producer
-
60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్
బరువు తగ్గడం అనేది పెద్ద టాస్కే. అదీ 50 దాటిన తరువాత అధిక బరువును తగ్గించు కోవడానికి చాలా కృషి, పట్టుదల, ప్రేరణ కావాలి. ఇతర ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వెయిట్ లాస్ జర్నీని ప్లాన్ చేసుకోవాలి. అలా ప్రముఖ నిర్మాత,సల్మాన్ ఖాన్ స్నేహితుడు, సాజిద్ నదియాడ్ వాలా బరువును తగ్గించుకుని ఫిట్‌గా మారిన తీరు అభిమానులను ఆశ్చర్యపర్చింది. అతని బాడీలోని భారీ పరివర్తన, బాగా బరువు తగ్గి స్మార్ట్‌గా తయారైన అతడి ఫోటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి..బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'సికందర్' చిత్రానికి సాజిద్ నిర్మాత. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సాజిద్ ఫేస్ ఆఫ్ ది ఇంటర్నెట్గా మారిపోయాడు. అతని భార్య వార్దా ఖాన్ బాగా సన్నగా ఉన్న భర్త సాజిద్ ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. రిప్డ్ జీన్స్, డెనిమ్ జాకెట్, బటన్స్ లేని షర్ట్‌లో అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సాజిద్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా 59 ఏళ్ల వయసులో, ఆరోగ్యంగా, సంతోషంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాడు. అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.“ఎంత సెక్సీ లుక్… అబ్ తో ఫిల్మ్ మే హీరో బన్నే కా సమయ్ ఆ గయా హై” (సెక్సీగా ఉన్నారు.. ఇక సినిమాల్లో హీరో ఐపోయే సమయం వచ్చింది.)"అప్నా అస్లీ సికందర్ యే హై (మా నిజమైన సికందర్)" , ‘‘యువ హీరోలకు కఠినమైన పోటీ...” ,“21 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారు! జవానీ కా రాజ్ క్యా హై?” ( ఈ యంగ్ లుక్ వెనుక రహస్యం ఏమిటి?), తదితర వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.కాగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నిర్మించిన ‘సికందర్’ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈద్‌కు విడుదల కానున్న ఈ మూవీలో రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్, సత్యరాజ్ , శర్మన్ జోషి ప్రధాన పాత్రలు పోషించారు.50ల తరువాత బరువు తగ్గడం, జాగ్రత్తలు శరీరం వయస్సు పెరిగే కొద్దీ, కండరాలు, అవయవాలు, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. 50 ఏళ్లు దాటాకి ఇది మరీ పెరుగుతుంది. అందుకే ఆహారం, వ్యాయామం , జీవనశైలిపై దృష్టి పెట్టడం చాలా అవసరం అవుతుంది. ఈక్రమంలో పురుషులు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలను పరిశీలిద్దాంహైడ్రేషన్: 60కి సమీపిస్తున్న తరుణంలో వెయట్ లాస్ అంటే చాలా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి.ముఖ్యంగా హైడ్రేషన్ అనే గోల్డెన్ టిప్‌ను అస్సలు మిస్ చేయకూడదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.ఆహారం: కండరాల బలం కోసం చికెన్, గుడ్డు, పనీర్, కాయధాన్యాలు వంటి ప్రోటీన్లున్న ఫుడ్ తీసుకోవాలి. జీర్ణక్రియకోసం తృణధాన్యాలు, కరిగే ఫైబర్, పండ్లు , కూరగాయలపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకరమైన మెటబాలిజం రేటుపై శ్రద్ధపెట్టాలి. .తీపి పదార్థాలకు దూరంగా : తీపి పానీయాలు, చక్కెర కలిగిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. లేదంటే అరుగుదల సమస్యలు, కొవ్వు పేరుకు పోవడం లాంటి సమస్యలొస్తాయి.వ్యాయామం: ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. బాడీలో అన్ని ఎ ముకలు, కీళ్ల కీళ్ల స్వేచ్ఛా కదలికల నిమిత్తం క్రమం తప్పకుండా వ్యాయామం చాలా అవసరం. ఇది మొత్తం కండరాల, ఎముక బలానికి కూడా సహాయపడుతుంది.నిద్రకు ప్రాధాన్యత: సరియైన నిద్ర అనేది మరో ప్రధాన మైన నియమం. నాణ్యమైన 8-9 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఇది శరీరం కోలుకోవడానికి,విశ్రాంతికి సహాయపడుతుంది. -
నిర్మాతగా సమంత తొలి సినిమా.. ఫోటోలు షేర్ చేసిన సామ్
-
ఆ ఏడాదే పుష్ప 3 రిలీజ్.. ప్రకటించిన నిర్మాత
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు.. కాదుకాదు, వైల్డ్ ఫైరు.. అని నిరూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప ఫ్రాంచైజీ (Pushpa Movie)తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాడు. పుష్ప 1.. 2021లో విడుదల కాగా దాని సీక్వెల్ 2024లో రిలీజైంది. మరి పుష్ప 3 ఎప్పుడు? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.వారి ఎదురుచూపులకు నిర్మాత రవిశంకర్ తెర దించాడు. 2028లో పుష్ప 3 (Pushpa 3 Movie) విడుదల చేస్తామని వెల్లడించాడు. విజయవాడలో ఆదివారం జరిగిన రాబిన్‌హుడ్ ప్రెస్మీట్లో ఈ విషయాన్ని తెలిపాడు. అలాగే బన్నీ.. ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.పుష్పరాజ్ ప్రయాణం ఎలా మొదలైందంటే?అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప (Pushpa: The Rise). ఫహద్ ఫాజిల్, సునీల్, డాలి ధనంజయ, అజయ్ ఘోష్, జగదీశ్ ప్రతాప్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి శ్రీకాంత్ విస్స డైలాగ్స్ రాశాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు.దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా పుష్ప: ద రూల్ తెరకెక్కింది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1650 కోట్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత సృష్టించిన పుష్ప 2కి సీక్వెల్ ఉంటుందని చిత్రయూనిట్ ఎప్పుడో ప్రకటించింది. తాజాగా రిలీజ్ ఎప్పుడో కూడా చెప్పేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: ఆ సినిమా చూస్తుంటే చేదు గతం కళ్లముందుకు..: టాలీవుడ్ హీరోయిన్ -
దాన్ని అడ్డుకోవాలంటే ఓ ఉద్యమం చేయాలి: దిల్ రాజు కామెంట్స్
సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎవరి సినిమాపై ఎఫెక్ట్ పడుతుందో వారు మాత్రమే పైరసీ గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు. పైరసీ గురించి శుక్రవారం మాట్లాడితే సోమవారానికే మర్చిపోతున్నారని అన్నారు. పైరసీకి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దిల్ రాజు మాట్లాడుతూ..' ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే పైరసీపై మాట్లాడతారు. ఈ విషయాన్ని శుక్రవారం మాట్లాడితే.. సోమవారానికి మర్చిపోతున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్డీసీ ఛైర్మన్‌గా నేను లీడ్ చెస్తాను . నిర్మాతలందరు కలిసి రావాలి. డబ్బులు పోయేవి నిర్మాతలవే కాబట్టి అందరూ మేల్కోవాలి. సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి. నేను నిర్మాతగా, పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా. విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, నితిన్ ఎల్లమ్మ సినిమాల స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.' అని వెల్లడించారు.కాగా.. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తోన్న పైరసీ అనే భూతం ఎప్పటి నుంచో పట్టి పీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, తండేల్, విదాముయార్చి సినిమాలు సైతం పైరసీ బారినపడ్డాయి. గేమ్ ఛేంజర్ సినిమాను ఏకంగా ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఈ సంఘటనపై కేసు కూడా నమోదు చేశారు. అలాగే తండేల్ మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని నిర్మాత బన్నీ వాసు హెచ్చరించారు. -
దుబాయ్‌లోనే నిర్మాత 'కేదార్' అంత్యక్రియలు.. కారణం ఇదే
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో మరణించిన విషయం తెలిసిందే.. అయితే, ఆయన ఆంత్యక్రియలు కొంత సమయం క్రితం దుబాయ్‌లోనే ముగిశాయి. సుమారు పది రోజుల క్రితం అనుమానాస్పదంగా ఆయన మరణించారు. కానీ, కేదార్ మృతికి సంబంధించి కారణాలు తెలియడం లేదు. అయితే, ఆయన మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని దుబాయ్ పోలీసులు తేల్చడం గమనార్హం. కేదార్ అనారోగ్యం కారణంగానే మరణించారని వారు పేర్కొన్నారు. భారత ప్రభుత్వం అనుమతితో కేదార్ మృతదేహాన్ని ఆయన భార్య రేఖా వీణకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.దుబాయ్‌లో ఇప్పటికే స్థిర నివాసం, వ్యాపారాలు చేస్తున్న కేదార్ అంత్యక్రియలు అక్కడే పూర్తి చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో వారి కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. భారత్‌కు కేదార్ మృతదేహాన్ని తీసుకొస్తే ఇబ్బందులకు గురవుతామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణం వల్లే ఆయన అంత్యక్రియలు ఇక్కడే చేశామని వారు చెప్పుకొచ్చారు. కేదార్ అంత్యక్రియలలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ నాయకులకు బినామీగా కేదార్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వారికి సంబంధించిన వందల కోట్ల రూపాయలు ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బుతో దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కేదార్ మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలునిర్మాత కేదార్ సెలగంశెట్టి మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి..? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు..? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి..? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తామని రేవంత్ చెప్పారు. -
ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో ఫన్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్. గతంలో విడుదలైన అభిమానులను అలరించిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. మ్యాడ్-2 చిత్రం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మ్యాడ్‌లాగే ఇందులో కూడా ఎలాంటి కథ ఉండదని తెలిపారు. కేవలం రెండు గంటలు నవ్వుకోవడానికి థియేటర్లకు రండి అని విజ్ఞప్తి చేశారు. ఇంజినీరింగ్ చదువుకుని ఉద్యోగం చేయకూడదనుకున్న ముగ్గురు వెధవలు ఒక మంచోడిని వెధవను చేసే కథే మ్యాడ్ స్క్వేర్. ఈ సారి హైదరాబాద్‌లో చేసిన అరాచకాలు అయిపోయాయని.. స్టోరీని గోవాకు మార్చామని అన్నారు. ఈ సినిమా అంతా ఫన్.. ఎలాంటి లాజిక్స్ వెతకొద్దు.. ముందే క్లియర్‌గా చెబుతున్నాని పేర్కొన్నారు. ఇది మిస్సయింది.. అది మిస్సయింది లాంటి అడొగద్దు.. నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్‌కు రండి అని నాగవంశీ టాలీవుడ్ అభిమానులకు సూచించారు.గతంలో వచ్చిన మ్యాడ్ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్'ను మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన 'లడ్డు గానీ పెళ్లి', 'స్వాతి రెడ్డి' పాటలు, టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. మ్యాడ్ సినిమా లాగే ఈ సీక్వెల్ తో మరోసారి నవ్వుల విందును ఫ్యాన్స్‌కు అందించనున్నారు. టీజర్లో వారి అల్లరి, పంచ్ డైలాగ్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఈ చిత్రం మార్చి 29న థియేటర్లలో విడుదల కానుంది. డైరెక్టర్లు మైక్ పట్టుకొని అతి వాగొద్దుఇందులో కథ లేదు లాజిక్ లేదు- Producer #NagaVamsi#MadSquare #TeluguFilmNagar pic.twitter.com/w9BYDaqWHj— Telugu FilmNagar (@telugufilmnagar) February 28, 2025 -
తెలుగమ్మాయిలపై వివాదాస్పద కామెంట్స్: టాలీవుడ్ నిర్మాత వివరణ
ఇటీవల డ్రాగన్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించమని.. వారిని తీసుకుంటే ఏమవుతుందో తెలుసని కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తాను చెప్పిన వాటిలో వివాదమేముందని ఎస్కేఎన్ రిప్లై కూడా ఇచ్చారు.(ఇది చదవండి: తెలుగమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వకూడదు: ఎస్కేఎన్)అయితే తాజాగా ఈ వివాదంపై నిర్మాత ఎస్కేఎన్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది తెలుగమ్మాయిలను పరిచయం నిర్మాతల్లో తాను కూడా ఉన్నానని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఈవెంట్లో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు ఎనిమిది మందిని తెలుగువారిని వెండితెరకు పరిచయం చేశానని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 25 మందిని ప్రతిభావంతులైన తెలుగమ్మాయిలను టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగువారి ప్రతిభను ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నా ప్రాదాన్యతగా భావిస్తానని ట్విటర్లో వీడియోను పంచుకున్నారు. అందుకే దయచేసి తనపై ఎటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వీడియోలో ఎస్కేఎన్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇటీవల డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు అమ్మాయిల గురించి మాట్లాడా. కానీ నేను తెలుగు అమ్మాయిలతో పని చేయనని రాశారు. కానీ చాలా మంది తెలుగు నటీమణులను పరిశ్రమకు పరిచయం చేసిన కొద్దిమంది నిర్మాతలలో నేను ఒకడిని. రేష్మా, ఆనంది, మానస, ప్రియాంక జువాల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత లాంటి వారని నేనే పరిచయం చేశా. ఇలా ఎనిమిది మందిని పరిచయం చేశానని' అన్నారు. Hi everyone, Namaste. I am one of the few producers who have introduced Many Telugu actresses to the industry. A lighthearted comment I made recently was misunderstood, leading to unnecessary headlines with incorrect meanings.To clarify, I have introduced 8 talented individuals… pic.twitter.com/raWN8Suvpk— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 18, 2025 -
తెలుగమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వనన్న నిర్మాతపై ట్రోలింగ్.. ఆయన రిప్లై ఇదే!
'టాలీవుడ్లో తెలుగు వచ్చిన అమ్మాయిలకన్నా తెలుగురాని అమ్మాయిలనే ఎక్కువగా ప్రేమిస్తుంటాం. తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తర్వాత తెలిసింది. అందుకని ఇక మీదట తెలుగురానివారిని ఎంకరేజ్ చేయాలని నేను, డైరెక్టర్ సాయి రాజేశ్ (Sai Rajesh) నిర్ణయించుకున్నాం' అంటూ నిర్మాత ఎస్కేఎన్ (Producer SKN) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన చివరిగా నిర్మించిన సినిమా బేబీ. అందులో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్గా పరిచయం చేయడంతో.. ఆమెకు బేబీ టీమ్‌కు మధ్య విభేదాలు వచ్చాయా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.ఆరుగురు తెలుగమ్మాయిలను..నిజానికి ఎస్కేఎన్ దాదాపు ఆరుగురు తెలుగమ్మాయిలను హీరోయిన్స్‌గా మార్చాడు. 'ఈ రోజుల్లో' సినిమాతో రేష్మ రాథోడ్, ఆనంది, 'రొమాన్స్'తో మానస, 'టాక్సీవాలా'తో ప్రియాంక జవాల్కర్ (దీనికంటే ముందు కల వరం ఆయే సినిమా చేసింది కానీ గుర్తింపు రాలేదు), 'బేబి'తో వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను హీరోయిన్గా వెండితెరకు పరిచయం చేశాడు. సంతోశ్ శోభన్‌తో తీస్తున్న సినిమాలో దేత్తడి హారికను కూడా కథానాయికగా పరిచయం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ.. ఎస్కేఎన్.. చాలామంది తెలుగు హీరోయిన్లకు తెరకు పరిచయం చేశారు. కవర్ డ్రైవ్ఫన్ కోసమో, ఫ్లోలోనో వివాదానికి దారితీసేలా స్టేట్మెంట్ పడేశారు. కానీ దాన్ని హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ముడిపెట్టి చూడటం సరికాదేమో? అని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఎస్కేఎన్ స్పందిస్తూ.. హహ్హహ్హ.. ఈ మధ్య చాలామంది వినోదం కన్నా వివాదానికే మొగ్గు చూపుతున్నారు గురూజీ.. ఏం చేస్తాం చెప్పండి! అని రిప్లై ఇచ్చాడు. కాంట్రవర్సీ మీరే చేసి ఇప్పుడు కవరింగ్ దేనికో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: లాజిక్ లేకపోయినా రాజమౌళి సినిమాలు సూపర్‌హిట్టు: కరణ్ జోహార్ -
ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకూ చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత–నటి–గాయని చిత్తజల్లు కృష్ణవేణి(Krishnaveni) (101) ఇక లేరు. పదిహేను రోజులుగా ఆమె హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న కృష్ణవేణి జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారామె. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారామె. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి. కాగా ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశారు.నటిగా కృష్ణవేణిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. వారిది ప్రేమ వివాహం. ఆ తర్వాత జయా పిక్చర్స్‌పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అలా నిర్మాణరంగంవైపు వచ్చారామె. ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్‌ని శోభనాచల స్టూడియోస్‌గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి.ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. కాగా ‘తిరుగుబాటు’ సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. ఒకవైపు అనురాధ ఆలనా పాలనా, మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు.ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ. 45 వేలు పారితోషికం అందుకున్నారట. ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా... ‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గానూ చేశారు. ఇదే చిత్రంతో గాయనిగా పి. లీలను పరిచయం చేశారు. అలాగే ‘వరూధిని’ చిత్రం తర్వాత, ఊరికి వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి, ‘మన దేశం’కు అవకాశం కల్పించారామె. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి సంగీతదర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం. ‘దాంపత్యం’ (1957) నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె. కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.అదే సినిమాని తెలుగులో నాగేశ్వరరావు హీరోగా ‘చక్రధారి’గా రీమేక్ చేశారు. ‘రాముడే రావణుడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం, ఇల్లాలే దేవత’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారామె. తెలుగులో తీసిన ‘మా పెళ్లికి రండి’ నిర్మాతగా ఆమె చివరి చిత్రం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారామె.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణవేణికి కూతురు అను రాధా దేవి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న మనమరాలు అర్చన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.కృష్ణవేణి కాశీ మజిలీ కథలతో పాటు చాలా పుస్తకాలు చదివేవారు. వాటిలో సినిమా తీయడానికి పనికొస్తాయనిపించే పాయింట్స్ తీసుకుని, కథ తయారు చేయించేవారు. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్ ΄్లాన్ చేసి, షూటింగ్ స్పాట్లో ఉండటంవరకూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు కృష్ణవేణి.సినీ నిర్మాత, నటి, గాయని, రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనేక భాషల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది, నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పలు గొప్ప చిత్రాలు తీసి, నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి, పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడినిప్రార్ధిస్తున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ను చిత్ర రంగానికి పరిచయం చేసి, కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూమార్తె అనురాధ తెలిపారు.ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కృష్ణవేణి1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు.కృష్ణవేణి సినీ ప్రస్థానం..శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1937) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. -
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు సినిమాలతో రూ.100 కోట్ల నష్టం: టాలీవుడ్ నిర్మాత సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత సింగనమల రమేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇద్దరు పెద్ద హీరోలతో తీసిన సినిమాల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఏర్పాటు ప్రెస్మీట్లో మాట్లాడిన నిర్మాత మహేశ్ బాబు ఖలేజా, పవన్ కల్యాణ్ కొమరం పులి చిత్రాల గురించి మాట్లాడారు. ఆ రెండు సినిమాలతో వచ్చిన నష్టం గురించి ఆయన వెల్లడించారు.కొమరం పులి, ఖలేజా లాంటి చిత్రాలతో భారీగా నష్టపోయినట్లు సింగనమల రమేశ్ వెల్లడించారు. ఆ రోజుల్లో కేవలం ఏ సినిమా అయినా ఏడాదిలోపే పూర్తి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. నా దురదృష్టం వల్లనేమో కొమరం పులి, ఖలేజా సినిమాలు నిర్మించడంలో ఎక్కువ టైమ్ తీసుకొవాల్సి వచ్చిందన్నారు. ఈ రెండు ఆలస్యమవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని రమేశ్ అన్నారు. ఈ రెండు సినిమాలతో నష్టపోయినా నాకు.. ఏ హీరో కూడా సపోర్ట్ చేయలేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి అయ్యో పాపం అని.. కనీసం పలకరించిన పాపాన పోలేదని నిర్మాత రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.కాగా.. 2011లో గచ్చిబౌలిలో హైదరాబాద్ వ్యాపారవేత్తను బెదిరించి రూ.12 కోట్లు స్వాహా చేశారని రమేష్ బాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో జనవరి 31 2025న రమేష్ బాబును కోర్టు నిర్దోషిగా తేల్చింది. అందువల్లే ఆయన తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. కొమరం పులి, ఖలేజా సినిమాల పైన 100 కోట్లు నష్టపోయాను.హీరోలు కనీసం 'అయ్యో పాపం' అని కూడా అనలేదు- Singanamala Ramesh (Producer and Film Financier) pic.twitter.com/6KQtgFCaBZ— idlebrain.com (@idlebraindotcom) February 5, 2025 -
ఐటీ ఎదుట దిల్ రాజు
-
టాలీవుడ్లో విషాదం.. 'మడత కాజా' నిర్మాత మృతి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వేదరాజు టింబర్ (54) (Vedaraju Timber) కన్నుమూశారు. గతంలో ఆయన నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించడమే కాకుండా కనస్ట్రక్షన్ రంగంలో కూడా రాణించారు. అయితే, కొంత కాలంగా సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేదరాజు కొన్ని నెలల క్రితం చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో శుక్రవారం ఉదయం మరణించారు.కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన కనస్ట్రక్షన్ రంగంలో బిజీగా ఉన్నారు. మళ్లీ చిత్ర రంగంలో రీఎంట్రీ ఇద్దాం అనే ఆలోచనలతో ఇప్పటికే పలు కథలను కూడా ఆయన రెడీ చేసుకున్నారు. వేదరాజు టింబర్ నెక్ట్స్ ప్రొడక్షన్ పేరుతో టీమ్‌ను కూడా రెడీ చేసుకున్నారు. అయితే, ఇంతలో ఇలా జరుగడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హీరో అల్లరి నరేష్‌తో ‘మడత కాజా’ చిత్రంతో పాటు 'సంఘర్షణ' అనే మరోసినిమాను ఆయన నిర్మించారు. వేదరాజుకు భార్య, కూతురు ఉన్నారు. ఆయన మృతి పట్ల సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయింత్రం జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
'హాయ్ నాన్న' కాపీ సినిమా.. నాని ఇంత చీపా?: కన్నడ నిర్మాత
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా (Hi Nanna Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.75 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం 2023 డిసెంబర్లో విడుదలైంది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమాపై కన్నడ నిర్మాత పుష్కర మల్లికార్జునయ్య (Pushkara Mallikarjunaiah) సంచలన ఆరోపణలు చేశాడు. తన సినిమా కథను దొంగిలించారని ఆరోపించాడు. తాను తెరకెక్కించిన భీమసేన నలమహారాజ మూవీ ఒరిజినల్ స్టోరీ అని.. తమ అనుమతి లేకుండా హాయ్ నాన్న పేరిట తెలుగులో రీమేక్ చేశారని మండిపడ్డాడు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తావనుకోలేదంటూ హీరో నానిని ట్యాగ్ చేశాడు. దీంతో హాయ్ నాన్న సినిమా టీమ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లూ ఒరిజినల్ కథ అని నమ్మించారు, తెలుగు ఇండస్ట్రీ తలదించుకునేట్లు చేస్తున్నారు కదా.. తిట్టిపోస్తున్నారు.భీమసేన మూవీ ఎప్పుడొచ్చింది?భీమసేన నలమహారాజ సినిమా (Bheemasena Nalamaharaja Movie) విషయానికి వస్తే ఇది కన్నడ చిత్రం. కార్తీక్ సరగుర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అరవింద్ అయ్యర్, ఆరోహి నారాయణ్, ప్రియాంక, ఆద్య, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. చరణ్ రాజ్ సంగీతం అందించిన ఈ చిత్రం 2020 అక్టోబర్‌లో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఈ మూవీని హీరో రక్షిత్ శెట్టితో పాటు పుష్కర మల్లికార్జునయ్య, హేమంత్ ఎమ్ రావు నిర్మించారు. మల్లికార్జునయ్య.. కిరిక్ పార్టీ, గోధీ బన్నా సాధారణ మైకట్టు, హంబుల్ పొలిటీషియన్ నోగరాజ్, జీరిజింబె, అవతార పురుష, 10 వంటి పలు చిత్రాలను నిర్మించాడు.చదవండి: మొన్న హీరోయిన్ సన్యాసం.. ఇంతలోనే మరో కథానాయిక సోదరి కూడా -
ప్రముఖ నిర్మాత మృతి.. సుధా కొంగర ఎమోషనల్ నోట్
ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సుధా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. A long journey through life and cinema.Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025 View this post on Instagram A post shared by Sudha Kongara (@sudha_kongara) -
స్వప్న బ్యానర్‌కు ఆ హీరోతోనే బాగా కలిసొచ్చింది : స్వప్న దత్
-
ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచింది: దిల్ రాజు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు(వెంకట రమణ రెడ్డి) బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయనను ప్రభుత్వం ఈ పదవిలో నియమించగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవకాశమిచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి దిల్ రాజు ధన్యవాదాలు తెలిపారు.తెలుగు సినిమా పూర్వ వైభవం తీసుకురావడానికి అందరి సహకారం అవసరమని దిల్ రాజు అన్నారు. తెలంగాణా సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిందని.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ పదవి నా బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని దిల్ రాజు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల సమస్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.కాగా.. ఈ రోజు దిల్ రాజు పుట్టినరోజు కావడం మరో విశేషం. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వచ్చే ఏడాది పొంగల్‌కు విడుదల కానున్నాయి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
దేవిశ్రీకి కౌంటర్ ఇచ్చిన పుష్ప ప్రొడ్యూసర్..
-
చెన్నైలో దేవీశ్రీప్రసాద్ కామెంట్స్.. స్పందించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత
ప్రస్తుతం అందరిచూపు పుష్ప-2 ది రూల్‌పైనే ఉంది. రోజులు గడిచే కొద్ది ఆడియన్స్‌లో మరింత ఆతృత పెరుగుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండడంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ విడుదల చేశారు.అయితే ఈ ఈవెంట్లో మ్యూజిక్ దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ టాలీవుడ్ హాట్‌టాపిక్‌గా మారాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు నాపై ప్రేమతో పాటు ఫిర్యాదులు కూడా ఎక్కువే ఉన్నాయంటూ మాట్లాడారు. తాను ఏదైనా చెప్పాల్సి వస్తే వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుందని డీఎస్పీ మాట్లాడారు.అయితే దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్‌పై తాజాగా నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. నితిన్ రాబిన్‌హుడ్ ప్రెస్మీట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. మా వాళ్లకు నాపై లవ్ ఉంటది.. దాంతో పాటు కంప్లైంట్స్ కూడా ఎక్కువే అన్నారు. అందులో తప్పేముంది సార్? మాకైతే దేవిశ్రీ ప్రసాద్ మాటల్లో ఎలాంటి తప్పు కనిపించలేదని రవిశంకర్ అన్నారు. మీరేదో రాసినంత మాత్రాన మేమంతా ఒక్కటే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు.. డీఎస్పీ ఉన్నంతవరకు ఆయనతో సినిమాలు చేస్తాం.. మేము ఉన్నంతసేపు ఆయన సినిమాలు చేస్తారు.. అందులో డౌటే లేదని రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఫ్రీగా నటిస్తున్నారా? ఫ్రీగా ఫుటేజీ ఎందుకివ్వాలి?: నిర్మాత
మూడు సెకన్ల ఫుటేజీ వాడినందుకు మాపై పగ తీర్చుకోవడం సరికాదంటూ హీరోయిన్ నయనతార.. ధనుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నానుమ్ రౌడీదాన్ (నేనూ రౌడీనే) సినిమాలోని ఓ చిన్న క్లిప్‌ను నయనతార తన డాక్యుమెంటరీలో వాడింది. నిర్మాతగా తన అనుమతి పొందకుండా ఆ క్లిప్ వాడటంతో ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేశాడు. దీంతో నయన్.. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తోంది.. ఇంతలా దిగజారుతావనుకోలేదు అంటూ నానామాటలు అనేసింది.మరి నీ భర్త చేసిందేంటి?ఈ వ్యవహారంపై నిర్మాత ఎస్ఎస్ కుమారన్ స్పందిస్తూ నయనతారను దుయ్యబట్టాడు. ఒకర్ని తప్పుపట్టేముందు తమరి తప్పులు తెలుసుకోవాలని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా సినిమాలోని మూడు సెకన్ల ఫుటేజీ వాడుకున్నందుకు ధనుష్ మీకు లీగల్ నోటీసులు పంపాడు. మరి నీ భర్త నేను రిజిస్టర్ చేసుకున్న ఎల్ఐసీ సినిమా టైటిల్‌ను అప్పనంగా వాడేశాడు. నా నిర్ణయాన్ని గౌరవించలేదుఆ టైటిల్ కావాలని ఎవరి ద్వారానో అడిగించాడు. నేనందుకు ఒప్పుకోలేదు. అయినా సరే మీరు నా నిర్ణయాన్ని లెక్క చేయకుండా ఎల్ఐసీ టైటిల్‌తోనే సినిమా చేశారు. మరి దీన్నెలా సమర్థిస్తారు? నా కథకు, ఎల్ఐసీ టైటిల్‌కు కనెక్షన్ ఉండటం వల్లే దాన్ని మీకు ఇవ్వలేనని సున్నితంగా తిరస్కరించాను. కానీ మీరేం చేశారు? ఏం చేసుకుంటావో చేసుకో? అని నా టైటిల్‌ను వాడేశారు. దీనికి ఏమని సమాధానం చెప్తారు?ఎంత కుంగిపోయానో?ఒక ఫుటేజీ కోసం మీ కంటే శక్తిమంతుడైన వ్యక్తి అంగీకారం కోసం రెండేళ్లు ఎదురుచూశారు. నేను చిన్న నిర్మాతను కాబట్టి నన్నసలు లెక్కచేయలేదు. ఇది నాకెంతో బాధేసింది. ఎమోషనల్‌గా ఎంత కుంగిపోయానో నాకు తెలుసు. అది నా సినిమాపైనా ప్రభావం చూపింది.ఉచితంగా యాక్ట్ చేస్తున్నారా?ప్రతి నిర్మాత తన సినిమా కోసం సమయం, డబ్బు వెచ్చిస్తాడు. అలాంటిది.. ఆ సినిమాను మీ వ్యాపారాల కోసం వాడుకోవాలంటే కచ్చితంగా అతడి అనుమతి తీసుకోవాలి. న్యాయపరంగా ముందుకెళ్లాలి. మీరేమీ ఏదీ ఉచితంగా చేయట్లేదు.. కానీ ఫుటేజీ మాత్రం ఫ్రీగా ఇచ్చేయాలి! ఈ దారుణమైన ట్రెండ్‌ను నువ్వు, నీ భర్త ఇండస్ట్రీలో తీసుకురావాలని చూయడం ఘోరం అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: బిగ్‌బాస్ షోలో పృథ్వీ సేఫ్.. ఎంటర్టైనర్ అవుట్ -
నా సినిమా అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తాయి: నిర్మాత నాగవంశీ
నందమూరి బాలకృష్ణ-బాబీ కాంబోలో వస్తోన్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.అయితే ఇవాళ జరిగిన టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇందులో బాలయ్యను సరికొత్తగా చూపించనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు బ్లాక్స్ వేరే లెవల్లో ఉంటాయని అన్నారు. ఇంటర్వెల్ సీన్ బాలయ్య సీన్ మామాలుగా ఉండదని..టీజర్ కొన్ని ముక్కలు మాత్రమే కట్ చేసి చూపించామని నాగవంశీ వెల్లడించారు.(ఇది చదవండి: బాలకృష్ణ 'డాకు మహారాజ్' టీజర్ రిలీజ్)ఆ తర్వాత సంక్రాంతి రేస్, నాగవంశీ సినిమాల విడుదల డేట్స్‌పై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ఏడాది గుంటూరు కారం, అలాగే లక్కీ భాస్కర్ సినిమా విడుదల సమయంలో మీకు పోటీగా ఏదైనా సింపతి కార్డ్ సినిమా వస్తోందా? అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? దీనిపై మీరేమంటారని నాగవంశీని అడిగారు.దీనికి ఆయన స్పందిస్తూ..' ఈ ప్రశ్న అడిగిన మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నా సినిమా టైమ్‌లోనే ఇలాంటి బాంబులు పేలుస్తున్నారు. అప్పుడే అందరి కష్టాలు గుర్తొస్తున్నాయి. ఇకనుంచి నేను కూడా ఏదైనా కష్టాలు వెతుక్కోవాలి. వచ్చే సంక్రాంతికి మేము కూడా సింపతీ కార్డ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి' అంటూ సరదాగానే మాట్లాడారు.కాగా.. ఈ ఏడాది ప్రారంభంలో గుంటూరు కారంతో పాటు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. హనమాన్, నాసామిరంగ, సైంధవ్ చిత్రాలు సందడి చేశాయి. ఈ పోటీలో హనుమాన్ హిట్‌గా నిలిచింది. ఇటీవల దీపావళీ సందర్భంగా లక్కీ భాస్కర్‌తో కిరణ్ అబ్బవరం క మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.Memu Kooda Ee Sankranthiki edho Oka Sympathy Card tho Raavali.- #NagaVamsi Mass at #DaakuMaharaj title teaser eventpic.twitter.com/NsTps1FrRp— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) November 15, 2024 -
'ఇంతకంటే పెద్ద హిట్ ఎవరైనా తీయగలరా?'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
సీతారామం మూవీతో తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఆయన హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. ఈ సినిమాలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు మీడియా మిత్రులకు ఆయన పార్టీ ఇస్తానని మాటిచ్చారు. లక్కీ భాస్కర్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా నాగవంశీ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో ఒక్క నెగెటివ్ రివ్యూ గానీ.. నెగెటివ్ కామెంట్ కానీ చూపిస్తే అందరికీ పార్టీ ఇస్తానన్నారు.తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఈ విషయంపై నిర్మాత నాగవంశీ స్పందించారు. లక్కీ భాస్కర్లో ఎవరూ ఒక్క నెగెటివ్ పాయింట్‌ను పట్టుకోలేకపోయారని అన్నారు. ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఎవరూ కూడా చేయలేకపోయారు. ఇంతకంటే పెద్ద ఎవరైనా కొడతారా? అని నిర్మాత నాగవంశీ అన్నారు. ఇప్పుడు మీకు తప్పును పట్టుకోలేకపోయిందుకు పార్టీ ఇవ్వాలని ఫన్నీగా కామెంట్స్ చేశారు. కాగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో తీసిన ఈ సినిమాని డబ్బు ప్రధాన ఇతివృత్తంగా తీశారు. 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్‌ని కాస్త టచ్ చేశారు. ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తూ సాగిన ఈ మూవీకి తొలిరోజు రూ.12.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. -
నవంబర్ 1 నుంచి తమిళ్ సినిమా షూటింగ్స్ బంద్
తమిళ చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి కోలీవుడ్‌లో ఎలాంటి షూటింగ్స్ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ విషయంపై తాము గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని నిర్మాతల మండలి తాజాగా పేర్కొంది. తమిళ చిత్ర పరిశ్రమను పునర్నిర్మించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు ప్రకటించారు.తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 'నిర్మాతల సంఘం తరపున ఇప్పటికే పలు సమస్యలను తెరపైకి తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా బడ్జెట్‌తో పాటు నటీనటులు, టెక్నీషియన్ల ఫీజులు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయని నిర్మాతల మండలి పేర్కొంది. దీనిని నియంత్రించి, కొన్ని రకాల పరిమితులు తీసుకురావాలని వారు తెలిపారు. నిర్మాతల సమస్యలకు పరిష్కారం కనుగొనే వరకు నవంబర్ 1 నుంచి షూటింగ్‌లు, సినిమాలకు సంబంధిత ఇతర కార్యకలాపాలను ఆపేస్తున్నట్లు వారు నిర్ణయించాం. అయితే, ఈ నిర్ణయం పూర్తి చట్టవిరుద్ధమైన నిర్ణయమని నడిఘర్ సంఘం పేర్కొంది. ఇలాంటి చర్యలకు దక్షిణ భారత నటీనటుల సంఘం ఎప్పటికీ మద్దతివ్వదని తెలిపింది.తమిళ నిర్మాతల ప్రధాన డిమాండ్స్అగ్ర హీరోలు నటించిన చిత్రాలను థియేటర్లలో విడుదల చేసిన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ చేయాలి.ఇటీవలి కాలంలో ఎక్కువగా నటీనటులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ తీసుకుని ఇతర చిత్రాలకు వెళ్లడం వలన నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతల నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, సాంకేతిక నిపుణులు వారి సినిమా పూర్తయిన తర్వాతే మరొక చిత్రానికి పనిచేయాలి.అనేక తమిళ సినిమాలు సరైన థియేటర్లు దొరక్క నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి.నటీనటులు, టెక్నీషియన్ల జీతాలు, ఇతర ఖర్చులు అదుపులేకుండా పెరిగిపోతున్నందున, చిత్ర పరిశ్రమను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నాలు జరగాలి. -
టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి మరణించారు. 'వినాయక విజయం', 'ప్రతిబింబాలు' చిత్రాల్ని నిర్మించిన ఈయన ఆ తర్వాత మరే సినిమాలు చేసినట్లు లేరు. శనివారం రాత్రి బాపట్ల దగ్గరలోని కారంచేడులోని స్వగృహంలో మృతి చెందారు.(ఇదీ చదవండి: చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..)నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి మరణవార్తని చెప్పిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి.. సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: నయని సేఫ్, మెహబూబ్ ఎలిమినేట్!) -
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రెండు ప్రాంత్లాలో ఉన్న ఖరీదైన భూములపై కన్నేసి, నకిలీ పత్రాలతో కబ్జా చేసే ప్రయత్నం చేసిన టాలీవుడ్ నిర్మాత, రియల్డర్ బూరుగుపల్లి శివరామకృష్ణ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అరెస్టు అయిన మరుసటి రోజే బెయిల్‌పై బయటకు వచ్చిన ఈయన గురువారం మళ్లీ కటకటాల్లోకి వెళ్లారు. బెయిల్ రద్దు చేయడంతో పట్టుకున్న ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శివరామకృష్ణతో పాటు బెయిల్ పొందిన మరో నిందితుడు లింగమయ్య ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. శివరామకృష్ణ శ్రీవెంకటేశ్వర ఎస్టేట్స్ సంస్థకు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు. రాయదుర్గం పైగా విలేజ్‌లోని సర్వే నం.46లో ఉన్న 83 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు యాచారంలోని మరో 10 ఎకరాల ప్రైవేట్ భూమిపై కన్నేశారు. వీటిపై నకిలీ పత్రాలు సృష్టించిన శివరామకృష్ణ తార్నాకలో ఉన్న స్టేట్ ఆరై్కవ్స్లో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్న కె.చంద్రశేఖర్‌ను సంప్రదించారు. అతడి సహాయంతో వీటికి మద్దతుగా స్టేట్ ఆరై్కవ్స్ నుంచి ఓ నకిలీ పహాణీ, సేత్వార్ రూపొందించి, అటెస్టేషన్ చేయించి తీసుకున్నారు. వీటి ఆధారంగా సైదాబాద్‌కు చెందిన రియల్టర్ ఎం.లింగమయ్యతో కలిసి రంగంలోకి దిగిన శివరామకృష్ణ రాయదుర్గంలోని భూమి తనదే అంటూ అందులో పాగా వేశారు. యాచారంలో ఉన్న ప్రైవేట్ భూమి మీద వివాదం సృష్టించారు. శివరాకృష్ణ సమరి్పంచినవి నకిలీ పత్రాలని తేలి్చన న్యాయస్థానం అది ప్రభుత్వ భూమిగా ప్రకటించింది. దీనిపై నమోదైన కేసును దర్యాప్తు చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు ఈ నెల 17న శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగమయ్యలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే అనారోగ్య కారణాలు చూపిన శివరామకృష్ణ, లింగమయ్య ఆ మరుసటి రోజే బెయిల్ పొందారు. వీటిని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురికీ మంజూరు చేసిన బెయిల్ రద్దు చేసింది. దీంతో గురువారం శివరామకృష్ణను పట్టుకున్న పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించారు. స్టేట్ ఆరై్కవ్స్ ఉద్యోగి చంద్రశేఖర్ ఇప్పటికీ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. -
శ్రీవారి సేవలో దిల్‌రాజు దంపతులు.. వీడియో వైరల్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సతీసమేతంగా తిరుమల వెళ్లిన ఆయనకు ఆలయ పూజారులు తీర్థ, ప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. డిసెంబర్లోనే రావాల్సిన గేమ్ ఛేంజర్.. చిరంజీవి విశ్వంభర పొంగల్ పోటీ నుంచి తప్పుకోవడంతో రామ్ చరణ్ వచ్చేస్తున్నాడు. కాగా.. ఈ మూవీలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. Ace Producer #DilRaju along with his family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!!🙏✨#GameChanger #TeluguFilmNagar pic.twitter.com/v11nYzY8Lk— Telugu FilmNagar (@telugufilmnagar) October 24, 2024 -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలోని ప్రభుత్వ భూమిని కాజేసేందుకు బూరుగుపల్లి శివరామకృష్ణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. నకిలీ పత్రాలతో 84 ఎకరాల భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. నకిలీ పత్రాలతో వేల కోట్ల విలువైన 84 ఎకరాల భూమిని కొట్టేసే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు. స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి పత్రాలు తెప్పించుకున్న బూరుగుపల్లి శివరామకృష్ణ.. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించాడు. బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ తనదేనంటూ క్లయిమ్ చేసుకున్నాడు. ఈ నకిలీ పత్రాలపై 2003లోనే అప్పటి ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. చివరకు ఈ న్యాయ పోరాటంలో ప్రభుత్వం గెలిచింది. శివరామకృష్ణవి నకిలీ పత్రాలనేని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్‌పై కేసు నమోదు చేసిన ఓయూ పోలీసులు..తాజాగా వారిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాగా శివరామ కృష్ణ గతంలో రవి తేజ తో ‘దరువు’ మూవీతో పాటు యువత, రైడ్ లాంటి సినిమాలను నిర్మించారు. -
నిర్మాతతో మొరాకో టూర్లో హీరోయిన్ త్రిష! (ఫొటోలు)
-
'పుష్ప-2 చూశా'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. తాజాగా పుష్ప-2 మూవీపై టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. 'ఓ వారం క్రితం పుష్ప-2 రెండు సీన్స్ చూశా. అల్లు అర్జున్ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే ఏడేళ్లలో ఇండియాలో ఉన్న అన్ని అవార్డులను కొట్టేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది. ఒక యాక్టర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అలా ఉంటది. ఒక డైరెక్టర్ క్రియేటివిటీ పీక్స్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంటది. అందరికీ కూడా టాప్ ఫామ్‌లో ఉన్నప్పుడు.. అలాంటి ప్రొడక్ట్ మాత్రమే వస్తది. అది చూసినప్పుడు నాకు అలా అనిపించింది. డిసెంబర్లో రిలీజయ్యే పుష్ప-2 తెలుగు సినిమాను ఇంకోస్థాయికి తీసుకెళ్తుందని బలంగా నమ్ముతున్నా' అని అన్నారు.అంతేకాకుండా ప్రభాస్ ది రాజాసాబ్ గురించి ఆయన మాట్లాడారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 23 నుంచి సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ప్రారంభమవుతాయని నిర్మాత శ్రీనివాస కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. -
'అన్నింటి కంటే చీప్ సినిమా టిక్కెట్స్ మాత్రమే'.. టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
టాలీవుడ్లో సినిమా టిక్కెట్లపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అన్నింటితో పోలిస్తే ఒక్క సినిమా రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. మూడు గంటల పాటు ఎంటర్టైన్ చేసేందుకు ఆ మాత్రం టిక్కెట్ రేట్ పెట్టలేరా అని ఆడియన్స్‌ను ప్రశ్నించారు. ఓ కుటుంబంలో నలుగురు కలిసి సినిమాకెళ్తే కేవలం రూ.1500 మాత్రమే ఖర్చవుతుందని అన్నారు.దేవర సినిమాకు ఒక్క టికెట్ రూ.250 రూపాయలు అనుకుంటే నలుగురికి వెయ్యి రూపాయలు, పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 దాకా అవుతుందన్నారు. ఇంతకన్నా తక్కువ ధరలో మూడు గంటల పాటు ఎంటర్ టైన్మెంట్ అందించేది ఎక్కడా లేదన్నారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత తక్కువ ధరకు ఏక్కడైనా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందేమో చెప్పండి అని నాగవంశీ ప్రశ్నించారు.కాగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ దేవర కలెక్షన్స్ గురించి నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల సంతోషం కోసమే తాము కలెక్షన్స్ వెల్లడిస్తామని తెలిపారు. వారు సంతోషంగా ఉంటే మాకు కూడా హ్యాపీ అని అన్నారు. కానీ డబ్బులు వచ్చాయని చెబుతుంటే కొందరు మాత్రం నమ్మడం లేదన్నారు. ఎప్పుడు కూడా వసూళ్ల విషయంలో అసత్యాలు ప్రచారం చేయలేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సైతం వసూళ్లపై ఫుల్ క్లారిటీ ఉన్నారని నాగవంశీ తెలిపారు.సినిమా టికెట్ రేట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి...ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి కనీసం 1500 కూడా పెట్టలేరా అంటున్న నాగ వంశీ...VC: Great Andhra pic.twitter.com/UovWMmoJdi— Movies4u Official (@Movies4u_Officl) October 13, 2024 -
ఎగతాళి చేసినవాళ్లే గౌరవిస్తున్నారు
‘మనం సినిమా చూసేవాళ్లమే కానీ తీసేవాళ్లం కాదు’... భార్య వెంకట నర్సమ్మతో భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు అన్నారు. ఒక్క సినిమా అయినా నిర్మించాలనే తల్లి ఆలోచనను కాదన్నాడు కుమారుడు వెంకట రవీంద్రనాథ్. రెండేళ్లు ఇంటికి దూరంగా ఎక్కడికో వెళ్లిపోయాడు కూడా. కొడుకు ఆచూకీ తెలుసుకుని ఇంటికి పిలిపించుకున్న నర్సమ్మ మళ్లీ సినిమా పాటే పాడారు. ఇక చేసేదేం లేక సినిమా నిర్మించాలని ఫిక్స్ అయిపోయారు. నర్సమ్మ వేలి ముద్ర మాత్రమే వేయగలరు. కానీ వెండితెరపై నిర్మాతగా ఓ ముద్రగా మిగిలిపోవాలని కూలి చేసి సంపాదించిన డబ్బు, రాగి సంగటి హోటలు పెట్టి, దాని ద్వారా వచ్చిన ఆదాయం... ఇలా కష్టం చేసిన డబ్బుతో ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) సినిమాని ఆరంభించారు. ఇక... మిగతా విశేషాలు నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ, ఆమె భర్త చెన్నెబోయిన వెంకటేశ్వరరావు మాటల్లో తెలుసుకుందాం.‘‘నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. పొలం పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో నేను, నా స్నేహితులు కలిసి సినిమాలు చూసే వాళ్లం. ‘బ్రహ్మంగారి చరిత్ర, పొట్టేలు పున్నమ్మ’ సినిమాలు నా మనసుని బాగా కదిలించాయి. సినిమాలపై ఇష్టంతో ఎప్పటికైనా ఓ సినిమా నిర్మించాలనుకున్నాను. అందుకోసం పట్టుదలగా పదేళ్లు శ్రమించాను. ఆ కల ఇన్నేళ్లకు ‘స్పిరిట్’ (ఈజ్ నాట్ వన్) చిత్రంతో నెరవేరడం చాలా సంతోషంగా ఉంది’’ అని నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ అన్నారు. రవిబాబు, సత్యప్రకాశ్, ‘చిత్రం’ శ్రీను, చిట్టిబాబు, రమ్య, ప్రియ, పింకీ, జబర్దస్త్ నాగ్తేజ్, జూనియర్ రాజశేఖర్, సైదులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘స్పిరిట్’ ఈజ్ నాట్ వన్). తన కుమారుడు వెంకట రవీంద్రనాథ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎయిత్ వండర్ సినిమా పతాకంపై చెన్నెబోయిన వెంకట నర్సమ్మ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.నా కల ఇన్నేళ్లకు నెరవేరింది ఈ సందర్భంగా నిర్మాత చెన్నెబోయిన వెంకట నర్సమ్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ– ‘‘మాది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల గ్రామం. నేను చదువుకోలేదు కాబట్టి చదవడం, రాయడం రాదు. చెన్నెబోయిన వెంకటేశ్వరరావుతో నా పెళ్లయింది. పెళ్లి తర్వాత ఆయనతో కలిసి సినిమాలు చూసేదాన్ని. మాది వ్యవసాయ కుటుంబం. మాకున్న పొలంలో వ్యవసాయం చేసుకోవడంతో పాటు కూలి పనులకు వెళ్లేదాన్ని. బర్రెలు, మేకలు, పొట్టేళ్లు కూడా పెంచేవాళ్లం. ఓ చిన్నపాటి హోటల్ కూడా నడుపుతున్నాం. సినిమా నిర్మించాలనే నా ఆలోచనని ముందు నా భర్తకి చె΄్పాను. ఆ తర్వాత నా పెద్ద కుమారుడు వెంకట రవీంద్రనాథ్‌కి చె΄్పాను. సినిమా నిర్మాణం అంటే మాటలా? కోట్ల రూపాయలు కావాలి? మన ఆర్థిక పరిస్థితి ఏంటి? వద్దని వారించారు. ఆ తర్వాత నా పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి ఒప్పుకున్నారు. నా ఆలోచన నుంచి వచ్చిందే ‘స్పిరిట్’ సినిమా కథ. నా ఆలోచనలని వెంకట రవీంద్రనాథ్ చక్కగా తెరపై చూపించగలడనే నమ్మకంతో తననే డైరెక్షన్ చేయమన్నా. ఈ సినిమా కోసం మాకున్న పొలం, పశువులు, పొట్టేళ్లు, మేకలు, ఇల్లు అమ్మేశాం. సినిమా నిర్మాణం, పోస్ట్ ్రపొడక్షన్ పనులు, సెన్సార్ వంటి వాటికి ఇప్పటికే రూ. 90 లక్షలైంది. దాదాపు 40 లక్షలు దాకా అప్పులు చేశాం. సినిమా విడుదల చేసేందుకు పబ్లిసిటీ ఖర్చుల కోసం మరో రూ. 10 లక్షలు కావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... తెలంగాణాలోని దేవదాసీ వ్యవస్థలానే కోస్తాంధ్రలో మాతంగులు ఉండేవారు. ఇప్పుడూ ఉత్సవాలు, జాతర్లు, ఎల్లమ్మ తిరునాళ్ల వంటి సమయాల్లో వారిని డ్యాన్స్ చేయటానికి తీసుకొస్తుంటారు. వారి కష్టాలను కళ్లారా చూశాం. మాతంగుల జీవితాలు ప్రస్తుతం దుర్భరంగా ఉన్నాయి. వారిపై జరిగే దురాచారాలు పోవాలి. వారి పిల్లలు మాతంగుల వృత్తిలోకి రాకుండా చదువుకుని, ఉద్యోగాలు చేసుకోవాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం. త్వరలో ఆడియో రిలీజ్ చేసి, సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే మా బంధువులు, తెలిసినవారు, ఊర్లోని వారు ‘మీరేంటి? సినిమా నిర్మించేదేంటి?’ అంటూ హేళనగా, చులకనగా మాట్లాడేవారు. అన్నింటినీ భరించి, ఈ సినిమా నిర్మించాం. దీంతో ఎగతాళిగా మాట్లాడినవారే అనుకున్నధి సాధించావంటూ ఆ΄్యాయంగా మాట్లాడుతున్నారు... గౌరవంగా చూస్తున్నారు. సినిమా నిర్మించాలనే నా కల నెరవేరింది. ఇకపై సినిమా నిర్మించను. ఇండస్ట్రీలోనే ఉండాలా? వద్దా అన్నది మా అబ్బాయి వెంకట రవీంద్రనాథ్ ఇష్టం. మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ఆత్మస్థైర్యం కోల్పేలేదు – చెన్నెబోయిన వెంకటేశ్వరరావు సినిమా నిర్మించాలని ఉందని నా భర్య అన్నప్పుడు మొదట్లో నేను కూడా నవ్వుతూ, ఎగతాళి చేసేవాణ్ణి. అయితే తన పట్టుదల చూసి ఆ తర్వాత ఒప్పుకున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఈ సినిమా నిర్మించింది. ఈ సినిమా నిర్మాణం మాకో మధురానుభూతి. అలాగే ఓ విషాదం కూడా నింపింది. ఈ చిత్రంలో నటించిన మా రెండో అబ్బాయి పాముకాటుకు గురై మృతి చెందడం మమ్మల్ని కలిచివేసింది. మా అబ్బాయి నటించిన సన్నివేశాలు వచ్చినప్పుడు నా భార్య చూడదు... బాధపడాల్సి వస్తుందని. ఈ సినిమాలో నేనో పాత్ర చేశాను. ‘స్పిరిట్’ మాకు లాభాలు తీసుకురాకపోయినా పర్లేదు. కానీ, చేసిన అప్పులు తీర్చేలా డబ్బులు వస్తే చాలు. ఏది ఏమైనా సినిమా నిర్మించామన్న తృప్తి ఎప్పటికీ ఉంటుంది. -
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
Niharika Konidela: 'కమిటీ కుర్రోళ్ళు' టీమ్ లీడర్ నిహారిక (ఫోటోలు)
-
హీరో మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్లో మరో విషాదం. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనమామ, ప్రముఖ నిర్మాత ఉప్పాలపాటి సూర్యనారాయణ బాబు కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: బాబును అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది: నటి)సూపర్‌స్టార్ కృష్ణకు సూర్యనారాయణ బాబు.. బావ అవుతారు. ఈయన 'రామ్ రాబర్ట్ రహీమ్', 'సంధ్య', 'బెజవాడ రౌడీ' తదితర సినిమాలని నిర్మించారు. అలాంటిది ఇప్పుడు ఈయన మృతి చెందిన వార్తని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. (ఇదీ చదవండి: హీరో రవితేజని అన్ ఫాలో చేసిన ఛార్మీ.. ఏమైందంటే?)We deeply regret to inform that Film Producer, Sri. Uppalapati Suryanarayana Babu ( Brother-in-law of Superstar Krishna Garu) Renowned Producer (Films Produced: "Ram Robert Rahim" , "Sandhya", "Bazaar Rowdy" etc.,) passed away today (28.07.2024) at Apollo Hospital, Hyderabad. pic.twitter.com/2SiZfCPhwX— Telugu Film Producers Council (@tfpcin) July 28, 2024 -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?
టాలీవుడ్లో మెగా- అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని గతంలో చాలాసార్లు వార్తలొచ్చాయి. వీరి మధ్య రిలేషన్ దెబ్బతిన్నట్లు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున వైరలైంది. అంతే కాకుండా ఎన్నికలముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అప్పటి నుంచే వీరి మధ్య మరింత దూరం పెరిగినట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు స్పందించారు. ఆయ్ మూవీ ప్రెస్మీట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇచ్చారు.బన్నీ వాసు మాట్లాడుతూ.. 'కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీలో చిన్నచిన్న గొడవలు వస్తుంటాయి. కానీ నేను 20 ఏళ్ల నుంచి మెగా- అల్లు ఫ్యామిలీని చూస్తున్నా. వారి కుటుంబాలు కలిసి ఉండాలని చిరంజీవి ఎల్లప్పుడు కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తారు. అంతమందిని తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. చాలా ఖర్చు కూడా అవుతుంది. దానికి ప్రధాన కారణం అందరూ కలిసి ఉండాలనేదే ఆయన కోరిక. ఇలా చేయడం వల్ల మేమంతా ఒకటే అని చెప్పడం. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని విషయాల్లో ఇష్యూస్ వస్తాయి. కానీ ఇవీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. అంత మాత్రాన దీన్ని ఇలా చూడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వారి బంధం గురించి నాకు బాగా తెలుసు. వాళ్లందరూ కలిసి ఉండాలనే మేం అందరం కోరుకుంటాం.' అని అన్నారు. అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ గొడవ ఉందా??#AlluArjun #BunnyVas #TeluguFilmNagar pic.twitter.com/YFXCOxglXA— Telugu FilmNagar (@telugufilmnagar) July 19, 2024 -
'పొలిమేర' నిర్మాతల మధ్య వివాదం.. బెదిరింపులు-కేసుల వరకు!
గత కొన్నేళ్ల కాలంలో హారర్ స్టోరీల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమా 'పొలిమేర'. అంచనాల్లేకుండా రిలీజై అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ చిత్రానికి ఇదివరకే రెండు భాగాలు రాగా.. రీసెంట్‌గానే మూడో పార్ట్ కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగానే పార్ట్ 2 నిర్మించిన నిర్మాత మూడో భాగాన్ని తీస్తున్న నిర్మాతపై పోలీస్ కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్ )తాంత్రిక విద్యలు, చేతబడి కాన్సెప్ట్‌తో తీసిన 'మా ఊరి పొలిమేర' సినిమా.. 2021లో నేరుగా ఓటీటీలో రిలీజై సెన్సేషన్ సృష్టించింది. దీంతో రెండో భాగాన్ని గతేడాది థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓవరాల్‌గా పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేశాయి. రెండో భాగానికి గౌరి కృష్ణప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా, నందిపాటి వంశీ అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. నిర్మించింది తానే కాబట్టి వచ్చిన లాభాల్లో షేర్ కావాలని అడుగుతుంటే.. చంపేస్తానని తనని వంశీ బెదిరిస్తున్నాడని కృష్ణప్రసాద్ తాజాగా హైదారాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 'పొలిమేర 2 మూవీ రిలీజ్ తర్వాత రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ ఇప్పటివరకు నాకు లాభాల్లో పైసా కూడా ఇవ్వలేదు. నా షేర్ నాకు కావాలని డిమాండ్ చేస్తూ తనని కలిశాను. కానీ నన్ను చంపేస్తానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే దానికి తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు' అని నిర్మాత కృష్ణ ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య లాంచ్ అయిన మూడో భాగానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది వంశీనే కావడం ఇక్కడ ట్విస్ట్!(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్) -
తిరుమలలో టాలీవుడ్ నిర్మాత సురేశ్ బాబు, తమన్, గోపిచంద్ మలినేని (ఫొటోలు)
-
నిర్మాత చైతన్య రెడ్డి (ఫోటోలు)
-
మస్క్‌కు ధన్యవాదాలు తెలిపిన నిర్మాత.. ఎందుకంటే?
ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఇవాళ చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.అయితే ఆ ట్వీట్లో ఓ సినిమా పోస్టర్‌ను మస్క్ పంచుకున్నారు. దీంతో అందరి దృష్టి ఆ ఫోటోపైనే పడింది. ఇంతకీ ఆ పోస్టర్ చూస్తే ఇండియన్ సినిమాకే చెందినదిగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ సైతం ఆ పోస్టర్ గురించే చర్చ మొదలెట్టారు.అయితే ఆ పోస్టర్ కోలీవుడ్ సినిమాకు చెందినదిగా తెలుస్తోంది. తాజాగా మస్క్ షేర్ చేసిన ఫోటో.. తమ సినిమా తప్పట్టం లోనిది అంటూ తమిళ నిర్మాత ఆదం బవ రిప్లై ఇచ్చారు. నా చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. My thanks to Elon Musk for making my movie thappattam poster world famous..😁🙏🏻@elonmusk https://t.co/LRQ7teFgzn pic.twitter.com/pg9DRMImFa— Adham Bava (@adham_bava) June 11, 2024 -
ఆస్పత్రిలో చేరిన టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్..!
టాలీవుడ్ నిర్మాత బండ్లగణేశ్ ఆస్పత్రిలో చేరారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Tollywood producer Bandla Ganesh has been admitted to Apollo Hospital and is currently undergoing treatment for chest pain! pic.twitter.com/dFH5wBTMcs— Madhu (@offlinemadhu) June 3, 2024 -
లెక్క కుదిరింది
కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్)కి, షిప్ ఓనర్ (ప్రోడ్యూసర్)కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి. షిప్ (సినిమా)ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి, యజమాని నష్టపోకుండా కెప్టెన్ చూసుకుంటే.. ఇక అతనికి, యజమానికీ మధ్య మంచి అవగాహన కుదురుతుంది. మళ్లీ మళ్లీ కలిసి ప్రయాణం చేయాలనుకుంటారు.అలా లెక్కలు కుదిరి కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతున్నాయి. ఇలా ఓ దర్శకుడికి–నిర్మాతకి మధ్య స్నేహం కుదరడం, మళ్లీ కలిసి సినిమాలు చేయాలనుకోవడం ఓ ఆరోగ్యకరమైన వాతావరణం అని చెప్పాలి. రిపీట్ అవుతున్న ఆ దర్శక–నిర్మాతల కాంబినేషన్ గురించి తెలుసుకుందాం. ‘దిల్’ రాజు, అనిల్ రావిపూడిమూడోసారి ‘దిల్’ కలిసిందికుటుంబ నేపథ్యంలో సినిమాలు తీసి విజయాలు అందుకునే నిర్మాతగా ‘దిల్’ రాజుకి పేరుంది. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేలా సినిమా తెరకెక్కించగల దర్శకుడు అనిల్ రావిపూడి. వీరిద్దరి కాంబినేషన్లో సుప్రీమ్ (2016), ‘రాజా ది గ్రేట్’ (2017), ‘ఎఫ్ 2’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020), ‘ఎఫ్ 3’ (2022) వంటి హిట్ సినిమాలు వచ్చాయి. తాజాగా అనిల్–‘దిల్’ రాజు కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. ఇందులో వెంకటేశ్ హీరో. హిట్ చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ తర్వాత వెంకటేశ్–అనిల్ రావిపూడి–‘దిల్’ రాజు కాంబినేషన్లో రూపొందనున్న మూడో చిత్రమిది. ఈ సినిమాకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ అనుకుంటున్నారట. రవిశంకర్, నవీన్, సుకుమార్‌గురు–శిష్యులతో మైత్రీడైరెక్టర్ సుకుమార్–మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ (2018). రామ్‌చరణ్, సమంత జోడీగా నటించిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్–మైత్రీ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రం ‘పుష్ప: ది రైజ్’ (2021). అల్లు అర్జున్, రష్మికా మందన్న జోడీగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా సుకుమార్–నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ కాంబినేషన్లో ‘పుష్ప 2: ది రూల్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోనూ అల్లు అర్జున్, రష్మికానే జోడీగా నటిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.∙సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనాని దర్శకునిగా పరిచయం చేస్తూ వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉప్పెన’ (2021) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన రెండో చిత్రాన్ని కూడా మైత్రీలోనే చేస్తున్నారు బుచ్చిబాబు. రామ్‌చరణ్ హీరోగా నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సునీల్, రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ములశేఖర్‌తో మరో సినిమాప్రేమకథలే కాదు.. కుటుంబ కథలనూ తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా ‘కుబేర’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ (ఏషియన్ గ్రూప్), అమిగోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. కాగా శేఖర్, సునీల్ నారంగ్, రామ్మోహన్ కాంబినేషన్లో రూపొందుతోన్న రెండో చిత్రం ఇది. ఈ కాంబినేషన్లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన ‘లవ్ స్టోరీ’ (2021) సూపర్ హిట్టయింది. నాగ్ అశ్విన్, ప్రియాంక, అశ్వినీదత్, స్వప్నహోమ్ బేనర్లో నాగ్ అశ్విన్‌ఇంట్లోనే ఒక పెద్ద బేనర్ ఉంటే బయట బేనర్ల అవసరం అంతగా ఉండదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కి రెండు హోమ్ బేనర్లు వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ ఉన్నాయి. అశ్వినీదత్ రెండో కుమార్తె ప్రియాంక, నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్‌పై అశ్వినీదత్, స్వప్న సినిమాస్‌పై ఆయన కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ బేనర్లలో ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015), ‘మహా నటి’ (2018) సినిమాలకు దర్శకత్వం వహించారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ, వెంకీసార్‌తో ఆరంభమై లక్కీతో మళ్లీ...డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘సార్’ (తమిళంలో వాత్తి). ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ దర్శక–నిర్మాతల కాంబినేషన్లో తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ , మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెలహీరో కూడా రిపీట్‌శ్రీకాంత్ ఓదెల దర్శకునిగా పరిచయమైన చిత్రం ‘దసరా’ (2023). తొలి చిత్రంతోనే నానీని దర్శకత్వం వహించే చక్కని అవకాశం అందుకుని సద్వినియోగం చేసుకున్నారు. నాని, కీర్తీ సురేష్ జోడీగా శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ‘దసరా’ కాంబినేషన్లోనే మరో సినిమా రానుంది. నాని కెరీర్లో ఇది 33వ చిత్రం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారు. టీజీ విశ్వప్రసాద్, కార్తీక్ రెండోసారి రెండు భాగాలతో... ‘ఈగల్’ చిత్రం తర్వాత డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని–పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో ‘మిరాయ్’ సినిమా రూపొందుతోంది. రవితేజ, అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరో, హీరోయిన్లుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ‘ఈగల్’ ఈ ఏడాది విడుదలైంది. ప్రస్తుతం కార్తీక్–విశ్వప్రసాద్ కాంబినేషన్లో ‘మిరాయ్’ చిత్రం రూపొందుతోంది. తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ‘మిరాయ్’లో మంచు మనోజ్ కీలక పాత్ర చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలి భాగం 2025 ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలోనూ రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ, నిరంజన్ రెడ్డిఈసారి ‘జై హనుమాన్’తో...సంక్రాంతి అంటే స్టార్ హీరోల చిత్రాల పోటీ ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా హీరోగా ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయింది. ఇక ‘హనుమాన్’కి సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ–చైతన్య–నిరంజన్ రెడ్డి కాంబినేషన్లో ‘జై హనుమాన్’ రూపొందుతోంది. 2025లో ఈ చిత్రం విడుదల కానుంది.వీరే కాదు.. మరికొందరు దర్శక–నిర్మాతల కాంబినేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. -
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ ఆయన మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) కన్నుమూశారు. హృదయ సంబంధిత వ్యాధితో ఆమె తుదిశ్వాస విడిచారు.కాగా.. సూర్యదేవర నాగేంద్రమ్మ (90)కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు సంతానం. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారమే రిలీజ్ కానుంది. ఈ సమయంలో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఆస్కార్ విజేత మృతి!
హాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ఆస్కార్ అవార్డ్ విన్నర్, చిత్రనిర్మాత ఆల్బర్ట్ ఎస్ రడ్డీ కన్నుమూశారు. అనారోగ్యంతో లాస్ఎంజిల్స్లోని ఆస్పత్రిలో చేరిన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆల్బర్ట్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా.. ది గాడ్‌ఫాదర్, మిలియన్ డాలర్ బేబీ లాంటి చిత్రాలకు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. అల్ రడ్డీ సిట్కామ్ హొగన్ హీరోస్, డ్రామా వాకర్, టెక్సాస్ రేంజర్, ది లాంగెస్ట్ యార్డ్ లాంటి సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన బ్యాడ్ గర్ల్స్ (1994) చిత్రాన్ని కూడా నిర్మించాడు. ముఖ్యంగా మహిళా ప్రధాన పాత్రలతో మొదటి పాశ్చాత్య చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత బేస్ బాల్ కామెడీ ది స్కౌట్ (1994), మటిల్డా (1978) లాంటి కామెడీ ఓరియంటెస్ సినిమాలు నిర్మించారు. వీటితో పాటు డెత్ హంట్, మెగాఫోర్స్ , లాస్సిటర్, లేడీబగ్స్ , ప్రిజనర్స్, మీన్ మెషిన్ , కామిల్లె చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.Adiós al gran Albert S. Ruddy, productor (canadiense de nacimiento) con dos Oscars en su haber: EL PADRINO y MILLION DOLLAR BABY. Repitió con Clint Eastwood en CRY MACHO, y nos regaló (también como guionista y argumentista), entre otras pelis, EL ROMPEHUESOS, de Robert Aldrich. pic.twitter.com/gMlIAOMDjN— Fausto Fernández (@faustianovich) May 28, 2024 -
మీనా, ఆమె తల్లి నాతో దురుసుగా మాట్లాడారు.. నిర్మాత ఆవేదన
మీనా.. తెలుగు, తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్. దాదాపు అందరు అగ్ర హీరోలతోనూ నటించింది. ఎన్నడూ వివాదాల జోలికి వెళ్లిందే లేదు. 40 ఏళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ నటిగా రాణిస్తోంది. అయితే మీనా, ఆమె తల్లి తనను అవమానించారంటున్నాడు ఓ నిర్మాత.దురుసు వ్యాఖ్యలుమాణిక్యం నారాయణన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు. ఓ ప్రోగ్రామ్ చేయమని పిలవడానికి మీనా దగ్గరకు వెళ్లాను. కానీ అటు వైపు నుంచి నాకు సరైన స్పందన రాలేదు. మీనాయే కాదు ఆమె తల్లి కూడా చాలా దురుసుగా మాట్లాడారు. నేనొక నిర్మాతను.. నాలాంటి నిర్మాతలే కదా మీ సినిమాలకు కావాల్సింది. అలాంటి నన్ను పట్టుకుని అలా చీప్‌గా మాట్లాడతారా? నాకు చాలా బాధేసింది.వాళ్లందరూ నా స్నేహితులేఈ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏదీ అడగకూడదని తెలిసొచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఖుష్బూ, రోజా, సుహాసిని ఇలా చాలామంది సూపర్ హీరోయిన్లు నాకు స్నేహితులే! వాళ్లు నా కుమారుడి వివాహానికి కూడా వచ్చారు. అయినా ఈ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండటమే నయం అని పేర్కొన్నాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలో వైరల్‌గా మారాయి.చదవండి: ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్ -
పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
'ఆర్ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్ చేసిన ఆరోపణలపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ స్పందించింది. నాలుగేళ్ల క్రితం నటించిన రక్షణ సినిమాను ప్రమోట్ చేయకపోతే టాలీవుడ్ బహిష్కరిస్తామంంటున్నారని పాయల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై టీఎఫ్‌పీసీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. పాయల్ సినిమాను ప్రమోట్ చేయడానికి డేట్లు కేటాయించకపోవడంపై నిర్మాత, దర్శకుడు ప్రణ్‌దీప్ ఠాకూర్ నుంచి మార్చిలోనే తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. అతను ఈ సినిమాను ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాడని తెలిపింది. కానీ ఇందుకు పాయల్ సహకరించలేదని.. మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించింది. ప్రమోషన్స్‌కు వస్తే ఆమెకు చెల్లించాల్సిన రూ.6 లక్షలు ఇచ్చేందుకు నిర్మాత సిద్ధమయ్యారని.. కానీ పాయల్ పట్టించుకోలేదని వెల్లడించారు.ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. ఆమె ఆరోపణలను ఖండిస్తూ.. మేనేజర్ ద్వారా పాయల్‌ను కలిసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని టీఎఫ్‌పీసీ పేర్కొంది. ఈ చిత్రంలో పాయల్ నటించినందున ప్రమోషన్స్ సమయంలో ఆమె పేరును ఉపయోగించుకునే హక్కు నిర్మాత, దర్శకుడు ప్రణ్దీప్కు ఉందని వారు పేర్కొన్నారు.బ్యాన్ చేస్తామంటూ..కాగా.. అంతకుముందు పాయల్ తనను బెదిరిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. రక్షణ సినిమా ప్రమోషన్లకు పాల్గొనకపోతే టాలీవుడ్లో నిషేధిస్తామంటున్నారంటూ ఆరోపించింది. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆ చిత్ర యూనిట్‌తో నా టీమ్ ఇప్పటికే చెప్పిందని.. కానీ వారు మాత్రం చెల్లించేందుకు ముందుకు రాలేదని పేర్కొంది. నా ప్రమేయం లేకుండా ఆ సినిమాలో నాపేరు, పాత్ర ఉంటే నేను న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె స్పష్టం చేసింది.'రక్షణ'లో పోలీస్ ఆఫీసర్‌గా పాయల్రక్షణ చిత్రంలో పాయల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రోషన్, మానస్ తదితరులు నటించారు. ఈ మూవీని హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. జూన్ 7న ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటన కూడా వెలువడిన విషయం తెలిసిందే. Producer & Director Sri Prandeep Thakore gave a complaint on his film "Rakshana" Heroine and Lead artist Ms. Payal Rajput at Telugu Film Producers Council pic.twitter.com/0TlzpYmA3s— Telugu Film Producers Council (@tfpcin) May 20, 2024 -
ఛార్మీ కౌర్ 37వ పుట్టినరోజు స్పెషల్ ఫోటోలు
-
కొత్త ఎలక్ట్రిక్ కారు కొన్న అల్లు అరవింద్.. ధరెంతంటే?
తెలుగు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొత్త కారు కొన్నాడు. ఈసారి బీఎమ్‌డబ్ల్యూ ఐ7 బ్రాండ్‌ను తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. చూడటానికి ఎంతో స్టైలిష్‌గా ఉన్న ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రెండున్నర కోట్ల పైనే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందించాడు. పసివాడి ప్రాణం, మెకానిక్ అల్లుడు, జల్సా, మగధీర, సరైనోడు, అల వైకుంఠపురములో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలున్నాయి.తండ్రి నిర్మాతగా, తనయుడు హీరోగా బిజీఅల్లు అర్జున్ 22వ సినిమాతో పాటు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించే సినిమా సైతం గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే నిర్మితం కానుంది. కొన్ని ఇతర భాషా చిత్రాలను అరవింద్ ఇక్కడ డబ్ చేయిస్తూ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు అల్లు అరవింద్ తనయుడు, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by BMW KUN Exclusive (@bmwkunexclusive_ts_ap) -
అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ప్రముఖ నిర్మాత
ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఈయన మృతిపై తలో రకంగా కామెంట్స్ వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తొలుత గుండెపోటుతో చనిపోయారని అనగా.. కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఫ్యామిలీ స్టార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయిందా?) జగదీష్.. మస్త్ మజా మాది, స్నేహితారు తదితర చిత్రాలని నిర్మించారు. అప్పు-పప్పు సినిమాతో తన కొడుకుని హీరోగా పరిచయం చేశాడు. సినిమాల నిర్మాణంతో పాటు ఈయన ఇండస్ట్రీలిస్ట్ కూడా. అలానే బెంగళూరులో ఓ పబ్ కూడా ఉంది. ఆదివారం ఉదయం జగదీష్ ఉరి వేసుకోగా, కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్ కి లేవని ఇతడి ఫ్రెండ్ శ్రేయస్ చెప్పారు. కానీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
విజయ్ బాగా డబ్బున్నోడు.. బేబీ నిర్మాత కౌంటర్
హీరో విజయ్ దేవరకొండ.. మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చినవాడే! ఎన్నో కష్టాలు పడి గొప్ప స్థాయికి ఎదిగాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీస్టార్ రేపు(ఏప్రిల్ 5న) రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. పెళ్లి చూపులు సినిమా తర్వాతే బైక్ ఫుల్ ట్యాంక్ కొట్టించాను.. అప్పటివరకు నా జీవితంలో బండి ఫుల్ ట్యాంకు కొట్టించలేదు అని చెప్పాడు. ఇది చూసిన కొందరు అంత సీన్ లేదు.. నీకు మంచి బ్యాగ్రౌండ్ ఉంది.. నువ్వు మిడిల్ క్లాస్ అంటే నమ్మమంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ట్రోలింగ్‌పై బేబీ, టాక్సీవాలా చిత్రాల నిర్మాత ఎస్కేఎన్ (శ్రీనివాస కుమార్) స్పందించాడు. 'ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినా కంటెంట్ బాగోలేకపోతే సినిమా చూడం.. ఒకవేళ డబ్బులున్నవాడని కంటెంట్ బాగున్నా సినిమా చూడకుండా ఆగిపోము. కాబట్టి అతడికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత అతడు శ్రీనగర్‌లో మాకు దగ్గర్లోనే ఓ చిన్నపాటి ఫ్లాట్‌లో అద్దెకు ఉన్నాడు. నేను అతడిని ఫస్ట్ టైమ్ అక్కడే కలిశాను. కష్టపడి పైకి వచ్చినవాళ్లకు.. ఆ కష్టాన్ని చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉంది. అందుకే అది ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు. ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. డబ్బులు సంపాదించాలనే.. నచ్చితే సినిమా చూడు, లేకపోతే మనేయ్. ఎందుకు ఒకరి మీద పడి ఏడవడం సోదరా? వీలుంటే అతడి పదాలను ఇన్స్పిరేషన్గా తీసుకో.. కష్టపడి తనలా ఓ స్థాయికి ఎదుగు. అప్పుడు నీకు ఆ తృప్తి ఏంటో తెలుస్తుంది' అని కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ కూడా ఓ వ్యక్తి.. విజయ్ సోదరుడు ఆనంద్ అమెరికా వెళ్లాడుగా.. మరి మధ్యతరగతి వ్యక్తికి అదెలా సాధ్యమని ప్రశ్నించాడు. దీనికి ఎస్కేఎన్ స్పందిస్తూ.. మిడిల్ క్లాస్ కాబట్టే డబ్బులు సంపాదించుకుందామని పోయాడు. కోట్లు ఉంటే ఇక్కడే ఎంజాయ్ చేస్తారు కదా.. ఇప్పుడు అమెరికా, కెనడా పోయే విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారందరికీ కోట్లు ఉన్నాయా? అని ప్రశ్నించాడు. Middle class kabatte dabbulu sampadinchukondam ani poyindu Kotlu unte ikkade enjoy chestaru kadha Ippudu U S U K Canada poye students /job holders andaru crores unnaya — SKN (Sreenivasa Kumar) (@SKNonline) April 4, 2024 చదవండి: డేరింగ్ స్టంట్స్.. అజిత్ కారు ప్రమాదం వీడియో వైరల్ -
నిర్మాత లైంగిక వేధింపులు.. ఆ విషయంలో సంతోషంగా ఉందన్న నటి!
బాలీవుడ్లో ప్రముఖ రియాలిటీ షో తారక్ మెహతా కా ఊల్టా చష్మా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఈ షోలో రోషన్ దారువాలా కౌర్ సోధి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జెన్నిఫర్ మిస్త్రీ బన్సీవాల్ అర్ధాంతరంగా తప్పుకుంది. ఆ తర్వాత షో నిర్మాత అసిత్ కుమార్ మోడీ లైంగిక వేధింపుల గురి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసిత్ కుమార్ మోడీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాజాగా ఈ కేసులో జెన్నిఫర్ మిస్త్రీ విజయం సాధించినట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడిందని తెలిపింది. అయితే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని పోలీసులను కోరినట్లు ఆమె వెల్లడించారు. నాకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే పరిహారంగా అందించారని తెలిపారు. ఈ కేసులో నాకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.25 నుంచి 30 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అదనంగా మరో రూ.5 లక్షలు కోర్టు జరిమానా విధించినట్లు ఆమె వెల్లడించింది. అయినప్పటికీ ఈ కేసులో తనకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని జెన్నిఫర్ మిస్త్రీ వాపోయింది. జెన్నిఫర్ మాట్లాడుతూ.." ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చి 40 రోజులకు పైగా అయింది. ఇంకా నాకు రావాల్సిన మొత్తం పరిహారం రాలేదు. అతన్ని దోషిగా నిరూపించినప్పటికీ.. ముగ్గురు నిందితులకు ఎలాంటి శిక్ష విధించలేదు. సోహిల్ రమణి, జతిన్ బజాజ్‌లను దోషులుగా చేర్చలేదు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కేసు తీర్పుతో నేను ఎలాంటి ప్రచారాన్ని కోరుకోవడం లేదు. నాపై జరిగిన వేధింపులను గుర్తించినందుకు సంతోషిస్తున్నా. ఈ కేసులో ప్రస్తుతానికి నాకు సరైన న్యాయం లభించలేదని భావిస్తున్నా" అని చెప్పింది. కోర్టు విధించిన పరిహారం చిన్నదని.. ఇలాంటి నేరాలు ఇతరులు చేసేలా ప్రేరేపించవచ్చని నటి పేర్కొంది. -
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
నిర్మాత మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్ (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్‌ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్. ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్‌కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు. అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్‌తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్ (85) గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలుజారి పడ్డారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు మహేశ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 1975లో 'మాతృమూర్తి' సినిమాతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ 'మనుష్యులంతా ఒక్కటే', 'మహాపురుషుడు', చిరంజీవి 'సింహపురి సింహం', సుమన్ 'ముసుగు దొంగ' చిత్రాల్ని నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్‌కి ప్రొడ్యూసర్, రైటర్‌గా పనిచేశారు. నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. పెళ్లి చేసుకోకుండానే చివరివరకు ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. (ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
ప్రముఖ నిర్మాతకు చెందిన షాపింగ్ మాల్ సీజ్
కన్నడ ప్రముఖ నటుడు, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు చెందిన షాపింగ్ మాల్‌కు తాళం పడింది. ఈరోజు (ఫిబ్రవరి 14) ఆయనకు సంబంధించిన మాల్‌ను బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) అధికారులు సీజ్ చేశారు. బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ ప్రీతీ గెహ్లాట్, జోనల్ జాయింట్ కమిషనర్ బాలశేఖర్ సమక్షంలో అధికారులు దాడులు నిర్వహించారు. 2011 నుంచి 2022- 23 వరకు మాల్ మేనేజ్మెంట్ వారు బోర్డుకు చెల్లించాల్సిన పన్ను రూ. 11.51 కోట్లు ఉంది. ఇంత మొత్తంలో కార్పొరేషన్‌కు ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉందని డిమాండ్ నోటీసు జారీ చేసినా వారి నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. రాక్‌లైన్ వెంకటేష్ కన్నడతో పాటు అనేక తెలుగు చిత్రాలను నిర్మించారు. ఆపై సినిమా పంపిణీ వ్యవహారంలో కూడా ఉన్నారు. బజరంగీ భాయిజాన్, లింగా (రజనీకాంత్), కాటేరా, పవర్ (రవితేజ), ఆటగధరా శివ వంటి చిత్రాలతో పాటు పలు కన్నడ, తమిళ్ సినిమాలను రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకటేష్ నిర్మించిన విషయం తెలిసిందే. దాసరహళ్లి జాయింట్ కమిషనర్ బాలశేఖర్ ఏం చెప్పారంటే.. 'మాల్ యాజమాన్యం పన్నులో సగం అయినా చెల్లించాలి.. అప్పటి వరకు మాల్ తెరవలేం.. ఇంతకు ముందు ఈ కేసు కోర్టులో ఉంది.. ఏడాది క్రితం కేసు పరిష్కారమైంది. అయినా పన్ను చెల్లించలేదు. ఈ కారణంగానే ఈరోజు మాల్‌కు తాళం వేశాం.. దానికి తాళం వేయడాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయినప్పటికీ మా కర్తవ్యాన్ని నిర్వర్తించాం.' అని అన్నారు. రాక్‌లైన్ మాల్ మేనేజర్ ప్రకాశ్ వ్యాఖ్యలు 'మాకు నోటీసులు ఇవ్వలేదు.. నిన్న రాత్రి నోటీసు ఇవ్వడానికి వచ్చారు.. రాక్‌లైన్ సార్ వచ్చే వరకు ఆగాలని చెప్పాం.. అయినా వెయిట్ చేయలేదు.. ఈరోజు ఉదయం వచ్చి సడన్‌గా మాల్‌కు తాళం వేశారు. కోర్టు ద్వారా డబ్బులు జమ చేయాలని చెప్పి అధికారులు వెళ్లిపోయారు.' అని తెలిపాడు. గత 10 సంవత్సరాల నుంచి రాక్‌లైన్ వెంకటేష్ పన్ను చెల్లించడం లేదని బీజేపీ బెంగళూరు సౌత్ జిల్లా విభాగం అధ్యక్షుడు ఎన్. ఆర్ రమేష్ ఆరోపించారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు కూడా ఆయన సమర్పించారు. బీబీఎంపీ అధికారులు రాక్‌లైన్ మాల్ ప్రాపర్టీని కొలిచినప్పుడు అది 1,22,743 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు తేలింది. అంటే సుమారు 73000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని రిజిస్ట్రేషన్ చేయలేదని, పన్ను ఎగ్గొట్టారని రమేష్‌పై ఫిర్యాదు చేశారు. అప్పట్లో కార్పొరేషన్ జారీ చేసిన నోటీసును ప్రశ్నిస్తూ రాక్‌లైన్ వెంకటేష్ కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను ఇప్పుడు కొట్టివేసింది. దీంతో పన్ను బకాయిల కారణంగా మాల్‌కు తాళం పడింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఇలాగైతే విజయ్ గెలవడు.. అలా చేయాల్సిందే!: నటుడు
దళపతి విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరుతో పార్టీని ప్రారంభించడంతో తమిళనాట పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే విజయ్ సొంతంగా మాట్లాడకుండా తన తరఫున బుస్సీ ఆనంద్ మీడియా ద్వారా ప్రకటనలు చేస్తే గెలవరని నటుడు, నిర్మాత కె.రాజన్ అన్నారు. ఆయన ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎంజీఆర్ ప్రజలకు చేసిన సేవల్లో 30 శాతం చేస్తే విజయ్ రాజకీయాల్లో రాణిస్తారన్నారు. ఆయన ప్రజలకు మంచి చేస్తారని భావిస్తున్నానన్నారు. నినైవెల్లా నీయడా చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై కె.రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇళయరాజా సంగీతం.. లేఖా క్రియేటర్స్ పతాకంపై రాయల్ ప్రభు నిర్మించిన చిత్రం నినైవెల్లా నీయడా. సెటిలైంది, రణతంత్ర, ఆరువా సౌండ్ వంటి హిట్ సినిమాల ఫేమ్ ఆదిరాజన్ ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు రాసి దర్శకత్వం వహించారు. ప్రాజన్, మనీషాయాదవ్ జంటగా నటించగా రాజా భట్టార్జి చాయాగ్రహణం, ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఇది ఇళయరాజా సంగీతం అందించిన 1,417వ చిత్రం కావడం విశేషం. చిత్ర ఆడియో లాంచ్ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఆయన్ను కలవడమే కష్టమన్నారు.. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత కె.రాజన్, దర్శకుడు పేరరసు, ఆర్వీ ఉదయకుమార్, నిర్మాత కేఆర్ సినీ ప్రముఖులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు ఆదిరాజన్ మాట్లాడుతూ.. ఇది మధురైలో తన మిత్రుడి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఇందులో 70 శాతం వాస్తవం కాగా 30 శాతం కల్పితమని పేర్కొన్నారు. ఇళయరాజాను చేరడమే కష్టమని కొందరు చెప్పారని, అలాంటిది ఈ చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇళయరాజాతో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
పెళ్లి చేసుకుందామంటూ ఇంటికి పిలిచి నిండా ముంచేసిన మహిళా నిర్మాత
గతంలో జరిగిన పెళ్లిళ్ల విషయాన్ని దాచిపెట్టి ఓ మహిళ ప్రేమ పేరుతో యువకుడిని పెళ్లి చేసుకుంది. అతని వద్ద నుంచి అందినకాడికి దండుకుంది. తీరా ఆమె గురించి విస్తుపోయే నిజాలు బయటపడడంతో తాను మోసపోయాయని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తాను పనిచేసిన ఓ సినిమా షూటింగ్లో మహిళా నిర్మాత అతనికి పరిచయం అయ్యింది. సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం సదరు మహిళా నిర్మాత అతనికి ఫోన్ చేసి డిన్నర్ చేసేందుకు ఇంటికి రావాల్సిందిగా చెప్పింది.ఆ సమయంలో భర్తకు విడాకులు ఇచ్చి పెళ్ళి చేసుకుందామని సదరు మహిళ నాగార్జున బాబుకు చెప్పింది. దీనికి కూడా అతను ఒప్పుకోవడంతో ఇరువురూ చిలుకూరి బాలాజీ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఆమె అతని నుంచి రూ. 18,50,000లను నేరుగా, మరో రూ. 10 లక్షలను ఆమె బ్యాంక్ అకౌంట్లోకి వేయించుకుంది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన నాగార్జునబాబు విచారించగా అప్పటికే ఆమెకు రెండు వివాహాలు అయ్యాయని, ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిసింది. కానీ తనకు ఒక వివాహం అయ్యిందని, పిల్లలు లేరని చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బులు కాజేసిందని గ్రహించాడు. అలాగే గతంలో ఆమె పలువురిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిసింది. వైజాగ్ గాజువాక పోలీస్ స్టేషన్లో భరత్ అనే వ్యక్తిపై, కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తిపై, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కార్తికేయ అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసింది. తనను కూడా బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురిచేస్తుందంటూ నాగార్జున జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హనుమాన్ సూపర్ హిట్.. డైరెక్టర్‌కు కళ్లు చెదిరే గిఫ్ట్!
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ప్రశాంత్ వర్మ. సంక్రాంతి కానుకగా రిలీజైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా వచ్చి దాదాపు రూ.250 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ప్రశాంత్ వర్మ మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. జై హనుమాన్ పేరుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. ఈ మూవీ ఘన విజయం సాధించండంతో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. అంతే కాదు దాదాపు రూ.6 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇవ్వనున్నారట. ఇప్పటికే కారును కూడా బుక్ చేసినట్లు సమాచారం. సాధారణంగా సినిమాలు సూపర్ హిట్ అయితే ఖరీదైన కార్లు బహుమతిగా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. గతంలోనూ పలువురు నిర్మాతలు డైరెక్టర్లకు కార్లు బహుమతులుగా అందించారు. బేబీ డైరెక్టర్‌కు ఇలాగే నిర్మాత కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతే కాకుండా విశాల్ మార్క్ ఆంటోనీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌కు కారు బహుమతిగా ఇచ్చి నిర్మాత సర్ప్రైజ్ ఇచ్చారు. రజినీకాంత్, నెల్సన్‌కు కాస్ట్ లీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మకు సైతం ఖరీదైన కారు ఇవ్వనుండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!
సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద నాలుగు చిత్రాలు పోటీపడ్డాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగా ప్రేక్షకులను పలకరించాయి. అయితే తీవ్రమైన పోటీ ఉండడంతో రవితేజ సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకున్నారు. ఇక సంక్రాంతి సందడి ముగియడంతో అందరి దృష్టి సమ్మర్ సీజన్ సినిమాపైనే ఉంది. మరికొద్ది రోజుల్లో రానున్న సమ్మర్లో అలరించేందుకు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. ఈ సందర్భంగా రవితేజ ఈగల్ మూవీ మేకర్స్‌ను ఆయన ప్రశంసించారు. ఫిబ్రవరి 9న రిలీజవుతోన్న ఈ చిత్రానికి వీలైనన్నీ ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అయితే కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా రిలీజ్‌పై దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమ్మర్లో రిలీజ్ కావాల్సిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ పోస్ట్ పోన్ అయితే తాము పోటీలో ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'సంక్రాంతి సినిమాలకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. వచ్చే సంక్రాంతికి నేను ప్రెసిడెంట్‌గా ఉండను. మరో ఆరు నెలల్లో నా టర్మ్ అయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నా సినిమా తప్పకుండా ఉంటుంది. ఈ ఏడాది సమ్మర్లో దేవర సినిమా ఉంది. ఒకవేళ దేవర వాయిదా పడితే మేము వస్తామని అన్ అఫీషియల్‌గా చెప్పాం. దేవర పోస్ట్ పోన్ అయితే మా సినిమా ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఇప్పటికే ఒకసారి చెప్పాం కదా ' అని క్లారిటీ ఇచ్చారు. -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
పండుగ వల్లే అన్ని కలెక్షన్స్ వచ్చాయా?
-
గుంటూరు కారంపై నెగెటివ్ టాక్.. మహేశ్‌బాబు ఏమన్నాడంటే?
'అతడు', 'ఖలేజా' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారంలోనే ఈ సినిమా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. భారీ వసూళ్లు.. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు నిర్మాత ఎస్. నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. "గుంటూరు కారం సినిమా విడుదలై నిన్నటితో వారం రోజులు అయింది. కొందరి అంచనాలను తప్పని నిరూపిస్తూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బయ్యర్లు అందరూ బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యారు. కొందరు కావాలనే ఈ సినిమాను టార్గెట్ చేసి తప్పుడు రివ్యూలిచ్చారు. కానీ కుటుంబ ప్రేక్షకులు, సాధారణ ప్రేక్షకులు ఎప్పుడైతే సినిమాకి రావడం మొదలుపెట్టారో సాయంత్రానికి ఒక్కసారిగా టాక్ మారిపోయింది. ఇది నేను చెప్పడం కాదు.. ఇప్పటిదాకా సాధించిన వసూళ్లే చెబుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. మహేశ్‌కు మొదటి నుంచీ నమ్మకముంది గతంలో మా బ్యానర్ నుంచి పండగకి ఒక సినిమా వచ్చేది. సినిమా బాలేదని రివ్యూలు వచ్చాయి. వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కానీ ఇప్పుడు గుంటూరు కారం చిత్రం రివ్యూలతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతోంది. పండగ కారణమైతే అన్ని సినిమాలు హిట్ కావాలి కదా. పండగకు వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మహేశ్‌బాబు మొదటి నుంచి ఈ సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మొదట్లో నెగటివ్ రివ్యూలు వచ్చినా ఆయన ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఆయన అంచనా నిజమైంది రేపటి నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడండి అంటూ మాకు భరోసా ఇచ్చారు. ఆయన అంచనానే నిజమైంది. ఆయన ధైర్యమే ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమైందనిపించింది. ఇది మాస్ సినిమా అని అంతా భావించారు. త్రివిక్రమ్ గారి శైలిలో ఉండే ఫ్యామిలీ సినిమా అని ముందుగా ప్రేక్షకులకు తెలిసేలా చేయలేకపోయాము. అయినా జానర్ ను బట్టి ఒక్కో సినిమా ఒక్కో ప్రాంతంలో ఎక్కువ వసూళ్లు రాబడుతుంది. సినిమా విజయం అనేది మొత్తం వసూళ్లపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. చదవండి: చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా.. అయినా తన నుంచి మెసేజ్.. -
Ekta Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ (ఫోటోలు)
-
టాలీవుడ్ అగ్ర నిర్మాతపై అసభ్యకర కామెంట్స్.. ప్రముఖ సినీ రచయితపై కేసు.!
సినీ మాటల రచయిత రాజసింహపై కేసు నమోదైంది. ప్రముఖ నిర్మాత కూచిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కథల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదమే కారణమని తెలుస్తోంది. రాజాసింహ తన కుటుంబ సభ్యులకు అసభ్యకరమైన, బెదిరింపు సందేశాలు పంపిస్తున్నట్లు వివేకానంద ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను అగౌరవపర్చేలా సామాజిక మాధ్యమాల్లోనూ సందేశాలు పెట్టాడని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా దర్శకుడు రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, ఠాగూర్ మధు లాంటి వారిని సైతం దూషిస్తూ సందే శాలు పెట్టాడని కూచిబొట్ల గురువారం పోలీసులను ఆశ్రయించారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. అసలు రాజాసింహ ఎవరు? ఇదిలా ఉండగా.. రాజసింహ తడినాడ దాదాపు 60 సినిమాలకు పైగా రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ నటించిన ‘రుద్రమదేవి’ సినిమాకి డైలాగ్ రైటర్‌గా పని చేశారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన ‘గోన గన్నా రెడ్డి’ పాత్రకి రాజసింహ రాసిన డైలాగులకి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అదే క్రేజ్‌తో దర్శకుడిగా మారిన రాజసింహ.. యంగ్ హీరో సందీప్ కిషన్‌తో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రాజసింహకి సినిమా అవకాశాలు తగ్గాయి. అయితే పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందుల కారణంగా రాజసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటినుంచి రాజసింహ బయట పెద్దగా కనిపించడం లేదు. -
తండ్రికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడ్ అంటూ విషెస్ తెలిపారు. (ఇది చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్లో పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. Happy Birthday Dad 🖤 pic.twitter.com/nrlLF4yRHM — Allu Arjun (@alluarjun) January 10, 2024 -
ఆ హిట్ సినిమాకు 50 ఏళ్లు.. ఘనంగా స్వర్ణోత్సవం!
ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన పాత్రల్లో కె. సత్యం దర్శకత్వంలో కాకర్ల కృష్ణ నిర్మించిన చిత్రం ‘ఇంటింటి కథ’ (1974). ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం జరిగింది. కాకర్ల కృష్ణ మనవడు త్రికాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత, నటుడు మురళీ మోహన్ హాజరయ్యారు. మురళి మోహన్ మాట్లాడుతూ– ‘‘వీబీ రాజేంద్ర ప్రసాద్‌గారి జగపతి సంస్థలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రయాణం ప్రారంభించిన కృష్ణ ఆ తర్వాత ‘ఇంటింటి కథ’ సినిమాతో నిర్మాతగా మారారు’ అని అన్నారు. కాకర్ల కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ఆత్మీయల సమక్షంలో నా స్వర్ణోత్సవం జరగటం సంతోషంగా ఉంది. ఇది నా జీవితాంతం తీపి జ్ఞాపకంగా ఉంటుంది. కృష్ణ స్వర్ణోత్సవం జరగడం సముచితంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నిర్మాతలు కె. దామోదర ప్రసాద్, జి. ఆదిశేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్‌ని వెండితెరకు తెచ్చిన 'కృష్ణవేణి' ఎవరో తెలుసా..?
మణిలాంటి నటి... మణిలాంటి గాయని... మణిలాంటి నిర్మాత... కృష్ణవేణి చిత్రసీమకు ఒక అమ్యూలమైన మణి. మంచి నటీమణిగా తెరపై తన అభినయాన్ని కనబర్చారు. మంచి గాయనీమణిగా తన గాత్రాన్ని వినిపించారు. ‘మన దేశం’ వంటి చిత్రంతో అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు. నేడు నూరవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు సి. కృష్ణవేణి. ఈ సందర్భంగా కృష్ణ‘మణి’ జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న జన్మించారు కృష్ణవేణి. తండ్రి యర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్నారు కృష్ణవేణి. ఆ తర్వాత వెండితెరపైనా ప్రేక్షకులను మెప్పించారు. ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఆ సమయంలో రాజమండ్రి వెళ్లినప్పుడు ఆయన ‘తులాభారం’ నాటకం చూశారు. అందులో కృష్ణవేణి నటన నచ్చి, సినిమాలో నటించమని అడి గారు. అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాలో తొలి అవకాశం అందుకున్నారు కృష్ణవేణి. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1973) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు. ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. నటిగా ఆమెకు ‘గొల్లభామ, లక్ష్మమ్మ’ వంటి చిత్రాలు బాగా పేరు తెచ్చాయి. ‘కచదేవయాని, గొల్లభామ, అనసూయ’ వంటి పలు చిత్రాల్లో పాటలు పాడారు కృష్ణవేణి. ‘తిరుగుబాటు’ సినిమాలో ఆమె చేసిన వ్యాంప్ క్యారెక్టర్‌పై ప్రేక్షకులు పెదవి విరిచారు. 1942లో రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనూరాధ జన్మించడం.. భర్త రాజా సినిమాల నిర్మాణంలో బిజీగా ఉండటంతో స్టూడియో వ్యవహారాలు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాలతో నటనకు స్వస్తి పలికారు కృష్ణవేణి. కుమార్తె పేరుపై ‘ఎంఆర్ఏ’ప్రోడక్షన్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మన దేశం’ (1949) సినిమా తీసి, విజయం అందుకున్నారు. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని వెండితెరకు పరిచయం చేశారు కృష్ణవేణి. కాగా ‘వరూధుని’ సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావుని పిలిపించి, ‘మన దేశం’లో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారామె. తన అభిరుచి మేరకు నిర్మించిన ఆ సినిమా ఎంతో సంతృప్తి ఇచ్చిందని పలు సందర్భాల్లో కృష్ణవేణి పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గానూ తన ప్రత్యేకత చాటుకున్నారామె. ‘ధర్మాంగద’కి రూ. నలభై ఐదు వేలు పారితోషికం తీసుకున్నారు. ఆమె నిర్మించిన ‘గుడ్ ఈవెనింగ్, లేడీ డాక్టర్’ వంటి కొన్ని చిత్రాలు పరాజయం కావడం, ‘కుమ్మరి మొల్ల’ వంటి మరికొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు కృష్ణవేణి. ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సావాసం’ (1952). మహారాష్ట్ర గవర్నర్‌గా చేసిన కోన ప్రభాకరరావు ఆ చిత్రంలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి నిర్మించిన చిత్రాల్లో ‘భక్త ప్రహ్లాద’ (1942) ఒకటి. నిర్మాతగా 1957లో విడుదలైన ‘దాంపత్యం’ కృష్ణవేణి చివరి సినిమా. నటిగా, నిర్మాతగా, గాయనిగా చిత్ర పరిశ్రమలో ప్రత్యేకత చాటుకున్న ఆమె 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. గత ఏడాది ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు కృష్ణవేణి. తల్లి బాటలో కుమార్తె కృష్ణవేణి బాటలో ఆమె కుమార్తె ఎన్ఆర్ అనురాధా దేవి నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు. ముందు పలు అనువాద చిత్రాలు విడుదల చేసి, లక్ష్మి ఫిలింస్ కంబైన్స్‌పై ఆమె కన్నడంలో తన తొలి చిత్రం ‘భక్త కుంబారా’ (1974)ని నిర్మించారు. ఇందులో రాజ్‌కుమార్ హీరో. తెలుగులో అనురాధ నిర్మించిన తొలి చిత్రం ‘చక్రధారి’ (1977). అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ, జయప్రద కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. నిర్మాతగా మొత్తం 17 చిత్రాలు నిర్మించారు అనురాధ. ఆమె నిర్మించిన చివరి చిత్రం ‘మా పెళ్లికి రండి’ (2000). జేడీ చక్రవర్తి, సాక్షీ శివానంద్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా అనురాధా దేవి 2001లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. - అనురాధా దేవి -
ఈ ఏడాది నిర్మాతలుగా డామినేట్ చేసిన మహారాణులు
‘అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తి కావాల్సిందే... ప్లాన్ తప్పకూడదు’ అని హుకుం జారీ చేయాలంటే చేసే పని మీద ప్రేమ, శ్రద్ధ... ఈ రెంటికీ మించి ధైర్యం, ఆత్మవిశ్వాసం లాంటివి కూడా ఉండాలి. ముఖ్యంగా ‘మేల్ డామినేటెడ్’ ఇండస్ట్రీస్‌లో ఒకటైన సినిమా పరిశ్రమలో ‘ఫీమేల్ప్రొడ్యూసర్’ రాణించాలంటే తెగువ కావాలి. అవసరమైనప్పుడు రాణిలా హుకుం జారీ చేయాలి. సున్నితంగా పనులు చక్కబెట్టడంతో పాటు కఠినంగానూ ఉండాలి. అలా రెండు రకాలుగా ఉంటూ... ‘మేం రాణిస్తాం’ అంటూ ఈ ఏడాది నిర్మాణ రంగంలోకి వచ్చిన కొందరు ఫీమేల్ ప్రొడ్యూసర్ క్వీన్స్ గురించి తెలుసుకుందాం. హీరోయిన్గా యాభైకి పైగా సినిమాలు చేశారు సమంత. అగ్రశ్రేణి నటిగా ప్రేక్షకులు కితాబులిచ్చారు.ఇప్పుడు ‘ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారామె. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ, అర్థవంతమైన కథలను ఈ నిర్మాణ సంస్థ వేదికగా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నామని సమంత పేర్కొన్నారు. ► ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు కుమార్తె హన్షితా రెడ్డి తండ్రి బాటలో నిర్మాత అయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు ఇప్పటికే 50కి పైగా సినిమాలు నిర్మించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఇక ‘దిల్’రాజుప్రొడక్షన్స్ స్థాపించి ‘ఏటీఎమ్’ వెబ్ సిరీస్ నిర్మించిన హన్షిత తొలిసారి ‘బలగం’ సినిమా నిర్మించి, బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో పాటు అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకునిగా మారారు. ఈ ఏడాది మార్చి 3న విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. అన్నట్లు.. ‘బలగం’కి హర్షిత్ రెడ్డి మరో నిర్మాత. ఇక ఆ మధ్య రెండు చిత్రాలు ఆరంభించిన ఈ నిర్మాతలు మంగళవారం మరో చిత్రాన్ని ఆరంభించారు. ► ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర ‘మ్యాడ్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో నటించారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 6న రిలీజై, హిట్‌గా నిలిచింది. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను బాగా నవ్వించింది. తొలి చిత్రంతోనే అభిరుచి ఉన్న నిర్మాత అనిపించుకున్నారు హారిక. ► తండ్రి నిమ్మగడ్డ ప్రసాద్ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్. ఇక కూతురికి సినిమాలంటే ఫ్యాషన్. ఆ∙ఇష్టంతో ‘మంగళవారం’ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలి విజయం అందుకున్నారు స్వాతీ రెడ్డి. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్లో అజయ్ భూపతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతీ రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించిన ఈ సినిమా గత నెల 17న విడుదలై హిట్‌గా నిలిచింది. ► మెగా కుటుంబం నుంచి వచ్చిన నిహారిక (నాగబాబు కుమార్తె) అటు నటన, ఇటుప్రొడక్షన్ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకూ పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ నిర్మించిన ఆమె తొలిసారి ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యాదు వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయమవుతుండటం విశేషం. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. ► శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. తేజ మార్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘బన్నీ’ వాసుతో కలిసి విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న విడుదలైన ఈ పొలిటికల్, పోలీస్ బ్యాక్‌డ్రాప్ మూవీ హిట్‌గా నిలిచింది. ► నటిగా, గాయనిగా, నర్తకిగా గుర్తింపు తెచ్చుకున్న రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాతగా మారి, ‘కలశ’ చిత్రాన్ని నిర్మించారు. భానుశ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కొండ రాంబాబు దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 15న విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రమైనా కాన్సెప్ట్ బాగుందనిపించుకుంది. ► పాయల్ సరాఫ్కి సినిమా నేపథ్యం లేదు. అయితే నిర్మాత కావాలన్నది ఆమె కల. ‘భరతనాట్యం’ చిత్రంతో నిర్మాతగా మారారామె. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో సూర్యతేజ ఏలే హీరోగా, మీనాక్షీ గోస్వామి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ‘‘షూటింగ్ లొకేషన్లో అమ్మాయిలు తక్కువగా ఉంటారు. మనం అమ్మాయి అనే విషయాన్ని మరచిపోయి మన పని మనం శ్రద్ధ చేయగలిగితే సక్సెస్ గ్యారంటీ’’ అంటున్నారు పాయల్ సరాఫ్. -
బాలీవుడ్ రిచ్ మ్యాన్.. స్టార్ హీరోల కన్నా ఈయన సంపాదనే ఎక్కువ!
బిజినెస్ రియాలిటీ సిరీస్ సృష్టికర్తలను పరిచయం చేసే 'షార్క్ ట్యాంక్ ఇండియా' (Shark Tank India) మూడవ సీజన్ కోసం సిద్ధమవుతోంది. ఇందులో అప్‌గ్రాడ్ కో-ఫౌండర్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్ 'రోనీ స్క్రూవాలా' ప్యానెల్లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బిజినెస్ మ్యాన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ రోనీ స్క్రూవాలా.. బాలీవుడ్లో అత్యంత ధనవంతుడైన రోనీ స్క్రూవాలా ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. ప్రారంభంలో టూత్ బ్రష్ తయారీ కంపెనీ స్థాపించిన స్క్రూవాలా.. ఆ తరువాత కేబుల్ టీవీ రంగంలో అడుగుపెట్టాడు. ఇది అతి తక్కువ సమయంలోనే భారతదేశంలోని అనేక నగరాల్లో బాగా విస్తృతి చెందింది. 1990లో కేవలం రూ. 37000 పెట్టుబడితో స్క్రూవాలా స్థాపించిన UTV అనేక ప్రజాదరణ పొందిన కార్యక్రమాలను నిర్వహించి, టెలివిజన్ రంగంలో తనకు తానే సాటిగా నిరూపించుకుంది. ఆ తరువాత రోనీ స్క్రూవాలా.. జోధా అక్బర్, ఫ్యాషన్, బర్ఫీ, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి ఎన్నో చిత్రాలకు ప్రొడ్యూసర్ అయ్యాడు. 2012లో రోనీ స్క్రూవాలా తన కంపెనీ వాటాను ఓకే బిలియన్ డాలర్లకు డిస్నీకి విక్రయించారు. ఆ తరువాత ఆర్ఎస్విపి మూవీస్ స్థాపించి ఉరి, కేదార్నాథ్ చిత్రాలను నిర్మించారు. స్క్రూవాలా రంగ్ దే బసంతికి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు జాతీయ అవార్డును గెలుచుకున్నాడు ఇదీ చదవండి: 2500 యాప్స్ తొలగించిన గూగుల్ - లోక్‌సభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన అప్‌గ్రాడ్ కంపెనీ స్క్రూవాలా కేవలం సినీ నిర్మాత మాత్రమే కాదు, అతడు UpGrad ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ కో-ఫౌండర్ కూడా. సుమారు 2.25 బిలియన్ డాలర్ల విలువైన ఈ కంపెనీని రోనీ స్క్రూవాలా.. మయాంక్ కుమార్, ఫాల్గం కొంపల్లి, రవిజోత్ చుగ్ వంటి వారితో జతకట్టి స్టార్ట్ చేశారు. ప్రస్తుతం రోనీ స్క్రూవాలా నికర విలువ రూ. 12800 కోట్లు ($1.55 బిలియన్) అని తెలుస్తోంది. -
Huma Qureshi: అయిదు పడవల ప్రయాణం
రెండు పడవల మీద ప్రయాణం చాలామందికి కష్టమేమోగానీ కొద్దిమందికి మాత్రం చాలా ఇష్టం. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషి ‘జేబా: యాన్ యాక్సిడెంటల్ సూపర్‌హీరో’ పుస్తకంతో రైటర్‌గా మారింది. రైటర్‌గా తన అనుభవాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ‘ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా అన్ని వర్గాల వారికోసం రాసిన పుస్తకం’ అంటుంది ఖురేషి. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషి. ‘నేను రాసిన హ్యూమర్ నాకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు. ఇతరులు అసలే నవ్వకపోవచ్చు. అందుకే హ్యూమర్ రాయడం చాలా కష్టం’ అంటుంది ఖురేషి. ఈ పుస్తకంలో కథానాయిక ‘జేబా’తో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు తనకు ఇష్టమే అని చెబుతున్న హుమా ఖురేషి రైటర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
నిర్మాత సుధాకర్ కన్నుమూత
నిర్మాత, కెమెరామేన్ మన్నం సుధాకర్ (62) అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. మూడు నెలల క్రితం చెన్నైలోని స్వగృహంలో బాత్రూంలో ప్రమాదవశాత్తు పడటంతో తలలో తీవ్ర రక్తస్రావమైంది. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆ తర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం కన్నుమూశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి ఆయన స్వస్థలం. ప్రముఖ కెమెరామేన్ వీయస్ఆర్ స్వామి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన సుధాకర్ ‘సితార, వారాలబ్బాయి, పుట్టినిల్లా మెట్టినిల్లా’ వంటి పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మహాగణపతి ఫిలింస్ బ్యానర్ స్థాపించి ‘తారకరాముడు, నా మనసిస్తారా, వాలి, సేవకుడు, ఆక్రోశం’ వంటి సినిమాలు నిర్మించారు సుధాకర్. టంగుటూరు ప్రాంతం నుంచి పలువురిని సినీ రంగానికి పరిచయం చేశారాయన. సుధాకర్‌కి భార్య దేవరపల్లి లక్ష్మమ్మ, కుమారులు మన్నం హరీష్ బాబు, మన్నం సతీష్ బాబు ఉన్నారు. కాగా ఆయన కుమార్తె మన్నం స్వాతి గతంలోనే చనిపోయారు. కారుమంచిలో మన్నం సుధాకర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
చాలా కష్టాలను అనుభవించాను: లోకేష్ కనకరాజ్
తమిళసినిమా: దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ పేరు ఇప్పుడు భారీ చిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. మానగరంతో ప్రారంభమైన ఈయన దర్శక పయనం మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ చిత్రాల వరకు విజయ పథంలో సాగుతూ వచ్చింది. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. 2024 ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు ఇటీవల ఒక కార్యక్రమంలో స్పష్టం చేశారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తాజాగా నిర్మాతగా అవతారం ఎత్తారు. జీ.స్క్వాడ్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు. కాగా ఉయిరడీ చిత్ర పేమ్ విజయకుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫైట్ క్లబ్. రీల్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య నిర్మిస్తున్న ఇందులో నటి మోనీషా మోహన్ మీనన్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం చైన్నెలోని ఒక హోటల్లో నిర్వహించారు. లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా తనను ఆదరించినట్లే తన నిర్మాణ సంస్థను ఆదరించాలని కోరారు. తాను డబ్బు సంపాదించడానికి చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించలేదన్నారు. దర్శకుడిగా తానిప్పుడు బాగానే సంపాదిస్తున్నానన్నారు. అయితే ఆరంభ కాలంలో తాను చాలా కష్టాలను అనుభవించానని తెలిపారు. తాను రూపొందించిన షార్ట్ ఫిల్మింస్కు తన మిత్రులు ఎంతో సహాయం చేశారన్నారు. వారి సాయంతోనే మానగరం చిత్రాన్ని రూపొందించానని చెప్పారు. అలాంటి మిత్రులు, ప్రతిభావంతులను ప్రోత్సహించడం కోస మే జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా వచ్చిన డబ్బును మళ్లీ చిత్ర పరిశ్రమలోనే పెడతానని లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. అలా తొలి సారిగా ఫైట్ క్లబ్ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
ఆ రంగంలోకి లియో డైరెక్టర్.. అభిమానుల్లో ఆసక్తి!
ఇటీవలే లియో మూవీ సూపర్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. కోలీవుడ్‌లో ఇప్పుడు ఆయన పేరే సక్సెస్‌కు కేరాఫ్‌గా మారింది. మానగరం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన లోకేశ్ కనగరాజ్.. తొలి చిత్రమే పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత కార్తీ కథానాయకుడిగా ఖైదీ చిత్రాన్ని తెరకెక్కించారు. అదీ కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత విజయ్‌తో మాస్టర్, కమలహాసన్‌తో విక్రమ్ చిత్రాలు సక్సెస్ అయ్యాయి. ఇలా ఇప్పటికి అదే చిత్రాలు చేసిన లోకేష్ కనకరాజ్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఆయన 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో సెట్ పైకి వెళ్లనుంది. కాగా లోకేష్ కనకరాజ్ ఇప్పుడు నిర్మాతగా మారనున్నారు. అవును ఈ విషయాన్ని ఆయనే తెలుపుతూ మంగళవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో తాను జీ స్క్వాడ్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ బ్యానర్లో తన శిష్యులకు, మిత్రులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. దర్శకుడిగా తనకు అందించిన ఆదరాభిమానాలను తన చిత్రాలకు అందించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా తన సంస్థలో నిర్మించనున్న చిత్రం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు లోకేష్ కనకరాజ్ పేర్కొన్నారు. దీంతో లోకేశ్ కనగరాజ్ చిత్రాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Need all your love and support 🤗❤️@GSquadOffl pic.twitter.com/9NWou59tuE — Lokesh Kanagaraj (@Dir_Lokesh) November 27, 2023 -
చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకనిర్మాత కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకనిర్మాత రాజ్‌కుమార్ కోహ్లి(93) ఇక లేరు. ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. నేడు(నవంబర్ 24న) ఉదయం 8 గంటలకు స్నానం చేయడానికి బాత్రూమ్లోకి వెళ్లిన ఆయన ఎంతకూ బయటకు రాలేదు. దీంతో ఆయన కుమారుడు అర్మాన్ కోహ్లి తలుపు బద్ధలు కొట్టి లోనికి వెళ్లగా ఆయన నిర్జీవంగా కిందపడి ఉన్నారు. దర్శకుడి మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేడు సాయంత్రం రాజ్‌కుమార్ కోహ్లి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈయన జానీ దుష్మణ్, రాజ్ తిలక్, విరోధి, నాగిన్, పతీ పత్నీ ఔర్ తవైఫ్ సహా తదితర చిత్రాలను డైరెక్ట్ చేశారు. అలాగే పంజాబ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు నిర్మించారు. బాలీవుడ్ స్టార్స్ అయిన సన్నీడియోల్, సునీల్ దత్, మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్ వంటి పలువురు హీరోలతో సినిమాలు చేశారు. చదవండి: చివరి కెప్టెన్సీ టాస్క్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. కెప్టెన్ ఎవరంటే? -
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత!
