pushpa
-
పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) వివాహబంధంలో అడుగుపెట్టాడు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేశాడు. ఈ క్రమంలో తమ ఆత్మీయులకు, అభిమానులకు నూతన దంపతులు క్షమాపణ చెప్పారు. కర్ణాటకలోని మైసూరులో బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.పెళ్లి తంతు పూర్తి అయిన తర్వాత మీడియా పూర్వకంగా అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సోషల్‌మీడియా ద్వారా పలు విషయాలు పంచుకున్నారు. పెళ్లికి వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి వేడుకలు ఘనంగా జరగడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అభిమానులు, మీడియా, పోలీసు శాఖ ఇలా ఎంతో మంది కృషి చేశారు. వారందరికీ మా ఇద్దరి తరఫున ధన్యవాదాలు. మా పెళ్లి కోసం చాలామంది హాజరయ్యారు. దీంతో కొంతమంది మాపై అభిమానంతో ఫంక్షన్ హాలు వరకు వచ్చి కూడా లోపలికి రాలేకపోయారు. మీకు ఇబ్బంది కలిగించినందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము తప్పకుండా మరిన్ని మంచి విషయాలతో తిరిగి మిమ్మల్ని కలుస్తాము. పెద్ద మనుసుతో మమ్మల్ని ఆశీర్వదించండి.' అని ఆయన తెలిపారు.కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.ధనంజయ్ సతీమణి ధన్యత విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు. ధనంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్‌గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఒక విలాసవంతమైన సెట్‌ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం..డాలీ ధనుంజయ్‌కు మైసూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్‌లోనే జరిగాయి. అందుకే మైసూర్‌లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్‌గా నిలిచింది. -
పుష్ప విలన్ జాలిరెడ్డి పెళ్లి పనులు షురూ (ఫోటోలు)
-
పెళ్లికి సిద్ధమైన జాలిరెడ్డి.. గ్రాండ్‌గా వెడ్డింగ్ ప్లాన్
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు డాలీ ధనుంజయ్. సినిమాలో జాలిరెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ధనుంజయ్ ఈనెల ఓ ఇంటివాడు కానున్నారు. ఈనెల 15,16 తేదీల్లో డాలి ధనుంజయ్- ధన్యతను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ మైసూరులో జరగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ధనుంజయ. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.నటుడు డాలీ ధనంజయ్-ధన్యతల వివాహం మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. నటుడు ధనంజయ్‌కి ఇష్టమైన పట్టణం మైసూర్ . ఆ నగరంలోనే చిన్నప్పటి నుంచి చదువుకుని అక్కడే పెరిగారు. ఈ నేపథ్యంలో ధనంజయ్ తన పెళ్లి ప్లానింగ్స్ గురించి మాట్లాడారు. మైసూర్లో పెళ్లి చేసుకోవాలనేది నా కల.. ఎందుకంటే నా చదువు, సినీ రంగ ప్రవేశం అంతా మైసూరు నుంచే జరిగిందని వెల్లడించారు. మాత చాముండేశ్వరి అనుగ్రహం తనకు ఎప్పుడు ఉంటుందని ధనంజయ్ అన్నారు. అందుకే చాముండేశ్వరి దేవాలయం నమూనాలో పెళ్లి వేదికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు.ధనంజయ్ చేసుకోబోయే ధన్యత విషయానికొస్తే చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. గైనకాలజీలో ఈమె స్పెషలిస్ట్. వీళ్లిద్దరికీ చాలా క్రితం నుంచే పరిచయం. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమలో మారింగి. ఇప్పుడు పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. View this post on Instagram A post shared by Daali Dhananjaya (@dhananjaya_ka) -
'పుష్ప రెండో పార్ట్ రావడానికి ఆయనే కారణం'.. సుకుమార్ ఆసక్తికర కామెంట్స్
పుష్ప సినిమా గురించి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ ఈవెంట్‌కు హాజరైన ఆయన పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా పుష్ప మూవీని అసలు రెండు పార్టులు కాదని అన్నారు. ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయ్యేసరికి 3 గంటలు రావడంతోనే రిలీజ్ చేసినట్లు తెలిపారు. పుష్ప సినిమాకు జరిగిన మిరాకిల్ ఇదే అని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్‌కి రూ.1800 కోట్లు తీసుకు వచ్చింది చెర్రీగానే అని నవ్వుతూ మాట్లాడారు. ఇది నిజంగా సాహసమనే చెప్పాలి.. ఫస్ట్ హాఫ్‌ను పుష్పగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని సుకుమార్ వివరించారు. దీనికంతా చెర్రీనే కారణం.. ఒక్క సినిమాతో పోయేదానికి పుష్ప సిరీస్‌గా మార్చేశారు అని సరదాగా అన్నారు.సుకుమార్ మాట్లాడుతూ..' నా ఫస్ట్ ప్రేక్షకుడు చెర్రీగారే. ప్రతి సీన్‌ను గమనిస్తూ ఉంటారు. మైత్రి మూవీ మేకర్స్‌కి డబ్బులు వచ్చాయంటే కారణం ఆయనే. నిజానికి అందరూ అనుకున్నట్లు రెండు పార్టులు కాదు. మొదట పుష్ప అనుకున్నది ఒక్క సినిమానే. ఫస్ట్ హాఫ్ 3 గంటలు వచ్చిందని చెర్రీ అన్నారు. ముందు రిలీజ్ చేసేయండి చెప్పాడు. ఇదే పుష్ప సినిమాలో జరిగిన అద్భుతం. ఒక్క సినిమాతో పోయేదానికి మూడు పార్టులు చేయాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత చెర్రీ గారిదే' అని నవ్వుతూ అన్నారు. -
పుష్ప-2 రికార్డ్స్ బద్దలు కొడతా : యానిమల్ హీరో
-
‘పుష్ప-2’విలన్‌కి ఆ సమస్య.. భార్య ఏం చేసిందో తెలుసా?
మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) పుష్ప-2తో మంచి పేరు తెచ్చుకున్నాడు. మళయాళంలో హీరోగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించినప్పటికీ..ఈ చిత్రంతోనే ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయేలా చెరగని ముద్ర వేశాడు. అందుకు తన భార్యే కారణం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఫహాద్. ఆయన ఇటీవలే ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్(ADHD (Attention Deficit Hyperactivity Disorder))) సమస్య బారినపడ్డాడు. ఇలా భార్యభర్తల్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారినడితే ఒక్కసారిగా సంసారంలో గందగోళం ఏర్పడుతుంది. అయితే ఆ పరిస్థితి ఎదురవ్వకుండా తన భార్య తీసుకున్న అనుహ్యమైన నిర్ణయం తమ దాంపత్యం మరింత బలపడేలా చేసిందంటూ భార్య నజ్రియా నజీమ్(Nazriya)పై ప్రశంసల జల్లు కురిపించాడు. మరీ అర్థాంగికి అసలైన అర్థ ఇచ్చేలా ఫహద్ భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో చూద్దామా..నజ్రియా ప్రపోజ్ చేయడంతోనే..2014లో రూపొందిన మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్’ షూటింగ్లో కలుసుకున్న వీరు.. తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. కొన్ని నెలల పాటు రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. అదే ఏడాది పెళ్లితో ఒక్కటయ్యారు.అయితే ఈ ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది నజ్రియానే. బెంగళూరు డేస్ చిత్రం షూటింగ్‌లోనే ఓ రోజు నజ్రియానే ఫహద్ దగ్గరికి వచ్చి.. ‘నన్ను పెళ్లి చేసుకో.. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా..’ అని ప్రపోజ్ చేసింది. అది కొత్తగా అనిపించి వెంటనే అందుకు సమత్తం తెలిపాడు ఫహాద్. అలా ఈ ఇద్దరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది. అయితే ఫహద్ మాత్రం తన భార్యే ముందు ప్రపోజ్ చేసిందంటూ తెగ సంబరపడిపోతాడు. హాయిగా సాగిపోతున్న వీరి సంసారాన్ని చూసి విధి పరీక్ష పెట్టాలనుకుందో ఏమో..!. ‘ఫహద్‌కు గతేడాది ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ అయింది. ఓపికనే ఆయుధంగా..అయితే నజ్రియా గాబరాపడిపోలేదు. తన భర్త ఈ సమస్యలను అధిగమించేలా తగిన ప్రోత్సహాన్ని అందించింది తమ బంధాన్ని మరింత దృఢంగా చేసుకుంది. ఈ మానసిక సమస్య తనలో ఎప్పటి నుంచో ఉండొచ్చు. కానీ ఇప్పుడిలా బయటపడింది. అది తమ జీవితం భాగమైపోతుందే తప్ప కొత్తగా ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని ధీమగా చెబుతోంది నజ్రియా. "దానికి మా సంతోషాన్ని ఆవిరి చేసే అవకాశం ఇవ్వను. మరింతం అన్యోనంగా ఉండి..ఆ మానసిక పరిస్థితిని తరిమికొట్టేలా తన భర్తకు సహకరించి, ఓపిగ్గా వ్వవహరిస్తానంటోంది". నజ్రియా. అర్థాంగి అనే మాటకు అసలైన అర్థం ఇచ్చేలా నిలిచింది నజ్రియా. ప్రతి బంధకంలా ఎదురయ్యే పరిస్థితులను ఆకళింపు చేసుకుని తగిన విధంగా కొద్దిపాటి మార్పులు చేసుకుంటే బంధాలు విచ్ఛిన్నం కావని చేసి చూపించింది నజ్రియా. ఏడీహెచ్‌డీ అంటే..అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఈ సమస్యతో బాధపడే వ్యక్తికి శ్రద్ధ చూపడం, ఉద్రేకపూరిత ప్రవర్తనలను నియంత్రించడం, వారి ఆలోచనలను ట్రాక్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది ఆందోళన , డిప్రెషన్ లేదా ఇతర మానసిక అనారోగ్య లక్షణాల మాదిరిగానే ఉంటాయి .లక్షణాలు..అనూహ్య మానసిక కల్లోలం కలిగి ఉంటారుపనిలో నిర్లక్ష్యంఅవతలి వ్యక్తి మాట్లాడితే వినాలనిపించకపోవడంసూచనలను అనుసరించకపోవడం లేదా పనులను పూర్తి చేయకపోవడంకార్యకలాపాలను నిర్వహించ లేకపోవడంపనిలో నిరంతర మానసిక శ్రమను నివారించండిఅసహనంనిద్రలేమి వంటి సమస్యలుఅతిగా మాట్లాడటంనివారణ: కేవలం మానసిక నిపుణుల కౌన్సిలింగ్, ఇంట్లో వాళ్ల సహకారంతో దీన్నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: లక్షల వేతనాన్ని వద్దునుకుని సివిల్స్‌కి ప్రిపేరయ్యింది..కట్‌చేస్తే..!) -
IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్
బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా నయా సెన్సేషన్ నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించిన నితీశ్.. టెస్ట్‌ల్లో తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం నితీశ్ చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. You know the dialogue😉#Pushpa2 pic.twitter.com/Y9YESUCSKk— CricTracker (@Cricketracker) December 28, 2024మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీ మార్కును అందుకున్న నితీశ్.. తగ్గేదేలేదంటూ పుష్ప స్టయిల్(Pushpa Style Celebrations)లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నితీశ్ సెలబ్రేషన్స్‌కు క్రికెట్ అభిమానులు సహా సినీ ఫ్యాన్స్ కూడా ముగ్దులవుతున్నారు. నితీశ్ 'తగ్గేదేలే' సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కిన భారత్ 300 మార్కును దాటింది. నితీశ్.. వాషింగ్టన్ సుందర్‌తో (39) కలిసి ఎనిమిదో వికెట్‌కు అజేయమైన 103 పరుగులు జోడించి భారత్‌ను ఫాలో గండం నుంచి గట్టెక్కించాడు. ప్రస్తుతం నితీశ్ 80ల్లోకి (85 నాటౌట్) ప్రవేశించాడు. 96 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 324/7గా ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 150 పరుగులు వెనుకపడి ఉంది.భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, కమిన్స్ 2, లయోన్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 474 పరుగుల వద్ద ముగిసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (140) సెంచరీతో సత్తా చాటగా.. సామ్ కొన్‌స్టాస్ (60), ఖ్వాజా (57), లబూషేన్ (72), పాట్ కమిన్స్ (49), అలెక్స్ క్యారీ (31) రాణించారు. ట్రవిస్ హెడ్ (0), మిచెల్ మార్ష్ (4) విఫలమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా 3, ఆకాశ్‌దీప్ 2, సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
అల్లు అర్జున్ కేసులో పొలిటికల్ ఫైట్
-
జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సందర్బంగా సెక్యూరిటీ కారణాల రీత్యా.. అల్లు అర్జున్ వెనుక జైలు వేనుక గేటు నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి నుంచి కాసేపట్లో తన ఇంటికి బయలుదేరనున్నారు. మరోవైపు.. అల్లు అర్జున్ ఇంటి వద్దకు సినీ ప్రముఖ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. విడుదల సమయంలో లాయర్లతో పాటుగా అల్లు అరవింద్ కూడా జైలుకు వెళ్లారు. దగ్గరుండి అల్లు అర్జున్ను తన వెంట తీసుకొచ్చారు. ఇక, శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్‌తో పాటుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం సభ్యులు కూడా విడుదలయ్యారు. A1, A2తో పాటు A11.. ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.Vachestunnadu 🥺🙏pic.twitter.com/GbSVWaXVT6— Allu Arjun Taruvate Evadina (@AATEofficial) December 14, 2024 అంతకుముందు జరిగింది ఇదీ..పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు, గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతిచోటా భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది.రిమాండ్ ఖైదీ నంబర్ 7697తో.. అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయన శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్‌గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినా.. దానికి సంబంధించిన కాపీ రాత్రి వరకు కూడా ఆన్లైన్లో అప్లోడ్ కాలేదు. అల్లు అర్జున్ న్యాయవాదులు సరి్టఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చినా.. ఒరిజినల్ పత్రాలు కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు.రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది.. ఆపై మంజీరా బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10.30 గంటల వరకు చంచల్‌గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకువెళ్లాలని భావించారు. కానీ బాధగా ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకుని తన ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమ అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసన తెలిపారు.ఎప్పుడేం జరిగిందీ..ఉదయం 11.45: అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు మధ్యాహ్నం 12: అరెస్టు చేస్తున్నట్టు అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు 12.20: జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు 12.40: చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్ రాజు, ఇతర ప్రముఖులు 1.00: చిక్కపడపల్లి ఠాణాకు అల్లు అర్జున్‌తో చేరుకున్న పోలీసులు 1.10: పోలీసుస్టేషన్ వద్దకు అల్లు శిరీష్, అరవింద్ 1.15: రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి 2.00: వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు 2.19: అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు 2.30: అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిరంజీవి, ఆయన భార్య సురేఖ 2.45: అల్లు అర్జున్‌కు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి 3.10: నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్.. లాయర్ల వాదనలు 5.00: అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధింపు 5.28: చంచల్‌గూడ జైలుకు అల్లు అర్జున్ తరలింపు 5.40: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు 7.15: బెయిల్ పేపర్లతో చంచల్‌గూడ జైలుకు చేరుకున్న లాయర్లు 7.30: ఆ పత్రాలు సక్రమంగా లేకపోవడం, ఆర్డర్ ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో జైల్లోనే బన్ని 10.00: జైలు రిసెప్షన్ నుంచి మంజీరా బ్యారక్‌కు అల్లు అర్జున్ -
పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ఫిట్నెస్ సీక్రెట్ ..!
ప్రస్తుతం దేశమంతా పుష్ప 2 ఫీవరే నడుస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డుని సృష్టించి బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ప్రభాస్‌ల పేరు మీదున్న రికార్డుని బ్రేక్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీలో ఆయన డైలాగులు, ఆహార్యం, ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. స్టైలిష్ స్టార్ స్టెప్పులు, ఫిజికల్ అపీరియన్స్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. ముఖ్యంగా హై ఎనర్జీతో కూడిన పెర్ఫార్మెన్స్కి ఎవ్వరైనా.. ముగ్గులైపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన నటన. మరి చూడటానికి ఆకర్షణీయంగా, ఆజానుబాహుడిలా ఉండే మన పుష్ప2 హీరో ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా..!పుష్ప మూవీలో డైలాగ్ మాదిరిగా.. "అల్లు అర్జున్ డైట్ అంటే నార్మల్ అనుకుంటివా అత్యంత హెల్తీ". ఆయన చెప్పే డైలాగులు..స్టెప్పులు అత్యంత వేగంగా ఉంటాయి. ప్రేక్షకుడిని అటెన్షన్‌తో వినేలా చేస్తాయి. అంతలా శక్తిమంతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే మంచి ఆరోగ్యకరమైన డైట్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. అందుకోసం హీరో అల్లు అర్జున్ ఈ ఎనిమిది చిట్కాలను తప్పనిసరిగా పాటిస్తారట. అవేంటంటే..బన్నీ రోజు.. వ్యాయామాలు, వర్కౌట్లతోనే ప్రారంభమవుతుందట. అందువల్ల ఉదయాన్నే హై ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌నే తీసుకుంటారట. దీని కారణంగానే ఆయన రోజంతా చురుకుగా ఉంటారుతప్పనిసరిగా అల్పాహారంలో గుడ్లు ఉండాల్సిందేనట. కండలు తిరిగిన దేహానికి అవసరమైన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ఇవి కండరాలను బలోపతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.ఇక లంచ్‌లో తప్పనిసరిగా గ్రిల్డ్ చికెన్ ఉండాల్సిందే. దీనిలోని లీన్ ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి, జీవక్రియను పెంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఆకుపచ్చని కూరగాయలను కూడా డైట్లో చేర్చకుంటారు. దీనిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, చర్మ సంరక్షణకు, మెరుగైన జీర్ణక్రియకు దోహదపడతాయి. హైడ్రేటెడ్‌గా ఉండేలా ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్లు, షేక్‌లు కూడా తీసుకుంటారు. దీని ద్వారా శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్లు అందుతాయి. డిన్నర్ దగ్గరకి వచ్చేటప్పటికీ చాలా తేలికైన ఆహారమే తీసుకుంటారు. బ్రౌన్‌రైస్, కార్న్, గ్రీన్ రైస్ , సలాడ్లు ఉండేలా చూసుకుంటారు. చివరగా అల్లు అర్జున్‌లా మంచి పిట్‌నెస్‌తో ఉండాలంటే..వ్యాయమాలను స్కిప్ చేసే ధోరణి ఉండకూడదు. సమతుల్యమైన డైట్‌ని తీసుకోవాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలతోపాటు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యం నిబద్ధతతో ఫిట్నెస్ లక్ష్యాన్ని చేరుకునేలా డైట్‌ని అనుసరిస్తే.. పుష్ప హీరోలాంటి లుక్‌ని ఈజీగా సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు.(చదవండి: ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?) -
'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?
'పుష్ప 2' సినిమా ఒకటి రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లే టికెట్ సేల్స్, ఫ్యాన్స్ హడావుడి గట్టిగానే ఉంది. మరోవైపు 'పుష్ప 3' ఉంటుందా లేదా అనే విషయమై చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ ఫొటో అభిమానుల్ని ఇంకాస్త కన్ఫ్యూజన్ చేస్తోంది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)కొన్నిరోజుల క్రితం 'పుష్ప 3' ఉండొచ్చనే రూమర్స్ వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ మీ హీరో మరో మూడేళ్లు ఇస్తే పార్ట్-3 చేస్తానని బన్నీ ఫ్యాన్స్‌తో అన్నాడు. అంటే చూచాయిగా లేదని చెప్పాడు. ఒకవేళ చేయాలన్నా సరే ఇప్పట్లో అయితే కష్టం. ఎందుకంటే సుకుమార్.. నెక్స్ట్ రామ్ చరణ్‌తో పనిచేస్తాడు. బన్నీ కోసం త్రివిక్రమ్ వెయిటింగ్.ఇలా మూడో పార్ట్‌పై ఎవరి సందేహాలు వాళ్లకు ఉన్నాయి. ఇంతలో మూవీకి సౌండ్ ఇంజినీర్‌గా చేసిన రసూల్ పొకుట్టి తాజాగా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాకపోతే వెనక స్క్రీన్‌పై మాత్రం 'పుష్ప 3: ద ర్యాంపేజ్' అని ఉంది. ప్రస్తుతానికి మూడో భాగం గురించి కార్డ్ అయితే వేసేస్తారు కానీ ఇప్పట్లో అయితే చేయకపోవచ్చు అని తెలుస్తోంది. ఒకవేళ చేసినా సరే మరో మూడేళ్లు అంటే కష్టమేగా!(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) -
పుష్ప.. మేక్ ఇన్ ఇండియా.. తగ్గేదే లే.. ఇంతకీ కథ ఎలా పుట్టిందంటే..
బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినిమా గురించి చర్చ సుకుమార్-అల్లు అర్జున్‌ల ‘పుష్ప’తోనే నడిచింది. దాదాపు 70 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎట్టకేలకు ఓ తెలుగు నటుడిని వరించింది ఈ చిత్రంతోనే. మూడేళ్ల కిందట వచ్చిన ఈ చిత్ర మొదటి భాగం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే ఇప్పుడు రెండో భాగం భారీ అంచనాల నడుమ ఆరు భాషల్లో.. 12వేలకు పైగా స్క్రీన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ మేనియా నడుమే అసలు పుష్పగాడి కథ ఎలా పుట్టిందో ఓసారి గుర్తు చేసుకుందాం. పుష్పరాజ్.. తన ఇంటిపేరును కూడా చెప్పుకోలేని స్టేజ్‌లో అవమానాలు ఎదుర్కొనే ఓ మొరటు యువకుడు. అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ‘నీ యవ్వ.. తగ్గేదే లే’’ అంటాడు. ఓనర్ ముందే ఇస్టయిల్‌గా కుర్చీలో కూర్చుని ఆ ఉద్యోగానికి కాలదన్ని మరీ ఎర్ర చందనం ముఠాలో చేరతాడు. అడవిలో స్మగ్లింగ్ కోసం కూలీగా వెళ్లి.. క్రమక్రమంగా శత్రువుల్ని పెంచుకుంటూ ఆ మాఫియాకి కింగ్‌గా ఎలా ఎదిగాడన్నది పుష్ప ది రైజ్ కథ. ఈ మధ్యలో తల్లి పార్వతమ్మ, సవతి అన్న ఫ్యామిలీ సెంటిమెంట్.. దానికి సమాంతరంగానే శ్రీవల్లితో ప్రేమాయణం కూడా నడుస్తుంది. ఆఖర్లో షెకావత్ సర్‌తో నడిచే బ్రాండ్ ట్రాక్‌తో కథకు కొనసాగింపుగా పుష్పగాడి పెళ్లిలోనే ‘‘శుభం కార్డు’’ పడుతుంది. మొదటిపార్ట్‌లో పుట్టుకొచ్చిన ఎనిమీస్ మధ్యే పుష్పగాడి రూల్ ఎలా నడుస్తుందనే దానితో సుకుమార్ రెండో పార్ట్‌ను చూపించబోతున్నారు!. అయితే..👉పుష్ప కథ, కాస్టింగ్ దగ్గరి నుంచి.. చాలా విషయాల్లో దర్శకుడు సుకుమార్ అనుకున్నది అనుకున్నట్లు జరగలేదు!. దశాబ్దాల కిందట ఏపీలో జరిగిన వాస్తవ ఘటనల స్ఫూర్తితో పుష్ప కథను రాసుకున్నాడు సుక్కూ. ఆయన దానిని ఓ వెబ్ సిరీస్‌గా తీయాలని భావించాడు. కానీ, ఆ తర్వాత ఎందుకనో నిర్ణయం మార్చుకుని ఫీచర్ ఫిల్మ్ వైపు మొగ్గు చూపాడు. 👉ఈ కథతో ఓ అగ్రహీరోను సంప్రదిస్తే.. ఆయన సై అన్నాడు. ప్రాజెక్టు ప్రారంభ పనుల్లోనూ ఆ హీరో సుక్కూతో కలిసి పాలుపంచుకున్నాడు. తీరా.. అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుకోగా.. తాను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడే హీరో అల్లు అర్జున్ దగ్గరకే ఆ కథ చేరింది. అయితే ఆ స్టార్ హీరోతో తీయాలనుకున్న కథ వేరైనా.. బ్యాక్‌డ్రాప్ మాత్రం ఇదేనని సుకుమార్ తర్వాత క్లారిటీ ఇచ్చారు కూడా.👉కాస్టింగ్‌లో విషయంలోనూ సుక్కూ లెక్క తప్పింది. కీలక పాత్రలకు అనుకున్నవాళ్లతో కాకుండా వేరే వాళ్లను ఎంచుకోవాల్సి వచ్చింది. మైత్రి మేకర్స్ సుకుమార్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేసింది 2019 జులైలో. అదే ఏడాది దసరాకు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని ప్రకటించింది. ఈలోపు అయితే అది కాస్త ఆలస్యమై.. అక్టోబర్ 30వ తేదీన కొంతమంది కాస్టింగ్‌తో పూజా కార్యక్రమం ద్వారా ముహూర్తం షాట్‌తో లాంఛనంగా ప్రారంభమైంది. 👉ఇక రెగ్యులర్ షెడ్యూల్‌ను అదే ఏడాదిలో కేరళలో యాక్షన్ షూట్‌తో ప్రారంభించాలనుకున్నప్పటికీ.. అప్పటికే అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో ఉండడంతో ఆలస్యమైంది. ఆపై 2020 మార్చ్‌లో కేరళ షెడ్యూల్‌తో షూటింగ్ మొదలుకావాల్సింది.కానీ, కరోనాతో సినిమాకు అడ్డుపడింది. అక్కడి నుంచి పుష్పకు సినిమా కష్టాలే నడిచాయి.👉2020 ఏప్రిల్ 8వ తేదీ.. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రగ్డ్ లుక్‌తో పుష్ప ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి హాట్ టాపిక్‌గా మారింది.First Look and the Title of my next movie “ P U S H P A “ . Directed by dearest Sukumar garu . Music by dearest friend @ThisIsDSP . Really excited about this one. Hoping all of you like it . @iamRashmika @MythriOfficial #MuttamsettyMedia pic.twitter.com/G8ElmLKqUq— Allu Arjun (@alluarjun) April 8, 2020👉అయితే చిత్ర షూటింగ్ ఏరకంగానూ మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కరోనా పరిస్థితులే అందుకు కారణం. ఆంక్షల కారణంగా లిమిట్ మెంబర్స్‌తో.. ముందుగా అనుకున్న లోకేషన్లలో కాకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో షూట్ కానిచ్చారు. ఏపీ, తమిళనాడు అటవీ ప్రాంతంలో 200 రోజులు షూటింగ్ జరుపుకోవడం, అదీ కరోనా లాంటి టైంలో.. మాములు విషయం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. 👉కరోనాతో కుదేలైన రంగాల్లో చలన చిత్ర రంగం కూడా ఉంది. షూటింగ్‌లు లేక వేల మంది టెక్నీషియన్లకు ఉపాధి లేకుండా పోయింది. ఆ టైంలో ధైర్యంగా షూటింగ్‌తో ‘పుష్ప’ ఎంతో మందికి ఆసరాగా నిలబడింది. అంతేకాదు విదేశీ టెక్నిషియన్లను ప్రాధాన్యత ఇస్తున్న టైంలో.. స్వదేశీ వాళ్లకు అవకాశం ఇవ్వాలని మేకర్లు భావించారు. అలా కరోనా టైంలో ప్యూర్ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రాజెక్టుగానూ పుష్ప ది రైజ్ గుర్తింపు దక్కించుకుంది. 👉కరోనా వైరస్ టైంలో అష్టకష్టాలు పడినా రిలీజ్ విషయంలోనూ అనుకున్నది జరగలేదు. 2021 పంద్రాగష్టు వారంలో విడుదల చేయాలనుకుంటే.. అది కాస్త డిసెంబర్ 17కి చేరింది. పుష్ప ది రైజ్ లాంటి సినిమా తీయడం అసమాన విషయం. నా ఒక్కడికే కాదు రెండేళ్లపాటు ఈ చిత్రం కోసం పని చేసిన వాళ్లందరికీ ఇది నాలుగు చిత్రాలతో సమానం. ::: పుష్ప ప్రమోషన్లో అల్లు అర్జున్ 👉2021 డిసెంబర్లో అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అయ్యింది పుష్ప ది రైజ్. అయితే.. రిలీజ్ అయ్యాక తెలుగులో మిక్స్డ్ రివ్యూస్ రాబట్టింది. కానీ, హిందీతో పాటు మిగతా భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.👉ముఖ్యంగా డీఎస్పీ అందించిన పాటలు.. అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యి గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్ అయ్యాయి. సెలబ్రిటీలు సైతం ఆ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు. బన్నీ స్టెప్పులు రీల్స్ రూపంలో సోషల్ మీడియాతో పాపులారిటీ సంపాదించుకున్నాయి. ఇంకోవైపు.. ‘‘తగ్గేదే లే’’, ‘‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు”లాంటి డైలాగులు పొలిటికల్ గానూ ఒక ఊపు ఉపడం గమనార్హం. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31)#PushpaCelebrityFanatics" Now a days, all around everyone discussing about one film #Pushpa " ❤️🔥When Defence Minister of India @rajnathsingh ji mentioned about Pushpa euphoria & dialogue. This shows to what extent the reach & impact @alluarjun made 🙏💥 pic.twitter.com/Cuu1K0TXnX— Ghouse Allu Arjun fans Wgl (@AlluWgl) October 23, 2024👉సుకుమార్ ‘పుష్ప ది రైజ్’.. 2022లో రష్యన్ భాషలో డబ్ అయ్యి అక్కడి థియేటర్లలో సందడి చేసింది. అంతేకాదు అదే ఏడాది మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ‘‘బ్లాక్‌బస్టర్ హిట్స్ ఫ్రమ్ ఎరౌండ్ ది వరల్డ్’’ కేటగిరీలో ప్రదర్శితమైంది. అలా పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసుకుంది.👉హిందీలో పుష్ప కేరక్టర్‌కు డబ్బింగ్ చెప్పింది నటుడు శ్రేయాస్ తల్పడే. తమిళంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కేపీ శేఖర్ చెప్పారు. ఇక మలయాళంలో అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు నుంచి మలయాళంలో డబ్ అయ్యే ఆయన ప్రతీ చిత్రానికి ఫిల్మ్ మేకర్ జిస్ జాయ్ వాయిస్ ఇస్తున్నారు. పుష్పకి కూడా ఆయనే డబ్ చెప్పారు. 👉షెకావత్ కేరక్టర్‌కు ఒక్క హిందీలో తప్ప(రాజేష్ ఖట్టర్) మిగతా అన్ని భాషల్లో ఫహద్ ఫాజిల్ సొంత వాయిస్ ఇచ్చుకున్నారు. ఈ కేరక్టర్‌కు సుకుమార్ మొదట బెంగాలీ నటుడు ‘జిషు సేన్ గుప్తా’(భీష్మ ఫేం) అనుకున్నారు. ఆ తర్వాత కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని తీసుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో.. విక్రమ్, మాధవన్, ఆర్య, బాబీ సింహా ఇలా పలువురి పేర్లను పరిశీలించారు. చివరకు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌తో సుకుమార్ ఫిక్స్ అయ్యారు.:: వెబ్ డెస్క్ ప్రత్యేకం -
'పుష్ప'లో ఈ పాత్రలను వదులుకున్న స్టార్స్ ఎవరెవరో తెలుసా..?
-
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ శుక్రవారమే థియేటర్లలో పుష్ప..!
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం పుష్ప 2 ది రూల్. ఇటీవల ట్రైలర్ రిలీజ్ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడు లేని రికార్డులు సృష్టస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఓవర్సీస్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.అయితే పుష్ప 2 రిలీజ్‌కు కొద్ది రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా పుష్ప ది రైజ్ పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ టెలీ ఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. హిందీ వర్షన్‌ను ఈ నెల 22న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నార్త్‌లో మార్కెట్‌ను మరింత పెంచుకునే ఆలోచనతో మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగే దక్షిణాది భాషల్లోనూ రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు యూఎస్‌లో పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించారు. #Pushpa - The Rise (Hindi) Re-Releasing In Cinemas on 22nd Nov 2024@alluarjun @iamRashmika @GTelefilms #PushpaTheRise #AlluArjun #RashmikaMandanna #PushpaReReleaseInCinemas pic.twitter.com/vrdSQCGqKg— Goldmines Telefilms (@GTelefilms) November 19, 2024 #PushpaTheRise USA RE RELEASE Bookings started to open 💥🪓#Pushpa2TheRule pic.twitter.com/owcQvwbF5z— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 16, 2024 #PushpaTheRise Re-Release bookings are now open at @Cinemark 💥💥🪓🪓Grab your tickets today with TUESDAY discount offers and relive the PUSHPA mania before the storm of #Pushpa2TheRule begins! 💥💥@alluarjun #Sukumar @MythriOfficial @PushpaMovie pic.twitter.com/a4UUkrBGfB— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 18, 2024 -
పుష్ప 2 ట్రైలర్ పై భారీ అంచనాలు..
-
డాక్టర్‌తో 'పుష్ప' విలన్ ధనంజయ నిశ్చితార్థం (ఫొటోలు)
-
పుష్ప సాంగ్‌కు డ్యాన్స్ చేసిన స్టార్ హీరోలు.. వీడియో వైరల్!
ఐఫా-2024 అవార్డుల వేడుక అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో సినీతారలంతా సందడి చేస్తున్నారు. సౌత్‌తో పాటు బాలీవుడ్ అగ్ర సినీతారలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే ఈవెంట్లో హోస్ట్‌లుగా వ్యవహరించిన బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ సందడి చేశారు. వేదికపై స్టెప్పులు వేస్తూ అభిమానులను అలరించారు.అయితే వేదికపై వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్ పుష్ప సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అనే ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులతో అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: నేను మాట్లాడింది ప్రభాస్ గురించి కాదు.. జోకర్ కామెంట్స్‌పై క్లారిటీ!)కాగా.. ఈ అవార్డ్స్ వేడుకల్లో షారూఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఈ అవార్డ్ దక్కించుకున్నారు. సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సెప్టెంబర్ 27న అబుదాబిలో ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ వేడుకల్లో సమంతా రూత్ ప్రభు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ సందడి చేశారు. Yeh tho asli FIRE hey 🔥🔥KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024 -
హ్యాండ్ ఇస్తున్న డైరెక్టర్స్ కన్ఫ్యూజన్ లో అల్లు అర్జున్
-
గురూజీ కి బన్నీ షాక్..! సినిమా లేనట్టేనా..
-
లీవ్ అడిగిన పాపానికి..
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణి లావణ్య, సిబ్బంది నడుమ వివాదం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. దీంతో అటెండర్ పుష్ప, ల్యాబ్ టెక్నీషియన్ నీరజ మంగళవారం వైద్యాధికారిణి లావణ్యపై శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనారోగ్య కారణాలతో లీవ్ కోసం అటెండర్ పుష్ప విన్నవించుకోగా పట్టించుకోక పోవడంతో తన భర్త ద్వారా టెలిఫోన్లో వైద్యాధికారిణిని మరోమారు విన్నవించే ప్రయత్నం చేశారు. అయితే అటెండర్ పుష్ప వ్యక్తిగత విషయాల గురించి ఆమె భర్తకు వైద్యాధికారిణి లావణ్య చెడుగా చెప్పడంతో కుటుంబంలో వివాదం తలెత్తింది. దీంతో మూడు రోజుల క్రితం పుష్ప భర్త, భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకు పంపేశాడు. ఈ విషయమై ఆధారాలతో సహా పోలీసులకు అందజేసి న్యాయం కోసం అటెండర్ పుష్ప ఫిర్యాదు చేసింది. అలాగే హాస్పిటల్‌లోని ల్యాబ్ టెక్నీషియన్ నీరజతో కూడా దురుసుగా ప్రవర్తించడం, తరచూ విధుల నిర్వహణలో తన పట్ల భేదాభిప్రాయంతో వ్యవహరిస్తోందని, వీరిద్దరూ శ్రీసిటీ పోలీస్ స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ గౌస్‌పీర్‌ను వివరణ కోరగా పీహెచ్సీ డాక్టర్‌పై రెండు ఫిర్యాదులు అందాయని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పుష్ప-2 తో పాటు పుష్ప-3
-
కుటుంబ సభ్యులు వద్దని చెప్పినా ఆ పాటలో నటించాను: సమంత
తమిళసినిమా: వృత్తిపరంగానే కాదు, వ్యక్తిగతంగానూ నటి సమంత ఒక సంచలనమే. మొదట్లో తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించినా, తెలుగులో నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే సక్సెస్ ఆమె నట జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత తెలుగులో స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు వరుస కట్టడంతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. ఆ తరువాత తమిళంలో విజయ్, సూర్య, విశాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. అలా తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ వివాహ జీవితం ఎక్కువ కాలం సాగలేదు. అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. ఈ విషయాన్ని పక్కన పెడితే సమంత ఐటమ్ సాంగ్ చేసిన చిత్రం పుష్ప. అల్లుఅర్జున్ , రషి్మక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం 2022లో విడుదలై ఎంత సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయంలో సమంత నటించిన ఊ అంటావా మామ పాటకు అధిక భాగమే ఉంది. ఆ పాటలో సమంత శృంగార భరిత నటన యువతను గిలిగింతలు పెట్టించింది. ఆ పాటకు డాన్స్ చేయడానికి సమంతకు రూ. 5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబసభ్యులు,స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. అందులో ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని, అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించవద్దని కుటుంబసభ్యులు, సన్నిహితులు చెప్పారన్నారు. అయితే తాను వారి వ్యతిరేకతను మీరి ఆ పాటలో నటించానని పేర్కొన్నారు. ఆ పాట పెద్ద టర్నింగ్ గా మారిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. నిజం చెప్పాలంటే ఆ అవకాశాన్ని కాదనడానికి తన వద్ద సరైన కారణం లేదన్నారు. అలాంటప్పుడు ఎందుకు దాన్ని నిరాకరించాలి, తానే తప్పు చేయలేదు అని అన్నారు. వివాహా జీవితంలోనూ తాను వంద శాతం నిజాయితీగా ఉన్నానని చెప్పారు. అయితే అది తనకు వర్కౌట్ కాలేదని అన్నారు. సమంత చెప్పిన ఈ విషయం పాతదే అయినా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా మైయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ఖుషీ చిత్రం తరువాత మరో చిత్రం నటించలేదు. కాగా సమంత ఇప్పుడు తన సొంత నిర్మాణంలో చిత్రం చేసి తన మార్కెట్‌ను తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ట్రెండింగ్‌లోనే ఉన్నారు. -
ఆయన వల్లే ఇక్కడున్నా.. పుష్ప-2 విషయంలో బాధలేదు: అజయ్ ఘోష్
అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 15 థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ విపరీతమైన స్పందన వస్తోంది.అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు అజయ్ ఘోష్ కీలక పాత్ర పోషించారు. కొండారెడ్డి పాత్రలో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పుష్ప-2లో తాను లేకపోవడంపై స్పందించారు. సుకుమార్ తన జీవితాన్ని మార్చారని అన్నారు. తన కెరీర్ అయిపోయిందనుకున్న దశలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని తెలిపారు.అజయ్ ఘోష్ మాట్లాడుతూ..' నా దృష్టిలో సుకుమార్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు. నేనేంటో తెలిసేలా చేసిన గురువు. కరోనా బారిన పడినప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా. పుష్పలో నటించేందుకు సుకుమార్ అడిగితే నా వల్ల కాదని చెప్పా. అయినా ఆయన వదల్లేదు. చాలాసేపు మాట్లాడి ఒప్పించారు. ఆయన మోటివేషన్‌తోనే నటనకు సిద్ధమయ్యా. పుష్ప-2లో నటించకపోవడంపై నాకే లాంటి బాధలేదు. నా కోసం మరో అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తారు సుకుమార్.' అని అన్నారు. కాగా..శివ పాలడుగు దర్శకత్వంలో మ్యూజిక్ షాప్ మూర్తి ఈ నెల 14న థియేటర్లో రిలీజ్ కానుంది. -
Sooseki Song: అదిరిపోయిన ‘కపుల్ సాంగ్’
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ‘పుష్ప పుష్ప పుష్ప..’ సాంగ్ విడుదలై సూపర్ డూపర్ హిట్టయింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ సాగే ఈ పాటకి ఆస్కార్ అవార్డు గ్రహిత చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శ్రేయ ఘోషాల్ అద్భుతంగా ఆలపించింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కి జోడిగా రష్మిక నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
పుష్ప సాంగ్ క్రేజ్.. వారి స్టెప్పులకు సమంత ఫిదా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఫుష్ప. ఈ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 కూడా రాబోతోంది. అయితే పుష్పలో సమంత ఐటమ్ సాంగ్‌కు స్టెప్పులేయని వారు ఉండరు. ఈ సినిమా వచ్చి రెండేళ్లు పూర్తయినా ఆ సాంగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే సాంగ్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే తాజాగా ముగ్గురు చిన్నారులు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సుకుమార్ భార్య తబిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన సమంత చిన్నారుల డ్యాన్స్‌కు ఫిదా అయిపోయింది. అంతే కాకుండా తగ్గేదేలే అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో చూశాక నేను ఇంకాస్తా బెటర్‌గా చేయాల్సిందని ఫన్నీ ఎమోజీతో పాటు లవ్ సింబల్ జత చేసింది. ప్రస్తుతం సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సమంత ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో కనిపించనుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. -
ఐపీఎల్లో సన్‌రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
లైసెన్స్‌కు అప్లై చేసిన బన్నీ.. అందుకోసమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో సందడి చేశారు, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు తీసుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్‌లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లైసెన్స్ అప్లై చేయడం చూస్తే త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు. -
'నేను అందంగా లేనని తెలుసు'.. సమంత షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది యశోద మూవీతో మెప్పించిన సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఆ తర్వాత కోలుకుంది. ఇప్పుడిప్పుడే తన మళ్లీ రీస్టార్ట్ అవుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్యను పెళ్లాడిన ముద్దుగుమ్మ ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సమంత ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండియా టుడే కాన్క్లేవ్ -2024లో పాల్గొన్న సామ్ తాను అందంగా.. ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించడం కూడా లేదని వెల్లడించింది. అంతే కాకుండా పుష్ప చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడంపై సమంత మాట్లాడింది. సమంత మాట్లాడుతూ... 'రాజీ (ఫ్యామిలీ మ్యాన్-2) చేయడం లాంటిదే ఇలాంటి నిర్ణయం. మీ చుట్టూ మంచి వ్యక్తులు లేకపోతే.. మన అభిప్రాయాలను గౌరవించుకోవడం మంచి విషయంగా భావిస్తున్నా. మరో వైపు నేను తప్పులు చేయాలి.. వాటి నుంచి నేర్చుకోవాలి. అలాగే నా గట్స్‌ను పెంచుకోవాలి. పుష్ప చిత్రంలో ఊ అంటావా.. అనే సాంగ్ చేయాలనే నిర్ణయం నాదే. నేను ఒక నటిగా ఆ కోణాన్ని అన్వేషించాల్సి సమయం వచ్చిందని' తెలిపింది. ఆ తర్వాత తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ.. 'నా జీవితంలో ఎప్పుడూ చాలా అసౌకర్యంగా ఉంటా. ఆ విషయంలో నాపై నాకు పూర్తి నమ్మకంగా లేను. నేను అందంగా లేను అనే భావన ఉంది. అంతే కాదు ఇతర అమ్మాయిల్లాగా కూడా కనిపించను" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సెక్సీ అనే పదం తనకు సెట్ కాదని తెలిపింది. కాగా.. సమంత చివరిసారిగా ఖుషి చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో కలిసి స్పై సిరీస్ సిటాడెల్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. -
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు బన్నీ
-
బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అల్లు అర్జున్.. అసలు విషయం ఇదా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడం వెనుక ఏమైనా సీక్రెట్ ఉందా అంటూ పలు ప్రశ్నలు వస్తున్నాయి. వాస్తవంగా పుష్ప 2 షూటింగ్ పూర్తి అయ్యే వరకు అల్లు అర్జున్, సుకుమార్ విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కానీ ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ జర్మనీకి వెళ్లి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంతటి బిజీ షెడ్యూల్లో ఆయన జర్మనీ వెళ్లి అక్కడ పుష్ప పార్ట్ 1 చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ నుంచి విరామం తీసుకొని నిర్మాత మైత్రి రవిశంకర్‌తో కలిసి జర్మనీలోని బెర్లిన్‌కు వెళ్లడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వారు వెళ్లింది పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ స్థాయిలో ఉన్న సినీ ప్రేక్షకులకు పుష్పగాడిని పరిచయం చేయాలని వెళ్లినట్లు తెలుస్తోంది. 74వ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో పుష్పను ప్రదర్శించడం ద్వారా, వారు యూరప్ దేశాల నుంచి డిస్ట్రిబ్యూటర్లను పొందేందుకు అవకాశం దక్కుతుందని ప్లాన్ వేశారట. అక్కడ సొంత భాషలలో పుష్ప 2 చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఈ వేడుక ద్వార అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ను కొనుగొని పుష్ప చిత్రాన్ని పంపిణీ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో పుష్ప టీమ్ పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్లుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బాహుబలి వంటి చిత్రాలు ఇతర దేశాల్లో సత్తా చాటాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేశాడని చెప్పవచ్చు. అన్నీ అనుకూలిస్తే ఇతర దేశాల్లో పుష్పగాడు దుమ్మురేపడం ఖాయం అని చెప్పవచ్చు. పుష్ప 2 చిత్రం భారతదేశంలోనే 4-5 భాషలలో విడుదల కానుంది, ఈసారి, దర్శకుడు సుకుమార్ అనేక ఇతర భాషలలో కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకుంటున్నారు. పుష్ప రష్యన్ వెర్షన్ అంత గొప్పగా ఆడలేదు కానీ ఇప్పుడు పుష్ప 2 ద్వారా పక్కా ప్లాన్‌తో ఇతర దేశాల్లో ఎంట్రీ ఇవ్వాలని మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. -
పుష్ప- 3 గురించి అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
జర్మనీలో జరిగిన ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 (గురువారం) నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరుగుతున్న 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన కూడా భాగం అయ్యారు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం అంతర్జాతీయ స్థాయికి చేరకుంది. భారత్‌లో ఇప్పటికే ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రతిష్టాత్మక బెర్లిన్ ఫెస్టివల్లోనూ సందడి చేసింది. ఈ ఫెస్టివల్లో ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌లతో అల్లు అర్జున్ కొంత సమయం పాటు చర్చించారు. ఆపై భారతీయ సినిమా ప్రాముఖ్యత, చరిత్ర గురించిన పలు అంశాలపై అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ క్రమంలో పుష్ప పార్ట్ -3 గురించి బన్నీ కామెంట్ చేశారు. అన్నీ అనుకూలిస్తే పుష్ప 3 కూడా ఉండొచ్చు. పుష్ప సినిమాను ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. రెండో భాగం విడుదలయ్యాక పార్ట్- 3 గురించి ప్రకటన రావచ్చని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటకే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్లతో సినిమాను ఒప్పుకున్నారు. బోయపాటి శ్రీనుతో కూడా ఒక ప్రాజెక్ట్ చేయనున్నారని టాక్ ఉంది. ఇలాంటి సమయంలో పుష్ప-3 రావడం అంత సులభం కాదని చెప్పవచ్చు. పుష్ప సినిమాలో రష్మికా మందన్నాతో పాటు ఫాహద్ ఫాజిల్ రోల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు నిర్మిస్తున్న పుష్ప పార్ట్ -2 ఆగస్టు 15న విడుదల కానుంది. -
శ్రీవల్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో అగ్రస్థానం!
ఇటీవలే యానిమల్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తాజాగా ఈ కన్నడ భామ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ఫోర్బ్స్ ఇండియా- 30- అండర్- 30 జాబితాలో స్థానం సంపాదించుకుంది. కాగా.. ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇవాళ విడుదల చేసిన జాబితా 30 ఏళ్లలోపు ఉన్నవారిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసింది. ఈ లిస్ట్‌లో రష్మిక నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ సరసన పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. Gratitude.. 🤍#Forbes30under30 pic.twitter.com/u0YliOF0g9 — Rashmika Mandanna (@iamRashmika) February 15, 2024 -
పుష్ప పార్ట్ 3 సుకుమార్ ప్లాన్ ఏంటి..?
-
'పుష్ప' సినిమాకు మూడో పార్ట్? వర్కౌట్ అయ్యే పనేనా?
అల్లు అర్జున్ పేరు చెప్పగానే ఇప్పుడు చాలామందికి 'పుష్ప'నే గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అంతా బాగుందనకునేలోపు ఏకంగా మూడో పార్ట్ కూడా ఉందని తెగ మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఉంటే ప్లస్సులు మైనస్సులు ఏంటి? ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ అనే ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి హీరో కూడా తమ తమ సినిమాలకు సీక్వెల్స్‌ని రెడీ చేస్తున్నారు. 'పుష్ప'కి కూడా సీక్వెల్ ఉంటుందని తొలి భాగం రిలీజైనప్పుడే ప్రకటించారు. ఇప్పుడు మూడో భాగమని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌ని 2021లో డిసెంబరులో థియేటర్లలోకి తీసుకురాగా.. సీక్వెల్ మాత్రం 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. అంటే ఒక్క సినిమా తీయడానికి దాదాపు మూడేళ్లు పట్టేసింది. ఇక సీక్వెల్ అంటే మరో రెండు మూడేళ్లయినా పట్టేయొచ్చు. (ఇదీ చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ హీరో?) అలానే అల్లు అర్జున్, సుకుమార్‌కి 'పుష్ప 2' కాకుండా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. బన్నీ కోసం త్రివిక్రమ్, అట్లీ లాంటి డైరెక్టర్స్ లైనులో ఉన్నారు. అలానే సుక్కూ కోసం చరణ్, మహేశ్ తదితరులు ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారని టాక్. అలానే ప్రేక్షకులకు ఓ పార్ట్ నచ్చింది కదా అని వరసపెట్టి అవే తీసుకుంటూ పోతే కంటెంట్ ఎంత బాగున్నా సరే జనాలకు బోర్ కొట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ముందుగా 'పుష్ప' కథని వెబ్ సిరీస్ గా తీయాలనేది డైరెక్టర్ సుకుమార్ ప్లాన్. కానీ సినిమాగా వచ్చింది. రికార్డులు సృష్టించింది. అయితే తొలి భాగం హిట్ అనేది ఎవరూ ఊహించలేదు. కానీ రెండో భాగంపై అంచనాలైతే ఉన్నాయి కానీ ఏం జరుగుతుందనేది చూడాలి. ఒకవేళ రెండో పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే మూడో పార్ట్ రావొచ్చు. లేదంటే మాత్రం సైలెంట్ అయిపోవచ్చేమో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి మరి. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) -
‘పుష్ప’ మళ్లీ షురూ
మళ్లీ యాక్షన్ షురూ చేశాడు పుష్పరాజ్. తనకు ఎదురొచ్చిన శత్రువుల బెండు తీస్తున్నాడు. అది ఏ రేంజ్లో అనేది ఆగస్టు 15న థియేటర్స్‌లో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’కి మలి భాగంగా ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. కాగా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ శివార్లలోని ఓ స్టూడియోలో ప్రారంభమైందని తెలిసింది. పదిహేను రోజులకు పైగా ఈ షెడ్యూల్ సాగుతుందట. అల్లు అర్జున్ పాల్గొనగా ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్లోనే కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' స్పూఫ్ షార్ట్ ఫిల్మ్ వైరల్.. మీరు చూశారా?
ఒకప్పుడేమో ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఎవరికి వాళ్లే తమ టాలెంట్‌ని చూపించుకుంటున్నారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే మాత్రం ఫుల్ వైరల్ అయిపోతున్నారు. అలా '7 ఆర్ట్స్' వీడియోలతో సరయు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు వీళ్ల నుంచి 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' షార్ట్ ఫిల్మ్ రిలీజైంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) 2021 డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన 'పుష్ప'.. దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్‌తో మూవీ టీమ్ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' పేరుతో ఓ స్ఫూప్ వీడియో చేశారు. 'పుష్ప' మూవీలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉన్నాయి. పుష్పరాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ నటించారు. ఈ కాన్సెప్ట్ రాసుకుని, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేశాడు. 'పుష్ప 2' కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్ని తీసినట్లు తెలుస్తోంది. షెకావత్ తనను బ్రాండ్ అని అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
'సరైన వ్యక్తుల వల్లే మీరేంటో తెలుసుకుంటారు': నేషనల్ క్రష్
యానిమల్ సినిమాతో హిట్ కొట్టిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. రణ్‌బీర్ కపూర్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం రష్మిక షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పుష్ప సినిమాతో శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకున్న భామ.. పుష్ప-2లోనూ నటిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. జీవితంలో కొన్నిసార్లు అగి ఆలోచించాలంటూ పోస్ట్ చేసింది. రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'జీవితం గురించి కొన్నిసార్లు ఆగి ఆలోచించాలి. అదంతా ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలేందుకు ఇదంతా జరిగిందని. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నా. ఇదంతా జరిగినందుకు ప్రశాంతంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే.. ఇదే నేను ఎప్పటినుంచో కలలు కనేది. కానీ నేను ఇదంతా జరుగుతుందని నేను గ్రహించలేదు. అంతే కాదు నాకు ఏం కావాలో తెలియని దాని వైపు పరుగులు తీస్తూనే ఉంటా. సరైన వ్యక్తులతో ఉండటం వల్ల మీరు కొన్నిసార్లు ఆగి.. దాన్ని గ్రహించాల్సి ఉంటుందని మీరు తెలుసుకుంటారు. ఈ లిటిల్ అమ్మాయి కలలు కంటూ పెరిగింది కూడా ఇదే!' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు నేషనల్ క్రష్ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
పుష్ప జగదీశ్ కేసు.. అసలు నిజం అదేనన్న నటుడు!
పుష్ప సినిమాలో హీరో స్నేహితునిగా నటించి ఫేమ్ తెచ్చుకున్న నటుడు జగదీశ్ అలియాస్ కేశవ (మచ్చా). ఇటీవలే ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మరొకరితో సన్నిహితంగా మెలగడం జగదీశ్‌కు నచ్చక ఆమెను వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్న జగదీశ్ చెప్పినట్లు తాజా సమాచారం. తన దారిలోకి తెచ్చుకునేందుకు ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు తీసినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. కాకినాడకు చెందిన యువతి ఓ సంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుండేది. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సంగీత్‌నగర్‌లో అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌లో నివసిస్తుండేది. తల్లి దండ్రులు కాకినాడలోనే ఉండగా.. ఆమెకు భర్తతో విడాకులు అయ్యాయి. కొంతకాలం కిందట ఆ యువతికి మణికొండలో నివసించే నటుడు జగదీశ్ పరిచయమయ్యాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారి కొద్దిరోజులు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. జగదీశ్ ఆ యువతిని కాదని మరో యువతిని వివాహం చేసుకోవడంతో ఆమె జగదీశ్‌ను దూరం పెట్టసాగింది. ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేది కాదు. రహస్యంగా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి.. ఈ క్రమంలో గత నెల 27న మహిళ నివసించే ఫ్లాట్ వద్దకు వచ్చిన జగదీశ్.. సదరు మహిళ మరో యువకునితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కిటికీలోనుంచి తీశాడు. ఆ తర్వాత డోర్‌కొట్టి లోనికి వెళ్లి మీ బాగోతం మొత్తం రికార్డ్ చేశానంటూ వారిని బెదిరించాడు. ఫొటోలు డిలీట్ చెయ్యా లని ఎంత బతిమిలాడినా వినలేదు. దీంతో ఆ యువతి, యువకుడు పోలీసులకు ఫోన్ చేస్తామనడంతో అక్కడ నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా ఫోన్లో వేధించాడు. 29వ తేదీ ఉదయం ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉన్న ఫొటో పంపించి.. ఇలాంటి ఫొటోలుఇంకా చాలా ఉన్నాయనీ.. అవన్నీ బయటపెడతానని బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడంతో ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మరుసటిరోజు యువతి బంధువులు జగదీశ్ వేధింపులను పోలీసులకు వివరించగా ఆ మేరకు కేసు పెట్టారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు జగదీశ్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
Kalpalatha: గ్రాండ్‌గా పుష్ప నటి కూతురి నిశ్చితార్థం (ఫొటోలు)
-
పుష్ప-2 యూనిట్ కు బిగ్ షాక్ నటుడు జగదీష్ అరెస్ట్..
-
'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!
పుష్ప సినిమా పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఆ డైలాగ్ ఒక్కటే. అదే గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అని చెప్పడం. ఈ డైలాగ్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్కువసార్లు ప్రదర్శించి ఉంటాడు. అంతలా ఫేమస్ అయింది పుష్ప సినిమా డైలాగ్. కానీ అదే రేంజ్లో వైరలైన మరో సీన్ కూడా ఈ చిత్రంలో ఒకటి ఉంది. ఇప్పుడు దానిపైనే మన బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందామా? ఈ సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయిన ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముగ్ధులైపోయారు. ఈ పాటలోని అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌లో చెప్పును వదిలేసి డ్యాన్స్ వేసే స్టెప్పును చాలామంది ట్రై చేశారు. తాజాగా ఆ సాంగ్ గురించే అమితాబ్ ప్రశ్న వేశారు. ఈ సందర్బంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్. ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి మాట్లాడుతూ.. 'పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్ వేసి.. చెప్పులు వదిలేసి మరీ వేసుకునే వారు' అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలోనే పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. GOAT praises GOAT. 🧎@SrBachchan @alluarjun #Pushpa pic.twitter.com/J5yPkgDq9a — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 8, 2023 -
అల్లు అర్జున్‌పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
పుష్ప, ఆర్ఆర్ఆర్, ఉప్పెన వంటి చిత్రాలు టాలీవుడ్ ఖ్యాతిని జాతీయస్థాయిలో అవార్డులను పొందాయి. ఈ ఘనతను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ హైదరాబాదులో గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన విషయం. కానీ.. ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రావడం లేదు ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ లాంటి వారిని సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావడం లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే, అది సినీ పరిశ్రమలోని నటీనటులందరికీ గర్వకారణం. రాజమౌళి మన తెలుగు సినిమాని ఆస్కార్‌కు తీసుకువెళితే అది తెలుగు పరిశ్రమకు, తెలుగు వారందరికీ గర్వకారణం అని ప్రకాష్ రాజ్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్‌కు జాతీయ అవార్డు రావడం తెలుగు సినిమా గర్వకారణం. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు ఎందుకంటే అల్లు అర్జున్ కష్టం అలాంటిది. తను మొదటి సినిమా చేస్తున్నప్పుడు అల్లు అరవింద్‌గారు బన్నీని ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లమంటే.. నేను ఇతర సినిమా షూటింగ్స్‌లో ఉన్నపుడు అల్లు అర్జున్ వచ్చి ట్రైపాయిడ్ కెమెరా దగ్గర కింద కూర్చుని నన్ను చూస్తున్న క్షణాలు నాకు గుర్తున్నాయి. తరువాత మేము గంగోత్రి చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో నేను తన నటన చూసి అల్లు అరవింద్‌తో 'దిస్ బోయ్ విల్ గ్రో' అన్నాను. నేను బన్నీలో ఉన్న ఆకలి చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలా మంది యువతకి ఒక ఉదాహరణగా నిలిచాడు. నువ్వు ఇప్పుడెలా ఉన్నావనేది కాదు.. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలుంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితే ఈ రోజు బన్నీకి జాతీయ అవార్డు వచ్చింది. బన్నీకి జాతీయ అవార్డు వస్తే నా బిడ్డకి వచ్చినట్టు భావిసున్నా. నాకు మొదటిసారి జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తెలుగు సినిమా అంటే అక్కడివారు తక్కువగా చూసేవారు. కానీ ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడు అవార్డు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు తెలువారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనకి అవార్డు వస్తేనే కాదు మనవాళ్లకి వస్తే కూడా మనకి వచ్చినట్టు. ఇక్కడికి చాలా మంది యువ దర్శకులు వచ్చారు కానీ ఇదెందుకు మన సినీ పెద్దలకి రావట్లేదు? మన సినిమాతో బౌండరీస్ దాటేస్తున్న సమయంలో అవతలి వాళ్లకంటే మన వాళ్లని మనం గౌరవించకపోతే ఎలా..? అంటూ ప్రకాష్ రాజ్ సినీ పెద్దలను ప్రశ్నించారు. -
20 ఏళ్లుగా అంటున్న మాట నిజమైంది: బన్నీ ఆసక్తికర కామెంట్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు పుష్ప ది రైజ్ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం వరించింది. సుకుమార్, బన్నీ కాంబినేషన్లో తెరకెక్కించిన పుష్ప మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే జాతీయ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులకు మైత్రీ మూవీ మేకర్స్ విందు ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి హాజరైన బన్నీ అవార్డ్ రావడం పట్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాతీయ అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు. నా మిత్రుడు దేవిశ్రీతో కలిసి అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో నటనకు గుర్తింపు వచ్చేందుకు సుకుమార్ ఎంతో శ్రమించారని బన్నీ వెల్లడించారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ..'బాలీవుడ్‌కు వెళ్లమని దేవిశ్రీ ప్రసాద్‌కు చాలా సార్లు చెప్పా. కానీ ముందు నువ్వు వెళ్లు.. నీతో పాటు వస్తా అనేవాడు. అలాంటిది మేమిద్దరం ఒకేసారి పుష్ప సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టాం. అక్కడా సక్సెస్ అందుకున్నాం. 20 ఏళ్లుగా దేవితో నేను అంటున్న మాట నిజమైనందుకు చాలా సంతోషంగా అనిపించింది. జాతీయ అవార్డులకు మా పేర్లు ప్రకటించినప్పుడు నాన్న చాలా సంతోషించారు. ఇద్దరు కుమారులకు జాతీయ అవార్డులు వచ్చినట్లు ఉందన్నారు. ప్రిన్సిపల్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోలేని మేము.. ప్రెసిడెంట్ దగ్గర మెడల్స్ తీసుకుంటామని అనుకున్నావా?’ అని ఆయన్ని అడిగా' అని నవ్వుతూ అన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే.. ఏరా? ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి టీసీలు తీసుకోవడమే తప్పా? ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లి మెడల్ తీసుకుంటుంటే నాకెంతో బాధగా ఉందో తెలుసా? అని అన్నారు. డైరెక్టర్ సుకుమార్ గురించి మాట్లాడుతూ..' జీవితంలోని ప్రతి దశలో ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటా. జాతీయ అవార్డు అందుకున్న తర్వాత నాకు తెలిసిన విషయం ఏమిటంటే.. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా కోరుకుంటూనే ఏదైనా సరే జరుగుతుంది. జాతీయ అవార్డు అందుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ అవార్డు రావాలని సుకుమార్ నాకంటే ఎక్కువగా కోరుకున్నారు. ఆయనే అఛీవర్.. నేను కేవలం అఛీవ్మెంట్ మాత్రమే.' అని అల్లు అర్జున్ తెలిపారు. -
అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం.. ఇంటివద్ద అభిమానుల సందడి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి వద్ద సందడి నెలకొంది. పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న బన్నీ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇంటికి చేరుకున్న బన్నీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అల్లు అర్జున్‌పై పూల వర్షం కురిపించారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప పార్ట్-1 చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కాగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ (పార్ట్-2) సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోనూ రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని ఆగస్టు 15, 2024న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. Icon star @alluarjun receives a roaring welcome from the fans in hyderabad, after receiving the National award for 'Best Actor' at #69thNationalFilmAwards2023 in Delhi. 🔥 pic.twitter.com/usVUX9elSC — Allu Arjun Official (@TeamAAOfficial) October 18, 2023 #WATCH | Allu Arjun receives the Best Actor Award for 'Pushpa: The Rise', at the National Film Awards. pic.twitter.com/FemqdiV41y — ANI (@ANI) October 17, 2023 Can fire be awarded, I believe it can be ❤️🔥 Congratulations Bunny @alluarjun for writing HISTORY & being the Telugu Pride. The Rise is written & let the Rule begin.#Pushpa2TheRule pic.twitter.com/fq9UpYnHsq — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 17, 2023 -
నాకు అవార్డు రావడానికి కారణం ఆయనే: బన్నీ ట్వీట్ వైరల్
జాతీయ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. 'పుష్ప' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే తెలుగు సినీ చరిత్రలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయనకు జాతీయ అవార్డు రావడం పట్ల ట్వీట్ చేశారు. నా ఈ విజయానికి కారణం ఆయనేనంటూ పోస్ట్ చేశారు. బన్నీ తన ట్వీట్లో రాస్తూ..'జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. నాకు గుర్తింపు ఇచ్చిన జ్యూరీకి, మంత్రిత్వ శాఖకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ అవార్డు నా వ్యక్తిగత మైలురాయి మాత్రమే కాదు. మన సినిమాను ఆదరించిన వారందరికీ చెందుతుంది. ముఖ్యంగా సుకుమార్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా విజయానికి కారణం ఆయనే.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప పార్ట్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా.. బన్నీ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. Honoured to receive the National Award. I want to thank the jury, the ministry, the Government of India, for this recognition. This award is not only a personal milestone, but belongs to all people who have supported and cherished our cinema. Thank you, Sukumar garu. You are the… pic.twitter.com/moX9e0hTSy — Allu Arjun (@alluarjun) October 17, 2023 -
RRR, పుష్ప చిత్రాలను చూడకుండానే తప్పుబట్టిన సీనియర్ నటుడు
ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. దానికి నిదర్శనమే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ వంటి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అవార్డులు అందుకున్నాయి. ఈ రెండు బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రెండు సినిమాల గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రాలను తాను ఇప్పటి వరకు చూడలేదని చెప్పాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలపై వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాకుండా ఆయనపై పలు విమర్శలు కూడా వస్తున్నాయి. (ఇదీ చదవండి: రూ. 29 లక్షల కేసు విషయంలో ఏఆర్ రెహ్మాన్‌పై ఫిర్యాదు) ఈ మధ్య వస్తున్న సినిమాల్లో హీరోయిజాన్ని ఎక్కువగా చూపించడం కనిపిస్తోందని ఆయన తెలిపాడు. అమెరికాలోని మార్వెల్ చిత్రాలు కూడా ఇదే తరహాలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితే భారత్‌లో కూడా ఇప్పుడు కనిపిస్తుందని చెప్పాడు. ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ చిత్రాలను ఇప్పటివరకూ చూడలేదంటూ ఈ చిత్రాల్లో హీరోయిజం ఎక్కువగా ఉందని ఆయన తెలిపాడు. ఇలాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకులు కూడా థ్రిల్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చూశానని, ఆయన గొప్ప దర్శకుడని కొనియాడాడు. ఆయన ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారని అందుకే ఆ సినిమా కూడా బాగా వచ్చిందని నసీరుద్దీన్ షా తెలిపాడు. ఇక్కడ ఆయన మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే ఆర్ఆర్ఆర్, పుష్ప ది రైజ్ సినిమాలు చూడకుండానే సుకుమార్, రాజమౌళిని సర్టిఫై చేసిన నసీరుద్దీన్ షాను పలువురు విమర్శిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ తమిళనాడులో తప్ప ఇతర రాష్ట్రాల్లో పెద్దగా ఆడలేదనే పాయింట్‌ను ఆయనకు గుర్తుచేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టింది మర్చిపోయారా అని చెబుతూనే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డును దక్కించుకున్నాడని నెటిజన్లు ఆయనకు గుర్తు చేస్తున్నారు. -
అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!
పుష్ప చిత్రంతో నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. అల్లు అర్జున్ సరసన నటించిన ఈ చిత్రమే కన్నడ బ్యూటీని బాలీవుడ్ వరకు తీసుకెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా బాలీవుడ్లోనే ఈ అమ్మడు పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. హిందీలో నటించిన తొలి చిత్రం గుడ్ బై పూర్తిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత నటించిన మిషన్ మజ్ను కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రం ఒకటే ఉంది. (ఇది చదవండి: పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్ ప్లాన్ అదేనా?) రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబిడియోల్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ప్రస్తుతానికైతే ఈ చిత్రంపైనే రష్మిక ఆశలన్నీ పెట్టుకుంది. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ కెరీర్ ఈ చిత్రం రిజల్ట్‌పైనే ఆధారపడి ఉందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. తమిళంలో రష్మికకు పెద్దగా క్రేజ్ లేదు. ఎందుకంటే రష్మిక కోలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం సుల్తాన్ డిజాస్టర్‌గా మిగిలింంది. ఇకపోతే వారియర్స్ చిత్రం ఒకే అనిపించుకున్న అందులో రష్మిక పాత్ర గ్లామర్‌కు, సాంగ్స్‌కు మాత్రమే పరిమితం అయిందనే విమర్శలను ఎదుర్కొన్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) దీంతో హిందీ చిత్రం యానిమల్ హిట్ కాకపోతే నటి రష్మిక టాలీవుడ్‌నే నమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే తెలుగులో అల్లు అర్జున్ సరసన నటిస్తోన్న పుష్ప–2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదల తరువాత తెలుగులో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశముంది. కాగా.. టాలీవుడ్లో ప్రస్తుతం పుష్ప–2 తో పాటు రెయిన్ బో అనే లేడీ ఓరియంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్, కోలీవుడ్ కలిసి నేషనల్ క్రష్‌కు కలిసి రాకపోవడంతో టాలీవుడ్‌పైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
మీ నుంచి చాలా నేర్చుకున్నా.. బన్నీపై బాద్ షా ప్రశంసలు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియాలో తెలియని వారు ఉండరు. పుష్ప సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్‌ను రీక్రియేట్ చేయని సెలబ్రిటీలు ఉండరు. ఇటీవలే నేషనల్ అవార్డ్ అందుకున్న బన్నీపై బాలీవుడ్ బాద్షా ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ మూవీ సక్సెస్‌పై బన్నీ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన షారుక్ ఖాన్.. బన్నీని పొగుడుతూ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: పెళ్లి చేసుకోమని నన్ను తిట్టాడు.. కొవ్వెక్కిపోయానట.. హీరోయిన్! ) షారుక్ ట్వీట్లో రాస్తూ.. 'నీ ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీలోని 'ది ఫైర్' నన్ను మెచ్చుకుంటోంది. పుష్ప చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. వీలైనంత త్వరగా వచ్చి మీకు వ్యక్తిగతంగా అందిస్తాను. లవ్ యూ బన్నీ.' అంటూ రిప్లై ఇచ్చారు. షారుక్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇటీవలే జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. 'షారుక్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. షారుక్ అవతార్‌తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్ నటుడు కన్నుమూత!) Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three… https://t.co/KEH9FAguKs — Shah Rukh Khan (@iamsrk) September 14, 2023 -
అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?
తెలుగులో దిగ్గజాలు, అద్భుతమైన నటులు ఎంతోమంది ఉన్నారు. వాళ్లెవరి వల్ల కానిది అల్లు అర్జున్ చేసి చూపిస్తున్నాడు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. 'పుష్ప' హిట్ అయిందనో, నేషనల్ అవార్డు వచ్చిందనో ఇలా అనట్లేదు. రియాలిటీలో జరుగుతున్నదే చెబుతున్నాం. రీజనల్ మూవీస్ చేసే ఓ హీరోని.. ఏకంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో కావడం ఏంటి.. స్పెషల్‌గా ఓ వీడియో రిలీజ్ చేయడం ఏంటి.. అసలు బన్నీకి ఎక్కడ కలిసొచ్చింది. ఇదంతా ఎలా సాధ్యమైంది? (ఇదీ చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' చిరంజీవి చేయాల్సింది.. కానీ!) స్టైల్ ప్లస్ గెటప్స్ తండ్రి అల్లు అరవింద్ నిర్మాత. దీంతో టీనేజీలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో బాగానే నటించాడు. కానీ బన్నీ లుక్స్‌పై విమర్శలు. వీడు హీరో ఏంట్రా? అన్నవాళ్లు కూడా ఉన్నారు. దీంతో రెండో సినిమాకే పూర్తిగా ఛేంజ్ అయ్యాడు. లవర్ బాయ్ 'ఆర్య'గా డిఫరెంట్ మేకోవర్‌తో మెస్మరైజ్ చేశాడు. అప్పటినుంచి మొదలు 'పుష్ప' వరకు ఏ మూవీకి ఆ మూవీకి డిఫరెంట్ స్టైల్- గెటప్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. వచ్చారు. యాక్టింగ్ పరంగానూ తనని వేలెత్తి చూపని విధంగా ఇంప్రూవ్ అయ్యాడు. డ్యాన్సుల్లో టాప్ తెలుగు హీరోల్లో చిరంజీవి తర్వాత బాగా డ్యాన్స్ చేసేవాళ్ల లిస్ట్ తీస్తే అల్లు అర్జున్ కచ్చితంగా ఉంటాడు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా బాగానే చేస్తారు. కానీ బన్నీకి సరైన మాస్ సాంగ్స్ చాలానే పడ్డాయి. సినిమా ఎలా ఉన్నాసరే పాటలు, వాటిలో అల్లు అర్జున్ డ్యాన్సుల వల్ల పాన్ ఇండియా ట్రెండ్ లేని రోజుల్లోనే డబ్బింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. (ఇదీ చదవండి: అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్) టర్నింగ్ పాయింట్ అల్లు అర్జున్ అంటే ఓ తెలుగు హీరో మాత్రమే. ఇతడి సినిమాలు ఆంధ్రా, తెలంగాణ వరకే పరిమితం. అయితే 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్ అయిన తర్వాత ఆ సాంగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. ఈ మూవీ వచ్చిన రెండు నెలలకే కరోనా లాక్డౌన్ రావడం. అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలా కొన్ని నెలలపాటు నార్త్ నుంచి విదేశీయుల వరకు ఎక్కడ చూసినా ఈ పాటలకే రీల్స్ తెగ చేశారు. అలా తనకు తెలియకుండానే అల్లు అర్జున్.. గ్లోబల్ వైడ్ ఫేమ్ సొంతం చేసుకున్నాడు. 'పుష్ప' విత్ నేషనల్ అవార్డ్ ముందు అనుకున్న ప్రకారం 'పుష్ప' సినిమాని తెలుగులో మాత్రమే రిలీజ్ అనుకున్నారు. కానీ రాజమౌళి సూచించడంతో ప్రమోషన్స్ చేయకుండానే నార్త్‌లోనూ రిలీజ్ చేశారు. తెలుగులో ఓకే అనిపించుకుంది. కానీ అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. నార్త్‌లో కలెక్షన్స్ దుమ్మరేపింది. అల్లు అర్జున్ అంటే ఎవరో దాదాపు ప్రతి ఉత్తరాది ప్రేక్షకుడి తెలిసేలా 'పుష్ప' చేసింది. దీంతో వాళ్లందరూ ఇప్పుడు 'పుష్ప 2' కోసం తెలుగు ఆడియెన్స్ కంటే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా బన్నీకి తాజాగా నేషనల్ అవార్డు రావడం మరో ప్లస్ పాయింట్. (ఇదీ చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. ఫొటో వైరల్!) వార్నర్ హెల్ప్! మిగతా సెలబ్రిటీలు సంగతేమో గానీ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. బన్నీకి గ్లోబల్ వైడ్ గుర్తింపు తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఎందుకంటే లాక్డౌన్ టైంలో అల్లు అర్జున్ పాటలకు సరదా కోసం వార్నర్ రీల్స్ చేశాడు. కానీ అవి చాలామందికి రీచ్ అయ్యాయి. అలా కొంతలో కొంత వార్నర్ కూడా అల్లు అర్జున్‌కి ప్లస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇన్ స్టా వీడియోతో మిగతా హీరోలందరూ పాన్ ఇండియా ట్రెండ్ వెనకాల పడుతుంటే.. బన్నీ మాత్రం గ్లోబల్ వైడ్ పాపులారిటీ ఆల్రెడీ దక్కించేసుకున్నాడు. ఎందుకంటే ప్రఖ్యాత ఇన్స్టాగ్రామ్.. బన్నీని ఫాలో అవుతోంది. భారతీయ నటుల్లో ఆ సంస్థ ఫాలో అవుతున్న ఫస్ట్ పర్సన్ అల్లు అర్జున్. తాజాగా ఇతడి దినచర్యని స్పెషల్‌గా ఓ వీడియో తీసి మరీ, తన అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇది చాలదా బన్నీ.. జాక్‌పాట్ కొట్టాడని చెప్పడానికి! (ఇదీ చదవండి: 48 ఏళ్ల వయసులో పెళ్లిపై స్పందించిన నగ్మా.. త్వరలోనే..) View this post on Instagram A post shared by Instagram (@instagram) -
'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా
ప్రముఖ నటుడు వెట్రి కొత్త సినిమా 'రెడ్ శాండిల్ వుడ్'. జేఎన్ సినిమాస్ పతాకంపై జే.పార్థసారథి నిర్మించిన విచిత్రానికి గురు రామానుజమ్ దర్శకత్వం వహించారు. నటుడు ఎంఎస్ భాస్కర్ గణేష్ వెంకట్రాం కేజీఎఫ్ ఫేమ్ రామ్ కబాలి విశ్వ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు పేరుతో బలేనా అమాయకుల నేపథ్యంలో సాగే యథార్థ సంఘటనల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. 2015లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలను తయారు చేసి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గంధపు చెక్కలను విదేశాలకు చేస్తూ చైనా నుంచి ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని చిత్ర కథానాయకుడు వెట్రి పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ట్రైలర్ చూడగానే మనసు ద్రవించిందన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు, అకారణంగా బాధింపునకు గురైన, శిక్షించబడిన వారే కనిపిస్తున్నారన్నారు. అలాంటి సంఘటన వెనుక ఎవరో ఉంటున్నారన్నారు. వారి వల్ల అమాయకపు తమిళ ప్రజలే బాధింపునకు గురవుతున్నారు అన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు నటించిన చిత్రాలు లేదా, సహజత్వంతో కూడిన చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయన్నారు. అలా ఈ చిత్రం జాతీయ అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను అని పేరరసు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: విజయ్ క్యారెక్టర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
దిగేదే ల్యా.. పుష్ప–3
చంద్రయాన్–3 విజయవంతమైన ఆనందంలో ఉండగానే ‘పుష్ప’ చిత్రం జాతీయస్థాయిలో అవార్డ్లు సొంతం చేసుకుంది. ఒకవైపు ‘పుష్ప–2’ షూటింగ్లో ఉండగానే మరోవైపు నెటిజనులు చంద్రయాన్, పుష్ప ఆనందాన్ని మిక్స్ చేస్తూ ఎవరికి వారు ‘పుష్ప–3’ స్టోరీలైన్ రెడీ చేశారు. అందులో ఒకటి... ఆంగ్లపత్రికలో వచ్చిన ‘వై ది గ్లోబల్ రేస్ ఫర్ ది లునార్ సౌత్ పోల్’ అనే వ్యాసాన్ని అనువాదం చేయించి తెలుగులో వింటాడు పుష్ప. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉన్న విలువైన ఖనిజాల గురించి విన్న తరువాత గంధపు చెట్లపై పుష్పకు ఆసక్తిపోయింది. ‘కొడితే సౌత్ పోల్ కొట్టాలి. విలువైన ఖనిజాలు కొట్టేయాలి’ అని గట్టిగా డిసైడై పోయాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పుష్పరాజ్ చంద్రుడి దక్షిణ ధృవం పైకి చేరుతాడా? అక్కడి ఖనిజాలను సొంతం చేసుకుంటాడా? ఒకవేళ చేసుకుంటే విలన్ భన్వర్ సింగ్ షెకావత్ ఎలా అడ్డుపడుతాడు... అనేది నెటిజనుల ఊహల్లో పుట్టిన పుష్ప–3 స్థూల కథ. -
జాతీయ అవార్డ్ విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
'పుష్ప' ఇప్పుడు దేశంలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇదే. ఈ సినిమాతో అల్లు అర్జున్ నటనకుగాను తాజాగా జాతీయ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ తొలి హీరో కూడా ఆయనే.. ఈ అవార్డుతో పాటు విజేతలకు కేంద్ర ప్రభుత్వం ఏమేం ఇస్తుందని సోషల్‌మీడియాలో నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు వెతుకుతున్నారు. జాతీయ చలనచిత్ర అవార్డలను అందుకున్న విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతిని అందిస్తారు. అంతేకాకుండా గుర్తింపుగా ప్రశంసా పత్రాలను కూడా అందిస్తారు. కానీ జ్యూరీ నుంచి అభినందనలు అందుకున్న సినిమాల విషయంలో కేవలం సర్టిఫికేట్ మాత్రమే అందిస్తారు. జ్యూరీ స్పెషల్ విజేతలకు మాత్రం ప్రశంసా పత్రంతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తారు. (ఇదీ చదవండి: డిసెంబర్ 12న విడుదల కానున్న రజనీకాంత్ మరో సినిమా) 2021 ఏడాదికి గాను 69వ జాతీయ అవార్డు అందుకోబోతున్న వారి జాబితా ఇప్పటికే విడుదలైంది. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్, ఉత్తమ నటీమణులుగా ఎంపికైన అలియా భట్, కృతి సనన్‌లకు ఒక్కోక్కరికి రూ.50 వేల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ► ఉత్తమ చిత్రం అవార్డుల కోసం 28 భాషల నుంచి 280 సినిమాలు పోటీ పడితే.. బెస్ట్ మూవీగా ఎంపికైన రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌కు రూ.2.50 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలాన్ని అందజేయనున్నారు. ► ఉత్తమ వినోద చిత్రం అవార్డు కోసం 23 భాషల నుంచి 158 చిత్రాలు పోటీపడగా ఈ అవార్డుకు ఎంపికైన RRR సినిమాకు రూ. 2 లక్షల నగదుతో పాటు స్వర్ణ కమలం దక్కించుకోనుంది. ► గోదావరి అనే మరాఠ సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు గెలుచుకున్న నిఖిల్ మహాజన్‌కు రూ.2.50 లక్షల నగదు బహుమతి, రజత కమలం అందుకుంటారు ► ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపికైన ది కశ్మీర్ ఫైల్స్‌కు రూ. 1.50 లక్షల నగదుతో పాటు రజత కమలం అందుకుంటారు. ఈ సినిమాకు రెండు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే ► జ్యూరీ స్పెషల్ అవార్డుకు ఎంపికైన షేర్షా సినిమాకు రూ.2 లక్షల నగదుతో పాటు రజత కమలాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. -
బన్నీ ఆస్కార్ అవార్డ్ గెలిచే సత్తా ఉంది: పోసాని కృష్ణ మురళి
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ రావడం పట్ల ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్, కొండపొలం, ఉప్పెన, పుష్ప చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ! ) పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..'అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్న అల్లు అర్జున్‌కు ఇష్టం. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నేర్చు కుంటూనే ఉంటాడు. అది అతనిలో ఉన్న గొప్ప లక్షణం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది.' అని అన్నారు. రాబోయే కాలంలో బన్నీ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) -
అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్
తాత స్టార్ కమెడియన్ (రామలింగయ్య), మామయ్య స్టార్ హీరో (చిరంజీవి), నాన్న స్టార్ ప్రొడ్యూసర్ (అల్లు అరవింద్).. ఈ నేపథ్యంతో అల్లు అర్జున్ తెరంగేట్రం చేశారు. అది ఎంట్రీ వరకు మాత్రమే ఉపయోగపడిందేమోగానీ స్టార్.. స్టైలిష్‌స్టార్‌ని చేసేందుకు మాత్రం కాదు. హీరో అంటే ప్రధానంగా ఉండాల్సింది ఏంటి..? మంచి లుక్స్..పర్సనాలటీ,కిల్లింగ్ స్మైల్ ఇలా కొన్ని తప్పక ఉండాల్సిందే. కానీ ఇవేమీ లేకుండా తన బ్యాంక్‌గ్రౌండ్‌తో ఎంట్రీ ఇస్తే ఏం చేస్తాం కొద్దిరోజులకు పక్కన పెట్టేస్తాం. కానీ ప్రేక్షకులకు అల్లు అర్జున్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. గంగోత్రి సినిమా సమయంలో వీడు హీరో ఏంటిరా అనే స్టేజీ నుంచి ఆర్య సినిమాతో వీడురా హీరో అని స్థాయికి చేరాడు. వీడికి స్టైల్ అంటే తెలుసా..? అని హేళన చేసిన వారికి స్టైలిష్ స్టార్ అనే గుర్తింపుతో సమాధానం ఇచ్చాడు. నటన రాదు అనేవారికి జాతీయ అవార్డు అందుకున్న ఏకైక హీరోగా తెలుగు సినిమా చరిత్రలో నిలిచాడు. గంగోత్రితో అవమానం ఎదుర్కొన్న బన్నీ 2003లో వచ్చిన తన తొలి చిత్రం 'గంగోత్రి'ని చూసిన వారందరూ ఆ వెంటనే వచ్చిన 'ఆర్య'ను చూసి ఆశ్చర్యపోయారు. తొలి చిత్రంలో సింహాద్రిగా కనిపించిన ఆ కుర్రాడేనా..? ఈ ఆర్య అంటూ తెలుగు సినీ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. అంతలా బన్నీ కష్టపడ్డాడు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అనే గుర్తింపు నుంచి అల్లు హీరో అనే ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇదంతా రాత్రికి రాత్రే జరిగిపోలేదు.. దీని వెనుక అతని 20 ఏళ్ల కష్టం ఉంది. తన 20 ఏళ్ల సినీ జీవితంలో వేదం,రుద్రమదేవి, వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో మెప్పించాడు. ఆర్య సినిమా విడుదల తర్వాత బన్నీని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. మలయాళంలో ఆయనకు ఉన్నంత ఫ్యాన్స్ అక్కడి హీరోలకు కూడా ఉండరనే చెప్పవచ్చు. అందుకే అతన్ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ప్రాంతం,భాష ఎలాంటి సంబంధం లేని తనకోసం వాళ్లందరూ చూపించే ప్రేమకు ఆయన మురిసిపోయాడు. అందుకే ఆయన ఒకసారి ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదేనని చెప్పి దానిని పాటిస్తున్నాడు. అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ఇప్పటికీ ఫ్యాన్స్ అని ఆయన ఇంటికి వెళ్తే అక్కడున్నవారు భోజనం పెట్టి పంపుతారు. 'ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నేను సంపాదించుకున్న అతిపెద్ద ఆస్తి నా అభిమానులే’ అని ఆయన చాలాసార్లు చెప్పాడు. అల్లు అర్జున్‌లో ఇవన్నీ ప్రత్యేకం ► సౌత్ ఇండియాలో సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌ను దేశముదురు సినిమాతో ట్రెండ్ సెట్ చేసింది అల్లు అర్జునే ► ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్లకుపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సౌత్ ఇండియా స్టార్‌గా అర్జున్ గుర్తింపు పొందాడు. ► 'రుద్రమదేవి' సినిమాకు కొన్ని ఇబ్బందులు ఎదురు అయ్యాయని తెలుసుకున్న అర్జున్ దానికి తనలాంటి స్టార్ అవసరమనుకున్నాడు. ఆ సినిమా కోసం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా గోనగన్నారెడ్డి పాత్రతో మెప్పించాడు. ► పాలకొల్లులోని 'పంచారామ' క్షేత్రంలో గోశాల ఏర్పాటుకు ఎవరూ అడగకుండానే రూ.18 లక్షలు విరాళం ఇచ్చాడు. గోశాలలోని ఆవులకు నిరంతరం అవసరమయ్యే ఖర్చును ఆయనే చెల్లిస్తానన్నాడు. ► వేదం సినిమాలో మంచు మనోజ్‌తో కలిసి నటించి నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాడు. ► ఎవరో బాలీవుడ్ జనాలు తన బాడీ,లుక్ మీద చేసిన కామెంట్‌ను సీరియస్ తీసుకొని ప్రత్యేకంగా జిమ్నాస్టిక్స్ శిక్షణ తీసుకొని సరికొత్త లుక్‌లో ఆర్యలో కనిపించి ఆ సినిమాకు నంది అవార్డు అందుకున్నాడు. ► కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్‌కే ఎక్కువ అభిమానులు. పరాయి రాష్ట్రంలో ఏ హీరోకు ఇలాంటి ఆదరణ లేదు. ► పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ ఎంటర్టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ అవార్డు గెలిచిన మొదటి సౌత్ హీరోగా రికార్డు సృష్టించాడు. ► ఫ్యాన్స్ కోసం ఒకరోజును ఆయన కేటాయిస్తారు. ప్రతి గురువారం తన ఫ్యాన్స్ డైరెక్ట్‌గా ఆయన ఇంటి వద్దకు వెళ్లి బన్నీతో ఫోటోలు దిగుతుంటారు. ఒక్కోసారి షూటింగ్ పనుల మీద ఇతర ప్రాంతాలకు ఆయన వెళ్లినప్పుడు ఆ అవకాశం ఉండదు. ► పుష్ప సినిమా కోసం భుజం ఒకవైపు ఉంచి నటిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా కథ నచ్చడంతో రెడీ అనేశాడు. సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన భుజానికి స్వల్ప శస్త్రచికిత్స జరిగింది. ► 2021లో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప' రూ. 365 కోట్లతో రికార్డు సృష్టించింది. -
జాతీయ అవార్డుల విషయంలో టాలీవుడ్ గళాన్ని వినిపించిన శ్రీలేఖ
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ సత్తా చాటింది. ఈ అవార్డుల విషయంలో సౌత్ ఇండియాకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంటుందనే విమర్శ గతంలో ఎక్కువగా వినిపించేది. అందులో టాలీవుడ్‌కు మరింత అన్యాయం జరుగుతుందని బహిరంగంగానే పలువురు జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులపైనే కామెంట్లు చేశారు. 1967లో 15వ జాతీయ అవార్డుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటుడి అవార్డు ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి నేటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్క హీరోకి ఉత్తమ నటుడి అవార్డు దక్కలేదు. (ఇదీ చదవండి: 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా?) తాజాగ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుని తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు. టాలీవుడ్లో ఎన్టీఆర్,నాగేశ్వరావు,కృష్ణ,చిరంజీవి ఇలా ఎందరో సినీ చరిత్రలో గొప్ప నటులున్నా ఇప్పటివరకూ ఎవ్వరికీ ఈ అవకాశం దక్కలేదు. దీంతో ఒక్కోసారి జ్యూరీ సభ్యులపై కూడా విమర్శలు వచ్చేవి. ఈ విభాగంలో తొలి అవార్డును బెంగాలీ నటుడు ఉత్తమ్‌కుమార్ సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎక్కువగా నార్త్ నుంచే ఆధిపత్యం ఉందని చెప్పవచ్చు. నార్త్ హీరోలకే ఎక్కువ అవార్డులు ఇప్పటి వరకు ఈ అవార్డు అందుకున్న వారిలో బాలీవుడ్ నటులు 27, మలయాళం 13, తమిళ్ 9, బెంగాలీ నుంచి ఐదుగురు ఉన్నారు. కన్నడ, మరాఠీ నటులకు మూడేసి చొప్పున అవార్డులను దక్కించుకున్నారు. అత్యధికంగా అమితాబ్ బచ్చన్ నాలుగుసార్లు, కమల్‌హాసన్,అజయ్‌దేవగణ్, మమ్ముట్టి మూడుసార్లు అవార్డు దక్కించుకున్నారు. మోహన్‌లాల్, ధనుష్,మిథున్చక్రవర్తి, సంజీవ్‌కుమార్, నసీరుద్దీన్‌షా, ఓంపురి కూడా రెండేసిసార్లు అవార్డు గెలుచుకున్నారు. విక్రమ్,సూర్య, ప్రకాశ్‌రాజ్,సురేష్‌గోపి,ఎంజీ రామచంద్రన్ వంటివారు కూడా ఈ పురస్కారాన్ని ఒకసారి అందుకున్నారు. శంకరాభరణం చిత్రానికి 4 అవార్డులు టాలీవుడ్ ఎవర్గ్రీన్ సినిమా అయిన శంకరాభరణం చిత్రానికి అప్పట్లో అత్యధికంగా 4 జాతీయ అవార్డులు దక్కగా మేఘ సందేశం సినిమాకు కూడా 4 పురస్కారాలు దక్కాయి. ఆప్పటి నుంచి టాలీవుడ్‌కు అంతగా జాతీయ అవార్డులు వరించలేదనే చెప్పవచ్చు. తాజాగ RRR మూవీకి 6 అవార్డులతో పాటు మొత్తంగా టాలీవుడ్‌కు 11 అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాల కమిటీ సభ్యుల ముందు తెలుగు చిత్రాల గళాన్ని గట్టిగా వినిపించే వారు ఉంటే తప్పక టాలీవుడ్‌కు న్యాయం జరుగుతుందని ఎంఎం శ్రీలేఖ నిరూపించారనే చెప్పవచ్చు. జ్యూరీ సభ్యురాలిగా ఎంఎం శ్రీలేఖ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యురాలిగా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ ఉన్నారు. ఈసారి టాలీవుడ్ సినిమాల ప్రత్యేకత గురించి కమిటీ సభ్యుల ముందు ఆమె గట్టిగానే గళం వినిపించారు. అవార్డుల అనౌన్స్మెంట్ తర్వాత ఎంఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని ఇలా తెలిపారు. 'ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం' అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారని శ్రీలేఖ తెలిపారు. వాళ్లకు తెలుగు రాదు అలాంటప్పుడు మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుందని ఆమె గుర్తుచేశారు. అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలని పేర్కొన్నారు. 'ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి.' అని ఎంఎం శ్రీలేఖ తెలిపారు. -
National film awards 2023 :అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తొలిసారి తెలుగు సినిమాలు దుమ్ము రేపాయి. మొత్తం పది అవార్డులతో ‘ఎత్తర జెండా’ అంటూ తెలుగు సినిమా సత్తా చాటింది. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో తెలుగు నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ‘పుష్ప... ఫైర్’ అంటూ అల్లు అర్జున్ రికార్డ్ సాధించారు. ఆస్కార్ అవార్డుతో చరిత్ర సృష్టించిన ‘ఆర్ఆర్ఆర్’ ఆరు అవార్డులతో సిక్సర్ కొట్టింది. వీటిలో ‘హోల్సమ్ ఎంటర్టైనర్’ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ సొంతం అయింది. 2021 జనవరి 1 నుంచి 2021 డిసెంబరు 31 లోపు సెన్సార్ అయి, అవార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను పరిగణనలోకి తీసుకుని జ్యూరీ సభ్యులు అవార్డులను ప్రకటించడం జరిగింది. జాతీయ ఉత్తమ నటీమణులుగా ‘గంగూబాయి కతియావాడి’లో వేశ్య పాత్ర చేసిన ఆలియా భట్, ‘మిమి’ చిత్రంలో గర్భవతిగా నటించిన కృతీ సనన్ నిలిచారు. ఖగోళ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఆర్. మాధవన్ టైటిల్ రోల్ చేసి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడిగా మరాఠీ ఫిల్మ్ ‘గోదావరి’కి గాను నిఖిల్ మహాజన్ అవార్డు సాధించారు. ఇంకా పలు విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం గురువారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఆ విశేషాలు ఈ విధంగా... 69వ జాతీయ అవార్డులకు గాను 28 భాషలకు చెందిన 280 చలన చిత్రాలు పోటీపడ్డాయి. మొత్తం 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలోని ‘పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకుగాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడిగా తొలి అవార్డు లభించింది. ఇదే చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డు సాధించారు. ఇక ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమాకు ఆరు విభాగాల్లో అవార్డులు దక్కాయి. జాతీయ హోల్సమ్ ఎంటర్టైనర్గా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇదే చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గాను ఎంఎం కీరవాణి, ఇదే చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్‌కి వి. శ్రీనివాస్ మోహనన్, ‘నాటు నాటు..’ పాట కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ‘ఆర్ఆర్ఆర్’లోని ‘కొమురం భీముడో..’ పాటకు మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా కాలభైరవ, ఇదే చిత్రానికి స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సాల్మన్లకు జాతీయ అవార్డులు దక్కాయి. ఇక ‘నాటు.. నాటు’కి రచయితగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ‘కొండపొలం’లోని ‘ధంధం ధం.. తిరిగేద్దాం...’ పాటకు జాతీయ అవార్డు అందుకోనున్నారు. దర్శకుడిగా తన తొలి చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన ఆనందంలో ఉన్నారు ‘ఉప్పెన’ను తెరకెక్కించిన బుచ్చిబాబు సన. మైత్రీ మూవీ మేకర్స్‌పై వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ‘ఉప్పెన’ ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ సినీ విమర్శకుడిగా నల్గొండ జిల్లాకి చెందిన ఎం. పురుషోత్తమాచార్యులకు అవార్డు దక్కింది. రెండేళ్లుగా ‘మిసిమి’ మాస పత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధనలు చేస్తూ, పలు వ్యాసాలు రాశారు పురుషోత్తమాచార్యులు. ఇక ఆలియా భట్‌కి ‘గంగూబాయి కతియావాడి’ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు దక్కేలా చేయడంతో పాటు మరో నాలుగు విభాగాల్లో (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, మేకప్, ఎడిటింగ్) అవార్డులు వచ్చేలా చేసింది. అలాగే విక్కీ కౌశల్ హీరోగా నటించిన బయోగ్రఫికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’కు ప్రాంతీయ ఉత్తమ హిందీ చిత్రంతో పాటు మొత్తం నాలుగు విభాగాల్లో (సినిమాటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్) అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి సూజిత్ సర్కార్ దర్శకుడు. తమిళ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కడైసీ వివసాయి’, మలయాళంలో ‘హోమ్’, కన్నడంలో ‘777 చార్లీ’ అవార్డులు గెలుచుకున్నాయి. ఇంకా పలు భాషల్లో పలు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇదొక చరిత్ర – నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అల్లు అర్జున్‌గారికి జాతీయ అవార్డు రావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇదొక చరిత్ర ‘పుష్ప’ షూటింగ్ సమయంలోనే అల్లు అర్జున్ తప్పకుండా నేషనల్ అవార్డ్ కొడతారని సుకుమార్‌గారు అనేవారు.. అది ఈ రోజు నిజమైంది. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ గార్లకు థ్యాంక్స్. దేవిశ్రీ ప్రసాద్‌కి జాతీయ అవార్డ్ రావడం హ్యాపీ. అలాగే మా ‘ఉప్పెన’కి ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ అవార్డు రావడం గర్వంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు, టీమ్‌కి అభినందనలు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం సంతోషంగా ఉంది. – నవీన్ యెర్నేని, నిర్మాత మా మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘ఉప్పెన, పుష్ప’ చాలా ప్రతిష్టాత్మక చిత్రాలు. జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్‌గారు చరిత్ర సృష్టించారు. తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరకాలం గుర్తుండిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్‌కి అవార్డు రావడం ఆనందంగా ఉంది. ‘ఉప్పెన, పుష్ప’ రెండు విజయాల్లో సింహ భాగం సుకుమార్గారిదే. ‘ఆర్ఆర్ఆర్, కొండపొలం’ చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది. – వై. రవిశంకర్, నిర్మాత ‘‘నా తొలి సినిమాకే జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. నిర్మాతలు నవీన్‌గారికి, రవిగారికి, మా గురువుగారు సుకుమార్ గారికి కృతజ్ఞతలు. సినిమా చూడ్డానికి మా ఇంట్లో నన్ను పంపించేవాళ్లు కాదు. అలాంటిది నేను ఒక సినిమాకి డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు రావడం అంటే ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. మా అమ్మగారికి నేషనల్ అవార్డు అంటే ఏంటో కూడా తెలియదు. ఈ అవార్డు గురించి ఆమెకి చెప్పాలంటే. ‘ఇండియాలోనే పెద్ద అవార్డు వచ్చింది’ అని చెప్పాలి’’ అంటున్న బుచ్చిబాబు సనని తదుపరి చిత్రం గురించి అడగ్గా.. ‘‘రామ్‌చరణ్‌గారి కోసం మంచి రా అండ్ రస్టిక్ స్టోరీ రాశాను. నా మనసుకి బాగా నచ్చి, రాసుకున్న కథ ఇది. జనవరిలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. – బుచ్చిబాబు సన, దర్శకుడు పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. 69వ చలనచిత్ర జాతీయ అవార్డు విజేతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి..) – కృతీసనన్ (మిమీ) ఉత్తమ చిత్రం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి– మరాఠీ సినిమా) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ అండ్ కో (గుజరాతీ) ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (నేపథ్య సంగీతం): ఆర్ఆర్ఆర్æ– ఎమ్ఎమ్ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): పుష్ప– దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్ –ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ – కొమురం భీముడో..) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్– కొండపొలం ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్– కింగ్ సాల్మన్ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్– శ్రీనివాస్ మోహనన్ ఉత్తమ సహాయ నటి: పల్లవీ జోషి (ద కశ్మీరీ ఫైల్స్– హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ– హిందీ) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిళల్– తమిళ్) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : ది మిత్రీ మాలిక్ – మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్ధమ్) (హిందీ) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి–హిందీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ – సోనూ కేపీ (చవిట్టు మూవీ–మలయాళం) ఉత్తమ స్క్రీన్‌ప్లే(అడాప్టెడ్): సంజయ్‌లీలా భన్సాలీ, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా–మలయాళం) ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగ్ రైటర్): ప్రకాశ్ కపాడియా – ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి– హిందీ) ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్ధమ్ మూవీ–హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో – గుజరాతీ) ఉత్తమ ఫిలిం ఆన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ : అవషావ్యూహం (మలయాళం) ఉత్తమ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్–ద రెజోనెన్ ్స (అస్సామీ) ఉత్తమ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్ మెంట్: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్): అనీష్ బసు (జీలీ మూవీ– బెంగాలీ) ఉత్తమ ఆడియోగ్రఫీ (రీ రికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్ధమ్–హిందీ) ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ) (డైరెక్టర్ విష్ణువర్థన్) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు ఉత్తమ తెలుగు చిత్రం : ఉప్పెన ఉత్తమ తమిళ్ చిత్రం : కడైసి వివసాయి (ద లాస్ట్ ఫార్మర్) ఉత్తమ కన్నడ చిత్రం : 777 చార్లి ఉత్తమ మలయాళ చిత్రం : హోమ్ ఉత్తమ హిందీ చిత్రం : సర్దార్ ఉద్దామ్ ఉత్తమ గుజరాతీ చిత్రం : లాస్ట్ ఫిల్మ్ షో (ఛెల్లో షో) ఉత్తమ మరాఠీ చిత్రం : ఏక్డా కే జాలా ఉత్తమ మీషింగ్ చిత్రం : బూంబా రైడ్ ఉత్తమ అస్సామీస్ చిత్రం : అనూర్ (ఐస్ ఆన్ ది సన్ షైన్) ఉత్తమ బెంగాలీ చిత్రం : కల్కొకో–హౌస్ ఆఫ్ టైమ్ ఉత్తమ మైథిలీ చిత్రం : సమాంతర్ ఉత్తమ ఒడియా చిత్రం : ప్రతీక్ష్య (ద వెయిట్) ఉత్తమ మెయిటిలాన్ చిత్రం : ఈఖోయిగీ యమ్ (అవర్ హోమ్) ‘పుష్ప’ చిత్రంలో నటనకుగాను అల్లు అర్జున్‌కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం సంతోషం. తొలిసారి ఈ అవార్డు అందుకోనున్న అల్లు అర్జున్‌కి అభినందనలు. 69వ జాతీయ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమకు బొనాంజాగా నిలిచాయి. అదే విధంగా పాన్ ఇండియా కాన్వాస్‌లో దూసుకుపోతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ఆరు విభాగాల్లో ఈ అవార్డులు దక్కటం ప్రశంసనీయం. డైరెక్టర్ రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌కి అభినందనలు. ఉత్తమ సంగీత దర్శకునిగా దేవీశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ సాహిత్యానికి చంద్రబోస్ (కొండపొలం) జాతీయ అవార్డుకు ఎంపికవడం అభినందనీయం. – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన బన్నీ (అల్లు అర్జున్)కి శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది. రాజమౌళి విజన్‌లో ఆరు అవార్డులు సాధించిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు, రెండు అవార్డులు సాధించిన ‘పుష్ప’కు, ‘ఉప్పెన’ టీమ్‌కు, సినీ విమర్శకులు పురుషోత్తమచార్యులకు శుభాకాంక్షలు. – చిరంజీవి ఇట్స్ సిక్సర్.. జాతీయ అవార్డులు సాధించినందుకు ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ అందరికీ శుభాకాంక్షలు. ఎంపిక చేసిన జ్యూరీకి ధన్యవాదాలు. ‘పుష్ప’.. తగ్గేదేలే... బన్నీకి, దేవిశ్రీ ప్రసాద్‌లతో పాటు ‘పుష్ప’ టీమ్‌కి శుభాకాంక్షలు. బోస్ (చంద్రబోస్)గారికి మళ్లీ శుభాకాంక్షలు. ‘గంగూబాయి కతియావాడి’తో అవార్డు గెల్చుకున్న మా ‘సీత’ (‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీత పాత్రలో నటించారు)కు కంగ్రాట్స్. ‘ఉప్పెన’ టీమ్‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు గెల్చుకున్నవారికీ శుభాకాంక్షలు. – రాజమౌళి నా నేపథ్య సంగీతాన్ని గుర్తించి, నాకు జ్యూరీ సభ్యులు అవార్డును ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను . చంద్రబోస్‌గారికి, దేవిశ్రీ ప్రసాద్, కాలభైరవ.. మా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు శుభాకాంక్షలు. – కీరవాణి ఈ జాతీయ అవార్డు మీదే (సంజయ్ సార్, గంగూబాయి.. టీమ్.. ముఖ్యంగా ప్రేక్షకులు). ఎందుకంటే... మీరు లేకుంటే నాకు ఈ అవార్డు దక్కేదే కాదు. చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలను గుర్తుపెట్టుకుంటాను. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడతాను. ‘మిమి’ సినిమాలో నీ ( కృతీ సనన్ని ఉద్దేశించి) నటన నిజాయితీగా, పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ సినిమా చూసి నేను ఏడ్చాను. ఉత్తమ నటి అవార్డుకు నువ్వు అర్హురాలివి. – ఆలియా భట్. ఏఏఏ 69 సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీకి రాని ఆ అద్భుతాన్ని తీసుకొచ్చిన ప్రేక్షకులకు, నిర్మాతలకు, దర్శకుడికి, ముఖ్యంగా మా ఫ్యామిలీని పతాకస్థాయికి తీసుకుని వెళ్లిన మా అబ్బాయికి (అల్లు అర్జున్ ) కృతజ్ఞతలు. – అల్లు అరవింద్ ఇంకా వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ తదితరులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పది అవార్డులతో తొలి రికార్డ్ ఈసారి తెలుగు పరిశ్రమ ఎక్కువ జాతీయ అవార్డులు సొంతం చేసుకోవడంతో పాటు మరో విశేషమైన రికార్డ్ సాధించింది. అదేంటంటే.. 27వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘శంకరాభరణం’ (1980) సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు లభించాయి. 30వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్‌లో ‘మేఘ సందేశం’ (1982)కి నాలుగు అవార్డులు వచ్చాయి. అలాగే ‘దాసి’ (1988) చిత్రం 36వ జాతీయ అవార్డ్స్‌లో ఐదు విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఐదుకు మించి అవార్డులు రాలేదు. 35 ఏళ్లకు రెండు ఐదులు.. అంటే పది అవార్డులు దక్కించుకుని తెలుగు చిత్రసీమ తొలి రికార్డ్‌ని సాధించింది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ భారతదేశ ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త నంబియార్ నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. ఇస్రోలో చేరిన నారాయణన్ స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా రష్యా డెవలప్ చేసిన క్రయోజెనిక్ ఇంజ¯Œ ్సని భారత్‌కి తీసుకురావాలనుకుంటారు. ఇదే సమయంలో పాకిస్తా¯Œ కు భారత రాకెట్ సాంకేతిక విషయాలను చేరవేశారనే నెపంతో అరెస్ట్ అవుతారు నారాయణన్. అరెస్ట్ తర్వాత కేరళ పోలీసుల విచారణలో ఆయన ఎలాంటి చిత్రహింసలు అనుభవించారు? ఆ తర్వాత ఆయన జీవితం ఎలా మలుపు తిరిగింది? తనపై వచ్చిన తప్పుడు ఆరోపణల నుంచి నారాయణన్ ఎలా విముక్తి పొందారు? అనే నేపథ్యంలో ‘రాకెట్రీ: ‘ది నంబి ఎఫెక్ట్’ సినిమా రూపొందింది. నంబియార్ నారాయణన్ పాత్ర చేయడంతో పాటు మాధవన్ దర్శకత్వం వహించారు. నారాయణన్ సతీమణి మీన క్యారెక్టర్లో హీరోయిన్ సిమ్రాన్ చక్కగా నటించారు. ప్రత్యేకించి ఆమె పండించిన భావోద్వేగాలు సినిమాకి హైలైట్. హీరో సూర్య అతిథి పాత్రలో మెరవడం కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. నా అభిప్రాయాన్ని బలంగా చెప్పాను – ఎంఎం శ్రీలేఖ ‘‘ప్రతి ఏడాది తెలుగు సినిమాలంటే కొంచెం నిర్లక్ష్యం. కంటి తుడుపుగా ఒకటో రెండో అవార్డులు ఇస్తున్నారు. దీనిపై జ్యూరీలో గట్టిగా మాట్లాడేవారు కావాలి. తెలుగుకు ఎందుకు ఇవ్వరు? అని మాట్లాడ గలగాలి. అయితే ఆ సినిమాలో విషయం ఉండాలి.. లేకుంటే మాట్లాడలేం’’ అన్నారు సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ. 69వ జాతీయ అవార్డుల్లో దక్షిణాది తరఫున జ్యూరీలో శ్రీలేఖతో పాటు రచయిత్రి బలభద్రపాత్రుని రమణి ఉన్నారు. అవార్డులు ప్రకటించిన అనంతరం ఎంఎం శ్రీలేఖ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘‘మామూలుగా ఫైనల్ ప్యానల్లో భోజ్‌పురి వాళ్లు ఉంటారు. వారికి మహానటి సావిత్రి గురించి ఏం తెలుస్తుంది? అందుకే జ్యూరీలో ఉన్న తెలుగువారు తెలుగు సినిమాల గురించి గట్టిగా చెప్పాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నా అభిప్రాయాన్ని నేను బలంగా చెప్పాను. ఈసారి నేను ఏవైతే రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య– కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండటం నాకో గొప్ప అనుభూతి. ఇక జ్యూరీ సభ్యులకు ఒత్తిడి ఉంటుందనుకుంటారు.. అలాంటిదేమీ లేదు. నిజాయతీగా నాకు ఏది అనిపిస్తే అది చెప్పాను’’ అన్నారు. ఉప్పెన మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోల్లో వైష్ణవ్ తేజ ఒకరు. ఆయన నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సన డైరెక్టర్‌గా, కృతీశెట్టి హీరోయిన్గా పరిచయమయ్యారు. ఈ ముగ్గురూ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సముద్ర తీరాన ఉప్పాడ అనే పల్లెటూరు. స్కూల్ డేస్ నుంచే బేబమ్మ (కృతీశెట్టి) మీద ఇష్టం పెంచుకున్న మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణవ్ తేజ్) నిత్యం తననే ఆరాధిస్తూ ప్రేమిస్తుంటాడు. ప్రాణం కంటే పరువు ముఖ్యం అనుకునే పెద్ద మనిషి శేషారాయనం (విజయ్ సేతుపతి). ఆయన కూతురు బేబమ్మ కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో తన మనసులోని ప్రేమను బేబమ్మకి చెబుతాడు ఆశీర్వాదం. తన స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకున్న బేబమ్మ కూడా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం శేషారాయనంకి తెలుస్తుంది. దీంతో ఆశీర్వాదం–బేబమ్మ కలిసి ఊరి నుంచి వెళ్లిపోతారు. ఈ విషయం బయటకి తెలిస్తే తన పరువు పోతుందని ఆర్నెళ్ల పాటు తన కూతుర ు ఇంట్లోనే ఉందని ఊరి జనాలను నమ్మిస్తాడు రాయనం. ఆరు నెలల తర్వాత అయినా బేబమ్మ ఇంటికి తిరిగొచ్చిందా? తన కులం కానివాడు తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఆశీర్వాదంని శేషారాయనం ఏం చేశాడు? ఆశీర్వాదం–బేబమ్మ ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంటుంది? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యరా ? లేదా అనేది ‘ఉప్పెన’ కథ. 2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. -
పనైపోయిందన్నారు.. కానీ వీళ్లిద్దరూ మాత్రం వేరే లెవల్!
ఏ సినిమా తీసుకున్నా.. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కీలకమే. కానీ యాక్టర్స్ ఎంత ఫెర్ఫార్మ్ చేసినా సరే దానికి సరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ లేకపోతే అసలు ఆ సినిమాలో జీవమే ఉండదు. అలా గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో తెలుగు సినిమాలకు ప్రాణం పోసిన వాళ్ల లిస్ట్ తీస్తే అందులో కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ కచ్చితంగా ఉంటారు. ఇప్పుడు వాళ్లకు జాతీయ అవార్డులు రావడం మరింత ప్రత్యేకంగా నిలిచింది. (ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) ఆస్కార్ ప్లస్ ఈ అవార్డ్ కీరవాణి పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. అప్పట్లో అందరూ హీరోల సినిమాలకు పనిచేసిన ఈయన.. కొన్నాళ్ల నుంచి మాత్రం ఎందుకో బయట సినిమాలు బాగా తగ్గించేశారు. ఒకవేళ చేసినా పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. కానీ బాహుబలి రెండు పార్ట్స్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ఈయన.. 'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు పాటతో ఆస్కార్ గెలిచారు. ఇప్పుడు అదే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో జాతీయ అవార్డు సాధించారు. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) మాస్ కమ్‌బ్యాక్ మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా ఏ పాటలకు ట్యూన్స్ కట్టాలన్నా అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ పేరు వినిపించేది. కానీ తమన్‌తోపాటు మిగతా సంగీత దర్శకుల హవా ఎక్కువ కావడంతో దేవిశ్రీ ప్రసాద్ క్రేజ్ పడిపోయింది. దీంతో చాలామంది డీఎస్పీ పనైపోయిందనుకున్నారు. కానీ 'పుష్ప' పాటలతో వరల్డ్ వైడ్ సెన్సేషన్ సృష్టించాడు. ఆ సాంగ్స్ వల్లే ఇప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. సీనియర్ల అనుభవం అయితే పైన ఇద్దరికీ జాతీయ అవార్డులు రావడం విశేషమే. కానీ వీళ్ల గురించి జనాలు మెల్లమెల్లగా మరిచిపోతున్న టైంలో అవార్డులు గెలిచి చూపించారు. సీనియర్ల అనుభవం.. ఇలాంటప్పుడు ఎలా పనికొస్తుందనేది ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి చూపించారు. ఇప్పటి జనరేషన్ మాటల్లో చెప్పాలంటే.. ఇది కదా అసలైన కమ్‌బ్యాక్ అంటే అని అనొచ్చు. ఇక ఈ అవార్డులు ఇచ్చిన ఊపుతో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు చేస్తూ మంచి మ్యూజిక్ ఇవ్వాలని.. తెలుగు సంగీత ప్రియులు కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: సిక్స్ కొట్టిన ఆర్ఆర్ఆర్.. ప్చ్.. ఆ ముగ్గురికి రాలేదే!) -
అల్లు అర్జున్ తొలి జీతం ఎంతో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్( పార్ట్ 1)’ తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమాకి తాజాగా జాతీయ అవార్డ్ దక్కింది. ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఈ తరుణంలో అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. అల్లు అర్జున్ తొలి సినిమా గంగ్రోతి. అయితే.. అంతకు ముందు ఆయన బాలనటుడిగానూ ఓ రెండు చిత్రాల్లో, చిరంజీవి డాడీ చిత్రంలోనూ ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఆపై.. 21ఏళ్ల వయస్సులో రాఘవేంద్ర రావు డైరెక్షన్లో గంగోత్రితో వెండి తెరకు పరిచయమయ్యారు. కానీ, అంతకంటే ముందే యానిమేటర్, డిజైనర్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆయన మొదటి జీతం రూ.3,500 మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ద్వారా అత్యంత డిమాండ్, అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటులలో ఒకరిగా కొనసాగుతున్నారు. అల్లు అర్జున్ ఆస్తులు ఎంతంటే పలు నివేదికల ప్రకారం.. టాలీవుడ్ ఐకాన్ స్టార్‌గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆస్తుల నికర విలువ సుమారు రూ.410 కోట్లు. ఒక్కో సినిమాకు ఆయన రెమ్యూనరేషన్ కూడా కోట్లలోనే ఉంటుంది. పార్లే ఆగ్రోఫ్రూటీ, రెడ్ బస్, కోల్గేట్ మాక్స్ ఫ్రెష్, లాట్ మొబైల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు విషయంలోనూ ఆయన కోట్లలో పారితోషకం అందుకుంటూ ‘తగ్గేదే లే’ అనిపిస్తున్నారు. ఖరీదైన కార్ కలెక్షన్ అల్లు అర్జున్ ట్యాగ్ లైన్ స్టైలిష్ స్టార్. దుస్తులు, గాడ్జెట్స్, షూ.. ఇలా అన్నింటా ఆ ట్యాగ్‌లైన్ కనిపిస్తుంటుంది. కానీ, డీ గ్లామర్.. అదీ పక్కా మాస్ రోల్‌తో ఆయన పుష్పగాడిగా విశేష ఆదరణ దక్కించుకోవడం గమనార్హం. ఇక.. ఆయనకు కార్లుంటే మహా ఇష్టం. రేంజ్ రోవర్ వోగ్ కారును రూ. 2.50 కోట్లు, వానిటీ వ్యాన్ రూ. 7 కోట్లు, బీఎండబ్ల్యూ ఎక్స్ 5 రూ. 80 లక్షలు, జాగ్వార్ ఎక్స్‌జేఎల్ రూ. 1.20 కోట్లు, ఆడి ఏ7 రూ. 86 కోట్ల వెచ్చించి కొనుగోలు చేశారు. వ్యాపారాలతో పాటు హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు పలు వ్యాపారాలు సైతం ఉన్నాయి. సినిమా థియేటర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. రూ.100 కోట్ల ఖరీదైన భవనం ఉంది. ఉదయపూర్‌లో నిహారిక కొణిదెల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వెళుతున్నప్పుడు అతను తన జెట్ ఫోటోగ్రాఫ్‌లను పోస్ట్ చేశాడు. దీంతో పాటు నార్సింగిలోని అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్ (ప్రొడక్షన్ హౌస్), ఆశీర్వాదం(ఫార్మ్ హౌస్), జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన భవనం కొనుగోలు చేశారు. -
'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తం 11 కేటగిరీల్లో పురస్కారాలు సొంతం చేసుకుంది. మిగతా విభాగాల సంగతేమో గానీ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలవడం సరికొత్త ఘనత అని చెప్పొచ్చు. ఎందుకంటే 69 ఏళ్ల సినీ చరిత్రలో ఓ తెలుగు నటుడికి జాతీయ అవార్డ్ రావడం ఇదే ఫస్ట్ టైమ్. అలానే డీఎస్పీ కూడా 'పుష్ప' సాంగ్స్‌కి గానూ అవార్డు అందుకున్నాడు. అసలు వీళ్లిద్దరికీ కలిసొచ్చిన అంశాలేంటి? పాటలు వైరల్ సినిమాలో కథ ఎలాంటిదైనా సరే జనాల్లో అంచనాలు పెరగాలంటే ప్రమోషనల్ కంటెంట్ ముఖ్యం. ఆ విషయంలో 'పుష్ప' ఫుల్ మార్క్స్ కొట్టేసింది. ఎందుకంటే రిలీజ్ చేసిన ప్రతి పాట కూడా జనాలకు తెగ నచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది. శ్రీవల్లి, సామీ సామీ, ఏయ్ బిడ్డా, ఊ అంటావా మావ, దాక్కో దాక్కో.. ఇలా ప్రతి సాంగ్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: 69వ జాతీయ సినిమా అవార్డులు ఫుల్ లిస్ట్) విదేశాల్లోనూ హవా అయితే 'పుష్ప' పాటలు తెలుగు వరకే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'పుష్ప' రిలీజ్‌కి కొన్నిరోజుల ముందు, ఆ తర్వాత కూడా ఎక్కడా చూసిన పుష్ప పాటలకు డ్యాన్స్, రీల్స్ తెగ కనిపించాయి, వినిపించేవి. అలా పాటలన్నీ మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. సినిమా కూడా 'పుష్ప' సినిమా రిలీజైన తొలిరోజు చాలామంది బాగోలేదని అన్నారు. కానీ వీకెండ్ పూర్తయ్యేసరికి టాక్ మొత్తం మారిపోయింది. బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నార్త్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప' దెబ్బకు బన్నీ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. (ఇదీ చదవండి: కంగ్రాట్స్ బావా.. ఈ అవార్డు నీకు రావాల్సిందే: తారక్) బన్నీ ఊరమాస్ అల్లు అర్జున్ డిఫరెంట్ పాత్రలు చేయడంలో ఎక్స్పర్ట్. అయితే 'పుష్ప' కోసం మరింత కష్టపడ్డాడు. చిత్తూరు యాసతో పాటు డీగ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. కామెడీ, ఎమోషన్, ఫైట్స్.. ఇలా అన్ని అంశాల్లోనూ ఊరమాస్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఆలోవర్ ఇండియా అల్లు అర్జున్‌కి ఫిదా అయింది. ఇప్పుడు ఏకంగా జాతీయ అవార్డు వరించింది. 'పుష్ప' సీక్వెల్లో.. 'ఇది 'పుష్ప'గాడి రూలు' ఓ డైలాగ్ ఉంది. ఆ మూవీ రిలీజ్‌కి ముందే జాతీయ అవార్డుల్లో ఆ మాట నిజమైంది. ఎందుకంటే 'పుష్ప' రూల్ చేసి పడేశాడుగా. ఇలా పైన చెప్పిన అంశాలతోపాటు సుకుమార్ డైరెక్షన్, రష్మిక యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఇలా చాలా అంశాలు కలిసొచ్చాయి. దీంతో జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ నిలిచారు. తెలుగు సినిమా స్థాయిని అందనంత ఎత్తుకి పెంచేశారు. (ఇదీ చదవండి: ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!) -
తొమ్మిది నెలల కిందే బన్నీకి సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్..
జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న అల్లు అర్జున్ను తొమ్మిది నెలల కిందే సాక్షి మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌తో సత్కరించింది. పుష్ప సినిమాలో వినూత్నమైన నటనతో పాటు తెలుగు అభిమానులను అత్యద్భుతంగా అలరించినందుకు ఎక్స్‌లెన్స్ అవార్డ్‌తో గౌరవించింది. ఆ సందర్భంగా మాట్లాడిన స్టైలిష్ స్టార్.. సాక్షి మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్‌కు థ్యాంక్యూ చెప్పారు. సాక్షి ఇచ్చిన ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ను మూవీ టీంకు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు. ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్‌కు మోస్ట్ పాపులర్ హీరో అవార్డ్.. -
జాతీయ అవార్డుల్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. చాలామంది ఊహించినట్లే.. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ అవార్డు గెలుచుకున్నాడు. తద్వారా 69 ఏళ్ల సినీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా రికార్డ్ సృష్టించాడు. అలానే బోలెడెన్ని విభాగాల్లో మనవాళ్లు అవార్డులు గెలుచుకున్నారు. మరి ఇంతకీ ఏయే విభాగాల్లో ఎవరెవరికీ అవార్డులు గెలుచుకున్నారనేది ఫుల్ లిస్ట్ చూసేద్దాం. విభాగాల వారీగా అవార్డు గ్రహీతలు ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ నటి: ఆలియా భట్ (గంగూబాయి) & కృతిసనన్ (మిమీ) ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ద కశ్మీరీ ఫైల్స్ - హిందీ) ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠీ (మిమీ- హిందీ) ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి - మరాఠీ సినిమా) ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): పుష్ప- దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎమ్) : ఆర్ఆర్ఆర్- ఎమ్.ఎమ్ కీరవాణి బెస్ట్ ఫీచర్ ఫిలిం: రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్ (హిందీ) ఉత్తమ పిల్లల చిత్రం: గాంధీ & కో (గుజరాతీ) ఉత్తమ కొరియోగ్రఫీ: ఆర్ఆర్ఆర్-ప్రేమ్ రక్షిత్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: ప్రీతిశీల్ సింగ్ డిసౌజా (గంగూబాయి కతియావాడి) ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: ఆర్ఆర్ఆర్-శ్రీనివాస్ మోహన్ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్: శ్రేయా ఘోషల్ (ఇరవిన్ నిహాల్ - తమిళ మూవీ) బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో) ఉత్తమ లిరిక్స్: చంద్రబోస్-కొండపొలం మూవీ (తెలుగు) ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్(స్టంట్ కొరియోగ్రఫీ): ఆర్ఆర్ఆర్- కింగ్ సోలమన్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీరా కపూర్ ఏ (సర్దార్ ఉద్దామ్-హిందీ) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: దిమిత్రీ మాలిక్ & మాన్సి ధ్రువ్ మెహతా (సర్దార్ ఉద్దామ్) ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి మూవీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్): అరుణ్ అశోక్ & సోనూ కేపీ (చవిట్టు మూవీ-మలయాళం) బెస్ట్ ఆడియోగ్రఫీ (సౌండ్ డిజైనర్) : అనీష్ బసు (జీలీ మూవీ- బెంగాలీ) బెస్ట్ ఆడియోగ్రఫీ (రీరికార్డిస్ట్ ఆఫ్ ద ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): సినోయ్ జోసెఫ్ (సర్దార్ ఉద్దామ్-హిందీ) బెస్ట్ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్): షాహీ కబీర్ (నాయట్టు సినిమా-మలయాళం) బెస్ట్ స్క్రీన్‌ప్లే (డైలాగ్ రైటర్) : ప్రకాశ్ కపాడియా & ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి) బెస్ట్ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉద్దామ్ మూవీ-హిందీ) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రబరీ (ఛెల్లో షో - గుజరాతీ సినిమా) బెస్ట్ ఫిలిం ఆన్ ఎన్వైర్మెంట్ కంజర్వేషన్: అవషావ్యూహం (మలయాళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్: అనునాద్-ద రెజోనెన్స్ (అస్సామీస్) బెస్ట్ పాపులర్ ఫిలిం ఆన్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్: ఆర్ఆర్ఆర్ ఇందిరాగాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: మెప్పాడియన్ (మలయాళం) స్పెషల్ జ్యూరీ అవార్డ్: షేర్ షా (హిందీ సినిమా) నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్: ద కశ్మీరీ ఫైల్స్ (హిందీ) భాషల వారీగా ఉత్తమ చిత్రాలు బెస్ట్ మీషింగ్ ఫిల్మ్: బూంబా రైడ్ బెస్ట్ అస్సామీస్ ఫిల్మ్: అనుర్ బెస్ట్ బెంగాలీ ఫిల్మ్: కల్కొకో-హౌస్ ఆఫ్ టైమ్ బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉద్దామ్ బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: లాస్ట్ ఫిల్మ్ షో బెస్ట్ కన్నడ ఫిల్మ్: చార్లి 777 బెస్ట్ మైథిలీ ఫిల్మ్: సమాంతర్ బెస్ట్ మరాఠీ ఫిల్మ్: ఏక్ దా కై ఝాలా బెస్ట్ మలయాళ ఫిల్మ్: హోమ్ బెస్ట్ మెయిటెయిలోన్ ఫిల్మ్: ఏక్ హోయిగీ యమ్ (అవర్ హౌమ్) బెస్ట్ ఒడియా ఫిల్మ్: ప్రతిక్ష్య (ద వెయిట్) బెస్ట్ తమిళ్ ఫిల్మ్: కడైసి వివసై (ద లాస్ట్ ఫార్మర్) బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన నాన్ ఫీచర్ ఫిలింస్ బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్: ఏక్ థా గావ్ (గర్హివాలీ - హిందీ) బెస్ట్ వాయిస్ ఓవర్: కులదా కుమార్ భట్టాచారి (హాథీ బందూ) బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: ఇషాన్ దీవేచా (సక్కలెంట్) బెస్ట్ ఎడిటింగ్: అబ్రో బెనర్జీ (ఇఫ్ మెమొరీ సెర్వ్స్ మీ రైట్) బెస్ట్ ఆన్‌లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్: సురుచి శర్మ (మీన్ రాగా) బెస్ట్ ఆడియోగ్రఫీ(ఫైనల్ మిక్స్డ్ ట్రాక్): ఉన్ని కృష్ణన్ (ఏక్ థా గావ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ: బిట్టూ రావత్ (పాతాళ్ తీ) ఉత్తమ డైరెక్షన్: బకుల్ మతియానీ (స్మైల్ ప్లీజ్) ఉత్తమ కుటుంబ కథా చిత్రం: చాంద్ సాన్సీ (హిందీ) ఉత్తమ షార్ట్ ఫిక్షన్ ఫిలిం: దాల్ బాత్ (గుజరాతీ) స్పెషల్ జ్యూరీ అవార్డ్: రేఖా మూవీ (మరాఠీ) బెస్ట్ ఏనిమేషన్ ఫిల్మ్: కండిట్టుండూ (మలయాళం) బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఫిలిం: లుకింగ్ ఫర్ చలాన్ (ఇంగ్లీష్) బెస్ట్ ఎక్స్‌ప్లోరేషన్ ఫిలిం: ఆయుష్మాన్ (ఇంగ్లీష్-కన్నడ) బెస్ట్ ఎడ్యుకేషనల్ ఫిలిం: సిర్పంగిలన్ సిర్పంగల్ (తమిళం) బెస్ట్ ఫిలిం ఆన్ సోషల్ ఇష్యూస్(షేర్డ్): మీతూ దీ (ఇంగ్లీష్) & త్రీ టూ వన్ (మరాఠీ-హిందీ) బెస్ట్ ఎన్వైర్మెంట్ ఫిలిం: మున్నం వలవు (మలయాళం) బెస్ట్ ప్రమోషనల్ ఫిలిం: వర్లీ ఆర్ట్ (ఇంగ్లీష్) బెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిలిం: ఇథోస్ ఆఫ్ డార్క్నెస్ (హిందీ-బెంగాలీ) బెస్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఫిలింస్: టీఎన్ కృష్ణన్ బౌ స్ట్రింగ్స్ టూ డివైన్ బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం(షేర్డ్): రుఖు మతిర్ దుఖు మహీ (బెంగాలీ) & బియాండ్ బ్లాస్ట్ (మణిపురి) బెస్ట్ ఎత్నోగ్రాఫిక్ ఫిలిం: ఫైర్ ఆన్ ఎడ్జ్ (టివా) బెస్ట్ డెబ్యూ నాన్ ఫియేచర్ ఫిలిం ఆఫ్ ఎ డైరెక్టర్: పాంచిక (గుజరాతీ- డైరెక్టర్ అంకిత్ కొఠారీ) -
షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!
పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్సింగ్ షెకావత్. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్’ సెట్స్‌పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్లోపాల్గొన్నారు ఫాహద్ ఫాజిల్. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్ ఫాజిల్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్’ సినిమాలోని ఫాహద్ కొత్తపోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ప్రతీకారంతో భన్వర్‌సింగ్ షెకావత్ సార్ బిగ్ స్క్రీన్స్‌పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్‌తో చిత్ర యూనిట్ ఫాహద్ కొత్తపోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్‌లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మికా మందన్నా షూటింగ్లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. -
Happy Friendship Day 2023: వెండి తెరపై ఈ స్టార్స్ దోస్తీ గురించి తెలుసా?
ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో స్నేహానికి ముఖ్యమైన పేజీలు ఉంటాయి. స్నేహితులు లేనివాళ్లు దాదాపు ఉండరు. అసలు స్నేహం లేకుండా జీవితమే ఉండదంటే అతిశయోక్తి కాదు. కష్ట సుఖాల్లో దోస్త్ మేరా దోస్త్ అని చెప్పుకునే ఫ్రెండ్ ఒకరుంటే అంతకన్నా మించినది ఏం ఉంటుంది? కొన్ని సినిమాల్లో స్నేహానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇలా వెండి తెరపై ప్రస్తుతం కొనసాగుతున్న కొందరు స్టార్స్ దోస్తీ గురించి తెలుసు కుందాం. సలార్ స్నేహం అమ్మకు ఇచ్చిన మాట తాలూకు లక్ష్యం ఓ వైపు.. తన మిత్రుడి రక్షణ మరోవైపు... సలార్‌కి ఉన్న రెండు పెద్ద బాధ్యతలు ఇవి. ప్రభాస్ టైటిల్ రోల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సలార్’. శ్రుతీహాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అమ్మకు ఇచ్చిన మాట, స్నేహితుణ్ణి రక్షించుకోవాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే హీరో పాత్రను ప్రభాస్ చేస్తున్నారని టాక్. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్కి సంబంధించి ఓ స్ట్రాంగ్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేశారని, ఈ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా ఉంటాయని సమాచారం. కాగా ‘సలార్’ కథలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ ఫైర్’ సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. హాయ్ ఫ్రెండ్ స్నేహానికి ఏజ్‌తో, జెండర్‌తో పని లేదు. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ఉండే స్నేహం నేపథ్యంలో చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’, వెంకటేశ్ ‘వసంతం’, సిద్దార్థ్ ‘ఓ.. మై ఫ్రెండ్’ వంటి చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ జాబితాలో ఓ సినిమా చేరనుందని టాక్. అదే నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీలక పాత్ర చేస్తున్నారు. శ్రుతీది నాని ఫ్రెండ్ క్యారెక్టర్ అని, వీరి కాంబినేషన్ సీన్స్ బాగుంటాయని టాక్. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి, డా. విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 21న విడుదల కానుంది. పుష్పగాడి ఫ్రెండ్ ‘ఆర్య’ సినిమాలో ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు హీరో అల్లు అర్జున్–దర్శకుడు సుకుమార్. అలాగే ‘ఆర్య 2’లో ఫ్రెండ్‌షిప్‌లోని మరో కోణాన్ని చూపించింది ఈ కాంబినేషన్. ఇప్పుడు ‘పుష్ప’తో మరోసారి స్నేహాన్ని చూపించారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఇందులో పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించగా, ఆయన ఫ్రెండ్ కేశవగా జగదీష్ నటించారు. పుష్పరాజ్, కేశవల మధ్య ఉన్న స్నేహం ఆడియన్స్‌కు భలే అనిపిస్తుంటుంది. సినిమాలో పుష్ప చేసే ప్రతి పనిలో కేశవ ఉంటుంటాడు. ఫ్రెండ్‌కు పుష్పరాజ్ ఇచ్చే ఇంపార్టెన్స్ అది. పుష్పరాజ్, కేశవల బాండింగ్‌ను ‘పుష్ప: ది రైజ్’లో కొంత చూశాం. అలాగే ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’లోనూ వీరి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పుష్ప: ది రూల్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని చిత్రాలు కూడా స్నేహం ఓ ప్రధానాంశంగా తెరకెక్కుతున్నాయి. -
'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్
'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' ఇటీవల 'అమెరికాస్ గాట్ టాలెంట్'లో ఆడిషన్స్ ఇచ్చి అక్కడ సెలక్ట్ అయింది. హర్యానాకు చెందిన గురుగ్రామ్‌లో ఓ చిన్న గ్రామం నుంచి ఆ టీమ్ అమెరికా చేరుకుంది. వారు చేసిన డ్యాన్స్‌ను చూసి ఆ షో జడ్జిలంతా ఆశ్చర్యపోయారు. షో చూసేందుకు వచ్చిన వారందరూ కూడా వీరి డ్యాన్స్‌కు ఫిదా అయిపోయారు. షోలో జడ్జీలుగా వ్యవహిరిస్తున్న వారందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్) ఇంతలా వారందరిని మెప్పించిన ఈ గ్రూపు ఎంచుకున్న పాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోనిది కావడం విశేషం. 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' పాట సాయంతో వారు డేంజరస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాజాగా ఈ గ్రూప్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. న్యాయనిర్ణేతలు ఏమన్నారంటే.. షో జడ్జీలు అయినటువంటి హెడీ క్లమ్, సోఫియా వెర్గారా, సైమన్ కోవెల్ ఈ ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. సోఫియా వారిని మెచ్చుకుంటూ.. 'మీరందరూ చాలా గొప్ప ప్రదర్శన ఇచ్చారు. మీరు గ్రూప్‌గా ఉన్న కూడా అందరూ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇది నిజంగా మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.' అని చెప్పింది. అదే సమయంలో.. మీకు పోటీ లేదు. మీరు చేసిన డ్యాన్స్ అద్భుతమైనది అని హెడీ అన్నారు. (ఇదీ చదవండి: RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే) హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చామని, ఒక NGO సహాయంతో అమెరికాలో ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చిందని ఆ డ్యాన్స్ గ్రూప్ లీడర్ తెలిపాడు. వారికి అయ్యే ఖర్చులన్ని ఆ సంస్థే భరించిందని వారు తెలిపారు. 'అమెరికాస్ గాట్ టాలెంట్' పేరుతో అక్కడ 18వ సీజన్ తాజాగా ప్రారంభమైంది. మొదటి సీజన్ 2006లో ప్రసారమైంది. అక్కడ గెలుపొందిన వారికి భారిగానే ప్రైజ్ మనీ అందుతుంది. మన 'ఇండియన్ డ్యాన్స్ గ్రూప్ వారియర్ స్క్వాడ్' అక్కడ 'ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా' అంటూ బన్నీ పాటతో అదరగొడుతుంది. THAT WAS AMAZING! @TheWarriorsInd2 is fearless! #AGT 🔥🔥🔥pic.twitter.com/dwKlqQxATu — Terry Crews (@terrycrews) June 21, 2023 -
పెళ్లయిన 15 రోజులకే విడాకులు.. బుల్లితెర జంటపై సింగర్ విమర్శలు!
బుల్లితెర జంట సంయుత, విష్ణుకాంత్ తమిళంలో బాగా ఫేమస్ అయ్యారు. సిప్పికుల్ ముత్తు అనే తమిళ టీవీ షోలో కలిసి నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట ఏడు నెలల పాటు డేటింగ్లో ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఏడాది మార్చి 3, 2023న వివాహం చేసుకున్నారు. కానీ ఎంత తొందరగా ప్రేమలో పడ్డారో.. అంతే తొందరగా విడిపోయారు. పెళ్లయిన 15 రోజులకే ఈ జంట తమ బంధానికి గుడ్ బై చెప్పారు. దీంతో ఈ టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: వేణుస్వామితో మరో హీరోయిన్ స్పెషల్ పూజలు) అయితే తాజాగా ఈ జంట విడిపోవడంపై మాజీ సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజలక్ష్మి స్పందించారు. ఈ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నాక ఒకరినొకరు బహిరంగంగా దూషించుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సంయుత, విష్ణుకాంత్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ జంట విడాకుల పంచాయతీ కోలీవుడ్‌లో మరింత హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. గతంలో ఈ జంట ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. తన మాజీ భర్త అసభ్యకరమైన వీడియోలను చూపించేవాడని సంయుత ఆరోపించింది. విష్ణుకాంత్ కేవలం శారీరక సంబంధంపైనే ఆసక్తి చూపుతున్నాడని సంయుత ఆరోపించింది. బెడ్ రూమ్‌లో కెమెరాలు పెట్టాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. కానీ మరోవైపు తాము విడిపోవడానికి సంయుత తండ్రే ప్రధాన కారణమని విష్ణుకాంత్ విమర్శలు చేశారు. ఆమెకు మరొకరితో సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో ఈ బుల్లితెర జంట విడాకులపై సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి) రాజలక్ష్మి ఎవరంటే? కాగా.. రాజలక్ష్మి అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప: ది రైజ్‌లోని సామి సామి తమిళ వెర్షన్‌ని పాడినందుకు ఫేమ్ తెచ్చుకుంది. జానపద గాయని అయిన రాజలక్ష్మి త్వరలో కథానాయికగా నటనలో రంగ ప్రవేశం చేయబోతోంది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమైన ‘సూపర్ సింగర్’ షోలో సెంథిల్, రాజలక్ష్మి దంపతులు పల్లెటూరి పాటలతో ఫేమస్ అయ్యారు. పల్లెటూరి పాటలు, సూపర్ సింగర్ ప్రోగ్రాం తర్వాత విదేశాల్లో కచేరీలు, కొన్ని తమిళ సినిమాల్లోనూ పాటలు పాడుతున్నారు. 🔴 ஆபாச Video காட்டி அதே மாதிரி பண்ண சொல்லி அடிச்சாரு - Samyutha Family Interview | Vishnukanth#Samyutha #SamyuthaFamilyInterview #Vishnukanth #samyukthainterviewaboutdivorce pic.twitter.com/IIlI0rN8PY — SS Music (@SSMusicTweet) May 31, 2023 Dear samyutha, Vishnukanth Unga sandaya phone la pesunga, pudikalaya divorce vangikonga. YouTube la kadupethathinga, thank you. — Nivin (@niivinn) May 24, 2023 ஒருத்தரை பிடிக்கல, அவர்கூட வாழ முடியாதுனு விவாகரத்து வரைக்கும் போனப்பிறகு, பொதுவுல மாறி மாறி ஒருத்தரை ஒருத்தர் ரொம்ப மோசமா திட்டி வீடியோ போட்டுட்டு இருக்காங்க. தன்னை யாருக்கு நிரூபிக்கனும் 🤷🤷 samyutha vishnukanth — ராட்சசி 2.0 🐝🐝 (@imthattaan) May 19, 2023 -
దివ్యాంగుల కోసం పరీక్షలు రాస్తుంది.. ఇప్పటికే వెయ్యికి పైగా..
విద్యార్థికి పరీక్షే కీలకం.అది రాయలేని పరిస్థితి ఉంటే?దివ్యాంగులు అయి ఉంటే?సహాయకులు కావాలి.కానీ పరీక్ష రాసి పెట్టడానికి అందరూ పనికి రారు. అందుకు ఎంతో ఓర్పు, సహనం, సేవాభావం కావాలి.బెంగళూరుకు చెందిన పుష్ప అలాంటి విద్యార్థుల కోసందాదాపు వేయికి పైగా పరీక్షలు రాసింది. ఆమె పరిచయం. బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల పుష్ప ఎన్ ఎం ఇప్పటికి 1086 పరీక్షలు రాసింది. ఆమె కోసం కాదు. దివ్యాంగుల కోసం, కలం పట్టుకునే వీలు లేని కండరాల సమస్య ఉన్నవారి కోసం, పరీక్షల ముందు యాక్సిండెంట్లకు గురయ్యి రాసే వీలు లేని వారి కోసం... ఆమె పరీక్షలు రాస్తూనే ఉంది. ఇంకా రాయాలనే అనుకుంటోంది. ‘ఒక దివ్యాంగ పిల్లవాడికి మీరు పరీక్ష రాసిపెట్టండి. రిజల్ట్స్ వచ్చి ఆ పరీక్ష పాసయ్యాక ఆ పిల్లవాడి కళ్లల్లో కనిపించే కృతజ్ఞతకు మీరు విలువ కట్టలేరు’ అంటుంది పుష్ప. 2007లో అనుకోకుండా ఆ రోజు పుష్ప రోజూ వెళ్లే బస్సులో కాకుండా నడిచి ఇంటికి వెళ్లాలనుకుంది. ఆ నడకే ఆమె జీవితాన్ని మార్చింది. దారిలో ఒక అంధ కుర్రవాడు రోడ్డు దాటించమని సహాయం అడిగాడు. పుష్ప రోడ్డు దాటిస్తూ మాట కలిపింది. ఆ కుర్రవాడు వచ్చే నెలలో ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాయనున్నాడు.‘నాకు మీరు పరీక్షలు రాసి పెడతారా?’ అని అడిగాడు. పుష్ప ఆలోచనలో పడింది. ‘మీలాంటి వాళ్లు మా కోసం ముందుకొస్తే మేము మా జీవితంలో ముందుకెళతాం’ అని ఆ అబ్బాయి అన్నాడు. ఆ మాట ఆమె మీద చాలా ప్రభావం ఏర్పరిచింది. ‘అప్పటి వరకూ నా జీవితానికి అర్థమేమిటా అనే ఆలోచన ఉండేది. ఆ క్షణాన ఇలాంటి వారికి సాయం చేయడానికే పుట్టానేమో అనుకున్నాను’ అంటుంది పుష్ప. అంత సులభం కాదు దివ్యాంగులకు, అంధులకు,సెరిబ్రల్ పాల్సీ.. డౌన్ సిండ్రోమ్... డిస్లెక్సియ వంటి బుద్ధిమాంద్యం సమస్యలు ఉన్నవారు పరీక్షలు రాయాలంటే వారికి లేఖకులుగా ఉండటం అంత సామాన్యం కాదు. ‘ముందు మీకు ఓపిక ఉండాలి. వాళ్లు ప్రశ్నను మళ్లీ మళ్లీ చదివి వినిపించమంటారు. ఒక్కోసారి నేను ఒక ప్రశ్నను ముప్పై నలభైసార్లు చదివి వినిపించిన సందర్భాలున్నాయి. అలాగే మీకు శ్రద్ధగా వినే శక్తి ఉండాలి. జవాబు చెప్పే పిల్లలు కొందరు మరీ నెమ్మదిగా, కొందరు మరీ వేగంగా చెప్తారు. అర్థం చేసుకుని రాయాలి. వారు రాసే సబ్జెక్ట్‌లు మీరు చదివినవి కావు. అందుకని కూడా మీరు జవాబులను పూర్తిగా అర్థం చేసుకుంటూ రాయాల్సి వస్తుంది. మనల్ని పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి గ్రామర్ వంటివాటిల్లో చిన్న సాయం చేయొచ్చు కానీ మన తెలివి వారికి అందివ్వలేం. నిజాయితీ ముఖ్యం’ అంటుంది పుష్ప. ఆమె ఇప్పటి వరకూ పది, ఇంటర్, డిగ్రీ, పిహెచ్డి, బ్యాంకు పరీక్షలు... ఇలాంటివి ఎన్నో రాసి పెట్టింది. అడిగిన వెంటనే సెలవు పుష్ప బెంగళూరులో ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది. లేఖకురాలిగా ఆమెకు ఉన్న డిమాండ్‌ను చూసి ఐటి కంపెనీ ధారాళంగా సెలవులు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఇది మంచి పనే అని మెచ్చుకుంటోంది. పుష్ప ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లోని విద్యార్థుల కోసం పరీక్షలు రాసి పెడుతోంది. ఇలాంటి విద్యార్థుల కోసమే తెలుగు, తమిళ భాషలను షార్ట్ టర్మ్ కోర్సులు చేసి నేర్చుకుంది. ‘నా బాల్యంలో మా నాన్న రోజు కూలీగా ఉండేవాడు. ఆయనకు ప్రమాదం జరిగి మంచాన పడితే మంచి మనసున్న వారి సాయంతో చదువుకున్నాను. ఇప్పుడు ఆ బాకీని ఇలా తీర్చుకుంటున్నాను’ అంటుంది పుష్ప.ఇంత అద్భుతమైన సేవ చేస్తున్నది కాబట్టే 2019లో నాటి రాష్ట్రపతి కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కార్ అందుకుంది. -
ప్యూబ్లో ఓ అంటావా మావ పాటకు డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన సమంత
-
పుష్పారెడ్డికి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా, ట్రాపిక్, అడ్మిన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేస్తున్న కర్రి పుష్పారెడ్డికి శుక్రవారం ప్రభుత్వం నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించింది. 2012 గ్రూప్–1 బ్యాచ్‌కి చెందిన పుష్పారెడ్డి 2014 నుంచి హైదరాబాద్ సీఐడీ, సైబర్ క్రైమ్ డీఎస్పీగా, 2018లో కల్వకుర్తి డీఎస్పీగా, 2019 నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో క్రైమ్, ఆపరేషన్స్ అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2020లో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీగా పనిచేశారు. ఈ మేరకు పుష్పారెడ్డికి సీపీ రంగనాథ్‌తోపాటు పలువురు పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. -
32 ఏళ్ల వయసులో హీరోయిన్గా మారిన 'పుష్ప' సింగర్
నటనకు వయసుతో పనిలేదు అన్నది మరోసారి రుజువైంది. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సూపర్ సింగర్స్ పోటీలో విజేతలుగా నిలిచి కప్పు గెలుచుకున్న దంపతులు సెంథిల్, రాజ్యలక్ష్మి. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి గాయకులుగా రాణిస్తున్నారు. కాగా ఇప్పుడు గాయని రాజ్యలక్ష్మి కథానాయకిగా అవతారం ఎత్తారు. ఈమె కథానాయకిగా నటించిన చిత్రం లైసెన్స్. జేఆర్జీ ప్రొడక్షనన్స్ పతాకంపై ఎన్. జీవానందం నిర్మించిన ఈ చిత్రానికి గణపతి బాలమురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్యలక్ష్మితోపాటు నటుడు రాధారవి, ఎన్. జీవానందం, విజయ్ భారత్, పళ.కరుప్పయ్య, గీత కై లాసం, అభి నక్షత్ర తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. కాశీ విశ్వనాథన్ ఛాయాగ్రహణం, బైజు జేకప్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు పేరరసు, నిర్మాత టి.శివ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. అదేవిధంగా నిర్మాత జీవానందం ప్లస్ టూ క్లాస్‌మెట్స్ అయిన 40 మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. కాగా ఈ వేదికపై కథానాయకగా పరిచయం అవుతున్న గాయని రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 32 ఏళ్ల వయసులో ఇద్దరి పిల్లల తల్లి అయిన తాను కథానాయకగా నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ చిత్ర దర్శకుడు ఫోన్ చేసి లైసెన్స్ చిత్రం కథను చెప్పారన్నారు. కథ విన్న తర్వాత ఇందులో తాను ఏం చేయాలని అడగ్గా మీరే కథానాయకి అని చెప్పారన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో తాను నటించగలనా అనే సందేహాన్ని వ్యక్తం చేయగా ఈ కథలో ఇతర పాత్రలకు చాయిస్ ఉంది గానీ.. కథానాయకి పాత్రకు మీరు తప్ప వేరే చాయిస్ లేదని దర్శకుడు చెప్పారన్నారు. ఒక మంచి కథా చిత్రంలో తాను భాగం కావడం సంతోషంగా ఉందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. -
అల్లు అర్జున్ పుష్ప-2లో నిహారిక!.. అలాంటి పాత్రలో మెగాడాటర్
మెగా డాటర్ నిహారిక కొణిదెల పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. భర్తతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న నిహారిక ప్రస్తుతం వర్క్‌పైనే ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించిన నిహారిక ఈమధ్యే నటిగానూ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు వరకు సినిమాలు చేసిన నిహారిక ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పింది. అయితే విడాకుల రూమర్స్ నేపథ్యంలో మరోసారి నటిగా తనకు తాను పరీక్షించుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2లో నిహారిక కీలక పాత్రలో కనిపించనుందట. చదవండి: యంగ్ హీరోతో కలిసి స్టెప్పులేసిన నిహారిక.. వీడియో వైరల్ ఈ పాత్ర కోసం గతంలో సాయిపల్లవిని సంప్రదిస్తే ఆమె నో చెప్పిందట. ఇప్పుడు ఆ రోల్లో నిహారిక కనిపించనున్నట్లు సమాచారం. గిరిజన యువతిగా పుష్ప-2లో ఓ ముఖ్యమైన పాత్రలో మెగా డాటర్ మెస్మరైజ్ చేయనుందన్నమాట. -
పుష్ప యూనివర్స్ పార్ట్ 3 కి లైన్ క్లియర్!
