సినీ నిర్మాత మురళీధరన్(65)గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మీ మూవీ మేకర్స్ పేరుతో ఈయన 27 చిత్రాలను నిర్మించారు. అందులో కమల్‌హాసన్‌తో అన్బేశివం,విజయకాంత్‌తో ఉలవతురై, కార్తీక్ (గోకులతిల్ సీతై), అజిత్ (ఉన్నై తేడి), విజయ్ (ప్రియముదన్), ధనుష్ (పుదుపేట్టై), శింబు (సిలంబాట్టం) వంటి సినిమా సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. జయం రవి, త్రిష మరియు అంజలి నటించిన 'సకలకళ వల్లవన్' ఎల్‌ఎమ్‌ఎమ్ నిర్మించిన చివరి చిత్రం. ఈ సినిమా 2015 సంవత్సరంలో విడుదలైంది.
మురళీధరన్ ఇంతకు ముందు తమిళ సినీ నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా సేవలందించారు. చెన్నైలో నివసిస్తున్న ఈయన గురువారం సతీమణితో కలిసి కుంభకోణంలోని నాచ్ఛియర్ దేవాలయానికి దైవదర్శనానికి వెళ్లారు. అక్కడ ఆలయం మెట్లు ఎక్కుతుండగా అనూహ్యంగా మెట్లపైనే చతికిలపడిపోయారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మురళీధరన్ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు తేల్చారు.
ఆయనకు భార్య ఉత్తర, కొడుకులు గోకుల్, శ్రీవత్సవన్ ఉన్నారు. మురళీధరన్ మృతికి నిర్మాత మండలితో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ట్వీట్ చేస్తూ.. అనేక హిట్‌లను అందించిన ర్మాత కె ఇక లేరు. ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఆయనకు నివాళులు అంటూ తమిళంలో పోస్ట్ చేశారు.
பல வெற்றிப்படங்களைத் தயாரித்த லட்சுமி மூவி மேக்கர்ஸ் நிறுவனத்தைச் சேர்ந்த தயாரிப்பாளர் கே. முரளிதரன் மறைந்துவிட்டார். அன்பே சிவம் நாட்களை நினைத்துக்கொள்கிறேன். அஞ்சலி.
— Kamal Haasan (@ikamalhaasan) December 1, 2022
Comments
Please login to add a commentAdd a comment