ప్రముఖ నటుడు చంద్రమోహన్ మరణ వార్త మరవకముందే టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మార్కాపురంలో పుట్టిన రవీంద్ర బాబు.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్ గా తన సేవలు అందిస్తూనే తనకి సినిమా పట్ల ఉన్న ఇష్టం తో నిర్మాతగా మారి దాదాపు 17 చిత్రాలు నిర్మించి పలు అవార్డు లు పొందారు . శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతగా మిత్రులతో సొంతఊరు , గంగపుత్రులు లాంటి అవార్డు చిత్రాలతో పాటు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత గుర్తింపు పొందాడు. తెలుగు లో నే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లోనూ సినిమాలను నిర్మించారు. గీత రచయితగా కూడా తన ప్రతిభ చాటుకుంటూ హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ లాంటి పలు చిత్రాలలో హృద్యమైన సాహిత్యం అందించాడు. ఇతనికి భార్య రమాదేవి, కుమార్తె ( ఆశ్రీత ) , ఒక కుమారుడు ( సాయి ప్రభాస్ ) ఉన్నారు. -
టీటీడీ ఎల్ఏసీ సభ్యుడిగా తెలుగు సినిమా నిర్మాత
టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రస్తుత టీటీడీ బోర్డు పదవీకాలానికి అనుగుణంగా శ్రీ వేంకటేశ్వర దేవాలయాలు జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా శ్రీ మోహన్ ముళ్ళపూడిని నియమించారు. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) ఈయన గతంలో పలు తెలుగు సినిమాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అలాగే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌కు గౌరవ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దేవాలయాల లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు. జూబ్లీహిల్స్, కరీంనగర్, హిమాయత్‌నగర్‌లోని టీటీడీ దేవాలయాల మొత్తం అభివృద్ధిలో, అలానే కరీంనగర్లో నిర్మిస్తున్న కొత్త ఆలయానికి సంబంధించిన పనుల్లో లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా ఈయన బాధ్యతలు నిర్వహిస్తారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోగా 'గుప్పెడంత మనసు' రిషి.. ఆ సినిమాతో ఎంట్రీ) -
నిర్మాత వేణుగోపాల్ మృతి
‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్వీఎస్ వేణుగోపాల్(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్ నిర్మించారాయన. ‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్. ‘తులసీదళం’ సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్‌గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు. -
బండ్ల బాజాతో మూడు గుళికలు.. ఎంత ఊదినా అంతే!
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ను ఏదో చేసి 25 సంవత్సరాలైందని గచ్చిబౌలి స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మామూలు సభలకే జనాలు రావడం లేదు. అలాంటిది ఈ సభకు జనాలను తరలించడంలో మ్యూజికల్ నైట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి మొత్తానికి కాస్త జనాలను రప్పించారు నిర్వాహకులు. ఇదే సభలో ఏతా వాతా లేని టాలీవుడ్ నిర్మాత అయిన బండ్ల గణేష్ చంద్రబాబు గురించి బాకా ఊదుతూ ఓ రెండు, మూడు బ్రాండింగ్ గుళికలను వదిలారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదట ప్రముఖంగా చెప్పుకోదగినది బండ్లగణేష్ చేసిన విచిత్ర ప్రతిపాదన.. అదే ఖైదీ మార్పిడి... అదేంటని విస్తుపోయారా? మీరే కాదు సభలో ఉన్న వారితో పాటు ఈ విషయం విన్న వారందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబుకు బదులు తనను జైల్లో పెట్టమని అభ్యర్ధించాడు. చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకుని బాకాలూదే బండ్ల గణేశుడు. జైల్లో పెట్టడం సరే అభిమానంతో అన్నాడని అనుకోవచ్చు. కానీ ఆ తరువాత అన్న మాటే విన్న వారందరూ విస్తుపోయారు. తనను జైల్లో పెట్టినా నా భార్య ఏమీ అనుకోదు అని గొప్ప గుళిక వదిలారు బండ్ల గణేశ్. ఇక బండ్ల గణేష్ వదిలిన రెండో గుళిక ఏంటంటే.. ఊర్లలో ఉన్న వాళ్లందరూ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ జాబులకు వెళ్తూ ఉంటే మన బండ్లకు కడుపు తరుక్కుపోయిందట. ఎందుకంటే చంద్రబాబు అనే వాడు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేకుండా లక్షలాది మందికి ఇప్పటికీ ఉద్యోగాలు వచ్చేవి కాదట. అసలు హైదరాబాదే ఉండేది కాదంట. అంతేకాదు వీరందరికీ చంద్రబాబు ఆదర్శప్రాయుడని బాగా బజాయించాడు బాకాలూదే బండ్లగణేశుడు. చిట్టచివరి బండ్ల గుళిక ఏంటంటే... మహానటి సినిమా మీకందరికీ గుర్తు ఉండే వుంటుంది. ఆ సినిమా మొదట్లో దర్శకుడు సావిత్రి వేషధారికి ఓ సన్నివేశం వివరిస్తూ ఈ సీన్లో ఓ కంట మాత్రం కన్నీరు రావాలి అని చెబితే మహానటి సావిత్రి ఆ సన్నివేశంలో ఓ కంట మాత్రం కన్నీరు కార్చి యూనిట్ సభ్యులనందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే విధంగా చంద్రబాబు సభలో బండ్ల గణేష్ ఆవేదనతో గొంతు వణుకుతూ తన ఏడుపును వినిపించాడు కాని కనిపించలేదు. అదేమిటి ఏడుపు కనిపించలేదు అనుకుంటున్నారా? మీరే చెప్పండి ఎదుటి వ్యక్తి ఏడుస్తున్నాడు అని మనం ఎప్పుడు అనుకుంటాం? వచ్చే కన్నీళ్లని బట్టి అని కచ్చితంగా ఎవరైనా చెప్తారు. కాని మన నటనిర్మాత అయిన బండ్ల గణేష్ తన ఏడుపును గొంతుతోనే వినిపించి కంట చుక్క కన్నీరు కూడా కనిపించకుండా చేసిన ఆయన నిజంగా మహానటుడు. ఆఖరుగా ఒక్క మాట బండ్ల బాకా ఊదినా.. గచ్చిబౌలిలో గోల రేగినా.. అవినీతి కేసులో ఇరుక్కున్న చంద్రబాబు మీద జనాలకి వచ్చేది సింపతీకాదు, సీ(చి)రాకు మాత్రమే. -
దిల్ రాజు అల్లుడి కారును ఎత్తుకెళ్లిన దొంగ.. హృతిక్ రోషన్ బాగా తెలుసట!
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు అల్లుడికి చెందిన ఖరీదైన పోర్షే కారును చోరీకి గురైంది. మాదాపూర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లోని జిమ్‌కు దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి వెళ్లారు. కారు పార్కింగ్ చేసి వెళ్లగా.. ఆయన తిరిగొచ్చేలోపే కారు ఎత్తుకెళ్లాడు ఓ దుండగుడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును కొన్ని గంటల్లోనే చేధించారు. (ఇది చదవండి: ‘లియో’ మూవీ ట్విటర్ రివ్యూ) అయితే సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో కారును చోరీ చేసిన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఈ కారు విలువ దాదాపు రూ.1.7 కోట్లు ఉంటుందని సమాచారం. మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని వివిధ ప్రాంతాల్లో కారును గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే దర్యాప్తులో అతను చెప్పిన కారణాలు విని పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. లగ్జరీ కార్లను దొంగిలించడం.. వాటిల్లో ఫ్యూయెల్ అయిపోగానే కారు అక్కడే వదిలేసి వెళ్లిపోవడం అతనికి సరదా అని తెలిసింది. గతంలోనూ సాయికిరణ్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. పోలీసులకు సాయి కిరణ్ చెప్పిన మాటలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తాను జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీకి పీఏనని.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తనకు పరిచయాలు ఉన్నాయని పోలీసులకు తెలిపాడు. సాయికిరణ్ మాటలు విన్న పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే సాయికిరణ్ మానసికంగా ఆరోగ్యంగా లేడని.. బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. అయితే ఈ చోరీ సంఘటనపై సాయికిరణ్‌పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ ట్విటర్ రివ్యూ) -
మార్పు రావాలి
కథానాయికగా సౌత్, నార్త్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్ ధక్’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్లో స్టార్ సిస్టమ్ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది. కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు, కో–స్టార్ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు. కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్ రైట్స్ ద్వారా డబ్బు రికవర్ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్ ధక్’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది. -
మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత పీవీజీ కన్నుమూత
ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, మీడియా దిగ్గజం, వ్యాపారవేత్త KTC గ్రూప్ ఆఫ్ కంపెనీల వ్యవస్థాపకుడు పీవీ గంగాధరన్ (80) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో కేరళలోని కోజికోడ్‌లోని ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. కోజికోడ్‌లోని ఆయన ఇంటి వద్ద ప్రజలకు అంతిమ నివాళులు అర్పించేందుకు గంగాధరన్ భౌతికకాయాన్ని KTC గ్రూప్ కార్యాలయంలో, ఆ తరువాత టౌన్ హాల్లో ఉంచుతారు. రేపు (శనివారం అక్టోబర్ 14న) ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష సేవలందించిన గంగాధరన్ అస్తమయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సినీ నటులు, ఇతర ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పీవీ గంగాధరన్ మలయాళ మీడియా సంస్థ మాతృభూమికి హోల్ టైమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గృహలక్ష్మి ఫిలింస్ బ్యానర్‌పై పలు పాపులర్, అవార్డు విన్నింగ్ చిత్రాలను నిర్మించారు. 1977లో సుజాతతో ప్రారంభించి, మలయాళంలో 22 చిత్రాలను నిర్మించారు. 'మనసా వాచా కర్మణా,' 'అంగడి,' 'అహింస,' 'చిరియో చిరి,' 'కట్టాతే కిలిక్కూడు,' 'వార్త,' 'ఒరు వడక్కన్ వీరగాథ,' 'అధ్వాత్యం,' లాంటివి వున్నాయి. ఎక్కువ భాగం విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రజాదరణ పొందాయి. ఆయన చివరి చిత్రం జానకి జానే, తన కుమార్తెల నిర్మాణ సంస్థ SCube ఫిల్మ్స్‌తో కలిసి దీన్ని నిర్మించారు. యాసిడ్ దాడి నుండి బయటపడినవారిపై పార్వతి నటించిన ఉయారే చిత్రాన్నికూడా పీవీజీనే నిర్మించడం విశేషం. Saddened by the demise of Shri P.V Gangadharan ji, a pioneer among Malayalam filmmakers. In a career spanning more than 5 decades he was honoured with multiple national and state awards, which stand as a testimony to his outstanding contribution to filmmaking. His works will… pic.twitter.com/m1UL3U0sEL — Anurag Thakur (@ianuragthakur) October 13, 2023 > పీవీజీ అని పిలుచుకునే గంగాధరన్ సినీ, రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. జాతీయ , రాష్ట్ర చలనచిత్ర అవార్డులతో పాటు, వర్త, తూవల్ కొట్టారం వంటి చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ నుండి ప్రశంసలు అందుకున్నారు. కనక్కినవ్ మూవీ 1997లో జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రతిష్టాత్మక నర్గీస్ దత్ అవార్డును అందుకుంది.. 2000లో 'సంతాం' చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు లభించింది. వీండుం చిల వీట్టుకార్యంగల్, అచ్చువింటే అమ్మ, నోట్‌బుక్ కూడా రాష్ట్ర చలనచిత్ర అవార్డులను అందుకున్నాయి. 2009లో ఆసియానెట్ నుండి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును వీపీజీ గెలుచుకున్నారు. కాగా 1943లో మాధవి సామి , పీవీ సామి దంపతులకు జన్మించిన గంగాధరన్‌కు భార్య షెరిన్ , ముగ్గురు కుమార్తెలు షెనుగ, షెగ్నా, షెర్గా ఉన్నారు. వీరు 2016లో SCubeని ప్రారంభించారు. Over the years I have only had people and family members rejecting my talents. PVG Sir is the only person who took me under his wings and supported my talents and accepted my skills. He is the reason I am connected to the Malayalam movie industry. RIP#obligation #gratitude pic.twitter.com/yB2tasXApq — Devas Chronicles (@Devas_Group) October 13, 2023 -
దిల్ రాజు తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి అంత్యక్రియలు (ఫోటోలు)
-
నిర్మాత మృతి.. చివరి రోజుల్లో ఇంత బాధ అనుభవించాడా?
సీనియర్ సినీ నిర్మాత వీఏ దురై (59) సోమవారం సాయంత్రం చైన్నెలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన 'పితామగన్' చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం 'శివపుత్రుడు' పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా నటుడు సత్యరాజ్ కథానాయకుడిగా నటించిన 'ఎన్నమ్మా కన్ను' నిర్మాతగా ఈయన తొలి చిత్రం. ఆ తర్వాత కార్తీ కథానాయకుడిగా లూటీ, విజయకాంత్ హీరోగా గజేంద్ర.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అదే విధంగా రజనీకాంత్ బాబా సినిమాకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఈయన భార్యా పిల్లలతో మనస్పర్థల కారణంగా చాలాకాలంగా వారికి దూరంగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తూ వచ్చారు. కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల ఒక కాలును కూడా తొలగించారు. వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవంటూ ఆ మధ్య ఈయన సామాజిక మాధ్యమాల్లో వీడియో రిలీజ్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటుడు కరుణాస్, సూర్య వంటి కొందరు ఆర్థిక సాయం చేశారు. తమిళం తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన పితామగన్ చిత్రం నిర్మాతకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు బాల మరో చిత్రం చేసి పెడతానని చెప్పి వీఏ దురై వద్ద రూ. 25 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆయన దగ్గర సినిమా చేయలేదు సరి కదా తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై బాలను వీఏ దురై పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నిర్మాత వీఏ దురై సోమవారం రాత్రి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా వీఏ దురై భౌతికయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. హస్ గురించి చైతూ కామెంట్ -
విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం శివపుత్రుడు పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. హీరో విక్రమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు. రజనీకాంత్,విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. గజేంద్ర చిత్రం తర్వాత దురై సినిమాలకు దూరమయ్యాడు. ఆమధ్య తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేయడంతో.. హీరో సూర్య సహాయం చేశాడు. దురైకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండో భార్యకు ఓ కూతురు ఉంది. దురై మరణం పట్ల కోలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన నిర్మాత ముకేశ్ ఉద్దేశి.. సోమవారం కన్నుమూశారు. ఈ విషయం ఒకరోజు తర్వాత అంటే మంగళవారం బయటకొచ్చింది. గత కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!) మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడంటే తెలుగు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. గతంలో హిందీలో 'ప్రతిబంధ్', 'ద జెంటిల్‌మ్యాన్' సినిమాలు చేశారు. వీటితోపాటు తెలుగులో 'ఎస్పీ పరశురాం' చిత్రం చేశారు. వీటికి నిర్మాతగా వ్యవహరించింది ముకేశ్ ఉద్దేశినే. నిర్మాతగా పలు మూవీస్ తీసిన ఈయన.. ఆ తర్వాత కొన్నాళ్లకు లైన్ ప్రొడ్యూసర్ అయ్యారు. గో గోవా డాన్, ద విలన్, ద షౌకీన్స్, బ్రేక్ కే బాద్, సారీ భాయ్, కిడ్నాప్, ప్యార్ మైన్ ట్విస్ట్, చష్మే బద్దూర్ సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌గా చేశారు. గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన్ని ప్రస్తుతం అల్లు అరవింద్ చూసుకుంటున్నారు. త్వరలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేశారు. కానీ ఇంతలోనే ఇలా ముకేశ్ చనిపోవడం ఆయన కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) RIP #MukeshUdeshi Ji. Producer. A thorough gentleman. Kind. Very good company. Spent a lot of time with him in Mauritius. Huge loss to the industry. pic.twitter.com/xOnuH99Wqe — kunal kohli (@kunalkohli) September 12, 2023 -
నిర్మాత కావాలన్నదే లక్ష్యం
‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్ అన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు. -
కుషి బ్లాక్ బస్టర్ వేడుకల్లో నిర్మాత నవీన్ యెర్నేని..
-
మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ ఫ్లాప్.. ఆయనకు తెలుసు!: బేబి నిర్మాత
సినిమా అన్నాక జయాపజయాలు సర్వసాధారణమే! పెద్దగా ప్రచారం లేకపోయినా హిట్ కొట్టేవి కొన్నయితే భారీ అంచనాల మధ్య డిజాస్టర్‌గా నిలిచేవి మరికొన్ని.. హీరోలు ఈ రెండిటింనీ సమానంగా స్వీకరించినా సరే అభిమానులు మాత్రం లైట్ తీసుకునేందుకు ఇష్టపడరు. సక్సెస్ అయితే పూనకంతో, ఫ్లాప్ అయితే ఆగ్రహంతో ఊగిపోతుంటారు. సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా వాళ్లను ఆపడం చాలా కష్టం. ఈ మధ్య చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలైంది. బాస్ మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. కానీ సినిమా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమాపై విమర్శలే కనిపించాయి. నేను మీలో ఒకడిని తాజాగా దీనిపై బేబి నిర్మాత, మెగా అభిమాని ఎస్కేన్ స్పందించాడు. ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా మొదటి టికెట్ తెగేది మెగా ఫ్యాన్ది మాత్రమే! నా కో- మెగా ఫ్యాన్స్‌ను నేను నమ్మాను.. వాళ్లు నా సినిమాకు ఓపెనింగ్స్ ఇస్తారనే బేబి తీశాను. ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టినా దాని క్రెడిట్ ముందుగా మెగా ఫ్యాన్స్‌కే దక్కుతుంది. నేను మీలో ఒకడిని. బాస్ ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాను. బాస్ చుట్టూ జరుగుతున్న వివాదం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆడిస్తున్నాడు.. ఓడిస్తున్నాడు మన సినిమా నచ్చితే ఫస్ట్ జై కొట్టేది మనమే.. మన సినిమా ఏదైనా నచ్చకపోయినా మొదట దాన్ని తొక్కేసేది కూడా మనమే.. ఫస్టాఫ్ అలా ఉంది, ఇంటర్వెల్ ఇలా ఉంది, సెకండాఫ్ ఇంకోలా.. అని చెప్పేస్తుంటాం. అలా చేయొద్దు. నాలుగు పదులకే నడవలేని హీరోలు ఉన్న ఇండస్ట్రీలో.. సుమారు ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా మెగాస్టార్ ఆడిస్తున్నాడు.. చాలామందిని ఓడిస్తున్నాడు. అది ఆయన విల్ పవర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఆయన మోస్ట్ గ్లామరస్‌గా కనిపించిన సినిమా భోళాశంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే దానికి కారణం మనమే. ఏది చేయాలో బాస్‌కు తెలుసు రీమేక్స్ చేయాలా? ఒరిజినల్ చేయాలా? అనేది బాస్‌కు తెలుసు. ఆయనకు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం. మోకాలికి ఆపరేషన్ చేయించుకుని కూడా స్టెప్స్ వేస్తున్నారు. మనందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా బాస్ వెంటే ఉండాలి. మనం ఐకమత్యంతో ఉంటే మనల్ని కొట్టేవాళ్లే లేరు. చాలామంది హిట్లర్ ముందు బాస్ పనైపోయిందన్నారు. ఖైదీ 150 ముందు కూడా అలాగే అన్నారు. అలా జరిగిందా.. లేదు.. ఆయన స్థాయి, స్థానం వేరు. ఆగస్టు 11న ఆయన సినిమాను ఎవరు తొక్కేలాయనుకున్నారో తెలుసు.. మనం మళ్లీ హిట్ కొట్టి చూపిద్దాం' అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఎస్కేఎన్. చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది.. -
సినిమా రిలీజ్ కాలేదని.. గుండెపోటుకు గురైన నిర్మాత
తెలుగు సినీ నిర్మాత విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడిపై ఈ నిర్మాత సినిమా తీశారు. అయితే అటు సినిమాను విడుదల చేయలేక, ఇటు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నాడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్. బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ‘ఖుదీరామ్ బోస్’ పాన్ ఇండియా మూవీగా రూపొందింది. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రశంసలే కానీ రిలీజ్‌కు నోచుకోలే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. 2022 డిసెంబర్ 22న ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యారు. ఎందరో ఉద్ధండులు పని చేశారు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారు. ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్‌కు తెలియకపోవటం, కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడమే నిర్మాత ఇటువంటి దుస్థితికి రావడానికి కారణంగా కనిపిస్తోంది. చదవండి: జైలర్‌లో విలన్‌గా మెగాస్టార్ చేయాల్సింది, కానీ రజనీకాంత్ వద్దన్నాడట! -
నిర్మాతగా మారనున్న ప్రముఖ డైరెక్టర్
కోలీవుడ్‌లో మసాలా పాప్‌కార్న్, వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్న చిత్రం 'నన్బన్ ఒరువన్ వంద పిరగు'. ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన ఐశ్వర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దీనిగురించి ఐశ్వర్య తెలుపుతూ దర్శకుడు వెంకట్ ప్రభు చిత్ర నిర్మాణ సంస్థలో పని చేసిన అనుభవంతో మంచి జనరంజకమైన చిత్రాలు నిర్మించాలని తలచానన్నారు. (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) మసాలా పాప్‌కార్న్ చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందే చిత్రాలు ప్రేక్షకులకు సంతృప్తి కలిగించే విధంగా ఉండాలి. మంచి వినోదాన్ని అందించేలా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. అలా మంచి స్నేహమయ జీవితంతో కూడిన చిత్రంగా నన్బన్ ఒరువన్ వంద పిరగు అని చెప్పారు. వైట్ ఫెదర్స్ స్టూడియోస్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. తమ మధ్య స్నేహమే ఈ చిత్రం ఇంత దూరం రావడానికి కారణమన్నారు. కాగా దర్శకుడు వెంకట్ ప్రభు దీనికి సమర్పకుడు వ్యవహరిస్తున్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో పాటు అధిక భాగం సింగపూర్‌లో నిర్వహించినట్లు చెప్పారు. చైన్నె 28 చిత్ర జ్ఞాపకాలను గుర్తు చేసే ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడం సంతోషంగా ఉందని దర్శకుడు వెంకట్ ప్రభు పేర్కొన్నారు. -
కమెడియన్ రచ్చ రవి బర్త్‌డే.. సినీ సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
నిర్మాతతో సహజీవనం.. నటి సంచలన ఆరోపణలు!
సినీ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది. అవకాశాల కోసం కొందరు అడ్డదారులు తొక్కితే.. మరికొందరు తన టాలెంట్‌పైనే నమ్మకంతో ఉంటారు. అలా సినీ ఇండస్ట్రీలోనూ లైంగిక వేధింపుల బారిన పడిన వారు కూడా ఉన్నారు. తాజాగా ఒడిషా నటి శీతల్ పాత్ర ఓ నిర్మాత తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. అంతే కాకుండా తన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేశాడని ఆరోపించింది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. (ఇది చదవండి: శరీరమంతా స్క్రూలు, రాడ్లు.. బతకడం కష్టమేనన్నారు: నటి) ఒడియా నటి శీతల్ పాత్రా చిత్రనిర్మాత దయానిధి దహిమాపై సంచలన ఆరోపణలు చేశారు. జూలై 28న భువనేశ్వర్‌లోని లక్ష్మీసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దయానిధి ఎంటర్టైన్మెంట్ యజమానిగా ఉన్న దయానిధి తనపై లైంగిక, మానసిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని.. తనకు ఇచ్చిన అన్ని రెమ్యునరేషన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారని నటి ఆరోపించింది. అంతేకాకుండా తన ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో పెడతానని బెదిరించాడని తెలిపింది. భౌతిక దాడి దయానిధి తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని శీతల్ పాత్ర పోలీసులకు వివరించింది. తాను చదివే కళాశాలలో విద్యార్థుల ముందే తనపై తన యూనిఫామ్‌ను చించేశాడని.. తనకు తీవ్రమైన అవమానానికి గురి చేశాడని పేర్కొంది. తన ప్రతిష్టను దిగజార్చడానికి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని.. అంతే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని కించపరిచేందుకు చిత్రనిర్మాత తప్పుడు సమాచారాన్ని ఉపయోగించారని నటి పేర్కొంది. అయితే తాను గత కొన్నేళ్లుగా నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ ఉన్నట్లు తెలిపింది. అందుకే తనను మోసం చేశాడని నటి ఫిర్యాదులో పేర్కొంది. శీతల్ పాత్ర మాట్లాడుతూ..'మొదట అతను నాతో సన్నిహితంగా ఉన్నప్పుడు మా ఫోటోలు, వీడియోలను రికార్డ్ చేసేవాడు. అప్పుడు వాటిని నేనేమీ పట్టించుకోలేదు. అతను ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నాడని నేను అనుకోలేదు. నేను అతనిని పూర్తిగా నమ్మాను. ఆయనతో సినిమా కూడా చేశాను. అంతేకాకుండా సినిమాకి రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి మా మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత నన్ను చాలా అసభ్యకరంగా దూషించేవాడు. ఇప్పుడు ఏకంగా నా ప్రైవేట్ వీడియో, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.' అంటూ వాపోయింది. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్మాత దయానిధి దాహిమాపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిర్మాతతో లివ్ ఇన్ రిలేషన్ కాగా.. నటనతో పాటు ఈ జంట కొన్నేళ్లుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. చాలా సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కూడా నటి మరో సినిమా నిర్మాతతో సినిమా చేయబోతుండడంతో దయానిధి కళ్లు ఎర్రబడ్డాయి. వేరే నిర్మాతలతో సినిమా తీయడం తనకు ఇష్టం లేదని.. నా ప్రొడక్షన్లో మాత్రమే నటించాలని ఆమెను బెదిరించాడు. దీనికి అంగీకరించక పోవడంతో నటిని వేధించడం ప్రారంభించాడు. గత రెండేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. తాజాగా ప్రైవేట్ వీడియోలు లీక్ కావడం ఒడిశా సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. (ఇది చదవండి: మీరు నా జీవితంలోకి రావడం నా ప్రయాణానికి నాంది: మంచు మనోజ్ ) . -
రోజుకో కారు మెయింటెన్ చేసిన స్టార్ హీరో.. చివరి రోజుల్లో మురికివాడలో
డబ్బుతో ఏం చేస్తారు? ఇదేం ప్రశ్న అనుకునేరు.. డబ్బును అందరూ ఒకేలా వాడరు. కొందరు పొదుపు చేస్తారు, కొందరు ఖర్చు చేస్తారు, మరికొందరేమో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. బోలెడంత డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువశాతం జనాలు విలాసాలకే వినియోగిస్తుంటారు. ఇలా ఉన్నదంతా ఖర్చు పెట్టి చివరికి కడు పేదరికాన్ని గడిపిన సెలబ్రిటీల సంఖ్య చాలానే ఉంది. అందులో ఒకరే బాలీవుడ్ స్టార్ హీరో భగవాన్ దాదా. మిల్లులో పనిచేసి.. ఈయన కార్మికుడు, నటుడు, డ్యాన్సర్, దర్శకుడు, నిర్మాత! భగవాన్ దాదా అసలు పేరు భగవాన్ ఆబాజీ పలావ్. కుస్తీ పోటీల్లో ప్రతిభ చూపిన ఇతడిని అందరూ ముద్దుగా భగవాన్ దాదా అని పిలిచుకునేవారు. మొదట ఈయన బాంబేలోని వస్త్ర మిల్లులో పని చేశాడు. విరామం లేకుండా పని చేస్తున్న ఈయనకు ఎప్పటికైనా సినిమాల్లోకి రావాలన్న ఆశ, ఆసక్తి రెండూ ఉండేవి. ఈ ఆసక్తితోనే సినిమా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీయడం ప్రారంభించాడు. చిన్న సినిమాలతో హిట్ చిత్రయూనిట్‌కు భోజనం సమకూర్చడం దగ్గరి నుంచి నటీనటుల దుస్తుల ఎంపిక వరకు అన్నీ తనే స్వయంగా చూసుకుని బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తపడేవాడు. 1938లో బహదూర్ కిసాన్ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాడు. తర్వాత చిన్నాచితకా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవి సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే అతడి పేరు మార్మోగిపోయింది. ఈ ధైర్యంతో భగవాన్ నిర్మాతగానూ మారాడు. ప్రేమ, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా నిలిచాడు. రోజుకో కారు, అతి పెద్ద బంగ్లా అయితే ఏదైనా సామాజిక చిత్రం తీయమని 1951లో రాజ్‌కపూర్ సలహా ఇవ్వడంతో అల్బెలా తీశాడు. ఇది ఆ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా అందులోని షోలా జో భడ్కే అనే పాటకు భగవాన్ వేసిన స్టెప్పులు హైలైట్ అయ్యాయి. బాలీవుడ్లో గొప్ప డ్యాన్సర్‌గా ఇతడిని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇకపోతే జమేలా, భాగం భాగ్ అనే సూపర్ హిట్స్ బాలీవుడ్‌కు అందించాడు. ఊహించని విజయాలతో అతడికి పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చింది. ఒకేసారి స్టార్డమ్ స్టేటస్ రావడంతో విలాసాలకు బాగా ఖర్చు చేసేవాడు. ఈ క్రమంలో ముంబై జుహులో 25 గదులు ఉన్న పెద్ద బంగ్లా కొని అందులోనే నివసించాడు. వారం రోజులపాటు రోజుకో కారులో తిరిగేలా ఏడు లగ్జరీ కార్లను మెయింటైన్ చేశాడు. భార్య నగలు కూడా అమ్మేయాల్సిన దుస్థితి కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అతడి సినిమాలకు ఆదరణ తగ్గిపోయింది. 1960 నుంచి భగవాన్.. హీరో స్థాయి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచే స్థాయికి పడిపోయాడు. నెమ్మదిగా ఆ కాస్త అవకాశాలు రావడం కూడా కనుమరుగైపోయాయి. ఆర్థిక అవసరాల కోసం ఒక్కో కారును, ఇంటిని, భార్య నగలను కూడా అమ్మేయాల్సి వచ్చింది. చివరికి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో మురికివాడలో జీవనం కొనసాగించాడు. 2002లో 89 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశాడు. చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే! రెండు పెళ్లిళ్లు ఫెయిల్.. ముచ్చటగా మూడోసారి విడాకులకు సిద్ధమైన బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
కష్టాల్లో ఉన్నప్పుడు దిల్ రాజుకు సహాయం చేసింది నేనే.. కానీ ఇప్పుడు
-
నాలుగేళ్లు ఇండస్ట్రీని సర్వనాశనం చేసారు.. ప్రొడ్యుసర్ గిల్డ్ పై నిర్మాత సి. కళ్యాణ్ ఫైర్
-
నాలుగేళ్లలో సర్వ నాశనం.. ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్‌పై సి.కల్యాణ్!
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చామని తెలిపారు. తొలిసారిగా నిర్మాతలకు మెడి క్లైమ్ తీసుకొచ్చింది తానేనని అన్నారు. అయితే నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. దాసరి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగానని వెల్లడించారు. (ఇది చదవండి: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్?) కానీ గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనమైందని విమర్శలు చేశారు. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తామని అన్నారు. ఈ సారి నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉందని కల్యాణ్ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ..' గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది. పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి. ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను. డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ' అంటూ విమర్శలు గుప్పించారు. ఫిల్మ్ ఛాంబర్ గురించి మాట్లాడుతూ..' ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్‌కు సేవ చేసేవాళ్లే కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు. ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల్లో పోటీపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్‌లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. దిల్ రాజు పక్కనున్నవాళ్లకు పోస్టులు కావాలి.' అని అన్నారు. (ఇది చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) -
కోహ్లి బావ గురించి తెలుసా? వందల కోట్లు పెట్టి..
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి, అతని భార్య అనుష్క శర్మ గురించి దాదాపు అందరికి తెలుసు. కానీ కోహ్లీకి స్వయానా బావ, అనుష్క శర్మ అన్న 'కర్నేష్ శర్మ' (Karnesh Sharma) గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఇతడు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కూడా. రూ. కోట్లలో సంపాదిస్తున్న కర్నేష్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్లీన్ స్లేట్ ఫిలింజ్.. బాలీవుడ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకత కలిగిన కర్నేష్ శర్మ తన చెల్లెలు అనుష్క శర్మతో కలిసి 2013లో క్లీన్ స్లేట్ ఫిలింజ్ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఇది అతి తక్కువ సమయంలోనే మంచి హిట్ కొట్టి 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందగలిగింది. ఫిలౌరీ, NH10 సహా పలు హిట్ చిత్రాలను కూడా ఇందులోనే నిర్మించారు. నిజానికి కర్నేష్ శర్మ విజయ ప్రస్థానం అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్10తో ప్రారంభమైంది. రూ.30 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్దగా రాణించలేదు, కానీ ఆ తరువాత మంచి యాక్షన్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఫిలౌరీ, పారి, బుల్బుల్ వంటివి కూడా మంచి హిట్స్ అందించాయి. (ఇదీ చదవండి: ఎలాన్ మస్క్, అంబానీ.. వీళ్లకంటే ముందు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఈయనే!) కర్నేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఖాలా (Qala) ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఈయన తరువాత చిత్రం 'చక్‌దే ఎక్స్‌ప్రెస్'. ఇది ఇండియన్ క్రికెటర్ 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా తెరకెక్కనుంది. (ఇదీ చదవండి: ఇలాంటి స్కీమ్ మళ్ళీ మళ్ళీ రాదు.. తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ!) నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం.. కర్నేష్ శర్మ అండ్ అనుష్క శర్మల నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ నెట్‌ఫ్లిక్స్ & అమెజాన్ ప్రైమ్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా రూ. 400 కోట్లకంటే ఎక్కువ అని సమాచారం. దీని కింద ఎనిమిది చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయనున్నారు. చివరగా కర్నేష్ శర్మ నికర విలువ దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు. -
మహిళా నిర్మాతకు కేబీఆర్ పార్క్‌లో చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళా నిర్మాతకు కేబీఆర్ పార్కులో చేదు అనుభవం ఎదురైంది. పార్కు వద్ద జాగింగ్ చేస్తున్న నిర్మాతను ఓ పోకిరి లైంగిక వేధింపులకు గురి చేశాడు. తాను జాగింగ్ చేస్తుంటే ఆమెను కారులో వెంబడిస్తూ వేధించాడు. అశ్లీల హావభావాలతో తనను ఇబ్బందిపెట్టడమే కాకుండా తన ఫోన్లో ఆమెను చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. దాదాపు గంటన్నరపాటు ఆమె వెంటపడుతూ ఇబ్బందికరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక సదరు 32 ఏళ్ల నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు 354ఎ, 354డి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటన జూలై 9న జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు నలుపు రంగులో కారులో వచ్చినట్లు బాధితురాలు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: కలిసిన కాసేపటికే ఇంటికి రమ్మన్నాడు.. వెళ్లి ఉండాల్సింది: హీరోయిన్ -
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే నటి మహాలక్ష్మి శంకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు కూడా. మహాలక్ష్మి డబ్బు కోసమే నిర్మాతను రెండో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. దీనిపై స్వయంగా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. అయితే ట్రోల్స్‌ను ఈ జంట పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా మరోసారి రవీందర్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. నిర్మాత రవీందర్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. (ఇది చదవండి: ఎక్కువ మంది చూసిన ఇండియన్ సినిమా ఇదే! బాహుబలి, దంగల్ కాదు!) రవీందర్ చంద్రశేఖరన్ తమిళంలో చాలా సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం రవీందర్ ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో చెన్నైలో రవీందర్‌పై కేసు నమోదైంది. దాదాపు రూ.15 లక్షలు తీసుకుని స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. చెన్నై క్రైం బ్రాంచ్ పోలీసుల సమాచారం ప్రకారం.. అమెరికాలో ఉంటున్న విజయ్ అనే వ్యక్తి రవీందర్‌తో కలిసి సినిమా నిర్మాణంలో భాగమయ్యాడు. ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెడుతుందని విజయ్‌కి రవీందర్ హామీ ఇచ్చారు. దీంతో విజయ్ తన వాటాగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా రవీందర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆన్లైన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో రవీందర్ చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో విచారణకు హాజరయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) -
చాలాసార్లు లవ్‌లో ఫెయిలయ్యా, అందుకే లైఫ్‌లో సక్సెసయ్యా: నిర్మాత
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఎంటర్టైనర్ బేబీ. రచయిత, దర్శకుడు సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో జూలై 7న బేబీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఎకేఎన్ తన జీవితంలో జరిగిన బ్రేకప్స్ గురించి మాట్లాడాడు. 'మన బ్రేకప్స్ లెక్కపెట్టుకుంటే ఇక్కడున్నవాళ్ల మేకప్‌లు ఆరిపోతాయి. లవ్‌లో ఫెయిలైనవాడే లైఫ్‌లో సక్సెస్ అవుతాడని నమ్ముతాను. చాలాసార్లు లవ్‌లో ఫెయిలయ్యాను, అందుకే జీవితంలో సక్సెస్ అయ్యాను. జీవితంలో తొలిసారి బ్రేకప్ అయినప్పుడు ఇంకో అమ్మాయిని ప్రయత్నించాను. అది కూడా ఎవర్నో కాదు, అక్కతో బ్రేకప్ అయితే ఆమె ఇగో దెబ్బతినాలని తన చెల్లినే ట్రై చేశాను. తర్వాత ఏమైందనే వివరాలు ఇక్కడ చెప్తే బాగోదు' అన్నాడు ఎస్‌ఎకేఎన్. చదవండి: మరో నటితో దొరికాడు.. బ్రేకప్ చెప్పిన విషయం తెలిసి నాన్నకు గుండెపోటు: నటి -
నిర్మాత కన్నుమూత
కన్నడ నిర్మాత, పంపిణీదారుడు కేసీఎన్ మోహన్(61) ఆదివారం బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కన్నడంలో అనేక సినిమాలను నిర్మించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా ఏడాది క్రితం సోదరుడు కేసీఎన్ చంద్రశేఖర్ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఇంతలోనే మోహన్ మృతి చెందడంతో ఈ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. -
దిల్ రాజు కుమారుడి బర్త్‌డే.. చిరు, మహేశ్ సహా పలువురు సెలబ్రిటీల హాజరు (ఫొటోలు)
-
రెండో భర్తకు విడాకులు.. కారణాలు అక్కర్లేదంటున్న నటి
బాలీవుడ్ నటి రుక్సర్ రెహమాన్, దర్శకనిర్మాత ఫరూఖ్ కబీర్ దంపతులు విడిపోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా వీరికి పొసగడం లేదని, తరచూ గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తారాస్థాయికి చేరడంతో విడిపోవడమే నయమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వార్తలపై రుక్సర్ రెహమాన్ స్పందించింది. విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. పెంట చేయాలనుకోవడం లేదు ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 'అవును, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం, కొంతకాలంగా దూరంగా ఉంటున్నాం. ఫిబ్రవరి నుంచి మేము విడివిడిగానే జీవిస్తున్నాం. విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నాం. ఇదంత సులువుగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనక ఉన్న కారణాలను, వివరాలను కూపీ లాగి పెంట చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను' అని చెప్పుకొచ్చింది. మొదటి భర్తకు విడాకులు.. రెండో సారి.. కాగా నటి రెహమాన్ తొలుత అసద్ అహ్మద్‌ను పెళ్లాడింది. వీరికి ఐషా అహ్మద్ అనే కూతురు జన్మించింది. ఈమె కూడా నటిగా స్క్రీన్‌పై తళుక్కుమని మెరిసింది. అయితే రెహమాన్, అసద్‌ల మధ్య దూరం పెరగడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెహమాన్.. ఫరూఖ్ కబీర్ ప్రేమలో పడింది. ఆరేళ్లు డేటింగ్లో ఉన్న తర్వాత 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే రెహమాన్.. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన 'యాద్ రఖేగి దునియా' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పీకే, గాడ్ టుస్సి గ్రేట్ హో, 83, ఖుదా హఫీజ్ 2 వంటి పలు చిత్రాల్లో నటించింది. చదవండి: రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి ఓపెన్ అయిన శేఖర్ మాస్టర్ -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. బాలీవుడ్ నిర్మాత కుల్జీత్ పాల్(90) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆదివారం ముంబయిలోని శాంతాక్రూజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) బాలీవుడ్లో అర్థ్, ఆజ్, పరమాత్మ, వాస్నా, దో షికారి, ఆషియానా వంటి చిత్రాలను కుల్జీత్ పాల్ నిర్మించారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ సీనియర్ హీరోయిన్ రేఖకు మొదటి అవకాశమిచ్చిన నిర్మాతగా కుల్జీత్ పాల్ పేరు సంపాదించారు. అయితే ఆ చిత్రం రిలీజ్ కాలేదు. దీంతో ఆమెతో దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. (ఇది చదవండి: ‘సర్కిల్’తో అవకాశాలు పెరుగుతాయి : అర్షిణ్ మెహతా, రిచా పనై) -
నటిపై లైంగిక వేధింపులు.. నిర్మాతపై కేసు నమోదు!
హిందీలో పాపులర్ షో అయినా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకుంది తారక్ మెహతా కా ఉల్టా చష్మా. అయితే ఈ షో నుంచి నటీనటులు ఒక్కొక్కరుగా వైదొలిగారు. గత కొద్దికాలంగా ఈ షో నిర్మాతలపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో నటించిన మోనికా భదోరియా, ప్రియా అహుజా, శైలేష్ లోధా, దిశా వకాని ఇప్పటికే గుడ్ బై చెప్పేశారు. అయితే గతంలో నిర్మాతలు తనను లైంగిక వేధింపులకు గురి చేశారని మరో నటి జెన్నిఫర్ మిస్త్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: షో నుంచి తప్పుకున్న నటి.. నిర్మాతలపై సంచలన ఆరోపణలు!) ఈ విషయంపై తాజాగా జెన్నిఫర్ మిస్త్రీ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెపై లైంగిక వేధింపులకు సంబంధించి ఇప్పటికే జెన్నిఫర్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. ఇవాళ ఉల్టా చష్మా షో నిర్మాత అలిత్ మోడీ, ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత జతిన్ బజాజ్‌పై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. కాగా.. అసిత్ మోడీతో పాటు కొంతమంది నటీనటులపై జెన్నిఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిరాధారం: అసిత్ మోడీ తనపై జెన్నిఫర్ మిస్త్రీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని అసిత్ మోడీ కొట్టిపారేశారు. తన పరువు తీసేందుకు అలా చేస్తోందని .. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. పోలీసులు విచారణ తర్వాతే నిజాలు బయటకు వస్తాయని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మహిళతో సహజీవనం.. లైవ్‌లో కమెడియన్ ఆత్మహత్యాయత్నం!) -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
‘‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎస్ఎఫ్సీసీ) అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నవారికి కృతజ్ఞతలు. గత ఏడాది కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ అసోసియేషన్‌కి పూర్తి సమయం కేటాయించలేకపోయాను.. ఈ ఏడాది కచ్చితంగా సమయం కేటాయించి అందరితో కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను’’ అని నిర్మాత సునీల్ నారంగ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన ‘తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి’ పాలక మండలిని శనివారం ప్రకటించారు. ‘టీఎస్ఎఫ్సీసీ’ అధ్యక్షునిగా సునీల్ నారంగ్ ఎన్నికవగా, ఉపాధ్యక్షులుగా వీఎల్ శ్రీధర్, వాసుదేవ రావు చౌదరి, సెక్రటరీగా కె. అనుపమ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా బాలగోవింద్ రాజ్ తడ్ల, ట్రెజరర్‌గా చంద్ర శేఖర్ రావు ఎన్నికయ్యారు. అలాగే 15 మంది ఈసీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ–‘‘టీఎస్ఎఫ్సీసీ’ పాలక మండలి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. అందరూ చిత్ర పరిశ్రమ, కార్మికుల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి’’ అన్నారు. ఇంకా నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడారు. -
రీసెంట్గా పెళ్లి.. భార్య కోసం ప్రముఖ నిర్మాత షాకింగ్ డెసిషన్!
మూవీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్, పెళ్లి, విడాకులు లాంటివి చాలా కామన్. కలిసి నటించిన యాక్టర్స్ ప్రేమలో పడి ఓవైపు పెళ్లి చేసుకుంటే.. మరోవైపు కొందరు నిర్మాతలు లేటు వయసులోనూ రెండోసారి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు ఉంటున్నాయి. తెలుగులో దిల్ రాజు ఇలానే రెండో పెళ్లి చేసుకున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ నిర్మాత మధు మంతెన కూడా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కి చెందిన మధు మంతెన.. దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగులో 'కార్తిక్' మూవీ తీశారు. ఆ తర్వాత పూర్తిగా హిందీకే పరిమితమైపోయారు. ఆమిర్ ఖాన్ 'గజిని', రక్త చరిత్ర, క్వీన్, మసాన్, సూపర్ 30 లాంటి హిట్ మూవీస్ కి నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం 'రామాయణ్' అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తీసే బిజీలో ఉన్నారు. 2015లో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాని పెళ్లి చేసుకున్న మధు మంతెన.. 2019లో ఆమెకి విడాకులు ఇచ్చేశారు. రీసెంట్ గా యోగా ట్రైనర్ ఐరా త్రివేదిని రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు ఈ జంట హనీమూన్ కు వెళ్లింది. భార్య ఫొటోల్ని కొన్ని ఈయన పోస్ట్ చేశారు. అయితే ఐరాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటిపేరుని తన ఇన్ స్టాలోనూ జోడించారు. ప్రస్తుతం 'మధు మంతెన త్రివేది' అని ఉంది. సాధారణంగా భర్తల పేరు లేదా ఇంటిపేరుని భార్య తన పేరు చివర చేర్చుకుంటుంది. ఇక్కడేమో రివర్స్ లో జరిగింది. (ఇదీ చదవండి: Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ) -
డ్రగ్స్ కేసులో ఇద్దరు స్టార్ హీరోయిన్లు, డైరెక్టర్?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం దుమారం రేపుతోంది. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. కబాలి నిర్మాత కేపీ చౌదరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతని నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌ను తీసుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డ్రగ్స్ దందాలోకి దిగిన కేపీ చౌదరితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు టచ్‌లో ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అరెస్ట్ అయిన రోషన్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. (ఇదీ చదండి: సినిమా రంగంలోనే డ్రగ్స్ ఎందుకు?) తాజాగా కేపీ చౌదరి ఏర్పాటు చేసిన పార్టీలకు హాజరైన సినీ ప్రముఖుల లిస్ట్‌ను పోలీసులు రెడీ చేస్తున్నారు. అతని నుంచి ఒక్కొక్కటిగా డ్రగ్స్ లింక్‌లు బయటపడుతున్నాయి. అతను ఎవరెవరితో వాట్సప్‌లలో చాటింగ్ చేశారో విశ్లేషిస్తున్నారు. డ్రగ్ మాఫియా ఖేల్ ఖతం అనుకుంటే.. గోవా టూ హైదరాబాద్ రూట్లో ఈ రాకెట్ మళ్లీ గుప్పుమంది. మరోవైపు డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం గాలిస్తున్నారు. టాలీవుడ్ నుంచి కేపీ చౌదరిని అదుపులోకి తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో హీరోయిన్ ఛార్మీ, రానా, పూరి,రవితేజ,నవదీప్,ముమైత్ ఖాన్,నందు,తరుణ్‌ను డ్రగ్స్ లింక్‌ల గురించి పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డ్రగ్స్ లింక్‌లో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లతో పాటు, నలుగురు మహిళా ఆర్టిస్ట్‌లు ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ డ్రగ్ మాఫియా వెనుక ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. కేపీ చౌదరి ఫోన్‌ను పూర్తిగా పరిశీలించి.. ఈ డ్రగ్స్ లింక్‌లో ఎవరెవరు ఉన్నారో? వారి పేర్లు బయటపెడుతామని పోలీసులు తెలుపుతున్నారు. (ఇదీ చదండి: తమన్నాతో లవ్.. ఆ సమయం కోసం వెయిట్ చేశా: విజయ్ వర్మ) -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అరెస్ట్.. భారీస్థాయిలో డ్రగ్స్ స్వాధీనం!
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. కబాలి చిత్ర నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి(కేపీ చౌదరి)ని కిస్మత్ పుర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 82 గ్రాముల కొకైన్,, రూ.2,05,000 నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి!) సినీరంగంలో నష్టాలు రావడంతో డ్రగ్స్ సరఫరాను ఎంచుకున్నారు. గోవాలో ఓహచ్ఎం పబ్‌ను ప్రారంభించిన కేపీ చౌదరీ సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పబ్బులో నష్టాలు రావడంతో హైదరాబాద్ తిరిగొచ్చారు. నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా బొనకల్ మండలంగా పోలీసులు తెలిపారు. ఆయన గతంలో పూణె ఏరోనాటికల్‌లో డైరెక్టర్ ఆపరేషన్స్‌గా పనిచేశారు. సినీ ప్రముఖలతో సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరికి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. గోవాలో నైజీరియన్లతో ఉన్న పరిచయాలతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇవాళ పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు కిస్మత్ పుర్లో కొకైన్ విక్రయిస్తుండగా మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అయితే గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. -
రెండో పెళ్లి చేసుకున్న గజిని చిత్ర నిర్మాత..!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, తన ప్రియురాలు ఐరా త్రివేదిని పెళ్లి చేసుకున్నారు. పలువురు బాలీవుడ్ తారలతో పాటు అమిర్ ఖాన్, హృతిక్ రోషన్ తదితరులు కూడా వివాహానికి హాజరయ్యారు. గతంలో మసాబా గుప్తాను పెళ్లాడిన మధు ఆమె విడాకులు తీసుకున్నారు. తాజాగా రెండో పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఐరా త్రివేది తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ( ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) ముంబయిలో జరిగిన ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. శనివారం జరిగిన మెహందీ వేడుకలో అమీర్, హృతిక్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ పాల్గొన్న సంగతి తెలిసిందే. మధు మంతెన గతంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. వీరు 2019లో విడిపోయారు. మసాబా ఇటీవలే సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకున్నారు. కాగా మధు మంతెన బాలీవుడ్లో క్వీన్, అగ్లీ, గజిని తదితర చిత్రాలను నిర్మించారు. (ఇది చదవండి: ఘనంగా బుల్లితెర నటి సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!) View this post on Instagram A post shared by Ira Trivedi (@iratrivedi) -
బాలీవుడ్ నిర్మాత మధు మంతెనా-ఇరా త్రివేది మెహందీ వేడుక (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత రెండో పెళ్లి.. మెహందీ వేడుకల్లో సినీ తారలు!
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మధు మంతెన, ఐరా త్రివేది ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. ఇవాళ రాత్రి ముంబయిలో జరుగుతున్న మెహందీ వేడుకలో అత్యంత సన్నిహితులు, బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. నిర్మాత మధు మంతెన, రచయిత-యోగా శిక్షకురాలు ఇరా త్రివేదిని జూన్ 11న పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఖాన్, రాజ్‌కుమార్ రావు, పాత్రలేఖ, నిఖిల్ ద్వివేది తళుక్కున మెరిశారు. ఈ పెళ్లివేడుక ఆదివారం ఓ ముంబయిలోని ఓ హోటల్లో జరగనుంది. (ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి ) ఈ జంట పెళ్లి తర్వాత త్వరలోనే వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మధు, ఐరా ఒకరికొకరు చాలా కాలంగా పరిచయమున్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహాబంధంతో ఒక్కటవుతున్నారు. మధు మంతెన ప్రస్తుతం రామాయణం చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నారు. అంతకుముందు గజిని, అగ్లీ, క్వీన్ హిట్ చిత్రాలను మధు నిర్మించారు. నీనా గుప్తా కుమార్తెతో మసాబా గుప్తాతో విడాకులు కాగా.. 2015లో ఫ్యాషన్ డిజైనర్, బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురు మసాబా గుప్తాను మధు వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అయితే మసాబాను వివాహం చేసుకోక ముందే నందనా సేన్‌తో మధు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే! ) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఆ నిర్మాత ఎంతోమందిని వాడుకుని వదిలేశాడు: ప్రేమమ్ హీరోయిన్
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్ కౌచ్' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్ కామెంట్ చేసింది. ఇలాంటి వారి టార్చర్ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్ రథ్ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది. నిర్మాత సంజయ్ నాయక్ కామెంట్: హీరోయిన్ల ఆరోపణలను సంజయ్ నాయక్ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్ తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
నిర్మాత బెల్లంకొండ కారు అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!
ప్రముఖ చిత్రనిర్మాత విక్రమ్ భట్ కూతురు కృష్ణ భట్ పెళ్లి పీటలెక్కనుంది. తన ప్రియుడు వేదాంత్ సర్దాను ఈ నెలలోనే వివాహాం చేసుకోనుంది. ఈ ప్రేమజంట పెళ్లి జూన్ 11న ముంబైలో పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని విక్రమ్ భట్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన కుమార్తె కృష్ణ భట్‌కు.. గతేడాది డిసెంబర్లో వేదాంత్ సర్దాతో నిశ్చితార్థం అయినట్లు తెలిపారు. (ఇది చదవండి: పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఉంటామన్న ఏపీ సీఎంవో) కాగా కృష్ణ భట్ నిర్మాతగా '1920 - హారర్స్ ఆఫ్ ది హార్ట్' అనే సినిమాతో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని మహేష్ భట్, ఆనంద్ పండిట్ సమర్పణలో రాజ్ కిషోర్ ఖవారెతో కలిసి విక్రమ్ భట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 23న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: స్నేహం పేరుతో నమ్మించి.. బాలికపై అత్యాచారం.. సింగర్ అరెస్ట్) View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) -
ఆ మాటలే నాకు దీవెనలు
‘‘సమాజంలో బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను చర్చించడానికి ఎన్నో వేదికలు ఉన్నాయి. ఒక సినిమా కళాకారుడిగా వెండితెర వేదికగా ఆ సమస్యలు చూపిస్తున్నాను’’ అని అన్నారు దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన స్వీయదర్శకత్వంలో రూపొందించి, నటించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి ‘సాక్షి’తో చెప్పిన విశేషాలు ఈ విధంగా... ► సమాజంలో ఉన్న సమస్యలతోనే 40 ఏళ్లుగా సినిమాలు తీస్తున్నారు... రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీస్తే సేఫ్ కదా? సేఫ్టీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నా వంతుగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడే సినిమా ఇవ్వాలన్నదే నా ఆశయం. అనాదిగా మంచి కోసం, సమసమాజం కోసం ఎందరో మహనీయులు వారివారి వేదికల్లో కృషి చేస్తూనే ఉన్నారు. అదే కోవలో నేను సినిమా వేదికగా ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు జర్నలిస్టు తన కలంతో, వాగ్గేయకారుడు పాటతో, రచయిత తన రచనలతో పరిష్కారం కోసం పోరాడతారు. అలాగే ఒక సినిమా సాంస్కృతిక సైనికుడిగా 40 ఏళ్లుగా సామాజిక సమస్యలే ఇతివృత్తంగా సినిమాలు తీస్తున్నాను. ఇందులోనే నాకు సంతృప్తి, ఆనందం దక్కుతున్నాయి. శ్రీశ్రీ చెప్పినట్లు నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అనేలా సామాజిక అంశాలపైన సినిమాలు తీస్తున్నాను తప్ప నేనేదో సమాజాన్ని ఉద్ధరించడం కోసం తీస్తున్నానని అనుకోవడంలేదు. గూడవల్లి రామబ్రహ్మంవంటి మహనీయులు సామాజిక అంశాలతో సినిమాలను రూపొందించి లెజెండ్స్‌గా నిలిచారు. వారి అడుగుజాడల్లో నడుస్తున్న చిన్నపిల్లవాడిని నేను. ► ‘యూనివర్సిటీ’ సినిమా గురించి? విద్య, నిరుద్యోగం ప్రధానాంశాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాను. ప్రైవేటు విద్య వద్దు, పబ్లిక్ విద్యే ముద్దు అనే అంశంతో తీశాను. ప్రస్తుతం ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల చదువు వ్యాపారంగా మారిపోయింది. ఈ వ్యవస్థలో ఫస్ట్ ర్యాంకులు సాధించాలని పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్‌లు పెరిగిపోయాయి. దీనివల్ల బాగా చదివిన విద్యార్థులు వెనకబడిపోతున్నారు. ఇవి భరించలేక ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా క్యాంపస్ వేదికల్లోనిప్రొఫెసర్లు కూడా కులాలకు, మతాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఇలాంటి అసమానతలు పోవాలంటే కొఠారీ కమిషన్ పేర్కొన్నట్టు ప్రభుత్వ విద్యకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి, ప్రైవేటు సంస్థల్లోని వసతులు ఇక్కడ కూడా అందేలా చూడాలి. ఈ అంశాలు ప్రతిబింబించేలా ఈ సినిమా తీశాను. ► విద్య గురించి మాత్రమేనా? ఇతర విషయాలేమైనా ఈ సినిమాలో చె΄్పారా? ఉద్యోగాల గురించి కూడా చర్చించాను. అతి పెద్ద గ్లోబల్ విలేజ్ అయినటువంటి భారత్ నుంచి ఎందరో విద్యార్థులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్నారు. కానీ అక్కడ కూడా నిరుద్యోగం పెరిగిపోయి మనవారికి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ రాజ్యాంగ హక్కు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అవన్నీ కోల్పోతున్నారు. అందుకే 1986లో మురళీధర్ రావు కమిషన్, 1990లో మండల్ కమిషన్ తెలిపిన రిపోర్టు ప్రకారం ప్రైవేటు సెక్టార్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరముంది. మనది నిరుద్యోగ భారతం కాదు... ఉద్యోగ భారతం కావాలని చెప్పే చిత్రం ఇది. ► తెలుగు భాషకు ్రపాధాన్యం ఇచ్చే మీరు ఈ చిత్రంలో రెండు ఇంగ్లిష్ పాటలు పెట్టారు? ‘ఎవిరీ బడీ సే నో టు ప్రైవేట్ స్కూల్స్.. ఎవిరీ బడీ సే యస్ టు పబ్లిక్ స్కూల్స్.. ఎవిరీ బడీ వాంట్స్ కామన్ ఎడ్యుకేషన్’ అనే మహోన్నత ఆశయంతో వేల్పుల నారాయణగారు గొప్ప పాట రాశారు. ఈ పాటను సాయిచరణ్ అంతే గొప్పగా పాడారు. ఇంకో ఇంగ్లిష్ పాటను జలదంకి సుధాకర్ రాయగా, సాయిచరణ్ పాడారు. ఈ రెండు ఇంగ్లిష్ పాటలతో పాటు ‘తాత. తాత..’ అని గద్దరన్న రాసి, పాడిన పాట, ఇతర పాటలు కూడా సందర్భానుసారం సాగుతాయి. ► ప్రజా సమస్యలతో సినిమాలు తీస్తున్న మీ గురించి ప్రజలు నాలుగు మంచి మాటలు మాట్లాడినప్పుడు కలిగే అనుభూతి.. నారాయణమూర్తి మన సమస్యలు తీస్తున్నాడు.. మన కథలను చూపిస్తున్నాడు.. ఒక కళాకారుడుగా మన గుండెల్లోని బాధను సినిమాలో చూపించాడు... పరిష్కారం మార్గం చూపిస్తున్నాడు. అతను మన మనిషి. ప్రజా కళాకారుడు అని ప్రజలు అంటున్న ఆ మాటలను పెద్ద దీవెనలుగా భావిస్తున్నాను. ఏ కథాంశం అయినా ఆకట్టుకుంటేనే అభిమానులు చూస్తారు. ‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ఇప్పటివరకు సామాజిక సమస్యలే ప్రధానాంశాలుగా సినిమాలు తీస్తున్నాను. ప్రజలు దీవిస్తే అదే నా సంపాదన. నా సినిమాలు వంద రోజులు, జూబ్లీ వేడుకలు చేసుకున్నాయి. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సినిమాలు తీస్తూనే ఉంటాను. -
త్వరలోనే మరో రామాయణం.. రాముడు, సీతగా వారిద్దరే!
రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ ఆదిపురుష్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతిసనన్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 16న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నట్లు టీ టౌన్లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితేశ్ తివారీ, నిర్మాత మధు మంతెనతో కలిసి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి) అయితే ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. సీత పాత్రకు బాలీవుడ్ భామ ఆలియా భట్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు నితేశ్ తివారీతో అలియా భట్ కనిపించడంతో ఓకే చెప్పారని సమాచారం. కానీ గతంలో సీతగా సాయిపల్లవి కనిపించనుందని వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రకు కేజీయఫ్ హీరో యశ్‌ను ఓకే చేశారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ..'నేను కొందరు నిర్మాతలతో కలిసి రామాయణాన్ని నిర్మిస్తున్నా. దాని కోసం నాలుగేళ్లుగా వర్క్ జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇది చాలా పెద్ద ప్రయత్నం. పూర్తవ్వడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఇండియాలోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా నిలుస్తుందని'. చెప్పారు. మరోవైపు ఈ ప్రాజెక్ట్ వాయిదా పడనుందనే వార్తలపై తాజాగా నిర్మాత మధు మంతెన స్పందించారు. ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రారంభించనున్నాం. దయచేసి ఇలాంటివి ప్రచారాన్ని నమ్మకండి అని అన్నారు. దీంతో మరో ఆదిపురుష్ రాబోతోందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అతనిపై విపరీతమైన క్రష్.. కానీ నన్ను మోసం చేశాడు: హీరోయిన్) -
నా వల్ల పైకొచ్చినవాళ్లు గీత దాటారు, అతడి పేరు చెప్పను!
నా ద్వారా పైకి వచ్చిన దర్శకులు చాలామంది గీత దాటారన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. కెరీర్లో కొంత సక్సెస్ కాగానే ఆ విషయం మర్చిపోయి గీత దాటి వేరే సినిమాలు చేశారని పేర్కొన్నాడు. మే 5న మలయాళంలో రిలీజైన 2018 మూవీ అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు గురువారం థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు. జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేశాడు. 2018 మూవీ చూశా, ఇది మనం తెలుగులో రిలీజ్ చేయాలి అని చెప్పాడు. ఇతర భాషల్లో వస్తున్న మంచి సినిమాలన్నీ మనమే చేస్తున్నం కదా.. ఇది కూడా మనమే చేద్దాం అంటే సరేనన్నాను. అయితే ఇక్కడ నేను గానీ, దిల్ రాజుగానీ.. సీనియర్స్ అందరం జూనియర్స్‌కు స్పేస్ ఇవ్వాలి. అందులో వాళ్లను ఎదగనివ్వాలి. మొత్తం మనమే ఆక్రమించేసి మనమే పైకొచ్చేయాలనేది సరి కాదు. పక్కవాళ్లకు స్పేస్ ఇవ్వడమే నా ఆటిట్యూడ్. ఇప్పటికీ నాకోసం నిలబడ్డాడు చందూ మొండేటి కార్తికేయ 2 తీసి ఏడాది దాటిపోయింది. అయితే ఆ సినిమా రిలీజవకముందే నాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్మెంట్ ఉంది. కార్తికేయ 2 రిలీజ్ కాకముందే అతడో గొప్ప డైరెక్టర్ అని గ్రహించి బుక్ చేసుకున్నాను. నాద్వారా పైకొచ్చినవాళ్లలో చాలామంది గీత దాటారు. వాళ్ల పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. కానీ చందూ మొండేటి మాత్రం నాతో సినిమా చేయడానికే నిలబడ్డారు' అని వ్యాఖ్యానించాడు అరవింద్. అయితే అల్లు అరవింద్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: అమ్మాయిలపై అత్యాచారం... నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష -
యాంకర్ నుంచి నిర్మాత ఆ తరువాత సినిమాల్లోకి న ప్రయాణం ఎలా కొనసాగింది అంటే..!
-
మెగా ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్
-
ఘనంగా నిర్మాత డివివి దానయ్య కుమారుడి వివాహం (ఫొటోలు)
-
గ్రాండ్‌గా నిర్మాత దానయ్య కుమారుడి పెళ్లి, వీడియో వైరల్
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తనయుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడయ్యాడు. వేదమంత్రాల సాక్షిగా సమత మెడలో మూడు ముళ్లు వేశాడు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హీరోలు రామ్‌చరణ్, పవన్ కల్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళితో పాటు పలువురు ఈ వివాహ వేడుకకకు విచ్చేసి సందడి చేశారు. దానయ్య వచ్చిన అతిథులను దగ్గరుండి రిసీవ్ చేసుకుని వారితో పెళ్లిమండపంలో ఫోటోలు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కొత్త పెళ్లికొడుకు కల్యాణ్ విషయానికి వస్తే అతడు అధీరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో గతేడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభమైంతది. జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. Happy Married Life @IamKalyanDasari 💐🎉#DVVDanayya#RamCharan #PrashanthNeel #SSRajamouli pic.twitter.com/MV3U1M9ar7 — Dheeraj Pai (@DheerajPai1) May 20, 2023 చదవండి: సీరియల్ నటీనటుల పెళ్లి.. ఆమెను ఎందుకు మోసం చేశావంటూ మండిపాటు -
ఆర్ఆర్ఆర్ నిర్మాత ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. దానయ్య కుమారుడు, యంగ్ హీరో కల్యాణ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడట. సమత అనే అమ్మాయితో శనివారం (మే 20న) ఏడడుగులు వేయబోతున్నాడంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మాదాపూర్‌లో ఈ వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ శుభకార్యానికి టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరై వధూవరును ఆశీర్వదించనున్నారట. ఇకపోతే కల్యాణ్ అధీరా అనే సూపర్ హీరో సినిమాతో త్వరలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతేడాది వేసవిలో డైరెక్టర్ రాజమౌళి, హీరో జూనియర్ ఎన్టీఆర్‌ల సమక్షంలో ఈ సినిమా ప్రారంభమైంది. జాంబి రెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తనయుడి సినిమా బాధ్యతలను దానయ్య తండ్రిగా తన భుజానికెత్తుకున్నాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో దానయ్య పేరు మార్మోగిపోయింది. రాజమౌళితో సినిమా చేయడం కోసం ఆయనకు 2006లోనే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నాడు దానయ్య. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణ బాధ్యతలను దానయ్యకు అప్పగించాడు జక్కన్న. ఈ సినిమా కోసం కోట్లాది రూపాయలు బడ్జెట్ పెట్టిన దానయ్య ఆస్కార్ ప్రమోషన్స్‌లో మాత్రం పాల్గొనలేదు. అయితే తను నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు రావడంతో ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్‌తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సుజీత్ డైరెక్షన్ అందిస్తున్నాడు. చదవండి: హీరోయిన్ను ముప్పుతిప్పలు పెట్టిన అమ్మాయిలు, ఎందుకిలా టార్చర్ చేస్తారు? -
ఒక్క మూవీకే రూ.32 కోట్ల నష్టం, సినిమాలు వదిలేద్దామనుకున్నా
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని.. అన్నాడో సినీ కవి. ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏ సినిమా అయినా హిట్టవ్వాలని కోరుకుంటారు. కానీ ప్రతి సినిమా హిట్టవ్వదు. ప్రేక్షకులకు నచ్చితేనే ఓటేస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. అలా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా చతికిలపడి నిర్మాతలకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన శక్తి సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుంది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి స్పందించాడు ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్. 'ఆ రోజుల్లో పంపిణీ అంతా నిర్మాతలే చూసుకునేవారు. అందువల్ల నష్టం వస్తే నిర్మాతలు తట్టుకోలేకపోయేవారు. చేసిన అప్పులు తీర్చేందుకు ఇళ్లు, పొలాలు, భూములు అమ్ముకున్న ఎంతోమందిని కళ్లారా చూశాను. అందుకే నేను ఎప్పుడూ కొంత జాగ్రత్త పడేవాడిని. ఏదైనా సినిమా తీసి దెబ్బతిన్నప్పుడు చిరంజీవి పిలిచి కథ రెడీ చేసుకోండి, మనం సినిమా చేద్దాం అనేవారు. నాగార్జున కూడా అంతే, వేరే సినిమాలు ఆపేసి మరీ నాకోసం సినిమాలు చేసేవారు. ఆరోజుల్లో అలా ఉండేది. నాకు బాగా అసంతృప్తిని ఇచ్చిన సినిమా శక్తి. ఈ ఒక్క సినిమాతోనే రూ.32 కోట్లు పోయాయి. నేను షాక్‌లోకి వెళ్లిపోయాను. అందుకే నాలుగైదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నిజానికి ఇండస్ట్రీ నుంచే వెళ్లిపోదామనుకున్నాను. ఇక్కడ బాగా సక్సెస్ అయిన చూడాలని ఉంది సినిమాను నేను, అరవింద్ కలిసి హిందీలో తీశాం. రూ.12 కోట్ల నష్టం వచ్చింది. అంటే చెరి ఆరు కోట్ల నష్టం. అప్పటికి ఇద్దరం ఫామ్‌లో ఉన్నాం కాబట్టి మళ్లీ వెంటనే కోలుకున్నాం' అని చెప్పుకొచ్చాడు. కాగా అశ్వినీదత్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె(వర్కింగ్ టైటిల్) సినిమా నిర్మిస్తున్నాడు. చదవండి: ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎన్నో వెధవ పనులు చేశా: డైరెక్టర్ నేను చనిపోలేదు, అలా అని రిటైర్మెంటూ తీసుకోలేదు: నటుడు -
గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మన్ కుటుంబానికి ఆర్థికసాయం
నటుడు సత్యరాజ్, వసంత రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వెపన్'. ఎంఎస్.మన్సూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర షూటింగ్లో ఓ దుర్ఘటన జరిగింది. ఎస్.కుమార్ అనే లైట్‌మన్ ప్రమాదవశాత్తూ మరణించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్) దీంతో అతని కుటుంబానికి వెపన్ చిత్ర నిర్మాత ఎంఎస్. మన్సూర్ రూ.12 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. ఈ మొత్తాన్ని బుధవారం చెక్కు రూపంలో లైట్‌మన్ కుమార్ భార్య జూలియట్, పిల్లలకు ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.పెల్వమణి, లైట్స్‌మన్ యూనియన్ అధ్యక్షుడు సెంథిల్, మేనేజర్ కందన్ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ లైట్‌మన్ కుమార్ మృతి తన కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినట్లు బాధిస్తోందన్నారు. వృత్తి కోసం రేయింబవళ్లు శ్రమించిన వ్యక్తి మరణం మనసును కలచివేస్తోందన్నారు. కుమార్ లేని లోటు అతని కుటుంబానికి ఎవరూ తీర్చలేనిదన్నారు. అందుకే తాను ఓదార్పుగా చిన్న మొత్తాన్ని సాయం చేసినట్లు తెలిపారు. (ఇది చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు!) -
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్
టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్ర హీరోలు, నిర్మాతలు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలకు, గూండాలకి అవార్డ్స్ ఇస్తున్నారని అశ్వనీదత్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక అవార్డ్స్‌కు విలువ పోయిందన్నారు. ప్రభుత్వం ముందు ఇండస్ట్రీని తాకట్టు పెట్టింది ఇండస్ట్రీ పెద్దలేనని ఆరోపించారు. ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్లు అప్పుడు అమరావతిలో భూములు తీసుకుంది వాస్తవం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పును.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి? చేయడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అవార్డ్స్ గురించి అడిగే దమ్ముందా? అని నిలదీశారు. (ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్) ప్రత్యేక విమానాల్లో వెళ్లి అమరావతిలో ఇండస్ట్రీని తాకట్టుపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీ కోసం కాకుండా రాజకీయాల కోసం మాట్లాడడం సరైంది కాదని హితవు పలికారు. పార్టీలకతీతంగా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి మాట్లాడాలని సూచించారు. నట్టి కుమార్ మాట్లాడుతూ.. ' ల్యాండ్స్ తీసుకున్న సినీ పెద్దలు స్టూడియోలు ఎందుకు నిర్మించట్లేదు.? స్టూడియోలు ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయి కదా. తెలంగాణలో 2014లో రూ.20 వేలు రెంట్ ఉంటే... ఇప్పుడు లక్షన్నర ఉంది. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అని మాత్రమే అంటోంది. కానీ చిన్న సినిమాలకి చేస్తోంది ఏమి లేదు.' అని అన్నారు. చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. '2014 నుంచి చిన్న సినిమా చచ్చిపోయింది. రెండు రాష్ట్రాలలో 2014 నుంచి స్టూడియోల నిర్మాణానికి ఎవరికి అనుమతులు లేవు. చిన్న, పెద్ద అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. పెద్దల్ని కలవలేక పోతున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాను. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి ఎంతో చేశారు. కానీ ఆయన చనిపోయాక ఎవరు పట్టించుకోవడం లేదు. రెండు ప్రభుత్వాలు దాసరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. దాసరి విజ్ఞాన పార్క్ పెట్టాలని కోరుతున్నా. ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.' అని అన్నారు. (ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!) -
ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం: ఏజెంట్ నిర్మాత
అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సారైనా అఖిల్ హిట్ కొడతాడని భావించినా అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే తాజాగా ఈ మూవీ ఫలితంపై టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఏజెంట్ మూవీ ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తమదేనని వెల్లడించారు. (ఇది చదవండి: కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో) అనిల్ సుంకర ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ మూవీపై వస్తున్న విమర్శలకు మాదే పూర్తి బాధ్యత. ఇది ఒక పెద్ద టాస్క్ అని తెలుసు. కానీ దాన్ని జయించగలమని అనుకున్నాం. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడంలో పొరపాట్లు చేశాం. కొవిడ్ వల్ల మరిన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే దీనికి ఎలాంటి సాకులు నేను చెప్పదలచుకోలేదు. చాలా పెద్ద మిస్టేక్ చేశాం. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాం. మరోసారి ఇలాంటివీ పునరావృతం కాకుండా చూసుకుంటాం. మా చిత్రబృందంపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరినీ క్షమాపణలు కోరుతున్నాం. రాబోయే ప్రాజెక్టుల్లో ఇలాంటి నష్టం జరగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం.' అని పోస్ట్ చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి-2 బ్యానర్స్‌పై తెరకెక్కించారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) We have to take the entire blame for #Agent. Though we know its an uphill task, we thought of conquering but failed to do so as we did a blunder starting the project without a bound script & innumerable issues including covid followed. We don't want to give any excuses but learn… — Anil Sunkara (@AnilSunkara1) May 1, 2023 -
చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్ ఎస్ చక్రవర్తి(53) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చక్రవర్తికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆయన తనయుడు జానీ రేణిగుంట అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. (చదవండి: అందరి ముందు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు!: రోజా రమణి) 1997 లో ‘రాశి’ అనే చిత్రంతో ఆయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో అజిత్ కుమార్ తో వాలి, రెడ్, సిటిజెన్, మగవారే, ఆంజనేయ అనే చిత్రాలను తెరకెక్కించారు. తన కెరీర్లో అత్యధిక సినిమాలు అజిత్‌తోనే నిర్మించాడు. శింబు హీరోగా నటించిన కాలై, వాలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. నిర్మాత చక్రవర్తి మరణంతో కోలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. Producer #NICArts #SSChakravarthy has passed away.. He was suffering from cancer for the last 8 months.. He produced lot of movies with Actor #AjithKumar Condolences to friends and family.. May his soul RIP! pic.twitter.com/JqmuvZZCAF — Ramesh Bala (@rameshlaus) April 29, 2023 -
ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత
టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీని ఒక్కరే తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. అఖిల్ ఏజెంట్ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా.. తమిళ మూవీకి కేటాయిస్తారా అని ప్రశ్నించారు. హీరోలను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నట్టి కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో రాజకీయాలు, ఎత్తుగడలు ఉన్నాయి. వాటిని అధిగమించడం అఖిల్ వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం వల్ల అవుతుందా? అక్కినేని కుటుంబం చాలా సైలెంట్. ఒక హీరోను తొక్కడానికి ఒక అగ్ర నిర్మాత థియేటర్లను బ్లాక్ చేశారు. ఏజెంట్ రిలీజ్ రోజే పొన్నియన్ సెల్వన్ 2 కూడా రిలీజ్ అయింది. మణిరత్నం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ మాకు తెలుగు సినిమా గొప్ప. ఏజెంట్ మూవీకి నిన్నటి దాకా డిస్ట్రిబ్యూటర్లు కూడా దొరకని పరిస్థితి ఉంది.' అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 'మోనోపాలి అనేది కరెక్ట్ కాదు. ఏజెంట్‌కు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని నాగార్జున ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. మీకే ఇలా జరిగితే మాలాంటి వారి పరిస్థితేంటి? తెలంగాణలో ఇప్పటికే చిన్న సినిమాలను చంపేశారు. మార్కెట్ మొత్తం పడిపోతోంది. దసరాకు కలెక్షన్స్ వచ్చాయి అంటున్నారు. మరి డబ్బులు ఎవరికెళ్లాయి. ప్రొడ్యూసర్‌కు, కొన్నవారికి ఇంకా డబ్బులు రావాలి. నిజమైన నిర్మాతలకు, బయ్యర్లకు డబ్బులు ఎందుకు రావడం లేదు. తెలుగు, తమిళం కంటే మనం తెలుగుకే ప్రాధాన్యత ఇవ్వాలి. వైజాగ్ అంతటా పొన్నియిన్ సెల్వన్-2 ఆడుతోంది. అక్కడ థియేటర్లు మొత్తం బ్లాక్ చేశారు. గతిలేని పరిస్థితుల్లో ఎగ్జిబ్యూటర్లు ఆ సినిమా వేయాల్సి వస్తోంది. మోనోపాలి వల్ల ఇండస్ట్రీ నాశనమవుతోంది. దీనిపై చర్చించాలి' అన్నారు నట్టి కుమార్. -
ఆ సినిమా నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది: దిల్ రాజు
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్ రాజు గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు నిర్మిస్తుంటారు. ఫ్లాపులు ఎదురైన వాటిని తట్టుకుని ఇండస్ట్రీలో నిలబడే వారిలో దిల్ రాజు ముందుంటారు. అలాంటి దిల్ రాజును భారీగా దెబ్బతీసింది ఆ చిత్రం. ఇటీవలే ఆయన నిర్మించిన శాకుంతలం మూవీ థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో బోల్తా కొట్టింది. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, మధుబాల, అల్లు అర్హ నటించారు. తాజాగా ఈ సినిమా ఫెయిల్యూర్‌పై ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు స్పందించారు. (ఇది చదవండి: సర్ఫ్‌తో స్నానం.. టాయిలెట్ వాటర్‌తో కాఫీ తాగా: నటి ఆవేదన) దిల్ రాజు మాట్లాడుతూ.. 'శాకుంతలం మూవీ మిస్ ఫైర్ అయింది. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్స్ రాలేదంటే ఇక ఫిక్స్ అయిపోవాలి. రియలైజేషన్ రావాలి. శాకుంతలం నాకు పెద్ద ఝలక్ ఇచ్చింది. నా 25 ఏళ్ల కెరీర్లో ఇది ఊహించలేదు.'అని అన్నారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్ అందుకున్న దిల్ రాజుకు శాకుంతలం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. కాగా.. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రాజెక్టులు ఓకే అయ్యాయని దిల్ రాజు తెలిపారు. (ఇది చదవండి: 'శాకుంతలం' సినిమాలో మెరిసిన యాంకర్ వర్షిణి) -
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ.. సాయి ధరమ్ తేజ్ నాన్నకు ఏంటీ సంబంధం?
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలో ఎవరినీ అడిగినా గుర్తుపట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ ఆయన బాటలోనే ప్రయాణిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి దూసుకొస్తున్న మరో యంగ్ హీరో, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈనెల 21న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదంతా మీకు తెలిసిన విషయమే కావొచ్చు. కానీ సాయి ధరమ్ తేజ్ తండ్రి గురించి మీకు తెలుసా? అంతే కాదండోయ్ ఆయనొక నిర్మాత అని మీరెప్పుడైనా విన్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తండ్రి జీవీఎస్ ప్రసాద్ ఓ సూపర్ హిట్ సినిమాను నిర్మించారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవితో ఆయన సినిమా తీశారు. ఆ బ్లాక్ బస్టర్ మూవీ గురించి ప్రేక్షకులందరికీ తెలిసు. కానీ ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ నాన్న నిర్మాతగా ఉన్నారన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఇంతకీ ఆయన తీసిన సినిమా ఏదో తెలుసుకోవాలనుందా? పదండి అదేంటో చూసేద్దాం. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఓ రేంజ్ ఉండేది. ఆయన సినిమాల్లో చేసే డ్యాన్స్‌ను అందరూ ఫిదా అయిపోయేవారే. అలా వెండితెరపై ఆయనొక ఎవర్ గ్రీన్ నటుడు. ఆయనతో సాయి ధరమ్ తేజ్ నాన్న జీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం 'రౌడీ అల్లుడు'. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు మెగాస్టార్. చిరు కెరీర్లో రౌడీ అల్లుడు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా 1991 అక్టోబర్ 18న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి కళ్యాణ్గా, ఆటో జానీగా రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ తర్వాత జీవీఎస్ ప్రసాద్ మరో సినిమా నిర్మించలేదు. మొత్తంగా ‘రౌడీ అల్లుడు’ సినిమా మెగాస్టార్ అభిమానులకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. -
నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు.. సమంతకు నిర్మాత కౌంటర్!
స్టార్ హీరోయిన్ సమంత, నిర్మాత చిట్టిబాబు మధ్య మొదలైన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇటీవల సమంత ఆయన కామెంట్స్‌పై కౌంటర్ ఇవ్వడంతో.. అయితే తాజాగా నిర్మాత చిట్టిబాబు స్పందించారు. ఆమె గురించి నేను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదంటూ సమంతను ఉద్దేశించి మాట్లాడారు. ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన కామెంట్స్ గురించి మాట్లాడితే బాగుండేదని చురకలంటించారు. (Hollywood Actor: సింగర్‌లా కనిపించేందుకు సర్జరీలు.. యువ నటుడు మృతి!) చిట్టిబాబు మాట్లాడుతూ.. 'ఇవన్నీ చాలా తెలివితేటలు అనుకుంటారు. నేను కౌంటర్ ఇస్తే ఆమె తల ఎక్కడా పెట్టుకోవాలో తెలియదు. నా పేరు చెప్పలేదు కాదు కాబట్టి సమంత అని నేను మాట్లాడడం లేదు. కానీ నేను కౌంటర్ ఇస్తే రిప్లై ఇవ్వలేదు. నా వెంట్రుకల గురించి మాట్లాడే బదులు నేను చేసిన కామెంట్స్‌లో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుంది.'అని అన్నారు. సమంత సినిమా ప్రమోషన్స్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని.. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. శాకుంతలం చిత్రంలో సమంతకు శకుంతల పాత్ర ఎలా వచ్చిందోనని ఆశ్చర్యం వేసిందంటూ విమర్శించారు. కాగా.. సమంత ఇటీవల 'శాకుంతలం' సినిమాతో అలరించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ప్రస్తుతం 'సిటాడెల్' వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బీజిగా ఉంది. ఇటీవల లండన్‌లో జరిగిన సిటాడెల్ ప్రీమియర్‌లో డిఫరెంట్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియన్ వర్షన్లో వరుణ్ ధావన్, సమంత జంటగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ఈనెల 28న స్ట్రీమింగ్ కానుంది. (జియో సినిమా ఉచితం కాదు.. ఇకపై డబ్బులు కట్టాల్సిందే!) సమంత స్ట్రాంగ్ కౌంటర్ అయితే సమంత కెరీర్‌పై నిర్మాత చిట్టిబాబు తీవ్రమైన ఆరోపణలకు సమంత గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనిపై ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్ చేసింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది. ప్రజలు తమ చెవుల్లో జుట్టును ఎలా పెంచుతారు? అన్న విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు వెల్లడించింది. అయితే చెవుల్లో వెంట్రుకలు పెరగడానికి టెస్టోస్టిరాన్ స్థాయిలే కారణమని గూగుల్ సమాధానమిచ్చింది. కాగా.. సమంత నటించిన శాకుంతలం అంతగా మెప్పించకపోవడంతో సమంతపై చిట్టిబాబు తీవ్ర విమర్శలు చేశారు. చిట్టిబాబు ఏమన్నారంటే? చిట్టిబాబు మాట్లాడుతూ..' సినిమా ప్రమోషన్స్ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. డైవర్స్ తర్వాత జీవనోపాధి కోసం పుష్పలో ఐటెమ్ సాంగ్ చేసింది. స్టార్ హీరోయిన్ హోదా కోల్పోయిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. హీరోయిన్గా ఆమె కెరీర్ ముగిసింది. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసి ఆశ్చర్యపోయా. శాకుంతలం ప్రమోషన్లలో మాటలు కూడా రావడం లేదంటూ సానుభూతి పొందాలని చూసింది.' అంటూ విమర్శించారు. (Kiran Abbavaram: స్టార్ హీరోతో కిరణ్ అబ్బవరం మల్టీస్టారర్!) -
రిలీజ్‌కు ముందు 'ఏజెంట్' నిర్మాత ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత,ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ సుంకర ట్విటర్ వేదికగా తెలిపారు. 'నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి.. అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తూ నా విజయానికి బాటలు వేసిన నా పెదనాన్న ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో బాధిస్తుంది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాము. కష్టపడి సక్సెస్ సాధిస్తూ మీరు గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా 2010లో బిందాస్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ఆరంభించిన ఆయన దూకుడు, ఆగడు, లెజెండ్, రాజుగారి గది, కృష్ణగాడి వీర ప్రేమగాధ వంటి హిట్ పలు హిట్ సినిమాలను నిర్మించారు. ఇప్పుడు అఖిల్ అక్కినేనితో ఏజెంట్ సినిమాతో ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. Woke up this morning with a news that my dear pedananna Sunkara Basava rao garu, who loved me encouraged me and always looked farward for my success is no more. He lived all his life encouraging innovation. REST IN PEACE pedanannagaru. We will always miss you but work hard to… pic.twitter.com/FFCkZvNWDF — Anil Sunkara (@AnilSunkara1) April 22, 2023 -
దిల్ రాజుకు భారీ షాక్ ఇచ్చిన సమంత..
-
విడాకులు ఫిక్స్..?
-
క్షీణించిన నిర్మాత ఆరోగ్యం.. దీనస్థితిలో వీడియో విడుదల.. లారెన్స్ సాయం
చెన్నై: కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అలా తాజాగా ఆయన పేదరికంలో వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న నిర్మాతకు ఆర్థిక సాయం చేశారు. విక్రమ్, సూర్య కలిసి నటించిన పితామహన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రంతో పాటు విజయకాంత్ హీరోగా నటించిన గజేంద్ర తదితర భారీ చిత్రాలను నిర్మాత విఏ.దురై. చివరిలో నిర్మించిన చిత్రాలు ప్లాప్ కావడంతో నష్టాల పాలయ్యారు. కాగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ చైన్నెలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఖర్చులకు కూడా డబ్బులేదని ఆవేదన చెందుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నటుడు రజనీకాంత్ కూడా సాయం చేస్తానని చెప్పారు. రాఘవ లారెన్స్ నిర్మాత పరిస్ధితి గ్రహించి బుధవారం ఆయన వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షలు ఆర్ధిక సాయం చేశారు. కాగా లారెన్స్ కథానాయకుడిగా నటించిన రుద్రన్ చిత్రం తమిళ ఉగాది సందర్భంగా ఇవాళ ఏప్రిల్ 14న విడుదలైంది. చదవండి: ‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
సమంత.. ఎందుకు ఈ డ్రామాలు? పిచ్చివేషాలు: నిర్మాత
సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు (ఏప్రిల్ 14న) ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా శాకుంతలం మూవీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే!. జ్వరం వచ్చిందని, గొంతు కూడా పోయిందని ట్విటర్లో వెల్లడించిందీ హీరోయిన్. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మాత్రం అదంతా డ్రామా అంటూ సమంతపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రతిసారి డ్రామాలు వర్కవుట్ కాదంటూ మండిపడ్డాడు. ఆయన మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత సమంత పుష్పలో ఐటం సాంగ్ చేసింది. తన బతుకుదెరువు కోసం ఆమె నటించింది. హీరోయిన్ స్థాయి నుంచి పడిపోయాక తన చేతికి వచ్చినవి చేసుకుంటూ ముందుకెళ్లింది. అయినా హీరోయిన్గా ఆమె కెరీర్ ముగిసిపోయింది.. గతాన్ని వాడుకుంటూ ముందుకు వెళ్లడమే! మళ్లీ ఆమెకు స్టార్డమ్ రాదు. మొన్న యశోద సినిమా సమయంలో ఏడ్చేసి ఆ సినిమాను సక్సెస్ చేసుకోవాలనుకుంది. ఇప్పుడేమో.. నేను చచ్చిపోయేలోపు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలనుకున్నా అని చెప్పింది. ఎందుకీ డ్రామాలు? ప్రతిసారి సెంటిమెంట్ వర్కవుట్ కాదు. కథ, పర్ఫామెన్స్ నచ్చితే చూస్తారు. అంతేకానీ అయ్యో పాపం, ఆఖరి కోరిక అన్నట్లుగా మాట్లాడుతోంది అని ఎవరూ చూడరు. ఇవన్నీ పిచ్చివేషాలు. ప్రతిసారి సమంత సెంటిమెంట్ డ్రామా క్రియేట్ చేస్తోంది. అయినా హీరోయిన్ స్థాయి నుంచి కిందకు పడిపోయిన అమ్మాయి శాకుంతలం చిత్రానికి ఎలా సెట్టయిందనేది పెద్ద ప్రశ్న. ఈ సినిమాపై నాకేమాత్రం ఆసక్తి లేదు' అని చెప్పుకొచ్చాడు చిట్టిబాబు. -
చిన్న సినిమాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్న యంగ్ లేడీ ప్రొడ్యూసర్స్
-
అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్
గత కొంతకాలంగా మెగాడాటర్ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్ చేశాడు. ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. -
'ఆర్ఆర్ఆర్' టీం..పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు తీసుకొచ్చారు: నిర్మాత
‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ‘ఆస్కార్’ వంటి ప్రతిష్టాత్మక అవార్డు రావడమంటే ఇండియాకి వచ్చినట్టే. ఇందుకు ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ప్రతి తెలుగువారు గర్వించాల్సిన సమయం ఇది’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డులకంటే గొప్ప అవార్డు తీసుకొచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, సాంకేతిక నిపుణులను మనం సన్మానించుకోవాలి.. గౌరవించుకోవాలి. ఎందుకంటే ఇది తెలుగు వారందరికీ దక్కిన గౌరవం. అందుకే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌ని, అవార్డు గ్రహీతలను చాలా గొప్పగా సత్కరించాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ వంతుగా ‘ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ కార్యవర్గం ఆధ్వర్యంలో నేడు శిల్ప కళావేదికలో సన్మానం చేస్తుండటం చాలా గొప్ప విషయం. ఇందులో ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుంది’’ అన్నారు. -
70 డైలాగ్స్ రాసి ఇచ్చా.. సినిమాలు నీకేందుకయ్యా అన్నారు: పోసాని
టాలీవుడ్ విలక్షణ నటుల్లో పోసాని కృష్ణమురళిది ముందువరుసలో ఉంటారు. అభిమానుల గుండెల్లో అంతలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. కమెడియన్‌గా, నటుడిగా, దర్శకనిర్మాతగా, రచయితగా సత్తా చాటిన ఆయన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించారు. ఆయనకు రైటర్‌గా తొలి అవకాశమిచ్చింది పరుచూరి బ్రదర్స్ అని వెల్లడించారు. పోసాని మాట్లాడుతూ..' నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు. ఇప్పటివరకు నా కెరీర్లో ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. ఎవరి దగ్గరైనా చిన్న తప్పు కూడా లేదు. నేను నిర్మాతగా చేసినప్పుడు ఇండస్ట్రీలో పెట్టినంతా మంచి భోజనం ఎవరు పెట్టలే. భోజనానికి మహా అయితే రూ.5 లక్షలవుతుంది. కానీ నేను రూ.30 లక్షలు ఖర్చు పెట్టా. నా కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఫస్ట్ సత్యానంద్ దగ్గరికి వెళ్లా. నాలుగేళ్ల తర్వాత రమ్మన్నారు. ఆ తర్వాత మద్రాస్‌లోనే పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లా. మా దగ్గర ఖాళీ లేవు పోమ్మన్నారు. ఆ తర్వాత నేను గేటు దగ్గర నిలబడి ఉండగా గోపాలకృష్ణ అంబాసిడర్ కారు వచ్చింది. ఏం వోయ్ రేపు మార్నింగ్ 5.30 కి రా అని అన్నారు. అయితే 5.30కి ముందే వెళ్లా.' అని అన్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ..' వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ ఇద్దరు వచ్చారు. బాగా చదువుకున్నట్లున్నావ్ ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా అన్నారు వెంకటేశ్వరరావు. అప్పుడు బీఎన్ ప్రసాద్ నిర్మాత. వెంకటేశ్వరరావు నాకు కొన్ని డైలాగ్స్ రాయమని చెప్పారు. అది పేకాట పిచ్చోడు అనే పాత్రకు. ఆయన వచ్చేలోగా 70 డైలాగ్స్ రాశా. అవీ చూసి 50 డైలాగ్స్‌కి టిక్ పెట్టారు. అందులో దాదాపు 35 వరకు సినిమాలో వాడుకున్నారు. డైలాగ్స్ బాగా రాశావ్ అన్నారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్డీ కూడా చేశా. ఫస్ట్ నాకు సినిమాల మీద ప్రేమ లేదు. రైటర్‌గా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేదాకా నాకు నమ్మకం లేదు.'అని అన్నారు. -
హీరోయిన్‌తో డేటింగ్.. స్పందించిన నిర్మాత
సినీఇండస్ట్రీలో లవ్ రూమర్స్ కొత్తేం కాదు, ఏ ఇద్దరు కలిసి కనిపించినా వారు ప్రేమలో ఉన్నారంటూ ముడిపెట్టేస్తుంటారు. అయితే హీరోహీరోయిన్లు, దర్శకుడు హీరోయిన్ లవ్‌లో ఉన్నారంటూ తరచూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. కానీ నిర్మాత, హీరోయిన్ ప్రేమలో పడ్డారని రూమర్స్ రావడం చాలా అరుదు. అయితే కొంతకాలం క్రితం అభిషేక్ నామా, ఓ పాపులర్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడంటూ ఫిల్మీదునియాలో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ రూమర్లపై అభిషేక్ నామా స్పందించాడు. 'హీరోయిన్‌తో డేటింగ్ అనేది వుట్టి మాటే! హీరోయిన్లతో కనీసం స్నేహం కూడా లేదు. వారితో లంచ్‌కు కూడా వెళ్లలేదు. నేను ఏ హీరోయిన్‌తోనూ డేటింగ్లో లేను' అని క్లారిటీ ఇచ్చాడు. కాగా అభిషేక్ నామా, రవితేజతో కలిసి నిర్మించిన రావణాసుర ఏప్రిల్ 7న విడుదల కానుంది. మరోవైపు నందమూరి కళ్యాణ్‌రామ్‌తో డెవిల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. డెవిల్ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తానని ప్రకటించాడు అభిషేక్ నామా. -
డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..
‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను. ‘కేరాఫ్ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘టైగర్’ సినిమా నుంచి సందీప్ కిషన్, వీఐ ఆనంద్‌లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్ బ్యానర్‌ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్‌లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్ తేజ్‌తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది’’ అన్నారు. -
ఆస్కార్ స్టేజీపై మనకు అవమానం.. మరీ ఇంత దారుణమా?
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆస్కార్ అందుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు చూద్దాం.. సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే వెంటనే ఆ స్పీచ్‌ను కట్ చేస్తారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్ కార్తీకి తనకిచ్చిన గడువులోనే స్పీచ్ ముగించింది. అయితే నిర్మాత గునీత్ మోంగా మాట్లాడటం మొదలుపెట్టకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుతిరిగింది. పోనీ అందరి విషయంలోనూ అకాడమీ ఇలానే ప్రవర్తించిందా? అంటే లేదు. వీరి తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ అవార్డులు తీసుకున్న చార్లెస్ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా ఎక్కువసేపు ప్రసంగించినా అభ్యంతరం తెలపలేదు. దీనిపై అమెరికన్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు నెటిజన్లు సైతం అకాడమీ భారత్‌ను అవమానించిందంటూ ట్విటర్లో మండిపడుతున్నారు. దీనిపై నిర్మాత గునీత్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై నన్ను ప్రసంగించనివ్వలేదు. ఇది నన్ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే భారత్ నిర్మించిన ఓ షార్ట్ ఫిలింకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చాటిచెప్పాలనుకున్నా. కానీ నన్నసలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదని బాధేసింది. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది. ఇండియాకు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని పంచుకుంటున్నాను. నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) The Elephant Whisperers triumphs at the #AcademyAwards - Kartiki Gonsalves and Guneet Monga win the Oscar for Best Documentary Short Subject - the first ever for an Indian Production at the #Oscars.#Oscars95 | @guneetm pic.twitter.com/BYiciGniF7 — santhoshd (@santhoshd) March 13, 2023 -
మిథునం నిర్మాత కన్నుమూత
‘మిథునం’ వంటి మంచి చిత్రాన్ని నిర్మించిన ముయిద ఆనందరావు (57) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ఆనందరావు ఓ ప్రైవేటు కంపెనీలో చిరుద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. సంఘ సేవకుడిగానూ మంచి గుర్తింపు పొందారాయన. సాహిత్యమంటే ఆయనకు మక్కువ. పర్యావరణ హిత పద్యాలను రాసి కోటిగాడు పేరుతో ప్రచురణ చేసేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి కీలక పాత్రల్లో తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఆనందరావు నిర్మించిన చిత్రం ‘మిథునం’. 2012లో విడుదలైన ఈ సినిమా 2017లో నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆనందరావు మృతితో వావిలవలస గ్రామంలో విషాదం అలముకుంది. ఆయనకు భార్య పద్మినితో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆనందరావు మృతిపై విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. -
రాజమౌళితో మాట్లాడటానికి ప్రయత్నించా, కానీ: RRR నిర్మాత
నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో యావత్ భారతదేశం గర్విస్తోంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ పార్టీ ఇచ్చాడు రాజమౌళి. అయితే ఈ సినిమాకు కావాల్సినంత బడ్జెట్ సమకూర్చిన నిర్మాత దానయ్య మాత్రం ఏ వేడుకలోనూ పాల్గొనడం లేదు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ అంతా అమెరికా చెక్కేసినా దానయ్య మాత్రం ఇక్కడే ఉండిపోయాడు. ఏ అవార్డు ఫంక్షన్లోనూ ఆయన కనిపించలేదు. తాజాగా తన సినిమాకు ఆస్కార్ రావడంపై తొలిసారి స్పందించాడు. 'తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి ఓ పాటకు ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయం. 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా చేద్దామన్నాను. అప్పటినుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. మర్యాద రామన్న చేయమని ఆఫర్ ఇచ్చారు. కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలనుంటున్నానని చెప్పాను. తన రెండు ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానన్నారు. సరే అన్నాను. అలా ఆర్ఆర్ఆర్ నా చేతికి వచ్చింది. ఇద్దరు స్టార్లతో ఇంత పెద్ద సినిమా తీస్తారని ఊహించలేదు. కానీ కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అయింది. నాటు నాటు ఒక్క పాటనే 30 రోజులు రిహార్సల్ చేసి ఉక్రెయిన్‌లో 17 రోజులు షూట్ చేశాం. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ఆస్కార్ వచ్చింది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు క్రెడిట్ అంతా రాజమౌళికే దక్కుతుంది. ఆయన కష్టానికి ప్రతిఫలమే ఈ పురస్కారం. ఆస్కార్ అందుకున్నాక రాజమౌళి వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వాళ్లు ఫంక్షన్లో బిజీగా ఉన్నట్లున్నారు. కాబట్టి మాట్లాడలేకపోయాను' అన్నాడు దానయ్య. -
ఫిలిం మేకింగ్‌లోకి ‘మేడమ్స్’.. ప్రొడ్యుసర్స్‌గా రాణిస్తున్న నారీమణులు
ఒక సినిమాను నిర్మించాలంటే చాలా కష్టం. కేవలం డబ్బు పెడితే సరిపోదు..ఎంతో మందిని మేనేజ్ చేయాలి...ఎన్నో టెన్షన్స్ పడాలి. అందుకే సినిమా నిర్మాణ విషయంలో మహిళలు దూరంగా ఉండేవారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ప్రతి విభాగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో లేడీ ప్రొడ్యూసర్ల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కంటెంట్ ఉన్న సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ...నిర్మాతలుగా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) పురస్కరించుకొని ఫిలిం మేకింగ్(నిర్మాణం)లో రాణిస్తున్న ‘మేడమ్స్’ గురించి తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు నిర్మించాడు. అశ్వనీదత్ కుమార్తెలు స్వప్నదత్...ప్రియాంక దత్. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో నెంబర్ వన్ లేడీ ప్రొడ్యూసర్స్ అనే చెప్పాలి. స్వప్న సినిమాస్ బ్యానర్ స్థాపించి భారీ చిత్రాలను నిర్మించటమే కాదు..బిగ్గెస్ట్ హిట్స్ కూడా అందుకున్నారు. డైరెక్టర్ నాగ్అశ్విన్ తో మహానటి నిర్మించిన ఈ లేడీ ప్రొడ్యూసర్స్...సేమ్ డైరెక్టర్ తో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 500 కోట్లు బడ్జెట్ కేటాయించారు. సమంత నటిస్తున్న మైధిలాజికల్ మూవీ శాకుంతలం...ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. తన తండ్రి గుణశేఖర్ సినిమాలకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది. రుద్రమదేవి సినిమాకి కూడా నీలిమ గుణ ప్రొడ్యూసర్ గా చేసింది. నిన్నటి వరకు చిరంజీవి సినిమాలకు , క్యాస్టూమ్స్ డిజైనర్ గా ఉన్న మెగాస్టార్ డాటర్ సుస్మిత కొణిదెల కూడా ప్రొడ్యూసర్ గా మారింది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షూట్ అవుట్ ఎట్ ఆలేర్ లాంటి వెబ్ సిరీస్ తో పాటు ..సేనాపతి, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు నిర్మించారు. సీనియర్ నటుడు కృష్ణంరాజు డాటర్..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సిస్టర్ ప్రసీద కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టింది. ప్రసీద..ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మూవీకి కో-ప్రొడ్యూసర్ గా వర్క్ చేసింది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురు, దివ్య దీప్తి నిర్మాతగా మారి... హీరో కిరణ్ అబ్బవరంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని మూవీ నిర్మించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాణ రంగంపై దృష్టి సారిస్తున్నారు. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘దిల్’ రాజు డిజిటల్ కంటెంట్‌ను నిర్మిస్తున్నారు. మరో నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ కూడా ప్రొడ్యూసర్స్ గా సినిమాలు నిర్మిస్తున్నారు. కేవలం సినిమాల మీద ఇంట్రెస్ట్ తో డైరెక్టర్ వెంకటేష్ మహా ను నమ్మి...ప్రొడ్యూసర్ గామారింది పరుచూరి విజయ ప్రవీణ. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా మారిన ఈమె వరుసగా సినిమాలను నిర్మిస్తోంది. ఏడిద నాగేశ్వరరావు వారసురాలిగా ఆయన మనవరాలు ఏడిద శ్రీజ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం ద్వారా నిర్మాతగా తొలి అడుగు వేశారు.. వీళ్లే కాదు..కొంతమంది హీరోయిన్స్ కూడా ప్రొడ్యూసర్స్ గా...కో ప్రొడ్యూసర్ గా మారుతున్నారు. హీరోయిన్ చార్మి నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా సెటిలైపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. హీరోయిన్ అవికా గోర్ పాప్ కార్న్ సినిమాని తనే సొంతంగా నిర్మించింది. -
ఇండస్ట్రీలో విషాదం.. ఆర్జీవీ మేనమామ మృతి
ప్రముఖ నిర్మాత మధు మంతెన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మధు మంతెన తండ్రి మురళీ రాజు అనారోగ్యంతో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజుల క్రితం పక్షవాతం రావడంతో ఆస్పత్రికి తరలించారు. కాగా.. మధు మంతెన బాలీవుడ్లో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. కాగా.. మురళి రాజు.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు మేనమామ. ఆయన మృతిపట్ల నిర్మాత అల్లు అరవింద్, నటులు అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, బన్నీ వాసు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మురళి రాజు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన నిర్మించిన వాటిలో గజినీ, ఉడ్తా పంజాబ్, సూపర్ 30, 83, రమన్ రాఘవ్ వంటి చిత్రాలున్నాయి. ఆర్జీవీ సహకారంతో మధు మంతెన ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన అనురాగ్ కశ్యప్, వికాస్ బెహల్, విక్రమాదిత్య మోత్వానీతో కలిసి ఫాంటమ్ ఫిల్మ్స్ స్థాపించారు. మురళి రాజు కూడా గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు మధు మంతెన ప్రస్తుతం అల్లు అరవింద్‌తో కలిసి మూడు భాగాలుగా 3డిలో రామాయణం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించిన మాటలు, స్క్రీన్ ప్లే పూర్తి చేశారు. -
'పాతాళభైరవి, మాయాబజార్ లాంటి ఆణిముత్యాలు అందించిన ఘనత ఆయనదే'
భారతీయ చలన చిత్రసీమలో బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి)ది చెరిగిపోని చరిత్ర. ‘పాతాళభైరవి, మిస్సమ్మ, మాయాబజార్’ వంటి అద్భుత చిత్రాలను నిర్మించిన ఘనత నాగిరెడ్డిది. కళాసేవే కాదు ఆయన ఎందరికో విద్య, వైద్య సేవలు ఉచితంగా అందించారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, వ్యాపారవేత్తగా రాణించి, ప్రముఖ నిర్మాతగా, స్టూడియో ఆధిపతిగా అసాధారణ సేవలు అందించిన మానవతావాది. ‘చందమామ’ పత్రికను అసంఖ్యాక భాషల్లో ముద్రించి అటు బాలలకు ఇటు పెద్దలకు కూడా నీతి బోధలు చేసిన ముందు చూపుగల మహా మనిషి. వినోద విజ్ఞానాల కృషీవలుడు, విజయాదిత్యుడు,చందమామ పత్రిక, అద్భుత దృశ్యకావ్యం, మాయాబజార్ల సృష్టికర్త బి.నాగిరెడ్డి వర్థంతి(ఫిబ్రవరి 25) సందర్భంగా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ► నాగిరెడ్డి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, సింహాద్రిపురం మండలం, ఎద్దులయ్యగారి కొత్తపల్లె (వై.కొత్తపల్లె) గ్రామంలో 1912, డిసెంబర్ 2న రైతు కుటుంబంలో బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, ఎరుకలమ్మ అనే దంపతులకు జన్మించారు. నాగిరెడ్డికి ప్రముఖ దర్శకుడు, పద్మభూషణ్ బీఎన్ రెడ్డి స్వయానా అన్న. ► ఎద్దులయ్యగారి కొత్తపల్లె గ్రామంలోని వీధిబడిలో రామాయణ మహాభారతాలు, భాగవతం లాంటి పురాణగ్రంథాలను మాత్రమే బోధించేవారు. ధర్మబద్ధమైన జీవితం ఎలా గడపాలో ఉపాధ్యాయుడు పిల్లలకు రోజూ చెప్పేవాడు. ప్రాచీన గ్రంథాల్లోని సూక్తులను, సుభాషితాలను పిల్లలచేత కంఠస్థం చేయించేవాడు. ఆ ఉపాధ్యాయుడి వద్ద చదువుకున్న నాగిరెడ్డి పన్నేండేళ్లు వచ్చేసరికే పురాణేతిహాసాలను ఔపోసన పట్టేశారు. అవన్నీ ఆయన ఆలోచనావిధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ►నిజంగానే తెలుగువారికి తమ సినిమాలతో పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం అందించిన ఘనులు నాగిరెడ్డి- చక్రపాణి. వారిద్దరు వ్యక్తులైనా ఏకప్రాణంగా సాగారు. వారి సినిమాలు కూడా తెలుగువారితో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'షావుకారు' నుంచి చివరి చిత్రం 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్' దాకా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారు నాగిరెడ్డి- చక్రపాణి. చక్కన్నది ఆలోచనయితే, నాగిరెడ్డిది ఆచరణగా ఉండేది.. అందుకే విజయావారి చిత్రాల్లో వారిద్దరి అభిరుచి తొణికిసలాడేది. ► 1947లో భారతీయ పత్రికా ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన పిల్లల మాసపత్రిక చందమామ ప్రారంభించారు. చందమామను చదవని తెలుగువారుండరు. తెలుగులోనే కాకుండా భారతదేశంలో మరో 12 భాషలకు చందమామ విస్తరించింది. నాగిరెడ్డి గారిని చందమామ రెడ్డి అని పిలిచేవారు. మహిళల కోసం ‘వనిత’ మాసపత్రికను, సినిమాల కోసం ‘విజయచిత్ర’ పత్రికను నడిపారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో: 1949-50 ప్రాంతంలో మద్రాసులోని వాహినీ స్డూడియోను కొని విజయా-వాహినీ స్టూడియోగా పేరు మార్చి అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియో 1970 ప్రాంతంలో స్టూడియోను మూసివేసి విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్టు ఏర్పాటు చేసి తద్వారా విజయా ఆసుపత్రి, విజయా హెల్త్‌కేర్ సెంటర్, విజయా హెల్త్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. 1950లో విజయా ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అర్జునుడి రథం మీద రెపరెపలాడే పతాకమే విజయా సంస్థ చిహ్నం. నాగిరెడ్డి పెద్దకూతురి పేరు జయలక్ష్మి. తనంటే ఇంట్లో అందరికీ ప్రాణం.తను పుట్టాకే ఇంట్లో బావిలో తియ్యటి నీళ్లు పడ్డాయి. అప్పటినుంచీ జయ అంటే ఓ సెంటిమెంటు. ఆమె పేరు కలిసొచ్చేలా ‘విజయా ప్రొడక్షన్స్’ అని పెట్టారు. ఈ సంస్థ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 50 సినిమాలు నిర్మించారు. వీరి తొలిచిత్రం ‘షావుకారు’ తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాల్లాంటి చలనచిత్రాలను నిర్మించారు. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి బాక్సాఫీస్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఎన్టీఆర్‌ను, ఎస్వీ రంగారావును, సూర్యకాంతాన్ని, సావిత్రిని, ఓ పద్మనాభాన్ని తెలుగు సినీ రంగానికి అందించింది నాగిరెడ్డి. 1951లో నిర్మించిన పాతాళభైరవి సినిమా జానపద చిత్రాలకు ఓ నిఘంటువు. ‘సాహసం చేయరా డింభకా’ అంటూ నటనలో, నడకలో, వాచకంలో ఎస్వీ రంగారావు కొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసం గురూ’ అంటూ డింగరీ పాత్రలో పద్మనాభం కనిపిస్తాడు. తెలుగుజాతి మరచిపోలేని ‘మాయాబజార్’ 1957లో నిర్మించబడిన మాయాబజార్ సినిమా తెలుగుజాతి మరచిపోలేని మధురమైన అద్భుత దృశ్యకావ్యం. సినిమా పరిశ్రమకు పెద్ద బాలశిక్ష. మాయాబజార్' స్థాయికి - సాంకేతిక నైపుణ్యంలో గానీ, నటనలోగానీ - ఏదీ సరితూగలేదన్నది జగద్విదితం. అందుకు ప్రధాన కారకులు - దర్శకులు కేవీ రెడ్డి, రచయిత పింగళి నాగేంద్రరావు. 'మాయాబజార్' విడుదలై ఇప్పటికీ 60 సంవత్సరాలు దాటుతున్నా అంతే ఆదరణ పొందుతున్న చిత్రం ఇదే. పలు పదవులు చేపట్టిన నాగిరెడ్డి 1980 నుంచి 1983 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉన్నారు. వీరి హయాంలోనే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మించబడింది. ఆలిండియా ఫిల్మ్ సమ్మేళన్‌కు రెండు సార్లు అధ్యక్షులు. సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు నాలుగు సార్లు అధ్యక్షులు. సాధించిన అవార్డులు: 1987లో నాగిరెడ్డి ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. హిందీ చలనచిత్ర సీమలో, అక్కాచెల్లెళ్లు అయిన లతా మంగేష్కర్, ఆశాబౌంస్లే ఈ అవార్డును పొందగా.. తెలుగు సినిమా రంగంలో అన్నదమ్ములైన బీఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి ఈ అవార్డును పొందడం గమనార్హం. 1957లో మాయాబజార్, 1962లో గుండమ్మ కథకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ప్రదానం చేసింది. శ్రీకృష్ణదేవరాయ, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. తమిళనాడులో ‘తలైమామణి’ బిరుదుతో సత్కరించారు. 1965లో కన్నడలో తీసిన ‘మదువెమదినోడు’ సినిమాకు జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. పలు భాషల్లో చిత్రాలు: విజయా సంస్థ తమిళంలో పాతాళభైరవి, కళ్యాణం పన్ని పార్ (పెళ్లి చేసి చూడు), చంద్రహారం, మిస్సియమ్మ (మిస్సమ్మ), మాయాబజార్, గుండమ్మ కథ, ఎంగవీట్టు పిళ్లై (రాముడు-భీముడు), హిందీలో పాతాళభైరవి, మిస్ మేరీ (మిస్సమ్మ), రాం ఔర్ శ్యాం (రాముడు-భీముడు), జూలీ; కన్నడ, సింహళీ భాషల్లో కూడా కొన్ని సినిమాలు తీశారు. నాగిరెడ్డి తమిళంలో గుండమ్మ కథ, ఎంగ వీట్టు పిళ్లై సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎంజీఆర్‌తో ప్రత్యేక అనుబంధం: ఎంజీరామచంద్రన్తో నాగిరెడ్డికి ఉన్న ప్రత్యేక అనుబంధం గొప్పది. ఒకసారి నాగిరెడ్డికి జబ్బుచేసి ఆసుపత్రిలో వుంటే ఎంజీఆర్ (అప్పుడు ముఖ్యమంత్రిగా వున్నారు) స్వయంగా వచ్చి పరామర్శించడమే కాకుండా ఫారిన్ మందులు తెప్పిస్తానని చెప్పారు. ఎంజీఆర్ సూచన మేరకే నాగిరెడ్డి విజయా ఆసుపత్రి నిర్మించి దాని పరిపాలనా బాధ్యతల కోసం ఒక ట్రస్టు స్థాపించి దానికి అప్పగించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షునిగా నాగిరెడ్డి నాలుగు సార్లు బాధ్యతలను నిర్వహించారు. ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయి, రాజాజీ, కామరాజ నాడార్, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రజానాయకులతో సన్నిహిత సంబంధాలను నెరిపారు. నాగిరెడ్డి అనారోగ్యంతో తన 92వ ఏట 25 ఫిబ్రవరి 2004న మద్రాసులో మరణించారు.