-
గేమ్ ఛేంజర్?
-
ఫోటో తీసెయ్.. కమెడియన్ అవినాష్‌కి బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ ఇది. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ షరవేగంగా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2 నుంచి అదిరిపోయే స్పెషల్ వీడియోతో పాటు బన్నీ లుక్‌ని రివీల్ చేసి మేకర్స్ షాక్ ఇచ్చారు. ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన క్షణాల్లోనే పుష్ప-2 పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. చీరకట్టు, ముక్కు పుడకతో కనిపించి బన్నీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్ప-2 లుక్‌ని ఇమిటేట్ చేస్తూ అరకొర ఎడిటింగ్‌తో పుష్పరాజ్‌లా మారిపోయాడు కమెడియన్ అవినాష్. జబర్దస్త్ స్కిట్స్, బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా బన్నీ లుక్‌ని కాస్త మార్ఫింగ్ చేసి తన ఫోటోను పెట్టుకున్నాడు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్‌పై ఫైర్ అవుతున్నారు.అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది అంటూ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. అర్జెంట్‌గా ఫోటో డిలీట్ చేయకపోతే బాగోదు అంటూ వార్నింగ్‌లు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) -
అల్లు అర్జున్ ‘అమ్మవారి’ వేషం వెనుక ఇంత కథ ఉందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ‘పుష్ప 2’. రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన విజయం సాధించిన ‘పుష్ప’సినిమాకు సీక్వెల్ ఇది. బన్ని బర్త్‌డే సందర్భంగా ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 7న ఈ చిత్రం నుంచి వేర్ ఈజ్ పుష్ప అనే స్పెషల్ వీడియోతో పాటు అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అంతా ఊహించినట్లే వీడియో అదిరిపోయింది. కానీ బన్నీ లుక్‌ని మాత్రం ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. ఎవరూ ఊహించని విధంగా అమ్మవారి గెటప్‌లో బన్నీ కనిపించాడు. చీరకట్టుకుని చేతులకు గాజులు వేసుకున్న ఆయన ఓ చేతిలో తుపాకీ పట్టుకుని కాళికా మాత రూపంలో దర్శనమిచ్చాడు. ఈ లుక్ సోషల్ మీడియాను ఊపేసింది. సౌత్‌తో పాటు నార్త్‌లోనూ బన్ని లుక్ తెగ వైరల్ అయింది. కథలో భాగంగా ఇప్పుడు కూడా ఈ గెటప్ ని వేసినట్టు తెలుస్తోంది. ఈ కాళికామాత గెటప్ వెనుక పెద్ద కథనే దాగి ఉందట. ఒకప్పుడు తిరుపతి పరిసర ప్రాంతాలను పాలెగాండ్లు పాలించేవారు. వారు ఏది చెబితే అదే చట్టం. మహిళలపై వాళ్లు చేసే అత్యాచారాలకు లెక్కే ఉండేది కాదట. నచ్చిన మహిళలను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవారట. వీళ్ల ఆగడాలను భరించలేక ప్రజలు అమ్మవారిని ప్రార్థించారట.దీంతో గంగమ్మ తల్లి భూమి మీదకు వచ్చిందట. ఆమె రూపాన్ని చూసి భయపడిపోయిన పాలెగాండ్లు అడవుల్లోకి పారిపోయారట. దీంతో అక్కడున్న మగవాళ్లు కొందరు ఆడవాళ్లలా వేషం వేసుకుని వెళ్లి పాలెగాండ్లు పట్టుకుని వస్తే.. అమ్మవారు వారిని సంహరించేదట. ఆ ప్రభావంతో ఆడవారిపై అఘాయిత్యాలు తగ్గిపోయాయి. అప్పటి నుంచి తిరుపతి, అక్కడి సమీపంలోని ప్రజలు గంగమ్మ జాతరను నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ కథ ఆధారంగానే పుష్ప 2 ఉండబోతుందని సమాచారం. అడవిలో ఉన్న విలన్స్ ని చంపడానికి పుష్పరాజ్ కాళికా మాతలా మారి దుష్ట సహారం చేస్తాడట. ఈ గెటప్ లో క్లైమాక్స్ ఫైట్ ని సెట్ చేశాడట సుకుమార్. ఇదే కనుక నిజం అయితే పుష్ప 2 క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. -
Allu Arjun Assets: అల్లు అర్జున్‌కు అన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా?
లెజండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య మనువడిగా, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అల్లు అర్జున్. హీరోగా తెరంగేట్రం చేయడానికి ముందే బాలనటుడిగా నటించి మెప్పించాడు బన్నీ. మొదట్లో యానిమేటర్ని అవుదామనుకున్న అల్లు అర్జున్ సినిమా మీదున్న ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చాడు. 2003లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ రావడంతో వెనుతిరిగి చూడలేదు.. ఈ సినిమాతోనే బన్నీకి స్లైలిష్ స్టార్ అనే ట్యాగ్‌లైన్ వచ్చింది. ఆ తర్వాత హ్యాపీ, బన్నీ, పరుగు వంటి సినిమాలతో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. దేశముదురు సినిమా బన్నీకి మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, మొన్నటి పుష్ప సినిమా వరకు ప్రతి క్యారెక్టర్లో వైవిధ్యం, లుక్‌లో కొత్తదనం సహా తన ఇమేజ్ను అంతకంతకూ పెంచుకుంటూ పోయాడు.ఇక అల్లు అర్జున్ లైఫ్‌స్టైల్ కూడా రిచ్‌గా ఉంటుంది. ఖరీదైన వానిటీ వ్యాన్ దగ్గర్నుంచి ప్రైవేట్ జెట్ వరకు అల్లు అర్జున్ ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. AA వ్యానిటీ వ్యాన్.. ధరెంతో తెలుసా? అల్లు అర్జున్‌కు చెందిన అత్యంత ఖరీదైన వస్తువుల్లో వ్యానిటీ వ్యాన్ ఒకటి. టీవీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన రిక్లైనర్ సహా పలు విలాసవంతమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. తన అభిరుచికి తగ్గట్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ వ్యానిటీ వ్యాన్ ధర సుమారు రూ. 7కోట్లు. అల్లు అర్జున్‌కు హైదరాబాద్‌లో సుమారు వంద కోట్ల రూపాయల ఇల్లు ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు బన్నీ. స్విమ్మింగ్ పూల్, జిమ్, హోమ్ థియేటర్ సహా విలాసవంతంగా ఇంటిని ఇంటీరియర్ చేయించుకున్నారు. ఇక బన్నీకి కార్లంటే చాలా ఇష్టం. సొంతంగా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే అల్లు అర్జున్ వద్ద ఖరీదైన హమ్మర్ H2, రేంజ్రోవన్ వోగ్, జాగ్వార్ ఎక్స్జెఎల్ సహా BMW X6 M స్పోర్ట్ కార్లు కూడా ఉన్నాయి. సొంతంగా ప్రైవేట్ జెట్ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్న అతికొద్ది మంది హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్‌కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఎక్కువగా కుటుంబంతో గడిపే అల్లు అర్జున్ ఎక్కువగా ప్రైవేట్ జెట్స్‌లోనే ఫ్యామిలీని తీసుకొని వెకేషన్స్‌కు వెళ్తుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటారు. వామ్మో.. ఒక్కో సినిమాకు అన్ని కోట్లా? ఒక ఒక్కో సినిమాకు రూ.40 కోట్లకు పైగా పారితోషకం అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సక్సెస్‌తో రెమ్యునరేషన్‌ను అమాంతం రూ. 100కోట్లకు పెంచేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు 'పుష్ప ది రూల్'తో పాటు సందీప్ రెడ్డి వంగాతో చేస్తున్న సినిమాకు సుమారు రూ. 100 - 120 కోట్ల వరకు బన్నీ చార్జ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. సినిమాలే కాకుండా పలు హైదరాబాద్‌లో పబ్స్, రెస్టారెంట్స్‌లలో ఆయనకు పలు షేర్స్ ఉన్నాయి. మొత్తంగా రూ. 400-500 కోట్లకు పైగానే ఆయన నికర ఆస్తుల విలువ ఉంటుందని సమాచారం. -
Allu Arjun Birthday: పాత్ర ఏదైనా ‘తగ్గేదే లే’.. వైవిధ్యంతో అలరిస్తున్న ఐకాన్ స్టార్
సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే ఎవరూ ఇండస్ట్రీలో రాణించలేరు. చేసే సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. నటనలో వైవిధ్యం ఉంటేనే హీరోగా స్వీకరిస్తారు. ఆ విషయం బాగా తెలిసిన వ్యక్తి అల్లు అర్జున్. మెగా కుటుంబం నుంచి వచ్చినా.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన స్టైల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు. తొలి సినిమా ‘గంగోత్రి’ నుంచి మొన్నటి ‘పుష్ప’ వరకూ బన్నీ చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపిస్తూ..మాస్, క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా దగ్గరయ్యాడు. ఎలాంటి పాత్ర అయినా సరే ‘తగ్గేదే లే’ అన్నట్లుగా నటిస్తూ ఐకాన్‌స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ బర్త్‌డే నేడు(ఏప్రిల్ 8). ఈ సందర్భంగా అల్లు అర్జున్ సీనీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం. చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ చిరంజీవీ హీరోగా నటించిన విజేత(1985) చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు బన్ని. ఆ తర్వాత స్వాతిముత్యం చిత్రంలోనూ నటించాడు. ఆ సినిమా తర్వాత దాదాపు 15 ఏళ్ల గ్యాప్ ఇచ్చి 2001లో వచ్చిన చిరంజీవి ‘డాడీ’సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డ్యాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్లో స్టెప్పులేసి మెప్పించాడు. రూ.100 అడ్వాన్స్‌తో ‘గంగోత్రి’ ఒకసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో అందరితో కలిసి డ్యాన్స్ చేశాడు బన్ని. అయితే తన డ్యాన్స్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండడంతో అందరి చూపులు బన్నీవైపు తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి(నిర్మల)దగ్గరకు వెళ్లి ‘మీవాడు పెద్దయ్యాక.. నేనే హీరోగా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తాను’అని చెప్పారు. అంతేకాదు అప్పుడు వంద రూపాయల నోటుని అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు ‘గంగోత్రి’తో బన్నీని హీరోగా పరిచయం చేశాడు. రాఘవేంద్రరావు ఇచ్చిన ఆ వంద రూపాయల నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ దగ్గరే ఉందట. ‘బన్నీ’తో హ్యాట్రిక్ క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య'(2004) సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డు లభించింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సెషన్. ఇక మూడో చిత్రం ‘బన్నీ’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాతే అల్లు అర్జున్‌ని అంతా బన్నీ అని పిలవడం మొదలు పెట్టారు. టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్ కరుణాకరన్ డైరెక్షన్ లో బన్ని నటించిన నాలుగో చిత్రం 'హ్యపీ' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన 'దేశముదురు' చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించడమే కాదు.. అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ ను, స్టార్ డమ్ ని టాలీవుడ్‌కి సిక్స్‌ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జునే. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ ఇలా చాలామంది హీరోలు సిక్స్‌ప్యాక్ చూపించారు. ‘పరుగు’తో ప్యామిలీ హీరో ‘దేశముదురు’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ మరో ప్రయోగం చేశాడు. తనకొచ్చిన మాస్ ఇమేజ్‌ని పక్కనపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకోవడం కోసం ‘పరుగు’ చేశాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. మే 1, 2008లో విడుదలైన ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులను బాగా దగ్గరయ్యాడు బన్నీ. ముఖ్యంగా అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు పడే బాధలను ఈ సినిమాలో చాలా బాగా చూపించాడు భాస్కర్. ఆ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ అయ్యాయి. అయితే సినిమా ఊహించినంత విజయం సాధించకపోయినా బన్నీకి మాత్రం చాలా ప్లస్ అయింది. వరుస అపజయాలు.. పరుగు తర్వా త ‘ఆర్య 2’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. సుకుమార్, బన్ని కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుడు, బద్రీనాథ్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలు బక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడ్డాయి. 'వేదం' చిత్రం నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది కానీ కమర్షియల్‌గా హిట్ కాలేదు. ‘జులాయి’, రేసుగుర్రం’ చిత్రాలు అల్లు అర్జున్ కెరీర్‌ని మలుపుతిప్పాయి. రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘ఎవడు’ కూడా బన్నికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ‘సరైనోడు’తో సాలిడ్ హిట్ ఆ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోయపాటి దర్శకత్వంలో నటించిన ‘సరైనోడు’మూవీ అల్లు అర్జున్‌లోని మరో కోణాన్ని బయటకు తీసింది. పారితోషికం తీసుకోకుండా ‘రుద్రమాదేవి’లో నటించి అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆ చిత్రంలో ‘గోనగన్నారెడ్డి’గా అద్భుతంగా నటించాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ డిజాస్టర్ కావడంతో రెండేళ్లు గ్యాప్ తీసుకున్న బన్ని.. ‘అల.. వైకుంఠపురము’ తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. 2020లో విడుదలైన ఈ సినిమా బన్ని బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలియజేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ సుకుమార్, బన్నీ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ఫ’ ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో స్టైలీష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్‌గా మారాడు. ఈ బిరుదు ఇచ్చింది కూడా సుకుమారే. ‘పుష్ప’తో నార్త్ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యాడు బన్ని. నిజం చెప్పాలంటే.. ఈ చిత్రం సౌత్‌తో కంటే నార్త్‌లోనే బాగా ఆడింది. అంతేకాదు బన్నీని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప చిత్రాకి సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’తో తిరిగి వస్తున్నాడు. బర్త్‌డే సందర్భంగా శుక్రవారం విడుదలైన టీజర్, పోస్టర్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
ఎస్ఆర్హెచ్తో మ్యాచ్.. అల్లు అర్జున్ను కలిసిన పంజాబ్ స్టార్ క్రికెటర్లు!
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకోపోతుంది. గెలుపు జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా ఏప్రిల్ 9న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ధావన్ సేన శనివారం నుంచి తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనుంది. ఇక ఇది ఇలా ఉండగా.. పంజాబ్ క్రికెటర్లు రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలిశారు. ఈ సందర్భంగా బన్నీతో కలిసి వీరిద్దిరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాహుల్ చాహర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక అతిథ్య ఎస్ఆర్హెచ్ జట్టు శనివారం హైదరాబాద్ చేరుకోనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆరెంజ్ ఆర్మీ.. పంజాబ్‌పై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తోంది. కాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2023: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం! పిచ్ కూడా! ఆ మాట చెప్పడానికి సిగ్గు లేదు -
షాకింగ్ లుక్‌లో అల్లు అర్జున్.. నెట్టింట ఫోటో లీక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప-2 ది రూల్. మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా వేర్ ఈజ్ పుష్ప పేరుతో ఇంట్రెస్టింగ్ వీడియోను వదిలిన సంగతి తెలిసిందే. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటూ కాన్సెప్ట్ టీజర్‌తో దుమ్మురేపిన పుష్ప టీంకు లీకు వీరులు షాక్ ఇచ్చారు. రేపు(శనివారం)బన్నీ బర్త్‌డే సందర్భంగా పుష్ప-2లోని ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయాలిని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ టీజర్ విడుదలైన కాసేపటికే అల్లు అర్జున్ మాస్‌లుక్ నెట్టింట లీక్ అయ్యింది. దీంతో చేసేదేమీ లేక అఫీషియల్ను పుష్పరాజ్ లుక్‌ను వదిలారు. అయితే ఇందులో అల్లు అర్జున్ మైండ్ బ్లాక్ అయ్యేలా అమ్మోరు అవతారంలో కనిపించి షాక్ ఇచ్చారు. కండలు తిరిగిన దేహంతో చీరకట్టుకొని చేతిలో తుపాకీ పట్టుకొని కనిపించారు బన్నీ. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఊరమాస్ లుక్‌లో నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. #Pushpa2TheRule Begins!!! pic.twitter.com/FH3ccxGHb8 — Allu Arjun (@alluarjun) April 7, 2023 -
నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి: రష్మిక
రష్మిక మందన్నా ఈ పేరు వింటే చాలు సౌత్, బాలీవుడ్‌తో ఠక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆమె నటించిన పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ఏకంగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇవాళ రష్మిక 28వ ఏట అడుగుపెడుతోంది. ఏప్రిల్ 5న ఈ అమ్మడు బర్త్ డే కావడంతో పుష్ప-2 టీమ్ కూడా క్రేజీ అప్ డేట్‌తో అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. చివరిసారిగా వారసుడు మూవీతో అభిమానులను పలకరించింది అమ్మడు. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. అయితే తన సినీరంగంలో ఎంట్రీపై ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అందాల పోటీలో గెలుపొందిన తర్వాత తనకు సినిమాలో ఆఫర్ చేశారని తెలిపింది. అయితే అది ప్రాంక్ కాల్‌గా భావించి 'నాకు సినిమాలపై ఆసక్తి లేదు సార్.. ఫోన్ పెట్టేయండి' అని ఆ నంబర్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో దర్శక, నిర్మాతలు స్నేహితుల ద్వారా తనను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ చివరికి వారు నా క్లాస్ టీచర్ ద్వారా నన్ను కలిశారు. చిత్రనిర్మాతని కలిశాక.. తనకు ఎలా నటించాలో తెలియదని చెప్పినట్లు రష్మిక తెలిపింది. అయితే తనతో కొన్ని డైలాగ్‌లను రికార్డ్ చేసిన తర్వాత ఎంపిక చేశారని చెప్పుకొచ్చింది. కాగా.. ప్రస్తుతం టాలీవుడ్ మూవీ పుష్ప సీక్వెల్ పుష్ప-2 అలరించేందుకు సిద్ధమైంది. రష్మిక సినీ కెరీర్ రష్మికా మందన్నా 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది. 2014లో రష్మికా మోడలింగ్ ప్రారంభించిన రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆమె పాత్రకు ఉత్తమ తొలి ప్రదర్శనగా సైమా అవార్డును కూడా గెలుచుకుంది. 2017లో రష్మిక రెండు కన్నడ చిత్రాలలో అంజనీ పుత్ర, చమక్‌లో కనిపించింది. టాలీవుడ్లో ఛలో చిత్రం ద్వారా అడుగు పెట్టింది. 2021లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం కాగా.. అదే సంవత్సరంలో గుడ్ బై సినిమా ద్వారా ఆమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్- 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2017లో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. కాగా.. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మేకర్స్ విషెస్ చెబుతూ ట్వీట్ చేసింది. Team #PushpaTheRule wishes the gorgeous 'Srivalli' aka @iamRashmika a very Happy Birthday ❤️ May you continue to RULE our hearts ❤️🔥 Icon Star @alluarjun @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/wNbsDxOUys — Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023