Allu Arjun Shares Emotional Tweet About Completing 20 Years In Industry, Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun: ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మీరే: అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్

Published Tue, Mar 28 2023 5:14 PM | Last Updated on Tue, Mar 28 2023 5:33 PM

Allu Arjun Shares Emotional Tweet Completing 20 Years In Industry - Sakshi

బన్నీ, ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ ఇలా ఏ పేరుతో పిలిచినా అన్నీ అతనే. టాలీవుడ్‌లో రెండు దశాబ్దాల పాటు దూసుకెళ్తోన్న హీరో అల్లు అర్జున్. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో గంగోత్రి సినిమాతో కెరీర్ ప్రారంభించి.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు స్టెలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికీ ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. ప్రతి సినిమాలో తనదైన నటనతో మెప్పించారు బన్నీ. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ సందర్భంగా తన అభిమానులకు థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్‌ చేశాడు. 

అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'నేటితో నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. ఈ ప్రయాణంలో నన్ను అందరూ అభిమానించారు. మీరందరూ నాపై చూపించిన ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. టాలీవుడ్‌ ఇండస్ట్రీకి వారందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులు, అభిమానుల ప్రేమే కారణం.' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. 

బన్నీ 20 ఏళ్ల సినీ ప్రస్థానం

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన  ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఓ కొత్త ప్రేమ కథను అందులో చూపించారు దర్శకుడు  సుకుమార్.  ఆ తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం  బన్నీ. ఈ సినిమా కూడా మంచి కమర్షియల్ హిట్ అయింది. ఆ తర్వాత "హ్యాపీ" సినిమాతో అలరించాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన "దేశముదురు" అల్లు అర్జున్ కొత్త క్యారెక్టర్‌ను పరిచయం చేసింది. ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన దేశముదురు సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 

ఆ తరువాత వచ్చిన పరుగు, వేదం, రుద్రమదేవి వంటి సినిమాలలో నటించారు అల్లు అర్జున్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, సరైనోడు లాంటి వరుస హిట్ సినిమాలతో దూసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "పుష్ప" మూవీ ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది. త్వరలోనే పుష్ప-2 సినిమాతో మరోసారి అభిమానులను అలరించబోతున్నారు మన ఐకాన్ స్టార్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement