
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మ్యాడ్ స్క్వేర్. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్‌లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్‌లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని అన్నారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్‌గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు.
గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు, టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మ్యాడ్ సినిమా లాగే ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందును ఫ్యాన్స్‌కు అందించనున్నారు. టీజర్‌లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది.
డైరెక్టర్లు మైక్ పట్టుకొని అతి వాగొద్దు
ఇందులో కథ లేదు లాజిక్ లేదు
- Producer #NagaVamsi#MadSquare #TeluguFilmNagar pic.twitter.com/w9BYDaqWHj— Telugu FilmNagar (@telugufilmnagar) February 28, 2025
Comments
Please login to add a commentAdd a comment