
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడ్ అంటూ విషెస్ తెలిపారు.
(ఇది చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!)
కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్‌లో పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు.
Happy Birthday Dad 🖤 pic.twitter.com/nrlLF4yRHM
— Allu Arjun (@alluarjun) January 10, 2024