ రివ్యూ గానీ.. నెగెటివ్ కామెంట్ కానీ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తానన్నారు.తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. లక్కీ భాస్కర్లో ఎవరూ ఒక్క నెగెటివ్ పాయింట్‌ను పట్టుకోలేకపోయారని అన్నారు. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎవరూ కూడా చేయలేకపోయారు. ఇంతకంటే పెద్ద ఎవరైనా కొడతారా? అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇప్పుడు మీకు తప్పును పట్టుకోలేకపోయిందుకు పార్టీ ఇవ్వాలని ఫన్నీగా కామెంట్స్ చేశారు. కాగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
'లక్కీ భాస్కర్' అలాంటి సంతృప్తిని కలిగించింది: నాగవంశీ
ప్రతి ఏడాది చాలా సినిమాలు రిలీజ్ చేస్తుంటాం. అయితే వాటిలో కొన్ని మాత్రమే మంచి సినిమాలు చేశామని సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సంతృప్తిని ‘లక్కీ భాస్కర్’కలిగించింది’ అని అన్నారు నిర్మాత నాగవంశీ. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’. మీనాక్షి చౌదరి హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత నాగవంశీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ‘లక్కీ భాస్కర్’ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. అందుకే ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాం. ప్రీమియర్లకు మంచి స్పందన వస్తుండటంతో, షోల సంఖ్య కూడా పెంచాం. టాక్ బాగా వస్తే, రేపు సినిమా చూసేవారి సంఖ్య మరింత పెరుగుతుంది. దాంతో మొదటిరోజు వసూళ్లు భారీగా వచ్చే అవకాశముంది.→ జయాపజయాలతో సంబంధం లేకుండా కొందరితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో సినీ ప్రయాణం కొనసాగుతుంది. దర్శకుడిగా వెంకీ అట్లూరిని మేము నమ్మాం. అందుకే ఆయనతో వరుస సినిమాలు చేస్తున్నాం.→ మనిషి డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు ఎంత దూరమైనా వెళ్తాడు అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. బ్యాంకింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ జానర్ లో ఉండే ఫ్యామిలీ సినిమా ఇది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆసక్తిని రేకెత్తిస్తూ నడుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభమైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులు భాస్కర్ పాత్రతో కలిసి ప్రయాణిస్తారు. భాస్కర్ అనే వ్యక్తి యొక్క జీవితం చుట్టూనే ప్రధానంగా ఉంటుంది ఈ చిత్రం.→ సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు భాస్కర్ గెలవాలని కోరుకుంటాడు. చూసే సాధారణ ప్రేక్షకులు భాస్కర్ పాత్రలో తమని తాము చూసుకుంటారు. కథానాయకుడు ఈ సినిమాలో ఎవరినీ మోసం చేయడం ఉండదు. తన తెలివి తేటలతోనే ఎదుగుతాడు.→ ఇది సందేశాత్మక చిత్రం కాదు. తెలుగులో వస్తున్న ఒక విభిన్న చిత్రం. కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ఫైట్స్ ఒకటే కాదు. ఫైట్స్ లేకుండానే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా నడుస్తుంది. సినిమా చూసి, ఒక మంచి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు.→ ఎడిటర్ నవీన్ నూలి ఏ సినిమా చూసి అంత తేలికగా సంతృప్తి చెందడు. అలాంటి నవీన్ సినిమా బాగుంది చూడమని చెప్పాడు. నాకు, త్రివిక్రమ్ గారితో సహా మా అందరికీ సినిమా బాగా నచ్చింది. అందరం సినిమా పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాం. -
వెంకీకి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుంది: నిర్మాత నాగవంశీ
'సీతారామం' సినిమా దెబ్బకు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇతడి లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే దాదాపు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఇప్పుడు 'అన్‌స్టాపబుల్' షోలో పాల్గొన్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తవగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు.గతవారమే 'అన్‌స్టాపబుల్' నాలుగో సీజన్ మొదలైంది. తొలి ఎపిసోడ్‌కి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు రెండో ఎపిసోడ్లో 'లక్కీ భాస్కర్' హీరోహీరోయిన్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ కనిపించారు.