![Kollywood Producer VA Durai Passed Away - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/10/3/va-durai.jpg.webp?itok=Re366QnP)
కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత వీఏ దురై(59) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం అర్థరాత్రి చెన్నైలోని వలసరవాక్‌లో గల తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన పితామగన్ చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం శివపుత్రుడు పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. హీరో విక్రమ్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్నారు.
రజనీకాంత్,విజయకాంత్, విక్రమ్, సూర్య, సత్యరాజ్ వంటివారితో సినిమాలు నిర్మించారు. గజేంద్ర చిత్రం తర్వాత దురై సినిమాలకు దూరమయ్యాడు. ఆమధ్య తనను ఆర్థికంగా ఆదుకోవాలని ఓ వీడియో విడుదల చేయడంతో.. హీరో సూర్య సహాయం చేశాడు. దురైకి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, రెండో భార్యకు ఓ కూతురు ఉంది. దురై మరణం పట్ల కోలీవుడ్ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment