bunny
-
శ్రీతేజు విదేశాల్లో చికిత్స..! బాలుడ్ని పరామర్శించిన బన్నీ వాసు
-
పుష్ప 2 ఫేమస్ డైలాగ్.. ప్రొ కబడ్డీలోనూ వాడేశారు!
పుష్ప-2 ఆ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం రావాల్సిందే. అంతలా సినీప్రియులను ఊపేస్తోంది తాజాగా రిలీజైన ట్రైలర్. ఆ డైలాగ్స్, ఆ మేనరిజం బన్నీ ఫ్యాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఊపేస్తున్నాయి. నవంబర్ 17న పాట్నా వేదికగా భారీస్థాయిలో నిర్వహించిన ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు. దేశంలో ఇంతవరకు ఏ భారతీయ సినిమాకు రాని రికార్డులను పుష్ప-2 సాధించింది.అయితే పుష్పలోని ఆ డైలాగ్ చెబితే ఫ్యాన్స్‌కే కాదు.. ఎవరికైనా పూనకాలే. అంతలా ఫేమస్ అయింది. పుష్ప-2 ట్రైలర్లో 'పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అనే బన్నీ డైలాగ్ ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఇలాంటి ఫేమస్ డైలాగ్‌ను ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ వాడేశారు.ఈ సీజన్లో విజయాలతో జోరుమీదున్న తెలుగు టైటాన్ టీమ్ ప్రత్యేకంగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ డైలాగ్‌తో ఉన్న టీమ్ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. 'టైటాన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్' అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌ను పుష్ప టీమ్ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరలవుతోంది. టైటన్స్ అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ 🔥#ProKabaddi #PKL11 #LetsKabaddi #ProKabaddiOnStar #TeluguTitans pic.twitter.com/EZXQMMkOKD— ProKabaddi (@ProKabaddi) November 18, 2024 -
'రికార్డుల్లో పుష్ప పేరు ఉండడం కాదు.. పుష్ప పేరు మీదే రికార్డులు ఉంటాయి'
ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. కేవలం వినిపించడమే కాదు..డైలాగ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఆదివారం పుష్ప-2 ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. బన్నీ ఫ్యాన్స్ సందడి అయితే అంతా ఇంతా కాదు. ఏ నగరంలో చూసిన టపాసులు పేలుస్తూ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్‌లో ఎప్పుడు లేని రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది.అయితే ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొడుతున్న పుష్ప రాజ్.. మరో క్రేజీ రికార్డ్ నమోదు చేశాడు. బిహార్‌లో పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా 2.6 లక్షల మంది లైవ్‌లో వీక్షించారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ఈ రికార్డ్‌ను సాధించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను పుష్ప టీమ్ ట్విటర్లో పంచుకుంది. దీంతో పుష్ప-2 రికార్డులు చూస్తుంటే ఏ ఇండియన్ సినిమాకు ఇప్పట్లో అందేలా కనిపించడం లేదు. కాగా.. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2021 డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్న పుష్ప-2 ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే. His arrival means one thing - the existing records tumble 💥💥#Pushpa2TheRuleTrailer launch event registers the highest number of live viewers for an event with 2.6 LAKH concurrent viewers❤🔥❤🔥#RecordBreakingPushpa2TRAILER 🌋🌋▶️ https://t.co/FKXAngle5q… pic.twitter.com/vuCpMypShD— Pushpa (@PushpaMovie) November 18, 2024 -
'ఆ విషయంలో నన్ను క్షమించండి'.. ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ రిక్వెస్ట్
ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌గా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా బిహార్‌లోని పాట్నాలో జరిగిన భారీ ఈవెంట్లో పుష్ప-2 ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు హాజరైన అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వేదికపై మాట్లాడారు.బన్నీ మాట్లాడుతూ..' నమస్తే.. బీహార్ గడ్డకు, ప్రజలందరికీ నా శతకోటి ప్రణామాలు.. బీహార్‌కు మొదటిసారి వచ్చా. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. పుష్ప ఎప్పుడు తలవంచలేదు.. కానీ మొదటిసారి మీ ప్రేమకు తలవంచుతున్నా. మీరంతా ఎలా ఉన్నారు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్ కాదు వైల్డ్ ఫైర్. నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. మీ ప్రేమే ఈ సినిమా ఇంత గొప్పగా తీయడానికి, ఇంత గొప్పగా అందరికీ నచ్చడానికి కారణం. పుష్ప టీమ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈవెంట్‌కు సహకరించిన పోలీసులు, అభిమానులకు థ్యాంక్స్. డిసెంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్‌గా రాబోతోంది. అందరికీ నచ్చుతుంది. థ్యాంక్యూ బీహార్. థ్యాంక్యూ పాట్నా' అంటూ ఐకాన్ స్టార్ మాట్లాడారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా... ఫ్లవర్ కాదు..’ అంటూ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్.హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. పుష్ప శ్రీవల్లి ఈ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నా. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుందిన. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నా' అని అన్నారు శ్రీవల్లి.కాగా.. ఈ ఈవెంట్లో భారీ ఎత్తున ఐకాన్ స్టార్స్ ఫ్యాన్స్ పాల్గొన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ రిలీజైన మాస్ ట్రైలర్ ఏకంగా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప-2 థియేటర్లలో విడుదల కానుంది. -
పాట్నాలో ఐకాన్ స్టార్.. ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఈ మూవీ ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేయనున్నారు. పాట్నాలో ఏర్పాటు భారీ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్లో పాల్గొనేందుకు ఐకాన్ స్టార్ ఇప్పటికే పాట్నా చేరుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నగరంలో గాంధీ మైదానంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీస్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రబృంద సభ్యులు పాట్నా చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల మూడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల చేయనున్నారు.Pushpa Raj aka @alluarjun is arriving in style to rule Patna! 💥Get ready for the MASSIVE #Pushpa2TheRuleTrailer Launch Event at Gandhi Maidan! ❤️🔥Watch Live Here 👇 https://t.co/JTQseKpgjQEvent by @MediaYouwe#Pushpa2TheRule #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/HPG6eegYUJ— YouWe Media (@MediaYouwe) November 17, 2024 -
పాత ఇంగ్లీష్ సినిమాల్లోని హీరోయిన్లా సమంత (ఫోటోలు)
-
బన్నీకి అభిమాని రిక్వెస్ట్.. వెంటనే రిప్లై ఇచ్చేశాడు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. పుష్పకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప-2 కౌంట్‌డౌన్ స్టార్ అయిపోయింది. మరో కొద్ది రోజుల్లో థియేటర్లలో పుష్పరాజ్ సందడి చేయనున్నాడు. డిసెంబర్ 6న థియేటర్లతో పాటు పలు రికార్డులు బద్దలు కానున్నాయి. ప్రస్తుతం పుష్ప టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఈ సంగతి పక్కన పెడితే బన్నీకి ఉన్న ఫ్యాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియానే మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇటీవల ఓ అభిమాని ఏకంగా యూపీ నుంచి సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. బన్నీని కలిసి ఆనందం వ్యక్తం చేశారు.(ఇది చదవండి: నేడు మీడియా ముందుకు 'పుష్ప2' యూనిట్)తాజాగా ఓ అభిమాని తన బర్త్ డే కావడంతో ఎక్స్ వేదికగా ఓ రిక్వెస్ట్ పెట్టాడు. మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని.. ఇవాళ నా పుట్టినరోజు.. మీ నుంచి విషెస్ వస్తే నాకదే సంతోషం అంటూ అల్లు అర్జున్ను ట్యాగ్ చేశాడు. ఇది చూసిన బన్నీ వెంటనే అతనికి రిప్లై ఇచ్చాడు. హ్యాపీ బర్త్ డే అంటూ తన అభిమానికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇది చూసిన అతను లవ్ యూ అన్న.. థ్యాంక్యూ సో మంచ్ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఏదేమైనా పాన్ ఇండియా హీరో ఫ్యాన్ ట్వీట్‌కు స్పందించడం అంటే బన్నీ సింప్లిసిటీ ఏంటో అర్థమవుతోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. Happy Birthday 🖤— Allu Arjun (@alluarjun) October 24, 2024 -
ప్రభాస్, బన్నీని ఫాలో అవుతున్న ఎన్టీఆర్
-
స్నేహం కోసం ఎందాకైనా వెళ్తాడు మా బన్నీ...
-
అల్లు అర్జున్, సుకుమార్ గొడవపై బన్నీ వాసు క్లారిటీ
-
వెకేషన్లో ఐకాన్ స్టార్.. బన్నీ- సుకుమార్ మధ్య అసలేం జరుగుతోంది?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఆవైటేడ్ చిత్రం పుష్ప-2 ది రూల్. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కావాల్సి ఉండగా.. మరోసారి వాయిదా పడింది. అయితే కొంత షూటింగ్ పెండింగ్‌లో ఉండడ, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణాంగానే పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 6న విడుదల చేస్తామని కొత్త తేదీని కూడా ప్రకటించారు.ఇదిలా ఉంటే టాలీవుడ్లో తాజాగా ఊహించని టాక్ నడుస్తోంది. పుష్ప-2 మిగిలిన షూటింగ్ షెడ్యూల్ విషయంలో బన్నీ, సుకుమార్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు చర్చ జరుగుతోంది. తాజాగా బన్నీ విదేశీ టూర్‌కు వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అంతేకాకుండా బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నట్లుగా విమానంలో వెళ్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పంచుకున్నారు. కాగా..2020 నుంచి ఇప్పటివరకు తన గడ్డాన్ని అలాగే మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. దీంతో పుష్ప-2 మరోసారి వాయిదా పడనుందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ సైతం యూఎస్ వెకేషన్ నుంచి ఇంటికి తిరిగొచ్చారు. తాజాగా అల్లు అర్జున్ మరోసారి హాలీడే ట్రిప్‌కు వెళ్లడంతో మళ్లీ వాయిదా పడుతుందేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలపై బన్నీ టీం స్పందించింది. ఎలాంటి ఆందోళన వద్దని ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చింది. చిత్ర బృందం నుంచి అప్డేట్లు రాకపోవడం.. సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు అంటూ వస్తున్న రూమర్స్‌పై వివరణ ఇచ్చింది.క్లారిటీ ఇచ్చిన టీమ్..పుష్ప-2 విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని అల్లు అర్జున్ టీమ్ వెల్లడించింది. ఆ వీడియో ఇటీవలే తీశారని.. గడ్డం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఆయనకు ఇప్పటికే పొడవాటి జుట్టు, గడ్డం ఉన్నాయని తెలిపారు. గడ్డాన్ని కొద్దిగా మాత్రమే ట్రిమ్ చేసుకున్నారని వివరణ ఇచ్చారు. డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. మరోసారి వాయిదా వేసే ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. కాగా.. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. Beard Ravataniki 1 Month, Balance Shoot 1 Month+ Post Production, Promotions....😔 Haha Malli Postpone Haa 💔😭 @alluarjun#Pushpa2TheRule @PushpaMoviepic.twitter.com/n3ubZDrDxb— CD ™ (@CoolDude__18) July 16, 2024Ee beard tho manage cheyalera??? https://t.co/jekutiqf1C pic.twitter.com/30bkzEqnL4— Tony (@tonygaaaadu) July 16, 2024 -
అల్లు అర్జున్ పుష్ప-2.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ -1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతే కాకుండా యాగంటి క్షేత్రంలోనూ రష్మిక మందన్నాపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్తో వచ్చారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే కావడంతో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 టీజర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని పుష్ప స్టైల్లో దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా బన్నీ నిలిచారు. #Pushpa2TheRule Teaser out on April 8th, 2024!!! pic.twitter.com/ivTN2CJZBh — Allu Arjun (@alluarjun) April 2, 2024 Let the #PushpaMassJaathara begin 💥 𝗧𝗛𝗘 𝗠𝗢𝗦𝗧 𝗔𝗪𝗔𝗜𝗧𝗘𝗗 #Pushpa2TheRuleTeaser out on April 8th ❤️🔥❤️🔥 He is coming with double the fire 🔥🔥#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG 2024. Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/gCPRAxqoPh — Pushpa (@PushpaMovie) April 2, 2024 -
‘బన్నీ’ సినిమా హీరోయిన్ ఇలా మారిపోయిదేంటి?
-
తండ్రికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ పేరు అందరికీ గుర్తుకొస్తుంది. అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. తాజాగా ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే డాడ్ అంటూ విషెస్ తెలిపారు. (ఇది చదవండి: అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!) కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్- బన్నీ కాంబినేషన్లో పుష్ప పార్ట్-1 సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప-2 థియేటర్లలో సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. Happy Birthday Dad 🖤 pic.twitter.com/nrlLF4yRHM — Allu Arjun (@alluarjun) January 10, 2024 -
యానిమల్తో అన్ని హద్దులను చెరిపేశారు: బన్నీ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించారు. అభిమానుల భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈ చిత్ర దర్శకుడిని ఆకాశానికెత్తేశారు. ప్రత్యేకంగా ఆర్జీవీ రివ్యూ సైతం రిలీజ్ చేశారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. యంగ్ హీరోయిన్ మృతి!) అయితే తాజాగా ఐకాన్ స్టార్ బన్నీ సైతం ఈ చిత్రంపై మనసు పారేసుకున్నారు. ఈ చిత్రం మైండ్ బ్లోయింగ్, సినిమా బ్రిలియెన్స్ అద్భుతమన్నారు. రణ్‌బీర్ కపూర్ భారతీయ సినిమాను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారని.. స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. రష్మిక నటన బ్రిలియంట్ అని.. అత్యుత్తమ నటన కనబరిచిందని శ్రీవల్లిని పొగిడారు. బాబీ డియోల్, అనిల్ కపూర్ అద్భుతంగా నటించారన్నారు. మరో నటి త్రిప్రి డిమ్రీ నటనతో ఎందరో హృదయాలను కొల్లగొట్టిందని ప్రశంసించారు. యానిమల్ చిత్రబృందానికి అభినందనలు ట్వీట్ చేశారు. సందీప్ గురించి రాస్తూ.. 'దర్శకుడు సందీప్ మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తోంది!' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా యానిమల్ కచ్చితంగా ఇండియన్ సినిమా క్లాసిక్ మూవీస్ లిస్ట్‌లో చేరుతుందని పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఆయన లేకుండా నా కెరీర్ ఊహించుకోలేను.. సిమ్రాన్ భావోద్వేగం) #Animal . Just mind blowing. Blown away by the cinematic brilliance. Congratulations! #RanbirKapoor ji just took Indian cinema performances to a whole new level. Very Inspiring . I am truly in loss of words to explain the magic you’ve created . My deep Respects to the highest… — Allu Arjun (@alluarjun) December 8, 2023 -
Allu Arjun-Sneha Reddy: బన్నీ-స్నేహాల జోడీ ఎంత బావుందో.. స్టైలిష్ కపుల్ (ఫోటోలు)
-
నాకు అవార్డు రావడానికి కారణం ఆయనే: బన్నీ ట్వీట్ వైరల్
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనకు జాతీయ అవార్డు రావడం పట్ల ట్వీట్ చేశారు. నా ఈ విజయానికి కారణం ఆయనేనంటూ పోస్ట్ చేశారు. బన్నీ తన ట్వీట్లో రాస్తూ..'జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి కారణం ఆయనే.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy — Allu Arjun (@alluarjun) October 17, 2023 -
ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన పుష్ప బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్ అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న పుష్ప-2 ది రూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాతో శ్రీవల్లిగా టాలీవుడ్ అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకుంది భామ రష్మిక. ఈ షెడ్యూల్లో బన్నీ, రష్మికపైనే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: పదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. కమ్ బ్యాక్ ఇస్తాడా? ) ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ నుంచి ఓ ఫోటో లీక్ కాగా.. అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోను హీరోయిన్ రష్మిక తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు పుష్ప రేంజ్ అంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సైతం ట్వీట్ చేసింది. పుష్ప సెట్ నుంచి శ్రీవల్లి లీక్ చేసిన ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. గతంలో బన్నీ సైతం తన ఇంటివద్దనుంచి షూటింగ్ స్పాట్‌కు వెళ్తున్న వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటో చూస్తే అచ్చం ఇంద్రభవనం తలపించేలా కనిపిస్తోంది. అంతే కాదు పుష్ప-2లోనూ ఇలాంటి ఇంట్లోనే బన్నీ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. (ఇది చదవండి: విక్కీ నువ్వు చాలా లక్కీ.. ఆ ఒక్క సినిమానే రూ.340 కోట్లు!) Our #Srivalli @iamRashmika shares her excitement with a pic from the lavish sets of #Pushpa2TheRule ❤️ Icon Star @alluarjun @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @TSeries pic.twitter.com/D4YYN67QDj — Mythri Movie Makers (@MythriOfficial) September 8, 2023 -
చిరంజీవి మాత్రమే కాదు బన్నీ కూడా లీక్స్ ఇస్తున్నాడు
-
ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇప్పటికే పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న పుష్ప-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ రిలీజవ్వగా భారీస్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అయితే తాజాగా బేబీ మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన బన్నీ క్రేజీ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాలోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. బేబీ సక్సెస్ మీట్లో డైలాగ్ చెప్పి బన్నీ ఫ్యాన్స్‌లో ఊత్సాహం నింపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ ఈవెంట్లో మాట్లాడుతూ.. ' సినిమా పేరు పుష్ప: ది రూల్. ఒకటే ముక్క ఉంటది. ఈ డైలాగ్ ఇక్కడ చెబుతానని నేను అనుకోలేదు. కానీ చెప్తున్నా. 'ఇడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండాది. పుష్ప గాడి రూల్.' అంటూ వేదికపై నవ్వులు పూయించాడు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు బన్నీ ముఖ్య అతిథిగా హాజరై బేబీ మూవీ టీంను అభినందించారు. కాగా.. పుష్ప-2లో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించనుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. (ఇది చదవండి: 'పుష్ప-2 మరో రేంజ్లో ఉండనుంది'.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన నటుడు!) Icon StAAr #AlluArjun LEAKS #Pushpa 2 dialogue on the stage. | #Pushpa2 | #PushpaTheRule | pic.twitter.com/QXbEaSnR7S — Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2023 -
బన్నీ హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'బన్నీ'. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఫ్యాన్స్ ఆయనను బన్నీ అని పిలవడం మొదలెట్టారు. దీంతో అభిమానుల్లో బన్నీగా ముద్ర పడిపోయారు. అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దిల్లీ భామ గౌరి ముంజల్ నటించింది. ఆ సినిమాతోనే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దిల్లీలో పుట్టి పెరిగిన ఈ భామ.. సినిమాలపై ఆసక్తితో ముంబయికి వచ్చి ఇండస్ట్రీలో ప్రవేశించింది. అయితే బన్నీ సినిమా క్రేజ్‌తో ఆమెకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఈ మూవీతో వచ్చినంత సక్సెస్ ఆ తర్వాత కలిసి రాలేదు. ఆమె తెలుగులో శ్రీ కృష్ణ -2006, గోపి - గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామ చిత్రాల్లోనూ కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె ఎలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. గౌరీ దాదాపు 16 చిత్రాల్లో కనిపించింది. కానీ సినిమాల్లో ఆమెకు అవకాశాలు తగ్గిపోవడంతో 2011లో దిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే వ్యాపారం చేసుకుంటూ స్థిరపడిపోయింది. కానీ ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌కు గౌరీ ముంజల్ హాజరు కాగా ఆ ఫొటోలు బయటకొచ్చాయి. వాటిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. బన్నీ హీరోయిన్ ఇంతలా మారిపోయిందేంటి? అంటూ అవాక్కవుతున్నారు. (ఇది చదవండి: అలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడొస్తుందో?: టాలీవుడ్ యాంకర్) -
Allu Arjun Assets: అల్లు అర్జున్‌కు అన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా?
లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనువడిగా, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అల్లు అర్జున్. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. మొదట్లో యానిమేటర్ని అవుదామనుకున్న అల్లు అర్జున్ సినిమా మీదున్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో వెనుతిరిగి చూడలేదు.. ఈ సినిమాతోనే బన్నీకి స్లైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ, బన్నీ, పరుగు వంటి సినిమాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. దేశముదురు సినిమా బన్నీకి మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, మొన్నటి పుష్ప సినిమా వరకు ప్రతి క్యారెక్టర్లో వైవిధ్యం, లుక్‌లో కొత్తదనం సహా తన ఇమేజ్ను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.ఇక అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఖరీదైన వానిటీ వ్యాన్ దగ్గర్నుంచి ప్రైవేట్ జెట్ వరకు అల్లు అర్జున్ ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. AA వ్యానిటీ వ్యాన్.. ధరెంతో తెలుసా? అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. టీవీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన రిక్లైనర్ సహా పలు విలాసవంతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ ధర సుమారు రూ. 7కోట్లు. అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో సుమారు వంద కోట్ల రూపాయల ఇల్లు ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు బన్నీ. స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇక బన్నీకి కార్లంటే చాలా ఇష్టం. సొంతంగా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే అల్లు అర్జున్ వద్ద ఖరీదైన హమ్మర్ H2, రేంజ్రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్జెఎల్ సహా BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి. సొంతంగా ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్‌కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్స్‌లోనే ఫ్యామిలీని తీసుకొని వెకేషన్స్‌కు వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. వామ్మో.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా? ఒక ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ను అమాంతం రూ. 100కోట్లకు పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాకు సుమారు రూ. 100 - 120 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలే కాకుండా పలు హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్‌లలో ఆయనకు పలు షేర్స్ ఉన్నాయి. మొత్తంగా రూ. 400-500 కోట్లకు పైగానే ఆయన నికర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం. -
అల్లు అర్జున్ ఇంటివద్ద భారీగా అభిమానులు.. వీడియో వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు(శనివారం)41వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా స్టైలిష్ స్టార్‌గా తనకు తాను ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు బన్నీ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బన్నీ మొన్నటి పుష్ప సినిమా వరకు తనకంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్‌గా పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇక తన ఫ్యాన్స్‌ను ఆర్మీ అని ముద్దుగా పిలిచుకుంటారు బన్నీ. ఈ క్రమంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ను కలిసేందుకు పలువురు అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఫ్యాన్స్‌ను ఆప్యాయంగా పలకరించారు బన్నీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
గంగోత్రి టూ పుష్ప.. 20 ఏళ్ల ప్రస్థానంపై బన్నీ ట్వీట్ వైరల్
బన్నీ, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ ఇలా ఏ పేరుతో పిలిచినా అన్నీ అతనే. టాలీవుడ్లో రెండు దశాబ్దాల పాటు దూసుకెళ్తోన్న హీరో అల్లు అర్జున్. టాలీవుడ్ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించి.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. ప్రతి సినిమాలో తనదైన నటనతో మెప్పించారు బన్నీ. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేశాడు. అల్లు అర్జున్ తన ట్వీట్లో రాస్తూ.. 'నేటితో నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఈ ప్రయాణంలో నన్ను అందరూ అభిమానించారు. మీరందరూ నాపై చూపించిన ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. టాలీవుడ్ ఇండస్ట్రీకి వారందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులు, అభిమానుల ప్రేమే కారణం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓ కొత్త ప్రేమ కథను అందులో చూపించారు దర్శకుడు సుకుమార్. ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం బన్నీ. ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అయింది. ఆ తర్వాత "హ్యాపీ" సినిమాతో అలరించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన "దేశముదురు" అల్లు అర్జున్ కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేసింది. ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన పరుగు, వేదం, రుద్రమదేవి వంటి సినిమాలలో నటించారు అల్లు అర్జున్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సరైనోడు లాంటి వరుస హిట్ సినిమాలతో దూసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "పుష్ప" మూవీ ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. త్వరలోనే పుష్ప-2 సినిమాతో మరోసారి అభిమానులను అలరించబోతున్నారు మన ఐకాన్ స్టార్. Today, I complete 20 years in the film industry. I am extremely blessed & have been showered with love . I am grateful to all my people from the industry . I am what I am bcoz of the love of the audience, admirers & fans . Gratitude forever 🙏🏽 — Allu Arjun (@alluarjun) March 28, 2023 -
అది నాకు ఎప్పటికీ ప్రత్యేకమే: అల్లు అర్జున్
అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఆయన రేంజ్ అందరికీ తెలిసిందే. బన్నీ, రష్మిక నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొద్ది రోజులుగా వైజాగ్‌లో జరుగుతోంది. తాజాగా షెడ్యూల్ పూర్తవ్వటంతో బన్నీ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. వైజాగ్ బీచ్ ముందు నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. థాంక్యూ వైజాగ్ అంటూ పోస్ట్ చేశారు. అలాగే విశాఖపట్నం ఎప్పటికైనా నాకు ప్రత్యేకమే అంటూ నోట్ రాశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే వైజాగ్‌లో ఫోటో షూట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఏకంగా ఫోటో షూట్ రద్దయింది. -
ఫోటో షూట్ రద్దు చేసిన అల్లు అర్జున్.. బోరున ఏడ్చేసిన ఫ్యాన్స్
ఐకాన్ స్టార్ బన్నీ అంటే రచ్చ మామూలుగా ఉండదు. ఆయన ఎంట్రీ ఇచ్చాడంటే అక్కడ ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఫోటో షూట్లో బన్నీ పాల్గొన్నారు. అయితే అభిమానులు అత్యుత్సాహానికి ఏకంగా ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. ఫ్యాన్స్ దెబ్బకు ఫోటో షూట్ రద్దయినట్లు తెలుస్తోంది. దీంతో ఎంతో ఆశగా బన్నీ అన్నను చూసేందుకు వచ్చిన అభిమానులు నిరాశకు గురయ్యారు. కొందరేమో ఏకంగా వేదికపైనే బోరున విలపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. బన్నీ చూసేందుకు వచ్చిన వేలాది మంది ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. VizAAg Fans Meet Got Cancelled 🥺💔@AlluArjun Anti @imsarathchandra Anna idi 🥺 It's Not The First Time.🥺 It's Repeating From 2-3 Yrs We're Not Happy With AUDIO Launch, SUCCESS Meet & FANS Meet Don't Play With Fans Emotions#AlluArjun𓃵 #Pushpa#PushpaTheRise #PushpaTheRule pic.twitter.com/BMHAHv3fiQ — Praveen 🪓 ™ (@_AlluBoyPraveen) February 6, 2023 Vizag craze @alluarjun 🔥#PushpaTheRulepic.twitter.com/WvziuNvxuM — Sumanth (@SumanthOffl) February 6, 2023 Bunny Anna fans meet 🔥❤️💥 #PushpaTheRule @alluarjun pic.twitter.com/lFEl9DTMYi — Virat bunny cult™🦁🪓 (@ViratBunny14) February 6, 2023 -
'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తాజాగా హిందీలో డబ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయనున్నట్లు గోల్డ్‌మైన్స్ టెలిఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. యూట్యూబ్‌లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగులో హిట్ అయిన హిందీ-డబ్బింగ్ వెర్షన్ హక్కులను ఈ కంపెనీ సొంతం చేసుకుంది అయితే కార్తీక్ ఆర్యన్ నటించిన అధికారిక హిందీ రీమేక్ షెహజాదా మూవీ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అల..వైకుంఠపురుములో. అప్పట్లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం బన్నీ కెరీర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి తమన్ అందించిన బాణీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతీ పాట ఓ సంచలనమే. ఇక తమన్ కెరీర్ లోనే అదిరిపోయే ఆల్బమ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి సాంగ్ నుంచి సినిమా విడుదల వరకు క్షణక్షణం అనేక రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్‌కు యూట్యూబ్‌లో వన్ బిలియన్ వ్యూస్ వచ్చాయంటే సాంగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థమవుతోంది. #AlaVaikunthapurramuloo (Hindi) | 2 Days To Go | Releasing On 2nd Feb 2023 Only On Our YouTube Channel #Goldmines #AlaVaikunthapurramulooHindi @alluarjun @hegdepooja pic.twitter.com/k0KLAPsX5W — Goldmines Telefilms (@GTelefilms) January 31, 2023 -
అలా అయితే నాకు మరో 20 ఏళ్లు పట్టేది.. అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను సైతం ఊపేసిన సినిమా 'పుష్ప- ది రైజ్'. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అందాల భామ రష్మికతో బన్నీ స్టెప్పులు యూత్‌ను ఓ రేంజ్లో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని సాంగ్స్ దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం పొందాయి. పుష్ప సినిమాతో అల్లుఅర్జున్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. (చదవండి: క్రేజీ అప్డేట్.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్ షూటింగ్!) ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ ఈ సినిమాపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడతూ 'పుష్ప మూవీ ఇంతపెద్ద విజయం సాధిస్తుందనుకోలేదు. ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ చిత్రంలో నేను లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. 'పుష్ప-2' పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రయత్నిస్తాం' అని అన్నారు. -
కొనసాగిన కర్రల సమరం
-
దేవరగట్టు..ఆచారానిదే పైమెట్టు
- నేడు జైత్రయాత్ర - అర్ధరాత్రి సంప్రదాయ సమరం - పోలీసుల భారీబందోబస్తు హొళగుంద/ఆలూరు రూరల్: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పర్వదినాన ప్రతి ఏటా ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది. జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినా ఇక్కడ సంప్రదయానిదే పైమెట్టు అవుతోంది. దేవరగట్టులోని మాళమల్లేశ్వర స్వామి కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. తర్వాత నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొండ కిందకు తీసుకొస్తారు. ఆ సమయంలో వేలాదిమంది భక్తులు జైత్రయాత్ర నిర్వహిస్తారు. జైత్రయాత్ర నిర్వహించే సమయంలో దేవుని పల్లకి ముందుకు తీసుకెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేస్తారు. అలా ఆ యాత్ర దేవరగట్టు అటవీప్రాంతంలో ఉన్న ముండ్లబండ వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి మాళమల్లేశ్వరస్వామి తిరుగాడిన పాదాలగట్టు ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ ప్రాంతం నుంచి రక్షపడి(రాక్షసగుండ్లు) వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తనతొడ రక్తాన్ని ఆ గుండ్లకు రాస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు శమీవృక్షం కిందకు చేరుకుంటారు. అక్కడ కర్రలను, పల్లకిని కిందకు దించి పూజలు నిర్వహిస్తారు. అలా కొనసాగిన జైత్రయాత్ర శనివారం తెల్లవారుజామున దేవరగట్టు కొండకింద ఉన్న ఎదురుబసవన్న గుడిపైకి ఎక్కి పూజారి గిరిస్వామి భవిష్యవాణి వినిపిస్తారు. సమాధానం లేని ప్రశ్నలు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే పేరుతో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు డుర్రు... డుర్రు.. గోబారక్ బహూపరాక్ అంటూ ముందుకొస్తారు. ఆ సమయంలో మరికొన్ని గ్రామాల ప్రజలు మధ్యలోకి వెళ్తారు. ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే తాము రక్షణగా కర్రలను ఉపయోగిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. ఉత్సవ విగ్రహాలను మూడు గ్రామాలు మినహా ఏ గ్రామాల ప్రజలు వాటిని ఎత్తుకెళ్లరని వారే పేర్కొంటున్నారు. అయితే మరి ఎందుకు కర్రల సమరం జరుగుతుందో భక్తుల తలలు ఎందుకు పగులుతాయో అనే ప్రశ్నలకు గత కొన్నేళ్లుగా సమాధానాలే లేవు. క్రూర మృగాల దాడి చేస్తాయనే.. దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి వెలసిన కొండప్రాంతం దాదాపు 40 కి.మీ. వరకు విస్తరించిన దట్టమైన అడవిలో ఉంది. అడవిలో క్రూరమృగాల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందు పూర్వం భక్తులు పెద్దపెద్ద బరిసెలు, రింగులు తొడిగిన కర్రలను తీసుకెళ్లే వారు. కాలక్రమేణా ఆ సంప్రదాయం ఇప్పటికీ కూడా వస్తుందని భక్తులు అంటున్నారు. ప్రస్తుతం మారుణాయుధాలను వదిలి బన్ని ఉత్సవంలో కర్రలను ధరించి ఉత్సవ విగ్రహాల జైత్రయాత్ర ముందుకు సాగేలా చూస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఇవీ దుర్ఘటనలు.. మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో ప్రతి ఏటా పలువురు గాయపడుతున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చి వివిధ కారణాల ఐదు సంవత్సరాల్లో ఇద్దరు మరణించారు. రెండేళ్ల క్రితం భక్తుల తొక్కిసలాటలో నెరణికి గ్రామానికి చెందిన ఒక బాలుడు మృతిచెందాడు. గాయపడిన వారు: 2010–11లో130 మంది, 2011–12లో 121 మంది, 2012–13లో 140 మంది, 2013–14లో 119 మంది, 2014–15లో కేవలం 103 మంది, 2015–16లో 57 మంది భక్తులు గాయపడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం: కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీయస్పీ బన్ని ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది పోలీస్ బందోబస్తు కూడా పెరిగింది. గత రెండేళ్లుగా ఉత్సవాల్లో రింగులు తొడిగిన కర్రలను ఉపయోగించకుండా, మద్యానికి దూరంగా ఉండాలని అవగాహన సదస్సులు కూడా నిర్వహించాం. ఈ యేడాది ఉత్సవాల్లో అల్లరిమూకలను గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఉత్సవాలు జరిగే ప్రదేశంలో 30 సీసీ కెమెరాలను కూడా అమర్చాం. సంప్రదాయం పేరుతో ఘర్షణకు దిగే వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏర్పాట్లు పూర్తి– ఓబులేస్, ఆదోని ఆర్డీఓ బన్ని ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవం జరిగే ప్రదేశంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యేక జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి ఉత్సవం జరిగే చోట ఉత్సవాలను తిలకించే భక్తులపై అగ్గి దివిటీలను, కర్రలతో దాడులు చేయకుండా ఉండేలా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరెంట్ కోతలు లేకుండా కూడా ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించాం. సంప్రదాయ సమరమే– మల్లికార్జున, నెరణికి గ్రామసర్పంచు బన్ని ఉత్సవం కేవలం సంప్రదాయ సమరమే. కొన్నేళ్లుగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఉత్సవాలను జరుపుకుంటారు. కల్యాణోత్సవం తర్వాత దేవుళ్లను ఊరేగింపుగా మూడు గ్రామాల ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్లే టప్పుడు ఇతర గ్రామాల ప్రజలు జైత్రయాత్రలో పాల్గొంటారు. అప్పుడు ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు దేవుళ్లకు రక్షణగా వచ్చే భక్తులు కర్రలను గాలిలో తిప్పుతారు. ఆ సమయంలో భక్తులు ప్రమాదవశాత్తు గాయపడతారు. -
భారీబందోబస్తు
కర్నూలు: దసరా పండుగను పురస్కరించుకొని హోళగుంద మండలం దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని అరికట్టేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు డీఎస్పీలు, 17 మంది సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు 41 మంది, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు 145 మంది, కానిస్టేబుళ్లు 458, స్పెషల్‌పార్టీ పోలీసులు 70 మంది, హోంగార్డులు 200 మందిని బందోబస్తు విధులకు నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, మఫ్టీ, స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దింపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ బన్ని ఉత్సవంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తకుండా ప్రతి ఒక్కరు తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. ఆకతాయిలు, అల్లరి మూకలు దాడులకు పాల్పడే విధంగా రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలపై, చిన్న పిల్లలపై, భక్తులకు నిప్పులు విసరడం, కర్రలతో రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిని వీడియో చిత్రీకరణ ద్వారా గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దేవరగట్టుపై డ్రోన్లతో నిఘా
-
దేవరగట్టుపై డ్రోన్లతో నిఘా
కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టుపై ఈనెల 11న జరిగే ‘బన్ని’ ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా జరిగే ఈ ఉత్సవంలో భాగంగా మాలమల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను గ ట్టుపైకి చేర్చే క్రమంలో గ్రామస్తులు కర్రలతో కొట్టుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఘర్షణలో పలువురు గాయపడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. దీనిని ఆపాలని అధికార యంత్రాంగం ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు పలు చర్యలు ప్రకటించారు. రేపు సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో భక్తులు తెచ్చే కర్రలకు ఇనుపచువ్వలు బిగించకుండా చూస్తున్నారు. అంతేకాదు, డ్రోన్లు, సీసీ కెమెరాలను వినియోగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనావేసి, అవసరమైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ పరిస్థితులను నివారించనున్నారు. ఉత్సవం జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యపానం విక్రయాలను నిషేధించారు. గాయపడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1300 మంది పోలీసులను ఇక్కడ మోహరించనున్నారు. -
బన్ని ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
అధికారులతో సమీక్షాసమావేశంలో ఆదోని ఆర్డీవో, డీఎస్పీ హోళగుంద : దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదోని ఆర్డీ ఓబులేశు, డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు సూచించారు. ఆదివారం దేవరగట్టులో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 11న జరిగే బన్ని ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరవుతారన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు సేవలందించడానికి కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డీఎల్పీఓ ఎలిసాకు ఆర్డీఓ సూచించారు. ఉత్సవాల విజయవంతానికి ఉపాధి మేటీలను వలంటీర్లుగా నియమించాలన్నారు. నాటుసారా విక్రయం జరగకుండా ఎక్సైజ్ అధికారులు ముందస్తుగా తనిఖీలు చేపట్టాలని సూచించారు. హెల్త్ క్యాంప్‌లో అన్నిరకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఏఎస్పీ ఫియాజుద్ధీన్, తహసీల్దార్ సతీష్, ఎంపీడీఓ నాగేశ్వరరావు, సీఐ శంకరయ్య, ఎస్ఐలు మారుతి, ధనుంజయ, కృష్ణమూర్తి, వలి తదితరులు పాల్గొన్నారు. -
కర్రల సమరానికి స్వస్తి పలుకుదాం
– లోకాయుక్త ఆదేశాలను అమలు చేద్దాం – సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు – కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): విజయదశిమి రోజున దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి సన్నిధిలో జరిగే బన్నీ ఉత్సవంలో కర్రల సమరానికి స్వస్తి పలుకుదామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయంలో బన్నీ ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి హింసాత్మక సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చుట్టు పక్కల గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షేత్రంలో సమస్యాత్మకంగా గుర్తించిన 100 ప్రదేశాల్లో అక్టోబరు 1వ తేదీ నుంచి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపాలని లోకాయుక్త ఆదేశాలు ఉన్నాయని, ఈ మేరకు భక్తులు సంప్రదాయం ప్రకారం వేడుకలు నిర్వహించాలన్నారు. కర్రల సమరానికి స్వస్తి పలికే విధంగా కళజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హాలహర్వి, హŸళగొంద మండలాల్లోని నెరణికి, నెరణికి తండా, అరికెర, అరికెర తండా, తదితర 13 గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. మాస్టర్ కంట్రోల్ రూము, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదోని ఆర్డీఓను ఆదేశించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని పూర్తిగా అరికట్టాలని, నాటుసారా బట్టీలను ధ్వంసం చేయాలని ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. సారా, మద్యం రవాణను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాల పరికరాలతో వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. దేవరగట్టు, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల్లో 3.6 కిలో మీటర్ల దారిని సీసీ రోడ్డుగా అభివృద్ధి చేసే పనులను వచ్చే నెల5లోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని రికార్డు చేస్తామన్నారు. హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. డ్రోన్ కెమెరాలతో ఉత్సవాన్ని చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, దేవాదాయ శాఖ డీసీ గాయత్రీ, ఆదోని ఆర్డీఓ ఓబులేసు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్కూల్లో బన్నీ నా జూనియర్
సోమాజిగూడ: ప్రముఖ నటుడు కార్తీ బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్లో శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ కాఫీ బ్రాండ్ ‘బ్రూ రోస్ట్ అండ్ గ్రౌండ్’ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించారు. తనకు అత్యంత ప్రియమైన బ్రూ కాఫీ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నటుడు నాగార్జున సోదరుడిలాంటి వాడన్నారు. తనూ తమన్నా, కాజల్ మంచి ఫ్రెండ్స్, అందరం దాదాపు ఒకేసారి కెరీర్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పారు. 'సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్(బన్నీ) నాకు మంచి మిత్రుడు. అయితే నేను చదువుకున్న స్కూల్లోనే బన్నీ చదివాడు. బన్నీ నా జూనియర్ అని తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యాను' అని కార్తీ అన్నారు. తమ సొంత బ్యానర్లో బన్నీతో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంతో కలిసి నటించే ఉద్దేశం అయితే లేదు కానీ, అన్నయ్య సూర్యతో మాత్రం కలిసి నటిస్తానని తెలిపారు. లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. -
బన్నీ ఉత్సవంలో రక్తపాతం వద్దు..
కర్నూలు(అగ్రికల్చర్): తమిళనాడులో జల్లికట్టు తరహాలో ఏపీలోని కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రలతో కొట్టుకుంటూ నిర్వహించే బన్నీ ఉత్సవాలపై అధికారు కీలక ఆదేశాలను వెలువరించారు. దేవరగట్టు మాలమల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి రక్తపాతానికి తావులేకుండా శాంతి యుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్.. నెరణికి గ్రామస్థులు, దేవస్ధానం అధికారులను కోరారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్హాల్లో బుధవారం దేవరగట్టు బన్ని ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్.. బన్ని వేడుకల్లో రింగులు తొడిగిన కర్రలు వాడొద్దని సూచించారు. ఈమేరకు భక్తులను చైతన్యపరిచేలా కళాజాతలలో ప్రచారం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవం నిర్వహించే రోజు మద్యం, నాటు సారా అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. దేవరగట్టు చుట్టుపక్కల గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కషి చేయాలన్నారు. సమీక్షకు హాజరైన జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ... బన్నీ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకుంటున్నదని, గత ఏడాది పోలీసులు, గ్రామస్తులు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎవ్వరికి గాయలు లేకుండా బన్ని ఉత్సవం ముగిసిందనానరు. ఈ సారి కూడా గ్రామస్థులు, దేవాలయం అధికారులు సహకరించాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, వివిధ శాఖల అధికారులు, నెరణికి గ్రామ నేతలు గాదేగౌడు, రామలింగంగౌడు, శేకన్న న్యాయవాది మల్లికార్జునగౌడు, దేవాలయ చైర్మన్ కుమారగౌడు తదితరులు పాల్గొన్నారు. -
నేనెప్పుడు అలా ఆలోచించలేదు: వర్మ
వీళ్లు, వాళ్లు అనే తేడా చూపకుండా.. ఎవ్వరినీ వదలకుండా తనదైన శైలిలో మాటల తూటాలతో వెంటాడే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. 'సరైనోడు' మీద కూడా ఓ కన్నేశాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' కంటే సరైనోడు చాలా చాలా పెద్ద హిట్ అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కన్నా బన్నీనే సూపర్ హిట్ హీరో అనే అర్థం వచ్చేలా తన స్టైల్లో కామెంట్లు చేశాడు. నిజానికి తానెప్పుడూ అలా ఆలోచించలేదని, బన్నీని పవర్ స్టార్ తో పోల్చి చూడాలని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ సరైనోడు సినిమాతో పవన్ కన్నా బన్నీ చాలా ఎదిగిపోయాడని.. ఈ విషయంలో తను చాలా ఆశ్చర్యపోతున్నానంటూ ట్వీటాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై వర్మ చేసిన కామెంట్లకు పవన్ కల్యాణ్.. 'ఆయన విచిత్ర మైన వ్యక్తి. నన్నడిగితే, ఆయన బయటవాళ్ళ మీద పెట్టే శ్రద్ధ తనపై, తన సిన్మాలపై పెడితే వేరే స్థాయికి వెళ్ళేవారు' అంటూ స్పందించిన విషయం తెలిసిందే. అయినా రామూ మాత్రం తన దారిలో తాను దూసుకుపోతున్నాడు. Since Sarainodu is a far far bigger hit than a far far bigger Sardar Gabbar Singh is Bunny far far bigger? ..just asking — Ram Gopal Varma (@RGVzoomin) 26 April 2016 I never thought anything about Bunny compared to him but am so very surprised that with Sarainodu he became so much bigger than him — Ram Gopal Varma (@RGVzoomin) 26 April 2016 -
ఆ హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్
కెరటం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది. రామ్ చరణ్‌తో బ్రూస్లీ, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో సినిమాలతో పాటు బన్నీ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. తనకు ఈ స్థాయి రావడానికి హెల్ప్ అయిన సక్సెస్ఫుల్ సినిమా లౌక్యం విడుదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తరువాత తన కెరీర్లో సెకండ్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అందించిన లౌక్యం యూనిట్‌తో పాటు తనను నమ్మి ఆ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు శ్రీవాస్‌కు కృతజ్ఞతలు తెలియజేసింది. #1yearofloukyam , 2nd turning point in my career .Very special film.Thanks to d entire team specially dir Srivasu sir for believing in me :) — Rakul Preet (@Rakulpreet) September 26, 2015 -
బన్నీ ఒప్పుకుంటాడా..?
ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం సాదించిన కామెడీ ఎంటర్టైనర్ 'భలే భలే మొగాడివోయ్'. నాని, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఓవర్సీన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న నాని కెరీర్‌కు మంచి కిక్ ఇచ్చింది ఈ మూవీ. నాని కెరీర్‌కు మాత్రమే కాదు, దర్శకుడు మారుతికి కూడా ఈ సినిమా చాలా ప్లస్ అయ్యింది. ఇప్పటి వరకు అడల్ట్ కామెడీలు మాత్రమే చేస్తాడనే అపవాదు ఉన్న మారుతి ఈ సినిమాతో ఆ పేరు చెరిపేసుకున్నాడు. గతంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలతో వర్క్ చేయని మారుతి నానితో ఆ కోరిక కూడా తీర్చేసుకున్నాడు. భలే భలే మొగాడివోయ్ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ఇప్పుడు స్టార్ హీరోల మీద దృష్టిపెడుతున్నాడు మారుతి. తనకు పెద్దగా పరిచయం లేని హీరోలతో సినిమా చేసే కన్నా తన హోం బ్యానర్ లాంటి గీతా ఆర్ట్స్‌లోనే అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటి వరకు పెద్ద హీరోలను, భారీ బడ్జెట్ సినిమాలను డీల్ చేసిన అనుభవం లేని మారుతితో సినిమా అంటే బన్నీ డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి. -
మళ్లీ వాయిదా పడిన 'రుద్రమదేవి' ..?
గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రుద్రమదేవి మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. తొలి ఇండియన్ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆర్ధిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల ఇప్పటికే ఈ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, ఆ రోజు కూడా రుద్రమదేవి ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ఇంకా ఆర్థిక సమస్యల నుంచి తేరుకోకపోవటంతో, పాటు గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తి కాకపోవటంతో సినిమా రిలీజ్ ను మరోసారి వాయిదా వేయాలని భావిస్తున్నారట. చారిత్రక కథాంశం కావటంతో సినిమాలో చాలా భాగం గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉంది. దీనికి తోడు తొలి స్టీరియెస్కోపిక్ త్రీడి చిత్రం కావటం, ఆ టెక్నాలజీ మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవటం లాంటి సమస్యల కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. అక్టోబర్ 9న రిలీజ్ కష్టమే అని తేలిపోవటంతో మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. రుద్రమదేవి పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, బాబాసెహగల్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇళయరాజ సంగీతం అందిస్తుండగా, గుణటీం వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. -
ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది
- బన్నీ వాసు ‘‘ఏ సినిమాకైనా దర్శకుడు హార్స్లాంటివాడు. ఆ హార్స్ సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది అని ఓ సందర్భంలో అల్లు అరవింద్‌గారు అన్నారు. ఆ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓ నిర్మాతగా సినిమాకి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని బన్నీ వాసు అన్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్ వంశీ , జీఏ2 బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలతో పాటు ఇతర విశేషాలను బన్నీ వాసు చెప్పుకొచ్చారు. * విభిన్న ఇతివృత్తాలతో యూత్‌ఫుల్ చిత్రాలు చేయాలన్నదే మా జీఏ2, యూవీ క్రియేషన్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మా ముందు పెట్టింది అల్లు అరవింద్‌గారే. జీఏ2కి నేను, శిరీష్, యూవీకి వంశీ నిర్మాతలం. కాన్సెప్ట్ విషయంలో, సినిమాలు తయారు చేసే విధానంలో అరవింద్‌గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ‘‘కథను నమ్ముకుని బడ్జెట్ పెట్టాలి. హీరోను బట్టి బడ్జెట్ పెట్టొద్దు’’ అని అరవింద్‌గారు చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. * రెండేళ్ల క్రితం మారుతి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పాడు. కథ వింటున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు నవ్వుకున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. నేను విన్నదానికన్నా విజువల్‌గా ఇంకా బాగుంది. మారుతి కథ చెప్పినప్పుడు వంద శాతం నవ్వొస్తే, నాని ఆ కథను తన నటన ద్వారా ఆవిష్కరించిన తీరుకి రెండు వందల శాతం నవ్వొచ్చింది. * మారుతి ఈ కథ చెప్పినప్పుడే నాని అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం హీరో ఎంటర్టైన్మెంట్ మీద సాగుతుంది. నాని హండ్రడ్ పర్సంట్ మంచి టైమింగ్ ఉన్న హీరో. ఈ సినిమాలో తనకు మతిమరుపు ఉంటుంది. అది ప్రేయసికి తెలియనివ్వకుండా భలే మ్యానేజ్ చేస్తుంటాడు. అందుకే ‘భలే భలే మగాడివోయ్’ అని టైటిల్ పెట్టాం. నాని బ్రహ్మాండంగా చేశాడు. అరవింద్‌గారు ఎడిటింగ్ టైమ్‌లో చూసి, ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు నానీకి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చెయ్యి. తనతో ఇంకో సినిమా చేద్దాం’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’లో సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందులో కామెడీ కూడా చేసి, బాగా నటించింది. * హీరోకి మతిమరుపు అంటే ‘గజిని’ సినిమా గుర్తుకు రావడం సహజం. కానీ, ఆ సినిమాకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కామెడీ వేలో సాగుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఉండవు. కథలో భాగంగానే కామెడీ సాగుతుంది. * ఈ చిత్రాన్ని ప్రభాస్ చూసి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎడిటింగ్ టైమ్‌లో బన్నీ (అల్లు అర్జున్) చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సీన్స్‌లో కానీ డైలాగ్స్‌లో కానీ వెతికినా కూడా ద్వంద్వార్థాలు కనిపించవు. ఈ చిత్రం చూడ్డానికి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వెళతారు. * మారుతి, నేను రూమ్మేట్స్. వంశీ, నేను లాస్ట్ టెన్ ఇయర్స్‌గా డిస్ట్రిబ్యూషన్లో పార్టనర్స్. నాని, వంశీ ఫ్రెండ్స్. సో.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన చిత్రం ఇది అనొచ్చు. వంశీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ముందుంటాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్‌ని తీసుకుందామని వంశీ, మారుతీయే అన్నారు. పాటలు సక్సెస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది, * ‘ప్రేమకథా చిత్రమ్’లో ఓ రెండు రీళ్లు పడీ పడీ నవ్వుకుంటాం. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి నాలుగు రీళ్లు ఉంటాయి. సినిమా మీద నమ్మకంతో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. * వంశీ, నేను వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మున్నా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాం. ఓ రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. -
రథమెక్కిన అల్లుఅర్జున్
-
రజనీ రికార్డ్స్‌ని బన్నీ బ్రేక్ చేస్తాడా..?
-
బన్నీని డైరెక్ట్ చేస్తున్న బోయపాటి..?
-
మృత్యుంజయురాలు
బోరు బావి నుంచి బయటపడ్డ బాలిక పుత్తూరు: బోరు బావిలో పడిపోయిన ముడేళ్ల చిన్నారి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడింది. ఈ సంఘటన పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడలో సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు చిన్నరాజకుప్పానికి చెందిన ఎల్లప్పరెడ్డి రెండు రోజుల క్రితం పొలంలో బోరు బావి తవ్వాడు. దానిపై గోనెసంచి (మూతగా) చుట్టి ఉంచాడు. ముగ్గుపిండి కోసం చిన్నరాజకుప్పం ఆది ఆంధ్రవాడకు చెందిన సునీత కూతురు బన్నీ(3)ని వెంట పెట్టుకుని ఆ బావి వద్దకు వెళ్లింది. ఆమె ముగ్గుపిండి సేకరణకు పూనుకుంది. పక్కనే ఆడుకుంటున్న బన్నీ ఆ బోరుబావికున్న గోనె సంచిని తీసింది. కాలుజారి అందులో పడిపోయింది. వెంటనే గమనించిన తల్లి కేకలు వేసింది. సమీపంలోని గ్రామస్తులు అక్కడి కి చేరుకున్నారు. ఓ తాడును బోరు బావిలోకి వదిలారు. సుమారు 20 అడుగుల లోతులో ఇరుక్కున్న బన్నీ ఆ తాడును పట్టుకోగా గ్రామస్తులు సురక్షితంగా బయటకుతీశారు. ఆ బాలిక శరీరంపై స్వల్ప గాయూలయ్యూరుు. చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
'పవనిజం జిందాబాద్' అంటూ 'బన్నీ' వెబ్ సైట్ హ్యాక్!
విజయవాడ: 'మీ కాలేజి వెబ్ సైట్ సెక్యూరిటీ సిస్టమ్ చాలా వీక్ గా ఉంది' అని హెచ్చరిస్తూ ఓ కాలేజి వెబ్ సైట్ ను బన్నీ పేరుతో హ్యాక్ చేయడమే కాకుండా పవనిజం జిందాబాద్ అంటూ ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. బన్ని అంటే అల్లు అర్జున్ అనుకుంటే పొరపాటే. బన్ని పేరుతో విజయవాడ సమీపంలో మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజి వెబ్ సైట్ ను ఇటీవల హ్యాక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యాకింగ్ పాల్పడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫోటోను పెట్టి పవనిజం జిందాబాద్ అనే సందేశాన్ని హోంపేజీలో పోస్ట్ చేశారు. 'మా వెబ్ సైట్ ను హ్యాక్ చేసినట్టు గమనించాం. ఇందుకు బాధ్యులైన వారిపై తర్వాత దృష్టిపెడుతాం' అని కాలేజి యాజమాన్యం ఓ దినపత్రికకు వెల్లడించారు. ప్రస్తుతం కాలేజి వెబ్ సైట్ ను పునరుద్దరించి.. యధావిధిగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కరెన్సీ నోటును ఫ్యాన్స్ మార్పింగ్ చేసి గాంధీజీ బొమ్మ స్థానంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను పెట్టడం వివాదస్పదమైన సంగతి తెలిసిందే. Follow @sakshinews -
బెజవాడలో బన్నీ సందడి
విజయవాడ : దక్షిణ భారతదేశపు మొబైల్ రిటైల్ వ్యాపారంలో సంచలనం సృష్టించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తరించిన మల్టీబ్రాండ్ స్మార్ట్ మొబైల్ రిటైల్ చైన్ ‘లాట్ మొబైల్’ 101వ స్టోర్ విజయవాడలో ప్రారంభమైంది. బందరురోడ్డులో ఏర్పాటుచేసిన ఈ షోరూమ్‌ను లాట్ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్, సినీ హీరో అల్లు అర్జున్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ రంగంలో లాట్ సంచలనం సృష్టించగలదన్నారు. అనేక ఆకర్షణీయమైన ఫీచర్లు లాట్ మొబైల్స్‌లో ఉంటాయని, మన హార్ట్ బీట్‌ను కూడా లాట్‌తో చెక్ చేసుకోవచ్చన్నారు. లాట్ ఆఫర్లను యువత సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, గుణశేఖర్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు అర్జున్ చెప్పారు. లాట్ మొబైల్స్ డెరైక్టర్లు రాజా, సంతోష్ మాట్లాడుతూ విజయవాడలో తమకు ఇది ఆరవ స్టోర్ అన్నారు. దీపావళికి ‘లాట్’ స్మార్ట్ ఆఫర్లు అనేకం ఉన్నాయని, నగరంలో మొదటిసారిగా రూ.4.40 లక్షల విలువైన హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 మోటార్ బైక్‌ను.. ‘మొబైల్ కొనండి.. ఈ రేసుగుర్రం గెలవండి’ అనే పోటీలు నిర్వహించి విజేతకు అందించనున్నామన్నారు. ఈ కాంటెస్ట్ ఆరు మొబైల్ స్టోర్స్‌లో జరుగుతుందన్నారు. ఒక మొబైల్ కొంటే రెండు ఉచితం (1+2), 1+3, 1+4 వంటి ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. మెమొరీ కార్ట్ ఆఫర్లు, పవర్ బ్యాంక్ ఆఫర్లు, రెండు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు కేవలం రూ.4,999కు, మూడు 3జీ మొబైల్స్ రూ.2,999 ఇస్తున్నట్లు వారు వివరించారు. -
నిర్మాతగా బన్నీతో సినిమా : సుకుమార్
పిఠాపురం మున్సిపాలిటీ :నిర్మాతగా మారి అల్లు అర్జున్(బన్నీ)తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నానని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ తెలిపారు. సోమవారం ఆయన పిఠాపురంలో సందడి చేశారు. స్థానిక నవచైతన్య జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. గతంలో కాకినాడ ఆదిత్య కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. నవచైతన్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెడ్డెం దుర్గాప్రసాద్ (బాబి)తో చర్చించారు. అంతకుముందు తన అసిస్టెంట్ డెరైక్టర్ కొత్తపల్లి గ్రామానికి చెందిన సానా బుచ్చిరాయుడు మామగారైన ప్రస్తుత 23వ వార్డు కౌన్సిలర్ రెడ్డెం భాస్కరరావు స్థానిక రంగారావుగారి ఆస్పత్రిలో ఉండడంతో ఆయనను పరామర్శించారు. పముఖ దత్త ప్రచారకులు నారాయణదత్త సుకుమార్‌కు దత్తుని ప్రసాదాలను, కేలండర్‌ను అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ తానే స్వయంగా నిర్మాతగా మారి అల్లు అర్జున్‌తో సినీమా తీసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల విడుదలైన వన్ చిత్రం ఆశించిన విజయం సాధించలేదని, రానున్న రోజుల్లో ప్రేక్షకుల మన్ననలు పొందేలా చిత్రాలను నిర్మిస్తానని పేర్కొన్నారు. తీరిక సమయాల్లో తాను పుస్తకాలు చదవడంతో పాటు భార్య తబిత, కుమార్తె సుక్రతవేణి, కుమారుడు సుక్రాంత్తో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నట్టు వెల్లడించారు. సుకుమార్ వెంట డాక్టర్ పంతం రాజేష్, వైఎస్సార్ సీపీ నేతలు ముమ్మిడి శ్రీను, కొండేపూడి శంకరరావు, రెడ్డెం జనార్ధన్ తదితరులు ఉన్నారు. -
త్రివిక్రమ్ కథకు మార్పులు చెబుతున్న బన్నీ
-
బన్నీతో నాకు అంత చనువుంది! - సురేందర్‌రెడ్డి
‘‘బన్నీకి ఈ టైటిల్ యాప్ట్... ఈ కథ యాప్ట్... టోటల్‌గా ఈ సినిమా యాప్ట్’’ అంటున్నారు సురేందర్‌రెడ్డి. మాస్ సినిమాని కూడా క్లాస్‌గా, స్టయిలిష్‌గా తెరకెక్కించే సురేందర్‌రెడ్డి, బన్నీని ‘రేసుగుర్రం'గా తీర్చిదిద్దారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా. కె. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సురేందర్‌రెడ్డి చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆయనతో జరిపిన సంభాషణ ఈ విధంగా... ‘రేసుగుర్రం' అంటున్నారు... హీరో బైక్ రేసరా? హార్స్ రైడరా? ఈ రెండూ కాదు. రేసు గుర్రం అంత వేగంగా హీరో పాత్ర ఉంటుంది. సినిమా కూడా చాలా స్పీడ్‌గా సాగుతుంది. ఇంతకీ హీరో ఏం చేస్తాడు? ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేవరకూ నిద్రపోడు. సినిమా మొత్తంలో హీరోకి రెండు, మూడు లక్ష్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ఏం చేశాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథ బన్నీని దృష్టిలో పెట్టుకునే తయారు చేశారా? అవును. బన్నీకి వంద శాతం నప్పే కథ ఇది. టైటిల్ మాత్రం షూటింగ్ సగంలో ఉన్నప్పుడు అనుకున్నాం. బన్నీ ఎంత ఎనర్జిటిక్కో మరోసారి ఈ సినిమాలో చూస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కోపం వచ్చినప్పుడు తిట్టడం, బాధ అనిపించినప్పుడు అలగడం.. ఇలా నా ఫీలింగ్ ఏదైనాసరే నేను నిర్భయంగా వ్యక్తపరచగల చనువు నాకు బన్నీ దగ్గర ఉంది. అతను అంత కంఫర్టబుల్. ‘రేసు గుర్రం’ కథ ఏంటి? భిన్న మనస్తత్వాలున్న ఇద్దరు అన్నదమ్ముల కథ. టామ్ అండ్ జెర్రీ తరహా అన్నమాట. అన్న శ్యామ్. తమ్ముడు బన్నీ. చదివే పుస్తకాల్లో ఏది ఉంటే దాన్ని అనుసరించడం అన్న స్టయిల్. కానీ, తన మనసుకి ఏది అనిపిస్తే అది చేయడం తమ్ముడి స్టయిల్. ఈ ఇద్దరూ రామ-లక్ష్మణుల్లా ఉండాలని వారి తల్లి కోరిక. కానీ, అలా ఉండరు. ఈ అన్నతమ్ముల్లిద్దరి మధ్య సాగే ట్రాక్ చాలా వినోదంగా ఉంటుంది. తమిళ ‘వేట్టయ్', హిందీ ‘రామ్‌లఖన్'లా ఈ సినిమా ఉంటుందనే టాక్ ఉంది? ఆ సినిమాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో వినోదం, యాక్షన్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ వేసవికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ఇస్తున్నాం. ఈ సినిమా కోసం 12 కేవీ లైట్ ఏదో వాడారట? మామూలుగా కీలక సన్నివేశాలకు, పాటలకు మాత్రమే ఈ లైట్ వాడుతుంటాం. కానీ, కెమేరామేన్ మనోజ్ పరమహంస సినిమా మొత్తం వాడదామన్నారు. ఖర్చుతో కూడుకున్నది కావడంతో ‘మొత్తం 105 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు వద్దంటే వేరే లైట్ వాడదాం’ అని నిర్మాత బుజ్జిగారితో అన్నాం. కానీ, కథకు న్యాయం జరగాలి కాబట్టి, రాజీపడొద్దన్నారు. సినిమాకి ఏది కావాలన్నా సమకూర్చారు కాబట్టే, ఫలితం బ్రహ్మాండంగా ఉంది. సినిమా చూసినవాళ్లకి ఆ లైట్ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుంది. ‘కిక్ 2’ చేయనున్నారట.. ఆ విశేషాలు? అది ‘కిక్'కి సీక్వెల్ కాదు. వేరే కథతో రూపొందించనున్నాం. రవితేజ హీరోగా చేస్తారు. హీరో కల్యాణ్‌రామ్ నిర్మిస్తారు. ఇంకా అంతా కొత్తవాళ్లతో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలనుకుంటున్నా. దీన్ని ‘ఠాగూర్' మధు నిర్మిస్తారు. హిందీ ‘కిక్'కి అవకాశం వస్తే ఎందుకు చేయలేదు? అప్పుడు ‘ఊసరవెల్లి'తో బిజీగా ఉన్నాను. మరి.. భవిష్యత్తులో హిందీ సినిమాలు చేసే ఆలోచన ఉందా? ఉంది. ‘ఊసరవెల్లి'ని హిందీలో రీమేక్ చేయాలని ఉంది. ఆ సినిమా ఇక్కడ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడానికి కారణం? నేనిప్పటివరకు చేసిన అన్ని కథల్లోకల్లా అత్యుత్తమం ‘ఊసరవెల్లి’. ఆ సినిమా విజయం విషయంలో నా అంచనా నిజం కాలేదు. స్క్రీన్‌ప్లే ఇంకా పకడ్బందీగా ఉండాలేమో అనిపిస్తోంది. హిందీ వెర్షన్ విషయంలో ఇంకా కేర్ తీసుకుంటున్నా. ఎన్టీఆర్‌తో చేసిన రెండు (అశోక్, ఊసరవెల్లి) సినిమాలూ ప్రేక్షకాదరణ పొందకపోవడంపట్ల మీ ఫీలింగ్? అసంతృప్తిగా ఉంది. అతనితో ఓ హిట్ సినిమా చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా చేస్తాను. మహేశ్‌బాబుతో మళ్లీ ఎప్పుడు సినిమా? మహేశ్‌లాంటి హీరోతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనే ఉంటుంది. అన్నీ కుదిరితే తనతో కూడా తప్పకుండా సినిమా చేస్తా. -
బన్నీతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందా..?
-
హిట్ కోసం 'రేసు గుర్రం'ని వదులుతున్న సురేందర్ రెడ్డి
-
కన్నడ సినిమా కోసం పోటీ పడుతున్న బన్నీ, ఎన్టీఆర్
-
రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల గూండే
-
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : కన బడలేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష ॥ గుండెనిండ పాలున్నా బిడ్డలకందించలేని తల్లిబతుకు దేనికనీ బీళ్లు నింపె నీళ్లున్నా సముద్రాన పడిపోయే శాపం తనకెందుకనీ బలువై దయకరువై తను వెలియై ఇక బలియై బృందం: బలువై దయకరువై తను వెలియై ఇక బలియై ఉప్పు సాగరాలలోకి వెళ్లలేక వెళ్లలేక వెక్కివెక్కి పడుతున్నది వృథా కథలు మోయలేక... ఆ అలల అలజడి ఆ తడి ఆరని కంటతడి ఆ అలల అలజడి తడి ఆరని కంటతడి కనబడలేదా వినబడడం లేదా ॥ చరణం : శిలాపలకలేసి మీరు ఎలా మరచిపోయారని బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది దుర్మదాంధులార తెలుగు బిడ్డలకీ కర్మేందని ధర్మపురిలో నారసింహ నాదం చేస్తున్నది ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్లు కడిగి ఏడ్చినది బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడి కి సాగిలపడి మొక్కినది పాపికొండల గుండె ధారై ప్రవహించినది ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది సిగ్గుపడండని కుటిల నాయకులను తిట్టినది గుండె పగిలి సరసాపూర్ సముద్రాన దూకినది చిత్రం : బన్ని (2005) రచన : సుద్దాల అశోక్‌తేజ, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ గానం : ఎస్.పి.బాలు, బృందం