(ఇదీ చదవండి: 'జై హనుమాన్' నుంచి సడన్ సర్ప్రైజ్)కారు డ్రైవింగ్ స్పీడ్ గురించి బాలకృష్ణ.. 300 కిమీ వేగంతో నడుపుతానని దుల్కర్ చెప్పాడు. అలానే మాటల సందర్భంలో నిర్మాత నాగవంశీ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వెంకీ అట్లూరికి ఎప్పటినుంచో పూజా హెగ్డేపై కన్నుందని అన్నాడు. అలానే దిల్ రాజు.. చాలాసార్లు పింక్ ప్యాంట్ వేసుకుని వస్తున్నారని, అది వద్దని చెప్పాలనుందని నాగవంశీ అన్నారు.సినిమా సినిమాకు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అనే తెలుగు హీరో గురించి బాలకృష్ణ-నాగవంశీ మధ్య చర్చ జరిగింది. ఆ హీరో పేరు ఏంటనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉండిపోయింది. ప్రోమో చూస్తుంటే సరదాగానే అనిపించింది. ఎపిసోడ్ కూడా ఇలానే ఉంటే మంచి ఫన్ గ్యారంటీ.(ఇదీ చదవండి: హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో) -
కొత్త ప్రపంచాన్ని చూస్తారు.. బన్నీ-తివిక్రమ్ మూవీపై నిర్మాత కామెంట్
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత మూడేళ్లుగా ఈ సినిమాపైనే బన్నీ ఫోకస్ చేశాడు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా రోజుల కిందటే ప్రకటించారు. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ లాంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్మాత నాగవంశీ తన మాటలతో ఆ అంచనాలను మరింత పెంచేశాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బన్ని-త్రివిక్రమ్ మూవీపై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ‘ప్రస్తుతం త్రివిక్రమ్ తన ఫోకస్ అంతా ఈ సినిమాపైనే పెట్టాడు. స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. జనవరిలో ఓ స్పెషల్ ప్రోమోతో సినిమాను ప్రకటిస్తాం. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఓ కొత్త కథతో రాబోతున్నాం. రాజమౌళి సైతం ఇలాంటి జానర్‌ని టచ్ చేయలేదు. మంచి విజువల్స్ ఉంటాయి. దేశంలో ఎవరూ చూడని సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా సినిమా ఉంటుంది’అని చెప్పారు. నాగవంశీ మాటలతో బన్నీ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
'దేవర'కు భారీ లాభాలు.. గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన ప్రముఖ నిర్మాత
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదుచేసింది. ఈ చిత్రం విజయంతో హీరో ఎన్టీఆర్‌తో పాటు ఆయన అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. దేవర వల్ల భారీ లాభాలు రావడంతో వారందరూ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించిన ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 509 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు.దేవర విజయం వల్ల థియేటర్ ఓనర్ల నుంచి క్యాంటీన్ నిర్వాహకుల వరకు అందరూ లాభపడ్డారని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ గతంలో చెప్పారు. ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో పాటు తాను కూడా సంతోషంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. దేవర వల్ల చాలామంది లాభ పడ్డారని ఆయన అన్నారు. అయితే, ఈ సినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లతో కలిసి నాగవంశీ ఒక పార్టీ చేసుకున్నారు. ఈమేరకు వారందరూ దుబాయ్ వెళ్లారట. దేవర విజయంతో భారీ లాభాలు రావడం వల్ల చాలా ఆనందంతో దుబాయ్‌లో సెలబ్రేషన్స్ చేసుకున్నారట.వరల్డ్ వైడ్‌గా మూడు వారాల్లో దేవర సినిమాకు రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికీ దేవర కలెక్షన్ల విషయంలో 50 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు బాగానే రన్ అవుతున్నాయి. 183 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన దేవర.. ఆ మార్క్‌ను ఎప్పుడో అందుకున్నాడు. మూడు వారాలకే సుమారు రూ. 80 కోట్ల నెట్ కలెక్షన్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. -
'అన్నింటి కంటే చీప్ సినిమా టిక్కెట్స్ మాత్రమే'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
టాలీవుడ్లో సినిమా టిక్కెట్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నింటితో పోలిస్తే ఒక్క సినిమా రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. మూడు గంటల పాటు ఎంటర్టైన్ చేసేందుకు ఆ మాత్రం టిక్కెట్ రేట్ పెట్టలేరా అని ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఓ కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకెళ్తే కేవలం రూ.1500 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.దేవర సినిమాకు ఒక్క టికెట్ రూ.250 రూపాయలు అనుకుంటే నలుగురికి వెయ్యి రూపాయలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 దాకా అవుతుందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరలో మూడు గంటల పాటు ఎంటర్ టైన్మెంట్ అందించేది ఎక్కడా లేదన్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ ధరకు ఏక్కడైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చెప్పండి అని నాగవంశీ ప్రశ్నించారు.కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ దేవర కలెక్షన్స్ గురించి నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల సంతోషం కోసమే తాము కలెక్షన్స్ వెల్లడిస్తామని తెలిపారు. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా హ్యాపీ అని అన్నారు. కానీ డబ్బులు వచ్చాయని చెబుతుంటే కొందరు మాత్రం నమ్మడం లేదన్నారు. ఎప్పుడు కూడా వసూళ్ల విషయంలో అసత్యాలు ప్రచారం చేయలేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సైతం వసూళ్లపై ఫుల్ క్లారిటీ ఉన్నారని నాగవంశీ తెలిపారు.సినిమా టికెట్ రేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి...ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి కనీసం 1500 కూడా పెట్టలేరా అంటున్న నాగ వంశీ...VC: Great Andhra pic.twitter.com/UovWMmoJdi— Movies4u Official (@Movies4u_Officl) October 13, 2024 -
కోహినూర్ వజ్రం కోసం పోరాటం చేయనున్న సిద్దూ జొన్నలగడ్డ
దసరా సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా ప్రకటన వెలువడింది. ఈ మూవీకి 'కోహినూర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రెండు భాగాలుగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అయితే, మరోసారి సితార ఎంటర్టైన్మెంట్స్ కలయికలో ఈ సినిమా రానుంది. వీరి కాంబినేషన్లో ఇప్పటికే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ రెండు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా 'కోహినూర్'ను ప్రకటించారు.విజయదశమి శుభ సందర్భంగా, భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. "కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం" అనే సంచలన కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. ఈ మూవీని రవికాంత్ పేరెపు తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఆయన సిద్దూ జొన్నలగడ్డతో 'కృష్ణ అండ్ హిజ్ లీల' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ను రూపొందించారు. క్షణం వంటి వంటి కల్ట్ థ్రిల్లర్‌ను కూడా ఆయన డైరెక్ట్ చేశారు. అయితే, ఇప్పుడు, సిద్ధూ-రవికాంత్ కలిసి సరికొత్త కథాంశంతో సోషియో-ఫాంటసీ డ్రామాతో వస్తున్నారు. భద్రకాళి మాత మహిమగా నిలిచిన ఐకానిక్ కోహినూర్ వజ్రం సామ్రాజ్యవాదుల చేతికి చిక్కింది. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి యువకుడు సాగించే చారిత్రాత్మక ప్రయాణంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం 2026 జనవరిలో థియేటర్లలో అడుగుపెట్టంనుందని ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. -
'కలెక్షన్స్ వచ్చాయని చెబుతున్నా నమ్మట్లేదు'.. దేవరపై నాగవంశీ కామెంట్స్
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.అయితే దేవర కలెక్షన్స్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఫ్యాన్స్ కోసమే మేము పెద్ద హీరోల సినిమాల వసూళ్లపై పోస్టర్స్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అభిమానులు సంతోషంగా ఉంటేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుందన్నారు. తొలిరోజు కలెక్షన్స్ గురించి మేము చెప్పిన నంబర్లను చాలామంది నమ్మలేదన్నారు. మేము డబ్బులు వచ్చాయని చెబుతున్నా మీరు నమ్మట్లేదని అన్నారు. దేవర కలెక్షన్స్ నిజమేనా? అని మీడియా ప్రతినిధులు అడగ్గా ఆయన ఇలా సమాధానమిచ్చారు.నాగవంశీ మాట్లాడుతూ.. 'దేవర మిడ్నైట్ షో సినిమాకు ప్లస్ అయినట్టే. దేవర వల్ల నాకొక విషయం తెలిసింది. మిడ్నైట్ షోలో టాక్ ఎలా ఉన్నా.. కథ బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. గుంటూరు కారంతోనూ అదే జరిగింది. దేవరకు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచే. మేం ఒరిజినల్ నంబర్స్ మాత్రమే ఇచ్చాం. సినిమా కలెక్షన్స్ గురించి పోస్టర్లు వేసేది ఫ్యాన్స్ కోసమే. ఈ కల్చర్ హాలీవుడ్‌లోనూ ఉంది. కలెక్షన్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు. దేవర సెలబ్రేషన్స్‌ని విదేశాల్లో ప్లాన్ చేశానని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని' చెప్పారు. -
'దేవర' కోసం అనుమతి ఇవ్వలేదు.. ఫ్యాన్స్‌ను క్షమాపణ కోరిన నాగవంశీ
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'దేవర'. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఆరు రోజులకుగాను ప్రపంచవ్యాప్తంగా రూ. 396 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టంది. దీంతో సక్సెస్ మీట్ ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, తాజాగా ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ సోషల్‌మీడియాలో ఒక ప్రకటన చేశారు. అభిమానుల సమక్షంలో దేవర విజయోత్సవాన్ని ఘనంగా జరపాలని తాము కూడా భావించినట్లు అన్నారు. కానీ, రెండు ప్రభుత్వాల నుంచి తమకు అనుమతులు రాకపోవడంతో ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించలేకపోతున్నట్లు నాగవంశీ తెలిపారు.ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద దేవర అపూర్వమైన రికార్డులను నెలకొల్పడంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో విజయోత్సవ వేడుకనైనా ఎంతో ఘనంగా చేయాలని ఎన్టీఆర్ ఎంతో బలంగా భావించారు. అందుకోసం మేము కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాం. అయితే, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు ఉన్న కారణంగా దేవర వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనుమతులు రాలేదు. ఇదీ చదవండి: 'మా' కుటుంబాలను బాధపెడితే మౌనంగా ఉండను: మంచు విష్ణుఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయినందుకు అభిమానులందరితో పాటు మా ప్రేక్షకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, అనుమతి కోసం మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. మీ ప్రేమతో అన్న (ఎన్టీఆర్) మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశిస్తున్నాను.' అని ఒక పోస్ట్ చేశారు.సెప్టెంబర్ 27న విడుదలైన దేవర.. బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. రూ. 500 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబడుతుందిన ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా మెప్పించారు. A big thank you to each and every one of you who played a part in creating the #DevaraStorm and setting unprecedented records at the BOX OFFICE.Since the pre-release event couldn’t be held, Tarak anna was adamant about having an event to CELEBRATE the Success of Devara in a BIG… pic.twitter.com/kyxAhy3CnN— Naga Vamsi (@vamsi84) October 3, 2024 -
ఫ్యాన్ వార్స్ చేయొద్దు.. 'దేవర'పై నిర్మాత పోస్ట్ వైరల్
ఎన్టీఆర్ 'దేవర' మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ తెరవగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ఇప్పటికే ట్రోలింగ్ ఆగట్లేదు. మిగతా హీరోల అభిమానులు కొందరు ఇప్పటికీ 'దేవర'పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత నాగవంశీ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ఫ్యాన్ వార్స్ వద్దని సలహా ఇచ్చారు.'తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి ఎమోషనల్ కంటెంట్‌తో వస్తున్నారు. అతడి వరకు మనకు గుడ్ కంటెంట్ రెడీ చేశాడు. చాన్నాళ్ల తర్వాత ఆంధ్రాలోనూ బెన్ఫిట్ షోలు పడుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు (ఫ్యాన్స్) కాస్త బాధ్యతతో ప్రశాంతంగా ఉండండి. అనవసరమైన ఫ్యాన్ వార్స్ చేయొద్దు. ఇలా ట్రోల్ చేయడం వల్ల మీకు సరదాగా అనిపిస్తుందేమో గానీ తర్వాత అది మన హీరోలకే ఇబ్బందిగా మారొచ్చు'(ఇదీ చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)'అందరి హీరోల ఫ్యాన్స్‌కు ఒకటే చెబుతున్నా. ఫ్యాన్ వార్స్ ఆపండి, సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్, సినిమా గురించి నెగిటివ్‌గా చెప్పడం లాంటివి ఈ సినిమాతోనైనా ఆపేద్దాం. అలానే సినిమా చూసేవాళ్లందరూ వాటిని వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. మీ పక్కనోళ్లని కూడా వీడియోలు తీస్తుంటే ప్రోత్సాహించొద్దు' అని నిర్మాత నాగవంశీ పోస్ట్ పెట్టారు.'గుంటూరు కారం' సినిమా తీసిన నిర్మాత నాగవంశీ.. 'దేవర' సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొన్నారు. ఈ సంస్థ ద్వారా ఆంధ్రా, తెలంగాణలో థియేటర్లలో రిలీజ్ కానుంది. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో నాగవంశీ ఓ సినిమా అనౌన్స్ చేశారు. కాకపోతే అది సెట్స్‌పైకి రాలేదు.(ఇదీ చదవండి: 'భారతీయుడు' హీరోయిన్ విడాకులు.. భర్తకు ఇష్టం లేకపోయినా!) View this post on Instagram A post shared by Naga Vamsi Suryadevara (@nagavamsi19) -
జూ. ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్ వీరే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.సిద్దూ జొన్నలగడ్డ సాయంటాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు. వరద బాధితులకు తన వంతుగా రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అందిస్తున్న డబ్బు కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ఆయన కోరారు.త్రివిక్రమ్, నాగవంశీ సాయంభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్ విడుదల చేశారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆపై యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి కూడా'సార్', 'తొలిప్రేమ' సిినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వెెంకీ అట్లూరి కూడా తన వంతు సాయం అందజేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.5 లక్షలు విరాళమిచ్చినట్లు ప్రకటించాడు.మహేశ్ బాబు కోటి రూపాయల విరాళం..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరద బాధితుల సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని అదుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహేశ్ బాబు కోరారు.In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024హీరోయిన్ విరాళం.. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024 హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదల వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళం అందించారు. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సలార్ అయినా.. గుంటూరు కారం అయినా.. అదే చూడాల్సింది: నాగవంశీ కౌంటర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది గుంటూరు కారంపై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్‌లతో పనిలేదని ఆయన అన్నారు. స్టార్ హీరోల ఎలివేషన్స్ చూసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. 'సలార్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు మాత్రం కొన్ని సీన్స్‌లో లాజిక్ లేదని కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా తరచుగా హీరో హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడని కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం గుంటూరు టూ హైదరాబాద్ మూడున్నర గంటల జర్నీని సినిమాలో చూపించలేం కదా. కొందరైతే గుంటూరు కారంలో మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ తర్వాత సినిమా చాలా బాగుందని మెసేజ్‌లు పెట్టారు' అని అన్నారు. గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ సాంగ్స్ చేశారు. అందుకే గుంటూరు కారంలోనూ అలాంటి సాంగ్ ఉంటే బాగుంటుందని కుర్చినీ మడతపెట్టి పాటను పెట్టినట్లు నాగవంశీ తెలిపారు. ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ.. ఆ టైమ్‌కు శ్రీలీల రావడం.. వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్‌లు మాట్లాడకూడదని అన్నారు. సినిమాను కేవలం వినోదం రూపంలోనే చూడాలని.. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది.. కానీ చిత్ర బృందంపై ఎవరు పడితే వారు మాట్లాడకూడదంటూ నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. -
'గుంటూరు కారం' విషయంలో బాధంతా వాళ్లదే: నిర్మాత నాగవంశీ
ఈసారి సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన సినిమా 'గుంటూరు కారం'. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలోని హ్యాట్రిక్ మూవీ ఇది. విడుదలకు ముందు ఫ్యాన్స్.. ఓ రేంజు అంచనాలు పెంచేసుకున్నారు. కానీ టాక్ రివర్స్ అయిపోయింది. రూ.150 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టుకుంది కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే విషయంలో నిరాశపరిచింది. తాజాగా ఓ ఈవెంట్లో 'గుంటూరు కారం' మూవీ గురించి ప్రశ్న ఎదురవగా.. నిర్మాత నాగవంశీ విచిత్రమైన సమాధానమిచ్చారు. (ఇదీ చదవండి: బోల్డ్నెస్ గురించి ప్రశ్న.. బిర్యానీ, పులిహోర అని అనుపమ కౌంటర్స్) 'గుంటూరు కారం సినిమా విషయంలో మాకు ఎలాంటి బాధలేదు. బాధంతా కూడా మీడియాదే' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈయన చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పెట్టిన డబ్బులొచ్చేయని అన్నట్లే. కానీ రియాలిటీ చూసుకుంటే ఈ మూవీ మహేశ్ అభిమానులే చాలామందికి నచ్చలేదు. అలానే సినిమాని కొన్న చాలామంది బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారని సమాచారం. కానీ నాగవంశీ మాత్రం మీడియా బాధంతా అని చెప్పడం విడ్డూరంగా అనిపిస్తోంది. అలానే త్రివిక్రమ్-అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అప్డేట్ గురించి అడగ్గా.. మరో ప్రెస్‌మీట్ లో చెబుతానని మాట దాటవేశారు. సితార సంస్థ నుంచి త్వరలో రాబోతున్న మూవీ 'టిల్లూ స్క్వేర్'. 'డీజే టిల్లు' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ మూవీలో సిద్ధు, అనుపమ హీరోహీరోయిన్లుగా నటించారు. మల్లిక్ రామ్ దర్శకుడు. తొలి భాగంతో పోలిస్తే ఇందులో గ్లామర్, రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి దీని ఫలితం ఫస్ట్ పార్ట్‌కి మించి ఉంటుందా? లేదా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: సిల్క్ స్మిత చేసిన పెద్ద తప్పు అదే: నటి జయమాలిని) -
గుంటూరు కారంపై నెగెటివ్ టాక్.. మహేశ్‌బాబు ఏమన్నాడంటే?
'అతడు', 'ఖలేజా' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. భారీ వసూళ్లు.. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యారు. కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేసి తప్పుడు రివ్యూలిచ్చారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మహేశ్‌కు మొదటి నుంచీ నమ్మకముంది గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చేది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మహేశ్‌బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదట్లో నెగటివ్ రివ్యూలు వచ్చినా ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఆయన అంచనా నిజమైంది రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనానే నిజమైంది. ఆయన ధైర్యమే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైందనిపించింది. ఇది మాస్ సినిమా అని అంతా భావించారు. త్రివిక్రమ్ గారి శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా.. అయినా తన నుంచి మెసేజ్.. -
నెగెటివిటీతో మా సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు: గుంటూరు కారం నిర్మాత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్‌లో గుంటూరు కారంపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొందరు అభిమానులు మహేశ్ బాబు సూపర్ హిట్ కొట్టారంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ మరికొందరు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేపోయిందని కామెంట్స్ చేశారు. అయితే ఇప్పటికే గుంటూరు కారంపై వస్తున్న నెగెటివ్ టాక్‌పై నిర్మాత దిల్‌రాజు కూడా స్పందించారు. ఇది వ్యాపారమని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని అన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మా గుంటూరు కారం సినిమాకు వందలాది ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ నుంచి గుంటూరు కారం చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్లో రాసుకొచ్చారు. గుంటూరుకారం చిత్రంపై నెగెటివీటి వచ్చినప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసేవారిపై.. అలాగే మూవీ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. సినిమా విషయంలో చివరికి ఆడియన్స్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఈ విషయం గుంటూరు కారం విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు. కాగా.. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. We've been receiving hundreds of such videos with highly positive feedback from family audiences & youth. The initial negativity on the movie cannot deem the quality and enjoyability factor of a film. It's always the audiences who give their final verdict and it is again proved… https://t.co/kkKm8sZ3kY — Naga Vamsi (@vamsi84) January 14, 2024 -
మహేశ్ ఫ్యాన్స్‌తో 'గుంటూరు కారం' నిర్మాత గొడవ.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా దెబ్బకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇప్పటికే తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే తీస్తున్న సినిమా విషయంలో అన్నీ బాగుంటే పర్లేదు. అలా కాకుండా టీజర్, పాటల్లాంటివి ఏ మాత్రం తేడా కొట్టినా సరే ఫ్యాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. అభిమాన హీరో మూవీ అయినా గానీ చీల్చిచెండాడేస్తున్నారు. తాజాగా 'గుంటూరు కారం'పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. నిర్మాత నాగవంశీ ఎంటర్ కావడంతో ఈ గొడవ మరింత పెద్దదైపోయింది! సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న సినిమా 'గుంటూరు కారం'. దాదాపు రెండేళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ మూవీ.. సంక్రాంతి కానుకగా రాబోయే జనవరి 12న థియేటర్లలోకి రానుంది. షూటింగ్ చివర దశలో ఉంది. మరోవైపు ఒక్కో అప్డేట్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నాళ్ల ముందు 'దమ్ మసాలా' అని తొలి పాట రిలీజ్ చేయగా అభిమానుల్ని ఆకట్టుకుంది. తాజాగా 'ఓ బేబీ' పేరుతో ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న శ్రీలీల కొత్త మూవీ) త్రివిక్రమ్-తమన్ కాంబోకి తోడు మహేశ్ హీరో అయ్యేసరికి.. ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఊహించుకున్నారు. పాట ఆ స్థాయిని రీచ్ కాలేదు. దీంతో మహేశ్ అభిమానులే స్వయంగా ట్రోలింగ్కి దిగారు. అయితే ఈ విమర్శలు ఫరిది దాటిపోయసరికి 'గుంటూరు కారం' నిర్మాత నాగవంశీ సైలెంట్‌గా ఉండలేకపోయారు. 'యానిమల్' సినిమాలోని ఓ సీన్‌కి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసి ట్రోలర్స్‌ని మరింత రెచ్చగొట్టారు. ఈ ట్వీట్ దెబ్బకు గొడవ మరింత ముదిరిపోయేసరికి.. నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చుకున్నారు. పాటపై ఫీడ్ బ్యాక్ ఇస్తే పర్లేదు గానీ మరి వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నారని అదే బాధ కలిగించిందని అర్థమొచ్చేలా వివరిస్తూ మరో ట్వీట్ చేశారు. అలానే జనవరి 12న చూసుకుందాం అన్నట్లు ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు. మరి 'గుంటూరు కారం'పై నిర్మాత నాగవంశీది నమ్మకమా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మూవీ వస్తే తెలుస్తోంది. కానీ అప్పటివరకు ఇంకెన్ని గొడవలు అవుతాయో ఏంటో? (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్) As a producer, my reply has hurt you, right. Now, understand how we feel when our teammates are targeted with personal abuses day-in and day-out for just doing their job. Feedback of any kind is welcome until there is no abuse, personal targeting and unnecessary harsh words. You… https://t.co/PR6U1Ievvu — Naga Vamsi (@vamsi84) December 15, 2023 -
క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ .రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆదికేశవ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. శ్రీకాంత్ ఎన్ . రెడ్డి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌కి చెందిన ఓ కుర్రాడు అనంతపురం సమీపంలోని కళ్యాణదుర్గం బ్రహ్మసముద్రం అనే గ్రామంలో జరుగుతున్న దారుణాలను ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథాంశం. మూవీ ప్రారంభమైన 10 నిమిషాలకే వైష్ణవ్‌తేజ్ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సినిమాలోని చివరి 45నిమిషాల సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా, క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. బడ్జెట్, పారితోషికం.. ఇలాంటి అంశాలను పట్టించుకోకుండా నా దృష్టంతా సినిమాపై కేంద్రీకృతమయ్యేలా చేసిన నాగవంశీగారికి థ్యాంక్స్. జీవీ ప్రకాష్ కుమార్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు.